స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేస్తున్నా అందరికీ.. ఎందుకంటే..రేపు నేను బిజీ. శ్రావణ శుక్రవారం WFH చేయక తప్పదు. ఉదయం ఒకరింట్లో వాయనం, ఇంకోరింట్లో భోజనం, ఒకళ్ళకి నాలుగింటికి, ఇంకోళ్ళకి ఆరింటికి ఆల్రెడీ సమయం ఇచ్చేసా. పొద్దున్నే లేచి కాస్త ఇంటి పని చూసుకుని, ఆఫీసు పని చేసుకుని, మధ్యలో వాయినాలకి వెళ్లివస్తూ.. ఇక తర్వాత వారాంతం అంతా మా కమ్యూనిటీ లో మరి పంద్రాగస్తు పండగ కి ఏర్పాట్లు చేయద్దూ ?
మా చిన్నది మూడో ఏట పాడిన పాట.. మొన్నటిదాకా ఎవరికి చూపించినా కోప్పడేది. ఈ మధ్యే ఎవరికి వినిపించినా ఏమీ అనట్లేదు. బ్లాగు లో పెట్టుకోవచ్చా? అంటే ఒక చూపు విసిరి 'ఓకే' అనేసింది..
పెద్దదానికీ ఒక దేశ భక్తి గేయానికి నాట్యం పోటీలు స్కూల్లో...
పొడుగు జడలూ, దుపట్టాలూ ఇప్పుడంటే బోల్డు ఇష్టం. మరి పెద్దయ్యాక.. పొట్టి ద్రస్సులూ, చింపిరి జుట్లూ.. ఇష్టమౌతాయేమో తెలియదు.. ప్రస్తుతానికి .. ఇలాగ..
తిరిగి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ.. శ్రావణ శుక్రవారం కూడా అందరూ ఆనందం గా జరుపుకోవాలని ..భావిస్తూ...
కృష్ణప్రియ/
34 comments:
పొడుగైన జడలు..
పొడుగైన దుప్పట్టాలు..
పొడుగైన వారాంతాలు..
ఏంటో అంత పొడుగైన లోకం లా ఉంది.
స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !!
హ హ మీ పాప గొంతు తో పాటు మీ గొంతు కూడా విన్నాను , సో స్వీట్ చక్క గా పాడింది ! ఆ జడలు , చున్నీల పిచ్చ చిన్నప్పుడు అందరికి ఉంటుందేమో :))
మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !
నాకెందుకో "పచ్చ" ఎక్కువయ్యి అనుకుంటా, పక్క దేశం కనిపిస్తొంది! క్షమించండి.
మీకూ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు .
@ శరత్ ,
ఊరక రారు మహాత్ములు! :) థాంక్స్!
@ ఆత్రేయ,
:) అన్నీ పొడుగ్గా ఉన్నాయి అని టపా సైజు కత్తిరించేశా!
థాంక్స్..
@ శ్రావ్య,
:) కదూ. ఆసంగతే ఆలోచించలేదు. నా అద్భుతమైన గాత్ర మాధుర్యాన్ని ఇంతకాలం బ్లాగ్లోకానికి పరిచయం చేయలేదు. ఈ టపా తో ఆ లోటు తీరిపోయింది.
వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు సైజు తగ్గుతుంది :) ఇక బట్టల సైజ్.. no comments!
గాలి గారు,
మీరన్నాక నాకూ నిజమే అనిపిస్తుంది కానీ.. కాషాయం పాలు కూడా ఎక్కువే ఉంది. (మీటర్ల లెక్కన :) )
మాల గారు,
చాలా థాంక్స్!
గాయని కృష్ణ గారూ జిందాబాద్!!
బాగున్నాయి మీ పిల్లల డ్రస్సెస్ మరియు డాన్స్ పోజులు..నాకూ నేను మా చెల్లెలు ఇలాంటి పోజుల్లో ఫొటోలు దిగిన సంగతి గుర్తొచ్చింది...:)
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు... పంద్రాగస్టు శుభాకాంక్షలు కూడా...
మూడవ ఏటి కల్లా పాపకి దేశభక్తి ని నూరి పోసిన మిమ్మల్ని ఏమని పొగడాలో :) చక్కగా ఉ౦ది పాప ట్యూన్ . మీ స్వర౦ తో ఆగస్ట్ పదిహేను, జాతీయ గీతం ప్రాముఖ్యత మళ్ళీ గుర్తుచేశారు.
అ౦దరినీ ఒక్కసారి మేల్కొలిపేసారు
మైత్రి పాటా, అంతకు మించి తన డౌటూ బాగున్నాయండీ :)) మీక్కూడా శుభాకాంక్షలు..
మీ పాప మాటా, పాటా కూడా బాగున్నాయండీ. :) మీకూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
:))
>>patriotic songs పాడేటప్పుడు ఎందుకు చాలా సాడ్ గా మొహం పెడతారు.
Struggle behind independence :)
మీక్కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
చిన్న టపాకాయ్ దడదడలాండించేసింది. భలే భలే! పేట్రియాటిక్ సాంగ్ ఎవరు పాడినా మొహం మాడ్చుకునే పాడుతారు కానీ, మీ చిన్న బంగారం "జడగడ మణ" విని ఫక్కున నవ్వుకోకుండా ఉండలేకపోయాను. లేచి నిలబడమని ముందే చెప్పొచ్చుకదండీ, నవ్వుకుంటూ లాప్టాప్ పట్టుకు నిలబడీ వింటున్నా మరో సారి. క్యూట్.
మీక్కూడా ఆగష్టు పదిహేను జేజేలు.
హ్హహ్హహ్హా! మీ పాప బుజ్జిబుజ్జిగా భలే పాడిందండీ :)) మళ్ళీమళ్ళీ పెట్టుకుని విన్నా! ఎంత అమాయకత్వమో కదా! ఏమీ అర్ధం తెలీదు ఆ ఏజ్‌లో! అయినా ఎంత ముద్దుగా పాడిందో! ఈ జడ,చున్నీ ల పిచ్చితోబాటు పూల పిచ్చి కూడా ఉండాలే! ;)
మీకు వరలక్ష్మి వ్రతం,మరియు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు :)
good..
meeku svatantra dinotsava subhakankshalu...
@ స్నిగ్ధ,
అదిగో.. అందుకే నాలో గాయనిని ఇంతవరకూ ప్రపంచానికి పరిచయం చేయనిది. జేజేలు అంటే నాకు తగని సిగ్గు ;)
@ మౌళి,
అబ్బే.. :) చాలా మంది పిల్లలు పాడటారు. ఇంట్లో పెద్దపిల్లలు స్కూల్లో నేర్చుకుంటారు కదా.. ట్యూన్ వచ్చేస్తుంది కానీ లిరిక్స్ రావు.
Anyways thanks!
@ శిశిర,
:) థాంక్స్!
@ a,
థాంక్స్!
@ హరే కృష్ణ,
:) బాగుంది బాగుంది. మీ రిచ్చిన వివరణ!
@ కొత్తావకాయ,
:) థాంక్స్! ఈ పాట ఎవ్వరికీ ప్లే చేసినా ఒప్పుకునేది కాదు. ఇప్పుడిప్పుడే ఊరుకుంతోంది.
@ ఇందు,
ఆ ఎందుకు లేవు.. ఉన్నవే పిచ్చులు :) అన్ని ఉన్నాయి :) అలా అంటే గుర్తొచ్చింది 'ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది!' అనగానే ,మా అమ్మాయి.. 'ఏంటి? మంచా?' అంటుంది.:)
@ సాయి,
థాంక్స్!
సాడ్ గా కాదు గంభీరంగా పెడతారు. ఎందుకంటే దేశభక్తి అంటే ఆషమాషీ కాదు, దైవ భక్తి ఎలాంటిదో, ఇది కూడా అంతే అని. గుడిలో దేవుణ్ణి పూజించేటప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండం, కాని అక్కడ విచారంగా ఉన్నమని కాదు కదా? నాకు ఏ దేశభక్తి గీతం పాడినా గుండె గొంతులో కొట్టుకుంటుంది. నేను, నా దేశం అనే భావన చాలా overwhelming గా ఉంటుంది.
మ్మ్...ఇంకా, పిల్లలకి తెల్లని కుర్తాలు కుట్టించవలసింది. మొత్తం మూడు రంగుల్లో ముచ్చటగా ఉండేవారు :)
>> patriotic songs పాడేటప్పుడు ఎందుకు చాలా సాడ్ గా మొహం పెడతారు.
She will grow and will be able to diffrentiate between Sadness and solemn emotion..
I guess you might have already told that to her :)
@ Ruth,
Well said!!!
అలాగే మీరు చెప్పిన రెండో పాయింట్ :-((( నిజమే నండీ..తట్టలేదు.. తెల్ల కుర్తాలు infact ఉన్నాయి కూడా..
'పొడుగైన వారాంతం ' టపా కి వ్యాఖ్య ఉంచిన వారాంతం గారు, :)
అవును.పైన రుత్ గారు చెప్పిన విధం గా నేను చెప్పాను... అలాగే ఎంజాయ్ చేస్తూ తన్మయత్వం తో ఆనందం గా మనోజ్ కుమార్ పాత పాటలు చూపించాను.
>> అలాగే ఎంజాయ్ చేస్తూ తన్మయత్వం తో ఆనందం గా మనోజ్ కుమార్ పాత పాటలు చూపించాను.
I do not know much about Manoj Kumar songs so I can not comment on "ఎంజాయ్ చేస్తూ తన్మయత్వం తో ఆనందం గా.."
Your choice..:)
హహహహ మీ చిన్నదాని పాట...కేక అసలు. బలే పాడింది ముద్దుముద్దుగా, తనిష్టం వచ్చినట్టు. మీరు ఇది రాసి బ్లాగులో పెట్టాలి. ఆ పదాలు ఎలా మార్చిందో తను పెద్దయాక చూసుకోవడానికి బావుంటుంది. :)
గజసుకమాలే, బెల్లగీమె...ఇది వింటే ఏదో కన్నడ పాటలా ఉంది. జనగణమణ ని కన్నడలోకి మార్చిన ఘనత మీ చిన్నదానికే దక్కుతుంది. :D
It is almost like.. they are really not thaaat happy being Indians...'....హమ్మో ఎంత పెద్ద ప్రశ్న అడిగేసింది!
అమ్మో మీ అమ్మాయికి ఎంత పెద్ద జడలండీ...అవి వెయ్యడానికి మీకెంత ఓపికో!
పెద్ద జడలు, పొడుగు చున్నీల ఇష్టం ఆ వయసులో అందరికీ మామూలే!
పొడుగు వారాంతాన్ని బాగా ఎంజాయ్ చెయ్యండి మరి.
మళ్ళీ మళ్ళీ వింటుంటే డౌటొస్తున్నాది. మీ పాప పాడినది కన్నడ పాటా?
చాలా ముచ్చటగా ఉందండి మీ పాటపా (పాటపా =పాప పాట + టపా ==> పాట కలిసిన టపా ) . మీక్కూడా స్వతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
@ సౌమ్య,
:) థాంక్స్ ఎన్ని సార్లు విన్నా నాకు తనివి తీరదు. ఇది సాక్షాత్తూ భారత దేశ జాతీయ గీతమే! అక్క పాడుతుంటే విని ట్యూన్ ని మాత్రమే పట్టింది :)
ఇంకో పాట ఉంది ఇలాంటిదే.. మీకు మెయిల్ చేస్తా.
హమ్మయ్య.. మా అమ్మాయి జడలని చూసారా? ఉదయం అదొక పెద్ద పని నాకు. కాకపొతే క్లాస్ లో అందరికన్నా పెద్ద జడలున్న అమ్మాయి గా ఒక గుర్తింపు తెచ్చి పెట్టాయి అవి దానికి ఇప్పుడు :)
@ మహీధర రెడ్డి గారు,
:) థాంక్స్! ఇక సోమవారం అంతా పంద్రాగస్టు పై టప టపా .. టపాలు రాలతాయి ఎలాగూ.. అందువల్ల నా పాటపా నిన్ననే వేసేసా! :)
చాలా బాగున్నాయి కృష్ణప్రియగారూ..మీ అమ్మాయి పాట ఇంకా తన ఆహార్యం.. :)
మీ అమ్మాయిలిద్దరి ఆలోచనా సరళి చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది. వారిలో అలాంటి ఆలోచనలను పెంపొందిస్తున్నందుకు మీ ఇరువురికీ అభినందనలు :-) మీ అమ్మాయి పాట, మీ పాట కూడా బాగున్నాయ్ :-)
ఓపికగా అంత పెద్ద జడలు వేసి స్కూలుకు పంపిస్తున్నందుకు మీకు బోల్డు అభినందనలు :-) పెద్దయ్యాక కూడా ఆ జుట్టును జాగ్రత్తగా సంరక్షించుకుంటారని బాబ్డ్ స్టైల్ లోకి మారరని ఆశిస్తున్నాను.. (నీకేం బాబు ఎన్నైనా చెబుతావు మెయింటెనెన్స్ ఎంత కష్టమో నీకేం తెలుసు అంటారా :-)
KRISHNA PRIYA GARU ,,,
హ్హహ్హహ్హా! పాప బుజ్జిబుజ్జిగా భలే పాడిందండీ :)) మళ్ళీమళ్ళీ పెట్టుకుని విన్నా! ఎంత అమాయకత్వమో కదా! ఏమీ అర్ధం తెలీదు ఆ ఏజ్‌లో! అయినా ఎంత ముద్దుగా పాడిందో!
మీకు వరలక్ష్మి వ్రతం,మరియు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు :)
పొడుగైన జడలు..
పొడుగైన దుప్పట్టాలు..
పొడుగైన వారాంతాలు..
MARI MEE BLOG EE MARII POTTIDAIPOI ... AYYOO APPUDE AIPOINDAA....ANI EDO TELIYANI DISAPPOINTMENT(CHINNAPPUDU VARAMANTAA DD LO CHITRALAHARIKOSAM WAIT CHESI ..AA CHIRALAHARI KASTHA OKKA KOTT CINEMA PAATATHO TWARAGA MUGINCHESINANTA BHADAGA ).
MAA BUJJI MEDAM TANA INTELLIGENCE NI MAROSARI NIRUPINCHUKUNDI ..
SARE IKA SELAVU ....
JAYA JAYA JAYA JAYAHE ...
JAI HIND
ITLU
BALA GANGADHAR THRILOK
( NAA COMMENT LO CHINNA MARPU GAMANINCHI UNTARU ... BADDAKAM MARI :p)
పాటల పోటీలో ప్రథమ స్థానం గెల్చుకున్న అమ్మాయిని ఇలా పరిచయం చెయ్యడం ...:)
సరే చేసేశావు కదా, ఇక మంచి పాటొకటి వినిపించు.
హహహ్హహ.. భలే క్యూట్ గా పాడింది మీ పాట! అన్నట్టు, మీరు మాత్రం కనీసం ఒక్క పాటైనా మొత్తం పాడి వినిపించాలి మా కోసం.. :)
జడలూ, డ్రస్సులూ.. మరీ ముఖ్యంగా చున్నీలు సూపర్ గా ఉన్నాయి. నిజమే.. చిన్నప్పుడు చున్నీలు వేసుకునే డ్రస్సులు ఎప్పుడొస్తాయా అని తెగ ఎదురుచూసేవాళ్ళం కదా! చాలా నవ్వొస్తుంది అవన్నీ గుర్తొస్తే.. :))
మీకో కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
మీ పోస్ట్ కొంచెం లేట్‌గా చదివాను. మన్నించండి. మీ అమ్మాయి బాగా పాడిందండి. అంటే పాడకపోయినా పాడలేదని చెప్పం కదండి ; )
Just kidding. నిజంగానే బాగుంది. మీక్కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
janagana mana superu madam....
హ హ పాప బాగా పాడిందండి :)
@ రవికిరణ్,
థాంక్స్,
@ వేణూ శ్రీకాంత్,
ఈ కాలం అందరు పిల్లలూ ఇంతే :) నా చేతిలో శక్తి, వాళ్లకి ఆసక్తి ఉన్నంత కాలం వాళ్లకి పొడుగు జడలు. :)
ఇక నా పాట బాగుందన్నారు.. ఇక ఆగేది లేదు. ఈ మాత్రం ప్రోత్సాహం చాలు నాకు. బ్లాగ్కచేరీ పెట్టించేస్తా త్వరలో..
@ థ్రిల్,
:) థాంక్స్!
@ లలితా,
:) తప్పక వినిపిస్తా త్వరలో..
@ మధురవాణి,
:) థాంక్స్.. ఇలాగ మొహమాట పెట్టేస్తే నేను పాడేస్తే తర్వాత వినలేక మీరు మొహమాట పడాల్సి వస్తుంది.
@ చాణక్య,
భలేవారే.. లేట్ గా చదివి మన్నించండి అంటే సరిపోతుందా? షో కాజ్ నోటీస్ ఇస్తున్నాను. కారణాలు వివరించండి. :)
జస్ట్ కిడ్డింగ్! మీరు చదవడమే నాకు గొప్ప! థాంక్స్.
@ రాజ్,
:) నువ్వు ముందే విన్నావు కదా
@ బంతి,
:) థాంక్స్!
ఆ.. తప్పకుండా. నోటీస్‌తో పాటు నోట్లు కూడా పంపండి. రాయడానికి కొంచెం శక్తి వస్తుంది. ; )
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.