ఏడాది మీద రెండు నెలల సెబాటికల్..
కారణాలనేకం! ఈతి బాధలు, ఆఫీసు పనులు, చిన్న చిన్న కన్స్ట్రక్షన్ పనులు, పిల్లల చదువుల పైన శ్రద్ధ పెంచడం, నాకలవాటైన గూగుల్ ఫాంట్సు మాక్ మీద పనిచేయకపోవడం తో టైపింగు వేగం తగ్గిపోవడం, రాయడం లో కన్నా, చదవడం లో ఇంకా ఆనంద పడటం, ఇలా ఎన్ని కారణాలున్నా,
అతి ముఖ్యమైన కారణం మాత్రం, ఒళ్లు బద్ధకం పెరగడం, ఈజీ ఎంటర్ టెయిన్మెంట్ కి అలవాటు పడిపోవడం.. (టీ వీ /యూట్యూబ్ లొ) సినిమాలు, ఇంటర్వ్యూలూ చూస్తూ, గూగుల్ చేసుకుంటూ, వికీల్లో పడి కొట్టుకుపోవడమున్నూ..
మరి ఈ సంవత్సరం కాలం లో ఎంతో మంది (అంటే వందల్లో కాదు కానీ, కనీసం ఒక 20-30 మంది) నన్ను, ఎందుకు రాయడం లేదని మందలించినా, నేనెందుకో ఈ బద్ధకపు కుకూన్ని చీల్చుకుని బయట పడలేకపోయాను. మా అమ్మ కూడా తప్పకుండా మళ్లీ చచ్చో పుచ్చో :-((( రాస్తూ ఉండు. మానేయకు అని సలహా ఇచ్చినా, స్థబ్దత ని వీడలేకపోయాను.
మళ్లీ ఎందుకో ఈ పూట రాయాలనిపించి, నిమ్మకాయ నీళ్లు నాకు నేనే కలిపేసుకుని తాగేసి ఈ పూట కీబోర్డు పట్టాను.
ఈసారి పూర్వం లా మరీ పెద్ద టపాలు కాకపోయినా కనీసం అప్పుడప్పుడూ రాసుకుందామని ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, నిర్ణయం తీసుకుంటున్నాను.
జై హింద్..