మా మేనత్త కూతురు ప్రియ నాకు చిన్నప్పట్నించీ ఇష్టం. ప్రతి వేసవి సెలవల్లో తప్పని సరిగా కలిసేవాళ్ళం. 30 యేళ్ళ స్నేహం మాది. ఏమే అని పిలుచుకునే చనువూ, తప్పు చేస్తే మందలించే చొరవా.. కోపగించుకుని అరుచుకునే దగ్గరతనం మాకు ఉన్నాయి.
కాకపోతే.. మా అత్త పాతకాలపు మనిషి. ప్రియ కి పద్ధెనిమిదవ ఏడు వస్తూనే పెళ్ళి చేసేసింది. ఎవరెంత చెప్పినా వినలేదు. ప్రియ డిప్లోమో చేసి.. ఇంకా చదువుదామనుకున్నా.. మా అత్త పడనీయలేదు. దానికి చదువు పిచ్చి తీరలేదు. భర్త సహకరించినా.. అత్తింట్లో పరిస్థితులు సహకరించకపోవటం తో తన చదువు కొనసాగించలేకపోయింది.
పైగా పెళ్ళయి ఏడాది తిరక్కుండానే కొడుకు. వాడి ఆలనా పాలన తోనే దానికి గడిచిపోయింది. నా పిల్లలు ఇంకా మిడిల్ స్కూల్ రాలేదు. దాని కొడుకు అప్పుడే ఐ ఐ టి లో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం లో కొచ్చేసాడు. చెప్పటానికి ఈజీ గానే ఉంది కానీ.. అది పడిన కష్టం, వాడిని పెట్టిన హింస మాటల్లో చెప్పలేనిది.
చిన్నప్పట్నించీ.. వాడికి చదువు తప్ప వేరే వ్యాపకాల్లేవు. ఒక చుట్టం, పక్కం తెలియదు. అహర్నిశలూ చదువు. వాడి ఆటపాటల్లో కూడా నోటి లెక్కలూ, భాష, విజ్ఞానాన్ని పెంపొందించే ఆటలే. వాడికి చెస్, స్క్రాబుల్, క్రాస్ వర్డ్, లాంటి ఆటలు తప్ప బాట్మింటన్,క్రికెట్ లాంటివి అలవాటు చేయలేదు.
ఏ విషయం లో నైనా.. మా మాట వినేది కానీ.. కొడుకు విషయం లో సాక్షాత్తూ ఆ దేవుడు దిగి వచ్చినా తన పంతమే నెగ్గేలా చూసుకునేది. మేము కూడా చెప్పి చెప్పి అలిసిపోయాం. గమ్మత్తేంటంటే.. దాన్ని చూసి 'ఇదేంటీ అనుకున్న నేను.. దాని లాంటి వందలాది తల్లిదండ్రులని చూసి ఆశ్చర్యపోయాను. పేపర్లో చదువుతూనే ఉన్నాం కదా .. సీట్ రాని వాళ్ళ ఆత్మహత్యా ప్రయత్నాలూ, చదువు పేరుతో దిప్రెషన్ లోకి దిగిన వాళ్ళూ,.. వేలాది మంది..
అయితే వాడు సహజం గా తెలివైన వాడే..పైగా..తల్లి ఆశయం పట్ల నిబద్ధత కల్గిన వాడు, బుద్ధిమంతుడూ..
వాడిని దాని ఆశయానికి తగ్గట్టు ఐ ఐ టి లో సీటే ధ్యేయం గా పెట్టుకున్న స్కూల్లో ఎనిమిదవ తరగతి నుండీ.. వేసింది. వాడు నిన్నటి పువ్వులా.. వడిలిపోయాడు. కళ్ళల్లో తేజం పోయి.. ముఖం నీరసపడి డల్ గా తయారయ్యాడు.
ఆరా తీస్తే తేలిందేంటంటే... ఉదయం 5 కొట్టే 15 నిమిషాల ముందే లేస్తాడట. పదిహేను నిమిషాల్లో తెమిలి గ్లాస్ పాలు తాగి ఆటో ఎక్కుతాడట. 5.30 నుండీ 7.30 దాకా ఐ ఐ టి కోచింగ్. ఎనిమిది కి ఇంటికి వచ్చి స్నాన పానాదులూ, బ్రేక్ ఫాస్టూ కానిచ్చి స్కూల్ కి పరుగు.
స్కూల్ నుండి 3.45 కి రాగానే.. చక చకా బట్టలు మార్చుకుని పెట్టింది తిని.. ఇంకో ఆటోలో ఇంకో కోచింగ్ సెంటర్ కి పయనం. అలా వెళ్ళినవాడు 8 కి ఇంటికి తోటకూర కాడ లా నీరసం గా ఇంటికి రావడం. అప్పుడే తిండీ, స్కూలు పనీ,నిద్రా.. ఇది చాలదన్నట్టు ప్రతి శనివారమూ ప్రాక్టీస్ టెస్టులు!!!
స్కూల్లో ఎలాగూ ఐ ఐ టీ కి కూడా చెప్తున్నారు గా..ఇంకా వాడికి మళ్ళీ బయట ఎందుకు అంటే.. 'నీకు తెలియదే.. చుక్కా రామయ్య దగ్గర సీటు దొరకాలంటే ఇక్కడ రెండేళ్ళు రుబ్బితే కానీ కుదరదు ' అంది.
అసలు ఈ కోచింగ్ కోసం పెట్టిన ఎంట్రన్స్ లో వాడికి రెండవ రాంకు వచ్చిందిట. వాళ్ళు మొదటి రాంకు వాడికి పూర్తి ఫీస్ రాయితీ.. రెండవ రాంకు వాడికి 50% రాయితీ.. మూడవ రాంకు వాడికి 25 % రాయితీ ఇచ్చాడట.
ఇక్కడ ఇంటర్ లో చుక్కా రామయ్య దగ్గర సీట్ కోసం కోచింగ్ ట. 'అబ్బో ' అనుకున్నాను. ఇంట్లో టీ వీ తీసేసారు. ఫోనూ పీకేసారు. పేపర్ తప్ప వేరే వినోదం లేదు వాళ్ళ జీవితం లో.
వాడు మాకు నాలుగేళ్ళు కనపడలేదు. అఫ్ కోర్స్.. ప్రియ కూడా కనపడలేదనుకోండి.
ఈ నాలుగేళ్ళ కఠోర దీక్ష కి ఫలితం వచ్చిన రోజున.. వాళ్ళు పడ్డ వత్తిడి ని చూసి నాకు భయం వేసింది. ఎందుకయినా మంచిదని వాళ్ళ ఇంటి బయట కాపు కాయమని (పిల్లాడు ఒకవేళ అఘాయిత్యానికి తలపడితే?).. మా డ్రైవర్ కి చెప్పాను. రిజల్ట్ వచ్చింది. మూడు వేలకి పైన వచ్చింది. ప్రియ ఏడుపు, శాపనార్థాలు.
వాడు చిన్నబుచ్చుకున్నాడు. ఇంటి బయట పడ్డాడు. వాడి వెంట కాస్త దూరం లో నీడలా మా డ్రైవర్ రెడ్డి.
బోల్డు ఐఐటీలు పెట్టటం వల్ల వాడికి సీటైతే వచ్చింది కానీ కోరుకున్న బ్రాంచ్ కాదు. వాడికి నాలుగేళ్ళ ఎగ్జైల్ తర్వాత మనుషుల్లో పడటానికి చాలా కాలం పట్టింది. ఐఐటీలో మూవీ క్లబ్ కి సెక్రెటరీ. కల్చరల్ వింగ్ కి ప్రెసిడెంట్ అవటానికి ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఊహించుకోండి..
ట్రెక్కింగ్, బైకింగ్, స్పీచుల్లో,డ్రామాల్లో అన్నింటిలోనూ వాడే. అదీకాక వాడి దగ్గర వందల MP3 లు. scribd లో డవున్లోడ్ చేసిన పుస్తకాలూ, torrent లో తీసిన సినిమాలూ,.. ఉన్నాయంటే.. వాటితో పాటూ ఒకటి రెండు 'F' లు కూడా చేరాయని.. ప్రత్యేకం గా చెప్పనవసరం లేదనుకుంటాను?
వాడు ఇంటికి వస్తున్నాడని తెలిసి కలవటానికి వెళ్ళాను.,.
జ్వరం తో సెలవలకొచ్చిన వాడిని ప్రియ.. గ్రేడుల విషయం లో నిలదీసి అడిగింది. చదువు తప్ప మిగిలినవి వదలమని వార్నింగ్ ఇచ్చింది. కానీ వాడు చూసిన ఒక్క చూపు లో కనపడిన నిరసనకి భయపడింది. మౌనం గా రెండు క్షణాలు తీక్షణం గా తల్లి వంక చూసి..
'కృష్ణత్తా! మొన్న అడిగావు కదా.. ఐఐటీ లో సీట్ వచ్చినందుకు ఏది కావాలన్నా ఇస్తానని?' అన్నాడు. 'అఫ్ కోర్స్! అడుగు..' అన్నాను ఉత్సాహంగా.. 'నీ పిల్లల్ని ఐఐటీ కి పంపించకు.. పంపినా ఏళ్ళతరబడీ వాళ్ళను హింసించకు ' అన్నాడు. ఎవ్వరం ఏమీ మాట్లాడలేకపోయాం....
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
Excellent :-)
It's complicated.
వద్దు వద్దు అనుకుంటూనే తమ వంతు వచ్చేసరికి అందరూ ఇలానే చేస్తారేమో అనిపిస్తుంది.
bavundi... parents lo maarpu raavali..pillalni swechchaga ga edaganivvali..
>>"నీ పిల్లల్ని ఐఐటీ కి పంపించకు.. పంపినా ఏళ్ళతరబడీ వాళ్ళను హింసించకు"
చక్కగా చెప్పాడు. అటు ఇంటిలోని హింస, ఇటు కాలేజీలోని ఒత్తిడి భరించలేక ప్రతీ సంవత్సరం ఆత్మహత్యలు/ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఎందరో. ఇక్కడున్న కొద్ది సంవత్సరాలలోనే నేను చాలామందిని చూశాను. అంతెందుకు, కేవలం వారం రోజల క్రితం ఒకబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐఐటీలో స్టూడెంట్స్‌కు చాలా స్వేఛ్ఛ ఉంటుంది. వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇంకా ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నా, కౌన్సిలింగ్‌లు ఇవ్వడానికి ప్రత్యేకంగా విభాగాలు ఉంటాయి. అవసరానికి ఆదుకోవటానికి చాలా మందే ఉంటారు. ఇన్ని ఉన్నప్పటికీ ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడంటే, అది కేవలం పైన మీరు ఉదహరించిన తల్లిదండ్రుల వంటి వారే కారణం.
పాపం. మీరన్నట్టుగా ఆ అబ్బాయి ఎంత కష్ట పడ్డాడో. ఎటువంటి ఆఘాయిత్యం చేసుకోలేదు. అందుకు సంతోషించాలి ఆ అబ్బాయి తల్లిదండ్రులు.
Many moons ago I used to have a "great" idea of these IITs. Once I visisted it on a holi holiday and the people there behaved (with colors and such) as if they are no more than dogs and donkeys - with their level of education and their attitude for sex and such. It was such an eye opener that I decided I was very lucky never to have gone to IIT. Not all are like that but most are that way.
These grads just do not have what it takes to mix with general public. Put a lady opposite of him in the meeting and he will be like a dog with leaking 'చొంగ' and will do anything you demand of him. Their level of social behavior is just par par par below even an uneducated village idiot. Absolutely dumb and stupid.
Cannot even imagine that the IIT going kids can actually be that bad. Bombay IIT (used to) had bonfire type festivals (Mardi Gras) obviously imported from New Orleans LA and a friend who then was at IIT said "ఘోరాలు జరిగిపోతాయి అమ్మాయల్తో" That alone speaks volumes about IIT life. These guys graduate that way, come to USA and *THEN* recognize that Indian culture is great. So wow start doing something like reading sumati satakam, go to temple because they need society to survive. IITs absolutely need some courses to reform these guys.
On the other edge of the spectrum there are people like Shivkumar Kalyanaraman (Google ShivRPI and see what an IIT scholar actually is capable of).
Mr. DG
its looks like ur far beyond the dream of realise the absolute truth
ok, let me clear you got a son and got a seat in IIT what u will do now?
@Kiran
I won't force him to do whatever *I want(ed)* to do. He is free to do what HE WANTS. Since you asked, I would prefer if my kid can become independent human being and sincere good at heart guy - even if he is a car mechanic or plumber. BTW the mechanics and plumbers make more money than IIT guy if you are aware (or not). The mechanic I go to, fixes about 20 cars a day - employs 6 to 10 people, and easily makes more than a million an year. Very independent, sincere. Did not even go to college, let alone IIT. The guys who graduated at IIT come to USA and work as programmers. All their knowledge of engineering goes to naught. To become a programmer (or the so called software engineers) you do not need an IIT degree. From the day they enter IIT, all they talk is migrating to USA and what percentage of them stay back in India?
Do not stoop low to go on personal attacks about *my* dreams or *your* achievements. They are irrelavant here. I also quoted two ends of the same spectrum in my original post. I will *NOT* reply any more to anyone else. Au revoir.
Interesting.
Please have a look at this for another angle on this IIT question
http://kottapali.blogspot.com/2009/01/blog-post.html
@ ప్రవీణ్ గార్లపాటి
"వద్దు వద్దు అనుకుంటూనే తమ వంతు వచ్చేసరికి అందరూ ఇలానే చేస్తారేమో అనిపిస్తుంది."
నేనయితే ఇంతవరకు అలా చేయడం లేదు. ప్రస్తుతం వరకు అయితే మా పిల్లలని A గ్రేడ్ తెచ్చుకొమ్మంటాను అంతే. క్లాసులో ఫస్టు రావాలని గానీ, ఇతర వత్తిడులు కానీ నేను ఏమాత్రం పెట్టను.
why cant you look into the scribd docs which are named into other format
but its going to they are watching all the time in the hostel if somebody stops at home
so they will grow according to their own wishes not by forcing others
after two years please ask the same question he will definitely going to answer the opposite
iit is like a heaven kind of answers
and nobody replied to my comment haha i won
no body can stop them they will watch until they out of their institute thats a normal practice
thats the part of student life
watching in home is a wrong thing
in hostel they have the freedom wt they would like to have
thr is no wrong in it
why cant you look into the scribd docs which are named into other format
wt i mean is
u will find many x
everybody sure abt it
i have seen lot ppl like that
ఆవిడేదో(క్రిష్ణ గారు) పిల్లల మీద వొత్తిడి గురించి ఒక ఉదహరణగా IIT విషయం రాస్తే, అస్సలు IIT లు వుంచాలా? తీసెయ్యలా? IITలో చదివె వాళ్లు దెయ్యాలా? దేవుళ్లా? అనే దాకా లాగీ, పీకీ, ఉతికి అరేస్తున్నారుగా! Amazing quantity of context insensitive imagination. Hmm..
nice post maam
DG garu n i agree with u r opinion that after 4 years he will say IIT is heaven but i wont agree on u r opinion on IIT viewing frm outside angle n viewing frm its point differs i m not iitian but i spent my sixmonths weekends in IIT i never felt wat u said u saw some persons n drawing conclusion n the things u said will exist in every engineering clg its not particular abt iit
ఇప్పటికైనా interest ఉన్న చదువు అయితే పర్వాలేదు.ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకుని చదవాల్సి రావటం అంత నరకం ఇంకోటి ఉండదు.
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.