Sunday, April 18, 2010

ఒరిజినల్ మైసూరు సిల్కు చీర ..- pyrated DVD

పోయిన సారి మనం ఇల్లు కట్టినప్పుడు మీ చెల్లెళ్లకి నాలుగేసి వందలకి కొన్నాం చీరలు.. ఇంటికి అణా పైసల తో సహా పెట్టాం .. కనీసం ఆడపిల్లలకి మంచి చీరలు కూడా పెట్టలేకపోయాము అన్నాను రాము తో. 'ఏంటి నా చెల్లెళ్ళ మీద ఇంత దయ అన్నట్టు గా కళ్ళెగరేసి చూసి వ్యంగ్యం ఏమీ లేదు .. నిజం గానే అంటున్నాను అని అర్థం అయ్యాక .. 'వాళ్లకి మాత్రమే ఎందుకు? మీ చెల్లి కి కూడా కొందాం ' అన్నారు రామ్.

'యా .. కొందాము. మా అమ్మకీ.. మీ అమ్మ కీ కూడా కొనాలి గా. కాస్త ఎక్కువ లో తీసుకుందాం.. అన్నాను.. ఉదారం గా మొహం పెట్టి.. రామ్ తలాడిస్తూ 'సరే .. ఎక్కడ కొందామని? ' అన్నారు. KSIC లో .. అక్కడ మైసూరు సిల్కు చీరలు గవర్నమెంట్ షాప్ కాబట్టి నాణ్యత లో తిరిగి చూసుకోవక్కరలేదనిపిస్తుంది.. అన్నాను.. ఒకింత గర్వం గా.

చలో అయితే మద్యాహ్నం వెళ్దాం. మన బ్యాంకు పని అయ్యాక చీరలు కొని వద్దాము అనుకున్నాము. బయల్దేరాక.. మరి వాళ్లకి నచ్చిన రంగులో? అన్నాను. 'అక్కడ మనకి సరిపడే రేంజ్ లో చీరలు దొరికాక ఫోన్ చేసి అడుగుదాం లే ' అన్నారు రామ్. అదీ బానే ఉంది అనుకుని.. మా అమ్మకి అయితే రామ నీలం రంగు ఇష్టం. అదే కొంటాను.. అన్నాను. మీ అమ్మ కి mustard కలర్ ఇష్టం .. మిగిలిన ముగ్గుర్నీ.. షాప్ లోంచి అడుగుతాం అని ప్రణాళిక లేసుకుని MG Road మీద నడుస్తున్నాం.

'అబ్బ ఏం ఎండా.. రోడ్ మీద మసాల మజ్జిగ అమ్ముతున్నాడు.. తాగుదాం పద.. ' అన్నారు రామ్. 'ఇంకా నయం. రోడ్ సైడ్ మజ్జిగ పైగా.. ఏ నీళ్ళు వాడాడో .నేను మాత్రం ముట్టను ' అన్నాను. తను హాయిగా మజ్జిగ తాగుతుంటే.. నేను మాత్రం KSIC షాప్ లో ముగ్గురు సిస్టర్స్ కి ఒక రేంజ్ .. తల్లులకి ఒక రేంజ్.. కొంటే మరి నాకే రేంజ్ లో తీసుకోవచ్చో .. ఒకవేళ ఎవరికైనా ఫోన్ తగలకపోతే ఏమి చేయాలో ఆలోచిస్తూ ఉన్నాను. షాప్ లోకి దూరుతూనే.. ముగ్గురు సేల్స్ గర్ల్స్ కనపడ్డారు. వాళ్ళు నా జీన్సు మీద పసుపు మారక గమనించటం చూసి..'ఛీ అసలు డ్రెస్ మార్చుకోవాల్సింది' అనుకున్నాను.

అసలే చీరలు కొనటం తక్కువ.. లక్కీ గా ఇక్కడ స్టాండర్డ్ ధరలూ, నాణ్యతా ఉంటాయి గా.. అని బోల్డ్ గా మైసూరు సిల్కు చీరలు కావాలి. రెండు నుండీ.. మూడు వేల లోపల' అన్నాను.. వాళ్ళు నా వైపుకి అదోలా చూస్తూ.. 'minimum range is 6000 ma'am' అంది ఠీవి గా . అదేంటి మొన్నీ మధ్య మైసూరు లో ఆ రేంజ్ లో కొన్నామే అన్నాను. అవి డూప్లికేటు అయ్యుంటాయి అంది. దెబ్బకి దయ్యం జడిచిందని.. లేచి.. థాంక్స్ చెప్పి.. బయట పడ్డాము. ఇంత ఖరీదు ఉంటాయి అనుకోలేదు. పోన్లే.. హాయిగా చందన, బొమ్మన ఉన్నాయి గా హైదరాబాద్ లో కొందాం లే అనుకున్నాం.

దోవలో అమ్మని వాడిది పాపం.. జామకాయలు.. కొబ్బరి బొండాలు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు, వేయించిన పల్లీలు కొన్నాము. ఆరు వేల రూపాయల చీర మీద అన్నీ చీపే అనిపిస్తుంటే..
ఏం మాయ చేసావే DVD కొన్నాము. కొనేముందు రామ్.. 'ఏ ఒరిజినల్ యా డూప్లికేట్? ' అని అడిగితె.. 'ఇదు ఒరిజినల్ ప్రింట్ సార ' అన్నాడు. మాట్లాడకుండా తీసుకుని బయటకోచ్చేసాం.

8 comments:

కొత్త పాళీ said...

good one

drsd said...

అరె! నేను ఇంకా నెక్స్ట్ టైం బెంగుళూరు వచ్చినప్పుడు KSIC కి వెళ్లి మైసూరు సిల్క్ సారీ కోనాలనుకొన్నాను.నా చిన్నపుడు మా పిన్ని కి ఉండేది మైసూరు సిల్క్ సారీ, మెత్తగా, అపుడే అనుకొన్నాను పెద్డైయాక కొనాలని!లాస్ట్ టైం బెంగుళూరు వచ్చినపుడు మైసూరు వెళ్ళాం కానీ, అక్కడ కొనాలంటే ఒరిజినల్ అవునా కదా అని డౌట్ తో కొనలేదు. మరెలా?

కృష్ణప్రియ said...

ఏముంది,.. కనీసం 7-8 వేలు చేతిలో పెట్టుకుని వెళ్ళటమే.. కింద లంకె లో చూడండి.. ధరలకి కళ్ళు తిరుగుతాయి.. కానీ, తిరుగులేని క్వాలిటీ :)

కృష్ణప్రియ said...

Sorry Link : http://www.ksicsilk.com/

lalithag said...

:)))))))

కృష్ణప్రియ said...

:))

Mauli said...

Ha Ha,

సేమ్ పి౦చ్. మైసూర్ లో ఆఫీస్ పని పై వెళ్ళి, మైసూర్ సిల్క్ చీర అమ్మకి కొనకపోవడమా అని వెళ్ళాను :)

మినిమ౦ 7,500 లొ మాత్రమే నచ్చాయి. అదీ క్రీమ్ కలర్ ,బొలెడ౦త జాగ్రత్త గా వాడాలి. కొనకు౦డా వచ్చాక అమ్మకి చెప్పి ఇ౦కొ పొరబాటు చేసా. :)

మొత్తానికి నాకూ మైసూర్ సిల్క్ అ౦దని ద్రాక్ష అయిపోయి౦ది :)

సాధారణ పౌరుడు said...

compared to mysore silk, you can buy Dharmavaram silk, its around 150-180km from bangalore. you can find very good quality silk from 1200+ from tapeborder to golder/silver jaree.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;