ఉండాలా? ఏం? మేం మగాళ్లకి ఏం తీసిపోయాం? వాళ్లకీ ఓ రోజు పెట్టాలా? అయినా మన భారత సంస్కృతి లో స్త్రీ పూజనీయమైనది.. ఒక శక్తి, ఒక....
అబ్బా.. ఇదంతా కాదు కానీ.. మూడు వందల అరవై అయిదు రోజుల్లో ప్రతి రోజూ స్త్రీదే కాకపోవచ్చు..కానీ ప్రతి ఒక్కరోజూ స్త్రీ దీనూ..
గత సంవత్సరం స్త్రీల దినం అందరూ ఏంటో తెగ ఘనం గా చేశారు. ఇటు పొద్దున్నుంచీ SMS లు, ఫోన్లు, ఆఫీసులో రోజా పూలిచ్చి కేకు ముక్కలు పంచడం.. ‘ఆడవాళ్ల వల్లే మా బృందానికి వన్నె వచ్చిందని మా డైరెట్రు గారి నుండి ఈ మెయిలూ.. అందరూ కళ కళ లాడుతూ సీతాకోక చిలకల్లా.. ఇంటికొస్తూనే కాంప్లెక్స్ ఆడవాళ్లు పిల్లలని ఇళ్లల్లో వదిలి మ్యూజికల్ చైర్లు, బింగో ల్లాంటి వినోద కార్యక్రమాలూ.. ఏంటో వెలితి.. విసుగూ..
మరి ఈరోజో? ఆడవారి రోజు. అంటే అచ్చం గా నాదే ఈరోజు.. It’s my day and My day is beatiful!!
మార్చి 8, 1200am
గంట కొట్టింది. ఇంట్లో అందరూ కలల సీమ లోనో, గాఢ నిద్రలోనో.. నేను మాత్రం ఒక సీరియస్ ఆఫీసు పని. చేయకపోతే నా ప్రతిభ కే ఒక మచ్చ. చేస్తున్నాను.. తలెత్తటానికీ సమయం లేదు.
1am ఆఆఆఆఆకలి.. రాగి బిస్కట్లు?బోరు. ఆవకాయన్నం? ఇంకా నయం.. అరటి పండు? వద్దులే.. అన్నట్టు.. పాలు ఫ్రిజ్ లో పెట్టానా? చూసొద్దాం..
2am డామిట్.. కథ అడ్డం తిరిగింది.. ఇదేంటి!!!!! ఇప్పటిదాకా పని చేసిన కోడ్.. లేద్దాం అనుకుంటే.. ఇప్పుడు పని చేయదు? దీని పని పట్టాల్సిందే..
2.45am : చాలు..బాబూ.. అయినంత చాలు.. ఉద్యోగం తీసేస్తాడా?ఉరేస్తాడా? తూర్పు తిరిగి దణ్ణం పెట్టుకోమను.. నేను పడుకుంటున్నా.. ‘సుఖ నిద్ర కి మించి న వరం.. ఉంమ్మ్మ్మ్మ్.....zzzzzz
7am : నూతి లోంచి.. లీల గా.. మంద్రంగా ‘అమ్మా.. ‘ ‘హమ్మో!!! ఏడు గంటలా!!! టిఫిన్లు, వంటలు.. ఎలా? ‘ దిగ్గున లేస్తుంటే.. ‘పర్వాలేదు.. అమ్మా.. ఈ పూట కి సీరియల్ తింటా.. ఇవ్వాళ్ల పదకొండు న్నర కే వస్తున్నాను. లంచ్ అక్కర్లేదు.. జడ వేయి చాలు..’ ‘ఆహా.. ఎంత మంచి womens day gift!! నేను అరవకుండానే తయారయిపోయారు..’
“My children are beautiful!” ‘ఓహ్.. పదకొండున్నరకే వచ్చేస్తారా? అయితే మళ్లీ WFH పెట్టాలి.. సోమవారం నుండీ పరీక్షలు.. నేను పని చేసుకుంటూ లెక్కలు చేయిస్తే...బాసు ఏమంటారో ’
7.30am : ‘బై బై.. తల్లీ.. అరే.. ఫోన్.. ‘ఓహ్.. కోయీ బాత్ నహీ.. మై ఘర్ పే హూ.. ఆప్కే బచ్చోంకో భీ యహీ చోడ్ దేనా..’ అరే కాలింగ్ బెల్..’ఓహ్.. ఇన్నికే టాంక్ క్లీన్ పన్న పోరింగలా? నాళకి ముడియాదా? ఓకే ఓకే నో ప్రాబ్లం. ‘
8.30am: ‘ఓ.. హాప్పీ వుమెన్స్ డే!! అలాగే అలాగే బై..’.. అప్పుడే పది ఫోన్ కాల్స్. ఒక్క అమ్మకి ఫోన్ చేస్తే చాలు. మిగిలిన వాళ్లకి ఆన్ లైన్ లో .. ఇక పని పూర్తి చేయాలి...
9.30am: ‘నీళ్లు పట్టేసుకుంటే.. మళ్లీ టాంక్ కడిగినప్పుడు టెన్షన్ ఉండదు.. అప్పుడు.. ఓసారి బ్లాగులు చూద్దాం? ‘అయ్యో..అయ్యో.. సిరిసిరి మువ్వ గారికి శ్రావ్య బ్లాగ్ ముఖం గా ఇవ్వడానికి శ్రావ్య గారికి ఒక ఆడియో మెసేజ్ పంపుదామనుకున్నాను. గిల్ట్..గిల్ట్..గిల్ట్.. హ్మ్.. Too late.. I need to manage my time well..
10.30am: అరే బాసు గారి మెయిల్..’ నీవు గత వారం చేసిన బగ్ ఫిక్స్ వల్ల ఇవిగో సైడ్ ఎఫెక్ట్స్.. కాస్త చూసుకుని...!@#@$#’ ‘ఓకే ఓకే.. దీని ప్రభావం పని మీద పడకూడదు.. కంటిన్యూ..’ అన్నట్టు కాస్త పాదం అటూ ఇటూ తిప్పాలి పని చేస్తూ.. లేకపోతే బిగుసుకుపోతుంది... మొన్ననే విరిగి అతుక్కుందసలే.. అమ్మాయి వచ్చేసరికి దానికిష్టమైనవి చేయాలి..ఇంట్లో ఉన్నాను కదా..
11.30am. ‘కృష్ణా.. పని ఎలా అవుతుంది.. స్నేహితుల పలకరింపు.. నా కంపెనీ కాకపోయినా.. నా కోడ్ ఏమాత్రం ఐడియా లేకపోయినా చాట్ ద్వారానే సహాయం చేసే ఫ్రెండ్!! ఎన్నాళ్ల నుండో వెతుకుతున్న ‘యుగాంత’ పుస్తకం ఇచ్చిన ఇంకో ఫ్రెండ్!!! Friends are beautiful! అమ్మాయి వచ్చేసింది.. దాని ఫ్రెండ్సూనూ.. ‘ఆంటీ.. పప్పు, మాగాయ కావాలి నాకు..’ గుజరాతీ పిల్ల గారాలు.. ‘ఓకే నో ప్రాబ్లం..’
12.30: అమ్మయ్య వంట రెడీ.. రండమ్మా తింటూ చెప్పుకోవాలి కబుర్లు.. ‘ఆ ఆ.. వింటున్నా.. వింటూ చేసుకుంటున్నానమ్మా పని!! ఓ.. సారీ వింటా.. పూర్తి శ్రద్ధ తో చెప్పు.. కళ్ళు ఆసక్తి గా వింటున్నట్టు, బాడీ లాంగ్వేజ్ అలాగే.. ప్రతి పది సెకన్లకీ ‘ఓహ్.. అవునా.. టూ మచ్.. బాబోయ్.. థాంక్ గాడ్’ లాంటివి వాడుతూ.. మెదడు లో ఎక్కడో.. ‘బగ్ గురించి ఆలోచిస్తూ... దొంగతనం గా పేపర్ చదువుతూ..
1.30pm: టాంక్ కడిగినప్పుడు పోయే ప్రతి బొట్టూ మొక్కలకే చేరాలి.. అయ్యో... అరటి చెట్టు గెలనింకో సారి చూసి వద్దాం.. సీతా ఫలం చెట్టు.. చిగురు..అ బ్బా.. ప్రకృతి సౌందర్య మయం.. మనమే.. చేసుకుంటున్నాం ఇదంతా మాయం... ‘ఆఆఆఆఅ వస్తున్నా.. ఇచ్చిన లెక్కలన్నీ చేశావా? వెనక సమాధానాలు చూడలేదు కదా.. Just asking!!! అంత కోపమే.. చచ్చాం. కరెంట్ పోయింది. బాకప్ కూడా రాలేదు....
2.30pm. అరే మేరీ నువ్వెళ్లిపో ఇంక.. ‘హాపీ వుమెన్స్ డే.. ఇంద.. దీనితో ఏదైనా మంచి చీర కొనుక్కో సరదాగా.. ఇదిగో మీ అక్క బిడ్డ కోసం ఆవకాయ.. జాగ్రత్త గా కారకుండా.. ‘ అరే కరెంట్ వచ్చింది.. ‘అరీ చిన్నమ్మాయీ వచ్చేసింది.. గుడ్’ ఈమెయిల్స్ చూడాలి. ‘అయ్యో.. ఇంత నెగటివ్ రిమార్కులా!!! ఏంటి? అంత చెత్తగా రాశానా కోడ్!! ముసలి దాన్నవుతున్నాను. ఇంక ఈ కోడింగ్ ఆపేయాలి.. ఈ ఉద్యోగం కష్టం బాబూ.. చిన్న చిన్న అబ్బాయిలతో పోటీ పడుతూ...
3.30pm.. నా వల్ల కాదు ఈ కోడ్.. ‘phone a friend option?’ సరే.. ఈయన చెప్పిన పద్ధతీ ప్రయత్నిద్దాం. ‘అరే.. మామయ్య ఫోన్.. బాగుండదు. రెండు నిమిషాలు మాట్లాడదాం..’ అరే? పెట్టేసే సరికి మళ్లీ ఫోన్!! చాట్ లో ఎవరు? ‘అలాగే.. నీకు ప్రొమోషన్ రావాలంటే.. ఊర్కే గ్రూపులు మారకు.. ‘ మరి సలహాలు ఇవ్వకపోతే..గడుస్తుందా రోజు? ఇతనికేం కావాలి? ‘ఓహ్.. రివ్యూ.. సరే.. ఏంటయ్యా ఈ ఇంగ్లీషూ.. నేను రాసి పెట్టను.. నీచేతే రాయిస్తాను.. మూడో లైన్లో...’ బాబోయ్ .. పని జరగటం లేదు.. concentrate krishna!! concentrate...
4.30pm.. గారడీ ఆట.. పొయ్యి మీద పప్పు పులుసు..కూర, పెద్దదానితో సంస్కృతం, చిన్నదానితో సైన్సు.. ఆఫీసు పని కొద్దిగా ఓ కొలిక్కి వస్తున్నట్టుంది?
5.30pm.. అవునూ.. అసలు ఉదయం నుండీ చాయ్ తాగానా? పోన్లే ఈయనా వచ్చారు గా.. ఇద్దరం తాగచ్చు.. పని,పని, పని.. టీ వీ చూస్తూ భర్తగారు,.. ఆటల్లో పిల్లగార్లు.. నాకే.. ఈ బగ్.. అర్థం కావటం లేదు.. కాన్సెంట్రేట్.. ‘అమ్మా..చెస్ ఆడతావా? ఒక్క గేమ్?’ సరే..పద.. చెస్..భలే ఆట.. కానీ మా చిన్నదానికి తెలిసిన ఒక ఎత్తు ముందు విశ్వనాథ్ ఆనంద్ కూడా గెలవలేడు.. అదే.. ‘బోర్డ్ ఎత్తు..’ పిల్లలతో ఆడటం.. How beautiful!!
6.30pm : పని, పని.. ‘అలాగే.. లాప్ టాప్ మూసి కథలు చెప్తూంటాను..తినండి.. యెస్...’
7.30pm: పని పని.. నా వల్ల కాదు ఒక వాక్ కొడితే.. ‘ఆహా.. రోడ్డు, సాయంత్రపు సంధ్య..!!! అద్భుతం.. రోడ్డు మీద నుంచుని.. ఆడవాళ్లతో ముచ్చట్లు.. ‘Women are so beautiful’..
8.30pm: ‘కథలు.. ఏం చెప్పాలబ్బా? అనగా అనగా..
8.45pm: ‘మొన్న ఎంతవరకూ చూశారు సినిమా? ఒక విండో లో పిల్లలు రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా.. వివాహ భోజనంబు.. ఇంకో విండో లో పనీ, పనీ... పర్లేదే.. వీళ్లకీ నవ్వొస్తోందే. జై జంధ్యాల, జై రాజేంద్ర ప్రసాద్.. ఈ పాట వినండి.. బాలు లేత గొంతు.. నచ్చినట్లుంది.. తాళం లీల గా పడుతుంది.. గుడ్ గుడ్.. ‘ Music is beautiful!!
9.45pm: NDTV లో తమిళ ముస్లిం ఆడవారిని చైతన్య పరిచిన కార్యక్రమం మీద డాక్యుమెంటరీ ఏదో.. ఆంగ్ల సబ్ టైటిల్స్ తో.. Our idea of a date.. ఒళ్లో లాప్ టాప్ పనీ, పనీ.. ‘ పెద్దగా చదువుకోకపోయినా, వేరే జీవనాధారం లేకపోయినా, ఎంత ధైర్యం గా ఉన్నారు? ఎన్ని సమస్యలనెదుర్కుంటున్నారు!! కళ్ళు నిండిపోయాయి.. దుఖం తో కాదు హృదయం నిండి.. వాళ్ల సమస్యల ముందు నా బోడి బగ్ ఎంత చిన్నది...
10.45pm: ‘అరే.. ఇదా.. కథ!! వచ్చేసింది సొల్యూషన్.. హమ్మయ్య.. మూడురోజుల నుండీ.. ఎంత కష్టపడ్డాను... తొందర పడకూడదు. బాగా టెస్ట్ చేసి మరీ ఇవ్వాలి..
11.45pm : అమ్మయ్య అయిపోవచ్చింది..
12.45pm: ఆల్మోస్ట్ డన్..
1.45pm: అమ్మయ్య.. అయిపోయింది. ‘work is beautiful..’!!
పడుకోనా? అప్పుడే!!! మరి చదివాను, ఇంటి పని, పిల్లలు, వాళ్ల చదువులు, సినిమా, సంగీతం, స్నేహితులతో గప్పాలు,. మొక్కలు, బేబీ సిట్టింగ్, ఆఫీసు పని, ఇన్ని చేసినదాన్ని..ఇదంతా రాసుకోవద్దూ.. Documenting yet another beautiful day .. బగ్ ఫిక్స్ అయిందని కాదు కాకపోయినా మంచిరోజే.. రేపంటూ ఉందిగా.. ఫిక్స్ చేసుకోడానికీ... :)
చేతి నిండా పని, చేయగల్గే ఆసక్తి, అనురక్తి, గుండె నిండా ధైర్యం, ఆరోగ్యం, కొద్దిగా స్పందించే మనసూ... ఉంటే అంతకన్నా ... celebration లేదు, అక్కర్లేదు.. Life is beautiful!
సిరి సిరి మువ్వ.. 'వరూధిని' గారికి ఈ పోస్ట్ అంకితం!!!