Saturday, November 20, 2010

కార్తీక మాసం వన భోజనాలు - నా వంట టల్లోస్ ..

జ్యోతి గారికి థాంక్స్ తో.. 

 కార్తీక మాసం వనభోజనాలకోసం.. నా వంట..  మెంతి కూర, పండుమెరప కాయల వంటకం, టల్లోస్..

టల్లోస్.. పేరు వెనక కథ.. 

పండు మెరప కాయల ఘాటు కాస్త అటూ ఇటూ అయితే స్స్ స్స్ స్స్ అని వగరుస్తూ, జగ్గుల కొద్దీ నీళ్ళు తాగుతూ, ' తల్లో స్స్ స్స్ స్స్ ',  'తల్లో స్స్ స్స్ ' అని అరుపులు మామూలు కనక..

మరీ 'నా తల్లో, ఓర్నాయనో' .. అని పెట్టకుండా.. 'త ' ని 'ట ' గా మార్చి 'టల్లోస్ ' అని పెట్టానన్నమాట. 



ఇక టల్లోస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.. 


తప్పని సరి గా కావాల్సిన పదార్థాలు:


పండుమెరప కాయలు  - 100 గ్రా
మెంతి కూర                 - ఒక కట్ట
ఉల్లిపాయ                    - 1 పెద్దది
బెల్లం                           - చిన్న నిమ్మకాయంత
చింతపండు                 - బెల్లం ముక్కంత
ధనియాలు                  - ఒక తేనీటి చెంచా తో
ఉప్పు, పసుపు             - తగినంత
కర్వేపాకు                    - రెండు రెబ్బలు


తాళింపుకి :
4 బల్ల చెంచాల నువ్వుల నూనె, చిటికెడు ఇంగువ, తేనీటి చెంచాడు ఆవాలు, మినప పప్పు


కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేయవచ్చనుకునే పదార్థాలు..


ఉల్లి, వెల్లుల్లి      - రుచికి తగ్గట్టుగా
పెరుగు            - ఒక కప్పు..


ముందుగా రెడీగా ఉంచుకోవాల్సినవి..


మెరపపళ్ళు :




పండు మెరపకాయలు కడిగి, పొడిగుడ్డతో తుడిచి డైరెక్ట్ గా జార్ లోకే కత్తెర తో ముక్కలు గా కత్తిరించుకోవాలి.  ఫుటో లో మూడు రంగులవి ఉంచాను. కొంతమంది ఎర్ర రంగు చూసి.. 'బాబోయ్ ' అంటారని ఒక్కోసారి నారింజ రంగు మెరపపళ్ళు వాడతాను.. ఒక్కోసారి కాస్త మార్పు గా ఉంటుందని ఆకుపచ్చ గా ఉన్న పచ్చిమెరప కాయా వాడవచ్చు.. కాకపోతే.. ఘాటుని ఎంత వరకూ భరించగలమో,.. మన ఇష్టం..




తరిగిన మెరప పళ్ళల్లో, చింతపండు, బెల్లం, ధనియాలు, ఉప్పు,పసుపు, వేసి కచ్చా పచ్చాగా నూరాలి.





మెరప మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకుని  ఇక పొయ్యి వెలిగించటమే తరువాయి!!!




మూకుడు/బాణలి పొయ్యి మీద పెట్టుకుని, నూనె వేసి, కాస్త కాగాక ఇంగువ వేయాలి, పిదప ఆవాలు, మినప్పప్పు వేసి చిటపట లాడేంత వరకూ ఆగి ..






 మంట తక్కువ చేసి, మెంతి కూర మూకుట్లోకి సన్నగా కత్తెర తో కత్తిరించాలి..  ముందే తరుక్కుని రెడీ గా ఉంచుకోవచ్చులెండి.. కానీ నాలాంటి లో మెయింటెనెన్స్/త్వరగా వంట ముగించుకుని బయట పడాలనుకునే వాళ్ళు చేసే షార్ట్ కట్స్ అన్నమాట :)





ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న మెరపపళ్ళు,మసాలా మిశ్రమాన్ని మూకుట్లో మెంతికూర తురుముకి జోడించి కలియబెట్టి, మంచి సువాసన వచ్చేంతవరకూ సన్నటి సెగ మీద రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.




కాస్త మెంతి కూర మగ్గాక, ఇప్పుడు ముందుగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలియపెట్టి పొయ్యి ఆపేయాలి.





పొయ్యి మీద ఉల్లిపాయలు వేడిగా ఉన్న టల్లోస్ లో ఉల్లి ముక్కలు కమిలి రసాన్ని పీల్చి,..జ్యూసీ గా తయారవుతాయి.

తర్వాత, ఒక గిన్నె లోకి తీసుకుని కర్వేపాకు జత చేసి, ఒక పండుమెరప కాయ, పచ్చి ఉల్లి ముక్కలతో గార్నిషింగులు చేయాలి.








రొట్టెల్లోకీ, అట్టు జాతి పదార్థాలతో, పెరుగు-టల్లోస్ వాడవచ్చు.  అదెలా చేస్తారంటే.. ఒక కప్పు పెరుగులో ఒక చెంచాడు టల్లోస్ వేసుకుని కలుపుకోవడమే !! వేడి అన్నం లోకి, ఒక చెంచా నెయ్యి తో తినండి.. 




కలిపాక పెరుగు టల్లోస్ చూడండి.. ఎంత బాగుందో.. దీన్ని టల్లోస్ రాయ్ తా అని కూడా పిలుచుకోవచ్చు.. 



56 comments:

రాజ్ కుమార్ said...

తల్లోస్స్..... స్స్ స్స్ స్స్.... sorry.. 'టల్లోస్.. ..స్స్ స్స్ స్స్.. :) :) photos keka andi..noroori potundi :) :)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

:))

Anonymous said...

మీరు కుడా కవాండి? (కవి+ఆ+అండి)

అవును ఆ గరిటేంటండి భలే ఉన్నది ఎముక ఆకారంలో

జయ said...

తినటమేమో గాని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది 'టల్లోయ్'. ఆ రంగు రంగుల మిరపకాయలు మాత్రం బ్రమ్హాండంగా ఉన్నాయ్.

lalithag said...

ఈ రోజు మీ ఇంటికి భోజనానికి వచ్చేస్తాం. నీకు ఒంట్లో బానే ఉంది కదా?
:))

కృష్ణప్రియ said...

@ వేణూ రాం,

:) థాంక్స్! అవును.. నాకూ ఆశ్చర్యం వేసింది. ఫుటోలో చూసినంత అందం గా బయట లేదేమో.. :)

@ వీకెండ్ పొలిటిషియన్,

:))

@ తార,

కవా? అబ్బే అస్సలూ కాదు. ఆ చెంచాలు అమెరికా లో 'ఐకియా' అని స్టోర్ లో కొన్నాను. పిల్లలకోసం నానా రంగుల్లో దొరుకుతాయి..అక్కడ చాలా కామన్ అవి.

@ జయ,

:-) మెరపకాయలు సంవత్సరం పొడుగునా దొరుకుతాయి ఇక్కడ బెంగుళూరులో 'నాం ధారీ ' లో.

@ లలితా,

హమ్మో.. లలితా.. ఏంటో చేతులు గుంజుతున్నాయి. తల పోటు, నడుం నొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి...

Anonymous said...

పోనీలేండి,
పేరు చూసి, ఏ దేశందో అనుకున్నాను, తీరా మీరు కనిపెట్టారు అంటే..కాస్త భయం వేసింది, నిర్భయంగా చేసుకోవచ్చాండి? అందులోనూ మాకు పచ్చి మిరప తప్ప కారం తక్కువ మిరప ఆనదు.
ఏమయ్యా రాజ్ కుమారా, పచ్చడికి మొహం వాచి మీ ఊరు వస్తే ఇట్టాంటివి పెట్టు ఈ సరి, చేసి ఉంచు, ఈ సారి వచ్చినప్పుడు కుమ్ముదాం.

...

టెంప్లెట్లో టెక్స్ట్ విడ్త్ కాస్త పెంచకపొయ్యారా, టపాలు చూస్తే పెద్దా ఉంటున్నాయి, కానీ ఊరికే ఐపోతున్నాయి..

వేణూశ్రీకాంత్ said...

బాగుంది :-) ఇంతకీ మీరు చెప్పే చుంబరస్కా టల్లోస్ ఇదేనా అది వేరే వంటకమోయ్ అంటారా :-)

మధురవాణి said...

ఆహా.. చూస్తుంటేనే నోరూరిపోతోంది. చూడ్డానికి మహా రుచిగా ఉంది మీ టల్లోస్.మీ ఆరోగ్యం కుదుటపడ్డాక చెప్తే మేమొచ్చేస్తాం మీ ఇంటికి ;)

Bhãskar Rãmarãju said...

బరకగా నూరటం??
పొడిని బరక్కా వేస్తారు.
పచ్చళ్ళనో లేక ఇట్లాంటోటిని కచ్చాపచ్చాగా నూరతారు.
హేవిటోనమ్మా...

Overwhelmed said...

talloy..

Sravya V said...

ఏమిటీ ఐతే నిజం గానే టల్లోస్ అనే వంట ఉందా ???????? హ్మ్ !
ఫొటోస్ , మీరు చెప్పిన తయారీ విధానం సూపర్ . ఎంత నోరు ఊరిస్తున్న కానీ ఆ ఇంగ్రేడియట్స్ చూస్తుంటే మాత్రం కొంచెం పొదుపుగానే తినాలేమో అన్న డౌట్ వస్తుంది .
ఏమండీ అంటే అన్నామంటారు కాని మరీ ఇంత రుచికరం గా (నోటికి , కంటి కి కూడా ) చేస్తుంటే అ సంగతి తెలిసిన వాళ్ళు ఫోన్ చేసీ మరీ మీ ఇంటికి భోజనానికి రాకుండా ఎలా ఉంటారు చెప్పండి :)

జేబి - JB said...

బాగుందండీ, ఫొటోలు సూపర్.

మావాళ్ళచే టల్లోస్.. ..స్స్ స్స్ స్స్.. అనిపించుటకు, మా గుంటూరువాళ్ళ ఘాటు రుచి చూపించుటకు దీన్ని రేపే మావాళ్ళపై ప్రయోగించవలే.

అవునండీ, పండుమిరప బదులు పచ్చిమిర్చివాడచ్చా? మా ఇండియాబజారులో అవే దొరుకుగతాయి :-(

కృష్ణప్రియ said...

@ తార,

వంట కనిపెట్టింది నేనే!! భయం అక్కర్లేదు. బెంగుళూరు కొస్తే.. సీమ మెరప లాంటి ఘాటైన మెరప తో చేసి పెడతానని అందరికీ చెప్తున్నాను మరి.

టెంప్లేట్ లో విడ్త్ మారుద్దామంటే నాకు చేతకాలేదు. చూడాలి.

@ వేణూ శ్రీకాంత్,

చుంబరస్కా టల్లోస్ చాలా కాంప్లికేటెడ్. పేటెంట్ రాగానే దాని గురించి పోస్ట్ రాస్తాను లెండి :)

@ మధురవాణి,
:-) తినటానికి కూడా చాలా బాగుంటుంది. మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ దీన్ని మేథీ మసాలా అని పెరుగు తో.. లాగించేస్తారు.

మంచు said...

:-) మనం బెంగళూరులొ నైబర్స్ అయ్యాక.... మా ఇంట్లొ చుంబరిస్కా...మీ ఇంట్ళొ టల్లొస్ చేస్తె ఆపై చుంబరస్కా టల్లొస్ చెయ్యడం ఈజీ. పేటెంట్ విషయం లొ మనం మనం ఒక అండర్‌స్టాండింగ్ కి వద్దామంటే నాకు ఒకే మరి ... ఇక్కడ చూడండి

http://manchupallakee.blogspot.com/2010/11/patent-pending.html

కృష్ణప్రియ said...

@ భాస్కర్ రామరాజు,

పట్టేశారండీ. అవును. పొడులు బరక గా, పచ్చళ్ళు కచ్చా పచ్చాగా.. మా అమ్మ చేతి చివాట్లు పొద్దున్నే తిన్నా.. :-) మారుస్తున్నాను.

@ జాబిలి,

:-)

@ శ్రావ్య,

అదేంటండీ 'ఉందా? ' అని నెమ్మది గా అడుగుతారు. కనిపెట్టిందే మనం.. ఇంగ్రిడియంట్స్ కాస్త భయం పెట్టించేటట్లున్నా కాస్త లావైన పండు మెరపకాయలు తీసుకుంటే ఆట్టే కారం ఉండదు. మా అమ్మాయి ఫ్రెండ్స్ పదేళ్ళ గుజరాతీ వాళ్ళు తినేస్తారు. అయినా కాస్త నువ్వులో పల్లీలో వేయించి కలిపితే.. కమ్మగా తయారయిపోతుంది. :)

కృష్ణప్రియ said...

@ జేబి - JB,

థాంక్స్! పచ్చి మెరప వాడాలంటే.. చిన్న మార్పులు చేయాలి. హాలోపెనో/ఫ్రెస్నో పెప్పర్ బెస్ట్.

మన పచ్చిమిర్చీ బజ్జీల మెరపకాయలూ ఓ కే కాస్త ఫ్రిజ్ లో కాకుండా బయట పడేస్తే.. పండుతాయేమో.. చూడండి.

పచ్చివాటికయితే, పల్లీలో, నువ్వులో కలిపితే టేస్ట్ మారి.. మిర్చ్ కా సలాన్ టేస్ట్ వచ్చేస్తుంది. పైగా మెంతికూర కాంబినేషన్ కుదరదేమో.. ట్రై చేసి చూడాలి.

swapna@kalalaprapancham said...

photos matram addrus main ga aa colors mirapakaayalu. bale kottha vantam cheppare, Good.

miru kanipettara baboy, chuste matram bagane undi, chesukoni thineyochhane anukuntunnanu ;)

కృష్ణప్రియ said...

@ మంచు,

హమ్మ మంచూ.. జ్యోతి గారు చెప్పారు కదా అని నేను ఎంతో గోప్యం గా ఉంచి కాపాడుతున్న టల్లోస్ రెసిపీ బ్లాగు లో రాసేస్తే.. చుంబరస్కా కి పేటెంట్ అప్ప్లై చేసేస్తారా! యే అన్యాయ్ హై.. అక్రం హై..

మీ మీద దావా వేసేయాలి అర్జంట్ గా.. అయ్యో.. ఇది ఆదివారమైందే.. :-)

కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి. చుంబరస్కా + టల్లోస్ చేసే విధానం మౌలికం గా రైట్ డైరెక్షన్ లోకే వెళ్తున్నట్టున్నారు..


@ swapna@kalalaprapancham,


తప్పకుండా చేసుకుని చేసుకోవాల్సిన వంటకం ఇది. :-))

కరెక్షన్ : మీరు కనిపెట్టారా బాబోయ్ అనకూడదు.. 'తల్లోయ్ ' అనాలి

మీ బ్లాగ్ లో కామెంట్ సదుపాయం లేనట్టుంది? మీ పాలక్ పనీర్ మీద వ్యాఖ్య ఉంచుదామంటే.. కనపడలేదే..

జేబి - JB said...

ఐతే ఏల్పినోతో ప్రయత్నిస్తానండీ, థాంక్స్.

సుజాత వేల్పూరి said...

చాలా వెరైటీగా ఉంది! మా గుంటూరు పండు మిరపకాయలతో చేస్తే ఇంకెంత బాగుంటుందో?

సర్లే , చేతులు కడుక్కుని వస్తున్నా, వడ్డించేయండి!

swapna@kalalaprapancham said...

oka banglore donga sachhinodu vedava gaadu neechudu nikrustudu nenu ye post rasina daniki relate kakapoyina ishtamochhinattu adda diddamina comments paaresaadu vintha vintha id's tho (perlatho), aha aa perlu matram supero super. vadu uttha waste candidate. piriki vedava fake id's tho comments ichhe vaadu. vadi ip address anni unnayi kani phone number kanukkolekapoya. ayina vadi gurinchi manaki endukule. vadu nannu ane chance ivvakudadu ani bahu vidala alochinchi last ki ee option selet chesukunna ade comments option peeki padesaanu :)

ippudu nenu na blog nu happy ga raasukuntu pothunnanu. naku edina post nachhinthe andari blogs ki comments rasthuntaanu. naku comments ravalani epudu korukoledu. nenu na kosam satisfation kosam rasukuntunna blog. nenu rasindi vere vallaki entertainment avuthunda, chusara leda annade kavali anthe naku.

baboy anedi na oothapadam lendi ;)

mire ani expect chesa na paalak pannir pic download chesindi ani. mi mirapakayala pic kuda nenu save chesukunnanu :)

annattu marchipoya na original blog ni malli reopen chesaanoch.

http://swapna-kalalaprapancham.blogspot.com

నేస్తం said...

చూడగానే భలే నోరు ఊరింది క్రిష్ణా.. అందులోనూ ఈ రోజు ఉపవాసం ..:( ఈ రోజు వంటలన్ని ఓ రోజు ప్రయోగం చేయలి..

sunita said...

talloy..hahaha....

3g said...

ఇన్ని మిరపకాయల్తో.... వంటా.... అమ్మా టల్లోస్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్స్

కొత్త పాళీ said...

వంటల్లోనూ మీ స్టైల్ వేరే :)

కృష్ణప్రియ said...

@ జేబి - JB

శుభం. మొదలు పెట్టండి మరి :)

@ సుజాత,
అవును, గుంటూరు పండు మెరప కాయలతో కారం గా ఉన్నా.. అద్భుతం గా ఉంటుంది.. వచ్చేయండి.. వచ్చేయండి...

@ నేస్తం,

తప్పక ప్రయత్నించండి.. కానీ.. నకిలీ చుంబరస్కా వంటలను చూసి మోసపోకండి.. నా డైరీ లో రాయబోయే చుంబరస్కా యే అసలైనది.. :)

@ సునీత,

:-))

@ 3g,

అవన్నీ చూపించటానికండీ.. వేయాల్సింది తక్కువ పరిమాణం లోనే.. :)

@ కొత్తపాళీ గారు,

థాంక్స్, థాంక్స్!..

మాలా కుమార్ said...

తల్లోయ్ . . . తల్లోయ్ ఇంత నోరూరిస్తే ఎలాగా తల్లీ ?

నేను said...

తేనీటి చెంచా, 4 బల్ల చెంచాల //
కేక :-)

మెంతి కూర//
ఈ మెంతికూర అనగానేమి ?
ఇంకా ఇంగువ mandatory నా ?

ఇవి కాస్త చెప్తే భవిష్యత్‌లో ఒక పనిలెని పూట ట్రై చేస్తా.

మంచు said...

నకిలీ చుంబరస్కా ... హ హ హ .... సూపర్... :-)
ఓ...చెంచాలు పాలొ అల్టొ ఐకియాలొ కొన్నారా

కృష్ణప్రియ said...

@ మాల గారు,

:) మీరీ సారి హైదరాబాద్ లో గెట్ టుగెదర్ పెట్టుకుంటే.. నేను గిన్నెడు టల్లోస్ తీసుకొస్తా.. అలాగే ఒరిజినల్ చుంబరస్కా..

@ బద్రి,

:).. మెంతి కూర అంటే..హిందీ లో మేథీ, ఇంగ్లిష్ లో fenugreek leaves. దొరకకపోతే మెంతులని మూకుట్లో వేయించుకుని (no oil.. dry roast), పవుడర్ చేసి కలపాలి. ఇంగువ mandatory కాదు.

@ మంచు,

నాకెందుకో మీలో ఒక అనూ మాలిక్, ఒక చక్రి కనిపిస్తున్నారు నిన్నటినుంచీ.. :)
అవును పాలో ఆల్టో ఐకియా నుండే..

మంచు said...

అనూ మాలిక్ , చక్రి అంటే ఒక్క క్షణం వెలగలేదు.... వాఆఆఆఆ వా వా.... ఇప్పుడు నేను అనాలి యే అన్యాయ్ హై...అక్రం హై...అజారుద్దిన్ హై....

ఒరిజినల్ చుంబరస్కా నాదే .....నాదే ఒరిజినల్ చుంబరస్కా..

చెప్తా మీ పని....అర్జెంట్‌గా చిన్న పొస్ట్ వెయ్యాలి... మీరు బజ్ ఫాలో అవుతారా ?

Anonymous said...

ఘాటుగా ఉంటే మీ ఇంట్లో ,తల్లో స్స్,స్స్ అంటారా ,మా ఇంట్లో అబ్బా స్స్,స్స్ అంటాం.అయితే అలాంటి వంటలకు మేము అబ్బాస్ అని పేరు పెట్టుకోవచ్చేమో

చెప్పాలంటే...... said...

ఆహా.. చూస్తుంటేనే నోరూరిపోతోంది. చూడ్డానికి మహా రుచిగా ఉంది మీ టల్లోస్.ఫొటోస్ , మీరు చెప్పిన తయారీ విధానం బాగుందండీ.....

Sravya V said...

పాలొ అల్టొ ఐకియా ??? దీనికి ఐకియా కి తేడా ఏంటి ?

కృష్ణప్రియ said...

@ మంచు,

ఇవ్వాళ్ళ మీరొచ్చి చుంబరస్కా నాదంటే.. ఏం చేస్తాం.. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు టెస్లా గురించి ఆయన వందో పుట్టినరోజున వివరించినట్టు నా వందో పుట్టినరోజున .. ఏ పూల పల్లకీ యో, ఉయ్యాలో .. పేటెంట్ మీదైనా అసలు శ్రమ నాదని, భావి తరాలకి నిజాన్ని వెళ్ళడించకపోతాడా.. :-)

@ అను,

:-) బాగుంది..కానీ తినేటప్పుడు తమిళ్ హీరో అబ్బాస్ ముఖం గుర్తొస్తుందేమో.. చూసుకోండి.

@ చెప్పాలంటే..

ధన్యవాదాలు.


@ శ్రావ్య,

ఐకియా స్టోర్.. పాలో ఆల్టో లో ఒక outlet ఉంది.. బహుశా ఒక్కటే ఏమో బే ఏరియా లో..
http://www.ikea.com/us/en/catalog/allproducts/

Sravya V said...

కృష్ణ ప్రియ గారు నేను "పాలో ఆల్టో " ఏరియా అనుకోలేదు అందుకే డౌట్ వచ్చింది , ఐకియా మా ఊర్లో ఉన్న ఐకియా కాకుండా వేరే ఏదన్నా అని డౌట్ వచ్చింది :) కామెంట్ రాసిన తరవాత ఫ్రెండ్ తో కన్ఫర్మ్ చేసుకొన్నా ముందే ఆ పని చేయాల్సింది .
ఇవ్వాళ్ళ మీరొచ్చి చుంబరస్కా నాదంటే.. ఏం చేస్తాం.. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు టెస్లా గురించి ఆయన వందో పుట్టినరోజున వివరించినట్టు నా వందో పుట్టినరోజున ..
----------------------------------
అబ్బే అది వెనకటి కాలం అండీ ఇప్పడు మనమెందుకు ఊరుకోవాలి మీరు ఏదో పాపం మన మంచు గారే కదా అని వదిలేసారు అనుకున్నా లేకపోతే చెప్పండి ఈ విషయం లో నా ఫుల్ సపోర్ట్ మీకే :)

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,

:-)) మన మంచే కదా అని ఊరుకున్నా లెండి... నాకు తెలుసు మీ సపోర్ట్ నాకే అని ..

ఇందు said...

భలే రంగులు రంగులుగా ఉంది....చాలా బాగుంది :)

హరే కృష్ణ said...

కాస్త తొందరగా ఫార్ములా చెప్పేశారు..థాంక్స్ :)

ఒక రెండు లీటర్లు డెలివరీ కి సిద్ధం గా ఉంచండి
కటౌట్లకి పాలాభిషేకాలు చేసి బోర్ కొట్టేసింది
టల్లోస్ అభిషేకానికి పేటెంట్ కూడా మీకు ఈజీ గా వచేస్తుంది :)

హరే కృష్ణ said...

పండుమెరప కాయలు - 100 గ్రా
మెంతి కూర - ఒక కట్ట
ఉల్లిపాయ - 1 పెద్దది
బెల్లం - చిన్న నిమ్మకాయంత
చింతపండు - బెల్లం ముక్కంత
ధనియాలు - ఒక తేనీటి చెంచా తో
ఉప్పు, పసుపు - తగినంత
కర్వేపాకు - రెండు రెబ్బలు

ఇందులో ఎన్ని ingredients అప్పు లేకుండా తీసుకొచ్చారు అని అడిగే ప్రమాదం ఉంది ముందు పోస్ట్ హాంగ్ ఓవర్ ఇంకా వదలలేదు ;-)

మంచు said...

పండుమెరప కాయలు - 100 గ్రా
మెంతి కూర - ఒక కట్ట
ఉల్లిపాయ - పెద్ద నిమ్మకాయంత
బెల్లం - ఉల్లిపాయలొ సగం
చింతపండు - బెల్లం ముక్కంత
ధనియాలు - చింతపండులొ పావు వంతు
ఉప్పు, పసుపు - తగినంత
కర్వేపాకు - రెండు రెబ్బలు

--------------------------------

ఇప్పుడు చెప్పు హరే కృష్ణా....ముందు పక్కింటినుండి అప్పు చేసి తేవాల్సింది ఎమిటి???
.
.
.
కొలత కొసం నిమ్మకాయ ....:-))))))

సుమలత said...

టల్లోస్.. హ్మ్ .. పేరు చాలా బావుంది. మరి రుచి సంగతి చూడాలి నే చేసిన తర్వాత :)

కృష్ణప్రియ said...

@ ఇందు,
థాంక్స్! :)

@ హరేకృష్ణ,
:-) ష్ ష్ ష్ ష్... . పేటెంట్లూ అవీ కామెంట్ల రూపం లో ఇస్తే.. నా కన్నా ముందే అప్లై చేసేస్తున్నారు.
ఎన్ని వీలైతే అన్ని అప్పులు తెచ్చుకోవాలి.. అన్నింటికన్నా తినేవాళ్ళు దొరకటమే కష్టం :)

@ మంచు,
:-))

@ సుమలత,
ధన్యవాదాలు :)

Admin said...

కృష్ణ ప్రియ గారు ఎన్ని ఫోటోలు పెట్టారో. అన్ని ఫోటోలు ,టల్లోస్ రాయ్ తా కూడా బాగుంది. ఇంతకి మీరు టెస్ట్ చేసారా! ఫోటోలు చూసి వంట చేసేసుకోవచ్చు.

Sravya V said...

అయ్య బాబోయ్ కార్తీక మాసం అయ్యిపోయిందండి , ఆ వనభోజనాల సందడి నుంచి బయటపడి ఒక పోస్టు రాసెయ్యండి :)

హరే కృష్ణ said...

ఏమిటిది ఇది కృష్ణ ప్రియ డైరీ ఏనా..డైలీ డైరీ నా.. మంత్లీ డైరీ నా..టల్లోస్ ప్రభావమా..?
మాకు తెలియాలి..తెలియాలి..తెలిసి తీరాలి
చాలా మంది వెయిటింగ్
దసరా సెలవుల్లో ప్రయాణం విశేషాలు కూడా బాకీ ఉన్నారు!

Rajesh Pediredla said...

కృష్ణ ప్రియ గారు నా బ్లాగ్ లో కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు అండీ.....మీ బ్లాగ్ చుసా....నోట్లో లాలాజలం వురిపోతుంది వన బోజనాలు చూస్తుంటే.....మీరు Software Engineer గ చేస్తున్నారా...?

కృష్ణప్రియ said...

@ లక్ష్మి,
థంక్స్. :) మొదట మా పక్క వాళ్ళకి ఇచ్చి తిన్నారని రూఢి చేసుకుని.. తర్వాత మేమూ తిన్నాము.

@ శ్రావ్య, హరే,
:) మీ అభిమానానికి థాంక్స్.

@ రాజేశ్,
అవును, థాంక్స్!

కొత్తావకాయ said...

నిన్న సాయంత్రం పాలో ఆల్టో ఐకియా లో నా ముసిముసి నవ్వులు చూసి అందరూ నాకు పిచ్చనుకున్నారు తల్లోయ్... అంతా మీ చలవే!

కృష్ణప్రియ said...

LOL.. :) నిన్న చదివారా ఈ పోస్ట్? సరదా కి రాసింది.. కానీ.. లక్కీ గా ఆదివారం రాయటం తో.. వేరే పనీ పాటా పెద్దగా లేకపోవటం తో.. తీరిగ్గా.. ఫోటోలు పెట్టి మరీ రాసాను...

I am glad you liked it :)

Manasa Chamarthi said...

జ్యోతి గారి బ్లాగ్‌లో లింక్ చూసి ఇక్కడకు వచ్చాను,
నిజంగా భలే నోరూరిపోతోంది ఫొటోస్ చూస్తుంటే! :((

ఒక ఆదివారం నింపాదిగా కూర్చుని ప్రయత్నిస్తాను; :)
అన్నట్టు మీరు వాడిన బోలెడు పదాలు మా అమ్మ వాడే పదాల్లా అనిపించాయి. కచ్చ పచ్చాగా లాంటివి :).

ఈ ఏడాది కూడా మరొకటి రాయండి మరి. :)

కృష్ణప్రియ said...

@ మానస,

:) అవునా? 'కచ్చా, పచ్చా' అని నాకు భాస్కర్ రామరాజు గారు కరెక్షన్ చేశారు...

ఈసారి కూడా రాస్తాను. మీరూ రాయండి.

Sharada said...

ఈ వీకెండే ఈ ఎక్స్పెరిమెంటు చేయాలన్నమాట!
కొత్త రెసిపీ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
శారద

కృష్ణప్రియ said...

@ శారద గారు,

:) చేయండి చేయండి..

Sujata M said...

ఒహ్ ! నాకు చదూతూనే బాల్యం/టీనేజ్ జ్ఞాపకం వచ్చేసింది. మా అమ్మగారు చేసే వారు ఇలాంటి చట్నీ ఇడ్లీ లోకి. ఓ వేళ చెయ్యకపోతే, ఇంట్లో కొరివికారం పచ్చడి, పెరుగులో కలుపుకుని తినేసేదాన్ని.. అపుడు కారం అంటే అంత ఇష్టం వుండేది. ఇపుడు బీ.పీ. వచ్చాక, చాలా మటుకూ తగ్గించేసాను.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;