సరస్వతి :
కొత్తింటికి మారుతూనే నేను గమనించిన మొదటి మనిషి, పక్కింటి పనిమనిషి. ఒక యాభయ్యేళ్లుంటాయి. తలుపు కొడుతూ ‘యశోదా! ఓ యశోదా! తెలుపు తీయి.. ‘ అని అరుస్తోంది. ‘అమ్మగారో! అమ్మా! మాడం!..అక్కా! భాభీ!’ ఇలాంటి పిలుపులు విన్నాను కానీ ఇలాగ పేరు పెట్టి, పైగా ఏకవచనంలో పిలుస్తోంది. అని బుగ్గలు నొక్కుకున్నాను. సదరు యశోదా దేవి ‘వరేన్ సరస్వతక్కా’ అని తలుపు తీసేది. తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే.. మనమూ అంతే గా.. మా నాన్నగారు వాళ్లు, మా కన్నా ఒక పది ఏళ్ల క్రితం వరకూ ఉద్యోగాల్లో పై అధికారిని, ‘సార్..మాడం..’ అని పిలిచిన వారే గా.. మరి నేను మా బాసు గార్ని ‘హే రాజేశ్! సంజయ్! రూడీ.. సామ్సన్ ‘ అని పిలవట్లా! ఇదే మార్పు మనకి పనిచేసే వారు చేస్తే మాత్రం ఏంటి.. ఎక్కడో ముల్లు లా గుచ్చుకుంటోంది? నాలో ఇంకో బలహీనత అర్థం అయింది. ఈ మార్పు ని ఆహ్వానించాను.
అన్నట్టు ఒకటి గమనించానబ్బా.. నా చిన్నప్పుడు మా అమ్మా వాళ్లూ మామూలు చీరలైనా కాస్త శుభ్రమైనవి, రంగు వెలవని చీరలు కడితే, మా పని మనుషులు ఏ రంగో గుర్తుపట్టలేని చీరలు, ఒక్కోసారి మాసికలతో,అతుకులతో ఉన్న నాసిరకం చీరలూ, మోకాలు కిందకి ఎగ్గట్టి కట్టి, నేల మీద ఓ బండ మీద కూర్చుని అంట్లు తోమేవారు. కొంతమంది శుభ్రం గా స్నానం చేసి తలకి నూనె రాసుకుని, వచ్చినా కొద్దిమంది స్నానాలు రెగ్యులర్ గా చేసేవారు కాదు.
మరి ఇప్పుడో? బెంగుళూరు సాఫ్ట్వేర్ జనాభా లో ఆడవారు వెలిసినట్టున్న లేత రంగుల గుడ్డలు, మోకాళ్ల కిందకి పాంట్లు, టీ షర్టులూ వేసి తలకి కర్లర్లు, సింగినాదాలూ పెట్టి, పనులు పురమాయిస్తుంటే, సీతాకోక చిలకల్లా రంగు రంగుల చీరల్లో మాంచి ఫాషన్ గా, అందం గా జడలేసుకుని, బొట్లు గాజులు, తలలో పూలతో, లక్ష్మీ దేవుల్లా మెరిసిపోతూ వస్తారు. నాకైతే పొద్దున్నే చాయ్ తాగుతూ మా ఇంటి ముందు వెళ్లే చీరల్ని గమనించటం ఒక హాబీ అయిపోయింది.
సరస్వతీ అంతే. భలే చక్కని స్త్రీ. కొత్తింట్లో చేరిన పది రోజుల్లో అర్థమైంది.. కనీసం పదిళ్లల్లో తనే చేస్తుందని. తన వయసుకి అంత వేగం గా, సమర్థవంతం గా అసలు ఎలా చేయగలదు? అన్నది గమనించనారంభించాను. వస్తూనే గడ గడా ఎంత వాగినా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఏదో పని చేస్తూనే చేస్తుంది. తన పని అవుతూనే, వాక్యం మధ్యలో ఉన్నా, పత్రికల్లోసస్పెన్స్ సీరియళ్లలా వదిలేసి తర్వాతింటికి వెళ్లిపోతుంది.
చుట్టూ పరిచయాలు పెరిగాక ఇంకొన్ని వివరాలు తెలిశాయి. పిల్లల్లేరని, సరస్వతి భర్త తనని వదిలి ఇంకోపెళ్లి చేసుకుని వెళ్లిపోయాడట. కొంత కాలం దుఃఖ సాగరం లో ములిగినా తాగి భార్య ని కొట్టి పైసలు గుంజుకుపోయే భర్త వల్ల కష్టాల్లో ఉన్న పక్కింటి పిల్లల పెంపకం బాధ్యత నెత్తి మీదకి వేసుకుందని.. వాళ్ల చదువుల కోసం శక్తి కి మించి పని చేస్తుందని..
అన్నేసి ఇళ్లు చేస్తుంది కదా.. ‘ఎలాగూ మళ్లీ సాయంత్రం రావాలి .. ఇంటికెళ్లటం దండగ!’ అనుకుని కాలనీ లో ఒక చంటి పాపాయి ని మధ్యాహ్నం రెండు గంటలు ఆడించటానికి కుదురుకుంది. డబ్బు మాత్రం పుచ్చుకోలేదు. ‘ఎందుకు సరస్వతీ.. నీ విశ్రాంతి సమయం ఇదీ.. ఎలాగూ పిల్లని చూస్తున్నావు.. గంటకి ఇంతా అని మాట్లాడుకోవచ్చుగా!’ అని అడిగాను.
‘క్రిష్ణప్రియా! నువ్వు కరెక్ట్ గా చెప్పావు. ఇది నా విశ్రాంతి సమయం. డబ్బు పుచ్చుకుని చంటి పిల్లని చూస్తే.. అది విశ్రాంతి సమయం ఎందుకవుతుంది? ఏం? నాకు విశ్రాంతి అవసరం లేదా?” అంది. గుండె నిండిపోయింది. మళ్లీ నేను నోరెత్తలేదు. ఈలోగా తనే అనేసింది.. “ఏ జన్మ లో చేసిన పాపానికో.. ఈ జన్మలో బిడ్డలు పుట్టలేదు. ఏమో! ఏం తెలుసు? కనీసం ఈ విధం గా నైనా పిల్లలకు సేవ చేసుకుంటే వచ్చే జన్మ లో తల్లినవుతానేమో ‘ అంది. నేను తలెత్తి చూశాను. ‘సినిమాల్లో/కథల్లో లాగా.. కన్నీటి తెర అడ్డుకోవటం, తల తిప్పేసుకోవటం లాంటివి ఏమీ లేవు.. చాలా చాలా మామూలు గా చెప్పింది.
కొన్నాళ్లకి, ఒక పది రోజులు రాలేదు. తన పక్కింటి వారి పెద్ద కొడుకుకి చెడు స్నేహాలకి మరిగి, చదువు పెక్కన పెట్టి, ఖర్చులకిచేతిలో డబ్బు ఆడట్లేదని నెత్తి మీద మోది మరీ తన తాగుడు కోసం దాచుకున్న డబ్బంతా ఎత్తుకుపోయాడని చెప్పింది. ‘మరి ఎందుకు నీకు ఈ ఆరాటం! ఎవరి గురించీ బాధ పడకు. నీ సంగతి నువ్వు చూసుకో..’ అని అందరూ చిలక్కి చెప్పినట్టు చెప్పారు. వినలేదు. ‘వాడు కాకపోతే, ఇంకా ఉన్నారు గా పిల్లలు! వాడి తప్పు వల్ల మిగిలిన పిల్లలు ఎందుకు శిక్షింపబడాలి?’ అని నవ్వేసి తన పనులు అలాగే చేసుకుంటూ వెళ్లిపోయింది.
ఏంటో, మెలకువ ఉన్న ప్రతి నిమిషమూ, నాకోసం, నా వాళ్ల కోసం ఆలోచించటం, ఇతరుల కోసం, కొద్దో గొప్పో ఆలోచించినా, ఆచరణ కి మాగ్నిట్యూడ్ లో ఏమాత్రం పొంతన లేదనిపించింది. కానీ, ‘ఆ.. ఒంటరి గా ఉంది కాబట్టి ఇరుగూ, పొరుగూ, కష్టం, సుఖం అని మాటలు చెప్తోంది. తనకంటూ కుటుంబం ఉండి ఉంటే ఏమనేది.. తనూ సంసార సాగరం లో ఈదుతూ, మూలుగుతూ, తేలుతూ ఉండేది లే.. అని నాకు నేను సద్ది చెప్పుకుని, దులిపేసుకున్నాను.
తన వైద్యానికి, ఖర్చులకీ, ‘చాలా ఉదారం’ గా ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి, నాకు నేనే శబాషీలిచ్చుకుని, నా అహాన్ని సంతృప్తి పరుచుకున్నాను.
(ఇంకా ఉంది)
46 comments:
కృష్ణ ప్రియ గారూ ఈ సరస్వతిని పూజించవలసిందే నండీ..ఇలాంటి వారిని చూస్తుంటే మన పరిమాణం మనకు అర్ధం అవుతుంది కాదూ..మీ టపాలు ఎవరికోసమో వ్రాస్తున్నట్లుండదు..మీలో మీరు మాట్లాడుకున్నట్లుగానో లేకపోతే ఓ స్నేహితురాలితో మనసు పంచుకు౦టున్నట్లుగానో ఉంటాయి. మంచి విషయాలు పంచుకుంటున్నందుకు మీకు ధన్యావాదాలు.
VERY GOOD AND INTERSTING
నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా ఉందండి... ఈ మధ్యన పనిమనిషిలు ఇలానే చాలా ఫాస్ట్ గా ఉంటున్నారు.. మా అమ్మా వాళ్ల పని మనిషి ఇలానే పది ఇళ్ళలో చేస్తుంది.ఎక్స్ప్రెస్సే !
సరస్వతి గారు లాంటి వారికి నిజంగా పాదాభివందనం చేయాలి. అన్నీ ఉండి సహాయం చేయడానికి ఆలోచించేవారు ఎక్కువయిన ఈ రోజుల్లో ఆవిడ అలా అంత మానవతతో ఉండటం నిజంగా ప్రశంసనీయం! నా అహాన్ని సంతృప్తి పరుచుకున్నాను అన్నారు కానీ నాకెప్పుడూ మీలో అహం కనిపించలేదు మీ మదిలోని భావాలని కూడా నిజంగా మీ డైరీలో పొందుపరుచుకున్నట్టు అన్నిటినీ (మదిలోని భావాలని కూడా) చక్కగా చెప్పేస్తారు
>>డబ్బు పుచ్చుకుని చంటి పిల్లని చూస్తే.. అది విశ్రాంతి సమయం ఎందుకవుతుంది? ఏం? నాకు విశ్రాంతి అవసరం లేదా?”<<
అబ్బ ఎంత బాగా చెప్పారండీ ఆవిడ!
waiting for next post!
నిజమే కదా. ఇలాంటి మనుషులు అప్పుడప్పుడు మనలోని మంచిని, మానవతని మేల్కొలుపుతారు. మీ వ్యాఖ్యానం లోని నిజాయితీ ని మెచ్చు కుంటున్నాను. మన మందరం అంతే. మళ్ళీ కధ మామూలే. మనం మనమే. మన జీవితం మనకే.
హ్మ్మ్.. బావుంది టపా ఎప్పట్లాగే మీ మార్కు నెరేషన్ తో..
>>"వెలిసినట్టున్న లేత రంగుల గుడ్డలు, మోకాళ్ల కిందకి పాంట్లు, టీ షర్టులూ వేసి తలకి కర్లర్లు, సింగినాదాలూ పెట్టి, పనులు పురమాయిస్తుంటే,"
కొన్నిసార్లు స్నానాలూ గట్రా లేకుండా కూడా కదా :)
పని మనిషి ఐనా చాలా మంచి హృదయం కలదానిలా వుంది సరస్వతి .ఎంతైనా అలాంటి వాళ్ళు అరుదు గా వుంటారు .
1. శుభ్రం గా స్నానం చేసి తలకి నూనె రాసుకుని వచ్చి మనింట్లో నానా చెత్త పనులన్నీ చెయ్యటం కంటే అవన్నీ అయ్యాక ఇంటికెళ్ళి శుభ్రం గా స్నానం చేసి తలకి నూనె రాసుకోవడం బెటర్
2. >>ఒక్కోసారి మాసికలతో,అతుకులతో ఉన్న నాసిరకం చీరలూ, మోకాలు కిందకి ఎగ్గట్టి కట్టి, నేల మీద ఓ బండ మీద కూర్చుని అంట్లు తోమేవారు
అతుకులతో ఉన్న నాసిరకం చీరల సం రక్షణ ముందు తాము చక్కగా కనబడటం అంత ప్రాముఖ్యం అనిపించదు.
సరస్వతి గారిలా ఉండటం అంత అసాధారణమేమీ కాదండీ. అన్ని ఆర్థిక స్థాయిల్లోనూ చాలా మంది మనుషులు అలాగే ఉంటారు. అన్ని ఆర్థిక స్థాయిల్లోనూ అన్ని రకాల వాళ్ళూ ఉంటారు. బహుశా డబ్బులేని వాళ్ళ మామూలు జీవితాల గురించి అంతగా తెలియని వాళ్ళకి కొద్దిగా అసాధారణంగా ఉండొచ్చు అందువల్ల ఎక్సెప్షన్ లా కనిపిస్తుంది. పనిమనిషికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది అని ఎప్పుడూ అర్థం చేసుకునే అవకాశం రానివాళ్ళకి డ్రమటిక్ గా ఉండి భలే మనసులో నాటుకుపోతుంది విషయం.
మీ టపాలో ఆవిడ పనిమనిషై కూడా ఇలా ఆలోచించగలిగింది అనే భావం లేకపోవడం నాకు బాగా నచ్చిన అంశం.
మీరు చక్కగా రాశారు. మీరు చల్లగా ఉండాలమ్మా.. చల్లగా ఉండాలి. నేనింకా చాలా రాశాను మీకు కన్నీటి తెర అడ్డొచ్చి కనబడట్లేదంతే :)
ఇలా పేర్ల తో పిలిచే అలవాటు సిటీలలో అంత గా కనపడదు కానీ, ఊర్లలో ఎక్కువే కదా ?
కొంచెం మీ అన్ని పోస్ట్లో , ఈ పోస్ట్కు కొంచెం తక్కువ రేటింగ్ ఇస్తాను నేను :))
@ జ్యోతిర్మయి గారు,
ధన్యవాదాలు. నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తుల ఆలోచనా సరళి కీ, నేనాలోచించే విధానానికీ, ఉన్న తేడా, చెప్పాలనిపించి రాస్తున్నాను..
@ కష్టేఫలే శర్మ గారు,
ధన్యవాదాలు.
@ తృష్ణ గారు,
అవును. ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత సంపాదన :)
@ రసజ్ఞ,
ధన్యవాదాలు..
@ సౌమ్య,
ఎల్లుండి రాస్తాను రెండవ భాగం...
@ బులుసు గారు,
కరెక్ట్ గా నేను చెప్పదలచుకుంది అదే.. మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు..
@ WP,
థాంక్స్. జస్ట్ నన్ను ఆకర్షించిన చిన్న మార్పు.. చెప్పానంతే.. No big deal really..
@ మాల గారు,
ఆర్థికం గా మంచి పరిస్థితి లో లేకపోయినా, రేపటి గురించి చింత లేని మనిషి, చిన్న గోల్ తో,కష్టపడుతున్న మనిషిని రోజూ చూడగలగటం నాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది..
చూసే కనులకు మనసుంటే ప్రతి వ్యక్తిలోను, ఏదో ఒక ప్రత్యేకత కనపడుతుంది.
@KP,
జస్ట్ ఫన్ కోసం మీ అబ్జర్వేషన్ కి కొద్దిగా పొడిగింపు ఇచ్చానంతే. I know its not a big deal :)
మీరు గొప్పగా ఆలోచిస్తారండీ, కానీ మామూలుగా ఉండగలుగుతారు. మీకు అహం అంటదు అయినా అహం ఎక్కడుంది లెండి. ఎప్పుడో చంపి పాతరేసినట్టే ఉన్నారు. మీ పోస్ట్ చదివినప్పుడు మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అనుకుంటాను. ఇది నిజం.
పేరు పెట్టి పిలువడం లో పెద్ద మార్పేమీ కనిపించలేదు,మీరు మార్పును ఆహ్వానించారని అనుకోవడమూ లేదు .అసలా అవకాసం ఆమె మీకు ఇవ్వాలి కదా ముందు :) మీ కాలని లో పిన్ని గారు, బాబాయ్ గారు, గారు, అండి, అక్కయ్య, అన్నయ్య గారు, వదినగారు, నా తలకాయ్ ..ఇవ్వన్ని పిలుచుకోకుండా పేరు తోనే కదా పిల్చుకుంటారు :)
>తనూ సంసార సాగరం లో ఈదుతూ
ఆమె గురించి నేను ఊహించి చెప్పడం సరి కాదు కాని, పిల్లలున్నా ఆమె అలానే ఉంటె, ఆమె పిల్లలకి పిసరంత నష్టం కూడా జరిగేది కాదు :)
:) :) :) :)
>>"ఎక్కడో ముల్లు లా గుచ్చుకుంటోంది? నాలో ఇంకో బలహీనత అర్థం అయింది. ఈ మార్పు ని ఆహ్వానించాను."
ఇంత నిజాయితీగా ఎంత మంది రాయగలరు ? రాయగలగటం అటుంచి ఇలా ఆత్మ విమర్శ చేసుకోగలగడం చాలా గొప్ప సంగతి.
మీ ఉన్నతమైన వ్యక్తిత్వం, వినయ విధేయతలూ చాలాకాలం నుంచి బ్లాగులు చదువుతున్న నాతో మొదటి సారిగా కామెంటు రాపించాయి.
చాలా బాగుందండీ.. కొనసాగింపు కోసం ఎదురు చూస్తున్నాను.
హ్మ్మ్... నాకేమ్ కమెంటాలో తెలియటం లేదండీ..
బ్లాంక్ గా ఉందీ. రెండోసారి చదివినా కూడా..
అయ్యా, ఈ KP ఎవరా అని, ముందు నాలుగయిదు వ్యాఖ్యతల పేర్లు కుడా చూసి అప్పుడు వెలిగింది :) , మార్పుని ఇక్కడ ఇంకొకరు కుడా ఆహ్వానించారని :D
కృష్ణప్రియ గారూ, ముఖ్యంగా మీ టపాల్లో నాకు బాగా నచ్చే అంశం, మీ చుట్టుపక్కలా జరిగే సంఘటనల్లోంచో, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లోంచో మంచిని గ్రహించి నలుగురికీ పరిచయడం చేయడం. గొప్ప వారిగురించి అందరికీ ఏదోలా తెలుస్తుంది.. కానీ మన చుట్టూ ఉండే వారి మంచి లక్షణాల గురించి? మీ ప్రయత్నం నాకు చాలా నచ్చింది:)
మధ్యలో కొన్ని టపాలు మిస్ అయ్యాను అనుకోకుండా:( ముఖ్యంగా ఆర్ముగంలోని కోణాలు:) అన్నీ చదివెయ్యాలి వీలు చూసుకుని:)
మీలో నాకు నచ్చే విషయం...మీలో మీరు -ve అనుకున్నవి...మీరు తప్పుగా అలోచించాను అనుకున్నవి ఎంత ధైర్యంగా రాస్తారు...
@ FM గారు,
<<<<సరస్వతి గారిలా ఉండటం అంత అసాధారణమేమీ కాదండీ. అన్ని ఆర్థిక స్థాయిల్లోనూ చాలా మంది మనుషులు అలాగే ఉంటారు. అన్ని ఆర్థిక స్థాయిల్లోనూ అన్ని రకాల వాళ్ళూ ఉంటారు.
------నిజమే.. పాత సినిమాల్లో లాగా, బీదవారంతా మంచివారు, డబ్బున్న వారికి హ్రుదయాలుండవు.. అనుకోవట్లేదు :)
ఆర్ధిక స్థాయి అంత తక్కువ ఉన్నా.. ఆహా ఎంత మంచి మనసు!! అని నేనెక్కడా అనలేదనుకుంటున్నాను. గత ఐదేళ్లు గా దాదాపు ప్రతి రోజూ చూస్తున్న ఒక మనిషి గా మాత్రమే రాస్తున్నాను.
<<<< బహుశా డబ్బులేని వాళ్ళ మామూలు జీవితాల గురించి అంతగా తెలియని వాళ్ళకి కొద్దిగా అసాధారణంగా ఉండొచ్చు అందువల్ల ఎక్సెప్షన్ లా కనిపిస్తుంది.
---- హ్మ్. ఒక ఎక్సెప్షన్ అన్నట్టు రాశానా? డబ్బు లేని వాళ్ల జీవితాల గురించి అంతగా తెలియదని...ఎందుకలా అనుకుంటున్నారు? సరస్వతి ఒక అసాధారణ మహిళ .. అని అనట్లేదు. సరస్వతీ,నేనూ,మేరీ అందరమూ
మామూలు మనుషులమే, మా ముగ్గురివీ మామూలు జీవితాలే.
<<<<<<పనిమనిషికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది అని ఎప్పుడూ అర్థం చేసుకునే అవకాశం రానివాళ్ళకి డ్రమటిక్ గా ఉండి భలే మనసులో నాటుకుపోతుంది విషయం.
------ పురిటి కందునుండీ, పండు ముసలి మనిషి దాకా వ్యక్తిత్వం, సొంత ఆలోచనా లేని వారెవరైనా ఉంటారా?
మీ టపాలో ఆవిడ పనిమనిషై కూడా ఇలా ఆలోచించగలిగింది అనే భావం లేకపోవడం నాకు బాగా నచ్చిన అంశం.
థాంక్స్!
<<<<మీరు చక్కగా రాశారు. మీరు చల్లగా ఉండాలమ్మా.. చల్లగా ఉండాలి. నేనింకా చాలా రాశాను మీకు కన్నీటి తెర అడ్డొచ్చి కనబడట్లేదంతే :)
---- ఇది కొంచెం ఎక్కువైందనుకుంటా? :)
హ్మ్.. నా వ్యాఖ్య మిమ్మల్నుద్దేశించి కాదండీ. అది మీరు అర్థం చేసుకున్నట్టు లేరు :(
@ శ్రావ్య,
ఈ టపా రాశాకే చాలా మంది దగ్గర్నించి ఈ మాట విన్నాను. నా వరకూ, ఇదే మొదటి సారి వినటం. మా కాలనీ లోకూడా సరస్వతి నుండి తప్ప, వేరెవరి నుండీ, పేరు తో పిలవటం.. (అంటే,.. సుశీలమ్మా.. అంట్లు వేయి.. అన్నది విన్నాను. సుశీలా అంట్లు వేయి.. అంటే.. ఇంటావిడ 'అలాగే సరస్వతక్కా' అనటం, నేను చూడటం ఇదే మొదలు.)
బెంగళూరు,హైదరాబాదుల్లో 'మాడం/దీదీ/అమ్మగారు/అమ్మా' ల్లాంటివే విన్నాను.
ఈ టపా మీద మీ రేటింగ్ శిరోధార్యం! ఇద్దరు ముగ్గురు మీ లాగే చెప్పారు.
బహుశా రెండు భాగాలు గా విభజించకుండా ఉండాల్సింది. నేను చెప్పదలచుకుంది సరిగ్గా చెప్పలేకపోయినట్టున్నాను. రెండో పార్ట్ మొదలు పెట్టాను రాయటం. రేపు, ఎల్లుండుల్లో పూర్తి చేస్తాను.
@ bonagiri,
నిజమే!
@ చందు గారు,
ఎక్కడికో తీసుకెళ్లిపోయినట్టున్నారు. అహాన్ని జయించటమే? అస్సలూ కాదండీ. నాకు బోల్డు అహం, కోపం,ఆవేశం, కక్కుర్తి, జెలసీ.. అన్నీ ఉన్నాయి. సకల గుణ సంపన్నురాలిని నేను :)
కానీ, మీ వ్యాఖ్యకి చాలా చాలా థాంక్స్!
@ WP,
:)
మౌళి గారు,
నా వరకూ ఆలోచనా ధోరణి ని మార్చుకుని, మనస్పూర్థి గా ఇళ్లల్లో పని మనుషుల దగ్గర్నించి first name basis మీదకి రాగలగటం ఖచ్చితం గా మార్పే.
>>>> ఆమె గురించి నేను ఊహించి చెప్పడం సరి కాదు కాని, పిల్లలున్నా ఆమె అలానే ఉంటె, ఆమె పిల్లలకి పిసరంత నష్టం కూడా జరిగేది కాదు :)
ఎందుకో అర్థం కాలేదు. కొద్దిగా వివరం గా చెప్తారా?
@ మహేశ్ కుమార్ గారు,
థాంక్స్!
@ అజ్ఞాత,
>>>వినయ విధేయతలు..
LOL
@ వేణూ శ్రీకాంత్ గారు,
థాంక్సండీ.
@ రాజ్ కుమార్ గారు,
హ్మ్..
@ మౌళి గారు,
:)
@ అపర్ణ,
ధన్యవాదాలు. ఆర్ముగం ఆరు కోణాలూ రాయలేదు. ఏదో పని వత్తిడీ, అలాగే వేరే విషయాల గురించి రాయటం తో, వెనక బడిపోయింది. మళ్లీ కుదిరినప్పుడు రాయాలి.
@ స్పురిత,
థాంక్స్! అన్నీ రాయను లెండి :)
>>>నా వరకూ ఆలోచనా ధోరణి ని మార్చుకుని, మనస్పూర్థి గా ఇళ్లల్లో పని మనుషుల దగ్గర్నించి first name basis మీదకి రాగలగటం ఖచ్చితం గా మార్పే.
ఉహూ, మీ ప్లేస్ లో మేమెవరం ఉన్నా మీ లానే ఆక్సెప్ట్ చెయ్యాల్సి వచ్చేది. కాబట్టి మారినది ఇల్లు మాత్రమె అనుకుంటున్నాను. పని వాళ్ళని అక్కా అనే అలవాటు ఆంధ్రా లో ఒక వైపు ఉన్నదనుకుంటాను కుడా,
>>>> ఆమె గురించి నేను ఊహించి చెప్పడం సరి కాదు కాని, పిల్లలున్నా ఆమె అలానే ఉంటె, ఆమె పిల్లలకి పిసరంత నష్టం కూడా జరిగేది కాదు :)
>>>ఎందుకో అర్థం కాలేదు. కొద్దిగా వివరం గా చెప్తారా?
ఏమి లేదు, ఆమెని మనతో పోల్చుకొన్నపుడు అన్నమాటనే..మనం ఆమె పరిస్థితిలో ఉంటె చెప్పగలమా .ఉహూ :) అప్పుడు కుడా పక్కింటి వాళ్లకి ఆమె చేసిన సాయం లోఐదు శాతం అయినా చెయ్యమేమో. అలాగే ఆమె కి పిల్లలు ఉంటె అందరిలానే తన కుటుంబం మాత్రమె చూసుకొంటుంది అని మనం అనుకోవడం సరి కాదేమో
చేసినా ఆమె పిల్లలకి పిసరంత నష్టం కుడా జరగదు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ప్రకృతి లో ఒక రూల్ ఉంది. సంపాదించే మొత్తం లో 30 శాతం దానం చేస్తే మాత్రమె మన సంపాదన వల్ల మనకి పూర్తి ప్రయోజనం కలుగుతుంది. కాని చాలా కొద్ది మంది అలా చేయగలుగుతారు :)
సారీ అండీ! ఇలా కామెంట్ పెడుతున్నందుకు ఏమి అనుకోవద్దుమీరు మళ్లి నా బ్లాగ్ లో కామెంట్ చూస్తారో లేదో అని ఇక్కడ కామెంట్ పెడుతున్నాను.
కృష్ణ ప్రియ గారు! సంతోషం అండీ ఈ మామిడి చెట్టుకి చిన్న ఇనప బుట్టలు కట్టి ఉంచడం గురించి వివరంగా చెప్పగలరా? దీనిని కూడా అనుసరించాలని ఉంది.వీలుంటే ఒక ఫోటో కూడా మీ బ్లాగ్ లో ఒక పోస్ట్ లో రాస్తే అందరికి తెలుస్తుంది కదా.
మీ బ్లాగ్ కి ఇప్పుడే ఫాలో పెట్టాను.
మొత్తం చదివి చెప్తాను.
కృష్ణప్రియ గారు,
నా వ్యాఖ్య మిమ్మల్నుద్దేసించి కాదు. మీరు అన్ని వాక్యాలకీ వివరంగా ఇచ్చిన జవాబులు ఆలోచింపచేస్తున్నాయి.
"మీ టపాలో ఆవిడ పనిమనిషై కూడా ఇలా ఆలోచించగలిగింది అనే భావం లేకపోవడం నాకు బాగా నచ్చిన అంశం" అని నేను స్పష్టంగా చెప్పాక కూడా మీకు నా వ్యాఖ్య మిమ్మల్నుద్దేసించిందే అనిపించిదా !!
లేకా మీ టపా చదివే వాళ్ళకి ఎలా అనిపించిందో అలా అనిపించాలనే రాశారేమో !!
ఇంక చివరి వాక్యం విషయానికొస్తే.. ఊర్కే సరదాగా రాశానులెండి. అవును మీరన్నట్టు కొంచెం ఎక్కువయ్యింది :)
ఇంకా ఉంది అన్నారు కాబట్టి నేను ముందే ఏమీ కామెంటడం లేదు...
కాకపొతే తనకి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను...
ఈ గూగుల్ డాష్ బోర్డ్ లో ఏదో ప్రాబ్లం ఉంది కృష్ణ ప్రియ గారు.
కొత్త పోస్ట్ updates ఏమీ కనిపించడం లేదు.
నిజంగా పని చేసేవాళ్ళు అభినందనీయులు
చలి చలి అని ఎనిమిదింటి వరకు ముసుగు తీయడానికి బద్దకిన్చినా కూడా పొద్దున్న ఆరింటికే వచ్చి కాలింగ్ బెల్ కొడితే అక్కడ వరకు వెళ్లి తలుపు తీయడానికే బద్దకించే జనాలు
అన్ని ఇళ్ళల్లో చాతుర్యంగా చేయడం నిజంగా హాశ్చర్యం కలిగిస్తుంది.
ఎప్పుడూ మనం మనం అని ఆలోచించడం తోనే సరిపోయే ఈ జీవితాల్లో స్వార్ధం లేకుండా సేవ చేస్తున్న సరస్వతి లాంటి వారికి నమస్కారం చేయాలి.
మీరు చేసిన పనిని అభినందిస్తున్నాను.
>>"ఆ.. ఒంటరి గా ఉంది కాబట్టి ఇరుగూ, పొరుగూ, కష్టం, సుఖం అని మాటలు చెప్తోంది. తనకంటూ కుటుంబం ఉండి ఉంటే ఏమనేది.. తనూ సంసార సాగరం లో ఈదుతూ, మూలుగుతూ, తేలుతూ ఉండేది లే.. అని నాకు నేను సద్ది చెప్పుకుని, దులిపేసుకున్నాను.
తన వైద్యానికి, ఖర్చులకీ, ‘చాలా ఉదారం’ గా ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి, నాకు నేనే శబాషీలిచ్చుకుని, నా అహాన్ని సంతృప్తి పరుచుకున్నాను"
hmm..While being very honarable... isn't this para a complete fake !!!!
You really felt that way and anointed yourself like that !!!!!
you don't need to publish this comment. Just think about it ;)
మౌళి గారు,
మీ వ్యాఖ్య అర్థమైంది. టపా లో నేను రాసిన లైన్.. అలాగ ధ్వనించాలని రాసిందే.. మనం చేయలేని/చేయకూడదనుకున్న పనులు వేరే వాళ్లు చేసేస్తున్నప్పుడు ' వాళ్లు నా పరిస్థితి లో ఉంటే చేయరు .. అని సరిపెట్టుకోవటం చాలా నార్మల్ అని. చాలా తక్కువ మంది దీనికి అతీతులు అని నేననుకుంటున్నాను..
@ కల్లూరి శైల బాల గారు,
సారీ, చాలా రోజులైంది మీ కామెంట్ చూసి కానీ బద్దకించాను. పాత కాలం ఉల్లిపాయల బుట్టలుంటాయి చూడండి అలాంటిది ఏదో పడి ఉంటే దాన్ని ఈవిధం గా వాడుకున్నారు.. ఈసారి ఫోటోలు తెస్తాను.
నా బ్లాగ్ ఆసాంతం చదువుతున్నాను అన్నారు.. ధన్యవాదాలు!!
మాధవి గారు,
ధన్యవాదాలు. రెండో పార్ట్ రాస్తున్నాను..
@ హరేకృష్ణ,
మీరన్న మొదటి పాయింట్ లో ఒక మర్మం ఉంది. అవసరాన్ని బట్టి .. తప్పదు కదా.. పూర్వం WFH ఆప్షన్ లేని రోజుల్లో, పిల్లలకి జ్వరాలైనా.. ఇంట్లో తూఫాన్ ఉన్నా, కష్టపడి ఆఫీసులకి పరిగెత్తి ఎలాగోలా గడుపుకునేవాళ్ళం. ఇప్పుడు ..'మా ఇంట్లో చీమ చిటుక్కుమంది.. WFH' అని మెయిల్ పడేస్తున్నాం :)
>>>వాళ్లు నా పరిస్థితి లో ఉంటే చేయరు .. అని సరిపెట్టుకోవటం చాలా నార్మల్ అని.
రచయితా ఇలాంటి అభిప్రాయమే వ్రాస్తే ఇంక రచనకి ప్రయోజనం ఉండదు అండి.
మౌళి గారు,
'నార్మల్' అన్నది కరెక్ట్ పదం కాదక్కడ. నిజమే. అంటే అక్కడ నా ఉద్దేశ్యం.. లోకం తీరు అలాగ.. అని. బహుశా.. నాకు చెప్పటం చేత కాలేదనుకుంటా.
అదే కరెక్ట్, అందులో మార్పు కి తావు లేదు. ఇదంతా నార్మల్ అని కాదు.
మనం చేయాలనుకుని చేయలేకపోయిన పని ని పక్కవాళ్లెవరో చేస్తే గిల్ట్ నుండి తప్పించుకోవటానికి .. మనం (చాలా మంది) ఒక కారణం వెతుక్కుంటాం.. అని చెప్పాలని ఒక సెటైర్ లా అలా రాశాను..
Looks like it did n't work out :)
@ FM,
>>>>>hmm..While being very honarable... isn't this para a complete fake !!!!
You really felt that way and anointed yourself like that !!!!!
you don't need to publish this comment. Just think about it ;)
- "Complete fake" .. I don't think so.
పైన మౌళి గారికి వివరణ ఇచ్చినట్టు,
భోరున వర్షం కురుస్తుంటే ఉదయానే చంటి పిల్లను తీసుకున్న తల్లులో/వికలాంగులో కార్ దగ్గర వచ్చి అడుక్కుంటే.. ఒక్క పూట కి కాస్త ఎక్కువ డబ్బిచ్చి ఇచ్చి, కొంత తృప్తి చెంది మనల్ని మనం సంతృప్తి పరచుకుంటాము,ఇకా ఆ ఆలోచన మనసు లోకి రానీయం. రోడ్డు మీద ఎవరైనా మూర్ఛ వచ్చి పడిపోతే.. మనలో చాలా మంది వెళ్లి తీయం.. ఎవరో ఒకరు తీసుకెళ్తే మనం కాస్త డబ్బిచ్చి అంతకు మించి ఇంకేమీ చేయలేక పోవటానికి కారణాలు వెతుక్కుంటాం. (అందరూ అలా చేయరని నేననట్లేదు.. )
నేను చెప్పాలనుకున్నది ఈ టపా లో బహుశా సమర్థవంతం గా చెప్పలేదనుకుంటాను.. రెండవ భాగం లో కొద్దిగా మెరుగు పరచటానికి ప్రయత్నిస్తాను.
మౌళి గారు,
'నార్మల్' అన్నది కరెక్ట్ పదం కాదక్కడ. నిజమే. అంటే అక్కడ నా ఉద్దేశ్యం.. లోకం తీరు అలాగ.. అని. బహుశా.. నాకు చెప్పటం చేత కాలేదనుకుంటా.
అదే కరెక్ట్, అందులో మార్పు కి తావు లేదు. ఇదంతా నార్మల్ అని కాదు.
మనం చేయాలనుకుని చేయలేకపోయిన పని ని పక్కవాళ్లెవరో చేస్తే గిల్ట్ నుండి తప్పించుకోవటానికి .. మనం (చాలా మంది) ఒక కారణం వెతుక్కుంటాం.. అని చెప్పాలని ఒక సెటైర్ లా అలా రాశాను..
Looks like it did n't work out :)
@ FM,
>>>>>hmm..While being very honarable... isn't this para a complete fake !!!!
You really felt that way and anointed yourself like that !!!!!
you don't need to publish this comment. Just think about it ;)
- "Complete fake" .. I don't think so.
పైన మౌళి గారికి వివరణ ఇచ్చినట్టు,
భోరున వర్షం కురుస్తుంటే ఉదయానే చంటి పిల్లను తీసుకున్న తల్లులో/వికలాంగులో కార్ దగ్గర వచ్చి అడుక్కుంటే.. ఒక్క పూట కి కాస్త ఎక్కువ డబ్బిచ్చి ఇచ్చి, కొంత తృప్తి చెంది మనల్ని మనం సంతృప్తి పరచుకుంటాము,ఇకా ఆ ఆలోచన మనసు లోకి రానీయం. రోడ్డు మీద ఎవరైనా మూర్ఛ వచ్చి పడిపోతే.. మనలో చాలా మంది వెళ్లి తీయం.. ఎవరో ఒకరు తీసుకెళ్తే మనం కాస్త డబ్బిచ్చి అంతకు మించి ఇంకేమీ చేయలేక పోవటానికి కారణాలు వెతుక్కుంటాం. (అందరూ అలా చేయరని నేననట్లేదు.. )
నేను చెప్పాలనుకున్నది ఈ టపా లో బహుశా సమర్థవంతం గా చెప్పలేదనుకుంటాను.. రెండవ భాగం లో కొద్దిగా మెరుగు పరచటానికి ప్రయత్నిస్తాను.
మీరు చెప్పింది అర్థమయ్యింది. ఎవరైనా "నేను" అని రాసినప్పుడు, కొన్ని సార్లు చాలా చిన్న చిన్న విషయాల్నీ, సాధారణ లోపాలనీ వివరించి వాటి మీదా వచ్చే ఆలోచనలకి కొంచెం పెద్ద పెద్ద పదాలతో మహా వ్యక్తిత్వ వికాసం లాగా రాసినప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుందండీ. బహుశా అది నా లోపమేమో..!!!
మీరు చివరి రెండు పేరాలు లో మీ పై మీరు వేసుకొన్న సెటైర్ నప్పలేదండీ. కొంత ఎవరు నమ్మరు :) ( FM గారు కుడా సరిగా ఇవే మాటలు కోట్ చెయ్యడం నాకు సంతోషాన్నిచ్చాయి ) ఇంకొంత మాములుగానే మీ అభిమానులు మీ టపాలతో కాక మీతో మాట్లాడడానికే ఇష్టపడతారు. 'అందువల్ల' అక్కడ(చివరిలో ) మీరు మీరు వ్రాసిన విధానం, అంత చక్కగా మనసుపెట్టి వ్రాసిన టపా కాస్తా ....
btw నాకు కుడా సుధా నారాయణ మూర్తి, ఈ వారెన్ బుఫేట్ ఇలా కోట్లు కోట్లు దానం చేసేస్తారు, వీళ్ళకి కాస్త కుడా భయం ఉండదా అని అర్ధం అయ్యేది కాదు. అబ్బ వీళ్ళకి మాత్రమె దానగుణం ఉండటం ఎలా సాధ్యం అని, అదీ కాక వాళ్ళందరికీ పిల్లలు కుడా ఉన్నారాయే (మీకోసం సెటైర్ J /K )
ఎపుడో కాని ఇంత మంచి టపాలు రావు, అందుకే నా అభిప్రాయాలు వ్రాయకుండా ఉండలేక పోయాను, మిమ్మల్ని నొప్పించి ఉంటె :)... చాల బాగా వ్రాసారు.
ఏమండోయ్,
నిజమేనంటారా ? లేక ఇది మీ ఊహా గానమా ? ఇలా కూడా మనుషులు ఉండవచ్చు సుమీ అని?
జిలేబి.
మౌళి గారు,
నొప్పించటం :) అంత లేదండీ.. I am glad you wrote these comments.
మీరన్నది నాకర్థమైంది.. థాంక్స్
@ జిలేబి,
:)
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.