నిరోష్ఠ్య బ్లాగాయణమా? అంటే?
నేపధ్యం....
ఓష్ఠ్యాలంటే పెదవులు కలిపితే కానీ ఉచ్చరించలేని అక్షరాలు. 'ప, ఫ, బ,భ,మ ' అక్షరాలని మనం పెదవులని కలపకుండా పలకలేము. మా నాన్నగారు నిరోష్ఠ్య రామాయణాన్ని గురించి చెప్పినప్పుడు.. ఆశ్చర్యపోయాను. మరింగంటి అప్పల దేశికుల వారు కుతుబ్ షాహీ ల కాలం లో (కనీసం 400 ఏళ్ల క్రితం అప్పటి మునగాల పరగణా కోదాడ వద్ద నరసింహాపురం వాస్తవ్యులు ) రాసారట ఈ గ్రంథాన్ని. మొత్తం గా ఒక్క ఓష్ఠ్యమూ వాడకుండా రాసిన గ్రంథ రాజమది. అసలది ఎలా సాధ్యం? 'రామ' శబ్దం లోనే ఓష్ఠ్యముంది.ఆయన్ని అంటి పెట్టుకుని తిరిగిన లక్ష్మణుని పేరు లోనూ..'మ' వాడకం ఉంది. సింహాసనం మీద పాదుకలని పెట్టి రాజ్యపాలనా భారాన్ని మోసిన భరతుడి గురించి 'భ ' అక్షరం వాడకుండా ఎలా రాస్తారు? అని.ఇంకో ఉదంతం కూడా చెప్పారు.. ఆచార్యుల వారింట్లో ఒక పని ఆవిడ ఉండేదట. పెద్దగా చదువుకోలేదు.. కానీ వీరింట చర్చలు విని విని.. పాండిత్యం బాగానే వంట పట్టిందట. ఒక అతిథి వారింటి ముంగిట ఉదయపు వేళ వచ్చి.. 'అమ్మా.. ఆచార్యుల వారు ఉన్నారా? ఏం చేస్తున్నారు?' అని అడిగితే.. ఆవిడ ఒక్క ఓష్ట్యమూ వాడకుండా.. 'దశరథ రాజ నందన చరిత రచియిస్తున్నారూ' అని!!! ఆ పుస్తకం కాపీ దొరికితే తప్పక చదవాలని ప్రయత్నాలైతే మొదలు పెట్టాను.
ఈలోగా మొన్నీ మధ్య హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు.. సెలవల్లో కాస్త వెసులు బాటై.. నాకూ ఎలాగైనా ఒక చిన్న ప్రయత్నం చేయాలన్న పిచ్చి పట్టుకుంది. బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరము అవుతోంది గా.. నా ఈ ప్రస్థానం గురించి ఓష్ట్యం అనేది వాడకుండా మీకు వివరిద్దామని ఒక చిన్ని ఆశ...
నేనా, పండితురాలను కాను. కానీ కేవలం ఉత్సాహం తో రాస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నం లో దోషాలు ఉంటే, (తప్పక ఉంటాయి.. తెలుసు..) తప్పులు సరిదిద్దమని బ్లాగుల్లో పండితులని కోరుకుంటున్నాను. అలాగే ఎవర్నైనా తప్పుగా వర్ణించినా.. బాధించినా చెప్తే..సరి చేస్తాను..
ఇక మొదలు పెడతా .. నిరోష్ట్యబ్లాగాయణం :-)
'ఇలా రాస్తే?' అని ఒకరిద్దరి దగ్గర అనగానే.. 'తల్లీ.. నువ్వు.. నీ రాతల్లో దోషాలకి తావు లేకుండా చూడు.. అనేశారు. నేనూరుకుంటానా? నిరుత్సాహాన్ని దరి చేరనీయకుండా.. ఇదిగో..రాసేసా..
అంతర్జాల గూడుల లేదా ఊసుల గూడుల లోకాన్ని గురించి నేను కొత్తగా వివరించేది లేదనుకోండి..
నా స్నేహితురాలి అరవ గూడు చూసి.. నేను తెలుగు ఊసుల గూడు ఎందుకు కట్టుకోకూడదు అనీ.. అలాగే.. నేనూ నా తల్లినుండి నేర్చిన తెలుగు లో నేనూ నాలుగు వాక్యాలు రాసుకోవద్దూ? అనుకున్నా.
చిన్నదనాన రాసిన తర్వాత ఎక్కడా అక్కర కు రాదన్న నిర్లక్ష ధోరణి తో వెనక్కి నెట్టిన నా తల్లిని ఎదరకు తెచ్చి తుడిచి.. నానా అలంకారాలూ చేసి..నట్టింట సత్కారాలు చేసి.. ..
అసలు తెలుగు లో అంతర్జాలాన ఎట్లా రాస్తారో కాస్త శోధించి సాధించి .. నా ఆలోచనలన్నీ ఒక కొలిక్కి తెచ్చి, నా గూడులో తొలి లంకె వేసా.!!..క్రిందటేడు నాలుగవ నెల, ఇరవయ్యవ తేదీకి ఇంకా రెండున్నొక్క రోజులున్నాయనగా!
ఎవరైనా చూస్తారా? చూడగలరా? నాకు తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే.. నా కోసం తెలుగు లో నాలుగు వాక్యాలు రాయ గలుగు తున్నా.. ఒకవేళ ఎవరైనా నా రాతలని చూసినా, చదివిన వారికి నచ్చాలి! వారు తిరిగి చూడటానికి రాగలగాలి! అన్న ఆలోచన లేకుండా నాలుగైదు వ్యాసాలు రాసాను.
కొన్ని రోజుల తర్వాత చూస్తే సుజాత గారి వ్యాఖ్య!!... అసలు ఆవిడ కి నా రాతలగురించి ఎ విధం గా తెలిసిందా అని ఆశ్చర్యం తో.. ఆవిడ వివరాలున్న లంకె తెరిచి ఆవిడ గూటికి చేరి చూస్తే.. ఒక కొత్త లోకానికి చేరాను. ఎందరివో గూడులు.. రకరకాల గూడులు.. ఒక్కొక్క గూటిలో ఒక్కక్క వింత..
కొన్ని కథలవైతే.. కొన్ని వెతలవి. కొన్ని రాజకీయాలవి.. కొన్ని ఊసులు, ఇంకొన్ని వెటకారాలు, కొన్ని గేయాలు, ఇంకొన్ని చిత్ర లోక విచిత్రాలూ.. అలాగ ఎవరికి నచ్చిన రీతి న వారు హాయిగా రాస్తున్నట్టుందే అనుకుని చూస్తుంటే నాలుగు సంకలునులు లేదా అగ్రగేటర్లు ఉన్నాయని, తెలిసింది. ఓహో అనుకుని నా గూటినీ.. వాటిలో రాయించుకుని తిరిగి నేను ఇంకో వ్యాసాన్ని రాస్తే..
'నాగేస్రావు' అన్న వ్యక్తి నా గూటిని అనుసరిస్తున్నారని తెలిసింది. ఆయన నా గూటిని గుర్తించి అనుసరించిన తొలి వ్యక్తి. గుండె నా వ్యాసాలని కూడా చదివే వారున్నారా? అని ఏదో గుండె నిండినట్టు!.. ఆరోజు నిద్రా దేవి నన్ను కరుణించనంది. గాలి లోనే విహరించేలా చేసింది. అలాగ, ఒక్కొక్కరూ నా గూటికి వచ్చి వ్యాఖ్య నుంచటాన, కొత్త విషయాలు తెలిసి.. నా గూటికి కొత్త అలంకారాలూ, సోయగాలూ, అతిథుల, వ్యాఖ్యల గణాంకాలు, వివరణలు చేరాయి.
. రంగుటద్దాల కిటికీ లో నాగలోక వాసుల జీవితాలని చూసేలా చేసిన వారు, వారి గూటిలో నా గూడు గురించి రాసి..'దీన్నీ ఒక లుక్కెయ్యండి' అన్నారు.. చక్కగా రాస్తున్నావు.. ఇంకా రాయి అంటూ.. ఆశీర్వదించారు..
*************************************************
నాగిని, శ్రీ, నాగేస్రావ్, సుజాత గార్లు, అగ్రిగేటర్ల లో నేను కొత్తగా రాసిన వ్యాసాలని చూసి తొలి రచన చూసా' అన్నారు.
*************************************************
నడి వేసవి లో వడగళ్ల వాన వర్ణన చూసి తొలి సారి వెంకట గణేశ్ తను అనుకున్నవే నేనూ రాశానన్నారు.. తోచుట చూచించే సంజ్ఞ
, శ్రీదేవి గార్లు (drsd) , గూడ లలిత, 'నా గూడు!' అని రాసుకుంటున్న తెలుగు వారికి అత్యంత ఇష్టుడైన చిన్నవాడు గార్లూ, వచ్చి వ్యాఖ్యానించారు.
*************************************************
ఉద్యాన నగరి లో చందన నగర సిల్కు చీర కొనటానికి వెళ్ళిన వైనాన్ని రాస్తే కొత్తవారు ఎవరూ రాకున్నా.. కొందరు వ్యాఖ్యలనుంచారు.
*************************************************
నాకు తెలిసినావిడ వికటకవి రచించిన ఒక చక్కని కథ కి నాయిక లాంటిదని అని రాస్తే.. సుజ్జి గారు కొత్తగా వచ్చి కథ చక్కగా ఉందన్నారు.
*************************************************
శేషు,రిషి, శ్రీవిద్య వచ్చి నారాయణ రెడ్డి గారి కథ చదివి వ్యాఖ్యలనందించారు.
*************************************************
ఆయన ఫోటో కి కూడా 'మినబే' జై కొట్టారు..
*************************************************
చదువుకున్న ఆడదీ ఎంత సాధారణం గా తన సంసారాన్ని రక్షించాలని, అత్తింటి ఆరళ్ళు సహించిందో రాస్తే.. అశోక్ చౌదరీ, రవి, తియ్యని వాణి, శ్రీనివాస్ / వికటకవి, గోగినేని వినయ చక్రవర్తి, కావ్య, తొలి సారి వచ్చి వారూ అయ్యో అన్నారు.
*************************************************
రైలు లో జనాల నడత గురించి రాస్తే . శ్రావ్య, చెన్న కేశవ రెడ్డి, సాహితి దండ గారు,... , ఆంధ్రుల సినీ హాస్య చక్రవర్తి గారు, అగ్రహార కథలతో అలరించే, (వేదుల )శ్రీకృష్ణుని చెల్లీ, గూటిలో తొలిసారి వ్యాఖ్యానించారు.
*************************************************
చేతి సంచీలు ఎన్ని రకాల వస్తువుల తో నిండి ఉండటం చూసానో రాస్తే నీటి రొట్టె ఒకట్రెండ్...... కాలి గజ్జె గార్లు వచ్చి వ్యాఖ్య నుంచారు.
*************************************************
ఇక రోజూ చుట్టూ జనాలు సాధారణ రోజూ వారీ జీవితం లో ఏవిధం గా నడుచుకుంటారో రాస్తే.. ఆకాశవీధి లోంచి కిషన్ రెడ్డిగారూ, దేవుడికి నివేదన గారు, 'నాలో నేను ' గూటి రాణి, చిరుగాలి లోకాన్నుంచి ఒక తరుణీ, వచ్చి చూసి వ్యాఖ్య వదిలారు.
*************************************************
రాష్ట్ర రాజధాని నగరాన చిన్న నాటి ద్విచక్రవాహన చోదన విశేషాలు వివరిస్తే అరుణ గారు, చదువరి గారూ, వారాంతాలు రాజకీయాలు చేసే వారూ.. తొంగి చూసి వ్యాఖ్యలు చేశారు.
*************************************************
చిక్కటానికి ఆహార నియంత్రణ చేయాలని కష్టించిన వైనాన్ని వర్ణిస్తే.. డీ జీ గారు వచ్చి తొలిసారి గా వ్యాఖ్య చేసారు..
*************************************************
చిన్న అన్యాయాన్ని ఎదిరించాలన్నా 'వద్దులే.. ' అని జంకి వెనుకంజ వేసే తరం లోని నాకు తల్లిదండ్రుల వల్ల కలిగిన జ్ఞానోదయాన్ని వివరిస్తే.. కృష్ణ గీతాన్ని అందరికి అందించే ఆవిడా తొలి సారి వచ్చి వ్యాఖ్య విడిచారు.
*************************************************
చెన్నై నగరాన నా స్నేహితులు ఈశ్వరీ, శ్రీనివాసుల కథ ని రాస్తే టీ గారు, తన జీవన యానాన సంఘటనలని వివరించే వారు, అనిల్ గారు, సంతోషంగా ఉండే రెడ్డి గారు వేంచేసి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
సంతానాన్ని ఐ ఐ టీ ల్లో చదివించాలని తల్లిదండ్రులు వారిని గురి చేసే నానా రకాల హింసల గురించి రాస్తే, 'చిత్రాలు చూడ'రో అని ఒక గూడూ, ఇంకో గూటిలో తన హృదయ గాథ ని వివరించే వారు, చిన్నూ గారు, నారద వీణా గాన లోలుడు నాగ గారు, కిరణ్ గారు, శరత్ గారు, ఇంకా దేశీ కిశోర్ గారు, అవని గారు వచ్చి చర్చించారు..
*************************************************
టీవీల్లో హోర్తెత్తించే సినీ గేయాల గురించి రాస్తే రాఘవ, ఆవకాయ, ఇంకా విష్ణువు నివసించే కొండ గారు, జయగారు, గడ్డ కట్టిన నీరు వారు , తన హృదయం కథలు వివరిస్తుందనే సతీ దేవి.. వచ్చి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
రాష్ట్ర రాజధాని నగరాన ద్విచక్ర వాహన చోదనా విశేషాలు రాస్తే అరుణ గారు, చదువరి గారూ, వారాంతాలు రాజకీయాలు చేసే వారూ.. తొంగి చూసి వ్యాఖ్యలు చేశారు.
*************************************************
విదేశాల నుండి వచ్చే వారి సంచీలు సద్దుడు కథ కి కొత్తగా వచ్చి వ్యాఖ్యలు ఇచ్చారు తెరెసా గార్లు ..
*************************************************
'నిక్కీ' అన్న చిన్నారి ని తెచ్చి ఆకాశాన విహారాలు చేయించి నేలకి త్రోసిన వైనాన్ని రాస్తే .. కొత్త గా ఎవరూ రాలేదు కానీ. కొందరు వ్యాఖ్యలనుంచారు.
*************************************************
శ్రీనూ రాధల కొత్త ఇంట్లోకి వెళ్ళే కథ కి తియ్యని గురుతుల గూటి రాణీవారు తొలిసారి విచ్చేసి వ్యాఖ్య ఉంచారు.
*************************************************
సిల్కు నైటీల్లో హైందవ ఆచారాలని నిర్వర్తించే ఆడవారి గురించి రాస్తే.. కే వీ ఆర్ ఎన్ గారు, వాలు నారీకేళ చెట్టు గూటి రాణి గారు, తన చక్కని కవిత లతో అందరినీ అలరించే 'జలజాలకి అంకిత కాంత' - వారి తొలి వ్యాఖ్య ఇచ్చారు.
*************************************************
సెలవలనగానే తల్లి గారి తల్లి ఇంటికి వెళ్ళిన చిన్ననాటి విషయాలు గుర్తు చేస్తే, రాధిక, శివ, తేనె, తన చిన్నారి కూతురి ఊసులు వివరించే ఆవిడ, వచ్చి, వారూ వారి విశేషాలు అందించారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో ని కొత్త గా చేరిన వారి తత్వాన్ని వర్ణించే కథ రాస్తే..కే.వీ.ఆర్. ఎన్, గిరీశ్గార్లు తోలి సారి వచ్చి వ్యాఖ్యానించారు.
*************************************************
ఈ తెలుగోళ్ళంతా ఇంతే.. నంటూ రాసిన కథ, నా గూటికి కత్తి గారినీ, కీర్తన గారినీ, శారద గారినీ, వెన్నెల రాజ్యాన్నీ, వాయువు గారినీ.. కొత్తగా చేర్చింది.
************************************************* కార్యాలయాల్లో జరిగే గోష్టుల్లో జరిగే సరదా విశేషాలని, వివరిస్తే.. సూర్య కుల తిలక రెడ్డి గారు, సూర్య కుల తిలక రాజు గారూ జంట గా వచ్చి వ్యాఖ్యానించగా.. చలం గారి ఆలోచనా స్రవంతి ని వివరించే వారూ ,దేశీ జ్ఞాన దేవత గారూ, వచ్చి చూసి వ్యాఖ్యానించారు.
*************************************************
' ఇంకా సాఫ్ట్ వేర్ ఇంజనీరేనా?' కొలువు లో ఎదుగుదల లేదా? అని చటుక్కున వచ్చి జాలిగా అడిగే వెంకీ ల వల్ల ఒక రోజంతా కాస్త చిరాకయి తిరిగి సద్దుకున్న విషయాన్ని గురించి వివరిస్తే శ్రినివాల్ గారు, స్రవంతి గారు,చింత రుచి కలిగిన ఆయన, ఉష, సునీత గార్లు, ఆర్ గారు, స్నిగ్ధ గార్లూ వచ్చి వ్యాఖ్యనుంచారు. ************************************************* ఇంట్లో ఊరికే అవతలకి విసిరేయాల్సినకూరగాయల తొక్కల తో చేసిన వంటకాలని తినే తెల్ల అధికారి సరదా కథ రాస్తే.. 'చిత్రం' వేణు గారు, తుంటరి, హరేకృష్ణ గార్లు తొలి సారి విచ్చేసి వ్యాఖ్యానించారు.
*************************************************
ఈ దేశ వాసుడైనా, తన సొంత ఊరి నుండి నిర్వాసితుడైన డోగ్రా అన్న కుర్రవాడి కథ వివరిస్తే.. సతీ సహిత శివుడు గారు, శిరీష గారు, సాయి కిరణ్ గారు, 'రాఘవ నరశార్తూల' గారు, దుర్గేశ్వర గారు, సందేశగీతాల గూటివారు, వచ్చి వ్యాఖ్యానించగా.. నాగార్జున గారయితే, కరిగి ఆయనే తన గూటిలో ఇంకో వ్యాసాన్నుంచారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో కాలనీ అధ్యక్షుని ఇల్లాలిగా నా కష్టాల సరదా కథ రాస్తే.. ఆలోచించే ఇంద్ర గారు, జ్యోతి గారు తొంగి చూసి వ్యాఖ్యానించారు.
*************************************************నా తల్లి చెల్లి వివాహాన్నీ, ఆవిడ కొడుకు వివాహాన్నీ, వర్ణిస్తూ రాసిన వ్యాసాన్ని వీక్షించి తొలిసారి వ్యాఖ్యానించిన వారిలో.. వోలేటి వారు, సిద్ధ హస్తురాలు, శ్రీనివాస్ గారు, దివ్య వాణి గారు, విరజాజి గారు, సవ్వడి గార్లూ ఉన్నారు.
*************************************************
చిన్న తనంలో , 'వయస్కులయ్యాక ఇలా ఉండాలి' అని కన్న కలలు గుర్తు చేస్తే.. తన లోకాన్ని అంతర్జాల గూడులోవెల్లడిస్తున్న వెంకట్ నీ, నేస్తాన్నీ, చిన్న కాకి కృష్ణ నీ, గంగ/తులసి/సీత వంటి ఆవిడ నీ , తెలుగు తియ్యదనాన్ని వివరించే 'క్రిష్' నీ లాక్కొచ్చి తొలి సారి వ్యాఖ్యానించేలా చేసింది.
*************************************************
వేరు వేరు దేశాల్లో నివసించి స్వదేశానికితిరిగి వచ్చిన వారు జన జీవన స్రవంతి లో కలవటాన్ని గురించి రాస్తే.. శ్రీకర్ గారు, 'తెలుగు' గారు, శ్రీ గారు, 'కొడుకు' గారు, కవిత గారు, వేణు గారు, రాఘవేంద్ర గారు, snkr గారు వచ్చి తొలి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
హాల్లో, చలన చిత్రాలు చూడటం లో ఉన్న హాయి ని రాస్తే.. ఇంగువ శేషు గారూ, కలల లోక రాణి వారూ, 'ఒకటి తక్కువ నాలుగు' జీ గారూ వచ్చి తొలి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
అన్నయ్య వరసాయన నవ జాత శిశువు ని దత్తు తీసుకున్న వైనాన్ని రాస్తే రాం, స్నేహిత్, చావా కిరణ్ గార్లు, అన్నయ్య వ్యక్తిగత జీవితాన్ని అంతర్జాలానికి ఈడ్చానని అనుకోగా.. అంతర్జాల తెలుగు ఊసుల గూడుల శశిరేఖ గారు, సాహితి గారు, తదితరులు వచ్చి హర్షించి, వ్యాఖ్యానించి వెళ్ళారు. కొందరు సందేహ నివృత్తి చేసుకున్నారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో సంఘ సేవ సరదా కష్టాల కథ రాస్తే.. తన గూటిలో 'ఫీలింగ్స్' రాసుకునే శ్రీశుడు గారు,.. కొడుకున్ :) గారు , శివరంజని గారు , రవి వచ్చి తొలి సారి వ్యాఖ్యలనందించారు.
*************************************************
రవ్వ తో చేసిన వంటకాల ని తినకుండా హాయిగా ఏదో ఇలాగ ఆనందిస్తుంటే.. తిరిగి ఎలాగ అవే వంటలు చేసి తినాల్సి వస్తోందో రాస్తే.. రవి, శ్రీ రాఘవ, వేణూ శ్రీకాంత్, ఆది శేషు, ఇష్టురాలు, విశ్వనాథ్, చందు లు వచ్చి తొలి సారి వ్యాఖ్య ఇచ్చారు.
*************************************************
ఒక అవ్వ చావు చూసి , తర్వాత ఆ ఇంట జరిగిన కథ గురించి రాస్తే ..లక్కరాజు రావు గారు, సుజాత గారు, శివ గారు, తొలిసారి వ్యాఖ్యానించారు.
*************************************************
'వెండి కడ్డీగెలిచారు!! వచ్చి తీసుకెళ్లండ'ని అంటే.. ఉత్సాహాన్ని తట్టుకోలేక వేసిన వేషాల సరదా కథ రాస్తే సునీల్ గారు, 'నా లోగిలి' గూటి వారు, లోకేశ్ శ్రీకాంత్, శిశిర, నీహారిక గార్లు, నవ్వితే నవ్వండనే వారు, సతీ దేవి గారు, ఆత్రేయ గారు, శేషేంద్ర శాయి గారు వచ్చి తొలిసారి వ్యాఖ్యానించి వెళ్లారు.
*************************************************
త్రిదశకానికి ఇంకో రెండు లోకోక్తులని జోడించి కూర్చి ఒక కథ గా అల్లి గూటిలో చేర్చితే.. కన్నాజీ, హంస, కన్నగాడు, గోల్కొండ నాగరాజు, రాధిక (నాని), ఆదిత్య చౌదరి, చంద్రుణ్ణి సిగ లో ధరించిన వారు, తాతయ్య కల ని అందించే వారు, హరి కృష్ణ, ఆంజనేయ రావు గార్లు వచ్చి తొలి సారి వ్యాఖ్యానించారు.
*************************************************
విద్యార్థులు ఏడాదంతా చదివి సాధించిన జ్ఞాన స్థాయిని కొలుస్తుంటే వచ్చే వత్తిడి గురించి రాస్తే స్నేహ గారు, రెంటాల రచన గారు, శ్రీదేవి గారు కొత్తగా వ్యాఖ్యానించారు.
*************************************************
'గుండె ఊసులు ' అంటూ.. అనవసరంగా విదేశీ సాధనాల వాడకాన్ని ఎక్కువ చేసి.. చికిత్స ధర ఎక్కువయ్యేలా చేసిన వైద్యుల గురించి రాస్తే.. వజ్రం, కౌటిల్య, అంతర్జాల ఊసుల యుధిష్టిర జనకుడు, శ్రీవల్లి, రఘు, వచ్చి తొలిసారి వ్యాఖ్యానించారు.
*************************************************
దసరా సెలవల్లో రైలేక్కేదాకా జరిగిన సంఘటనల గురించిరాస్తే.. నేనూ-నువ్వూ అనే సూర్యుడు..... శశి సఖి, ఎస్. ఆర్ రావు, ఇందు గార్లు తొలిసారి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో అరువుల గొడవల గురించి రాస్తే.. లత గారు, నిశిగంధ, ఊహల తేరు వారు, కొత్తగా వ్యాఖ్య నుంచారు.
*************************************************
కార్తీక వన విహారవిందుల కొరకు నేను చేసిన టల్లోస్ తాకిడి నీ తట్టుకుని వ్యాఖ్యాస్త్రాలు సంధించారు, చంద్రిక, అను గార్లు , సంగతులు- కాకరకాయల గూటివారు, కొంటె సంగతుల గూటి వారు, సిరి గారు, ఇంకా రాజేశ్ గార్లు.
*************************************************
చదువు ఒత్తిడి తో కొట్లాటలు ఎక్కువయిన నా కూతుళ్లని 'చదువుకుంటారా ? లేక...' అని నిలదీసానని రాస్తే.. శ్రీ శేషు గారు, కెలుకుడే కెలుకుడు అనేవారు, ఎన్నెల గారు, అనిల్ కృష్ణ గారు, ఆరోగ్య రహస్యాలు వివరించే గూటి వారు వచ్చి వ్యాఖ్యలని విడిచారు.
*************************************************
ఇంటికొచ్చిన అతిథి దేవుని ఆగడాలని వర్ణిస్తే.. ఎస్ శంకర్ గారు తొలిసారి వ్యాఖ్యనుంచారు.
*************************************************
సెలవల్లో తెలుగు వారి రాజధాని విహార విశేషాలు, గ్రంథ విక్రయ శాలల లో కలిసిన సాటి అంతర్జాల తెలుగు గూటి వారి గురించీ చర్చిస్తే .. తెలుగు సినీ గాన గాంధర్వుడు, కాంతి ధార గూటి వారు, తేజస్విని గారు, కిరణ్ గారు, అన్నె శశిధర్ గారు తొలి సారి రాసారు.
*************************************************
ఒక చిన్న విషయాన్ని నాన్చి నాన్చి వివరించే నా చతుర్చక వాహన చోదకుడి (డ్రైవర్) శిశు జనన కథ రాస్తే.. నల్లనయ్య, నాట్య రాణి , శేషు గార్లు వారి తొలి వ్యాఖ్యలనుంచారు.
*************************************************
'వింటే కురు వంశ కథ వినాలని.. తింటే..?' అంటూ నా కూతుళ్లకి జయ ఇతిహాస గాధ రెండు నెలలు సుదీర్ఘంగా వివరించి ఆ కథ ని వ్యాసంగా రాస్తే.. దళ శ్రీనివాసు, సంజు రాజు గారు, ఇచ్చేశ్వర రావు గారు , సతీశ్ గారు, రుత్ గారు, సత్య గారు, తేనె గారు, 'ఇద్దరు' , వ్యాఖ్యాత , ఎస్ ఎస్ గార్లు వచ్చి వ్యాఖ్యాల్లో చర్చించేలా చేసింది.
*************************************************
నడి రోడ్డున చేజారిన నా దూర వాణి ని గురించి రాస్తే
దుర్గ , తృష్ణ, విరి వంటి స్త్రీ ,యజ్ఞ గార్లు వచ్చి వ్యాఖ్యానించారు.
*************************************************
'నాకూ ఉన్నారు .. ఫాక్షనిష్ట్ స్నేహితులు ..' అని గర్విస్తూ సింగాన్ని గురించి రాస్తే.. శ్రీరాఘవ, జై తెలంగాణా, కథా సాగర్ గార్లు తొలిసారి వచ్చారు.
*************************************************
ఒకే ఆవరణ లో ఉండే ఇళ్లల్లో జనాల కథల గుత్తి లో నరకాసుర వర్ధంతి తరువాత రోజు ఉత్సవాలల్లో ఆహార వ్యవహారాల నిర్వహణ విధానాన్ని వర్ణిస్తే.. దివ్వెగారు కొత్తగావచ్చి వ్యాఖ్య నుంచారు.
*************************************************
ఇలాగ అరవై కి నాలుగు తక్కువ గూటి అనుచరులు, ఏడు తక్కువ కథ/వ్యాసాలూ.. ఇరవై నాలుగు వేలకి వెయ్యి తక్కువ అతిథులు,..
ఏడాది క్రితం.. అస్సలూ కలలో కూడా ఊహించనిది! ఈరోజు కూడా ఈ డైరీ రాసే కృష్ణ (అక్కయ్య) నేనేనా? ఈ ఆదరణ అంతా నాకేనా? నా రాతలని చూసి ఒక చిత్రాన్ని వేసినావిడ నాకిచ్చిన గౌరవానికి అచ్చెరువు గా ఉంటుంది. నేను కొత్త వ్యాసాన్ని ఇలాగ రాయగానే చదివి తరచూ వ్యాఖానించిన వారిని తలచుకుంటే గర్వంగా ఉంటుంది.
నా ఊసుల గూటిని ఆదరిస్తున్న అందరికీ ఇవే నా శత కోటి నెనర్లు ..
95 comments:
క్రిష్ణక్కయ్య .. హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ హేపీ ఫస్ట్ బర్త్ద్ డే మీ బ్లాగ్ కి :)
మీరు ఇంకా ఎన్నో ఎన్నో ఏళ్ళు బ్లాగులు ఇలాగే రాయాలి .. మేము చదవాలి :)
First Birthday na .. Kani fantastic journey meedi. Happy Blogging. U are very talented.
Happy Blogging Darling !!!
మీరు సామాన్యమైనవారు కాదండీ... " గడ్డ కట్టిన నీరు వారు " నా పేరు కెవ్వు:-)))
నేను ఎక్కువగా అభిమాంచించే అతికొద్దిమంది బ్లాగర్లలొ మీరు ఉంటారు :-)
మీ బ్లాగుకి హ్యాపీబర్త్ డే ఆదివారం చేప్తాలేండి:-))
చాలా చాలా బాగా రాశారు క్రిష్ణ గారూ
మీ గూడుకు జన్మదిన శుభాకాంక్షలు
చక్కగా రాసారు !
ఇది ఓష్ట్యాలు వాడకుండా రాసిన కామెంట్ ;)
నిగమ శర్మ అక్క ముక్కు పుడక..
ఒరిజినల్ మైసూరు సిల్కు చీర ..- pyrated DVD
నడి వేసవి లో వడగళ్ళ
ఇవి మాత్రం మీ బ్లాగులో నావి అల్ టైం ఫావరేట్ పోస్టులు !
మీరు మరిన్ని పోస్టులు ఇలాగే రాయాలి మనస్పూరి గా కోరుకుంటున్నాను !
మీరు చాలా బాగా రాస్తారండి.ఇంకా ఇలాగే చాలా బ్లాగు పుట్టినరోజులు జరుపుకోవాలి మీరు, మీ బ్లాగు :-)
కృష్ణప్రియ గారు ,
బాగారాశారండి .
నా పేరు సాహితీ దండ పెట్టారా :) బాగుంది .
మీ గూటికి హపీ బర్త్ డే అండి .
భలే రాసారండి ..చాలా ఓపికగా ..మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
చాలా చక్కగా వ్రాసారు. మీకు మీరే సాటి!
అందరి బుర్రలకి కూడా బాగానే పని పెట్టారు..ఎవరి పేరు ఎలా వ్రాసారో అని. ఇంకోసారి చదివితే గాని ఎవరెవరో అర్థం కాదు. తీరిగ్గా వస్తా మళ్ళీ.
బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు
మీ బ్లాగుకి పుట్టిన రోజు శుభాకాంక్షలండి..
చాలా చాలా బాగా రాశారు క్రిష్ణ గారూ
మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
అద్దరగొట్టేహారంతే...
మీ బ్లాగుప్రస్థానానికి శుభాకాంక్షలు.
చాలా కష్టమైనపనే...కొన్ని పదప్రయోగాలు చాలా బాగున్నాయి. ఇంత కష్టపడి రాయడంలో బ్లాగులంటే (మీ బ్లాగంటే) మీకున్న ప్రేమ, వాటిని చదివి అభిమానించి వ్యాఖ్యానించేవారిపట్ల ఉన్న ఆదరం తెలిస్తున్నాయి. అభినందనలు.
ఇలా రాయగలగడం చాలా కష్టమైన పని. చాలా బాగా రాశారు. అభినందనలు.
కృష్ణ గారూ,
బాబోయ్... నాకు కళ్ళు చెదిరిపోయాయి.. అలాంటి గ్రంథం ఉందని విని.. అలాగే మీ ప్రయత్నం చూసి కూడా! అద్భుతం అంతే! :)
మీ బ్లాగుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.. :) ఏ పోస్టయినా చదవడం మొదలుపెడితే మధ్యలో ఆపడం సాధ్యం కాని బ్లాగుల్లో మీది ముందు వరసలో ఉంటుంది..
Just Awesome కృష్ణప్రియ గారు. మీ ఓపిక చూస్తే టోపీలు తీసేయాలనిపిస్తుంది అంతే :) మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు.. మీకు అభినందనలు..
మీ డైరీ లో విజయవంతం గా 365 పేజీలు పూర్తి చేసినందుకు అభినందనలు.
ఇంకా మీరు రాయాల్సింది చాలా ఉంది. మేము చదవాల్సింది మిగిలేవుంది. మరిన్ని ఆసక్తికరమైన పోస్టులకై చూస్తూనే ఉంటాం "కృష్ణ ప్రియ డైరీ". :)
చాలా చక్కగా రాసారు..అభినందనలు..మరిన్ని పోస్టులకోసం ఎదురుచూస్తూ ...
Very nice. Tu Si Great HO Krishna ji.. :)
U r post on Kashmiri is something I remember even now.
All the best.
వామ్మో, మీరు సామాన్యులు కాదు...మెగాబ్లాగరని మరోసారి నిరూపించుకున్నారు. అసలు ఇలాంటి అవిడియాలు ఎలా వస్తాయి మీకు! కిటుకులు చెప్పొచ్చుగా మా అందరికీ :)
"అంతర్జాల తెలుగు ఊసుల గూడుల శశిరేఖ గారు"....ఇది నేనే కదా.....ఏమి పేరు పెట్టారండీ, జోహార్లు!
మొత్తం టపాలో ఓష్ట్యా లు ఉంటాయేమో, మీరెక్కడైనా దొరుకుతారేమో అని దుర్భిణీ వేసి వెతికాను, ఊహూ మీరు అసాధ్యులు సుమండీ! :) కాకపోతే 'వివరించేది' లో 'రిం' అన్న చోట పెదాలు కలుస్తాయి. కలవకుండా కూడా పలకొచ్చులెండి, కాబట్టి వాకే. :D
నిర్వోష్ట్య రామాయణం గురించి నేనెప్పుడూ వినలేదు, మంచి విషయం తెలియజేసారు, ధన్యవాదములు. శ్రమకోర్చి ఇంత మంచి టపా కూడా రాసారు,అందుకోండి వీరతాళ్ళు.
మీ బ్లాగు పాపయికి పుట్టినరోజు జేజేలు.
>> కాకపోతే 'వివరించేది' లో 'రిం' అన్న చోట పెదాలు కలుస్తాయి.
Before commenting on the post I just want to give my thought on this one..
పదానికి చివర రానంత వరకూ, 'అం' అనే శబ్దం నిర్వోష్ట్యం గానే చెలామణి అవుతుంది. ఏదైనా పదానికి చివరలో వస్తే మాత్రం ఓష్ట్యమవుతుంది.
ఇంకొక్క విషయం, పైన మహేష్ గారు చాలా మంచి పాయింట్ రాశారు. I agree with him on this one..
>>ఇంత కష్టపడి రాయడంలో బ్లాగులంటే (మీ బ్లాగంటే) మీకున్న ప్రేమ, వాటిని చదివి అభిమానించి వ్యాఖ్యానించేవారిపట్ల ఉన్న ఆదరం తెలిస్తున్నాయి.
"మినబె" అనే పేరుని రాసినప్పుడు నిర్వోష్ట్యం దెబ్బతింటుందని తెలిసినా మీరు ఆ పాఠకుడి పేరుని ప్రచురించడానికే నిర్ణయించుకున్నారు. మీ ప్రయోగం కన్నా మీకు ఇతరుల మీద ఆదరాభిమానాలు ఎక్కువ అనే విషయం స్పష్టం.
I appreciate and highly value your choice on this one :)
మీకు మీరే సాటి.మరొకరు లేరు. ఇప్పటికీ సుమారు ఒక డజను బ్లాగు ల్లో వార్షికోత్సవాలు చదివాను. ఇంత విభిన్నంగా, వినూత్నంగా ఎవరూ వ్రాయలేదు. మంచు గారు తన బజ్ లో "వామ్మో ఈవిడ సామాన్యురాలు కాదు" అన్న శీర్షిక తో మీ టపా గురించి వ్రాసారు. ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను.
17 వ తారీఖు పుట్టినరోజు కి రెండు రోజుల ముందు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇల్లాంటివి ఎన్నో, మరెన్నో జరుపుకోవాలని, ఇల్లాగే మమ్మల్నందరిని అలరిస్తూ, నవ్విస్తూ ఇంకేన్నో మంచిటపాలు వ్రాయాలని కోరు కుంటున్నాను.
పాహిమామ్ కృష్ణాజీ పాహిమామ్....
మీ ఈ పోస్టు వల్ల భాషాపరమైన, సాహితిపరమైన విషయాలు తెలిసినయ్... ఒకే దెబ్బకు రెండు పిట్టలు :) అందుకు థాంక్సులు..
ఇక కొత్త నామకరణాలు సూపరు...వారు ఎవరు అనేది తీరిగ్గా డీకోడింగ్ చేసుకుంటాను.
బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు
and very glad to know that he's back :) :)
బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరొచ్చి ఏడాదేనా ఐంది? రెండుమూడేళ్లు అనుకుంటున్నాను..
Keep going...
కొన్ని రోజుల ముందు వేరొక బ్లాగులో చెప్పాను
>>బ్లాగు లోకపు ఆడ స్త్రీ లేడీస్ అందరు ఇలా వరస పెట్టి షాకుల మీద షాకులిస్తున్నారేంటో.... :-? <<
ఈ వరుసలో తరువాత ఎవరు ?
బాగుందండీ మీ బ్లాగాయణం, దాని సింహావలోకనమూ! విభిన్నంగా రాసినందుకు అభినందనలు.
ఇక ‘తప్పులు సరిదిద్దమని బ్లాగుల్లో పండితులని కోరుకుంటున్నాను’ అన్నారు. పొరపాటును చెప్పటానికి పండితులే అవసరం లేదు కదా? కాబట్టి చెప్తున్నా.
నిర్ + ఓష్ఠ్య = నిరోష్ఠ్య అవుతుంది; ‘నిర్వోష్ట్య’ కాదు! కాబట్టి నిరోష్ఠ్య రామాయణం/ బ్లాగాయణం అనాలి!
యాక్షన్ హీరో చిరంజీవి రుద్రవీణ సినేమా చేసి క్లాస్ ప్రజల అభిమానన్ని చూరగొన్నట్లు, బ్లాగుల్లో రాసే వార్షికోత్సవ టపాలన్నిటికన్న భిన్నంగా ఈ టపా రాయటమే కాక, మీకు ఉన్న ఇమేజ్ కి భిన్నంగా నూతన శైలిలో రాసి మళ్ళీ మరొక మారు "లేడి మెగా రైటర్" అని నిరూపించుకొన్నారు. Congratulations.
బాగుంది మీ రివ్యూ .. :)
@ కావ్య,
48 సార్లు 'హాపీ' అన్నావా? ఇంకో నాలుగైదు సార్లు అంటే ఏంపోయింది? థాంక్స్..
చాలా థాంక్స్ సుజాత గారూ..
నీహారిక గారూ థాంక్స్!
మంచు గారూ, థాంక్స్! ఆదివారం చూస్తాను. మీరు హాపీ బర్త్ డే చెప్తారా లేదా అని..
లతగారూ, థాంక్స్ థాంక్స్!
శ్రావ్యా, బాగుంది. మీ కామెంట్ ఆల్ మోస్ట్ నా ప్రతి పోస్ట్ కీ ఉంటుంది.. మీ సపోర్ట్ నాకు బలం :) నా ఫేవరేట్ టపా అయితే 'నడి వేసవి లో వడగళ్ళ వాన '
స్నేహ గారూ.. ధన్యవాదాలు.
మాల గారూ,
మీకు నా ధన్యవాదాలు.
వరూధిని గారూ,
ఏదో అలా రాసేసా. ఆయా టపాలకెళ్తే .. అర్థమయిపోతుంది. ఎవరు ఎవరో అన్నది.
కేశవ స్వామి గారూ, నెవర్లు!
చెప్పాలంటే గారు,.. థాంక్స్ థాంక్స్!
శ్రీనివాస్ గారు.. :) సూపర్ కామెంట్.. థాంక్స్
మహేశ్ కుమార్ గారు, ధన్యవాదాలు!
శిశిర గారు, చాలా రోజులకి ఇటు తొంగి చూశారు. ధన్యవాదాలు!
మధురవాణి గారు, ధన్యవాదాలు.. మీరే మంచి రచయిత్రి .. నా అదృష్టం.. మీ నుంచి ఈ కామెంట్ రావటం ..
వేణూ శ్రీకాంత్ గారు,
థాంక్స్ థాంక్స్.. మీరూ చాలా కాలం తర్వాత వచ్చినట్టున్నారు..
శంకర్ గారు, మీ స్పూథిదాయకమైన కామెంట్ కి నెనర్లు!
నైమిష్ గారు,. నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్..
మైత్రేయి గారు, థాంక్స్ థాంక్స్! ఆ పోస్ట్ కి సీక్వెల్ రాస్తా త్వరలో..
సౌమ్యా.. :) థాంక్స్ .. మీరే.. మీరు కాక ఎవరున్నారు శశిరేఖలు ఇక్కడ? కొంపదీసి SVR లు మీ వేషం లో తిరగట్లేదు గా బ్లాగుల్లో .. ? On serious note,.. detailed గా రాస్తాను.. మళ్ళీ ఓష్ఠ్యాల రూల్స్ గురించి.
WP గారు,
థాంక్స్.. మినబె లో నాకు ఏ అర్థమూ తోచలేదు. పోనీ ఆయన/ఆవిడ ప్రొఫైల్ కెళ్ళి చూస్తే .. అది లేదు. ఇంక విధిలేక అలాగే వదిలేసా..
బులుసు సుబ్రమణ్యం గారూ.. :) మీకు నా నమస్కారాలు. మీ ఇంటికి వస్తే మమ్మల్ని మీ కుటుంబమంతా ఎంత ఆదరం గా చూశారో.. తలచుకుంటే.. నాకు ఎంతో ఆనందం గా ఉంటుంది. అలాగే .. మీ అమ్మాయి కి హాస్యం లో మీ పోలికే.. మీ కామెంట్ కి థాంక్స్!
నాగార్జున గారూ, థాంక్స్!! చాలా సంతోషం..
జ్యోతి గారు, ధన్యవాదాలు.. అవునండీ.. ఆదివారానికి ఏడాది.
వేణు గారూ,
చాలా సంతోషం. మీరు తెలియచేసినట్టు గా కరెక్ట్ చేసాను. చాలా చాలా థాంక్స్!
శ్రీకర్ గారూ, :)) ధన్యవాదాలు! క్లాస్/మాస్ :) మీ ఆదరాభిమానాలకి థాంక్స్!
Snkr గారూ, :) ఠాంక్స్
oops! I'm a late comer again!
బ్లాగు పుట్టినరోజని ఎంత గడుసుగా చెప్పారూ!అందర్నీ పేరు పేరునా కేకేసి మరీ!
హాపీ బర్త్ డే
నేను మళ్ళీ అలిగానోచ్.
నాపేరు ఎక్కడా లేదు. నేనొప్పుకోనంతే. మీ మొదటి నాలుగైదారేడుఎనిమిత్తొమ్మిది టపాల్లో నా వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేలేండి. అయిన్స్ వారికి ఆకుల్స్.
మీ పోస్ట్ టైటిల్ చూడగానే ,ఎంటబ్బ ఇది అనుకున్నాను. చాలా....చాలా... చాలా ....... బాగా రాసారు .నాకు చాలా నచ్చింది .మీరిలాంటి మంచి మంచి పోస్ట్ లు చాలా చాలా ..రాయాలని కోరుకుంటూ మీ బ్లాగ్ జన్మదిన శుభాకాంక్షలు..
కృష్ణవేణిగారూ ముందుగా అభినందనలు. ఇది వన్నియర్ వేడుకకు.
నాలుగైదు వీరతాళ్లు... ఇంత వైవిధ్యంగా సెలెబ్రేట్ చేసుకున్నందుకు.
ఇప్పుడో చిన్న సవాలు... నా పేరునో నా బ్లాగు పేరునో నిర్వోష్ఠ్యంగా అనండి చూద్దాం :)
కృష్ణప్రియ గారూ, ‘నిర్వోష్ఠ్య’ కాదండీ, ‘నిరోష్ఠ్య’! నా వ్యాఖ్యను మరోసారి జాగ్రత్తగా చూడండి.
@ బాలు: సంబోధనలో ‘కృష్ణవేణి’ అంటూ తడబడ్డారు సరే, దాంతో పాటు ‘నిర్వోష్ఠ్యం’ అని మీరు కూడా అనేసేస్తే ఎలా చెప్పండి? :-))
కృష్ణ గారు, చాలా చాలా చాలా బాగా రాసారు....
అసలు మీకిలాంటి ఐడియా ఎలా వచ్చిందండీ...మొదటి సారి చదివినప్పుడు అనుకున్నాను నా పేరు లేదెంటబ్బా...ఐనా మీ బ్లాగ్ తరచుగా కామెంటడంలేదు కదా అని అనుకున్నాను...ఇప్పుడు మళ్ళీ మీ టపా చదివా...నా పేరు కూడా ఉంది...థాంక్సండోయ్ నన్ను గుర్తుపెట్టుక్కున్నందుకు..ఈ టపా వల్ల ఒక కొత్త విషయాన్ని చెప్పారు...అందుకు మీకు బోలేడన్నీ థాంకులు...త్వరలో మీరు ఆ పుస్తకాన్ని చదివి మాకు పరిచయం చెయ్యాలి....అయ్యో అసలు విషయం చెప్పడం మరిచిపోయా..మీ బ్లాగు పాపాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు...మీరు మరిన్ని ఊసులు మాకు చెప్పాలని కోరుకుంటున్నాను...
కృష్ణప్రియగారూ పొరబాటుకు క్షంతవ్యుణ్ని. ఇప్పుడే కృష్ణవేణీతీరం బ్లాగులో విహరించి రావడంతో అదే బుర్రలో ఉండిపోయింది.
@వేణుగారూ అదేంటో కొన్ని పదాలకు ఒత్తులు ఎగస్ట్రాగా తగిలించి పలుకుతుంటే బాగుంటుంది. సరే, తప్పొప్పేసుకుంటున్నా... మీరుజెప్పినట్టే ‘నిరోష్ఠ్య’ :)
నా పేరుందా? లేదే! నేనొప్పుకొనంతే! ఎపుడో మేలోనే మొదటి వ్యాఖ్య పెట్టాను, నన్ను మర్చిపోతారా? గుర్ర్ర్ర్ర్ర్!
మీరు నన్ను మర్చిపోయినా మీ రాతలు నేను మర్చిపోనండి.
ఇలా రాస్తూనే ఉండండి.
ధన్యవాదములతో,
జేబి
బాగు౦ది. వ్యాఖ్యలకు సమాధానాలు కూడా ఇదే భాష లొ ఇవ్వాల్సి౦ది ;)
సుజాత గారు,
:) థాంక్స్..
భాస్కర్ రామరాజు గారు,
సరిగ్గా చూసి చెప్పండి.. :) నా బ్లాగ్ లో మొదటి సారి మీరు కామెంట్ ఇచ్చిన టపాలో.. మీ గురించి చెప్పాగా.. ? ఇప్పుడు మీరే చెప్పండి .. మిమ్మల్ని ఏ విధం గా సంబోధించానో?
రాధిక గారు, మీకు హ్రిదయ పూర్వక ధన్యవాదాలు!
బాలు గారు,
:) మీకు కూడా.. ఇదే క్విజ్. వెళ్ళి చూడండి.. నా బ్లాగ్ లో మీరు కామెంట్ పెట్టిన పోస్ట్ గురించి రాసేటప్పుడు మీ పేరూ రాసాను.
వేణు గారు, హ్మ్మ్.. మీరు చెప్పింది నిజమే.. కానీ.. మరి ఆ రామాయణానికి నిర్వోష్ట్య అని ఎందుకుందో.. ఆ పుస్తకం కాపీ మా మామయ్యగారి దగ్గర ఉంది. నేను ఆయన కి ఫోన్ చేసి కనుక్కుంటాను.. ఎందుకు ఆ ఎక్స్ట్రా 'య; శబ్దం వచ్చిందో..
స్నిగ్ధ గారు, చాలా థాంక్స్! నేను సాధ్యమైనంత వరకూ వ్యాఖ్యానించిన ప్రతి వారి పేరూ రాశాను. ఈ పుస్తకం గురించి నేనూ చూస్తున్నాను. దొరికితే చదవాలనే.. చదివితే తప్పక పరిచయం చేస్తాను.
బాలు గారు, :) పరవాలేదు లెండి.
జేబి - JB గారు, మిమ్మల్ని mention చేసాను.. క్లూ.. మీరు కామెంట్ ఇచ్చిన మొదటి పోస్ట్.. చూసి చెప్పండి మీరే..
మిమ్మల్ని అస్సలూ మర్చిపోలేదు. మీరే నా బ్లాగ్ కి రావటం తగ్గించారు ;)
మౌళి గారు, :) హమ్మో!! భలే వారే...
కృష్ణ గారు, మీ టపా పేరు చూడగానే చాలా ఉత్సాహమూ, ఉత్తేజమూనూ..
మొదటి కారణం, చాలా రోజుల తర్వాత రాసినందుకు..
రెండోది, నేనెప్పుడూ వినని పదం ఉన్నందుకు (పదో తరగతి వరకూ టెల్గూ మీడియమే అయినా ఈ ఓష్ట్యాల గురించి విన్న జ్ఞాపకం లేదు)..
ముచ్చటగా మూడోది, ఈసారి ఎటు నించి మొదలుపెట్టి ఇంకెటు తీసుకెళ్ళబోతున్నారో అన్న కుతూహలం..
మీ టపా పూర్తిచేశాక అసలు ఇలా ఎలా రాయగలిగారా అన్న ఆశ్చర్యం నించి తేరుకోడానికి ఓ గంటా రెండుగంటలు పెట్టేసిందండి.. మొత్తానికి చాలా చాలా బాగా రాశారండి.. కాకపోతే మీకెలాంటి కష్టాన్ని కలగనీయని నా పేరు మీద మొదటిసారి కాస్త ఉక్రోషం వచ్చింది :))
మొదటి వసంతం పూర్తి చేసుకున్న మీ బ్లాగు పాపాయికి శుభాకాంక్షలు :-)
హాపీ బర్త్ డే టు యు
కృష్ణప్రియ డైరీ
హాపీ హాపీ బర్త్ డే టు యు.
ఇలా వ్రాస్తే ఎలా పొగడాలండి? ఎంత జ్ఞానం కావాలి, క్షమించండి.
శ్రీశుడు అంటే రమేష్ ఆ అండి?
నిషిగంధ గారు,
:) మీ అభిమానానికి థాంక్స్! నిజమే.. నాకూ.. ఓష్ఠ్యాలు లేని పేరు గల వారి తల్లిదండ్రులకి నాకూ నిన్న చేతులెత్తి మొక్కాలనిపించింది.
Rao S Lakkaraju గారు, థాంక్స్! థాంక్స్!
రమేశ్ గారు,
You are right! Is is about you. మీ గురించే రాసాను.
హ హ హ సూర్య కుల తిలక రాజు >> భాస్కర్ గారు ఇది మీరే
అయ్యారే
నా కవి గుండెకాయకు స్పురించనేలేదే ఈ మెలిక.
సూర్య తిలక రాజు.
ఎవరక్కడ
ఓ నాలుగు రథములనిండా తెలుఁగు పుస్తకములు తోలుకు రండు. మరోమారు బుఱ్ఱకు పదునుపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
క్షంతవ్యుణ్ణి. మీ దొడ్డమనసును సరిగ్గా అర్థం చేస్కోలేకపొయ్యాను
శర్మాజీ..మాఫ్ కరో శర్మాజీ....వాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
మరిన్ని మాంఛి మాంఛి టపాలతో మమ్మల్ని మరింత అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...belated wishes !!
భలే రాసారండి ..చాలా ఓపికగా ..మరిన్ని మాంఛి మాంఛి టపాలతో మమ్మల్ని మరింత అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ........మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
శ్రావ్యా :) మీరు ఆయన కి ఆన్స్వర్ చెప్పేసారే?
భాస్కర్ గారూ,
:) సూర్య కుల తి(అ)లక రాజు గారు .. మీ క్షమాపణలు సహృదయం తో స్వీకరించటమైనది.
అన్నట్టు మధ్యలో శర్మగారు ఎవరు?
తృష్ణ గారు, చాలా చాలా థాంక్స్!
హహహహహ్హహహహ్హహహ్హ్హహ్హహహ్హహ్
భలే రాసారండి ..చాలా ఓపికగా ..మరిన్ని మాంఛి మాంఛి టపాలతో మమ్మల్ని మరింత అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ........మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
'చిత్రం' వేణు
హహహ్.. ఇది చదివినప్పుడు నాకే చాలా కొత్తగా అనిపించీదండీ.. మీ పోస్ట్ అదుర్స్.
మీ బ్లాగుకు పుట్టినరోజు శుభాకాంక్షలు
నిర్వోష్ఠ్య --ఈ పదం నాకు కొత్త...దీన్ని పలకడానికే కాస్త సమయం పట్టింది..:)
మొత్తం పోస్ట్ చాలా బాగుంది..:))
ఏంటి మీ బ్లాగ్ వయసు సంవత్సరమే నా.??..ఆశ్చర్యంగా ఉంది..
మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..మీకు అభినందనలు..
ma lekunna matalo-maza-ledakunna ,
pa lekunna padamulo-pasa-ledakunna ,
bha lekunaa gaani bhavamu bhagundandi ,
pha lekunna gaani pharfecttuga phalikaarandi
హుర్రే! కనిపించింది, నేనూ ఉన్నాను - క్లూ ఇచ్చినందుకు థాంక్సండి. నా పేరులో 'బ' వల్ల మార్చారని గుర్తించలేకపోయా :-(
అబ్బే! మీ బ్లాగుకి రావడం మానలేదండి. ఆఫీసులో చదివితే వ్యాఖ్యపెట్టను. ఇంట్లో సమయం చిక్కట్లేదు. మీ 'గణాంకాల్లో' బోస్టను నుండి హిట్ ఉంటే అది నాదేనండి :-)
ఏటి నేనే!
తెలుగు సినీ గానగంధర్వుడినే!
ఓలమ్మోలమ్మో ఈ ఆనందం తట్టుకోడం నావొల్ల కాదురా బాబోయ్! :))))))))))
@ రంగావఝ్యుల శేషాంజనేయావధాని శర్మ గారు,
ధన్యవాదాలు! మీకు నచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది.
@ వేణూరాం, :) అవును.. నాకూ సరదాగానే అనిపించింది. థాంక్స్...
ఇవాళ అసలు వార్షికోత్సవం కదా.
మీ బ్లాగుకి యాపీ యాపీ బర్తడే :)
కిరణ్ గారు,
థాంక్స్! అవును సంవత్సరమే అయింది :)
జై తెలంగాణ,
వావ్.. మీ కవిత/పద్యం బాగుంది. అయితే 'బ ' మీద మీకు అభిప్రాయం లేదా? :)
జేబి - JB గారు,
:) గుర్తించారన్నమాట! నైస్. థాంక్స్.....
బాలు గారు,
LOL..
సౌమ్య గారు,
:)థాంక్స్..
కృష్ణుడికి నచ్చిన దానివని అంటూ రాసే రాతలతో నలుగురికీ నచ్చే ఊసులాడే నెచ్చెలీ,
నాకు తెలిసినదానివని తెలియకుండానే నీ ఊసుల గూడు ఉండే చోటు గుర్తుంచుకుని వచ్చి చదివేదానిని. అనుకోని అంతరాయాల తర్వాత కూడలికి నేను తిరిగి వస్తూనే నీ ఊసులు నాకు తెలిసాయి. ఆ తర్వాత నువ్వు నాకు తిరిగి తెలిశావు. ఎంతో నచ్చి, కొంత 'అవునా?" అనుకుని తిరిగి అవునవును కదా అనుకునేలా చేసే రాతలతో కొత్తగా రాసిన వెంటనే వచ్చి చూసేలా చేసుకునేదానివి, ఆ నాడే. నా గుండెకు దగ్గరైన అంశం రాసి నా చేత లావైన వ్యాఖ్య రాయించావు. నీవేనని తెలిశాక తొలి రాత దగ్గర్నుంచీ చదువుకుంటూ వచ్చి ఎక్కడికక్కడ నీ స్నేహితురాలినని ఎలుగెత్తి అరవాలని ఉన్నా ఆగాను ఎంతో అసహనంతో. తల్లీ, నీవీలాగున చిన్నారుల కొరకై ఒక సరదా కథ రాసి ఇవ్వచ్చు కదా, అంతర్జాలంలో చిన్నారుల కోసం తెలుగులో నేను చేసే చిరు సేవకి నీ చేయి అందించవచ్చు కదా?
పైన అంతా పెదాలు కదపకుండా చదవచ్చునేమో, ప్రయత్నమైతే చేశాను నీ స్ఫూర్తితో :) Great job! కొత్త విషయం ఎంత కొత్తగా పరిచయం చేశావు! శభాష్!
కృష్ణగారు... మీ బ్లాగ్ పుట్టినరొజు శుభాకంక్షలు... మాకు ఇంకా ఆదివారం ఉందండీ...
నిజం చెప్పాలంటే అర్జెంట్ పనిమీద బయటకు వెళ్ళడం వల్ల మీకు ఆదివారం వచ్చే సమయానికి చెప్దామనుకున్నది ..మాకు ఆదివారం వెళ్ళిపొయే సమయానికి చెప్తున్నాను :-)))) కానీ మర్చిపొలేదండొయ్...
లలితా :) బాగుంది బాగుంది... గుడ్ జాబ్.
మంచు :) పోన్లెండి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. థాంక్స్! ఇలాగ గుర్తుపెట్టుకుని రాసినందుకు ఇంకా నాదగ్గరున్న నాలుగైదు patentable రేసిపీజ్ మీకు ఇస్తా లెండి..
క్రిష్ణప్రియ గారూ.........ముందుగా సారీ! ఈమధ్య బ్లాగుల వైపు రావట్లేదండీ....కారణం మీకూ తెలుసుగా!! అందువలన మీకు లేటుగా చెబుతున్నా! ముందు మీ టైటిల్ అర్ధం కాలేదు........మేటర్ చదివితే మీరు ఎలా ఇంత టపా మేనేజ్ చేసారా అని హాచ్చెర్యపోయేసేసా!! :) కాని భలే ఉంది. లాస్ట్ వరకు చదివి హుర్రే!! దిగ్విజయంగా ఏ దోషం లేకుండా 'నిర్వోష్ట్యబ్లాగాయణం' ముగించారు కృష్ణగారు అనుకున్నా!! :) బహుశా నా పేరు మీకు అట్టే ఇబ్బంది కలిగించలేదనుకుంటా :) కానీ ఇంత సాహసం చేసిన మీరు అసలు సూపర్ అంతే :)
ఇక మీ బ్లాగ్ విషయానికి వస్తే........ నేను ముందు నా బ్లాగ్కి మీ బ్లాగ్లాంటి పేరే పెడదామనుకున్నా....'ఇందు డైరీ' అని.కానీ ఏదో ఇలా పెట్టేసా అనుకోండీ!! ఆ తరువాత మీ బ్లాగ్ చూసి భలే అనిపించింది...అరె నా ఆలోచనే అని. మీరు రాసేవి.... సున్నితంగా.... .ఆకర్షణీయంగా..... అందంగా.... చాలా బాగుంటాయ్ :) మీరు రాసినా,రాయకపోయినా వారినికి ఒకసారి మీ బ్లాగులోకి తొంగి చూడడం నాకు అలవాటయిపోయింది :)
ఇక సుత్తి ఆపేస్తాలె....ఇప్పటికే చాలా రాసేసా ;) మీ బుజ్జి బ్లాగుకి హాప్పి హాప్పి బర్త్ డే [బిలేటెడ్]
మీ స్టైలే వేరు!
మీ బ్లాగుకి యాప్పీ బర్త్‌డే!!
ఇందు గారు,
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు! వెన్నెల సంతకం కన్నా అందమైన పేరేముంటుంది ? :) మీ పేరు ఏ ఇబ్బందీ కలిగించలేదు.. నిజమే..నేను అసలు 'వెన్నెల సంతకాన్ని రాసి అందరికీ అందించే ఇందు గారు' అని రాద్దామనుకున్నా.. కానీ.. అప్పటికే టపా ఎక్కువైంది అని కుదించా...
కొత్త పాళీ గారు,
మీరు చూడలేదేమోనని అనుకున్నా.. నేనే మిమ్మల్ని టపా చూడమని అడుగుదామనుకున్నా.. :) థాంక్స్! థాంక్స్!
కృష్ణ ప్రియ గారు భాస్కర్ గారు నాకు సోదరతుల్యులు అన్నమాట అందుకే ఇద్దరం హెల్ప్ సహాయం చేసుకుంటాము :D , ఈసారికి ఇలా కానిచ్చేయండి :)
వావ్ అప్పుడే ఏడాది అయిపోయిందా!
హృదయపూర్వక బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు :)
మరిన్ని (C) చుంబ రస్కా,టల్లోస్ (R) లాంటి మధురమైన రచనలు చేయాలని మనసారా కోరుకుంటూ
hearty congratulations!
ఏంటో...ఇందులో నేనున్నానా..
పోస్టు బాగుంది...అభినందనలు.
@ శ్రావ్య,
:)
@హరేకృష్ణ,
థాంక్స్!
@budugu,
తెలుగు వారికి అత్యంత ఇష్టుడైన చిన్నవాడు -- budugu
Brilliant..మీరు చాలా టాలెంటెడ్ :-)
అవునూ కృష్ణప్రియ గారూ, రాసే శైలి లోనే కాదు, దైనందిన జీవితం లోని బయటకి కొట్టేచ్చేట్లుగా కనపడని విషయాలని దొరకపట్టుకోవటం లోనే కాదు, ఉన్న లాండ్ స్కేప్ లో గాప్స్ ఎక్కడున్నాయా అని అత్యంత చాక్చక్యంగా పట్టుకొని, కొత్త ఐడియాలతో రావటంలోనూ మీరు చాలా టాలెంటెడ్ అని తెలుస్తోంది. ఐ వండర్...మీరు మీ టాలెంట్ ని కొంచెం వృధా చేస్తున్నారేమోనని..రైటింగ్ ఒక్కటనే కాదు, మీరు మీ కెరీర్ లోనూ, సోషల్ సర్కిల్స్ లోనూ, మీ క్రియేటివ్ బ్రెయిన్ అండ్ మీ ఇండస్ట్రీ మీకున్న ఆస్తులు కాబట్టి వాటిని బాగా ఇన్వెస్ట్ చేస్తే, మీరు చాలా పైకెదగగలరని నమ్ముతున్నాను. కావలసిందల్లా ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారే, అది. అదే కొంచెం లోపించిందేమోనని నా అనుమానం. థింక్ హార్డ్ కృష్ణప్రియ గారూ, యు ఆర్ ఎ టాలెంటెడ్ పర్సన్.
ఎనీవే, ఇది కొంచెం ఈ బ్లాగునీ, ఒక వ్యాఖ్యాతగా నా పరిధినీ దాటి చేస్తున్న వ్యాఖ్య, అందుకని ముందుగా క్షమాపణలు. ఈ రకమయిన పొగడ్తలు వినేవాళ్ళకి కూడా కొంచెం ఎంబరాసింగ్ గా ఉంటుంది కాబట్టి, మీరు ఇది పబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు.
కడు చక్కగా వుంది, చక్కలగిలిలా వుంది ఈ సరదా గూడు, keep it up
కృష్ణప్రియ గారూ !
విలక్షణమైన శైలితో విభిన్న అంశాలతో అందర్నీ అలరిస్తున్న మీ ' కృష్ణప్రియ డైరీ ' కి, మీకు ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే మీ రచనా సుగంధాలు కలకాలం వెల్లివిరియాలని కోరుకుంటూ.......
@ thedirector గారు,
చాలా బాగుంది.. నిరోష్ట్యం గా చెప్పారు :) ధన్యవాదాలు!
@ SRRao గారు,
మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషం వేసింది. చాలా చాల ధన్యవాదాలు!
@ KumarN గారు,
Brilliant అన్నారు.. :) ధన్యవాదాలు!
మీ రెండవ కామెంట్ చూశాను. మీ సహృదయత కి నా నెనర్లు. ఆలోచించ దగ్గ విషయమే..
నా వరకూ, నాకు జీవితం లో అన్నీ చూడాలనిపిస్తుంది. పదహారేళ్లు గా MNC ల్లో కారీర్, పెళ్లీ, పిల్లలూ, ఎనిమిదేళ్లు కర్నాటక సంగీతం, ఇప్పుడు గత నాలుగేళ్లగా హిందుస్తానీ సంగీతం నేర్చుకుంటూ, లోకల్ గా కాలనీ లో చిన్న పిల్లల తో పత్రిక నడిపిస్తూ , మాలీలతో పని లేకుండా తోట పని చూసుకుంటూ, ట్యూషన్ టీచర్ల ప్రమేయం లేకుండా పిల్లల చదువులు చూసుకుంటూ.. ఏడాదికి రెండు వెకేషన్లు తీసుకుంటూ బ్లాగ్ రాసుకుంటున్నాను :) దీనికి మించి ఏదైనా చేస్తానా? ఏమో? ఏదైనా చేసి చూపించాలనే ఆసక్తి పెద్దగా లేదు. ఒకవేళ చేద్దామనుకున్నా, చేయగలనా? అంటే ..ఎక్కడో కాంప్రమైజ్ అవ్వాలి గా?
నా పేరెక్కడా కనిపించలేదు :(
నా fav post కూడా "నడి వేసవి లో వడగళ్ళ వాన ..."
@ బద్రి,
టీవీల్లో హోర్తెత్తించే సినీ గేయాల గురించి రాస్తే రాఘవ, ఆవకాయ, ఇంకా విష్ణువు నివసించే కొండ గారు,********************* జయగారు, గడ్డ కట్టిన నీరు వారు , తన హృదయం కథలు వివరిస్తుందనే సతీ దేవి.. వచ్చి వ్యాఖ్యలనుంచారు.
It was the best I could do :) బదరి, బద్రి కి నిఘంటువు లో అర్థాలు వెతికితే.. రేగు, హిమాలయాల్లో ఒక కొండ అన్న అర్థాలు కనిపించాయి. బదరీ నాథుడు నారాయణుడు కాబట్టి..
యిదంతా చూసాక...నాకేమనిపించిందంటే....నేను ఇంతవరకూ మీ బ్లాగు చూడలేదనీ,ఒక్కటపా కూడా చదవలేదనీ అయినా సరే శుభాకాంక్షలు.ఆరోజుల్లో ఇలాగే చెప్పుకునేవాళ్లం అభినందనలు,శుభాకాంక్షలు అయినా ఆరోజులే వేరులేండి బ్లాగుల్లో... :)
మొదటి సారి చూసా మీ బ్లాగు. 'ఏమని పొగుడుతాం లే ఇన్ని కామెంట్ల తరువాత!' అనిపించింది. ఓ "వీరతాడు" అయినా వెయ్యకుండా వెళ్ళడానికి మనసొప్పక మళ్ళీ వెనక్కొచ్చా..
నిర్వోష్ఠ్య "వీరతాడు" :)
Very interesting. I like your blog. Sorry dont have enough time to learn to type in Telugu for one comment :)
Not related to your current post:
Recently I read Hellphone story in Vipula May edition. The beginning has lot of resemblence to your post on lost cell phone. For a moment I thought you wrote the story(did not check the writer's name before I started reading.)
Thats all. Thought of mentioning it you. Happy writing.
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి ,
హ్మం.. :) ఇంతకీ ఈ టపా అయితే చదివారన్నమాట! నా బ్లాగ్ కి స్వాగతం!
@ కొత్తావకాయ,
చాలా చాలా థాంక్స్! మీకూ స్వాగతం.. నా బ్లాగ్ కి
@ Kala,
చాలా థాంక్స్! ఇప్పుడే చూసా.. నేను స్కూటర్ మీద నుంచి పారేసుకుంటే ఈ కథ లో స్కూటర్ మీద వెళ్తూ దక్కించుకున్నారు.. మీరన్నట్టు style of writing నాలాగే ఉంది..
వేణు గారు,
మీరు ఇదివరకు నిరోష్ఠ్య అనాలి నిర్వోష్ట్య అని కాదు అని కరెక్ట్ చేశారు. నేను 'నిర్వోష్ఠ్య' గా మాత్రమే కరెక్ట్ చేశాను. మొన్నీ మధ్య ఆ పుస్తకం కాపీ చూడటం జరిగింది. మీరన్నది కరెక్టే. నేను ఆ విధం గా టైటిల్ మరియు ఇతర రిఫరెన్సులు మార్చుతున్నాను.
ధన్యవాదాలు..
Mee blog gurinchi, athidi devo bhava article gurinchi maa variki cheppi navvukunnam...taruvatha ee article gurinchi chebithe tanu Chala aascharya poyaru...maa voorilo inko 2 varallo ugadi uthsavalu....authsahikulu aina Valla andariki Telugu lo potilu....ventane tanu nuvvu raayi time choosukuni alantidi annaru...enti rasedi? Adi vinataniki simple ga undi..rayataniki kaadu babu...manaki antha telugu parignanam ledu...so inkosari meeku compliments chebudam ani comment rastunna...:)
ధన్యవాదాలు. నాకూ అంత పాండిత్యం లేదు. మా అమ్మా నాన్నలని, మా వారిని, మా చెల్లి, మరుదులని, ప్రశ్నలతో ఊదర గొట్టి, ఒక పది రోజులు కష్టపడితే తయారయింది ఈ టపా..
మీరూ ప్రయత్నించండి.. ఖచ్చితం గా ఇది ఒక మంచి అనుభవం..అని చెప్పగలను.
శ్రీరామ నవమి సందర్భంగా ఒక పోస్టు వ్రాయబోతూ, నిరోష్ఠ్య రామాయణం అని గూగిలీకరిస్తే మీ పోస్ట్ కనిపించింది. ఏడాది లేటుగా మొదటి సంవత్సరానికి, రెండువారాల ముందుగా రెండో సంవత్సరానికీ బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ పొస్టుల్లో కొన్ని చదివాను. గుర్తున్నది ’సంధ్య,రమేశ్ మరియు ద్రౌపది.’ చాలా బాగా వ్రాస్తున్నారు మీరు. అభినందనలు.
నాదగ్గర నిరోష్ఠ్య రామాయణం సాఫ్ట్ కాపీ ఉంది. మీ మెయిల్ ఐడీ కి పంపుతున్నాను.
ఈ పుస్తకం pdf ని ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
http://archive.org/details/dasaradarajanand019203mbp
నిరోష్ఠ్యరామాయణం లేక దశరధ రాజ నందన చరిత్ర లో నిరోష్ఠ్య నియమాలు వ్రాసారు 36 -38 వ పేజీలలో. చాలా ఆసక్తికరం గా వుంటుంది. ఉ కార, ఋ కారాలను కూడా ఓష్ఠ్యములుగా పరిగణించారు. అలాగే ' వందన' లాంటి పదాలు నిరోష్ఠ్యము గానూ, ' మరువం' లాంటివి ఓష్ఠ్యము గానూ చెప్పారు. అంటే పెదాలు పూర్తిగానే కాదు అసలు కలవడానికి ప్రయత్నించినా ఓష్ఠ్యము లేనన్నమాట. ఇంక ఇవికూడా తీసేస్తే మరింత కష్టమవుతుంది కదా..!!
మీ ప్రయత్నం చాలా బాగుంది. మరొక్క సారి అభినందనలతో..
రాధేశ్యాం.
అమ్మా! నిరోష్ట్యము అనే పదంతో గూగుల్ వెదకగా మీ గూడు దర్శనమిచ్చింది.చాలా సంతోషమనిపించింది.
నిరోష్ట్య రామాయణం గురించి మీరు వ్రాసినందుకు, మీకు గల సాహిత్యాభిలాషకు చాలా సంతోషం కలిగిందమ్మా.
మీకు నా అభినందనలు.
మీ వ్రాసం కూడా నిరోష్ట్యంగా సాగినందుకు మరీ సంతోషం కలిగిందమ్మా.
మీకు నా హృదయ పూర్వక అభినందనలు.
http://andhraamrutham.blogspot.com
@ రాధేశ్యాం గారు,
ముందుగా సారీ! పని వత్తిడి వల్ల మీ వ్యాఖ్య కి సమాధానం ఇవ్వలేకపోయాను..
అనేకానేక ధన్యవాదాలు! మీరిచ్చిన లంకెని చాలా మందితో పంచుకున్నాను, ప్రింట్ అవుట్ తీసి భద్రం గా దాచుకున్నాను.. నాకు చాలా చాలా సంతోషం గా ఉంది!!
@ చింతా రామకృష్ణ రావు గారు,
మీకు గత సంవత్సరం ఫోన్ చేశాను.. గుర్తుపట్టారా? ఈ పోస్ట్ చదివి మీలాంటి పెద్దలు వ్యాఖ్య ఉంచటం అంటే.. చాలా గర్వం గా అనిపిస్తుంది.
నెనర్లు..
ఈ పోస్ట్ మూడో సారి మళ్ళీ చదివాను. మీరు సామాన్యులు కాదండీ.
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.