Friday, July 22, 2011

ఎనిమిదికి రెండు మార్కులు ...




మీటింగ్ లో ఉన్నా.. సెల్ మోగుతోంది.. 'అప్పుడే మూడున్నరైంది' అనుకుని బయట పడి కాల్ అటెండ్ అయ్యాను. చిన్నదాని ఫోన్.


'అమ్మా.' సాక్రీన్ స్వీట్ గా చిన్న దాని గొంతు. నాకు తెలుసు ఏదో ఫిట్టింగ్ పెట్టటానికే. మా చిన్నదానికి అవసరమైన విషయాల్లో తప్పించి వేరే వాటన్నింటిలో తెగ తెలివి తేటలు.

గంభీరం గా గొంతు పెట్టి..'చెప్పు త్వరగా.. మీటింగ్ లో ఉన్నా.. అరగంట లో బయల్దేరతా ఇంటికి..' అన్నాను.

'నాకు హిందీ లో మార్కులిచ్చారు డిక్టేషన్ లో' అని నానుస్తూ..

'నీకేన్నొచ్చాయి ?'.
'సుకృతి కి 1/8. '

'నీకేన్నొచ్చాయి ?'
'అసలు క్లాస్ లో అందరికీ ఒకటే మార్క్ వచ్చింది ఎనిమిది కి'
'నీకెన్ని?'
'అసలు పేపర్ చాలా కష్టం గా...'
'నీకెన్ని?'
'అంటే.. నాకు సుకృతి కన్నా ఎక్కువ...'
'నీకెన్ని?!!!!'
గొంతు .చాలా చిన్నదైపోయింది. ఒక్కసారి గా..
..'' రెండు మార్కులు
'వినపడట్లా'
'రెండు మార్కులు' అని త్వరతరగా 'అసలు నా మార్కులు అంత తక్కువగా ఎందుకొచ్చాయో తెలుసా?'
'ఎందుకబ్బా? Give me one good reason!'


'ప్రతి సారీ నా ముందు కూర్చునే ఉదిత్ గాడిని ఈసారి వెనక కూర్చో బెట్టారు'
'ఏంటీ!!!! కాపీ చేస్తున్నావా? నీకు పిచ్చా? సున్నా వచ్చినా పర్వాలేదు. కాపీ చేస్తే మాత్రం చంపేస్తా!'

'అదే మాట మీదుండు!.. మాట మార్చకు. నేనేం కాపీ ఎప్పుడూ చేయను.జీరో కన్నా ఎక్కువే వచ్చాయి కదా..'

'మధుమిత కి ఎన్నొచ్చాయి?'
'దానికా.. ఏడు.'

'వినపడట్లా'
'ఏడు'
'మరి అందరికీ తక్కువ మార్కులొచ్చాయన్నావు?'
'దానికే ఎందుకో ఎక్కువొచ్చాయిలే!'
'అమ్మా.. నీకే ఇంత బాధ గా ఉందే.. మరి సుకృతి వాళ్లమ్మ కి ఎంత బాదుండాలి చెప్పు..It must be insulting for her'
'ఏం?'
'వాళ్లింట్లో హిందీ మాట్లాడతారు.. అయినా దానికి..'
'అబ్బా... మరి నీకు తెలుగు ఎంత వచ్చో !!'
'నాకు స్కూల్ లో నేర్పరు కదమ్మా..'
'మరి మధుమిత ఇంట్లో తమిళ్ మాట్లాడతారు కదా?'
'అబ్బా... చెప్పాగా.. దానికి ఏదో తేడా..'
'ఆ??
'అన్నింటికీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్లతోనే కంపేర్ చేసుకోకూడదమ్మా!.. ఒక్కోసారి మిగిలిన వాళ్ల తో కూడా కంపేర్ చేసుకోవాలి'
'నీ దగ్గర్నించే నేర్చుకోవాలి పాఠాలు నేను.. ఇంటికి రానీ నీ పని చెప్తా!!'

'కృష్ణాజీ.. We are waiting...' లోపల నుంచి మా సింగ పెరుమాళ్...
'Coming.. just a minute' ... 'ఇదిగో.. తప్పులైన పదాలని ఐదు సార్లు రాయి. సరేనా?'

'అమ్మా.. నువ్వెప్పుడోస్తున్నావు? '
'గంట లో ఉంటా ఇంట్లో.. I need to run..'
'గంట కి కదా.. అప్పటికి రాసేస్తాలే!'
'రాయక పోవాలి.. ఈరోజు ఆటలు లేవు.. అసలు రోజూ నాతో ఒక గంట కూర్చోవాలి నువ్వు ఈరోజు నుంచీ సరేనా?'
'అబ్బా... రేపటి నుంచీ చదువుకుందాం'
'కృష్ణా.. Are you coming back? Or shall we continue later?' ఆశ గా సింగ పెరుమాళ్..
అబ్బే.. అతికష్టం మీద మీటింగ్ కి అందరూ వచ్చారు. అంత తేలిగ్గా వదులుతానా?

'తల్లీ.... లేటర్.. ఐ రియల్లీ నీడ్ టు రన్!'
'థాంక్స్ అమ్మా.. ఒకవేళ కరంట్ పొతే.. నేను రాయలేకపోతే ఏమీ అనద్దు.. ఓకే?'
'ఓకే ఓకే'

లోపల కొచ్చాక అర్థమైంది.. అదేమందో.. కరెంట్ పొతే రాయటానికేంటిట?
ఇంటికెళ్లాక చెప్తా దాని పని. 'హః.'. ఒళ్లు మండుతోంది...
* * * * * * * *



"తీయవే పుస్తకాలు... ఏం చెప్పారు ఇవ్వాళ క్లాస్ లో ?'
'సోషల్ లో Our Country చెప్పారు.'

'తీయి అయితే చూద్దాం ..'
'గ్లోబ్ తీసుకునిరా'

(అరగంట తర్వాత, నాలుగు అరుపులు, ౨౦ పెడబొబ్బలు అయ్యాక.. ఏడుపు మొహం తో వచ్చి కూర్చున్న అరక్షణానికి..'
'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'

'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?'
'Nooooo.. she is studying'
'మన దేశం లో ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియన్ సముద్రం, దక్షిణాన హిందూ మహా సముద్రం.. చూడు...'
'అసలు ఏమంటున్నావు? నాకర్థం కావట్లే'

(హః. ఇంగ్లిష్ మీడియం పిల్లలు :-(( ' - మనస్సులో అనుకుని).
'మన దేశానికి నార్త్ లో హిమాలయాజ్, ఈస్ట్ లో బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ లో అరేబియన్ సీ, సౌత్ లో ఇండియన్ ఓషన్ .. చూడు..'
(పిల్ల ఆలోచన లో..)
'ఏంటి మళ్లీ.. ఆలోచనలు.?.'

'నీళ్లల్లో ఇండియన్ ఓషన్ కీ, అరేబియన్ సీ కీ మధ్య లైన్ ఎలా గీస్తారు? బార్డర్ ఎలా తెలుస్తుంది?'
(ఏదో సద్ది చెప్పి..ఇండియా లో వివిధ భౌగోళిక పరిస్తుతులని వర్ణిస్తున్నా.)
'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'

'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?
'Nooooo.. she is studying'

'రాజస్థాన్ లో డిసర్ట్.. అక్కడ అన్నీ కాక్టస్ లూ, థార్నీ ప్లాంట్స్ మాత్రమే పెరుగుతాయి..'
'అంటే రోజెస్ లాంటివి?' (చిలిపి గా)
'చంపుతా.. నీకు తెలుసనీ నాకు తెలుసు.. Let me continue.. అక్కడ రోజంతా చాలా వేడిగా.. రాత్రంతా.. విపరీతమైన చల్లగా.. నీళ్లు తక్కువ..పంటలు తక్కువ..."

"కిసుక్కు..."

(ఇదేంటబ్బా.. కాస్త తేడా గా.. అని చూస్తే పెద్దది.. ఏంటి.. అన్నట్టు దాని వైపు చూసా..)

'అక్కడ పీపుల్ పోయెమ్స్ ఎలా రాస్తారా అని ఆలోచిస్తున్నా.. ఆల్వేజ్ మా టెక్స్ట్ బుక్ లో ఎప్పుడూ, బ్యూటిఫుల్ ఫామ్స్, ఫీల్డ్స్, గ్రీనరీ, వాటర్ స్ట్రీమ్జ్ నే దిస్క్రైబ్ చేస్తారు కదా'

'ఆగవే.. అసలే నేను చస్తుంటే.. రాజస్తాన్ లో పొయెట్రీ ఎలా రాస్తారో నాకెందుకు?'



'ట్రింగ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్గ్'

'Who is it?'
'Aunteeeee.. Can she come out to play?'
'Nooooo.. she is studying'

'ఆ.. ఎక్కడిదాకా వచ్చాం? లేక్స్.. ..'
'I know.. I know.. చిలుక లేక్ కానీ గ్రీన్ గా ఉండదు. సాంబార్ లేక్ వాటరీ గా ఉంటుంది.. వులార్ లేక్ -- దీనికే ఏమీ ఫన్నీ గా చెప్పటానికి లేదు.. ఏం చెప్పచ్చు?'



'ఆంటీ ప్లీజ్.. సెండ్ హర్ అవుట్! వీ నీడ్ హర్!!' (అరడజన్ పిల్లలు గుమ్మం దగ్గర..)
'సరే పో.. గంటలో ..'


మళ్లీ వచ్చేయాలి.... అనేలోపలే.. గాయబ్! చాల్లే ఇవ్వాల్టికి చదివిన చదువు చాలు!





34 comments:

చాణక్య said...

>>అక్కడ పీపుల్ పోయెమ్స్ ఎలా రాస్తారా అని ఆలోచిస్తున్నా.. ఆల్వేజ్ మా టెక్స్ట్ బుక్ లో ఎప్పుడూ, బ్యూటిఫుల్ ఫామ్స్, ఫీల్డ్స్, గ్రీనరీ, వాటర్ స్ట్రీమ్జ్ నే దిస్క్రైబ్ చేస్తారు కదా<<


హహాహ్హా.. మీ పెద్దమ్మాయికి కరెక్ట్ డౌటే వచ్చింది. పాపం రాజస్థానీస్.

As usual, SUPERB..!

SD said...

మీ పిన్ని కొడుకో ఎవరో ఐ ఐ టి లో చేరడానికి పడ్డ కష్టాలు అవీ వ్రాసి చెప్పారుగా? మళ్ళీ మీరే ఇలా?.... నాకు చిన్నప్పుడు X క్లాసులో అత్తెసరి మార్కులొచ్చాయి. అన్నింటికన్నా ఎక్కువ వచ్చినది హిందీలో. జోకు ఏమిటంటే ఇప్పటికీ నాకు హిందీ పూర్తిగా మాట్లాడ్డం రాదు. :-) తర్వాత ఇంజినీరింగ్ లో చేరినప్పుడు మొదటి సెమిస్టర్ లో ఉన్న ఇంగ్లీష్ క్లాసులో ఎనిమిది సార్లు టెస్ట్ పెట్టరు. అందులో నాకొచ్చిన అత్యధిక మార్కులు అక్షరలా నలభై ఫైనల్లో. ఫైల్లో పాస్ అవడానికి కావాల్సిన మార్కులు నలభై! :-) ఆ మేడం నన్ను రోజూ తిడుతూ ఉండేది. గతం గతహ ఇప్పుడు.

పిల్లల్ని వదిలేయండి. అయినా మీ పాపకి హిందీలో తక్కువ మార్కులొస్తే హిస్టరీ ప్రాక్టీస్ ఎందుకు చేయించారు? తప్పు మీదే. :-)

కొత్త పాళీ said...

తప్పు రాసిన మాటలు ఐదేసి సార్లేనా? నేనైతే పది సార్లైనా రాయీంచేవాణ్ణి - తనతో కాదు, మీతో :P

Wonderful as usual

లత said...

బావుంది.పిల్లలంతే ఏమీ అనకుండా ముందే మనని ప్రిపేర్ చేసేస్తారు

శ్రీ said...

మీ అమ్మాయికి భలే తెలివితేటలు.

ఆత్రేయ said...

ట్రింగ్ ట్రింగ్ ఏమండీ కెన్ యు సెండ్ హర్ టు అవర్ హౌస్.

ఎన్ని మార్కులోచ్చినా ఏమీ అనను,
పైగా సినిమా తేస్కేల్తా రిసల్ట్స్ రోజు.

ఇందు said...

హ్హహ్హహ్హ! భలే ఫన్నీగా ఉంది!! ముఖ్యంగా మీ పెద్దమ్మాయ్ డౌట్!! ;)

మీ చిన్నమ్మాయ్ ఫ్రెండ్స్ గట్టివాళ్ళే! ఎలాగైతేనేం తన ఫ్రెండుని తీసుకెల్లిపోయారు ఆటలకి! :)

చాల బాగుంది కృష్ణగారు :)

మురళి said...

soooooooooooooo sweet!!!

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>'అన్నింటికీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్లతోనే కంపేర్ చేసుకోకూడదమ్మా!.. ఒక్కోసారి మిగిలిన వాళ్ల తో కూడా కంపేర్ చేసుకోవాలి'

చిన్నపిల్లలు జీవిత సత్యాలు బోధిస్తున్నారు మీకు ఇంట్లో. మీ పిల్లల స్థాయికి మీరు ఎప్పటికి ఎదుగుతారో. రెండు దరహాసాలు.

టపా గురించి కొత్తగా చెప్పేదెముంది. సూపర్ అంతే.

వేణూశ్రీకాంత్ said...

హ హ హ చాలా బాగుందండి.. మీ పిల్లలిద్దరికి నేను అభిమానినయిపోతున్నాను :-) మీ పాప తెలివితేటలు సింప్లీ సూపర్బ్..

పద్మవల్లి said...

<< 'అన్నింటికీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్లతోనే కంపేర్ చేసుకోకూడదమ్మా!.. ఒక్కోసారి మిగిలిన వాళ్ల తో కూడా కంపేర్ చేసుకోవాలి'>>
మా అబ్బాయి ఫిలాసఫీ కూడా అంతే! :-)))
మీ పెద్దమ్మాయి డౌట్, మీ చిన్నమ్మాయి క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్ల్స్ ఆర్ వెరీ గుడ్.

SHANKAR.S said...

కృష్ణాజీ మీ చిన్నమ్మాయి పేరు చెప్పండి. తనకి ఒక అభిమాన సంఘం స్టార్ట్ చేస్తాను. ఈ రేంజ్ తెలివితేటలూ నా చిన్నప్పుడు ఉంటేనా.....బోలెడు దెబ్బలు తప్పేవి.

సుజాత వేల్పూరి said...

అబ్బ, మా ఇంట్లో హై డ్రామాని అద్దంలో చూస్తున్నట్టే ఉందండీ బాబూ! అది బోల్డు లాజిక్కులు మాట్లాడి, నా సహనం చచ్చే లోపు పది మంది పిల్లలు అచ్చు మీ ఇంట్లో లాగే "ఆంటీ, విల్ల్ యౌ సెండ్ (కెన్ ఊ కాదు) సంకీర్తన టు ప్లే?" అని ! ఎంతకీ కదలరు.

రాదు వెళ్ళండి...అని చెప్తే దీని మనోభావాలు గాయపడతాయి. పంపిస్తే నా మనోభావాల సంగతేంటి మరి?

హోమ్ వర్క్ స్కూల్లోనే చేసేసి వస్తుంది. మా ఇద్దరి ఇంటరాక్షన్ క్లాసులన్నీ జనరల్ సమస్యలు, సమాజం గురించే! అందువల్ల ఎక్కువ చర్చలూ, వాదనలూ, విభేదాలూ! నేను ఎనిమిదేళ్ళ పిల్లతోనే మాట్లాడుతున్నానా అని డౌటొచ్చి గిచ్చుకున్న సందేహాలొచ్చిన సమయాలు అనేకం!

కృష్ణప్రియ said...

@ చాణక్య,
థాంక్స్!

@ DG గారు,

హిందీ లో 8/8 రాకపోతే..ఎంత అప్రతిష్ట? నలుగురిలో నా పరువేం కావాలి? తలెలా ఎత్తుకు తిరగాలి? : Just kidding.
కాస్త ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తే చాలు. పెద్దయ్యాక ఏం చేస్తారో అప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. మరీ రెండు మార్కులొస్తే కష్టమని .. అంతే!

అయితే హిందీ కి మీ దగ్గర ట్యూషన్ కి పంపించాల్సిందే. మాట్లాడటం ఎవరికీ కావాలి? :) హిందీ లో ఎలాగూ లేవు కనీసం సోషల్ చెప్దామనుకున్నాను
చూసారు గా నా ప్లానింగ్/ఎక్జేక్యూషన్ :)

@ కొత్త పాళీ గారు,

బాగుంది. వాళ్లు తప్పులు చేస్తే నాకా డిక్టేషన్! అదీ పది సార్లు.. :) థాంక్స్

కృష్ణప్రియ said...

@ లత గారు,

firstly.. మీ బ్లాగ్ లో నేను గత ౩ టపాలకి కామెంట్లు రాయాలని చూసి రాయలేక పోయా. ఎన్ని సార్లు కామెంట్ రాసి పోస్ట్ అని నొక్కినా లాగిన్ ప్రాంప్ట్ కి తీసుకెళ్లుతోంది.
సమస్య ఏంటో. సెపరేట్ పాప్ అప్ కామెంట్ బాక్స్ ఉంటే ఈ సమస్య ఉండదని అనిపిస్తోంది.

@ శ్రీ,
అదే.. అక్కర్లేని తెలివి తేటలు.

@ ఆత్రేయ గారు,
LOL. తప్పకుండా.

కృష్ణప్రియ said...

@ ఇందు,
హ్మ్మ్.. అవును :) వాళ్లు ఎంతైనా గట్టి వాళ్లు. ఎంతకైనా తెగించగలరు. ఎలాగూ చదువు సాగనివ్వరు. పంపించటమే బెటర్.

@ మురళి గారు,

థాంక్స్!

@ బులుసు గారు,

మూడున్నర దరహాసాలు మీకు. నిజమేనండీ.. వాళ్ల లెవెల్ కి ఎప్పటికి ఎదుగు తామో ఏమో!

కృష్ణప్రియ said...

@ వేణూ శ్రీకాంత్,
:) ఈ కాలం పిల్లలు అందరూ అంతే నండీ.. నీను బ్లాగ్ లో రికార్డ్ చేస్తున్నాను. అందరి ఇంట్లో ఇదే పరిస్థితి.

@ పద్మవల్లి గారు,
:) థాంక్సండీ! పిల్లలు .. ఈకాలం వాళ్లు అంతా ఇంతే!

@ SHANKAR.S గారు,

ఈకాలం పిల్లలు అందరూ ఇంతే కదండీ. :) దేనికీ భయపడరు. అన్నింటికీ లాజిక్ తీస్తారు.
మేమూ చిన్నప్పుడు ఏదో చెప్పినది వినటమే కానీ.. ఎదురు సమాధానాలు చెప్పటం, ఇంత సేపు వాదించటం లేకపోవటం తో..

లత said...

కొన్ని కామెంట్స్ రావడంతో అసలు ప్రాబ్లం ఉన్నట్టు తెలియలేదండి
మీరు చెప్పినట్టు కామెంట్ బాక్స్ మార్చాను,
థాంక్యూ క్రిష్ణ గారు

జయ said...

పిల్లల్ని చదివించటమే లోకంలో చాలా పెద్ద కష్టమండీ బాబూ....
'Aunteeeee.. Can she come out to play?':)))))))))

Kathi Mahesh Kumar said...

:) :) 1/2

మహీధర రెడ్డి said...

యధా క్రిష్ణ ప్రియ తధా క్రిష్ణప్రియ పిల్లలు....మీరు కూడా మీ చిన్నతనంలో మీ అమ్మా నాన్నలని ఆ కాలానికి అనుగుణమైన ప్రశ్నలు అడిగే వుంటారు(నేను అడగలేదు అని అనొద్దండి ..బహుశా మీరు మర్చిపొయ్యుంటారు )
..అందుకే ఇప్పుడు మీకా ప్రశ్నల పరంపర ....(సరదా కి అన్నాను)...మీ పిల్ల ల సందేహలు నివ్రుత్తి చెయ్యాలంటే మీరు కూడా ఏదైనా ట్యూషన్ కి వెళ్ళాలేమో !!!! ఆలోచించండి ...అలవాటు ప్రకారం మీ టపా చాల బావుందండి. మీ తదుపరి టపాలలో సందేహాలతో పాటుగా సమాధానాలు కూడా వ్రాస్తే మా లాంటి వాళ్ళకి భవిష్యత్తు లో ప్రామాణికంగా ఉంటుంది మరి .

హరే కృష్ణ said...

>>>అన్నింటికీ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్లతోనే కంపేర్ చేసుకోకూడదమ్మా!.. ఒక్కోసారి మిగిలిన వాళ్ల తో కూడా కంపేర్ చేసుకోవాలి

:D :D

తృష్ణ said...

nice..:)

Sravya V said...

అదేంటండి మీ చిన్న అమ్మాయి తో మాట్లాడితే అలా చెబుతుంది ,
"ఈ తెలివితేటలూ అనీ వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మాయి చిన్నప్పుడు చేసిన పనులు గురించి చెబుతుంటే విని నేర్చుకున్నవి అని" :)))))

Anonymous said...

I can really identify with this situation, in both perspectives :).
రెణ్ణెల్ల క్రితం, సరిగ్గా టర్మ్ సెలవలు అయిపోయి స్కూలు తెరిచే సమయం, రాత్రి ఎనిమిదింటికి మా చిన్నది (ఎనిమిదో తరగతి) బెడ్ రూములో పుస్తకం చదువుకుంటున్న నా దగ్గరకొచ్చి,
"అమ్మా !I need to talk to you!" నా గుండె రెండడుగులు జారిపోయింది. సరే, వచ్చి ఇలా కూర్చొని చెప్పు, అన్నా.
"నో! నో! the lights have to be turned off. I feel ashamed of telling this to you." అంది. నా గుండెలు ఏకంగా పాతాళానికే జారిపోయాయి. ఇష్ట దైవానికి గబ గబా ప్రార్థన చెప్పుకున్నాను. సరే లైట్లన్నీ తీసేసీ , చీకట్లో పక్కన పడుకోబెట్టుకుని లాలనగా అడిగాను, సంగతేంటని.
మెల్లిగా నానుస్తూ చెప్పింది,
"I think I might get a C in Social Studies!" అని.
ఎంత భయపేట్టావే రాక్షసీ అని ముందు తిట్టి తర్వాత ఓదార్చాను. మా పెద్దమ్మాయి ఇప్పటికీ గులుగుతోంది, "that was a clever trick అమ్మా, to get away with a C!" అంటూ.

శారద

కొత్తావకాయ said...

'నీళ్లల్లో ఇండియన్ ఓషన్ కీ, అరేబియన్ సీ కీ మధ్య లైన్ ఎలా గీస్తారు? బార్డర్ ఎలా తెలుస్తుంది?'

సమాధానం చెప్పండి ముందు. మిగిలినవి ఆ తరువాత. మా అబ్బాయి నన్ను అడిగేసేలోపు మీ దగ్గర సమాధానం తెలుసుకొని ఉండాలి కదా నేను.

పరీక్షలో లాస్ట్ రాకూడదు కానీ, మీ టపా కి అందరూ వచ్చేసాక వస్తే ఓ ఉపయోగం ఉందండోయ్. శారద గారు రాసిన వ్యాఖ్య చదివి మీ టపా కి నవ్వినంతా నవ్వుకున్నాను నేను. టపా అసలు కి కామెంటు కొసరన్నమాట.

నేస్తం said...

కృష్ణ ప్రియగారు ఇంచుమించు అందరి ఇంట్లో ఉన్న గోలే అనుకుంటా.. అసలు రోజూ మా ఇంట్లో ( ఈ రోజు కూడా)ఇదే తతంగం ... మా పాపతో గోలలేదుకాని మా వాడితో 10 నిమిషాల హోమ్వర్క కి నాలుగు గంటలు తిరగాల్సి వస్తుంది ... అప్పుడే ఆకలి వేస్తుంది..అప్పుడే బాత్రూం వస్తుంది ... ఇంతలో ఫ్రెండ్స్ ఆంటీ ప్లీజ్ అని తలుపులు దభ దభ బాదేస్తారు ..ఆఖరికి కష్టపడి కూర్చోపెడితే ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు..చాలా బాగా రాసారు

sunita said...

హహహ!మరేమనుకున్నారు? పిల్లలా? మజాకానా?హమ్మయ్య! నాకు ఇంకా ఒక్కతే ఉంది ఈ హింస పెట్టడానికి. ఒకామె ఈ స్టేజి దాటేసింది:)

thrill said...

krishna priya garuu ,

mee/maa bujji/chinnu (ade mee chinna ammai...maa bujji kodal anukodni.nenu bujji/chinnu fan and supporterni)... papam edo valla hindi medam kutraki balai poyo ... leka ...mee training bagalekano (*1).. edo anivarya karanala valla... 2/8 vachinanta matrana .. ooooooooooo pedda radhantram chesestunnare ..

hindi is a language not a knowledge ..so enni markulochina not an issue ... asalu telivi paramga polchukunte .. chinnu telivi .. evariki undandi ..

A.meeru office lo bisi ga unna time chusi meeku cheppindi, appudaite meeru ventane peddaga tittaleru and meeru intiki ochelopu . mental ga prepare ai ..kastha cool aipotarani .

B.'అదే మాట మీదుండు!.. మాట మార్చకు. నేనేం కాపీ ఎప్పుడూ చేయను.జీరో కన్నా ఎక్కువే వచ్చాయి కదా..'.. idokkati chalandi ... nijaythi amayakatvam ,telivi ... anni kalagalipina chinnuni pallettu mata anakunda undedaniki.

C.10000000 mandi lo okkarini aina adagandi ...edo .. modduga batti kottadame kani ..'నీళ్లల్లో ఇండియన్ ఓషన్ కీ, అరేబియన్ సీ కీ మధ్య లైన్ ఎలా గీస్తారు? బార్డర్ ఎలా తెలుస్తుంది?'...ani .. doubt vastunda ... that is chinnu.

D.*1 : chinnu globe temmannappudu .. meeru kaneesam laptop lo google earth open cheyyaka povadam ...
chinnu ocean borders doubt ki samadhanam chepppaleka edo mabhyapetti samadhanam data veyadam ( samadhanam aa socialogy book rasina vadiki kuda telisundadu )
taditara vishayalu mee training lo lopalu ettichuputunnai... hindhi lo kuda mee training ila ne undi untundi anduke maa chinnu ki marks tagginai .. annte kani ...chinnulo ee matram tappu ledu.

so ila cheppukuntuu pote ..mee trainig lopalu chala unnai , alane chinnu telivi mundu evaru paniki raru ..


TAPPULANNI MEE TRAINING LO PETTUKONI .. CHINNUNI BLAME CHEYYALANI CHUSTE .. KABHADARR..VOPPUKUNE PRASAKTHE LEDU. INKOSARI ILA JARIGITE CHINNU & GANG INCLUDING ME RASTHA ROKHULU RAILROHOLU. VANTAVARPU , PENDOWN (HOME WORK CHEYYAKUNDA) ILANTI KARYA KRAMALU CHEPADATAM ANI HECHARISTUNNAM .

FINAL GA MEE TELIVIKI ANDANI ,CHINNU TELIVI :
of course chinnu mee nunchi tappinchukovadaniki meeru office nunchi vachelopu vesina master plan success avadam tho elago tappinchukundi aaputaki lekunte papam inkenni kashtalu pettevaro .

( master plan : valla frnds okkokkariga bell, entaki meeru longaka poye sariki .. andharnni okkasariga rangam loki dimpadam )


itlu
RAMULANNA
(chinnu fan club president)
(chinnu/chinna pillala hakkula porata yodhudu )

కృష్ణప్రియ said...

@ సుజాత గారు,
:) మనోభావాలు గాయపడే మాట నిజమే !
మీ అమ్మాయితో జరిగే చర్చలు ఎలాంటివో తెలుసుకోవాలని క్యూరియస్ గా ఉంది. ఎప్పుడో ఒకసారి మీరు రాయచ్చు కదా?
@ జయ గారు, మహేశ్ గారు,
:) థాంక్స్.

@ మహీధర్ గారు,
ధన్యవాదాలు, అడిగే ఉంటాము .. కానీ ఆ కాలం పరిజ్ఞానం, పరిధీ, ఎక్స్పో జర్ వేరు. ఇంటర్ నెట్ జనరేషన్ కదా.. కాస్త స్పీడు ఎక్కువ.
సమాధానాలు అన్నీ నాదగ్గర ఉంటే టపా రాస్తానా ఏంటి :) Just kidding. ఈ కాలం పిల్లలంతా ఇంతే. ఏదీ ఫేస్ వాల్యూ మీద తీసుకోరు. ప్రతీదీ ప్రశ్నిస్తారు. వాదిస్తారు. చాలా సార్లు చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టు అనిపించదు.
మా చిన్నప్పుడు తక్కువ మార్కులు వస్తే.. ప్రోగ్రెస్ కార్డులు బయటకి విసిరేయటం.. బతిమలాడి సంతకం చేయించుకోవటం.. మాత్రమే గుర్తు. ఇన్ని రకాలు గా మాట్లాడే అవకాశం ఉండేది కాదనుకుంటున్నా

కృష్ణప్రియ said...

@ హరేకృష్ణ, తృష్ణ గారు,
:))

@ శ్రావ్య ,
నేను అసలు 'కృష్ణ మంచి బాలిక' అన్నట్టే ఉండేదాన్ని. దాని మాటలు నమ్మద్దు సరేనా? :)
@ శారద గారు,
LOL!! మీ పెద్దమ్మాయి చెప్పింది నిజం:))

కృష్ణప్రియ said...

@ కొత్తావకాయ,
:-( నన్నిరికించకండి!! నేనే పాపమూ ఎరగను. మీ అబ్బాయి ఈ వయసు కొచ్చేసరికి ఇంకా పెద్ద ప్రశ్నలు అడుగుతాడు. ఏడాది ఏడాదికీ.. పదునెక్కి పోతున్నట్టున్నాయి వీళ్ల బుర్రలు.
ఇక పోతే..
******** 'నీళ్లల్లో ఇండియన్ ఓషన్ కీ, అరేబియన్ సీ కీ మధ్య లైన్ ఎలా గీస్తారు? బార్డర్ ఎలా తెలుస్తుంది?'

.వాటర్ కలర్స్ వాడి గీయచ్చా? :)
@ నేస్తం,
:)) థాంక్స్!
@ సునీత గారు,
:) అవునా? ఒకళ్లు చాలు లెండి నాలాగే అన్నమాట అయితే..

కృష్ణప్రియ said...

@ థ్రిల్,
:) నిజమే తప్పులన్నీ నా ట్రైనింగ్ లోనే ఉన్నట్టున్నాయి. Thanks for the comment!

కొత్తావకాయ said...

హ్హహ్హహా.. కృష్ణప్రియ అనిపించారు. మరి మల్లి వేస్తే ఉల్లి వస్తుందా? ఈ తానులో ముక్కేగా మీ చిన్న టపాకాయ్. భలే!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;