Wednesday, July 11, 2012

సీతారాముడు బెంగుళూరొచ్చాడు - ఉపోద్ఘాతం.


(By Vishnupriya)
“ఓ పని చేయి మామయ్యా! వాడిని బెంగుళూరు బస్సెక్కించెయ్! ఓ పది రోజులు చూస్తాను, నాకు తోచినది నేర్పిస్తాను… కొద్దిగా ఒక దిశా నిర్దేశం చేసేందుకు నాకు కాస్త అవకాశం దొరుకుతుంది..” అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

సీతారాం మా చుట్టాలబ్బాయి. వాళ్ల నాన్నగారు మా నాన్నగారికి ఆప్తులు. కాకపోతే రాకపోకలు తగ్గి నాకు ఆ కుటుంబం లో పిల్లల తో పరిచయం తక్కువే. బొత్తి గా పల్లెటూరు, ఓ ఎకరం కాస్త అమ్మి మరీ, ఒక మాదిరి పట్టణం లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లో, ఒకానొక కాలేజీ నుండి తన కొడుక్కి మా మామయ్య బీ టెక్ పట్టా తెప్పించగలిగాడు. పిల్లవాడు చాలా ‘బుద్ధిమంతుడు’ అని చుట్టాల్లో పేరు. ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. వాళ్లింట్లో అతనే మొదటి ఇంజనీరు. చిన్న సిటీ లో, చిన్న కాలేజీ లో చదువుకోవటం తో, పెద్దగా కాంపస్ ఇంటర్వ్యూలు జరగలేదు. జరిగిన వాటిలో వాళ్లబ్బాయి వ్రాత పరీక్ష లో ఉత్తీర్ణుడయినా, గ్రూప్ డిస్కషన్ల లో వెనకంజ వేశాడు అని తండ్రి చెప్పాడు.

“అమ్మా! కృష్ణా! నువ్వే కాస్త వాడికి ఒక దారి చూపించాలి. మీ కంపెనీ లోనో, తెలిసిన వారి దగ్గరో, ఒక ఉద్యోగం ఇప్పించు!” అని పదే పదే చెప్పటం తో, నేను కూడా చేతనైనంత సహాయం చేద్దాం.. అని నిశ్చయం చేసుకున్నాను. నాకూ, నాకు తెలిసిన వారికి చాలా మందికి కాంపస్ సెలక్షన్లలో ఉద్యోగం దొరికేయటం తో, కొత్తగా పాస్ అయిన వారు ఉద్యోగాల కోసం ఎలాగ ప్రయత్నిస్తారో నాకు అస్సలూ ఐడియా లేదు. నాకు తెలిసిన వాళ్లకి కాస్త చెప్పి 2012 లో పాస్ అయిన ఇంజనీర్లు అసలు అవకాశాల కోసం ఎలాగ ప్రయత్నించాలో తెలుసుకోవటం మొదలు పెట్టా.

పది మందికీ విషయం చెప్పటం తో, వంద రకాల సలహాలు రావటం మొదలు పెట్టాయి. నాకూ తల తిరిగిపోయింది. మంచి కాలేజీల్లో చదివి కొద్దిగా ‘స్మార్ట్’ గా ఉన్న పిల్లలకి ఎలాగూ అవకాశాలున్నాయి. B గ్రేడ్ టౌన్లల్లోని అరగొర సదుపాయాలున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లోంచి వచ్చిన పిల్లలకి మొదటి సాఫ్ట్వేర్ (మంచి) ఉద్యోగం సాధించటం దాదాపు తెలుగు సినిమాల్లో హీరో/హీరోయిన్ వేషం సాధించటమంత కష్టతరవిషయం అని. ఆంగ్లం లో గడగడా మాట్లాడగలగాలి, సబ్జెక్టుల్లో ఎలాగూ దిట్టలై ఉండాలి, వాళ్ల సబ్జెక్టులేకాక, కంప్యూటర్ల లో కొత్త విషయాల్లో ప్రవేశం ఉండాలి. అంతే కాక, కనపడిన ప్రతి వాక్ ఇన్ కీ పరిగెత్తాలి, అనుభవం లేదు కాబట్టి నామ మాత్రపు జీతాలకి పని చేయటానికి రెడీ గా ఉండాలి, ఒక్కోసారి ఎదురిచ్చి కూడా పని చేయటానికి కూడా సిద్ధం గా ఉండాలి, చిట్టెలుకంత చురుకు గా తిరగాలి, చిరుతంత వేగం గా ఉండాలి, చీమలు బెల్లం ఎక్కడ దాచినా వాసన పసి గట్టినట్టు, సిటీ లో అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలమీదా ఓ కన్నేసి ఉంచి అన్నింటిలోకీ ఒక రాయేసి చూడగలగాలి.. అన్నింటికీ మించి ‘మీ వాడికి ఇంకా ఉద్యోగం రాలేదా? పాపం! మా వాడికి ఫలానా కంపెనీ వాళ్లు ఆరు లక్షల పాకేజీ ఇస్తున్నారు, వేరేవాళ్లు తొమ్మిది ఇస్తున్నారు కానీ, బొంబాయి కి వెళ్లాలట.. ఎందుకూ, ఉన్నఊళ్లో కళ్ళ ఎదురు గా ఉండి ఆరు కి కాంప్రమైజ్ అవమని అడుగుతున్నాం.. ‘ అని సాటి వారు చెప్పే సోది విని నిర్వికారం గా ఉండగలగాలి!

మన వాడికి విషయ జ్ఞానం ఎలాగుంది? వాడి ఆంగ్లం పరవాలేదా? చురుకు గా ఉంటాడా? చెప్పింది చెప్పినట్టు అల్లుకుపోగలడా? ఇలాంటి ప్రశ్నలతో నాకు ఉక్కిరి బిక్కిరి అయినట్లయింది. ఈలోగా ఊరి నుండి ఫోన్ల మీద ఫోన్లు. ‘ఏమైంది ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయి? ‘ అంటూ. మా మామయ్య స్వాతి ముత్యం లో కమల్ హాసన్ లా రోజూ నన్ను అడగటమేకాక సీతా రాం చేత కూడా ఫోన్లు చేయించాడు. నా ఫోన్ పండగ పూట కోవెల్లో గంట లా గణగణ లాడుతూనే ఉంది.

ఓ నెల పాటూ ఫోన్ల ద్వారా సంభాషణలు మామయ్య తో అయ్యాకా, కొద్దిగా నాకు విషయం అర్థమవటం మొదలైంది. మా మామయ్యకి తానొక ‘అపర ఐన్ స్టీన్ కి తండ్రంత వాడినని గట్టి నమ్మకం! ‘అబ్బాయి ఇంజనీరయ్యాడు..’ అనగానే వరసగా క్యూలు కట్టి అందరూ వెనక వెనక పడి ‘మా కంపెనీ లో చేరు.. లక్షిస్తాం’ అంటే.. మా కంపెనీ లో రెండు లక్షలిస్తాం..’ అంటూ వేలం పాటలా పైకి తీసుకెళ్లి ‘అమెరికా వెళ్తావా! ఆస్ట్రేలియా కెడతావా?’ అని బ్రతిమాలుతూ, పాత సినిమాల్లో నాగేశ్వరరావు ని అడిగినట్టు.. ‘ ‘మీరు మీ తెలివి పెట్టుబడి పెట్టండి.. మేము డబ్బు పెడతాం..‘ అంటూ ఆఫర్లు ఇచ్చే పారిశ్రామికవేత్తలూ, .. గ్రూప్ డిస్కషన్ లో నోరు పెగలక పోతే, “భాష కాదు! భావం ముఖ్యం.. మిమ్మల్ని ఇంగ్లిష్ లో మాత్రమే మాట్లాడమని ఎవరన్నారు? తెలుగు లో మాట్లాడండి! ” అని అదో టైప్ సీరియస్ ఎక్స్ ప్రేషన్లు ఇచ్చి ప్రోత్సహించే ‘త్రిష’ ల్లాంటి ఎగ్జెగ్యూటివ్ లూ.. అబ్బో.. మా మామయ్య గారికి చాలానే భ్రమలు ఉన్నాయి అని అర్థమైంది.

“మామయ్యా! ఓ సారి వాడికి ఫోన్ ఇయ్యి... మాట్లాడతాను” అన్నాను. ‘ సీతారాముడు పూజ లో ఉన్నాడు.. ఇప్పుడు మాట్లాడలేడు. ఓ ఇరవై నిమిషాలాగి చేస్తాడు.. ‘ ఇరవై నిమిషాల పూజా! ఏదైనా పండగా! ఏంటి? మరీ పండగలూ, పబ్బాలూ పట్టించుకోని మెకానికల్ బతుకైపోయింది బొత్తి గా.. :- ( అనుకుంటూ, ‘అబ్బో.. ఏంటి స్పెషల్ ఈరోజు? ‘ కొద్దిగా గిల్ట్ నిండిన గొంతు తో అడిగాను. మామయ్య ‘లేదమ్మా! ప్రతి రోజూ రెండు పూటలా తలస్నానం చేసి సంధ్యావందనం, పారాయణం వంటివి అన్నీ చేసుకోవటం వాడి దినచర్య లో భాగం.. అన్నట్టు మా వాడు తిరుచూర్ణం, తిరువణిక్కాపు తో నామం పెట్టుకుంటాడు.. మరి ఉద్యోగాలకి ప్రయత్నిస్తున్నప్పుడు అదొక అడ్డంకి కాదు కాదు కదా? ‘ అని ఒకింత అమాయకం గా అడిగాడు..

నాకెందుకో ఒక్కసారి గా జాలి, నవ్వూ, వీడికి ఒక మంచి ఉద్యోగం ఎలాగైనా సంపాదించుకునేలా చేసి తీరాలనే పట్టుదలా కలగా పులగం గా తలకెక్కేసాయి. దాని ఫలితమే ఈ ఫోన్ కాల్...

(సశేషం)


45 comments:

Found In Folsom said...

Hmm....vetakaram anukokapothe, rendu pootala sandhya vandanalu, pooja punaskarala badulu aa pilladu edanna C noo, C++ lantivo nerchukunte bavuntundi kadaa....Paiga meeru ph cheste 20 nimishala taruvata cheyala? Maaku boledu mandi taglaru, tagulutunaru....alanti oo character gurinchi naaku tega raseyalanipstondi mee post choosaka....anyway, aa abbayi Valla parents vastavam grahinchi, daniki anugunanga panulu cheste bavuntundi...naa tarupuna nundi kooda good luck..:)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

చాలా బావుంది. నిజాయితీగా చెప్పాలంటే, మీ శైలిలో నాకు అంతగా నచ్చని అంశాలు ఈ టపాలో దొరకలేదు :)

అన్నట్టు బొమ్మ బావుంది ;)

Waiting for the next part...

రసజ్ఞ said...

"నా ఫోన్ పండగ పూట కోవెల్లో గంట లా గణగణ లాడుతూనే ఉంది" హహహ! బొమ్మ కథకు తగ్గట్టు భలే కుదిరిందండీ!
చాలా మంది పరిస్థితి ఇలానే ఉందటండీ. మొన్న ఒకతను చెప్తున్నాడు బిటెక్ వాళ్ళకే ఉద్యోగాలోస్తున్నాయి నేను ఎంటెక్ చేసినా ఇంకా రాలేదు (చేసి నెలయ్యింది) ఈ నెలలో రాకపోతే నా మొఖం ఎవ్వరికీ చూపించను, ఇంట్లోంచి పారిపోతాను అని. ఏమిటో జనాలు అనిపించింది!

Anonymous said...

మాఆవిడ నాదీఆడజన్మే ధారావాహిక కోసం ఎదురుచూసినట్లు, రేపటి మీటపా కోసం చూస్తూ,
--తిమ్మిరి

Padmarpita said...

:-)

Sujata said...

Oh.. Waiting for him to come..:D

sbmurali2007 said...

Very well begun!
Waiting for the next...
Sharada

రాజ్ కుమార్ said...

మీ సీతారాముడు మీకు అపరిచితుడు సినిమా చూపించినట్టుగా గెస్ చేస్తున్నాను. ఉపోద్ఘాతమే(హీరో ఎంట్రన్స్ అవ్వకుండా) ఇలా ఉంటే, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ రేంజ్ లో ఉంటాదో.. క్లైమాక్స్ ఎంత కిక్కిస్తాదో... ;) వెయిటింగ్ అండీ ఇక్కడా..

>>>
B గ్రేడ్ టౌన్లల్లోని అరగొర సదుపాయాలున్న ఇంజనీరింగ్ కాలేజీ ల్లోంచి వచ్చిన పిల్లలకి మొదటి సాఫ్ట్వేర్ (మంచి) ఉద్యోగం సాధించటం దాదాపు తెలుగు సినిమాల్లో హీరో/హీరోయిన్ వేషం సాధించటమంత కష్టతరవిషయం అని. ఆంగ్లం లో గడగడా మాట్లాడగలగాలి, సబ్జెక్టుల్లో ఎలాగూ దిట్టలై ఉండాలి, వాళ్ల సబ్జెక్టులేకాక, కంప్యూటర్ల లో కొత్త విషయాల్లో ప్రవేశం ఉండాలి. అంతే కాక, కనపడిన ప్రతి వాక్ ఇన్ కీ పరిగెత్తాలి, అనుభవం లేదు కాబట్టి నామ మాత్రపు జీతాలకి పని చేయటానికి రెడీ గా ఉండాలి, ఒక్కోసారి ఎదురిచ్చి కూడా పని చేయటానికి కూడా సిద్ధం గా ఉండాలి, చిట్టెలుకంత చురుకు గా తిరగాలి, చిరుతంత వేగం గా ఉండాలి, చీమలు బెల్లం ఎక్కడ దాచినా వాసన పసి గట్టినట్టు, సిటీ లో అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలమీదా ఓ కన్నేసి ఉంచి అన్నింటిలోకీ ఒక రాయేసి చూడగలగాలి.. అన్నింటికీ మించి ‘మీ వాడికి ఇంకా ఉద్యోగం రాలేదా? పాపం! మా వాడికి ఫలానా కంపెనీ వాళ్లు ఆరు లక్షల పాకేజీ ఇస్తున్నారు,>>>>

హ్మ్మ్.... ఈ పేరాకి నాలుగేళ్ళ క్రితం నా జీవితం.. ఆ ఎనిమిది నెలల కాలం గిర్రున తిరిగిందీ.. addicted to these lines..

harephala said...

ఉద్యోగాలు చిటికలో వచ్చేస్తాయనే భ్రమలో ఉన్న వారికి ఓ చురక.... ఇంకో విషయం, ఈ టపా లా చిన్న చిన్నగా వ్రాస్తే, చదువుకోడానిక్కూడా బావుంటుంది. ఒక్కో టపా మరీ పేజీలకి పేజీలు వ్రాసేస్తే చదవడానిక్కూడా ఓపికుండదు...keep going...

Narayanaswamy S. said...

మీరు అదేదో ముడిసరుకు అనుకున్నట్టుగా ఉంది - నేరుగా బ్రహ్మపదార్ధమే చేతికందిందన్నమాట! Good luck.

SNKR said...

మాంచి ఇంఫర్మేటివ్ హాట్ టాపిక్ ఎంచుకుని, సమకాలీన గతితార్కిక వుద్యోగ పర్వాన్ని బాగా ఆసక్తి కరంగా చెబుతున్నారు, బాగుంది. :)

Sravya Vattikuti said...

Nice ! waiting for next part :-)

Pantula gopala krishna rao said...

చాలా ముఖ్యమైన విషయాన్ని ఎన్నుకుని చాలా బాగా చెప్పారు. రెండో భాగంకోసం వెన్నెలకోసం చకోరపక్షిలా ఎదురు చూస్తుంటాను.

Mauli said...

పాపం సీతారాముడు :) బొమ్మ అందంగానే వేసారనుకోండి !

ఇక ఆ పది రోజుల్లో ఏ కోర్స్ చేరాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, తన ఫ్రెండ్సు బెంగుళూరు లో ఎక్కడెక్కడ ఉన్నారు, కాంటాక్ట్ నంబర్స్.

Zilebi said...

హమ్మయ్య,

ఆర్ముగం తో కాఫీ తరువాయి కృష్ణ ప్రియ గారికి మంచి కథా వస్తువే దొరికింది!

@శంకర్ గారు,

గతి తార్కిక ఉద్యోగ పర్వము అనగా ఏమి? వివరించుడీ!

చీర్స్
జిలేబి.

జేబి - JB said...

చాన్నాళ్ళకి మీ బ్లాగు చదివే సమయం చిక్కింది. రాజ్ కుమార్ లాగే నాకూ చక్రం ఒక్కసారి 8ఏళ్ళు వెనక్కి తిరిగిందండి. మిగిలన భాగాలు మీరు పెట్టగానే చదివే తీరిక చిక్కుతుందనుకుంటాను

బంతి said...

waiting for next part

కృష్ణప్రియ said...

@ Found in Folsom,
వెటకారం ఏముంది. నేనూ అదే అదే చెప్పి గొడవ గొడవ నేనూ పడ్డాను.. రాయండి :మీరు కూడా ; )
@ WP,
థాంక్స్.. బొమ్మ మా చెల్లి వేసింది.
@ రసజ్ఞ,
అవునా! కొంతమంది రెండేళ్లు కూడా సరయిన ఉద్యోగం లేకుండా ఉండిపోతున్న వాళ్లని కూడా చూస్తూనే ఉన్నానీమధ్య.
@ తిమ్మిరి,
LOL.. సరే అలాగే.
@ పద్మార్పిత,
థాంక్స్!
@ సుజాత,
అవునా.. థాంక్స్! అన్నట్టు బహుకాల దర్శనం..

కృష్ణప్రియ said...

@ శారద గారు,
థాంక్సండీ.. రాస్తున్నాను.
@ రాజ్ కుమార్,
మా సీతా రాముడి మీద అన్ని expectations పెట్టుకుంటే, నాకు టెన్షన్ ఎక్కిపోతోంది..  వచ్చే భాగం లో అతని ఇంట్రో.. ఇస్తున్నాను కదా, మీరే చూద్దురుగాని.
@ ఫణి బాబు గారు,
అలాగే నండీ, ఈసారి చిన్నవి రాయటానికి ప్రయత్నిస్తాను. థాంక్స్!
నారాయణస్వామి గారు,
:) అదే మరి.

కృష్ణప్రియ said...

@ snkr,
ధన్యవాదాలు! ఇంతకీ.. గతి తార్కిక .. అంటే.. ?
@ శ్రావ్య,
థాంక్స్! చాలా కాలానికి కనిపించారు!
@ పంతుల గోపాల కృష్ణ రావు గారు,
ధన్యవాదాలు! మొదటి సారి నా బ్లాగు లోకి వచ్చినట్లున్నారు? స్వాగతం.
@ మౌళి,
: ) పైన చెప్పినట్టు, బొమ్మ వేసింది మా చెల్లి.
@ జిలేబీ,
: ) కదా! థాంక్స్..

కృష్ణప్రియ said...

@ జేబీ,

థాంక్స్! త్వరలో (వీలయితే ఈ వారాంతం) రెండో భాగం రాస్తాను..

@ బంతి,

థాంక్స్!

రాజేష్ మారం... said...

సీతారాముడొచ్చి రెండు వారాలయినట్టుంది,

ఏం చేస్తున్నాడో తెల్సుకొవాలనుంది :)

.

జీడిపప్పు said...

Waiting for the update!

The Mother Land said...

He is knows .net and willing to work in a small company, send me a copy - i can help on zulu.damodar@gmail.com

I have few openings.

Harikrishna Pydipati said...

C/C++ నేర్చుకోడానికి సంధ్యావందనం అడ్డు అనుకోకపోతే బావుండు! సీతారముడికి శ్రీరామ రక్ష!!

నా తరపున శుభాకంక్షలు !

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

రెండు పూటలా తలస్నానం చేసి సంధ్యావందనం, పారాయణం వంటివి అన్నీ చేసుకోవటం, తిరుచూర్ణం, తిరువణిక్కాపు తో నామం పెట్టుకోవటం అతని వ్యక్తిగత విషయాలు. ఉద్యోగం విషయానికి సంబంధం లేని అంశాలు. సీతారాముడు తన ప్రాధాన్యతల్ని గుర్తించడం, సమయ పాలనా సరిగ్గా చేసుకోవడం చేసుకోగలిగితే అతని వ్యక్తిగత అభిరుచులూ నమ్మకాలూ చక్కగా పాటించుకోవచ్చు.

ఈ వ్యక్తిగత అభిరుచులనేవి ఒక్కోసారి అందరికీ కామన్ గా ఉండేవి అయితే మనకేమీ అనిపించదు. ఉదాహరణకి మీరు ఫోన్ చేసినప్పుడు, స్నానం చేస్తున్నాడు వచ్చాక తిరిగి ఫోన్ చేస్తాడు అనే సమాధానం వినిపించుంటే ఎలాగో ఇక్కడ వినిపించిందీ అలాగే. కాకపోతే, తిరిగి మీకు ఫోన్ చెయ్యటం ముఖ్యం.

అందరికీ అంత అవసరం అనిపించని వ్యక్తిగత అభిరుచులు ఉన్నప్పుడు (మరీ ముఖ్యంగా అవసరంలో ఉన్నవాళ్ళకి) మనకి కొంచెం తొందరగా "ఇదేంటి అసలు ఏది ముఖ్యం" అనిపించే అవకాశాలు ఎక్కువ.

సీతారాముడి వ్యక్తిగత అభిరుచి మనకి నచ్చిందా లేదా, లేకా మన దృష్టిలో వివేకవంతమైనదా కాదా అనేది పూర్తిగా వేరే చర్చ అనుకోండి :)
---------------------
ఇంక ఇంజినీరింగ్ కాలేజీల్లో వ్యక్తిత్వ వికాసం, అసలు సరైన జీవిత దృక్పధం ఏర్పడటం వృత్తి నైపుణ్యతని ఎలా మెరుగు పరచుకోవాలి, అవకాశాల్ని ఎలా అందిపుచ్చుకోవాలి అనే విషయాల్లో ఏమాత్రం శ్రధ్ధ కనబరచడంలేదు అనేది మాత్రం కొంచెం విచారించవలసిన విషయమె :(

the tree said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

Lasya Ramakrishna said...

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

లాస్య రామకృష్ణ

బ్లాగ్ లోకం

Anonymous said...

Something to think, how fair is it to make fun of a family friend / a relative in a public forum like this? They believed in you and asked you for help. How would he or his parents feel if they read this or if some of their friends read this and make fun of them?

Chinni said...

సీతారాముడు వచ్చి 2 నెలలైనా మీ డైరీలొ ఎగస్ట్రాగా ఒక్క పేజీ కూడా add అవ్వలేదు..త్వరగా రాయగలరని మనవి..

కృష్ణప్రియ said...

@ anon September 22, 2012 4.26 AM,

Absoultely! Thanks for the question!

ఇంతకు ముందు కూడా కొన్ని బ్లాగ్ పోస్టుల్లో చెప్పానండీ.. నేను రాసిన ప్రతి టపా లో కూడా రెండు రకాల మనుషులని ప్రస్తావిస్తాను.

౧) కాల్పనిక మనుషులు కానీ అయా స్వభావాలు తరచూ నాకు కనపడేవి..
౨) నాకు తెలిసిన వారు--వీరి గురించే పూర్తిగా రాయకపోయినా, ఏ మాత్రం ప్రస్తావన తెచ్చినా వారి నుంచి పూర్తి అనుమతి తీసుకుని రాస్తాను. ఇప్పటివరకూ రాసిన వాటిలో కేవలం ముగ్గురి గురించి రాసినప్పుడు మాత్రం వారి అనుమతి తీసుకోలేదు. ఒకరు 'అతిథి దేవోభవ ' టపా లో రాసిన ఫణి.. రెండవవారు 'మనసా వాచా దత్తతకు సిద్ధం' అందులో ని సంఘటనలు నిజమైనప్పటికీ, వారి వ్యక్తిగత వివరాలు, పరిసరాలు పూర్తిగా మార్చి రాశాను. తరువాత ఒక సందర్బం లో ఆ విషయం చెప్పి టపా టెక్స్ట్ వారికి చూపించటం జరిగింది.

అలాగే సమీర్ గురించి రాసినప్పుడు ఆయన ప్రాపంచిక విషయాల మీద విరక్తి తో అందరినీ వదిలి వెళ్లిపోయారు. తర్వాత వెనక్కి వచ్చాక ఒక సంబాషణ లో టపా ని అనువదించి చెప్పి, రెండవ భాగం రాస్తానని చెప్పటం జరిగింది.

కృష్ణప్రియ said...

రాజేశ్, జీడిపప్పు, చిన్ని గార్లు, అలాగే మెయిల్ ద్వారా రాయట్లేదని అడిగిన శ్రేయోభిలాషులకి,

అవునండీ, మా సీతారాముడు వచ్చి రెండు నెలలు దాటింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల (ప్రత్యేకమైనవి అంటూ లేవు లెండి. తీవ్ర మైన పని వత్తిడి.. కుటుంబ బాధ్యతల నిర్వహణల వల్ల సమయాభావం, మరియు బద్ధకం ..) బ్లాగు వైపు తొంగి చూడలేక పోయాను. వచ్చినట్లే వచ్చి మళ్లీ పారిపోవటం ఎందుకని.. అంతే..
అలాగే గమ్మత్తు గా అనిపించిన విషయం ఏంటంటే.. గతవారం గా రాద్దామని మొదలు పెట్టినా పాటలు పాడటం మానేశాక ఒక్కసారిగా స్టేజ్ మీద పాడమంటే ఎలా ఉంటుందో, వంటలకి దూరం గా ఉండి ఒకేసారి పండగ కి పడి మందికీ వండమంటే ఎలా అనిపిస్తుందో, కొంత కాలం బ్రేక్ తీసుకున్నాక ఆఫీసు కి వస్తే ఎలా ఉంటుందో.. అలాగ అనిపించి ఒక్క ముక్క రాయలేక మధ్యలోనే మానేశాను.. మళ్లీ మొదలు పెట్టాలి.

Rao S Lakkaraju said...

గతవారం గా రాద్దామని మొదలు పెట్టినా పాటలు పాడటం మానేశాక ఒక్కసారిగా స్టేజ్ మీద పాడమంటే ఎలా ఉంటుందో, వంటలకి దూరం గా ఉండి ఒకేసారి పండగ కి పడి మందికీ వండమంటే ఎలా అనిపిస్తుందో, కొంత కాలం బ్రేక్ తీసుకున్నాక ఆఫీసు కి వస్తే ఎలా ఉంటుందో.. అలాగ అనిపించి ఒక్క ముక్క రాయలేక మధ్యలోనే మానేశాను.. మళ్లీ మొదలు పెట్టాలి.
-----------------
నిజాన్ని ఎంత చక్కగా వర్ణించారు !

Anonymous said...

I agree with the anon in September 2012. You have a great writing style. But I thought the same thing. Why is she posting publicly about the people who trusted her with their life details or asked for help? You haven't written anything with your husband as the central theme. Surely you must have several stories (funny or otherwise) to write about him.
I like your blog. But, I have always felt that if I knew you and recognized myself in any of your posts, I wouldn't like it. Posts based on generalized behavior are ok for me. But, if a post is not whitewashed enough to remove the possibility of identification, then ... an uncomfortable feeling sets in. Especially, because you do seem to consider some people as off limits for blog post material, eg: your husband.

Sravya Vattikuti said...

Good to see you back :-))
కొంత కాలం బ్రేక్ తీసుకున్నాక ఆఫీసు కి వస్తే ఎలా ఉంటుందో.. అలాగ అనిపించి ఒక్క ముక్క రాయలేక మధ్యలోనే మానేశాను.. మళ్లీ మొదలు పెట్టాలి.
-------------------------------
ha ha :-))హ హ మీ చిన్నమ్మాయి ఇది చూసింది అంటే మీకో జెర్క్ ఇవ్వగలదు :-))

కృష్ణప్రియ said...

@ అనాన్,
Thanks a lot for your comment. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీ అభిప్రాయం, సూచన నాకు శిరోధార్యం.. ఈ విషయం మీద రాయటం మొదలు పెట్టిన దగరనించీ కూడా నేనూ చాలా చాలా ఆలోచించాను.. ముఖ్యం గా, దత్తత టపా రాసినప్పుడు.. అది నా పర్సనల్ అనుభవం. సంబంధిత వ్యక్తి తో కలిసి వెళ్లి మరీ పాప ని తేవటం జరిగింది. ఆ వ్యక్తి తో ఈ టపా చదివించటం జరిగింది. And he/she is fine with this. still.. it bothered me a lot. అప్పుడు మూడు నాలుగు వ్యాఖ్యలు ఈ విషయం లో వచ్చాయి. చాలా అంతర్మథనం జరిగాక, ఒకరిద్దరు మిత్రులతో, శ్రేయోభిలాషులతో చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడూ, ఒక తెలిసిన వ్యక్తి మీద వారి అనుమతి లేకుండా ఒక్క విషయం కూడా రాయలేదు. అంతెందుకు.. ఏడేళ్ల మా అమ్మాయి నయినా ఇదిగో నీ పాట పెడుతున్నాను, నువ్విలా అన్నావని రాస్తున్నాను.. అని ఓసారి చెప్పి టపా పోస్ట్ చేయటం అలవాటు గా చేసుకున్నాను. ఒక్కోసారి కొంతమంది ‘ఇదిగో ఈ అంశం మీద రాయి..’ అని అడగటం కూడా ఈ మధ్య జరుగుతోంది. మా పని మనిషి మేరీ, డ్రైవర్ రెడ్డి కానీయండి, పక్కావిడ కానీయండి, ఆఫీసు లో సింగపెరుమాళ్/సంధ్య/లీల/ఆర్ముగం కానీయండి.. లేదా సీతా రాముడు కానీయండి. Trust me.. They all know what I am writing, and I have their permissions.
గేటెడ్ కమ్యూనిటీ కథల్లో పాత్రలు పూర్తిగా కల్పితం కానీ, స్వభావాలు, సంఘటనలు మాత్రం నిజం గా నేను గమనించేవే.
ముఖ్యం గా సీతారాముడి గురించి.. ఈ కథ పూర్తిగా ౧౦౦% word to word అతని కథ కాదు. పేరూ అతనిది కాదు. ఈ టపా గురించి ముందస్తు గా అతని తో చెప్పటం, మొదటి భాగం చదివించటమే కాకుండా.. అతని బొమ్మ కూడా ఇమెయిల్ చేసి ‘పోస్ట్ చెయ్ అక్కా..పర్వాలేదు..’ అనిపించుకున్నాకే వేయటం జరిగింది.
ఇక ‘పెద్దక్క’ గురించి రాయటం మాత్రం మోరల్ గా కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఆవిడ దగ్గర్నించి నేను అనుమతి పొందలేదు. అందుకని ఒక భాగం తర్వాత ఆపేశాను. తర్వాత దానికి వేరే రూపం ఇవ్వటానికి ఒక రచయిత గైడెన్స్ తో ప్రయత్నిస్తున్నాను.
ఎనీవేస్.. కామెంట్ పోస్ట్ అంత పెద్దదైపోతోంది.. మళ్లీ ఈ విషయం లో టపా రాస్తాను.. త్వరలో ..

SNKR said...

/ఇంతకీ.. గతి తార్కిక .. అంటే.. ?/
కృష్ణప్రియ గారు,
తెలియదు. పదం బాగుందని కమ్యూనిష్టుల భావజాలంనుండి అరువు తెచ్చుకుని వాడాను. :D

SNKR said...

Anon September 22, 2012 4:26 AM.

She would have changed names, relationships. It is not important. If those people happen to read this it would help them to learn 'how others would think'. That would be helpful for them in their future such dealings.

That is how people learn from their experiences. It is Ok.

కృష్ణప్రియ said...

@ SNKR,

మీరు చెప్పినది పాయింటే.. కానీ, అందరికీ అది ఇష్టం లేకపోవచ్చు అన్నది అనాన్ ఉద్దేశం కదా..

నాకు తెలిసి, కొంత మందికి, ఈవిడ ఈ సినిమా కి వెళ్లింది /వెళ్లలేదు అన్న విషయం కూడా ఇతరులకి చెప్పటం ఇష్టం ఉండదు. కొంత మంది తమ జీవితాన్ని తెరిచిన పుస్తకం లా ఉంచుతారు. కొన్నేళ్ల క్రితం నాకు తెలిసిన ఒక అబ్బాయి, ఆక్సిడెంట్ లో మొత్తం కుటుంబాన్ని పోగొట్టుకుని ఆ విషయాన్ని ప్రతి రోజూ కలిసి భోజనం చేసే ఆఫీసు లో మిత్రులకి కూడా చెప్పలేదు. ఓ పది రోజులు సెలవ మీద వెళ్లి గుండు చేయించుకుని వచ్చాడు అని మాత్రమే అందరూ గమనించారు. చాలా కాలం తర్వాత ఆవిషయం తెలిసి ఆశ్చర్యపోయాం.
అలాగే ఇంకొకరు వాళ్లావిడ కి జలుబు చేసిన విషయం కూడా చెప్పేవారు..

మా ఆర్ముగం ఒప్పుకున్నాడు కానీ నా గురించి ఎవరైనా అంత రాస్తే నాకైతే కొద్దిగా ఇబ్బందే.. :)

SNKR said...

ప్రైవసీ అన్నది వాళ్ల వాళ్ళ బాధ్యత. కొంత మంది ప్రొఫైల్ ఏమీ రాసుకోకపోతే, 'వీడెవరు? ప్రొఫైల్ ఎందుకు చూపించడో' అని గోల చేస్తుంటారు, తిడుతుంటారు, శాపనార్థాలు పెడుతుంటారు, కామెంట్లు ప్రచురించం అనే బెదిరింపులకు తెగబడటం కూడా చూస్తుంటాము. ఎదుటి/పక్క వాడి ఆకులో చూడటం మానవునికి సహజగా వున్న గుణం. ఆడవాళ్ళలో ఇది మరి కొంచెం ఎక్కువగా వుంటుందని పరిశోధనల్లో తేల్చారు. :) "పొరుగింటి మీనాక్షమ్మ ను చూశారా?" పాటలు నే పుట్టకముందు నుంచే వున్నాయి. కాని మనం అలాంటి గుణాలు మనకున్నాయని ఓ పట్టాన ఒప్పుకోము, అదంతే.

ఇంతకీ క్లుప్తంగా నే చెప్పే దేమంటే... ఇదో పోరాటం, ప్రైవస్ ఈ కావాలనుకునే వాళ్ళు, దాన్ని ఏర్పరుచుకోవడం/కాపాడుకోవటం వారి భాద్యతే. దాన్ని చేదించి, వాటిని పాఠ్యాంశాలుగా మలుచుకోవాలన్న తపన మన ధర్మం, ప్రకృతి న్యాయం :D ఇష్టాఇష్టాల ప్రసక్తి కాదు, ధర్మాధర్మాల సమస్య, అని నా డిఫెన్స్ వాదన. :))

Mauli said...

హాయ్, బాగున్నారా? మీ సీతారాముడు కి ఉజ్జోగం వచిన్దాలేదా, పెళ్లి కుదిరిందా, ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుందా, వాళ్ళ పెళ్ళిలో మీకు పట్టు చీర పెట్టారా లేదా ..blah blah ఇవ్వన్నీ మాకెందుకు అండీ. ఏదో ఫ్రీ గా, సరదాగా ఒక టపా వ్రాసారు, చదివి ఆనందించాము.

చెప్పవద్దు అని ఇన్నాళ్ళు ఊరుకొన్న మాట, మళ్ళీ సందర్భం వచ్చింది , మీ పిల్లలికి తెలుగు చదవడం వస్తే 'దత్తత' టపా లోని నిజం వారికి తెలిసే ప్రమాదం ఉంది. "ఆ పాప కు సంబంధించిన సీక్రెట్ ని ఆ పాపను కూడా అడిగి పోస్ట్ చెయ్యలేదు కదా" :) ... జస్ట్ ఇంకాస్త ఎడిట్ చేసి మీ పిల్లలకి అర్ధం కాకుండా వ్రాస్తే అభ్యంతరం లేదనుకోండి..అయినా ఒకసారి ఆలోచించండి. ఆ పాప తల్లిని మాత్రమె అడిగితె సరిపోదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమె .

కృష్ణప్రియ said...

మౌళి గారు,

దత్తత టపా.. గురించి మీ అభిప్రాయం నాకర్థమైంది. మీ సిరీస్ నేను చదివాను.

బహుశా మీరు ఈ విషయం లో కరెక్ట్ అయి ఉండవచ్చు.

ఈ విషయం లో రెండు ముక్కలు..
మా కుటుంబం లో కనీసం నాలుగైదు దత్తత లు (అంటే కజిన్స్ కుటుంబాల్లో అని నా ఉద్దేశం) అందరికీ తెలిసినవే (Including the kids) అలాగే ఈ కుటుంబం గురించి మా వాళ్లకి అసలూ ఐడియా లేదు.
మరో విషయం.. మా అమ్మాయిలూ ఇద్దరూ తెలుగు చదువుతారు. మేము ఇంట్లోనే పిల్లలకి తెలుగు నేర్పించి వారాంతాల్లో వార్తా పత్రికలు ఒక అరగంట చదివిస్తాము. పెద్దమ్మాయి నా బ్లాగ్ చదవటానికే తెలుగు ఇంకా ఇంప్రూవ్ చేసుకుని మరీ అప్పుడప్పుడూ చదివి 'చాలా ఎక్కువ రాస్తావు. నాకు బోర్ గా ఉంది చదవలేను ' అంటుంది. :)

ఇవన్నీ ఒక ఎత్తు.. మీరన్న పాయింట్ ఒక ఎత్తు. నా టపా ని ఉపసంహరించుకుంటున్నాను..

ధన్యవాదాలు!

Bindu said...

చాలా బాగుందండీ మీ శైలి, మీ కథా. తరువాయి భాగం కోసం ఎదురు చూస్తున్నాం :)

మీరు చెప్పినట్టు top 10% కితొందరగా ఉద్యోగం వచ్చేస్తుంది. Bottom 10% ఇంక రాదని తొందరగా తెలిసిపోతుంది. మధ్యలో ఉండే వారికే తిప్పలు

DV Satya Prasad said...

Why no more posts. Busy?

భాస్కర రామిరెడ్డి said...

krishna priya garu, did u work in pol?

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;