' హాయ్ క్రిష్నా.. చాలా రోజులైంది.. ఎక్కడున్నావ్? ఏం చేస్తున్నావ్? ఏంటి ఇంకా నీ పొసిషన్ సాఫ్ట్ వేర్ ఇంజినీరేనా? ' అని తెగ జాలి పడిపోయాడు వెంకీ. యూ యెస్ నుండి ఆర్కిటెక్ట్ వస్తున్నాడు.. మీకు గైడెన్స్ ఇవ్వటానికి.. అంటే వందలాది వెంకట్/వెంకీ లలో ఎవరో పెద్దగా ఆలోచించలేదు. వెంకీ నేను టీం లీడ్ గా ఉన్నప్పుడు.. కాలేజ్ నుండి ఫ్రెషర్ గా చేరాడు నా టీం లో.. మరీ తెలివైన వాడు కాదు, అలాగని మొద్దూ కాదు. రెండేళ్ళు పని చేసాను అతనితో, బోల్డు నేర్పించాను.. చాలా సార్లు తప్పులు చేస్తే.. ఒక లీడ్ గా అతనిని వెనక్కి నెట్టి బాధ్యత వహించాను.
వెల్! అవన్నీ పాత రోజులు.. భీ సీ ఎరా.. (బిఫోర్ చిల్డ్రన్) పిల్లలు నా జీవితం లో కొచ్చేటప్పటికి నా కారీర్ కాస్త వెనక పడింది. పని గంటలు మార్చటం, పైగా..పూర్వం లా అన్నన్ని గంటలు ఆఫీస్ పని కి కేటాయించటం మానేయటం వల్ల క్రమం గా..వెనకపడి పోయాను. ఇంకో రెండు గంటలు చేస్తే..ఏం చేయగలనో, ఏం సాధించగలనో తెలుసు.. కానీ..చేయాలంటే.. ఎక్కడో అక్కడ హిట్ తీసుకోవాలి తప్పదు.
ఒక పక్క పిల్లలు. పొద్దున్నుంచీ.. సాయంత్రం 6 దాకా డే కేర్ లో పెట్టేసి/లేక ఒక నానీ పెట్టుకుని .. ఆఫీస్ పని చేసేసి.. ఒక డైరెక్టర్, వీ పీ అయిపోవాలా? లేక ఉద్యోగం మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఉంటే సరిపోతుందా? లేక మధ్యేమార్గం అనుసరించాలా లాంటి ప్రశ్నలు అందరు వర్కింగ్ మదర్స్ లాగే వేసుకుని.. చర్చించి, సమాధానపరచుకుని.. అమెరికా లో మా కంపెనీ ఇచ్చే అన్ని రకాల సెలవల్నీ విచ్చలవిడి గా వాడుకుంటూ, పని గంటలు కుదించుకుని, పని తీరు మార్చుకుని మరీ.. పూర్తిగా చదివిన చదువూ, సహజంగా ఉన్న జిజ్ఞాస ని కొంతవరకూ సంతృప్తిపరచుకుంటూ ఏదో ఇలా సాగిపోతోంది నా కారీర్.
వెంకీ ప్రశ్న తో ఒక్క క్షణం ముల్లు గుచ్చినట్టయింది. పైకి నవ్వేసి ఏదో సమాధానం చెప్పినా.. కాస్త అలజడిగానే అనిపించింది. ఇంతలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వెంకీ మీటింగ్ మొదలైంది. అన్య మనస్కం గానే వింటున్నాను. మీటింగ్ అయ్యాక.. వెంకీ తో కాఫీ లాంటి మర్యాదలు అవీ అయ్యాక.. వెంకీ.. ' కృష్ణ టాట్ మీ అ లాట్.. ఇంకా అలాగే నువ్వు కొత్తవాళ్ళని మెంటర్ చేయాలని ఆశిస్తున్నాను..' లాంటివి చెప్పాడు. వొళ్ళు మండిపోయింది. ఎలాగో లాగ బయట పడి.. చిరాకు గా క్యూబ్ కొచ్చి పడ్డాను.
వెంకీ ఒక్కడనేంటి.. అసలు ఏమైనా గౌరవం ఉందా నాకు ఒక ఇంజినీర్ గా? 'ఈవిడ పిల్లల కోడి.. 4 దాటితే ఉండదు. ఒకసారి పిల్లలకి పరీక్షలంటుంది, ఇంకోసారి సెలవలంటుంది.. లేదా ఎవరో ఒకరికి వొంట్లో బాగా లేదంటుంది.. ఏ ఈవెంట్ పెట్టినా టైం ఉండదు.. ' ఇదేగా అందరి అభిప్రాయం.. అనుకుంటే.. బెంగ గా అనిపించింది. నాకన్నా.. 6-7 యేళ్ళు చిన్నవాళ్ళు ఆర్కిటెక్ట్ లూ, మానేజర్లూ, అయిపోయారు. నేనే ఇలా మిగిలిపోయాను అని ..
ఫోన్ చేసిన శ్రీవారిని ఏదో వంకన అకారణం గా విసుక్కుని, ఆఫీస్ పని మీద ఇంక ధ్యాస పెట్టలేక.. బయట పడ్డాను. గల గలా నవ్వుకుంటూ కాంటీన్ కి కొందరూ, జిం బ్యాగులు తీసుకుని కొందరూ కనిపించారు. ఎప్పుడైనా వెళ్ళానా అసలు ఈ మధ్య.. ఎప్పుడూ ఏదో ఒక వంక తో.. ఎన్ని టీం అవుటింగులు వదులుకున్నాను? మొహం తిప్పేసి.. కార్ వైపు నడిచాను. కార్ లో కూడా ఆలోచిస్తూనే ఉన్నాను. అసలు చాలా మామూలు చదువు, ప్రతిభ కనపరచలేకపోయ్న నా క్లాస్ మేట్లు కొందరు ఎంత మంచి స్థాయి లో ఉన్నారు? ఆలోచనలు తెగట్లేదు.
మా ఇంటి సందు లోకి తిరుగుతుంటే.. రాధిక కనిపించింది. బిట్స్ పిలానీ లో ఒకప్పటి ర్యాంకర్ . కానీ.. భర్తా వాళ్ళూ వద్దన్నారని.. ఉద్యోగం చేయదు.
ఏదో కోల్పోయినట్టుంటుంది ఎప్పుడూ.. ఒకసారి చెప్పింది.. 'మా అమ్మాయిని అస్సలూ చదివించను. అంత టాపర్ గా నిలిచి నేనేం సుఖపడ్డాను? చదువుకునే రోజుల్లో ఒక సినిమా చూడలేదు.. ఒక సరదా తీరలేదు.. ఆపరేటింగ్ సిస్టంస్ మీద పని చేయాలని ఎన్ని కలలు కన్నాను? ' అంది. 'అయ్యో పాపం ' అనిపించింది అప్పుడు.
ఇంటికొస్తూనే.. ఏదో ఆఫీస్ కాల్. అటెండ్ అవక తప్పలేదు. పిల్లలు వచ్చారు.. కాల్ మీద ఉండే..వాళ్ళకి కావల్సినవి అమర్చాను. ఇంతలో ఈయన రావటం తో పిల్లలని చూడమని.. సైగ చేసి స్టడీ లో కెళ్ళిపోయాను. తర్వాత ఒక గంట చర్చ జరిగాక.. అలాగే 2 నిమిషాలు కూర్చుండిపోయాను.
'ఏంటి..అసలు.. ఎందుకింత బేల గా అయ్యాను? ఇది నా చాయిస్. నేను కావాలని తీసుకున్న నిర్ణయం.. అన్నీ కావాలనుకున్నప్పుడు.. పిల్లలకే ప్రాధాన్యత అనుకున్నప్పుడు.. కారీర్ కూడా గొప్పగా ఉండాలంటే ఎలా సాధ్యం? ' అనుకున్నాక మనసు తేలిక పడింది. 'పాపం.. ఏం తిన్నారో.. స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ మొహమైనా సరిగ్గా చూడలేదు.. ' అని స్టడీ లోంచి బయట కొచ్చాను.. ఎవరూ లేనట్టుంది.. ఆటలకెళ్ళారేమో.. వంట గబగబా చేసేద్దాం అని వంటింట్లో కెళ్ళేటప్పటికి.. 'సర్ప్రైజ్!! అమ్మా.. నువ్వు మీటింగ్ లో ఉన్నావు కదా అని .. నాన్నా,మేమూ దోశలు చేసాం.. ' అని మా పిల్లలు.
మనసు నిండిపోయింది.. తాత్కాలిక మానసిక దౌర్బల్యం లోంచి బయట పడ్డాను.
ఇంక ఏ వెంకీ నన్ను ఎఫెక్ట్ చేయలేరు కొన్నేళ్ళు :-)
Subscribe to:
Post Comments (Atom)
38 comments:
I appreciate your decision.
నాకేదో నా భవిష్యత్తు కనపడుతున్నట్టుంది మీలో! ;-)
Bagundandi, I guess every working mother goes through this phase:-)
"ఫోన్ చేసిన శ్రీవారిని ఏదో వంకన అకారణం గా విసుక్కుని" idi baga chepparu:-)
The way you look at it. I am 12ys old in the industry, still a consultant. Ladder and all, part of the game, specially Desi Companies frame work. From the client's view a consultant is a consultant. Ultimately, "are you satisfied, to the roof with what you do?" one should ask to self and answer too. If not happy, one becoming VP or CEO may not make any difference and sense.
This is my view only.
Just to add, to me, family is more important. I prefer to be at home by 5 pm. Let my manager write in the appraisal form that Bhaskar's personal life is blocking him to put max efforts, I dont care and I treat it as a complement.
I can totally identify with this.
ఇద్దరు పిల్లలతో, వృత్తిలో అనుకున్నంతగా రాణించట్లేదన్న బెంగా, ఆఫీసులో కొంచెం ఎక్కువ సమయం గడిపినా పిల్లలెలా వున్నారో అన్న దిగులూ, గిల్టీ ఫీలింగూ అన్నీ కరెక్టుగా చెప్పారు. అసలే విషయంలోనూ కాంప్రమైజు ఇష్టం లేక అన్ని వైపులానించీ ఏవేవో శక్తులూ, అవసరాలూ లాగుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే! వీలైతే ఇది చూడండి.
http://sbmurali2007.wordpress.com/2008/06/10/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%86%e0%b0%b5%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf/
శారద
నేనూ మీ కేటగిరేనోచ్. మా అబ్బాయి స్కూలు మొదలుపెట్టాకా జాయిన్ అయ్యాను.
నేనూ పెద్దగా ఆలోచించను కెరీర్ ఎదుగుదల ఎక్సెట్రా..నాకు తెలుసు ఇవన్నీ ఆలోచిస్తే మా అబ్బాయికి నేను న్యాయం చెయ్యలేను అని.
నేను ఇంట్లొ ఉంటున్నప్పుడు నా క్లాస్మేట్ అమ్మాయిలు అందరూ పెద్ద పెద్ద MNC లలో పనిచేస్తోంటే కొంచం గిల్టీ ఫీల్ అయ్యాను.కానీ మా అబ్బాయితో నేను గడిపిన సమయం అమూల్యం.ఈ మధ్యనే ఒక 2 యేళ్ళు పని చేసి 3 నెలలు బ్రేక్ తీసుకుని మళ్ళా జాయిన్ అయ్యాను.హాయిగా ఉంటోంది ప్రాణం.
మనకి ఉద్యోగం ఎప్పుడయినా వస్తుందండీ,పిల్లల బాల్యం తిరిగి రాదు కదా.గుడ్ డెసిషన్.ఇలాంటి వెంకీలు/వెంకమ్మలు అర్ధం చేసుకోలేరు.మనము ఏదో కోల్పోతున్నాము అనుకుంటారు,అనుకోనీండి.ఆల్ దబెస్ట్.
మీ బ్లాగు హాయిగా ఉంతుంది ఒక స్నేహితురాలి డైరీ చదువుతున్నాట్లు.
Me too. Irrespective of my title, I am still a developer.
అందరికీ ధన్యవాదాలు!
మనం కావాలని తీసుకున్న నిర్ణయాలు కూడా.. ఒక్కోసారి బలహీన క్షణాల్లో బాధిస్తాయి. ఆ ఫేస్ దాటాక మళ్ళీ మామూలే..
ఇప్పటికి 16 యేళ్ళ కారీర్ లో మొదటి 6-7 యేళ్ళూ తెగ చెమటోడ్చి చేసాను. తర్వాత పిల్లలతో,..ఆడుతూ,పాడుతూ పని వేళలు,గంటలు తగ్గించి కారీర్ హిట్ తీసుకున్నా.. ఏ రెండేళ్ళకో ఒకసారి పురుగు కుడుతూనే ఉంటుంది.. కొన్ని గంటలు బాధించి మాయమవుతుంది.. :-)
కృతజ్ఞలతో,
కృష్ణప్రియ/
చాలామంది ఆడవారి మనస్సుకి అద్దం మీ టపా!
"మనం కావాలని తీసుకున్న నిర్ణయాలు కూడా.. ఒక్కోసారి బలహీన క్షణాల్లో బాధిస్తాయి. ఆ ఫేస్ దాటాక మళ్ళీ మామూలే"..చాలా నిజం.
చదువు అయిన 16 సంవత్సరాల తరువాత పిల్లలు బాగా పెద్ద అయ్యాక ఉద్యోగం మొదలుపెట్టాను...పిల్లలకి ఇంటి పనులకి ఎలాంటి ఇబ్బంది కలగని పనివేళలే అయినా పిల్లలకి కొన్ని కొన్ని దూరం చేస్తున్నానేమో అని ఓ గిల్టీ ఫీలింగ్..చుట్టాలు వచ్చినప్పుడు ఇబ్బంది...ఓ మూడు సంవత్సరాలు చేసి ఇంటినుండి చెయ్యటం మొదలుపెట్టాను (ఈ సదుపాయం అన్ని ఉద్యోగాలల్లో ఉండదనుకోండి). ఇప్పుడు హాయిగా ఉంది..నాకిష్టమైనప్పుడు చేస్తాను..లేనప్పుడు మానేస్తాను. మీరన్నట్టు అప్పుడప్పుడు పురుగు కుడుతుందనుకోండి:))..ఇవేవి లేకపోతే నేను ఎక్కడుండేదాన్నో అని..అదీ ఒక్క నిమిషమే..పిల్లలకి ముందు మనం కావాలి..వాళ్లముందు ఇవన్నీ బలాదూర్ కదా!
బాగుంది మీ పోస్ట్
పల్లెటూర్లలో అమ్మాయిలని టెంత్ క్లాస్ వరకో, ఇంటర్మీడియేట్ వరకో చదివించి పెళ్ళి చేస్తారు. పట్టణాలలో గ్రాడ్యుయేషన్ చదివిన స్త్రీలు కూడా ఉద్యోగాలు చెయ్యకుండా ఇంటిలో గృహిణులుగా ఉంటున్నారు. ఎందుకంటే ఉద్యోగం చేసి సంపాదించినా జీతం తమ భర్తలకి ఇవ్వాల్సి వస్తుంది, తమ సంపాదన మీద తమకి హక్కు ఉండదు. అందుకే విద్య కంటే స్త్రీకి స్వతంత్ర అర్జన ముఖ్యం అని చలం గారు అన్నారు. అరబ్ దేశాలలో కూడా స్త్రీలు యూనివర్శిటీలకి వెళ్ళి చదువుకుంటారు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు తక్కువ. చేసినా గైనకాలజిస్ట్, టీచర్ లాంటి ఉద్యోగాలు చేస్తారు. ఇండియాలో కూడా స్త్రీల పరిస్థితి ఇలాగే ఉంది. ICICI, HDFC లాంటి బ్యాంక్ లలో టెల్లర్ సీట్ లో స్త్రీలు కనిపిస్తారు, మేనేజర్ రూంలో పురుషులు కనిపిస్తారు. ఎందుకంటే ఉద్యోగాలలో స్త్రీలకీ, పురుషులకీ సమానమైన హోదా లేదు. స్త్రీ పేరు మీద ఆస్తి వ్రాసి అధికారం ఆమె భర్తకి ఇస్తే ఏమి లాభం? అని అన్నారు చలం గారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా స్త్రీలకి ఆస్తి హక్కు ఉండేది. కానీ ఆ ఆస్తి మీద అధికారం వాళ్ళ భర్తలు చెలాయించేవారు. ఇప్పటి స్త్రీలు పాత కాలపు సావిత్రి, చంద్రమతి వంటి స్త్రీలలా లేరు కానీ స్త్రీల జీవితాలలో గొప్ప మార్పు రాలేదని మాత్రం చెప్పగలం. చట్టాల వల్ల స్త్రీల పరిస్థితిలో కొన్ని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు భర్తని వదిలేసి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న స్త్రీని పతిత అనేవారు. ఇప్పుడు విడాకుల చట్టం ఉంది కాబట్టి స్త్రీ లీగల్ గా రెండవ పెళ్ళి చేసుకోగలదు. చట్ట ప్రకారం ఆమెని పతిత అని అనలేరు. చలం గారు వ్రాసిన ఇతర రచనలలాగే "స్త్రీ" పుస్తకాన్ని కూడా సంప్రదాయవాదులు విమర్శించారు. ఈ సంప్రదాయవాదుల గురించి చలం గారు ఇలా అన్నారు "ప్రభుత్వం స్త్రీల హక్కుల కోసం చట్టాలు తయారు చేస్తే వాటిని విమర్శించే ధైర్యం రాదు కానీ తన లాంటి స్త్రీవాదులు స్త్రీల హక్కుల గురించి మాట్లాడితే విమర్శించే ధైర్యం వస్తుంది" అని
నేను వివాహానికి పూర్వమే ఉద్యోగినిని, ఇంతవరకు బ్రేక్ తీసుకోలేదు. నాదీ ఐటీనే, అందులోనూ నాక్కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ టచ్ చేసినదాన్నే. మీరు "ఒక క్షణం/స్థితి ఆ తర్వాత మామూలే" చెప్పేసారు కనుక ఇక పొడిగింపు అవసరం లేదు, కానీ.. Comparison is the death of happiness. That is my rule of thumb. నా వరకు పిల్లలు జీవితంలో వసంతం వంటివారు. ఆ అమని శోభలు ఒక్కటీ నేను అస్వాదించకుండా వదల్లేదు/వదలను కూడా. "పిల్లలు-వృత్తి-నాదైన వ్యాపకాలు/అభిరుచుల లోకం" ఈ ముప్పేట పేనిన జీవితంలో నాకు అసంతృప్తి మాత్రం ఆ మొదటి రెండిట్లలో కలగలేదు. నేను అప్ప్లై చేసే రూలిది..Down the line, after 'x' days/'y' years would my employer remember that I worked through a night missing an important event at home to meet a deadline? Would my child remember the pain? అలాగే నాకు ఏది ముఖ్యం అన్న నిర్వచనం చాలా సింపుల్..పిల్లలు. అంతే! అందుకే నాకు 24X7 mom అన్న పేరు. పిల్లలు కూడా ఇదే బాంధవ్యం లో ఎదుగుతున్నారు కనుక నాకు వారికీ నడుమ దాపరికాలు, బెంగలు ఉండవు. వాళ్ళు పిల్లలుగా ఎలా ఎదుగుతున్నారో, నేనూ అంతే సమంగా ఓ తల్లిగా ఎదుగుతున్నాను. ఈ పార్శ్వం ఆనందంగా ఉంటారు కనుక ఆ మిగిలిన రెండూ భాగాల జీవితం నేను నా శక్తి, సామర్థ్యాల మేరకు నడిపి సఫలికృతురాలినౌతాను/సంతృప్తి పడతాను. నా కెరీర్ గ్రాఫ్ అందుకే నాకు బాధని మిగల్చదు. ఈ జీవితగమనం నా ఐఛ్ఛికం + నా భాగస్వామి నుంచి దైనందిన పనుల్లో చాలా సహకారం ఉంటుంది కనుక ఆ వత్తిడీ ఉండదు. మన గీత/కొలత మన పరిధికి అన్వయిస్తే అన్నీ మంచి తరుణములే. మరొకరి స్వానుభవం మీకు మరోసారి ఆ క్షణం ఎదురైతే ఇంకా త్వరితంగా బయటపడేలా/అసలుకి ఇగ్నోర్ చేసేలా సహకరిస్తుందనే ఇన్ని వివరాలు రాస్తా.
కృష్ణప్రియ,
చాలా బాగా రాసారు. ఇది చదివాక కొన్ని ప్రశ్నలు, కొన్ని సమాధానాలు, కొంత అలజడి ఇది నా మనసు పరిస్థితి.
WOW! మీరందరూ అదృష్టవంతులు.
మీ ఎంపికలు మీకు చాలా సంతృప్తినిస్తున్నాయి.
అడపా దడపా కలిగే చిన్న చిన్న అనుమానాలు ఆ తృప్తిని బలపరిచేవే కానీ అవరోధాలు కావు.
అందుకు మీకందరికీ అభినందనలు.
చాలా సార్లు ఇలాంటి సంభాషణలలో అనిపిస్తుంటుంది - (ఆ వీలు ఉన్న వారికి)ఆడవారికి ఉద్యోగ విషయంలో చెయ్యనా వద్దా అనే choice ఉంటుంది. కాని మగ వారికి ఆ choice కూడా ఉండదు (most of whom we meet in our daily life). కానీ భాస్కర్ రామరాజు గారి వ్యాఖ్య ఆ పార్శ్వాన్నీ స్పృశించింది.
పైకెదగడం సరే, ఉద్యోగ భద్రత కోసమే రాత్రింబవళ్ళూ కష్టపడి పని చేస్తున్నామంటారు మరి, కొందరు.
ఇక పూర్తిగా ఉద్యోగం మానేసిన గృహిణుల దృక్కోణం (కొంతవరకూ సిరిసిరిమువ్వ గారు) తప్ప ఎక్కువ వినిపించలేదు.
అటు వైపు నించీ నీలాంబరి గారు / కృష్ణప్రియ గారి శైలిలో ఎవరైనా రాసి ఉన్నారా?
నా మటుకు నాకు ఒక guilty feeling. ఎంతో మంది తప్పనిసరై ఉద్యోగాలు చేస్తుంటారు.
ఎంతో మందికి పని వేళలు కుదించుకోవడం, అనుకున్నప్పుడు సెలవలు దొరకడం సాధ్యం కాదు.
ఇంట్లో అనుకున్నంత సహాయం దొరకదు. అలాంటి వారూ కష్టపడి నెగ్గుకొస్తున్నారు.
మీ లాంటి వారందరూ ఇల్లూ, ఉద్యోగమూ, ఇష్టాలూ అన్నిటికీ సమయం, శక్తీ వెచ్చించగలుగుతున్నారు, సంతృప్తితో ఉన్నారు.
నాకు, నాకు ఇష్టమైన పని, వ్యాపకం ఎంచుకునే సౌలభ్యం ఉన్నాయి.
ఇంట్లో సాయం అందుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ నాకు full time ఉద్యోగం చేసే వెసులుబాటు లేదన్నట్టే అనిపిస్తుంటుంది. అందుకే ఆ దిశగా ప్రయత్నించట్లేదు అని నాకు నేను చెప్పుకుంటున్నాను.
ఎప్పుడూ ఒక కథ గుర్తుకు వస్తుంటుంది. ఒక చోట చాలా windows దగ్గర క్యూలు కట్టి జనాలు నిలుచుని ఉన్నారుట. పని తొందరగా అవ్వడానికి ఏ క్యూలో నిలబ్డాలో అని ఆలోచిస్తుంటే వచ్చిన సలహా, అతి పెద్ద లైను ఉన్న క్యూలో నిలబడమని. ఎందుకంటే అక్కడ కౌంటరులో ఆమె చురుకుగా పని చేస్తుంది, అందుకే అక్కడ పని అవుతుంది, ఎక్కువ మంది అక్కడ ఉన్నారు అని. తక్కువ మంది ఉన్న చోట్ల కౌంటర్లలో పని నిదానంగా చేస్తున్నారు, అందుకే క్యూ చిన్నదైనా కదలడం లేదు, అక్కడ నిలబడ్డ వాళ్ళూ ఈమె కౌంటరు దగ్గరికి వస్తున్నారు అని.
నీలాంబరి గారి కథ విన్నాక అనిపించింది. (ఆరోగ్యకరమైనదే అనుకుంటున్నాను) పోటీ మనస్తత్వంతో ఆమె ఎన్నో సాధించగలుగుతోంది, తృప్తిని కూడా.
నాకు ఇంట్లో మధ్య మధ్య దొరికే ఖాళీ సమయాన్ని నాకు సంతోషాన్నిచ్చి కొందరికైనా ఉపయోగపడే వ్యాపకాలతో నింపుకుని, చిన్నగా నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, పిల్లలతో బోలెడంత సమయాన్ని సరదాగానూ గడుపుతూ, సదుపయోగమూ చేస్తున్నా, చుట్టు పక్కల ఉద్యోగం చేసే వారికి కాస్తో కూస్తో సహాయకారిగా ఉంటున్నా, మీ వంటి వారిని చూస్తుంటే అసూయ.
ఒకప్పటి కొలీగు పలకరించి ఉద్యోగం చెయ్యక పోవడం "నీ చాయిసేనా?" అని అనుమానార్థకంగా అడిగితే ఆలోచించాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పనులు ఒక్కోసారి సమయం ఉండీ వెనక్కి నెట్టినప్పుడు. బడిలో ఉన్నప్పుడు ఒక సహవిద్యార్థి నన్ను అడిగాడు, "నువ్వు భవిష్యత్తులో ఏం చెయ్యదలుచుకుంటున్నావు?"అని. అతనే సమాధానం కూడా చెప్పుకున్నాడు, "నువ్వు తప్పకుండా research లోకి వెళ్తావు" అని. అతనికి తెలియదు, తెలిసీ తెలియని వయసులో అదే ప్రశ్నకి "అమ్మని అవుతాను" అని చెప్పానని. అది తక్కువని కాదు. అమ్మగా కలిగే ఆనందానికి మూలం, పిల్లలలో ఉంటుందని అనిపిస్తోంది, అమ్మలో కన్నా. అమ్మ పాత్రలో అనుమానాలూ, భయాలూ ఎక్కువ, తను చేసే పని మీద సంతృప్తికన్నా. ముఖ్యంగా, అన్నీ పక్కన పెట్టి ఒక్క అమ్మగా మిగిలితే మాత్రం, ఆ పాత్రకు చెయ్యాల్సినంత న్యాయం చెయ్యలేదు, మిగిలినవీ పోగొట్టుకుంటున్నాము అన్న అనుమానం పీడిస్తూ ఉంటుంది గృహిణులను అని నాకనిపిస్తుంటుంది, అది వారి చాయిసే అయినా.
అందుకని మధ్యే మార్గంలో మహదానందాన్ని చవి చూసే మహిళలకు, వారికి సహకారాన్నిచ్చే వారందరికీ జోహార్లు.
సిరిసిరి మువ్వ గారూ, చాలా అందం గా చెప్పారు మీ మనసు లో మాట!
పుల్లాయనగారూ, ధన్యవాదాలు!
శర్మగారూ, కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా చెప్పారు! ధన్యవాదాలు! ఈరోజుల్లో ఎం ఎన్ సీల్లో, పై పొసిషన్లల్లో చాలా మంది ఆడవారు ఉన్నారు.. మచ్చుకి.. ఇంద్ర నూయి (పెప్సీ), పద్మశ్రీ వారియర్ (సిస్కో) అదీ కాక పారిశ్రామ వేత్తల కుటుంబాల్లో స్త్రీలు తమ ప్రజ్ఞ ని నిరూపించుకుంటున్నారు (అఫ్ కోర్స్, వారికి మంచి బేస్ ఉందనుకోండి.. మధ్యతరగతి వారు ఆడపిల్ల మైనస్ అని అనుకునే రోజుల్లోంచి నెమ్మది గా బయట పడుతున్నాం.
కృష్ణప్రియ/
ఉష గారూ,
ధన్యవాదాలు!
స్ఫూర్తి నిచ్చే చక్కని మాటలు చెప్పారు! అభినందనలు..
స్ఫురితా!
ఈ టపా మీకు నచ్చినందుకూ, ఆలోచించేలా చేసినందుకూ చాలా సంతోషం!
కృతజ్ఞతలతో,
కృష్ణప్రియ/
లలిత గారూ,
చాలా బాగా చెప్పారు. మీ అనాలసిస్ చక్కగా ఉంది.
నీలాంబరి గారి టపా గురించి కాస్త చెప్తారా?
నేను చూడలేదు.
ధన్యవాదాలు,
కృష్ణప్రియ/
అందరికీ,
చాలా చాలా ధన్యవాదాలు! ఈ టపా కి వచ్చిన రెస్పాన్స్ నన్ను మరింత శక్తిశాలిని చేసింది.. నా భావాలని అర్థం చేసుకుని ఇంత మంది తమ వ్యాఖ్యల ద్వారా సంఘీభావం తెలపటం.. నాకు చాలా స్పూర్థి నిచ్చింది.
శారదగారూ, మీ కథ చాలా చాలా బాగుంది.
బయట పని చేసినా, చేయకపోయినా, ప్రతిక్షణం తన కళ్ళతో చూసుకుంటూ, అన్నీ తానయి ఉన్నా, అవసరానికి (భౌతిక,మానసిక) అందుబాటులో లేకపోయినా.. అమ్మ అమ్మే..
ఆర్థికంగా, సామాజికం గా వెనకబడ్డ లక్షలాది స్త్రీలు, తమ చెంగుని నడు0కి కడుతూ, దానితో బాటూ అమ్మతనm నోరూ కట్టి పని కి వెళ్ళటం మనం చూస్తూనే ఉంటాం.
ఈ విషయం మీద సుద్దాల అశోక్ తేజ గారు మొన్న మే డే రోజు ఒక టీ వీ షో లో పాడిన పాట.. ఆరోజు మా అమ్మా,నేనూ చూస్తుంటే.. హృదయం భారం గా తయారయింది.
తప్పకుండా విని/చూసి తీరాల్సినది..
9 మిన్ 10 సెకండ్స్ నుండీ చూడండి..
http://www.youtube.com/watch?v=GYsyjCZPJMY&NR=1
కృతజ్ఞతలతో,
కృష్ణప్రియ/
పైన కామెంటు వ్రాసిన శారద (sbmurali2007) గారిదే నీలాంబరి బ్లాగు.
http://sbmurali2007.wordpress.com/2008/06/10/%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%86%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF/
ఓహ్ .. టైటిల్ కూడా చూడకుండా నీలాంబరి లింక్ లో కథ చదివేశా..
థాంక్స్!
కృష్ణప్రియ/
నేను ఇప్పటికి మూడుసార్లు బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకోవాలిసివచ్చింది. మీరందరు చెప్పిన అన్ని బాధలూ పడ్డాను. బాగా నొచ్చుకున్న క్షణం పీజీలో నా తరువాత స్కోరు తెచ్చుకున్న నా క్లాసుమేటు ఓ కంపనీ సీయీఓగా డాక్టరేటుతో కనిపిస్తే నేను ఇలా పిల్లలూ, మొగుడు, దేశాలూ అంటూ తిరుగుతున్నాను. ఇప్పటికీ నేను జెలసీ ఫీలయ్యే ఏకైక పాయింట్ +2 ఐపోయిన పిల్లల తల్లితండ్రులు. వాళ్ళ ముందు ప్రెసిడెంట్ పదవి కూడా బలాదూరె.కానీ నాపిల్ల ఎదుగుదల ఒక్కటీ మిస్స్ కాలేదు నేను. నాకు బాగా సంతోషాన్ని కలిగించే విషయం అది.
Life always comes with choice. ఒకటి తీసుకుంటే రెండోది మిస్ అవ్వవలసిందే కదా. ఈ ఐటీ లో అస్సలు తప్పని చిరాకులు. ఐనా పైన అన్నట్లు మనకే కాదు అందరు ఇంచుమించు గా చాయస్ లలో కావలసినది సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకుంటా. :-) నాకు మీలానే అప్పుడప్పుడూపురుగు కుట్టీ తెగ బాధించి వెళుతుంటుంది, మా అబ్బాయి కాలేజ్ కు వెళ్ళేంత వరకు తప్పదు అని సమాధాన పరచుకుని పురుగు కు మందేయ్యటమే..
సునీత, భావన,
ధన్యవాదాలు! మీ కథ కూడా షేర్ చేసినందుకు.. నాకు ఈ టపా తర్వాత మీ అందరూ (సునీత,భావన, సిరిసిరి మువ్వ, స్ఫురిత, లలిత, ఉష, మానస, శారద, స్రవంతి, మధురవాణి) బాగా తెలిసిన వారిలా అనిపిస్తున్నారు. భాస్కర్ రామరాజు గారు, భాస్కర్ రామి రెడ్డి గారు! వారి పర్స్ పెక్టివ్ చెప్పటం .. వెరి నైస్. శర్మ గారి విశ్లేషణ .. ఆలోచింపచేసింది.
చాలా ఆనందం గా ఉంది.
కృతజ్ఞతలతో,
కృష్ణప్రియ/
అందరూ అన్ని విషయాలు చక్కగా చెప్పారు. చివరగా మరో చిన్న పాయింట్, ఒక్కోసారి మనం అనవసరంగా పని గంటలు తక్కువ అన్న గిల్ట్ కి లోనయ్యి ఆఫీస్ లో పొందవలసినవి పొందవేమో! అడగందే పెట్టని పెట్టనవసరంలేదని అనుకొండే మానేజ్ మెంట్ కల్చర్ లో మనం లూజ్ అవుతున్నామని నా అబ్సర్వేషన్. చుట్టూ చూడండి అబ్బాయిలు అర్ధరాత్రి దాకా ఉండి గొప్పగా పీకుతున్న గడ్డి ఏమి లేదు. మనం ఉన్నంతలో పని చుట్ట పెట్టగలం. పైగా మల్టి టాస్కింగ్ లో మనం దిట్టలం అని అందరూ సర్టిఫికెట్లు ఇచ్చారయ్య.
చుట్టూ చూడండి అబ్బాయిలు అర్ధరాత్రి దాకా ఉండి గొప్పగా పీకుతున్న గడ్డి ఏమి లేదు. //
అధ్యక్షా, మీకు(అమ్మాయిలు లేక మహిళలు) problems ఎమన్నావుంటె మీరు మీ managements చూసుకొండి. మమ్మల్ని మధ్యలోకి లాగొద్దు మహాప్రభో.
ok Badri. ఏదో ఊపు రావటం కోసం తగిలేట్టు ఉండాలని అలా రాయాల్సి వచ్చింది. అదీ కాక అబ్బాయి లందరూ ఫీల్ అయ్యి కృష్ణగారికి కొంచెం పాపులారిటీ ఇస్తారని..
అయినా చుట్టూ చూడమన్నా కనుక అది ఆవిడ ఆఫీస్ వారి కి మాత్రమే వర్తిస్తుంది. :)
అమ్మాయిల్లో చాలా రకాలుంటారండీ.
1) కొందరు విపరీతంగా చదివేస్తారు కానీ పెళ్ళి కాగానే "పతియేప్రత్యక్ష దైవము" రేంజిలో అన్నీ వదిలేసి భర్తలదగ్గర అయినదానికి కాని దానికీ చేతులుచాచి తమను తాము తక్కువచేసుకొంటుంటారు. వీళ్ళంటే నాకస్సలు గౌరవం వుండదు. వీళ్ళు వట్టిసోమరిపోతులు. వీళ్ళకు చదువంటే ఒక కాలక్షేపం. ఇలాంటివాళ్ళే తాము చదువున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి పిల్లల్ల్ని కాన్వెంట్లకూ, ట్యూషన్లకూ పంపిస్తుంటారు. చదువు అనేకాకుండా ఆయా రంగాల్లో మంచిపేరు తెచ్చుకొని పెళ్ళీకాగానే రంగాన్ని వీడే వాళ్ళందరూ నా దృష్టిలో అంతే.
2) ఇంకొందరు రెండూ బాగానే లాక్కొస్తుంటారు. వీళ్ళంటే నాకు గౌరవం.
3) మరికొందరు కెరీర్‌కోసం, గుర్తింపుకోసం నిరంతరం పరితపిస్తూ ఇంకేమీ పట్టించుకోరు. అదృష్టవంతులు వీళ్ళంటే నాకు విపరీతమైన గౌరవం.
4) కొందరికి మొదట్నుంచే జీవితాన్ని తమకిష్టంవచ్చినట్లుగా మలచుకొనే ప్రతిభాసక్తులుండవు అందువల్ల కానీ ఈగోలు అవీ లేకుండా మొత్తానికి చాలా సంతోషంగా గడిపేస్తారు జీవితాన్ని తమ కంట్రోల్‌లో లేకపోయినా. వీళ్ళంటే నాక్కొంచెం ఈర్ష.
కృష్ణప్రియ గారు!
మీ కెరీర్లో మీరు ఆశించిన శిఖరాలను అందుకొలేకపోయిన నిస్సహయత మీ పోస్ట్ లో స్పష్టం గా కనబడుతోంది.
అంతలోనే మిమల్ని మీరు సముదాయించుకుంటూ, మీ పిల్లల్లో భర్తలో,ఒదార్పు పొందుతూ, మూర్తిభవించిన మీ వ్యక్తిత్వం కనబడుతోంది.
కాని నాదో చిన్న సందేహం!!!
ఇదే ఫీలింగు మీకు మరొక పదేళ్ళు అయ్యాక కలిగితే.? పిల్లల్లో ,చూసుకుంటా అని అనకండి. అప్పటికి వారికి సొంతంగా ఒక కొత్త ప్రపంచం ఏర్పడి పోతుంది..వారి ప్రపంచం లో మీరు అతిధులు మాత్రమే.
కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నా అనుకోవద్దు.ప్రతి స్త్రీ జీవితం లో ఇది మామూలే!!! అలోచించండి.
@ ఇండియన్ మినర్వ,
మీరు చెప్పిన మొదటి కాటెగెరీ లోకి.. ఇష్టపూర్వకం గా వెళ్ళేవాళ్ళుంటారు, అలాగే.. తోయబడ్డవాళ్ళుంటారు, అవసరాన్ని బట్టి వెళ్ళేవాళ్ళుంటారు.. ఆశయం తో వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారని.. నాకనిపిస్తుంది.. కేవలం బద్ధకం ప్రాతిపదిక మీద వెళ్ళేవాళ్ళ విషయం లో (సోమరి దనం తో పిల్లలని ట్యూషన్లకి పంపించేవాళ్ళు...) మీ అభిప్రాయం సరైనదే కావచ్చు :)
2, 4 కాటెగెరీల్లో వాళ్ళ మీద మీ అభిప్రాయం తో నేనూ ఏకీభవిస్తున్నాను hands down!
ఇక ఆడైనా, మగవారైనా.. మూడో కాటెగెరీ వాళ్ళంటే.. నాకు ఒకపక్క గౌరవం ఉంటుంది.., కానీ ఇతర కమిట్ మెంట్లు (ఒకవేళ చేసుంటే.. ) విస్మరిస్తే.. మాత్రం ...
@ r,
You have a point!
పని కోసం బయటకెళ్ళే ప్రతి స్త్రీ కి ఉన్న ద్వైదీ భావాలే ఇవి.. అవును.. నాకు ఒకప్పటి డైరెక్టర్, ఒక వియత్నమీస్ మహిళ, 'నాకు కారీర్ చాలా ముఖ్యం. ఈ విషయం లో ఎలాంటి compromise నేను చేయలేను.. అనుకుని నేను పిల్లల్ని కనలేదు.. అంది. భర్త ఇంకో సంస్థ లో VP.. ప్రపంచం లో అందరు పిల్లలూ నా పిల్లలే.. అని కొందరి చదువూ అదీ స్పాన్సర్ చేసేది.. వారితో అప్పుడప్పుడూ వీలున్నప్పుడు సమయం గడిపి వస్తూ ఉండేది.. అలాగయితే పర్వాలేదు.. కానీ.. అన్నీ కావాలనుకున్నవాళ్ళకి అన్నీ అత్యంత సమర్థవంతం గా చేయగలగటం కష్టం కదా.. మన priorities ని బట్టి మనం జీవితం గడపాలి..
అన్నీ తెలిసినా.. ఒక్కోసారి పురుగు తొలవక తప్పదు.. And.. It''s ok.. అని.. అలా రాశాను..
"మీరు చెప్పిన మొదటి కాటెగెరీ లోకి.. ఇష్టపూర్వకం గా వెళ్ళేవాళ్ళుంటారు, అలాగే.. తోయబడ్డవాళ్ళుంటారు, అవసరాన్ని బట్టి వెళ్ళేవాళ్ళుంటారు.. ఆశయం తో వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారని.. నాకనిపిస్తుంది.. "
ఇప్పుడు నాకు నీ మీదున్న గౌరవం మరింత పెరిగింది.
కృష్ణ గారు, ఏ టపా నుంచి మొదలుపెట్టను వ్యాఖ్య రాయడానికి...
మీ బ్లాగ్ని ఏక బిగిన మొత్తం చదివేసాను మొన్న..నేను దీక్ష గా మీ బ్లాగ్ చదువుతోంటే మా టీం జనాలకి డౌటొచ్చేసింది... :)
చాలా చాలా బాగా రాస్తున్నారు....ఇంతకంటే ఏం రాయాలో తెలియడం లేదు...
మీ టల్లోస్ వంటకం ఐతే అదిరింది... ఈ టపా ద్వారా నా భవిష్యత్తు కొంచెం లీలగా కనిపిస్తోంది... :) చాలా బాగా రాసారు....
@లలిత,
మునగచెట్టెక్కిస్తున్నావు మళ్ళీ :)
@స్నిగ్ధ,
చాలా చాలా థాంక్స్!
@Krishna Priya..
In My Opinion...Education for Women is necessary as they are the ones who are the architects of the next generation....
but...it need not be necessary or it is not a MUST to do a job for women....here my intentions are not to say that women should not work, but just I want to say is it is not a MUSt.....
and...if a woman is working and is growing very fastly in her career, all of a sudden after her marriage...she will face a situation in which she has to decide between her personal life and her professional life....
My advice is Personal Life is the Ultimate thing for anybody and everybody....(for men and women...Personal life is 1st then comes professional life)
I have a cousin sister...she works in IT and her Hubby also in It field....when they got a KID...they simply recruited a NANI to take of that KID and moved on with their professional career....but...can my sister now get back the LOVELY LIFE in seeing THE GROWTH of her own child?????
and....with out our family's support and with out our friend's support we would not have been in this present situation.....so definitely it is our gratitude to maintain the same effection and relation towards our family and dear ones.....this is completely realted with our personal life....
in the name of career growth....One should not MISS personal Life....
P.S:I won't mind if my wife wants to do a job but I will tell her that it should be Personal Life 1st...
Excellent post.
Thanks krishnapriya for taking time and writing such good posts.
hi krishan priyagaru,
though i read ur post very lately ur post inspired me .on thing i got is because of majority of women of of course with support of their husbands our family system is not destroyed. i me had to stop my career after my marriage and now i am having a son couldn't continue.i am bit depressed but now i hope can work soon
Krishnapriya gaaru, mee blog baavundandi. ivala correctga idhe vishyam alochistu vachaanu intiki, naa lanti vaallu inka chaala mande unnaru ani telsindi
anu
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.