Thursday, August 19, 2010

ఉప్మాయణం.. ఉప్మా ప్రేమికులూ.! చదవకండి...

చిన్నప్పుడోసారి మా తమ్ముడు "అమ్మా!!! ఉప్మా అత్త వచ్చింది..."  అని అరిచాడు గట్టిగా,  మా మేనత్త వరసావిడ ఇంటికి వచ్చిందని.. మా అమ్మ వాడికి మాత్రమే అర్థమయ్యేలా ఒక కోల్డ్ లుక్క్ ఒకటి పడేసింది. కవర్ అప్ చేసి ఆవిడని లోపలకి తీసుకెళ్ళిపోయింది.. 

                  మరి నిజంగానే వాళ్ళింటికి మేమెప్పుడు ఏ పరిస్థితి లో వెళ్ళినా ఎంతమందిమి వెళ్ళినా మాకు ఉప్మాయే పెట్టేది. ఠక్కున తయారయ్యే శాకాహార టిఫిన్లలో ఆరోజుల్లో ఉప్మాకే ప్రథమ స్థానం కదా..  కాకపోతే.. ఉప్మా ఉంత చిన్న చూపు చూడబడ్డ టిఫిన్ కూడా ఉండదేమో..

మా వాళ్ళ పెళ్ళిళ్ళల్లో ఎప్పుడూ ఉప్మాయే చేసేవారు. పైగా దాంట్లోకి కాంబినేషన్ అని మా నాయనమ్మ వైపేమో బూందీ వేస్తే.. హోటళ్ళళ్ళో చట్నీలూ, కోస్తా ఆంధ్రా వైపు పెసరట్టూమాకేమో వాటిని కూడా వేస్ట్ చేస్తున్నారనిపించేది.  బోడి ఉప్మాకి మళ్ళీ కాంబినేషన్ దండగ అని.. అనుకునేవాళ్ళం. ఎప్పుడైనా ఇంట్లో మా అమ్మ ఉప్మా చేస్తే.. వెంటనే ఆ పూట టిఫిన్ మానేసి  పాలల్లో అటుకులో,.. అవీ లేకపోతే.. రాత్రి మిగిలిన చపాతీలో, అన్నమైనా తినేసి మరీ వెళ్ళిపోయేవాళ్ళం.


ఎలాగైనా అలవాటు చేసి తీరాలని మా ఇంట్లో కంకణం కట్టుకుని మరీ, మా వెనకపడ్డారు.  అల్లం, పచ్చి మిర్చి, కొబ్బరి జల్లీ, టమాటాలు, రక రకాల కూరగాయలు, , నిమ్మరసం, ఉల్లిపాయలూ, అప్పటికప్పుడు దూసిన కర్వేపాకు, లేక కొత్తిమీర, జీడిపప్పు, పల్లీలు, కొన్ని వేసి, తీసి, అన్ని పర్ముటేషన్లూ, కాంబినేషన్లూ ప్రయత్నించారు. అబ్బే!!! దేనికీ లొంగలేదు మేము.

అంత మరీ మా వెనక పడి మాకలవాటు చేయాల్సిన అవసరం ఏముంది? మహా  వీజీ గా అయిపోతుందని 2 నిమిషాల్లో చేసి పారేయవచ్చని.. అని కసి గా అనుకుని మేము అస్సలూ మా అమ్మ వేసిన ఎత్తులన్నీ చిత్తు చేసేసాం. మా అమ్మ ఇంక విధి లేక కరంటున్నా, లేకున్నా ప్రతి రోజూ, పళ్ళూ, పచ్చళ్ళూ నూరుకుని, పప్పు రుబ్బుకునేది ఏం చేస్తుంది పాపం.

ఉప్మా అంటే విరక్తి కి చాలా ముఖ్యమైన కారణం.. పెద్ద ఎత్తున చేసే ఉప్మా టేస్ట్ గుర్తుకొచ్చి.. అనుకుంటా. ఎవరైనా చనిపోయినప్పుడు చటుక్కున చేసే వంటకం కావటం వల్ల కూడా అయ్యుండవచ్చనిపిస్తుంది నాకు.


పైగా ఎక్కువ నూనె అదీ వేయకుండా చెసే 'డైట్/పొదుపు ' ఉప్మాలూ కారణం అవ్వచ్చు.. పొడిగా ఒక్కోసారి గడ్డలు గడ్డలు గా చేసిన ఉప్మా వల్ల అసలు ఆ పదార్థం అంటేనే విసుగొచ్చేసింది.. పైగా.. మాస్ స్కేల్ లో చేసే ఉప్మా లో పూర్వం అప్పుడప్పుడూ పురుగులు కూడా కనబడీ.. (సారీ.. ఈ మధ్య బానే ఉంటోంది లెండి రవ్వ)

ఇంట్లో ఎన్ని సింగినాదాలు సాగినా.. హాస్టళ్ళల్లో వారానికి రెండు సార్లు చేస్తే.. ఏం చేస్తాం??.. నెల లో మొదటి రోజుల్లో షాన్ గా వదిలేసి బయట కెళ్ళి తిన్నా.. నెల మధ్యకొచ్చేటప్పటికి చచ్చినట్టు భరించాల్సివచ్చేది.  నాకంటూ ఒక వంటిల్లంటూ ఏర్పడితే.. జీవితం లో ఉప్మా అనేది చేయనని "కృష్ణమ్మ శపథం" చేసేసాను.

జీవితం లో ఏదీ గట్టిగా వద్దు అని అనుకోకూడదట. ఇంతటి కఠోర నిర్ణయాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించి పారేయాల్సిన ఘడియ నా పెళ్ళి ముహూర్తం అవుతుననుకోలేదు. :-(  పెళ్ళయ్యాక మల్లిక్ కార్టూన్లో లాగా "నాకు నేతి గారెలంటే ఇష్టం.. మరి నీకో? " లేదా "పులిహారలో నీకు పల్లీలేస్తే ఇష్టమా? లేక జీడిపప్పా?" లాంటి విషయాలు మాట్లాడుకోలేదు గా!!!  ..బంధుమిత్రుల హడావిడి లో గమనించనే లేదు.


నేనూ, మా వారూ  అమెరికా లో ఏదో భారతీయ రెస్టారెంట్ లో బఫే తింటున్నాం. ..ఎన్నో రుచికరమైన పదార్థాలు వదిలేసి "అరే ఇక్కడ ఉప్మా ఉందే " అని ఆనందం గా ఆస్వాదిస్తూ, "అసలు ఉప్మా కన్నా రుచికరమైంది భూలోకం లో ఉంటుందా? " అని అంటే.. ముందర జోకేమో అని ఆశగా మొహం లోకి చూస్తే కాదనీ, సీరియస్ గానే అంటున్నారనీ అర్థమైంది.


మనస్సులో అగ్నిపర్వతాలు బద్దలై, లావా పెల్లుబికింది. వెయ్యి సునామీలూ, భూకంపాలూ.. తెలుగు సినిమాల్లో హీరోయిన్ కి భర్త కి ఏదో ఎఫైర్ ఉందనో, లేక టీ బీ లాంటిది ఉందనో తెలిస్తే కలిగే భావ పరమర అంతా నాకూనూ..
అమెరికా లో భారతీయ రెస్టారంట్లలో ఉప్మా కూడా బఫేల్లో పెడితే దాని వైపుక్కూడా చూసేదాన్నే కాదు.
మరి తనో?? రోజూ ఉప్మా చేసినా యేళ్ళ తరబడీ అదే పారవశ్యం తో తినగల సమర్థులు!

మాంచి వర్షం వస్తుంటే 'అబ్బ! ఏ పకోడీలో బజ్జీలో.." అని ఇంకా ఏదో అనబోతుంటే.. "ఈ వర్షం లో జీడిపప్పులేసి నేతి పోపు పెట్టిన ఉప్మా గరిట జారుగా.. తింటే ఎంత బాగుంటుంది" లాంటి స్టేట్మెంట్లు!ఎప్పుడు బజార్ కి పంపినా బన్సీ రవ్వ, బొంబాయి రవ్వ, బియ్యం నూక, గోధుమ నూక మొదలైనవి కిలోలకొద్దీ తెచ్చి నా మొహాన పడేయటం.

ఉన్న ఉప్మా రకాలు చాలవన్నట్టు ఇడ్లీ ఉప్మా, లెఫ్టోవర్ ఫుడ్ తో ఉప్మా, బ్రెడ్ ఉప్మా, ఓట్ల ఉప్మాల్లాంటివి కూడా తయారు చేసి పెద్ద ఆటం బాంబ్ ఫార్ములా కనుక్కున్నంత పోజు కొట్టటం!!!..  రోడ్ ట్రిప్ లకెళ్ళేప్పుడు కూడా కాస్త  మరిగే నీళ్ళుంటే చాలు, పాకెట్ లో తీసుకెళ్ళిన రెడీ టు ఈట్ ఉప్మా మిశ్రమం కలిపి చేసుకుని తినేసి..'ఆహా' అనుకోవటం..

ఇటు అత్తగారింట్లో, చుట్టాల్లో .. ఏదో లే అనుకుంటే.. మా అమ్మా వాళ్ళూ మేమిద్దరం ఎప్పుడెళ్ళినా.. తనకిష్టమని ప్రత్యేకం గా ఉప్మా తోటే స్వాగతం! నాకు భయపడి నాకు వేరే ఏదో చేసిపెడుతుంది లెండి మా అమ్మ

మా రెండో పాప పుట్టినప్పుడు మాత్రం, ఇద్దరు పిల్లలతో సతమతమౌతూ  దొరికిన 10 నిమిషాల్లో ఏదైనా రుచి గా, ఫ్రెష్ గా వేడి గా తినాలంటే ఉప్మా కి మించిన పదార్థం లేదని కనిపెట్టినా "అమ్మో చెప్తే చులకనైపోనూ? " అని ఎవ్వరికీ చెప్పలేదనుకోండి.. మీరూ చెప్పద్దు.,..సరేనా?


ఏదో పెళ్ళయి పదేళ్ళయిన తర్వాత మా వారు ఈ మధ్య 'కార్బ్ కాన్షియస్'  అయి ఉప్మా పిచ్చి కాస్త తగ్గిపోయింది లెండి. నాకెలాగూ ఇంటరెస్ట్ లేదు కాబట్టి పెద్దగా చేయను. కానీ.. మొన్నీ మధ్య మా పెద్దది ఏదో పిల్లల పార్టీ నుండి వస్తూనే.. "అమ్మా నువ్వు అసలు ఉప్మా ఎందుకు చేయవు? వాళ్ళింట్లో తిన్నాను.. ఎంత బాగుందో! కెన్ ఉ మేక్ ఉప్మా ఫర్ మీ? "  అని గునుస్తూ..


'అమ్మో ఈ ఉప్మా జీన్స్ దీనికీ వచ్చాయా? హత విధీ! అనుకున్నాను. అంతా పైవాడి లీల. ఇప్పుడు నేనూ వారానికి 2 సార్లు ఉప్మా చేస్తూనే ఉంటాను. వేరే దారేది? :-(

30 comments:

బద్రి said...

chivari pic kekandi.

Maa weekend breakfast Upma (maa roommate baagaa chestadulendi :D). Ravva fry cheyyakundaa chese upma aithe naakistam ledante konchem kastapadataanu.

Ravi said...

Baagundi mee UpmaAayanam. Naa votu upma ke.

Lakshmi Raghava said...

ఉప్మా ప్రేమికులూ చదవకండి అన్నారు మీరు..అందుకే చదివాను..నాకు 63 యేళ్ళు..మా చిన్నప్పుడు మా అమ్మ రోజూ బియ్యపు రవ ఉప్మా చేసేది,దాని బొగ్గుల కుంట్లో ఆలగె పెట్టి కింద ఎర్రగా గోకు కట్టించేది..దాని కోసం అందరూ పొట్లాడుకునే వాళ్ళం ..ఇన్నాళ్ళకు మా అమ్మ ఉప్మా గురించి రాయడానికి ఎంత సంతొషపడు తున్నానో ..ఈసంగతి 88 యేళ్ళ మా అమ్మకు చెబుతాను తప్పకుండా..
లక్షీఋఅఘవ

మంచు said...

మా లాంటి ఉప్మా ప్రేమికుల మనొభావాలు తీవ్రంగా గాయపరిచారు... :-))
అసలు ఉప్మా కన్నా మధురమయినది ఎమయినా వుంటుందా ???

snkr said...

ఉ - అంటే ఊరించే
ప - ప్రజలందరి ని/చే
మా - మాకే మాకే అనిపించేదే ఉప్మా

నమిలి తినాల్సిన అవసరంలేని ఉప్మా పిల్లలకు , వృద్ధులకు చక్కటి ఆహారం అనిన్నూ, మధుమేహం , రక్తపోటు తగ్గించే పైత్యహారిణి ఉప్మా అనిన్నూ సింధులోయలో ఆర్యుల ఆహారపు అలవాట్ల మీద చేసిన ఓ పరిశోధనలో తేట తెల్లమయ్యింది, ఇహ మీ ఇష్టం... :)

హరే కృష్ణ said...

హ హ్హ బావుంది
ఉప్మా ని పొగుడుతూ రాస్తారేమో అని అనుకున్నాం
ఇలా ఉప్మా అభిమానుల మనోభావాలను దెబ్బ తీసారు :)
అయినా రెండు సార్లు వండుతున్నారు కాబట్టి దీక్ష ని విరమిస్తున్నాం :)

as usual well written

ఆ.సౌమ్య said...

నేనొప్పుకోను....ఉప్మా ప్రేమికులం మీ మీదకి యుద్ధానికొస్తాం.
అసలు ఉప్మా లో ఉన్న రుచి ఇంక దేన్లోనైనా ఉందా?
చిన్నప్పుడు ఉప్మా చెయ్యమని ఎక్కువ గొడవపెట్టేదాని, చేస్తే లొట్టలేసుకుంటూ తినేదాన్ని. ఇప్పటికీ అంతే. అసలు పెసరట్టు ఉప్మా లాంటి ఫలహారం మరొకటుందా?

మీ భూస్వామ్య ఉప్మా కుట్రలు నశించాలి నశించాలి.

మైత్రేయి said...

చాలా బాగుంది కృష్ణాజీ!
మా ఇంట్లో మీకు ఆపోజిట్ పరిస్థితి. నేను ఉప్మా వీరాభిమానిని కాకపోయినా ఎప్పుడైనా కూడా చెయ్యరు, చెయ్యనియ్యరు మా అత్తగారు. అందుకే ఈమద్య హొటల్స్ లో, పెళ్ళిళ్ళ లో ఉప్మా ఆబగా తింటుంటే అందరూ చిత్రంగా చూస్తున్నారు.
ఈజీగా చెయ్యటం విషయంలో దీన్ని కొట్టేసేది ఏదీలేదు. మీరిచ్చిన లిస్ట్ తో పాటు మరమరాలు, అటుకులు, సేమ్యా లాంటి పదార్దాలు కలుపుకుంటే వారమంతా రకరకాల ఉప్మాలతో టిఫినీలు కానించెయ్యచ్చు.
నాకు చిన్నప్పుడు డి డీ లో చూసిన ధర్మవరపు సుబ్రమణ్యంగారి ఉప్మా పద్మ నాటకం గుర్తుకొస్తోంది. :)

తార said...

బ్రిటీష్ వంటకం ఐన ఉప్మాని దేశంలో నిషేదించాలని కే.సి.ఆర్.కి విజ్ఞప్తి చేస్తున్నాను..

వీరుభొట్ల వెంకట గణేష్ said...

_________________________________
మా లాంటి ఉప్మా ప్రేమికుల మనొభావాలు తీవ్రంగా గాయపరిచారు... :-))
అసలు ఉప్మా కన్నా మధురమయినది ఎమయినా వుంటుందా ???
_________________________________

Comment re-use!!

వేణూ శ్రీకాంత్ said...

ఉప్మా ప్రేమికులను చదవద్దంటారా !! తప్పకుండా చదవాలి. ప్రతి మలుపులో మీ పై విజయబావుటని ఎగరేస్తూ చివరకి "రుచి లోనూ వేగంగా తయారు చేయబడడం లోను తనకి సాటి మరెవరూ లేరని ఇకపై రారని" అంతగా వ్యతిరేకించే మీతోనే చాటి చెప్పించుకున్న మా అభిమాన ఉప్మా విజయగాధని కన్నుల పండువగా ఒకటికి రెండు సార్లు చదువుకున్నాను :)

ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి మధ్యలొ ఉడకని పిండి తగిలేలా సరిగా వండక పోతే తినడం కష్టమే కానీ ఆ తప్పు వండే వారిదే కానీ ఉప్మాది కాదు. :) టపా చాలా బాగుందండీ :) నాకు అర్జంట్ గా పెసరట్టు ఉప్మా తినాలనిపిస్తుంది.

Krishnapriya said...

@బద్రి,

థాంక్స్! :-) హ్మ్మ్.. రవ్వ ఫ్రై చేయకుండా చేసే ఉప్మా మీకు వారానికి 3-4 రోజులు ప్రాప్తిరస్తు!

@రవి,

సరే ఏం చేస్తాం.. అలానే కానీయండి.

@ లక్ష్మి గారు,

నా బ్లాగ్ చూసి వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు! మీరు చెప్పిన గోకు .. నాకూ ఇష్టమే :-)

@ మంచు,

ఓహ్.. మీరు తియ్యగా చేసుకుంటారా ఉప్మా.. ఇలాంటి ఉప్మా ఎప్పుడూ నేను తినలేదేంటి చెప్మా? (డైలాగు పాతదే లెండి :-))

adi seshu said...

మేము ఈ ఉప్మా ను కాంక్రీట్ అని పిలిచేవాళ్ళమండి. ఇంజనీరింగ్ లో వున్న 4 సంవత్సరాలు ఆ కాంక్రీట్ కు తోడుగా కేసరీ భాత్ కొసరి కొసరి మరీ వడ్డించే వాళ్ళు మా హాస్టల్ మెస్ లో. నావరకూ నాకు ఉప్మా అంటే ఇష్టమేనండి.

Priya said...

Hey Mitreyi,

Nenu kuda DD TV lo aa Upma padma serial chusake amma upma antha baaguntundha...okasari nuvvukuda ala cheyyave ventane ani adiganu.... Nenu eppudu upma thinna/chesina aa scene gurthu vasthundhi naku. U know nenu okasari dharmavarapu subhramanyam tho maatladinappudu aayanaki kuda cheppa....mee Upma episode chala baagundhi ani. Antha guthu naku.

Krishnapriya said...

@snkr,

హ్మ్మ్.. బాగుంది మీ విశ్లేషణ.. సింధు లోయ లో ఆర్యులు తిన్నారు ఒకప్పుడు, వారి ఆరోగ్య రహస్యం ఇదే అని తెలియక ఇన్నాళ్ళూ నేను దీన్ని పట్టించుకోకుండా ఎంత పొరపాటు చేసాను? నా కళ్ళు తెరిపించారు :-)

@ హరేకృష్ణ,

థాంక్స్! మీ మనోభావాలని దెబ్బ తీసినా.. మీరన్నట్టు ఇంక వండటం,తినటం మొదలు పెట్టేసాగా? :-)

కృష్ణప్రియ/

Krishnapriya said...

@ సౌమ్య,

యుద్ధానికే? అమ్మో.. ఇంకెప్పుడూ ఉప్మా నేమీ అనను లెండి. మీరు చెప్పినవి రెండూ కరెక్టే..

ఉప్మా రుచి ఉప్మాదే.. అట్ల రుచి అట్లదే :-)
అలాగే పెసరట్టు ఉప్మా లాంటి పలహారం మరొకటి లేదు! పొగలు కక్కే ఇడ్లీ, కారప్పొడి, నెయ్యి, కొబ్బరి పచ్చడై లాంటి పలహారమూ లేదు ..

కృష్ణప్రియ/

Krishnapriya said...

@ మైత్రేయి, ప్రియ,

నాకూ ఎవరైనా.. ఉప్మా తినటానికి వీలు లేదు అని ఫత్వా జారీ చేస్తే.. క్రేవింగ్ వస్తుందేమో..
:-) నేనూ చూశాను ఉప్మా పద్మ.

Krishnapriya said...

@ తార,

కే సీ ఆర్ గారు ముందే చెప్పారు గా ఇడ్లీ సాంబార్ గో బాక్.. జొన్న సంకటి, పచ్చిపులుసే మాకు ముద్దు.. అని.. ఉప్మా కూడా ఇడ్లీ, దోశలతో బాటూ ఇంక్లూడెడే లెండి.

@ గణేష్,

మీరు కూడా తియ్య ఉప్మాయే తింటారన్నమాట..:-)

@ వేణు శ్రీకాంత్,

చాలా థాంక్స్ మీ కామెంట్ కి. నిజమే ఈ కథ లో అంతిమ విజయం ఉప్మాదే..

కృష్ణప్రియ/

Krishnapriya said...

@ ఆదిశేషు,

హ్మ్మ్,..ప్రపంచం లో అందరూ నాలాగే ఆలోచిస్తారనుకునే భ్రమ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది మీ అందరి కామెంట్లు చదువుతుంటే.. :-)

ఇప్పుడు నేనూ ఉప్మా కి అలవాటు పడిపోయాలెండి!

కృష్ణప్రియ/

విశ్వనాథ్ said...

టపా చదివాక, బయటకు వెళ్ళి ఉప్మా తిని వచ్చి కామెంటుతున్నాను.ధన్యవాదాలు తమిళ ఉప్మా రుచి చూపించారు.టపా నేను తిన్న ఉప్మాలాగా చాలా బాగుంది.

nagarjuna said...

అర్రేరె మాయాబజార్‌లో ’వివాహ‌ భొజనంబు..’ పాట గుర్తొచ్చింది చదువుతుంటే. ఉప్మా దగ్గర మొదలెట్టి ఇడ్లీ దాకా వెళ్ళారూ. నాకిక్కడ లాలాజలం సునామీలా పరవళ్ళు తొక్కుతోంది. కళ్ళముందు తెలుగుదేశపు ఉపాహారాలన్నీ నాట్యం చేస్తున్నాయి..... మధ్యాహ్నం లంచ్‌ కూడా చేయలేదాయే :( అదిగో ఇడ్లీ-సాంబర్, పూరీ-కర్రీ, వడలు, గుంత పుణుగులు, దోశలు, మినపట్లు, ఉప్మా.... వ్వా...

I hereby declare that the content posted here is highly disturbing, as stated by the author, for those people too who stay-up late in nights and begin their only after noon. So folks don't read- check it to confirm my warning :)

Krishnapriya said...

@ విశ్వనాథ్, నాగార్జున,
ధన్యవాదాలు!
అయితే మీకందరికీ నా ఉప్మా పాట్లు ఇలాగ "ఉపయోగ" పడ్డాయన్నమాట.
కానీ.. పైన కామెంట్ లో చెప్పినట్టు.. ఉప్మా కి ఇంతమంది అభిమానులుంటారని నిజం గానే నాకు తెలియదు :-)

Chandu said...

ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా మీద బేస్ ఐపోయి
మీ పిల్లలు, హితులు, సన్నిహితులు, మిత్రులు, బంధువుల్
మిమ్ములం నిత్యము ఉప్మా చేయండని
నిత్యము పీడించు గాక....
ఇదే మా ప్ర .ఉ. ప్రి. సం. వారి శాపం
ప్రపంచ ఉప్మా ప్రియుల సంఘం వర్ధిల్లాలి.

Krishnapriya said...

@ చందు,

భలే శాపం ఇచ్చారు నాకు :-) అన్నట్టు చందూ, మీకే వంటలు ఇష్టం ఉండదు?
ఆ హ్హా.. శాపానికి మళ్ళీ ప్రతి శాపం ఇద్దామని కాదు. ఊర్కే..

కృష్ణప్రియ

Sravya Vattikuti said...

హ హ హ ఉప్మా మీకూ నచ్చదా? నాకు కూడా కాకపొతే ఒక్క హైదరాబాద్ లోని తాజ్ మహల్ రెస్టారెంట్ లో తక్క అక్కడ మాత్రం సూపర్ ఉంటది .
మీలానే పాపం ఈ అమ్మాయి http://kranthigayam.blogspot.com/2008/07/blog-post.html రాసిన గోడు కూడా చదవండి .

Krishnapriya said...

@ శ్రావ్య,

అచ్చం నాలాగే ఉన్నాయి ఆ అమ్మాయి అభిప్రాయాలు. :-) అమ్మయ్య.. నా పోస్ట్ కి ఇప్పటిదాకా అందరూ ఉప్మా ప్రేమికులే కామెంట్లు పెట్టారు. నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని వినగానే ఆనందం గా ఉంది :-)

శివరంజని said...

హ హ హ ఉప్మా మీకూ నచ్చదా? నాకు కూడా .......బాగా రాసారు నేను మీ పార్టీనే

Krishnapriya said...

@ శివరంజని,

అమ్మయ్య!! లేట్ గా ఇచ్చినా లేటెస్ట్ గా చక్కని కామెంట్ ఇచ్చారు :-)

కృష్ణప్రియ

నేస్తం said...

:) అసలు ఉప్మాలో పెరుగు వేసుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా...నాకు కరాచి నూక ఉప్మా కంటే బియ్యం నూక ఉప్మా ఇష్టం... ఇష్టం అంటే ఓ రెండు నెలకోమారు ఇష్టం అన్నమాట .. :) కాని మా అత్తవారి ఇంట్లో అందరూ ఉప్మా హేటర్స్ ...ఉప్మా అనే మాట వింటే చాలు వాళ్ళ అమ్మతో చారిత్రక యుద్దాలు చేస్తారు.. పాపం మా అత్తగారు ఉప్మా లవ్వర్.. అందుకే ఆవిడ ఇక్కడకు వచ్చినపుడాల్లా ఉప్మాయే వండుతా...

Krishnapriya said...

@ నేస్తం,
రెండు నెలలకోమాటు ఇష్టం .. అదీ ఉప్మా టేస్ట్ ని పెరుగు తో డామినేట్ చేసి.. :-) మీదే అదృష్టమండీ.. మా అత్తగారికి సొజ్జప్పాలిష్టం..

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;