కిస్మస్ సెలవలముందు ఒక రోజు ఉదయం.. మా ఇంట్లో..
ఉదయం స్కూల్ కెళ్ళే హడావిడి ..ఒక పక్క నేను జడా.. వాళ్ళ నాన్న షూసూ వేస్తుంటే.. గంభీరం గా.. మొహం పెట్టి దోశ ముక్క నములుతూ, మా చిన్నమ్మాయి ..'నాన్నా.. మీ చిన్నప్పుడు.. world black 'N' white ఆ? కలరా? ' అని అడిగింది నిన్న. వొళ్ళు మండింది.. మేము కనీసం టీ కూడా సుఖం గా తాగకుండా.. సేవలు చేస్తుంటే.. ఎంత హాయిగా.. ఆలోచించుకుంటుంది..అని.. 'లేదమ్మా.. ప్రపంచం ఎప్పుడూ.. రంగులతోనే ఉంది..' అంటే .. 'కానీ.. గాంధీజీ వాళ్ళప్పుడు పాపం Black 'N' White లోనే ఉంది....' అని నిట్టూరుస్తూ....
రెండు రోజుల క్రిందట... "అమ్మా.. Byeeee" అని పళ్ళికిలిస్తూ స్కూల్ బాగేసుకుని వచ్చింది మా పెద్దమ్మాయి . . బుగ్గ పిండి పోపు పెట్టుకోవచ్చు.. అంత జిడ్డు మొహం!..
'ఏంటి అసలు సబ్బైనా పెట్టుకున్నావా? ముఖం మీద? ' అని గద్దిస్తే... 'yes అమ్మా!!.. నీకెప్పుడూ డౌటే నామీద.. అని ఇరిటేట్ అయింది మా పాప.. పోన్లే అని నేనూ హడావిడి లో పట్టించుకోలేదు..స్కూల్ బస్ వెళ్ళాక బాత్ రూం లోకెళ్ళి చూస్తే.. బకెట్ లో నీళ్ళ లెవెల్ ఒక ఇంచ్ అయినా తగ్గినట్టు అనిపించలేదు.. సబ్బు చూస్తే.. రాజస్తాన్ లో ఎడారి నేలంత .. పొడి పొడిగా..
సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక.. 'అవునూ.. ఉదయం నీ ఏక్షన్ రీ ప్లే చెప్తాను. బాత్ రూం కెళ్ళావు.. హాయిగా కొత్త టింకిల్ చదివావు.. 'టైం అయ్యిందీ' అని నా అరుపు వినగానే..గబ గబా.. చేతుల్ని బకెట్ లో ముంచి. మొహం తుడుచుకుని వచ్చేసావు.. ' అవునా? ' అని అడిగాను.. ముందర నా మొహం లోకి చూసింది.. వ్యంగ్యం,కోపం, లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయేమో.. ఒకవేళ నిజాన్ని ఒప్పుకుంటే.. తనకి ఏ విధమైన ట్రీట్ మెంట్ దొరకవచ్చు అని జాగ్రత్త గా..బేరీజు వేసుకుని.. నెమ్మది గా.. సిగ్గుగా, గారంగా ముఖం పెట్టి 'నీకెలా తెలుసు? ' అని అడిగింది..
నాకు కొన్ని దివ్యశక్తులున్నాయి అని చెప్పి.. స్నానం చేయకపోతే వచ్చే నష్టాలని వర్ణించి.. కాస్త భయపెట్టి వదిలాను.
వెళ్తూ వెళ్తూ.. 'అసలు టింకిల్ అలా చదివితేనే ఎంత.. thrilling గా ఉంటుందో తెల్సా? ' అని నా కందకుండా పరిగెత్తింది..
నేనూ తయారయి ఆఫీస్ కి వెళ్ళటానికి కార్ ఎక్కాక ఇద్దరు పిల్లల కబుర్లు, చిలిపి చేష్టలు నెమరు వేసుకుంటూ నవ్వుకుంటూ, కాసేపు చక్రాలు చక్రాలు గా కళ్ళముందు తిరుగుతూ..అలా నా నలుపు-తెలుపు ప్రపంచం లోకెళ్ళిపోయాను.. అదే నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నమాట..
మా చిన్నప్పుడు మేమూ అలాగే... పుస్తకాలు చదివేవాళ్ళం.. అసలు పుస్తకాలేంటి.. ప్రతీదీ... ఎంత బేసిక్ ఆనందాలుండేవి ... లైఫ్ లో... అని ఆలోచిస్తుంటే.. ఎన్ని గుర్తొచ్చాయో..
బస్ స్టాప్ లో.. బస్సు సమయానికొస్తే.. దాంట్లో అనుకోకుండా సీట్ దొరికితే కాలేజ్ రోజుల్లో వచ్చిన ఆనందం ... పది పైసల ఆకుపచ్చ గట్టి చాక్ లేటు కొనే డబ్బున్నప్పుడు.. పావలా కొచ్చే eclairs కొంటే వచ్చే ఆనందం,.. ఏ బస్సులోనో, రోడ్డు మీదో.. అనుకోకుండా.. ఆకస్మికం గా పాత స్నేహితులు కనిపిస్తే దొరికే ఆనందం..
ఇంటికి కాళ్ళీడ్చుకుంటూ వస్తుంటే ఇంట్లో ఫేవరేట్ చుట్టాల గొంతులు వినిపిస్తే వచ్చే ఆనందం..
గ్ర్ర్ర్ర్ర్ అని శబ్దం వచ్చే పంప్ స్టవ్ మీద.. తోపుడు బండీ లో వేయించే మిర్చీ బజ్జీలు తిని, (బకెట్ లో ఉన్న కుళ్ళు నీళ్ళలో ఒకసారి ముంచి స్టెర్లైజ్ చేసిన స్టీల్ ప్లేట్ లో ) ..
గాజు గ్లాసుల్లో మరకలని కర్చీఫ్ తో తుడుచుకుంటూ, వేడి వేడి టీ లు తాగినప్పుడొచ్చే ఆనందం..
జనాల్ని తప్పించుకుంటూ, తోసుకుంటూ, సుల్తాన్ బజార్ (హైదరాబాద్) లో.. రబ్బర్ బాండ్ లో, పిన్నులో కొంటే వచ్చే ఆనందం.. ఇలాంటి చిన్న చిన్న సర్ ప్రైజులు, ఆనందాలూ, కాస్త కాస్ట్లీ ఆనందాల, సర్ప్రైజుల వెనక్కి, ఎక్కడో అటకలమీద పెట్టేసాం..
ఇప్పుడు కార్ లో బయటకెళ్ళటం, ఫోన్ చేసి ఎపాయింట్ మెంట్ తీసుకోకుండా రాని బంధు మిత్రులూ, తినటానికెళ్ళాలంటే.. 'ఒక స్టాండర్డ్ ' ఉండాలని, .. షాపింగ్ అంతా.. మాల్స్ లో.. టీలూ,కాఫీలూ కాఫీ డేల్లో..
సెలవలంటే వాటికోసం తయారవటానికి 10 రోజులూ, సెలవలంతా.. అద్భుతం గా గడిపామన్న ప్రూఫ్ ల కోసం సెలవలంతా..మంచి కొత్త బట్టలేసుకుని, కెమేరాల్లో ఏ ఏ సీన్లు బంధించవచ్చా.. అని వెనకపడటమే సరిపోతుంది కదా అసలు?!!
వెనక్కొచ్చాక ఆ సెలవలనుండి రికవరీ కి మళ్ళీ ఇంకో వారం..
కనపడినవల్లా కొనేయటం,.. కో వర్కర్లకేమివ్వాలి? చుట్టుపక్కల వారికేమివ్వాలి? డ్రైవర్ కీ, పని అమ్మాయికేం కొనాలి? మన కుటుంబ సభ్యులకి ఎంత లో కొనాలి.. ఈ ఊబిలో కొట్టుకుంటూ..
ఇలా కాదు.. ఈ కిస్ మస్ సెలవల్లో గిఫ్టులు, కార్ లల్లో ప్రయాణాలు, చుక్క హోటళ్ళల్లో భోజనాలు, మాల్ లల్లో కొనడాలు, లాంటి వి వదిలేసి.. కొన్ని రోజులు 'బ్లాక్ ఎండ్ వైట్ ' ప్రపంచం లో గడపాలని నిర్ణయం తీసేసుకున్నాం.
హైదరాబాద్ లో దిగాక, సాయంత్రం పుస్తక ప్రదర్శన కి వెళ్ళి పేపర్ కప్పుల్లో టీ తాగి.. నాలుగున్నర గంటల పాటూ, పుస్తక ప్రపంచం లో విహరించాం.. ఇ-తెలుగు లో 'మనసు లో మాట' సుజాత గారు కనపడతారేమో నని ఆశ పడ్డాను కానీ.. నిరాశే అయింది.. అంతకు ముందే.. 'గడ్డిపూలు ' సుజాత గారు వచ్చి వెళ్ళారని తెలిసింది.. 'అయ్యో' అనుకున్నాను.. మేమొచ్చి వెళ్ళాక.. ' ప్రవీణ్ శర్మ, సీ బీ రావు గారు వచ్చారని తెలిసింది.. వాళ్ళనీ చూడలేక పోయాం.. అని అనుకున్నాను.శ్రావ్య గారూ వచ్చారని .. విన్నాను.. కానీ వేరే రోజనుకుంటా..
అక్కడ కలిసిన బ్లాగర్ల గురించి రెండు ముక్కలు చెప్పాలి..
భార్గవ రాం - త్వరగా కలిసిపోయి హాయిగా నవ్వుతూ నవ్వించే స్వభావం.. పైగా.. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే .. అంటే.. నాది చాలా ఆర్డినరీ ఫేసండీ.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు ప్రపంచం లో అంటారు.. నన్ను పోలినవారు మాత్రం 700 ఉంటారు కనీసం.. అని నవ్వేసారు.
కౌటిల్య గారు - ఎక్కువ మాట్లాడలేదు కానీ.. నన్ను బ్లాగర్ గా గుర్తించి.. నా బ్లాగ్ చదివానని, ఆయనకి నచ్చిందనీ చెప్పారు. (బహుశా.. ఆరోజు కలిసిన బ్లాగర్లలో ఒక్కరే అనుకుంటా.. నన్ను బ్లాగ్ ద్వారా గుర్తించింది.. )
శ్రీనివాస్ కుమార్ గారు : ఆయన చాలా సాదా (Simple) మనిషి లా అనిపించారు. మంచి స్టాల్స్ గురించి సూచనలిచ్చారు.
చావా కిరణ్ : బ్లాగుల్లో ఆయన చాలా సీనియర్ అని పరిచయం చేసారు. 'నేను చాలా వరకూ.. బ్లాగులు చదువుతాను.. మీ పోస్ట్ ఏదైనా చెప్పండి.. గుర్తిస్తాను.. ' అన్నారు. ఏ పోస్ట్ గురించి చెప్పాలో అయోమయం లో పడి ఇంక చెప్పలేదు..
కత్తి మహేశ్ కుమార్ : బ్లాగుల్లో ఆయన పేరు చాలా సార్లు విని ఉండటం వాల్ల, ఆయన టపాలు కొన్ని చూసి.. ఆయన పోస్టులు ఒకటి రెండు చదివి, కామెంట్ చేసిన experience తో .. ఆయన ని భీకరం గా.. కళ్ళెర్ర జేసి ఆవేశం గా రంకెలేస్తూ .. ఆలాగ ఏదో ఊహించుకున్నాను కానీ.. మృదు స్వభావి గా, మాట మాటకి పగలబడి నవ్వుతూ, నేను ఊహించిన దానికి వ్యతిరేకం గా కనిపించారు. మహేశ్ గారు నన్ను బ్లాగర్ గా గుర్తించలేదు.. నా కామెంట్లని గుర్తు చేసి.. కొద్దిసేపు ఆయన టపాల్లో ఏది నచ్చలేదో.. ఎందుకు నచ్చలేదో.. నేను ఆవేశం గా చెప్పినా.. ఆయన చిరునవ్వు తో చూస్తూ ఉండి పోయారు. వెళ్తూ వెళ్తూ.. తన బ్యాగ్ లో పుస్తకం చూపించి 'ముదిగొండ శివప్రసాద్ ని సంచీలో తీసుకెళ్తున్నాను ' అని చమత్కరించి వెళ్ళిపోయారు.
వీకెండ్ పొలిటిషియన్ :
వీకెండ్ పొలిటిషియన్ అంటే బొర్ర మీసాలతో, ఒక చలపతి రావో, ఒక కృష్ణం రాజో.. ఖాదీ బట్టలేసుకుని ఎర్రని బొట్టూ అదీ పెట్టుకుని భారీ కాయం తో .. చేతికి, మెడలో బంగారు గొలుసులతో .. చేతులు జోడించి అందర్నీ పలకరిస్తూ.... అని ఎవరైనా ఊహిస్తారు ఆయన కూడా.. దానికి విరుద్ధం గా.. సన్నగా పొడుగ్గా.. పెద్దగా ఆర్భాటాలు లేకుండా.. హుందా గా కనిపించారు. ( వారాంతాలు మాత్రమే ఆయన రాజకీయాలు చేస్తారనుకుంటా.. ఒక్క చొక్కా మాత్రమే.. ఖాదీ, మామూలు పాంటూ అందుకే వేసుకున్నారు కాబోలు )..
బోల్డు పుస్తకాలు కొని ఇంటికి చేరాం ...
హాయిగా.. మామూలు బట్టలేసుకుని, తలకి నూనె దట్టించి,.. బస్సుల్లో తిరగటం,....సెలవలంతా.. పుస్తకాలు నమలటం, రోడ్డు సైడ్ తోపుడు బళ్ళల్లో తినటం, 'ఆపిల్స్, పీర్స్ ' లాంటివి నాజూగ్గా పింగాణీ పళ్ళాల్లో ఫోర్కులతో తినటం కాకుండా.. 'చున్నీ తో దుమ్ము దులిపి బజార్ లో రేక్కాయలు, జామకాయలు, తేగలు, తిని, బస్సుల్లో తిరిగి,.. ఇరానీ హోటళ్ళల్లో చాయ్ లూ, పిడత కింద పప్పూ, బఠాణీలూ, తినటం, మా అమ్మగారింట్లో ఒక గోడ పెయింట్ చేయటం, తెల్లవారేదాకా స్నేహితులతో.. కబుర్లు,కొట్లాటలూ, జెనరల్ బజార్ లో మామిడి తాండ్ర, బొట్టు బిళ్ళల షాపింగ్ చేయటం.. లాంటివి చేయటం.. ఎంతో సంతృప్తి గా .. చాలా సీదా, సాదా గా.. సెలవలు గడిపి మళ్ళీ మా బంగారు బెంగుళూరు చేరుకున్నాం...
మళ్ళీ రొటీన్ లో పడినా.. కనీసం, 2 వారాలకి ఒక సారి కార్ వదిలి బస్సులో ప్రయాణం చేయాలనే నిర్ణయం, సెలవల్లో స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, కసి దీరా కొట్లాడినప్పుడూ, ఆర్థ్రమైన సంభాషణలు చేసినప్పుడూ, పుస్తకాలని నమిలినప్పుడు, ఆఘ్రాణించిన ఆలోచనా స్రవంతీ, సెలవల్లో దొరికిన కొత్త ఫ్రెండూ, చాలు... ఒక మంచి వెకేషన్.. అనిపించటానికి ..
హైదరాబాద్ 'అబ్బో బాగా మారిపోయింది.. మునపట్లా లేదు..' అనుకుటూ ఉండేదాన్ని, కానీ.. మారింది నేనేననీ, కొన్ని చూడటం/గమనించటం మానేశాననీ, .. కొన్ని మాత్రమే.. చూడటం నేర్చుకున్నానీ, సిటీ భౌతికం గా కొంత మారినా, ఎవరికి కావాల్సిన అనుభూతి వాళ్ళకి ఇవ్వటం మాత్రం లో మాత్రం మారలేదనీ.. మున్ముందు కూడా మార్పు రాదనీ అర్థమయింది....

41 comments:
హ హ నేనోచ్చాను అని చెప్పింది మీకే కదా , నేను వెళ్ళినప్పుడు RK గారు, చదువరి గారు, కృష్ణ ప్రియ గారు , వరూధుని గారు వీల్లెవరన్న కనపడతారేమో కాసేపు సుత్తి వేద్దాం అనుకున్నా కాని ప్చ్ అందరూ తప్పించుకున్నారు , వీవెన్ గారు ఫుల్ బిజీ ఉన్నారు సరే ఎందుకులే పాపం distrub చేయటం అని వెళ్ళిపోయాను :)
అద్యచ్చా.. నేను వాకవుట్ చేస్తున్నా.. ఎందుకంటే చదవటం పూర్తయిపోయింది :)
బావుంది మీ సెలవుల కథ. చివరి పేరా అనేక సందర్భాలలో గుర్తుంచుకొని ఆలోచించుకోవలసిన విషయం.
హైదరాబాద్ 'అబ్బో బాగా మారిపోయింది.. మునపట్లా లేదు..' అనుకుటూ ఉండేదాన్ని, కానీ.. మారింది నేనేననీ, కొన్ని చూడటం/గమనించటం మానేశాననీ, .. కొన్ని మాత్రమే.. చూడటం నేర్చుకున్నానీ, సిటీ భౌతికం గా కొంత మారినా, ఎవరికి కావాల్సిన అనుభూతి వాళ్ళకి ఇవ్వటం మాత్రం లో మాత్రం మారలేదనీ.. మున్ముందు కూడా మార్పు రాదనీ అర్థమయింది....
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఊరు భౌతికంగా మారినా దాని ఆత్మ అలాగే ఉంటుంది. మార్పు మనలోనే ఉంటుంది.
"బుగ్గ పిండి పోపు పెట్టుకోవచ్చు.. అంత జిడ్డు మొహం!.. "-బ్రహ్మాండం !!!
చాలా బావుంది.బాగా రాశారు.
ఒకోసారి చిన్న పిల్లల్లా ఎంజాయ్ చెయ్యడంలో ఉన్న ఆనందం ఎందులోనూ రాదు.
ఎటొచ్చీ సరైన తోడు ఉండాలి అంతే.
కృష్ణ ప్రియ గారూ, నిజంగా నేనూ ఎంతో ఫీలైపోయానండీ! మీరు వచ్చిన రోజు నాకు కాలేజీలో ఒక చిన్న సెమినార్ లాంటిది ఉండి వెళ్ళక తప్పింది కాదు. సాయంత్రం అక్కడే ఆలస్యమైపోయింది. అప్పుడు ఇహ అటువైపు వచ్చే సాహసం చేయలేకపోయాను కానీ అనుకుంటూనే ఉన్నాను, "ఇవాళ కృష్ణ ప్రియ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు" అని!ఈ సారి పుస్తకాల సంతలో కాకపోయినా తప్పక కలుద్దాం! మీ టపాలు నాకెంతో నచ్చుతాయి కానీ కామెంట్ రాద్దామని కూచుంటే అది టపా స్థాయికి చేరుతూ ఉంటుంది. ఉత్తినే ఒక స్మైలీ పారేసి పోవడం నాకు నచ్చదు. అందుకే తరచూ వ్యాఖ్యలు రాయలేకపోతున్నాను. సో, దీనికి కారణం మీరేనన్నమాట!
వీకెండ్ పొలిటీషియన్ గార్ని భలే వర్ణించారే!
చావా కిరణ్ ఆది బ్లాగరండీ బాబూ! తొలి తెలుగు బ్లాగరన్నమాట.
టపాలో చివరి పేరా చాలా టచింగ్ గా ఉంది
మీరు ఏ రోజు వచ్చేది చెప్పుంటే కొంతమందినన్నా కలవకలిగేవాళ్లు. ఇలాంటప్పుడు చెప్పాపెట్టకుండా రాకూడదన్నమాట! e-తెలుగు స్టాలులో చార్టు మీద మీ పేరు చూసి అరే కృష్ణప్రియ గారు వచ్చి వెళ్లారే అనుకున్నా!
నిజమే మీరు చెప్పినట్లు మారుతుంది మనమే!
మీరు భలే రాస్తారండీ, పిల్లల అల్లర్లు మీ డికేష్టను(బుడుగు భాషలో డిటెక్షన్) సూపర్ :-) బ్లాక్ & వైట్ రోజుల్లోకి భలే తీసుకు వెళ్ళారు. నిజమే సిటీ మారినది కొంతైతే మన దృక్పదాలు మారింది పోల్చుకోలేనంత. ఇప్పుడు అలా తిరిగి ఏవిబడితే అవితినాలంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి పరమ సుకుమారమైపోయిన శరీరం తట్టుకోగలదా అనే అనుమానంతో సగం ధైర్యం చేయలేం.
నాగురించి మీరూ అలాగే అనుకున్నారన్నమాట!..సర్లెండి కలిసాక ఒపీనియన్ మారిందిగా :) good to know that.
హమ్మయ్య మళ్ళీ పోస్టంతా తీరిగ్గా చదివా చాల బాగుంది . వీలయితే మీరేమి బుక్స్ కొన్నారో ఒక లిస్టు పడేయండి . నాకైతే బుక్ exhibition రాంగోపాల్ వర్మ హైజాక్ చేసినట్లు అనిపించింది .
సోమరాజు సుశీల గారి చిన్న పరిశ్రమ - పెద్ద కథలు చదువుతుంటే కృష్ణ ప్రియ డైరీ చదువుతునట్లు ఉంది , అదో ఒక రోజు మీ బుక్ కూడా అలా బుక్ exhibition లో కొనాలని నా కోరిక :)
అయితే ఆ ఆకుపచ్చ రేపర్ చుట్టి ఉండే చాక్లెట్లు మీకూ తెలుసన్నమాట. ఇంకా కొబ్బరిబిళ్లలూ నువ్వుజీళ్లూ రూపాయికి నాలుగిడ్లీలూ కడిగీకడగని ప్లేట్లలో మిర్చిబజ్జీలూ... ఆ రోజులే వేరండీ.
ఇహ పోతే...
వీకెండ్ పొలిటీషియన్ గార్ని నేనూ మీలానే ఊహించుకున్నానండీ :)
నేనెళ్లిన రోజు ఇంకో చమక్కు ఏంటంటే... కత్తి మహేశ్ కుమార్ గారిని నాకు చదువరిగారు పరిచయం చేశారు. :)
:)) మీ పిల్లల కబుర్లు బలే ఉన్నాయి!బ్లాక్ &వైట్ హహ్హహ్హ..చాలా బాగుంది.
సంక్రాంతి శుభాకాంక్షలండి
హరేఫాల గారి కామెంటు కి నేను కూడా డిట్టో. చివరి పేరా బ్యూటీఫుల్.
పుస్తక ప్రదర్శనకి నేను రెండుసార్లు వెళ్ళగలిగాను. బోల్డు పుస్తకాలు కొనడంతోపాటు చాలా మంది బ్లాగు మిత్రులని కలవగలిగినందుకు సంతోషంగా ఉంది.
క్రిష్ణప్రియ గారూ, మీరు మాత్రం నేనూహించినట్టుగానే ఉన్నారు :)
సుజాత గారు,
మొదటిసారి వచ్చినప్పుడు మీతో చెప్పినట్టుగానే ఇ-తెలుగు మెంబర్ షిప్ తీసుకున్నాను. VenuRam and Koutilya helped me with that.
I still have to read your post completely.
But a strange coincidence,
"..'నాన్నా.. మీ చిన్నప్పుడు.. world black 'N' white ఆ? కలరా? ' " Just yesterday, my younger son asked me the same question.
బుగ్గ చిదిమి పోపు వేసుకోవచ్చు.... 100 మార్క్స్ పొండి
శ్రావ్యా ఇండియావెళ్ళడం బ్లాగర్లను కలుసుకోవడం ..ఆహా..మీపనే బాగుంది అండి.. నాకు చెప్పనే లేదు మీతో కచ్చి పచ్చి పోండి :)
మీరు ఇలా అందరూ కలుసుకుంటూ వుంటుంటే నాకు కుళ్ళుగా వుందండీ. లాభం లేదు - అఖిల అమెరికా బ్లాగర్ల మహా సభలు నిర్వహిస్తాను.
నేనూ అప్పుడప్పుడు అలా సుల్తాన్ బజార్ లో , బడీ చావిడి లో తిరిగివస్తా . మీరొచ్చినప్పుడు చెపితే నేనూ తిరగనీకి వచ్చేద్దాన్ని గా !
సంక్రాంతి శుభాకాంక్షలు .
ముందుగా,
"నాకు 'కృష్ణప్రియ ' తెలుసోచ్!"
కానీ నేనింకా ఆ surprise ని తల్చుకుని తల్చుకుని నవ్వుకుంటున్నా :)
నీ పోస్టులు కొన్ని చదివినప్పుడు సమాంతరంగా నీతో పోలికలు గుర్తు చేసుకున్నానే కానీ నువ్వని తెలిశాక కూడా నమ్మశక్యం కాలేదంటే నమ్ము.
పుస్తకాల గురించి కూడా చెప్పవా కాస్త, వినాలనుంది.
"హైదరాబాద్ 'అబ్బో బాగా మారిపోయింది.. మునపట్లా లేదు..' అనుకుటూ ఉండేదాన్ని, కానీ.. మారింది నేనేననీ, కొన్ని చూడటం/గమనించటం మానేశాననీ, .. కొన్ని మాత్రమే.. చూడటం నేర్చుకున్నానీ, సిటీ భౌతికం గా కొంత మారినా, ఎవరికి కావాల్సిన అనుభూతి వాళ్ళకి ఇవ్వటం మాత్రం లో మాత్రం మారలేదనీ.. మున్ముందు కూడా మార్పు రాదనీ అర్థమయింది.... " అవునమ్మా, హైదరాబాదు మారలేదు. అదే నా అభిప్రాయం కూడా.
రంగుల ప్రపంచం occupation. నలుపు తెలుపు vacation. రెండూ కావాలనుకోవడం ambition :)
నీ ambition బావుంది. సాధిస్తావనే నమ్మకమూ ఉంది.
"సాఫ్ట్వేర్ ఇంజనీరే!" కాదు. అపర సవ్యసాచి లాగా అనిపిస్తున్నావు :))
Enjoy! Take care.
అయ్యో! మిమ్ములను మిస్ అయి పోయామే. మీ బ్లాగుకు ఇదే నేను రావటం అనుకుంటాను. హైదరాబాదు గురించిన మీ పరిశీలన, అనుభూతి హృదయాన్ని తాకింది. ఫిబ్రవరి లో బహుశా నేను బెంగలూరు రావచ్చు. నేను ఎప్పుడు మీ ఊరొచ్చినా తెలుగు బ్లాగర్ల, వికీపిడియన్ల సమావేశం జరుపుతాను.
మన బాల్యాన్ని మనం మళ్లీ చూసుకునేది మన పిల్లలలోనే.మా చిన్నప్పుడు అంటూ రీలును వెనక్కు తిప్పేస్తాం.ఇక గతం నలుపు,తెలుపులోనైనా బంగారువన్నె రోజులు దర్శనమిస్తాయి.వెకేషన్ కు,మార్పుకు కొత్త అర్థాన్ని ఆవిష్కరించారు.
నేనైతే బాగా బాగా కుళ్ళుకుంటున్నాను. అసలు జనాలు అన్ని అన్ని సార్లు పుస్తకాల సంతకి వెళ్లి పోవడమేంటి, అలా పుస్తకాలు కొనడమేంటి? అక్కడందరూ మీటింగులేంటి? కొత్త పుస్తకాల సంగతులు వ్రాయకుండా మా లాంటి వాళ్ళని కుళ్ళించటం ఏమి బాగాలేదు.
శరత్,
ఆ మహా సభలేవో మా అట్లాంటా లో పెట్టరాదు?
కృష్ణ ప్రియ
బడి చావడి ఆంజనేయ స్వామి గుడి ఎదురుకుండా చెరుకు రసం బండి మీద రసం సూపర్ గా ఉండేది. అక్కడ చుట్టుపక్కల బట్టల షాప్స్ లో బేరం చేసి సల్వార్ కమీజ్ వంద రూపాయల వరకు తక్కువ కొనుక్కుని ఇంటికి రిక్షాలో వస్తే ఆ మజానే వేరు. exhibition లో ఫెబ్రవరి పదో తారీకు నించి పదిహేను వరకు చెప్పులు, బాగ్ లు, నైల్ పోలిష్లు ఎనభై శాతం discountlo కొని వస్తు వస్తు తాజ్ లో మసాల దోస తింటుంటే ఉంటుంది...... ఎందుకు లెండి? ఆ రోజులే వేరు.
చుమ్బరస్కా గురించి గుర్తు చేస్తే టపాక్ మని గుర్తొచ్చే వారు కదా :)
Black 'N' White మార్పులు బాగున్నాయి మరి పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నారా అ౦డి,
బాగుంది మీ టపా .
కృష్ణప్రియ గారూ, నేనింక మీరు,వీకెండ్ పొలిటీషియన్ గారూ బంధువులనుకున్నానే! మాలా బ్లాగు బంధువులేనన్నమాట!..ః)...
పోతే నాకేదో క్రెడిట్ ఇచ్చినట్టున్నారుగా! మంగిడీలు...ః)...(ఎక్కువగా మాటాడలేదా ఐతే, ఈ సారి మీ బుఱ్ర తినేస్తా ఉండండి..ః).).... మీరు వెళ్ళిపోయేప్పుడు కలవటం వల్ల ఎక్కువ మాటాడలేకపోయాను....అదీకాక ఇ-తెలుగు కి శక్తివంచన లేకుండా నా టైముని వినియోగపెడుతున్నా కదా అప్పుడు...ః)
Good Post.
//నాన్నా.. మీ చిన్నప్పుడు.. world black 'N' white ఆ? కలరా?//
మీ చిన్నమ్మాయి మాత్రం సూపరండి. ఎప్పటికైనా J.K.రౌలింగ్ కంటే పెద్ద రచయిత్రి అయిపోతుంది చూడండి.
@ శ్రావ్య,
అవును.. మీరే చెప్పారు.. :)
@ WP,
థాంక్స్!
@ SHANKAR.S,
నా బ్లాగ్ కి స్వాగతం!
@ లక్ష్మీపతి గారు,
ధన్యవాదాలు! కొటేషన్ నాదే :)
@ లత,
థాంక్స్!
@ సుజాత,
:-) అనుకున్నా లెండి బిజీ గా ఉండి ఉంటారని.. మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు .. ఈ సారి కలుద్దాం.. అవును..అక్కడ చావా కిరణ్ గారి గురించి 'ఆది బ్లాగర్ ' పదం వాడటం విన్నాను..
@ సిరిసిరి మువ్వ,
సుజాత గారి బ్లాగు లో చెప్పాను ఆ రోజు వస్తానని.. ఈ సారి ఇంకొంత organized గా ఉంటే సరిపోతుంది.
@ వేణూ శ్రీకాంత్,
థాంక్సండీ.. అవును..బయట తిండి తినాలంటే భయమే :)
@ శ్రావ్య,
అవునండీ.. రాం గోపాల్ వర్మ పుస్తకం మొదటి రెండు వారాల్లో 20,000 కాపీలు అమ్ముడుపోయిందని విన్నాను.
నేను కొన్న పుస్తకాలు బోల్డు.. ఏడు వేలైంది బిల్లు :) వివరం గా రాస్తాను.. ఒక్క టపా లో..
@ బాలు,
:) అవును. ఆకుపచ్చ గట్టి చాక్ లేట్లు మొన్నీ మధ్య బెంగుళూరు లో దొరిగితే ఒక వంద చాక్ లేట్ల బాగు కొని తెగ తిన్నాము.
అయితే WP ని మీరూ నాలాగే ఊహించుకున్నారన్నమాట.. గుడ్ గుడ్ :)
@ రాధిక,
ధన్యవాదాలు రాధికా! మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు..
@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,
థాంక్స్ ! :)
@ Weekend Politician,
హ్మ్మ్.. అయితే.. మీరు నా పాత టపా..'బరువు...' చదివినట్టున్నారు :)
@ లలిత,
పిల్లలు దాదాపు అలాగే ఆలోచిస్తారన్నమాట..
@ నేస్తం,
థాంక్స్! థాంక్స్! నూటికి నూరు మీరు ఇచ్చారంటే..ఇంక ఆ స్తేట్ మెంట్ కి తిరుగు లేదని అర్థం :)
@ శరత్,
నా బ్లాగ్ కి స్వాగతం! అప్పుడెప్పుడో మీ 'కామెంటర్ ' టపా లో అరువున్న కామెంట్రుణం ఈ విధం గా తీర్చుకున్నట్టున్నారు! :)
ధన్యవాదాలు!
@ మాలా కుమార్ గారు,
మీరూ నా ఫేవరేట్ బ్లాగర్ల లో ఒకరు.. మిమ్మల్నీ ఈసారి తప్పక కలవాలి.. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..
@ లలిత,
:) నువ్వు మునగచెట్టు ఎక్కిస్తున్నావు..
@ cbrao గారు,
నా బ్లాగుకి స్వాగతం! ధన్యవాదాలు..
@ C.ఉమాదేవి గారు,
ధన్యవాదాలు!
@ కిరణ్మయి,
:) బాగుంది బాగుంది. పెట్టుకోండి సమావేశాలు. మీ జ్ఞాపకాలు బాగున్నాయి.
@ మౌళి,
:) ధన్యవాదాలు! పిల్లలకి కొంతవరకూ అలవాటు చేస్తున్నాం.. వారి black 'N' white world లో వేరే విశేషాలుంటాయేమో..
మంచూ, వింటున్నారా? మౌళి గారేమన్నారో ? 'చుంబరస్కా పేటెంట్ నాదే నాదే!!!' అన్నారు... పేటెంట్ ఆఫీస్ కి వెళ్ళి భంగ పడ్డారు.. చూశారా? ఆ పేరు చెప్తే నేనే గుర్తొస్తానట.. మీరు కాదట.. ఈ సంక్రాంతి పూట మంచి న్యూస్..
@ కౌటిల్య ,
:) నేనూ చూశాను.. మీరు చాలా బిజీ గా.. ఇ-తెలుగు స్టాల్ చూసుకోవటం.. నా ఉద్దేశ్యం, మీతో ఎక్కువ మాట్లాడటానికి అవకాశం రాలేదని.. మిమ్మల్ని కలపవటం చాలా సంతోషం గా అనిపించింది.
@ 3g,
థాంక్స్! :)
@ క్రిష్ణప్రియ
:)
@ కిరణ్మయి
మీ ఊరికివచ్చి నన్ను సభ పెట్టమంటారేంటండీ బాబూ. మీరే పెట్టేసెయ్యండి - మేము ఎలాగోలా వచ్చేస్తాం.
మునగ చెట్టు కాదు, అరటి చెట్టు ... ఎక్కక్కర్లేదు, గెల కోసి కొన్ని పళ్ళు ఇవ్వు చాలు.
నువ్వు నలుపు, తెలుపు, రంగుల మధ్య ఊగిసలాడుతుంటే నేను నీ భవిష్యత్తుని 3D లో ఊహిస్తున్నానన్నమాట :)
ఈ సారిలా కాక ముందెప్పుడైనా కలిసినప్పుడూ "నేను ముందే చెప్పాగా," అనొచ్చని!
choosaara choosara? kotta post edandee ani adigaanaa? nenu 33 comments late...cheppakoodadu...post pettanandee ani..pch..pch....
chala bagundandee...tapa!..nannu sultan bazaar black and white ki teesukellipoyaru kaasepu...
thanks meeku..eesaari nannu pilavandi nenu vasta...okna?
సంక్రాంతి శుభా కాంక్షలు
@ మహేశ్ గారు,
:)
@ లలిత,
హ్మ్మ్,,
@ ఎన్నెల,
థాంక్స్,.. :)
@ kannaji e,
ధన్యవాదాలు! మీకు కూడా సంక్రాంతి శుభా కాంక్షలు ..
టపా ఎప్పటిలానే :)
సంక్రాంతి శుభాకాంక్షలు
టపా కెవ్వ్ .......సంక్రాంతి శుభాకాంక్షలు కృష్ణప్రియ గారూ
కాస్త టెన్షన్ పడ్డానండి..
కానీ చివరికి కి good న్యూస్... :)
బాగుంది మీ పోస్ట్.. :)
@ హరేకృష్ణ, శివరంజని,
థాంక్స్.. మీకు కూడా శుభాకాంక్షలు (చాలా లేట్ గా నేమో :) )
@ కిరణ్,
హ్మ్మ్.. ఈ కామెంట్ తర్వాతి పోస్ట్ కనుకుంటా.. :) థాంక్స్.
Nijamena!!! marindi manam, chala baga chepparu :)
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.