రమ కి మా ఇంటి దగ్గర ఉన్న రెండిళ్ళ డిజైన్ లు చాలా నచ్చుతాయి. ఎప్పుడూ " ఇక్కడ ఒక ఇల్లు కొనగల్గితేనా ... " అని నిట్టూరుస్తూ ఉంటుంది. ఈ మధ్య ఆ ఇళ్ళల్లో ఒక ఓనర్ అమెరికా లో ఉంటూ వాళ్లమ్మాయికి కాలేజీ చదువులకి అవసరానికి ఇల్లమ్మేస్తున్నారని తెలిసింది. సరే బానే ఉంది అని రమ కి వెంటనే కబురు పెట్టాను.
అదీ, దాని భర్తా రెక్కలు కట్టుకు వాలిపోయారు. వెంటనే బ్రోకర్ ని కుదుర్చుకోవటం, డబ్బులు పోగుచేసుకోవటం మొదలు పెట్టేసారు. బేర సారాలు సాగుతున్నాయి. కోటీ పది లక్షలకి అడుగుతున్నారని వాళ్ళు.. ఎనభై కి ఒక్క పైసా ఎక్కువిచ్చేది లేదని వీళ్ళూ.. ఓనర్స్ మీతో మాకు పడదని వదిలేసారు.
అప్పట్నించీ మొదలైంది కథ. ఒక పక్క ఓనర్ అమెరికా ప్రయాణం దగ్గర పడుతోంది.. కోటి పది లక్షల కి తగ్గద్దని ఎగదోసిన వాళ్ళు ఒక్కళ్ళ నీ తేలేకపోయారు. దానితో వాళ్లకి కంగారు ఎక్కువయి పోయింది. ఇదేంటి.. ఇలా అయిందని. ఈ లోగా వాళ్లకి అర్థమయినది ఏంటంటే.. చుట్టుపక్కల వారు వీళ్ళ ఇల్లు ఎంత ఎక్కువ ధరకి అమ్ముడు పొతే వాళ్ళ ఇల్లూ అంతే ధర పలికే అవకాశం ఉందని వాళ్ళ ఆశ..
మొత్తానికి తొంభై లక్షలకి బేరం కుదిరింది. రమ సంతోషానికి పట్టా పగ్గాల్లేవు. ఈలోగా ఓనర్స్ కి బాధ హెచ్చింది. తొందర లో ఉండటం వాళ్ళ ఇరవై లక్షలు మోసపోయామని వాళ్ళ కినుక. ఇక పేచీలు మొదలు. ఇంటి వెనక గట్టు కట్టాను ..పది వేలు పోసి.. లయిట్లు, ఫాన్లు, geysers పెట్టించాను. ముప్ఫయి వేలకి పైగా పెట్టి అని ఒకటే విసుర్లు.
ఈ బాధ పడలేక.. పోనీ ఏంటో కొంత ఇస్తాము అనగానే.. ముక్కు పిండి పదిహేను వేలు వసూలు చేసారు.
నూట అరవై రూపాయలకి ఆటో చేసుకుని వచ్చిన రమ, అందర్నీ AC రెస్టారంట్ కి భోజనానికి తీసుకెళ్ళిన రమ, అక్షయ పాత్ర పథకానికి, ముగ్గురు పిల్లల చదువులకీ, సహాయం చేసే రమ, ఇస్త్రీ అబ్బాయి బట్టలు తగలపెట్టినా వాడి కొడుక్కి బుక్స్, బాగులు, కొని పెట్టె రమ, తొంభై లక్షలకి అమ్మి పదిహేను వేలు మళ్ళీ తీసుకుని, ఇంకా పూర్తిగా ఎదగని అరటి గెలలు కోసుకుని.. వెళ్తున్న ఓనర్స్ ని చూసి నవ్వుకున్న రమ ..
ఒక్క విషయం లో మాత్రం తట్టుకోలేక తెగ బాధపడి, యాగీ చేసి, వాళ్ళని శాప నార్థాలు పెట్టింది. దేనికను కున్నారు? నెల మధ్యలో కొనుక్కున్నాం .. నెల మొదటి హాఫ్ కరంట్ బిల్లు ఎందుకు కట్టాలి? 175 రూపాయలు పూర్తిగా కట్టటానికి వీల్లేదు.. సగం చేయాల్సిందే అని.. 80 రూపాయలు వాళ్ళు కట్టి తీరాల్సిందేనని.
ఔరా ! మానవ మెదడు ఎంత సంకీర్ణం గా ఆలోచిస్తుందో , దానిని మరింత క్లిష్టంగా మనసు మలుస్తుందో అనుకున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
ఒక్కోసారి ఇలాంటి చిన్న విషయాల దగ్గరే సగటు మనిషిగా ప్రవర్తించడం సగటు మనిషి లక్షణమేమో!అప్పుడప్పుడూ ఎవరిని వారు సెల్ఫ్ అసెస్ చేసుకుంటూ ఉండాలనుకుంటాను. అయినా సరే, ఇలాంటి వాటిని అవాయిడ్ చేయలేం! హ్యూమన్ టెండెన్సీ!
నిగమ శర్మ ముక్కు పుడక అన్న పేరు చక్కగా అమరింది. ఆ కథలో అదే చివరి చమక్కు!
ఇవాళే మీ బ్లాగు చూస్తున్నాను.బాగా రాశారు. అభినందనలు!
chaalaa santOsham.. idi nijam gaanE, ninnE jarigina sangati.
naa blog lO rOjoo, nEnu choosE, anubhavinchE vishayaalE raayaalanukunnnaanu.
mee abhinandanalu naaku enta spoorthi nicchaayO maaTallO cheppalEnu.
-Krishnapriya.
Baaga raasaru. :)
నాకు ఒక్క క్షణం టైటిలు రిలవెన్సు అర్ధం కాలేదు. వెలిగాక భలే నవ్వొచ్చింది. సెబాష్!
:-) ధన్యవాదాలు!
This is where I began following. Not bad!
Hmmm.. Nice.. అంతకు ముందర అగ్రెగేటర్ అంటే నాకు తెలియదు. ఈ టపా అప్పుడే కూడలి, మాలిక,హారం అంటూ ఎక్కడో చదివి రెజిస్టర్ అయ్యాను...
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.