Saturday, February 5, 2011

వింటే భారతమే వినాలి.. తింటే...పిల్లలకి కథలు చెప్పటం నాకు ఇష్టమే కానీ కథలే రావు. పోనీ నాకు తెలిసిన నాలుగు కథలైనా చెప్దామని చూస్తే, అవన్నీ పిల్లలు ఏ కార్టూన్ చానెల్ లోనో.. లేదా.. టింకిల్ లోనో చదివేసాం అనేస్తారు. రోజూ కథలు.. అందునా ఏడేళ్లకు పైగా చెప్పాలంటే.. ఏ సుధా మూర్తో కావాలి కానీ నా లాంటి వాళ్ల తరమా?  పోనీ ఏదైనా కథ చదివి చెప్దాం అనుకుంటే వాళ్ళు నా కన్నా ముందుగానే చదివేస్తున్నారు. :-((

అప్పటికీ రెండేళ్ళ క్రితం ఒక ట్రిక్ కనిపెట్టి వాడటం మొదలు పెట్టాను. కథ లో ఒక దుర్గుణం ఉన్న పిల్ల ఉంటుంది.. కథ పూర్తయ్యేసరికి ఆ దుర్గుణా న్ని  అధిగమిస్తుంది.  ఏ కళనున్నారో.. ఒక వారం విన్నారు. తర్వాత.. మా పెద్ద అమ్మాయి 'Ammaa.. Please don't tell me the stories of bad girls turning in to good girls.. I got the msg..' అనేసింది.  ఈ కాలం పిల్లల్ని కసి తీరా తిట్టుకుని, నా చిన్నప్పుడు ఎంత వినమ్రం గా  ఉండేవాళ్ళం? అనుకుని.. ఊరుకున్నాను.

ఇలా కాదు.. ఈసారి మన ఇతిహాసాలు, పురాణాలు,  వెలికి తీసి చెప్దాం అనుకుని చూస్తే.. హనుమంతుడి కథలూ, చిన్ని కృష్ణుడి లీలలూ TV లో చూసేసారు.. రామాయణమూ, వినాయకుడి కథలూ ఏదో చానెల్ లో వేస్తూనే ఉన్నారు. .. బిక్క మొహం వేసాను.. పైగా మా చిన్నది.. 'మొన్నటి వరకూ.. నా favorite god హనుమాన్ జీ కానీ టీ వీ లో 'బాల్ గ ణేశ' చూసాక ఇప్పుడు 'శివ జీ ' అంది...  ఇక నా వల్ల కాదు అని వదిలేసాను కానీ.. మొన్న దీపావళి కి ఇల్లు దులుపుతుంటే.. ప్రయాగ రామకృష్ణ 'భారతం లో చిన్న కథలు ' కనిపించింది. కానీ.. వద్దులే చిన్నపిల్లలకి ఒకటి రెండు కథలు పర్వాలేదు కానీ.. వాళ్లకి అర్థమయ్యేలా, ఆసక్తికరం గా.. మహా భారతం  చెప్పాలంటే కష్టమే.. అనుకున్నా  ముందర ౨-౩ సార్లు ప్రయత్నించి మానేసాను.  మళ్ళీ చూద్దాం అని మొదలు పెట్టాను..ప్రతి సారీ భరతుడి పుట్టుక తో మొదలు పెట్టి.. మరీ chronological  గా చెప్పటం వల్ల వాళ్లకి ఆసక్తికరం గా చెప్పలేక పోతున్నట్టు అనిపించి.. ఈసారి వ్యూహం మార్చి చిన్న పిట్ట కథ తో మొదలు పెట్టి చూస్తే ఆసక్తి గా వింటారేమో చూద్దాం అని మొదలు పెట్టాను, ఏకలవ్యుడి గురించి..కథ తో.. 

వింటే భారతమే వినాలి.. తింటే గారెలే తినాలి.. అన్నాను.. ఉపోద్ఘాతం గా..
I don't like gaarelu anyway.. అంది విసుగ్గా.. మా పెద్దమ్మాయి. 
సరే పిజ్జా అనుకో.. అన్నాను..మా పెద్దమ్మాయి అలవాటుగా పెదవి విరిచి.. 'I know this one' అని అనాసక్తి గా అటు తిరిగి పడుకుంది. మా చిన్నమ్మాయి పెద్దగా పుస్తకాలు చదవటం అవీ చేయదు.. అందువల్ల జాగ్రత్తగానే వింది. కథ పూర్తయ్యాక.. 'How mean?' అంది. ద్రోణాచార్యుడు ఆవిధం గా ప్రవర్తించటానికి కారణాలున్నాయి అని ఆగాను. మా పెద్దమ్మాయి కొద్దిగా ఇటు తిరిగినట్టు అనిపించింది.  

హమ్మయ్య అనుకుని.. కొద్దిగా ఆయనకు హస్తినాపురి తో ఉన్న అనుబంధాన్ని.. అసలు ఆయన ఎందుకు కురు వంశం వాళ్ళ రాకుమారులకి గురువు ఎలా అయ్యాడో చెప్పి.. అసలు దానికీ ఇంకో రీజన్ ఉంది.. అని ఆపేశాను.  అప్పటికి ఇద్దరూ చాలా ఆసక్తి గా వింటున్నట్టు అనిపించింది. కృపి, కృపాచార్యుల వారి పరిచయం జరిగింది.. ద్రోణాచార్యులవారి బీదరికం సంగతి చెప్పి.. ఆయనకి వేరేచోట తిండికి మార్గమేలేక కాదు ఒక లక్ష్యం తో వచ్చాడు..  ఆ లక్ష్యం గురించి రేపు చెప్తాను అని ఆపేశాను.


నేనాశించిన రియాక్షన్ అయితే వచ్చింది...'నో అమ్మా.. ప్లీజ్.. చెప్పు ఎందుకు వచ్చాడో...' అని.. నేనూరుకోలేదు.. కుదరదు అని కథ ఆపేశాను.  మర్నాడు మళ్ళీ అన్నం తిన్నాక, ద్రోణాచార్యుడి చిన్నప్పటి విషయాలూ, ఆయనకి ద్రుపదుడితో స్నేహం, తర్వాత పెద్దయ్యాకా వచ్చిన విభేదం గట్రా చెప్పి మళ్ళీ కౌరవుల, పాండవుల చిన్నప్పటి కాలం లోకి లాక్కొచ్చి పడేశాను. 

పాండవులూ, కౌరవులూ అంటే కజిన్లే కానీ వారికి వైరం ఉన్న విషయం వారికి అర్థం అయ్యేలా చేసి వారిచేతే.. 'ఎందుకూ' అని అడిగించి వాళ్ళ తల్లిదండ్రుల పరిచయం చేసి..
వారు ఆవిధం గా.. ఒకరు అంధత్వం తోనూ, ఇంకొకరు పాండు రోగం తోనూ.. పుట్టటం వెనక కూడా ఒక రహస్యం ఉందని చెప్పి ఆరోజు కథ ఆపేశాను. మళ్ళీ గొడవ. ఇంకా చెప్పు.. చెప్పు అని..

ఇలాగ.. పాండవులకీ, కౌరవులకీ ఉన్న వైరం గురించి చెప్తూ.. వారి పూర్వీకుల కథల్లోకి ఒక్కొక్కరి కథ లోకి తొంగి చూస్తూ.. మళ్ళీ వర్తమానం లోకి వస్తూ కథ నడిపిస్తూ మా ఇంట్లో మహా భారత సాగరం లో ఈదుతూ ఉన్నాం. దీపావళప్పుడు మొదలు పెట్టిన కథ సంక్రాంతి దాటినా అవలేదు..  'కట్టె, కొట్టె, తెచ్చె ' గా చెప్పవచ్చు గానీ..


ప్రపంచం లో ఉన్న సమయం అంతా ఈ కథ చెప్పుకోవటానికే అన్నట్టు.. మేము.. ఏ చిన్న విషయమూ వదలకుండా.. 10 నిమిషాల కథా.. 20 నిమిషాల చర్చా.. వాళ్ళ భావోద్వేగాలు అన్నీ విపులం గా చెప్పుకుని ఆలోచిస్తూ అలాగ..

సాధారణం గా మన ఇతిహాసాలూ, పురాణాలూ చదివితే చదివిన వారికీ, విన్న వారికీ.. ఫలానా శుభాలు కలుగుతాయని శ్లోకాలు ఉంటాయి కదా.. అవన్నింటి సంగతీ ఏమో కానీ.. నాకు  గత రెండున్నర నెలల్లో కలిగిన శుభాలైతే ఇవీ.. 


ఇంట్లో టీవీ గోల తగ్గి పిల్లలు ఒక రకమైన ఆలోచన లో పడ్డారనిపించింది..  త్వరగా పని పూర్తిచేసుకుని మర్నాటికి కావలసినవి రెడీ చేసుకుంటే కానీ భారత కథ ఉండదన్నానని..  పనులన్నీ చక చకా పూర్తి చేసుకుని నేను వంట చేస్తున్నా.. వేరే పనులు చేస్తున్నా.. నా వెనకే తిరుగుతూ వంటిట్లో రెండు స్టూల్లేసుకుని కూర్చుని నాకు పప్పులూ, ఉప్పులూ అందించటం.. 

రికార్డ్ స్థాయిలో.. గడియారం ఎనిమిది కొట్టేసరికి పిల్లలుమంచం ఎక్కేసి.. కథ కోసం ఆరాట పడేవారు..  రోజు లో చాలా సార్లు భారతానికి సంబంధించిన ప్రశ్నలెన్నో అడిగేవారు.  కొన్ని ప్రశ్నలు ఇబ్బంది పెడితే.. కొన్ని అబ్బురపరిచాయి. కొన్నింటికి సమాధానాల కోసం నాకు తెలిసిన పెద్దవారినీ, పండితులనీ సంప్రదించాల్సి వస్తే.. కొన్ని ప్రశ్నలు నాకు రాలేదేమని ఈర్ష్య కలగ జేశాయి.  మచ్చుకి..  


లాక్షా గృహ దహనానంతరం పాండవులు తమకిచ్చిన ఆహారం లో సగం భీముడికివ్వాలని కదా రూల్? మరి కుంతి ద్రౌపది ని తెచ్చినప్పుడు.. అందరూ సమానంగా పంచుకొమ్మని రూల్ ఎందుకు మార్చింది?

Thank God.. matsya yantra test was not won by one of kauravaas'  

'Wow.. Mahabharat is based on hatred in brothers, and Ramayan is based on love..'


ఉపపాండవులు పాండవులని ఏమని పిలిచేవారు? ధర్మరాజ నాన్నా? భీమ నాన్నా.. అలాగా?

ఒక  అక్కా, తమ్ముళ్లలో అక్క రాణి అయి, తమ్ముడు రాక్షసుడిలా అయ్యాడు? (సుధేష్ణ, కీచకులు)
ధృతరాష్ట్రుడికి తన పిల్లలందరి లోనూ.. ఒక్క దుర్యోధన దుశ్శాసనులే ఎక్కువగా ఇష్టమా? అర్జునుడే ఎక్కువ డామేజ్ చేస్తే.. భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు? 
విశ్వరూపాన్ని , ధృతరాష్ట్రుడు చూడ గలిగాడు కదా మరి గాంధారి పట్టీ తీసిందా? ..  స్నానం చేసేటప్పుడు.. పట్టీ తీస్తే కనిపిస్తుందా? అని
ఆశ్వత్థామ హతః కుంజరః అన్న ఒక్క అబద్ధానికి కొన్ని క్షణాల పాటూ నరకాన్ని చూసాడు కదా ధర్మరాజు.. మరి 'What about gambling and loosing brothers and wife and troubling them for years..?'

కథ  అయ్యాక సరదాకి కొన్ని ప్రశ్నలడిగాను. 
మహా భారత యుద్ధానికి కారణమెవ్వరు? ఒకళ్ళు ద్రౌపది, ధర్మరాజులనీ, ఇంకొకళ్ళు భీష్మ ప్రతిజ్ఞ-ధృతరాష్ట్రుడు గుడ్డి వాడవడమనీ..  సుయోధనుడి జెలసీ అనీ చెప్పారు.
గాంధారి కరెక్ట్ పని చేసిందా? అంటే... ఒకళ్ళు 'లేదు.. She should have helped him instead..' అని,.. 'ఏమో.. ధృతరాష్ట్రుడికి జెలసీ అనుకుని కట్ట్కుకుందేమో.. అని.. 
బెస్ట్ కారెక్టర్ ఎవరు భారతం లో ? అంటే  ఒకళ్ళు 'అఫ్కోర్స్ కృష్ణుడని, ఇంకోళ్ళు.. కర్ణుడనీ 
బెస్ట్ లేడీ.. అంటే..ఒకళ్ళు ద్రౌపది అనీ, ఇంకొకళ్ళు కుంతి అనీ.. 


అలాగే నువ్వే ద్రౌపది వైతే ఏం చేసేదానివి? కుంతి వైతే ఏం చేసేదానివి? యుద్ధం ఏం జరిగితే ఆగి ఉండేది.. లాంటి చాలా ప్రశ్నలకి వారి సమాధానాలు రాసి పెట్టుకున్నాను.  నాకు తెలుసు.. ప్రతి సంవత్సరమూ.. వాళ్ల మానసిక ఎదుగుదలని బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయని..  
ఇవ్వాళ మొత్తానికి నా కథ చెప్పటం అయిపోయింది. మరి రేపేం చేయాలి? రాత్రి ఇంతకన్నా మించిన కథ ఏముంటుంది? అని ఆలోచిస్తూ ఉన్నాను.. ఇప్పుడే మా అమ్మాయి నిద్ర లోంచి లేచి అడిగింది.. 'పోనీ భగవద్గీత చెప్తావా? రేపు ? ' అని.. 'నీకు అర్థం అవుతుందా? ఇంకా కొంచెం పెద్దవ్వాలి ..' అంటే.. 'I just want to know what made Arjuna go to the war..  What did Lord Krishna say to make him go..' అంది. 

నేను.. భగవద్గీత మొదలు పెట్టాను చదవటం.. సరిగ్గా చెప్పలేనేమో.. నాకే అర్థం కాదేమో.. అన్నీ అనుమానాలే.. 


ఇప్పుడు నా మీద కొత్త ఒత్తిడి మొదలైంది.. మహా భారతాన్ని మించి మెప్పించే కథ ఏముంది? ఏమి చెప్పి ఒప్పించగలను నా పిల్లలని .. అని.. Any suggestions?
123 comments:

SHANKAR.S said...

భాగవతం అందుకోండి

Mauli said...

@@@@అర్జునుడే ఎక్కువ డామేజ్ చేస్తే.. భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు?

ఇదే ఒక పేద్ద కధ...ఆ కధ కు ఇ౦కో అయిదు కధలు ఉ౦టాయి..

క్లూ: కీచకుడు చనిపోగానే, పా౦డవుల ఆచూకీ కౌరవులకు స్పష్ట౦ గా ఎలా తెలిసి౦ది :)

budugu said...

మళ్ళీ పౌరాణికమేనా.. ఇంగ్లీష్ వద్దని భీష్మించుకుంటే కష్టమే కానీ ట్రాయన్ హార్స్ కథ కూడా ఇంచు మించు అంత పెద్దది...అంతే ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే 9-10 ఏళ్ళ పిల్లలైతే చక్కగా ఫేమస్ ఫైవ్ సిరీస్.. లాంటివి చదివించొచ్చు. కొట్టుకెళ్తే 8-14 ఏజ్ గ్రూప్ కి బోల్డన్ని ఇంగ్లీషు మినీ నవలలు, అబ్రిడ్జ్ డ్ క్లాసిక్స్ దొరుకుతాయి. నా స్నేహితుడి కూతురు పదేళ్ళకే మొత్తం హారీ పాటర్ సిరీస్ చదివేసింద్. అలాంటివీ ప్రయత్నించొచ్చు. ఊరికే మీరే చెప్పేకంటే ఎవరో ఒకరు చదువుతుంటే మిగిలిన వాళ్ళు వినే పద్ధతి పెట్టుకోవచ్చు. you can mix n match all these and make it really interesting. happy reading/story telling.

KumarN said...

ఆంధ్రా, తెలంగాణా కథ ఎత్తుకోండి. ఇది సాగినన్ని రోజులూ మీ కథా సాగుతుంది :-)
That's a joke,

On a serious note, I am amazed with your effort.
చప్పట్లు.

Ennela said...

పంచ తంత్రాలు అయిపోయాయా?

lalithag said...

పిల్లలకేమో కానీ, నాకు తెలియని కథలెన్ని ఉన్నాయో భారతంలో.
ఈ మధ్యే అనుకోకుండా తటస్థపడుతున్నాయి.
"భారతంలో చిన్న కథలు" నేను ఎప్పుడో తెచ్చుకోవాల్సిన పుస్తకాల్లో తప్పిపోయింది.
కొనాలైతే.

కృష్ణప్రియ said...

@ SHANKAR.S,

కృష్ణుడి కథలు టీవీ లో చూసేసారు. ప్రాబ్లం ఏంటంటే.. ఏం కథ చెప్పినా.. వాళ్ళు చదివేసే ఉంటారు. బాగా ఇంటరెస్టింగ్ గా చెప్పగలగాలి.. ఎలా అని చూస్తున్నాను.

@budugu,

మా పెద్దమ్మాయి కూడా హారీ పాటర్ వి చదవటం, చూడటం లాంటివి చేసింది. Enid Blyton's వి బోల్డు చదువుతుంది.

ట్రాయన్ హార్స్ కథ -- Sounds interesting.. చూస్తాను బుక్ స్టోర్ లో థాంక్స్ అ లాట్!!..

@KumarN,

:) I think, most of the moms do.. Thanks!

కృష్ణప్రియ said...

@ Mauli,

Sounds interesting.. Please చెప్పేయండి.. నాకెంత ఆలోచించినా.. ఐడియా రావట్లేదు.

@ Ennela,

పంచ తంత్రము.. చదివేసారండీ.. అమర్ చిత్ర కథ ఉంది గా మనకి..

ప్రాబ్లెం.. పిల్లలు చదవనివి..మనం చెప్పాలి ..

@ lalithag,

అవును.. బోల్డు బోల్డు కథలు.. పైన మౌళి గారు చెప్పారు.. నాకు బోల్డు క్యూరియాసిటీ గా ఉంది .. ఎందుకబ్బా? అని..

Kathi Mahesh Kumar said...

:) :) :)

anveshi said...

బావుంది ఎప్పటిలానే మీ పొస్ట్.

దీనికి మనకి తెలిసిన సమాధానాలు చెప్పకుండా వాళ్ళకి దీని మీద చాల శ్రద్దగా వుంది కనుక యి సారి హైదరాబాదు వెళ్ళినప్పుడొ మరో రకం గానో "భారతం లో ధర్మ సుక్ష్మాలు "
అనే పుస్తకం రాసిన శ్రీ మల్లాది చంద్రశేఖర గారి ఇంటినుంచి తెచ్చుకో/తెప్పించుకోగలరు.బయట ఎక్కడా దొరకదు(నాకు తెలిసి)
వారి ఇంటికి వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాలి.భారతంలో మనకి కలిగే ప్రశ్నలు/సమాధానలకి మంచి పుస్తకం.IMO.

60 సంవత్సరాలకి పైన ప్రవచనాలు చెప్పిన మల్లాది గారి ప్రవచనం ఇక్కడ మీరు వినాలి అంటే.
http://surasa.net/music/purana/#malladi_malladi_bharata_songs

Sravya Vattikuti said...
This comment has been removed by the author.
sunita said...

నిజంగానే మీ కవన చాతుర్యానికి చప్పట్లు. నేను ఎంత ప్రయత్నించి అంగుళం కదల్లేకపోయాను. వెరీ బిగినింగ్లోనే మనిషి మనిషి వాసన కాకుండా చేపల వాసన, మరలా సుగంధం వాసన ఎలా వస్తాయి (సత్యవతి విషయంలొ). ఎంత రాజైనా అలా క్రూయల్గా పిల్లలని చంపుతుంటే ఎలా ఊరుకున్నాడు(గంగ). అలాంటి జబ్బులున్నవాళ్ళకి పిల్లలను ఇచ్చి పెళ్ళి చేసారంతే పేరెంట్స్ చాలా సెల్ఫిష్( ద్రుతరాష్ట్రుడి, పాండు రాజు పెళ్ళి). అసలు వాళ్ళు పాండవులు ఎలా, తైర్ ఫాదర్స్ వర్ డిఫరెంట్, దెయ్ షుల్డ్ రెఫెరెడ్ బై దైర్ మాంస్ నేం. వాళ్ళ నాన్న కాని వాని ఆస్తి వాళ్ళకు ఎలా వస్తుంది? ఈ చెత్తంతా మాకు అవసరమా? ఇందులొ ఏమి మంచి ఉంది. నువ్వు చెప్పె ఏ రీజనూ ఏ కాలానికీ ఒప్పుకోరు.

ఇలాంటివి కొల్లలు. అడుగడుక్కీ సందేహమే! అపనమ్మకంగా నేనేదొ కుకప్ చేసి చెప్తున్నానని అనే బాడీ లాంగ్వేజి. లేదా నన్ను కాకా పట్టదలుచుకుంటే మా చిన్నది ఆ అదేదొ భారతం అని చెపుతావు గా మమ్మీ అని వేషాలు. ఇలా కాదని సీరియల్ రూపంలొ వచ్చినదాన్ని ట్రై చేసా, ఒకటే నవ్వులు నేను చూడకుండా. ఎంత పిచ్చో అని(మాడ్).విసుగు వచ్చి వదిలేసాను. కొంతలొ కొంత ఈ గనేశా సిరీస్ నయం. క్రిష్ణ, భీం ఏజి దాటిపోయింది కనుక చూడరు.

kiran said...

హహహ..భలే చక్కగా చెప్తున్నారు మీ పిల్లలకు..:) అన్ని...:)
అసలు భగవద్గీత తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చినందుకే..మీ అమ్మాయిని మెచ్చుకోవాలి..:)

Sravya Vattikuti said...

చాల బావుందండీ (మీ పోస్టు, మీరు మీ పిల్లలకు ఇంట్రెస్ట్ కలిగేటట్లు వాళ్ళని మలచటం రెండూ కూడా) . నాకూ మహాభారతం చాల ఇష్టం ఎక్కడా బిగి సడలని స్క్రీన్ప్లే :)
భీమడు, కీచకుడు, బకాసురుడు, దుర్యోధనుడు , జరాసంధుడు వీళ్ళ ఐదుగురు వాళ్ళలో ఒకళ్ళు మాత్రమే వేరేవాళ్ళను చంపగలరు, వేరే వాళ్ళు ఎవరూ వీళ్ళను ఏమి చేయలేరు, అంతే కాకుండా ముందు గా ఎవరైతే వీళ్ళలో ఒకరు వేరే వాళ్ళని చంపగలరో అతనే మిగిలిన ముగ్గురిని కూడా చంపగలడు . అందుకే కీచకుడు చనిపోగానే పాండవులు విరాటరాజు కొలువు లో ఉండొచ్చు అన్న క్లూ దొరుకుతుంది , నేను కరెక్టే నా మౌళి గారు ?:)

Sravya Vattikuti said...

స్పెల్లింగ్ mistakes ఉన్నాయని కామెంట్ డిలీట్ చేసి మళ్ళీ పోస్ట్లు చేసాను , కంగారు పడకండి :)

రాధిక(నాని ) said...

బాగుందండి .చాలా ఓపికగా చెపుతున్నారు.

శ్రీనివాస్ పప్పు said...

లాక్షా గృహ దహనానంతరం పాండవులు తమకిచ్చిన ఆహారం లో సగం భీముడికివ్వాలని కదా రూల్? మరి కుంతి ద్రౌపది ని తెచ్చినప్పుడు.. అందరూ సమానంగా పంచుకొమ్మని రూల్ ఎందుకు మార్చింది?

కుంతీదేవి పాండవులు తెచ్చిన అన్నాన్ని రెండు భాగలు చేసి ఒక మొత్తం భాగాన్ని భీముడికే పెట్టి, మిగిలిన రెండవ భాగాన్ని మిగిలిన వారికి పంచేదంటే ఆమెకి మిగిలినవారి మీద ప్రేమలేదనికాదు. భీముడు మాత్రమే చేయగలిగిన కార్యాలకు తగిన శక్తి సమకూర్చడం ఆమె ఉద్దేశ్యం.

ద్రౌపదిని తెచ్చినప్పుడు ఒక వస్తువును తెచ్చామని చెప్తారు, అందుకే సమానంగా పంచుకోండి అని చెప్తుంది కుంతి(రూల్ మార్చడం కాదు,అది తిండివస్తువూ కాదు కాబట్టి రూల్ మార్చినట్టూ కాదు కదా)

శ్రావ్యా మీరు చెప్పింది కరక్టే (వారంతా ఒకే నక్షత్రం లో జన్మించారని కధనం)

Anonymous said...

baavumdamdi

Sravya Vattikuti said...

మీ ఈ పోస్టు లింక్ నినా buzz లో పెట్టాను (ఇక్కడ చూడచ్చు ) చైనా సుదీర్ కుమార్ తను ఇక్కడ కామెంట్ రాయలేక పోయారట , చాల బాగుంది అని చెప్పమన్నారు .

Mauli said...

Krishna Priya :)

మహాభారత౦ లో చెప్పేవి ఇ౦కా చాలా ఉన్నాయి కదా..

నాకు పూర్తిగా జ్నాపక౦ లేదు ...కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు,దుర్యోధనుడు, జరాస౦ధుడు వీరు ఒకే నక్షత్ర౦ లో పుట్టిన వారు అనుకు౦టాను..ఇవి నెట్ ను౦డి కాపి చేశా చూడ౦డి ,


*Bheemudu, Duryodhanudu, Keechakudu, Jara Sandrudu veelu andaru oka nakshatram lo putinavaalu.

evaru evarni mundara champite atanu vere vaalani champataru.

Nijanajik Duryodhanudu Bheemudu kante goppa vaadu gadha yudham lo andukani Bheemudu maha bharatam lo duryodhandu pai gelval ani Krishnudu Jara sandruduni champistadu bheemudi cheta ( chala help chestadu krishnudu ee yudham lo)>>>భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు?

To save his son duryoadhana :)

-----------------

ఇక నేను చెప్పిన క్లూ కి స౦బ౦ధి౦చిన విషయ౦: విరాట పర్వ౦ ను౦డి ,


"దుర్యోధనుడు అందరి మాటలను సావధానంగా విని సభను ఉద్దేశించి " కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు అసమాన బలాఢ్యులు. వీరితో పోలిన వారు భూమిలో ఎవరూ లేరు. వారిలో వారే ఒకరిని ఒకరు గెలవాలి. మత్స్యదేశ సైన్యాద్యక్షుడు కీచకుని గంధర్వుడెవరో చంపాడని తెలిసింది. ఒక కాంత కారణంగా చంపాఋఅని తెలిసింది. కీచకుని చంపాలంటే మిగిలిన ముగ్గురిలో ఒకరు చంపాలి. బలరాముడు , శల్యుడు మత్స్య దేశానికి దూరంగా ఉన్నారు కనుక వారు చంపలేరు. ఉపకీచకులతో చేర్చి కీచకుని వధించిన గంధర్వుడు అజ్ఞాతవాసంలో ఉన్న భీముడై ఉండచ్చు. ఆ కాంత ద్రౌపది కావచ్చు."

Mauli said...

శ్రావ్య గారు,

వ్యాఖ్యలు అన్నీ చదవకు౦డా నే రిప్లై చేశా ..మీరు కరెక్టే :) , ఎటొచ్చీ వీరి పేర్లు కొ౦చె౦ డవుట్ ...బకాసురున్ని భీముడు పసివాడి గా ఉన్నప్పుడే చ౦పుతాడు ...కాబట్టి అతను లిస్ట్ లో ఉ౦డే చాన్స్ అనుమానమే ..బలరాముడు మాత్ర౦ కరెక్టే ..

కాబట్టి ఇలా అనుకొ౦దా౦,
భీమడు, కీచకుడు, బలరాముడు, దుర్యోధనుడు , జరాసంధుడు..

థా౦క్యూ :)

జరాసంధుడు ని భీముడు చ౦పిన విషయ౦ బయటికి తెలియనివ్వరు అనుకొ౦టాను.

sanju -The king!!! said...

మీ అమ్మాయిలు మీ బ్లాగుని చదవకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టనిపిస్తోంది నాకు, లేకపోతే మీరు కథ పూర్తీ చేసేలోపే వాళ్ళు net లో చదివేయ్యగలరు :)

వాళ్ళు అర్థం చేసుకుని ప్రశ్నలు అడిగినవిధానం చూస్తె, ఒక bedtime story లాగా కథ మధ్యలోనే నిద్రలోకి జారిపోవడం కాకుండా వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది...పాత చందమామ పుస్తకాల్లో ఉన్న బేతాళ కథలు try చేసి చూడండి...అవి కూడా ఆలోచనలని బాగా రేకేట్టిన్చేవే...పాత చందమామలన్ని online లో ఉన్నాయి .

Sravya Vattikuti said...

I thought I posted the link anywayz here is the link http://www.google.com/profiles/SravyaV2020#buzz

హరే కృష్ణ said...

పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు..గ్రేట్!
>>వాళ్ల మానసిక ఎదుగుదలని బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయని..
ఇది చాలా చక్కగా చెప్పారు.చప్పట్లు!వింటే భారతమే వినాలి.. తింటే...


టల్లోసే తినాలి!

Mauli said...

http://avee-ivee.blogspot.com/2007/02/blog-post_12.html

lalithag said...

">>>భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు?

To save his son duryoadhana :)"

I think "Dhrtarashtra kaugili" incident was after the war. So, if at all there has to be a reason, it might be a different one.

Anonymous said...

మంచి అనుభవాలండీ. పిల్లలకి కథలు చెప్తుంటే మళ్ళీ మనం వాటిని కొత్తగా explore చేస్తున్నట్టుంది. మా ఇంట్లోనూ ఇలా "సీరియల్ కథలు" నడుస్తూ వుంటాయి. అభిఙ్ఞాన శాకుంతలం తో సహా చాలా కథలే కవర్ చేసాము.
మా పెద్దమ్మాయి పర్వాలేదు కానీ, మా చిన్నదానికి రామాయణ భారతాలు చెప్పటం చాలా గొప్ప ఎక్స్పీరియెన్సు! ఆమెకి పెద్ద పేర్ల కన్ ఫ్యూషను!
"రాముడి తండ్రి పేరేమిటో చెప్పు" అంటే "దుర్యోధనుడు" అంటుంది! "నీ మొహం! దశరథుడు" అని మనం సరి చేస్తే, "అదే, అదే, డి తో మొదలయ్యే పేరు!" అంటుంది. అసలది రామాయణంలో పాత్రలకీ, భారతంలో పాత్రలకీ ఎంత కంఫ్యూస్ అవుతందంటే, ఇక నేను చెప్పటం మానేసాను! మళ్ళీ ఆవిడొక రచయిత్రి కూడాను!
ఆంగ్ల సాహిత్యం లోకీ అప్పుడప్పుడు తొంగి చూస్తుంటాము.
మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
శారద

lalithag said...

ఇది టపా గురించి కాదు.
శ్రావ్య గారూ, మీ బజ్ లో ఏదో ఎవరో చూడలేరు అని మీరు మాట్లాడినవి నేను (బజ్ అసలు వాడని దాన్ని) కూడా చూడ గలుగుతున్నాను.
చూసుకోగలరు.
కృష్ణా, ఈ భాగం నీకు పరవాలేదనిపిస్తే (నీ బ్లాగుని నేను express చెయ్యడానికి వాడుకోవడం) ప్రచురించు.
ఈ బ్లాగుల భాగవతం ఇంకా పసందుగా వడ్డించుకుని తింటున్నట్టున్నారే అందరూ.
ఇది కథగా రాయండి ఎవరైనా, మంచి thriller అవుతుంది.
ఏమిటో, ఒకరి పంట పండిందని ఇంకొకరు, ఒకరు చివాట్లు వేశారని రెచ్చి పోయి ఒకరూ, ఎవరో ఇద్దరు గొడవ పడుతుంటే మరి కొందరు పక్కనుంచీ కెలికి కిసుక్కుమనుకోవడాలూ, వాళ్ళ పేర్లు చెప్పుకుని వీళ్ళు అదో రకమైన.. ఆనందం పడడాలూ.
ఇక ఆపితే బాగుంటుందేమో.
జరిగిన విషయంలో బోల్తా పడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో కొందరు పెద్ద వారు, ఇంకా మనుషులని "నమ్మే" వారూ ఉన్నారు.
అలా నమ్మడం లో తప్పు లేదు కదా.
పడని వారు మహా తెలివైన వారా, లేక వాళ్ళూ అలాంటి చురుకైన వారా అనేది ఆలోచించుకోవలసిన విషయం కూడా కదా.

Love all, trust a few, do wrong to none. ~William Shakespeare

తెలుగు బ్లాగులలో మంచి విషయాలు, బ్లాగరులు సాధిస్తున్న మంచి పనులూ చాలానే ఉన్నాయి.
అందరిలోని మంచినీ కలుపుకుని మరింత మంచిని సాధిద్దాం.
మంచిని పెంచుదాం. ఎవరికి వారు తామే గొప్ప (తప్పు లేని) వారనుకుని ఇంకొకరి మీదకి రాళ్ళు విసురడం చేసుకోవద్దు.ఎవరు ఎప్పుడు ఎవరికి ఏం సాయం చేస్తారో, ఎవరికి ఎవరి సాయం అవసరమౌతుందో, స్నేహంగా ఉందాం. ఎవరికీ తెలియని విషయాలు కాదు ఇవి. ఏదో నాకు చెప్పాలనిపించింది.

కావ్య said...

కృష్ణ ప్రియ గారు .. చాలా బాగా అనిపించింది .. మీ పోస్ట్ చదువుతూ ఉంటె ..
చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే ... రామాయణం అవి రోజుకి కొంత .. కాని నేను ఒక కధ ఎన్ని సార్లు అయిన చెప్పించుకునేదాన్ని .. అది గజేంద్ర మోక్షం :)
కాని మీరు రాసింది చదివాక ఎందుకో నాకు చాలా ఆనందం వేసింది ( ఎందుకో తెలీదు) .. నేను చిన్నప్పుడు భారతం భాగవతం రామాయణం అవి చదివాను కాని చిన్న పిల్లల పుస్తకాల్లో .. చదివాను .. సో ఇంత డీప్ గా నాకు తెలియదు .. మే బి చదవలేమో .. :) థాంక్స్ ఫర్ ది పోస్ట్ ...

Sravya Vattikuti said...

లలితా గారు buzz పబ్లిక్ అని నా ఐడియా ఉంది అందుకే లింక్ ఇక్కడ ఇచ్చా !
Anywayz thanks for your concern !

కృష్ణప్రియ said...

@ మహేశ్,

థాంక్స్..

@ అన్వేషి,

ధన్యవాదాలు.. చాలా మంచి లింక్స్ ఇంచ్చారు. I will definitely purse them..

@ సునీత,

నేనూ 3-4 సార్లు ప్రయత్నించాక, వదిలేద్దామనుకున్నాక, ఇలా కాదని,..వేరే విధం గా మొదలు పెట్టాను. మీరన్నట్టు.. భీష్మ ప్రతిజ్ఞ నుండీ, అంబ, అంబిక అంబాలిక ల పెళ్ళిళ్ళూ, ధృతరాష్ట్ర, పాండు జననాలూ.. ఏకలవ్యుడి గురుదక్షిణా..

ఇలా అడుగడుగునా.. ప్రశ్నలే.. అందునా ఈ తరం పిల్లలు ప్రశ్నించకుండా వదలరు. కొన్నింటికి వెనక పరమార్థముందని, అది కాస్త పెద్దయ్యాక అర్థమవుతుందని వదిలేశాను. కొన్నింటికి.. ఒరిజినల్ పుస్తకం చదివితే సమాధానాలు దొరుకుతాయని అవి వారే తెలుసుకోవాల్సి వస్తుందని చెప్పాను. కొన్ని యుగధర్మమని, ఆరోజుల్లో అదే కరెక్టని సద్ది చెప్పాను. అలాగ..

మొత్తానికి మా పెద్దమ్మాయి డా. రాజగోపాలా చారి గారి పుస్తకం మొదలుపెట్టి ఒక పది చాప్టర్లు చదివింది.

కృష్ణప్రియ said...

@ కిరణ్,

ధన్యవాదాలు!!

@ శ్రావ్య,

థాంక్స్ :))
మీకు ఇతిహాసాల్లో పురాణాల్లో బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. విరాటరాజు కొలువులో కీచక వధ తర్వాత కౌరవులకి ఇలాగ తెలిసిందని చిన్నప్పుడు ఏదో సినిమాలో చూశాను కానీ పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ మౌళి గారి వల్లా, మీ వల్లా గుర్తొచ్చింది.

@ రాధిక గారు,

థాంక్సండీ.. ఏదో మొదటిసారి ఇలా చెప్పగలిగాను..

కృష్ణప్రియ said...

@ శ్రీనివాస్ పప్పు గారు,

ధన్యవాదాలు!! అవును.. నిజమే వస్తువు అంటారు..
ఆహారం విషయం లో మీరు చెప్పిన వివరణే ఇచ్చాను నేను. ఈ ప్రశ్నకి సమాధానం మాత్రం ఇవ్వలేదు.. నాకు తెలియదని చెప్పాను.. ఈ సారి చెప్తాను.. అన్నట్టు నా బ్లాగ్ కి స్వాగతం! :)


@pureti,
థాంక్స్! మీరు కూడా మొదటి సారి వచ్చినట్టున్నారు ఇటుకేసి.. స్వాగతం!

@ మౌళి గారు,


పైన శ్రావ్యకి చెప్పినట్టు ఎక్కడో సినిమాలో చూశా గానీ మర్చిపోయా.. Thanks for reminding me ..
ఆ ఐదుగురిలో బలరాముడు ఉన్నాడంటారా? బలరాముడిని భీముడు చంపడు కదా.. ఓహ్.. అంటే ఒకవేళ చంపితే అనా?


అలగే.. దుర్యోధనుడిని చంపినందుకు ఆక్రోశం తోనే.. భీముడికి ధృతరాష్ట్ర కౌగిలి లభిస్తుంది కదా?

భైరవభట్ల కామేశ్వర రావు said...

చాలా బాగుందండి మీ ప్రయత్నం!

"'Wow.. Mahabharat is based on hatred in brothers, and Ramayan is based on love.." - What an observation!

"విశ్వరూపాన్ని , ధృతరాష్ట్రుడు చూడ గలిగాడు కదా మరి గాంధారి పట్టీ తీసిందా?" - భలే అనుమానం! నిజానికి సంస్కృత భారతంలో ధృతరాష్ట్రుడు కూడా విశ్వరూపాన్ని చూసినట్టు లేదనుకుంటా.

"అర్జునుడే ఎక్కువ డామేజ్ చేస్తే.. భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు?" - ధృతరాష్ట్రుడి నూరుగురు కొడుకులని భీముడే చంపుతాడు. అందుకే అతనికి భీముడంటే విపరీతమైన కోపం కలుగుతుంది.

ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు (పంచ భీములంటారు) భీముడు, బకాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడే.

కృష్ణప్రియ said...

@ sanju -The king!!! ,

రాజుగారికి మొదట గా నా బ్లాగు కి స్వాగతం!
థాంక్స్..భేతాళ కథలు తప్పక చెప్తాను. చాలా మంచి ఐడియా.. వాళ్ళు పాత చందమామలు చదివే చాన్సే లేదు :)

@ శ్రావ్య,
మీ బజ్ చూశాను ఇప్పుడే మీ అందరికీ చాలా చాలా థాంక్స్!

@ హరేకృష్ణ,

థాంక్స్.. కరెక్ట్ మాట.. వింటే భారతమే వినాలి.. తింటే...టల్లోసే తినాలి! :)

కృష్ణప్రియ said...

@ లలిత,


I think "Dhrtarashtra kaugili" incident was after the war.

నువ్వు అన్నది కరెక్టే..

@ శారదగారు,

హ్మ్..ధన్యవాదాలు.. మీ కథల అనుభవాల్ని పంచుకున్నందుకు థాంక్స్.. మీ అమ్మాయి ఏం రాస్తుంది? వివరాలిస్తారా?


@ కావ్య,

:) థాంక్స్..

@ భైరవభట్ల కామేశ్వర రావు గారు,

మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు. హ్మ్ అయితే.. అందర్నీ.. భీముడే చంపుతాడన్నమాట.

Mauli said...

కృష్ణప్రియ గారు,

@ఆ ఐదుగురిలో బలరాముడు ఉన్నాడంటారా? బలరాముడిని భీముడు చంపడు కదా.. ఓహ్.. అంటే ఒకవేళ చంపితే అనా?@@@

బకాసురుణ్ణి భీముడు చ౦పిన విషయ౦ కూడా దాచిపెడతారా అయితే? అ౦టే భీముడు చిన్న పిల్ల వాడు గా ఉన్నప్పుడే మిగిలిన ముగ్గురిని చ౦పేది అతడే అని తెలిసిపోతు౦ది కదా? ఉ హూ ..కొ౦చెము మీరు కూడా శోధి౦చ౦డి ..

భైరవభట్ల గారు చెప్పారు కాబట్టి బకాసురుడే అనుకొ౦దాము .కాని బకాసురుణ్ణి చంపాక , శ్రీ కృష్ణుడు ప్రత్యేకం గా జరాసంధుడిని భీముడు చేత ఎ౦దుకు చంపి౦చాల్సి వస్తుంది ? కొ౦చెము వివరి౦చగలరు

యుద్దానికి ము౦దు పా౦డవులు ధృతరాష్టృడు అసలు యెదురు పడరు కాబట్టీ యుద్ద౦ తర్వాతే అయ్యు౦డాలి

మీకు తెలిసే ఉ౦టు౦ది, కౌరవులు అ౦దరూ చనిపోరు ...యుయుత్సుడు ఉన్నాడు.

lalithag said...

At another sourse, a different named popped up.
"It is said that Bheema, Duryodhana, Keechaka, Jarasandha and Hidimbasura were born in the same cosmic phase. It was said that the one who kills the first among these five will kill the rest of them too. Bhima is the first to kill Himdimbasura and eventually slays everyone else."
Found it here:
http://www.lisp4.facebook.com/topic.php?uid=131161716926131&topic=244
Intersting discussion.
Krishna, it's not just your kids, you are motivating all of us here :)
Don't climb munaga chettu now. We need you around :)
Anyway, was it hidden that Bhima killed the other mighty ones?
Another resource my friend once recommended but I found not alway very consistent with my knowledge and interpretation, but interesting nevertheless. Some one can browse and discuss.
http://devdutt.com/bhima/
An aside: Sravya,
There were pieces of conversation you seemed to be confident of, that others cann't see in the buzz. That's what I was talking about, as the buzz is now public. As it turns out, seemingly private (to one group) conversations are turning out in public places after the "revlation". So, let's be cautious as well as honest and considerate.

Mauli said...

శ్రీనివాస్ పప్పు గారు...

@ద్రౌపదిని తెచ్చినప్పుడు ఒక వస్తువును తెచ్చామని చెప్తారు

కు౦తి కి ప౦డు తెచ్చామని చెబుతారు కదా...అ౦దుకే ప౦చుకొమ్మనడ౦ :) ..వస్తువు ఎలా ప౦చుకొ౦టారు..కాక పోతే ఇది చిన్న పిల్లలు అడిగిన అమాయకపు ప్రశ్న ..అనుకు౦టున్నాను..

బద్రి said...

నాకు తెలిసినంతవరకు భీముడు, దుర్యోదనుడు, కీచకుడు etc లకి గురువు బలరాముడు. తను ఒకరి చేతిలో మిగిలినోళ్ళు మరణిస్తారని శాపమో వరమో ఇచ్చాడు అనుకుంటా !!!

కొత్త పాళీ said...

కృష్ణప్రియగారు, అనేకానేక అభినందనలు మీ కథనకళాచాతుర్యానికి.
పంచంతంత్రం వెదికితే వాళ్ళకి ఇంతకుమునుపు పరిచయం లేని కథలు దొరక్క పోవు.
కానీ పొడుగ్గా, భారతమంత క్లిష్ట పాత్రల్తో సన్నివేశాల్తో కావాలంటే మీకు రెండు నిధులున్నాయి - 1. అరేబియన్ నైట్స్, 2. గ్రీకు, రోమను దేవగాథలు. రెండిటికీ పిల్లలకి సరిపోయే లాంటి వర్షను పుస్తకాలు దొరుకుతూనే ఉన్నాయి అనుకుంటాను.

కొత్త పాళీ said...

ఈ బలశాలుల కాంట్రవర్సీ గురించి నాదోమాట. భారతంలో ఉన్న కబురు వాళ్ళు సమాన బలశాలులు అని మాత్రమే. మొదట ఎవడైతే ఇంకోణ్ణి చంపుతాడో వాడే మిగతావాళ్ళందర్నీ చంపుతాడు అనే ప్రిడిక్షను లేదనే అనుకుంటున్నా. మిగతా నలుగురూ భీముడి చేతిలోనే చావడం గమనించిన అతి తెలివిగాడెవరో తరవాత పుట్టించి ఉంటాడు ఈ సూత్రాన్ని.
అవర్సలో చూస్తే
ఏకచక్రపురంలో మారువేషంలో ఉన్నప్పుడు (ద్రౌపది స్వయంవరానికి ముందు) బకాసురుణ్ణి,
రాజసూయానికి ముందు జరాసంధుణ్ణి,
అజ్ఞాత వాసంలో కీచకుణ్ణి,
చివరికి యుద్ధంలో దుర్యోధనుణ్ణీ భీముడు చంపాడు.
నిజానికి జరాసంధుడికీ పాండవులకీ ఏమీ వైరం లేదు. కానీ జరాసంధుడికి కృష్ణుడంటే మంట. చాలాసార్లు మథుర మీద దండయాత్ర చేస్తాడు. వాడి పోరు పడలేక కృష్ణుడు యాదవుల రాజధానిని మథుర నించి ద్వారకకి తరలిస్తాడు. రాజసూయానికి ముందు భీమార్జునుల్ని వెంట బెట్టుకుని ముగ్గురూ బ్రాహ్మణవేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్తారు. రాజసూయమంటే మిగతా రాజులందరూ ధర్మరాజు గొప్పని అంగీకరించాలి. జరాసంధుడు మొండి వెధవ, ఒప్పుకోడు అని కృష్ణుడు ఊహించి ముందు జాగ్రత్తగా మట్టుపెట్టించి ఉంటాడు.

Mauli said...

బలరాముడు అటువ౦టి వరాలిచ్చే టైప్ కాదు..మహా భారత యుద్ద౦ సమయ౦ లో తీర్ధయాత్రలకు వెళ్ళిన మహానుభావుడాయన....

@కొత్త పాళీ గారు,

రాజసూయానికి చాలా ధనము కావాలి..అది జరాసంధుని దగ్గర మాత్రమే ఉ౦ది ..ఇది ఒక ముఖ్య కారణ౦..

కాని ధనము కోస౦ చ౦పనక్కర లేదు ..ఓడిస్తే సరిపోతు౦ది ..ఇక అతన్ని రె౦డు భాగాలుగా చీల్చి చెరో దిక్కు లో విసిరేస్తాడు ..అది మరణ రహస్యమా...లేక అతని మరణ౦ గోప్య౦ గ ఉ౦చడమా...

tnsatish said...

What @Srvaya said is correct.
What @Bhairavabatla Kameswara Rao and @lalithag said are partially correct.

>> అర్జునుడే ఎక్కువ డామేజ్ చేస్తే.. భీముడిని ఎందుకు కౌగలించుకుని
>> చంపాలనుకున్నాడు?

Bheema has killed all the 100 kauravas.

Bheema is the one who killed more no.of people in the war. Arjuna killed less than Bheema. But, Arjuna killed many important warriors.


The five people who have equal strength are Bheema, Keechaka, Bakasura, Duryodhana and Jarasandha. According to Bhagavatham, Balarama has more strength than Bheema. Salya is not related to any of them. Salya was killed by Dharmaraja in the war.


>>భీముడిని ఎందుకు కౌగలించుకుని చంపాలనుకున్నాడు?
>>To save his son duryoadhana :)

Dhritharashtra tries to kill Bheema after the war.


>> ...బకాసురున్ని భీముడు పసివాడి గా ఉన్నప్పుడే చ౦పుతాడు
>> ...కాబట్టి అతను లిస్ట్ లో ఉ౦డే చాన్స్ అనుమానమే

Bakasura was killed by Bheema not during childhood. He was killed little before they marry Droupadi.>> జరాసంధుడు ని భీముడు చ౦పిన విషయ౦ బయటికి తెలియనివ్వరు అనుకొ౦టాను.

I don't think, they hide anything.

>> నిజానికి సంస్కృత భారతంలో ధృతరాష్ట్రుడు కూడా విశ్వరూపాన్ని
>> చూసినట్టు లేదనుకుంటా.

Dhritarashtra has seen the viswa roopa of Krishna. After seeing the viswa roopa, he asks krishna to take back the vision, because, he does not want to see the dirty world with the eyes which has seen the lord.


>> బకాసురుణ్ణి భీముడు చ౦పిన విషయ౦ కూడా దాచిపెడతారా అయితే?
>> అ౦టే భీముడు చిన్న పిల్ల వాడు గా ఉన్నప్పుడే మిగిలిన ముగ్గురిని
>> చ౦పేది అతడే అని తెలిసిపోతు౦ది కదా? ఉ హూ ..కొ౦చెము మీరు
>> కూడా శోధి౦చ౦డి ..

I don't think they hide anything. Even if not Bakasura, after the death of Keechaka or Jarasandha, they would know.

>> భైరవభట్ల గారు చెప్పారు కాబట్టి బకాసురుడే అనుకొ౦దాము .కాని
>> బకాసురుణ్ణి చంపాక , శ్రీ కృష్ణుడు ప్రత్యేకం గా జరాసంధుడిని
>> భీముడు చేత ఎ౦దుకు చంపి౦చాల్సి వస్తుంది ? కొ౦చెము
>> వివరి౦చగలరు

>> రాజసూయానికి చాలా ధనము కావాలి..అది జరాసంధుని దగ్గర
>> మాత్రమే ఉ౦ది ..ఇది ఒక ముఖ్య కారణ౦..

>> కాని ధనము కోస౦ చ౦పనక్కర లేదు ..ఓడిస్తే సరిపోతు౦ది ..ఇక
>> అతన్ని రె౦డు భాగాలుగా చీల్చి చెరో దిక్కు లో విసిరేస్తాడు ..అది
>> మరణ రహస్యమా...లేక అతని మరణ౦ గోప్య౦ గ ఉ౦చడమా...

Krishna knows that Jarasandha would be killed only by Bheema. Jarasandha defeats Krishna 17 times. 18th time, Krishna leaves Madhura and moves to Dwaraka. For Pandavas to perform Rajasuya yagam, they have to defeat Jarasandha. The most important warriors do not accept defeat as long as they are alive. Same thing with Jarasandha. It is not possible to win, without killing him.

When Jarasandha was born, he was born as two pieces. Jara has merged the two pieces and gave life to him. Hence, he was called as Jarasandha. The only way to kill him is, making him into two pieces, and that's why Bheema kills him that way.

>> మీకు తెలిసే ఉ౦టు౦ది, కౌరవులు అ౦దరూ చనిపోరు
>> ...యుయుత్సుడు ఉన్నాడు.

Yuyuthsa is a son of Dhritarashtra, but not the son of Gandhari. All the 100 sons of Gandhari dies in the war. Yuyuthsa moves to the pandava side before the war, and he survives.

Indian Minerva said...

మీ పిల్లలడిగిన ప్రశ్నలు చాలా బాగున్నాయండి.

మీరు ఏకంగా భగవద్గీతనే bedtime story గా చెబ్తారా?????

Sravya Vattikuti said...

Satish Thanks for sharing the info !
Krishna Priya gaaru special thanks to you for giving us a chance to refresh and addon some knowledge in this area!

Sasidhar Anne said...

Ninja - power lanti series lo pothunna ee generation lo , meeru mee pillalaki bharatam gurinchi cheppina vidhanam really superb!!!.
Pai Comments lo cheppinattu Troy Story cheppavacchu,leda bhagavatham try cheyyandi. inka tom sayer series kooda chala bavuntayi.Guiliver travels cheppesara???

భైరవభట్ల కామేశ్వర రావు said...

>>Dhritarashtra has seen the viswa roopa of Krishna

Satish garu,

Can you please give any reference (the slokas) to this. I looked at a version of Sanskrit Mahabharata and I couldn't find any Slokas that refer to this.
But in andhra bharatam it is there.

tnsatish said...

Kameswararao garu,
I have read it in an english book, which is considered as very authentic (i.e., same as the original sanskrit version.) If you cannot find it, then probably, it is not there.

Another case might be, it is there in some other purana. For example, In Bhagavatham, it is mentioned that, Dhritarashtra realizes everything in the last few days, and he becomes a big devotee and gets Moksha in just few days. In the similar way, it might have been mentioned in some other purana, and many others take it from that purana instead of Mahabharath. For example, 90% of the stories of krishna are from Bhagavatham only and not from Mahabharath.

By the way, you might be knowing that, there are many differences between telugu mahabharath and Sanskrit Mahabharath.

Mauli said...

Satish Gaaru,

Thanks...

@Dhritarashtra has seen the viswa roopa of Krishna

Even I have read this..

భైరవభట్ల కామేశ్వర రావు said...

సతీష్ గారు,

అవునండి. సంస్కృత భారతమే చాలా వెర్షన్లున్నాయి. బహుశా నన్నయ్యకి దొరికిన వెర్షనులో ధృతరాష్ట్రుడికి దివ్యదృష్టి ఇవ్వడమన్న సంగతి ఉందేమో. అందుకే మీకా వెర్షను దొరికిందేమోనని అడిగాను.

tnsatish said...

Kameswara Rao garu,
If I am correct, there is only one version of Veda Vyasa Mahabharath in Sanskrit. There may be other versions of Mahabharath or Ramayana in Sanskrit written by others.

What I wanted to say was, what we see Mahabharath in general (in books/serials/movies) did not come only from Vyasa Mahabharath, but also taken from Bhagavatham and other puranas. For example, most of the stories of krishna are there in Bhagavatham only, but, when others write books on Mahabharath, they include these as well.

I would consider a book as authentic as long as it is taken from one of the scriptures written by Veda Vyasa or Valmiki. Otherwise, I would not consider it as authentic.

కృష్ణప్రియ said...

రుత్ గారి కామెంట్..

Sorry, but your comment box is not working for me. so, mailing my comment :)

హ్మ్మ్... బాగుంది.

నాకు తెలిసి, భీముడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు ఇంకా దుర్యోధనుడు సమాన బలం కలవారు. వాళ్ళల్లో ఒక్కరిచేతిలో మిగతా నలుగురూ చస్తారని ఒక వరమో శాపమో ఉంది (ఇది ఎక్కడ ఉందో తెలియదు, నేను ఏదో చందమామ కథల్లో చదివి ఉంటాను). కాబట్టి మొట్టమొదటగా జరాసంధుడిని భీముడు చంపేలా కృష్ణుడి ప్లాన్. అందుకే మల్లయుద్ధం లో జరాసంధుడిని ఎన్నిసార్లు రెండుగా చీల్చినా ఆ రెండు పార్టులూ
అతుక్కుపోయి అతను బ్రతికేస్తూ ఉన్నప్పుడు, బయట ఉన్న కృష్ణుడు ఒక పుల్లని మధ్యకు చీల్చి రెండు భాగాలూ ఇటుది అటు, అటుది ఇటు పారేస్తాడు. క్లూ అందుకున్న భీముడు అలా చేసి జరాసంధుడ్ని చంపేస్తాడు. ఇక తర్వాత వరం ప్రకారం, మిగతా ముగ్గురూ భీముడి చేతిలోనే చావాలి. కనుకనే కీచకుడు చనిపోయిన వెంటనె పాడవుల అఙాతవాసం బయటపడిపోతుంది.
@ కొత్తపాళి గారు, కృష్ణుడు జరాసంధుడికి భయపడి ఉంటె తనే చంపొచ్చు కదా, మరి భీముడి వరకు ఎందుకు వెళ్ళాడు? నాకైతే, ఈ లాజిక్ ప్రకారం ఐనా, ఆ ఒక్కడు మిగతా నలుగురిని చంపుతాడు అనే వరం ముందే ఉందనిపిస్తుంది.
@ కృష్ణ ప్రియ గారు, మీ బ్లాగు ఈ మధ్యనే చూడటం జరిగింది. ఇన్నాళ్ళు మిస్స్ అయ్యాను మంచి బ్లాగు ని. మీరు జల్లెడలో లేరా?

-Ruth.

Mauli said...

@ కృష్ణ ప్రియ గారు

జరాస౦ధుడు చనిపోయినప్పుడు , భీముడే చ౦పాడని అ౦దరికీ తెలిసినట్లు ఆ అధారాలు లెవ్వు ..ఎక్కడా నాకు తెలిసి ....


@కాబట్టి మొట్టమొదటగా జరాసంధుడిని భీముడు చంపేలా కృష్ణుడి ప్లాన్...

నాకు తెలిసి౦ది ఇదే ...ఇప్పుడు నా ప్రశ్న...

రాజసూయ౦ సమయ౦కి బకాసురుడు ఉన్నాడా?

@ఏకచక్రపురంలో మారువేషంలో ఉన్నప్పుడు (ద్రౌపది స్వయంవరానికి ముందు) బకాసురుణ్ణి చ౦పాడు

రాజసూయ౦ ద్రౌపది స్వయంవరానికి ము౦దా తరువాతా? యాగ౦ చేసేప్పుడు ద్రౌపది ఉ౦దా :)

tnsatish said...

Ruth garu,

What Kotta Pali garu said was correct.

Bheema killed Bakasura, Jarasandha, Keechaka and Duryodhana in that order only.

Jarasandha had to be killed by Bheema only. That's why Krishna did not kill him. Not only that, Krishna lost to Jarasandha 17 times, and he moved away from Madhura 18th time.

tnsatish said...

Mauli garu,

As far as I know, all the important yagas are done by the married people with their wife only. At the time of Rajasuya yagam, Droupadi is there. Many people say that, laughing of Droupadi lead to the war (She laughed when Duryodhana fell in water)

After pandavas escaped from the fire, they stayed at Ekachakrapuram in disguise. At that time, kauravas thought, they were not alive. During that time, Bheema killed Bakasura. After Arjuna won droupadi in the Swayam varam, everybody came to know that they are alive.

After the marriage, Dhritarashtra gave Indraprastha kingdom to Dharmaraja, where he performed the Rajasuya yagam.

lalithag said...

I have reacted to this many times before.I know, author of the comment is not saying this, but is repeating what some say.
My reaction is only to such a thought:
"Many people say that, laughing of Droupadi lead to the war (She laughed when Duryodhana fell in water)"
This is a laughing matter!
Kauravas try to burn them alive before Draupadi even entered the scene, based on what provocation?
Now, Draupadi enters the scene and she is made the reason for Mahabharata war. So, Kauravas were reformed after the incident of fire and it was Draupadi who instigated them?!!!!
BTW, Mauli garu seems to be doing what my friend did with her kids. That went from Deepavali to Sankranti. This might as well go on until Ugadi :)
Either some yarn is being spun or a humongous ball of yarn is unrolling. Interesting.

సత్య said...

నిజానికి మహాభారత కథలో ప్రమాణాల ప్రకారం నాయకుడు(హీరో) భీముడే అర్జునుడు కాదు....ప్రతినాయకుదు దుర్యోధనుడు...శ్రీకృష్ణుడు సూత్రధారి.
చిన్నప్పటి నుండీ భీముడే అందరి చూపులకి కేంద్రమయ్యేవాడు....కౌరవులనందరిని ఈర్శ్య పాలు చేసేవాడు...అదే కదా అసలు ట్విస్ట్ మహాభారతంలో!

ద్రౌపతీఅమ్మవారు అచేతన భోజన పదార్థం కాదు కదా!

సగ భాగం ప్రేమతో, అవసరార్థం పెట్టారు రూల్ గా కాదు! (ఆ రూల్ భారతం లో లేదు)
ఆయనకి వృకోదరుడని పేరు అంటే వృకమనే అగ్ని తనకడుపులో ఎప్పుడూ మండు తుండేదట! అందుకే అంత ఆకలి. (అలాగే తేలు లాంటి కడుపు ఉన్న వాడని కూడా అర్థం)


ఏకలవ్యుడు ఉత్తమ శిష్యలక్షణాలు కలిగి వున్నా, దుర్మార్గులతో చేతులు కలిపిన వాడు, జరాసంధుని సేనలో కలిసి యుద్ధం చేస్తూ శ్రీ కృషునిచేతిలో హత మౌతాడు..

కీచకుడు నరరూపంతో నున్న రాక్షసుడు, అలాగే హేడంబుని చెల్లి హిడంబి మానవ లక్షణాలున్న రాక్షస స్త్ర్రీ! మహా భారతంలో ఇలాంటి వింత పాత్రలు ౧౮ వున్నాయ్!

శకుని కూడా ఎక్కడా దుర్మార్గుడు కాదు మహా భారతం ప్రకారం, ఎప్పుడు కౌరవులని తను రెచ్చ గొట్టలేదు. కాని చివుక్కు మనే నీతులు చెప్పేవాడు....మన సినిమావాళ్ళ్య్ ఆయనని అలా తయారు చేసారు...

భారతంలే గొప్ప పాత్ర భీష్ముడిది, ప్రభావవంతమైన పాత్ర కృష్ణుడిది, పరాక్రమమైన పాత్ర భీమునిది...
సౌమ్యమైన పాత్ర విదురునిది... సత్శీల పాత్ర ద్రౌపతీఅమ్మవారిది...

ఆ పిల్లలు అదృష్టవంతులు!!

..nagarjuna.. said...

@లలిత.జిః

>>Kauravas try to burn them alive before Draupadi even entered the scene<<

మీరనేది మైనపు భవనంలో జరిగే హత్యాప్రయత్నం గురించేనా....?

నాకు తెలిసినంతవరకు ఆ సమయంలో భీముడు ద్రౌపదిని,తక్కిన పాండవులను,కుంతిదేవిని కాపాడి ఒక అరణ్యంలో కాపలా కాస్తుంటాడు. అప్పుడే అతడికి హిడింబి పరిచయమౌతుంది. ఇదంతా పాండవులు జూదం ఓడిపోయిన తరువాత => రాజసూయ యాగం ముగిసిన తరువాత.

@కృష్ణప్రియః
పోస్టుతో సమానంగా (నిజానికి ఇంకాస్త ఎక్కువ వివరణాత్మకంగా) ఉన్నాయి వ్యాఖ్యలు. వీలైతే మీ పిల్లలకు వీటిని కూడా చెప్పవచ్చునేమో :)

ఖచ్చితంగా తెలియదుగాని దృతరాష్టుడు కృష్ణుడి విశ్వరూపాన్ని చూడగలిగేది తనకు ఉన్న ఒక వరం వలన అనుకుంటా

lalithag said...

@nagarjuna,
"లాక్షా గృహ దహనానంతరం పాండవులు తమకిచ్చిన ఆహారం లో సగం భీముడికివ్వాలని కదా రూల్? మరి కుంతి ద్రౌపది ని తెచ్చినప్పుడు.. అందరూ సమానంగా పంచుకొమ్మని రూల్ ఎందుకు మార్చింది?"
what about this?

tnsatish said...

@Nagarjuna garu,

Duryodhana tries to burn them alive before they marry Droupadi, not after Rajasuya yagam. After that incident, they went in disguise, and later they marry Droupadi.

In the story of Droupadi Swayam vara, Pandavas went there as Brahmanas. If they were not in disguise, they would have gone as Kshatriyas only.

snigdha said...

నిన్నే కామెంటుదాము అని అనుకున్నాను...అప్పుడప్పుడు ఆఫిస్ లో పనిచెయ్యాలి కాబట్టి పనిలో పడి కామెంటలేకపోయాను....సారీ...మీ టపా చదువుతున్నంతసేపు మా తాతగారి దగ్గర కూర్చుని నేను చెప్పించుకున్న రామాయణ,భారతభాగవత కథలు గుర్తొచ్చాయి....చందమామ రోజుల్లోకి తీసుకెళ్ళారు... ఈ కథలన్నీ విని నేను మా క్లాస్ లో ఫ్రెండ్స్కి చెప్పేదాన్ని..వాళ్ళు ఇందులో వీక్ అనుకుంటా అందుకే బోలేడు ప్రశ్నలు అడిగేవారు...నాకు ఆన్సర్ తెలియకపోయినా లేదు అది అంతే ఆ కాలంలో ఇవన్నీ జరిగాయంట అని సమాళించేసే దాన్ని.... తరువాత ఇంటికి వచ్చి తాతగారినో లేక వీటికి సమాధానాలున్న పుస్తకమో చదువుకొని వెళ్ళి చెప్పేసేదాన్ని...నేను అనుకున్న ప్రశ్నలన్నీ మీ పిల్లలు అడిగేశారండీ...దానికి ఆన్సర్స్ కామెంట్స్లో దొరికాయి....
త్వరగా భగవద్గీత చదివేసి మాక్కూడా చెప్పేయండీ....

..nagarjuna.. said...

@sathish gaaru:

Yes you are correct. I said it all wrong and big thanks for correcting.

@lalitha gaaru:

ద్రౌపదిని కుంతి దగ్గరకు తీసుకొని అది తమకు ఆ రోజు దొరికిన భిక్షగా (which needn't be food)పాండవులు చెబుతారు. అందుకే సమంగా పంచుకొమ్మని కుంతి చెబుతుంది.

పాండవులపై ధుర్యోధనుడికి ఎప్పడినుండో ఉన్న కోపం మయసభలో ద్రౌపది తనను చూసి నవ్విందని మరింత పెరుగుతుంది. ఆ సమయంలో శకుని జూదానికి ఉపాయం చెప్పటం, వస్త్రాపహరాణంతరం భీముడు ధుర్యోధనుడిని హతమార్చి పగ తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేయడం యుద్ధానికి నాంది పలుకుతాయి. వస్త్రాపహరణమే లేకుంటే కురుపాండవ యుద్ధం జరిగేది కాదేమో !

lalithag said...

నేను ఎక్కువ వివరించలేక ఆ సంఘటనని ఉదహరించాను, time line స్పష్టపరచడం కోసం.
నేను చెప్పదల్చుకున్నది సతీష్ గారు చెప్పినదే.
ఐతే ఇంతకీ ద్రౌపది నవ్వినందువల్లే మహా భారత యుద్ధం జరిగిందంటారు?
I hope you are not saying that.
దుర్యోధనుడికి వంకే కావాల్సి వస్తే ఏదో ఒకటి పట్టుకుంటాడు.
ఇక్కడ ద్రౌపది దుర్యోధనుడి చేతిలో అవమానించబడడమే కాక ఇప్పటికీ ఇలాంటి మాటల చేత అవమానింపబడుతోంది.
ఆంక్షలు పెట్టడానికి బలే వాడుకోబడుతోంది.
అదీ నా బాధ.
సర్లెండి. గాంధారి స్వయంగా ధర్మ రాజుని ఎన్నో మాటలంది.
ధర్మం తెలిసిన వాడు కాబట్టి పాండవుల వల్ల జరిగిన so called అధర్మాలకి అతను బాధ్యుడని.
పాండవులు మాత్రం పేరుకి గెలిచారని కానీ ఎన్ని పోగొట్టుకున్నారు?
మహా భారతం లో ప్రతి ఒక్క పాత్ర గురించీ "మంచి, చెడు" కి మించి ఎంతో తెలుసుకోవలసి ఉంది.
సమాజం గురించి, మనం "ధర్మం" అనుకునే దాని గురించీ.
కృష్ణా, ( :)) )
నువ్వు మీ పిల్లలకి స్వంతగా ఆలోచించుకోవడం నేర్పిస్తున్నావే, అది బావుంది.
అమ్మాయీ నువ్వు ఇన్ని చేస్తూ టపాలు టప టపా ఎలా రాసేస్తావో.
నేను ఈ వ్యాఖ్య రాయడానికి అరగంట తీసుకున్నాను. చెప్పదల్చుకున్నవి సగం వదిలేశాను కూడ.
Keep entertaining us :)

SRINIVAS said...

క్రిష్న గారు మీ ప్రయత్నం అభినందనీయం. ఈ టపా వల్ల నాకు అర్ధం అయ్యింది ఎంటంటే ఈలాంటి టాపిక్ తో బ్లాగ్ కామెంట్స్ సంఖ్యని మరియు హిట్స్ పెంచుకొవచ్చు అని.

Madhu said...

'భారతీయుడా! మహా భారతం చదివావా?' by Dr ఆప్పజొడు వెంకట సుబ్బయ్య గారు.... ఈ బుక్ చదవండి, very interesting one.

Anonymous said...

కృష్ణ గారూ,
మా అమ్మాయి అనన్య తన సొంత బ్లాగులో అప్పుడప్పుడూ కథలూ, కొన్నిసార్లు కవిత్వమూ రాస్తుంది. ఈ సంవత్సరం హై స్కూలుకి రావటంతో కొంచెం తగ్గినట్టుంది :). స్కూలు డ్రామా ప్రొడక్షన్లకీ అప్పుడప్పుడూ స్క్రిప్టు లో సహాయం చెస్తూ వుంతుంది.
You can see her blog at
www.anu-mystories.blogspot.com


శారద

Anonymous said...

I would recommend Lord of the Rings and The Hobbit by J R R Tolkien. If you haven't already read them please watch the movies before reading them or get a well illustrated edition of the books.

And please keep writing. I immensely enjoy reading your posts.

..nagarjuna.. said...

do i think Draupadi was THE reason for the war? - No

do i think Draupadi was A reason for the war ? - Yes.

i feel others too feel the same way but might sound different when they try to put it in words

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీ ప్రయత్నం, పిల్లలకి అర్ధం అయ్యేటట్టు, వాళ్ళు ఆలోచించేటట్టు, కధలుగా భారతం చెప్పడం అభినందనీయం.
టపా చదవడానికి 3 నిముషాలు, కామెంట్లు చదవడానికి 10-12 నిముషాలు అయిన తరువాత అనిపించింది. మనలో చాలా మంది పూర్తిగా మహా భారతం చదవలేదోమో నని. మహాభారత్ అన్న టి‌వి సీరియల్, చందమామ కధలు, ఇక్కడ అక్కడ విన్న ఉపన్యాసాలు, చదివినవి ద్వారానే మనకు అర్ధం అయిన భారతం మట్టుకే మనకి తెలుసు అని. బహుశా మేమందరము కూడా మీ పిల్లలకి మల్లె మీ దగ్గరే నేర్చుకోవాలేమో. :):)
డా. అప్పజోడు వెంకట సుబ్బయ్య గారి పుస్తకం 'భారతీయుడా మహా భారతం చదివావా'(భారతీయ ధార్మిక విజ్నాన పరిషత్, గుంటూరు, వారిచే ముద్రితం) భారతం లోంచి సామాన్యులు నేర్చుకోవాల్సిన నీతులు తెలియ చెప్పుతుంది. వీలైతే చదవండి. భారతంలో అనేక కధలు, కధలలో కధలు ఉన్నాయి. రోజుకో గంట చొప్పున రెండు సంవత్సరాలు చెప్పవచ్చు.

మనసు పలికే said...

కృష్ణ ప్రియ గారు, నాకు ఎంత సంతోషంగా అనిపించిందో మీ టపా చూసి. ఎందుకంటే చెప్పలేను కానీ.. మీ ప్రయత్నం మాత్రం అభినందనీయం. నిజంగా నాకైతే పురాణాలు సరిగ్గా తెలీదు:( సీరియల్స్ చూడను. పాత సినిమాలు చూసిన అనుభవం, చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో టీచర్ చెప్పిన కథలు తప్ప వేరేవి తెలీదు. మీ పిల్లలు అదృష్టవంతులు. నాకైతే మీలాగే నాకు పిల్లలు పుట్టాక కథలన్నీ చెప్పాలనిపిస్తుంది ;) ఈ విషయంలో మీరే నాకు గురువు:)))
కథల గురించి నేనైతే సలహాలివ్వలేనులే:)

lalithag said...

బులుసు సుబ్రహ్మణ్యం గారి వ్యాఖ్య చూసుకుని భుజాలు తడుముకున్నాను.
నా గురించి ముందే చెప్పుకున్నాను, "నాకు తెలియనివి చాలా ఉన్నాయి" అని.
ఐతే అది oversimplified. నిజానికి నాకు తెలిసినది outline మాత్రమే.
కృష్ణ ప్రియ టపాలో చెప్పినది నాకు ఇలా అర్థం అయ్యింది, "భారతంలో ఎన్నో కథలున్నాయి కదా" అని.
ఇక్కడి చర్చ ఆసక్తి రేపేదిగా ఉంది. చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు అమ్మని అడిగి తెలుసుకుంటారు.
ఈ టపా, ఇక్కడి అభిప్రాయాల మూలంగా నా లాంటి పెద్దలు ఇక్కడ ప్రస్తావించబడిన పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అది మంచి ప్రయోజనమే కదా.
ఇక, నేను ఈ మధ్య చందమామలో కూడా నేను మునుపు చదవని కథలను చదవడం ద్వారా, మహాభారతం యుద్ధంలో పాండవుల విజయం తర్వాత ఎన్నో విశేషాలు ఉన్నాయని తెలుసుకున్నాను.
రామాయణమూ, మహాభారతమూ bits and pieces లో చదివినవి / విన్నవే.
అవును వీలైనంత మంది బాగా చదివి తెలుసుకోవాలి.

కృష్ణప్రియ said...

@అపర్ణ,

:) థాంక్స్! నాకూ పెద్దగా తెలియవు.. ఇదే ఫస్ట్ టైం..

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,

ధన్యవాదాలు! మీరు చెప్పింది నిజం.. నా వరకూ.. పిల్లల బొమ్మల పుస్తకాల్లోంచీ, ఒక abridged version తెలుగు లోదీ, మరియు డాక్టర్ రాజగోపాలాచారి దీ, ప్రయాగ రామకృష్ణ గారి భారతం లో చిన్న కథలూ చదివాను. ఇప్పుడు ఇంకా మంచి పుస్తకం భారతం మీద చదవాలనిపిస్తోంది.. మీరు చెప్పిన పుస్తకం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను.

@ ఇద్దరు,

చాలా థాంక్స్.. వ్యాఖ్య కీ, మీ సజెషన్లకీ..


@ శారదగారూ,

మీ పాప బ్లాగు చూశాను.. కథలూ అవీ రాసేస్తోంది.. చాలా ముచ్చట గా అనిపించింది!!! Like Mom, Like Daughter లా ఉన్నారు.

Mauli said...

nagarjuna gaaru,

If we check 2 steps back, we may find Draupadui a reason or only reason..

but if you go back further back ...we see Bheeshma Pratigna to be a bachelor for life :) ..

Is there any chance to think on other ways..

@ద్రౌపదిని కుంతి దగ్గరకు తీసుకొని అది తమకు ఆ రోజు దొరికిన భిక్షగా (which needn't be food)పాండవులు చెబుతారు.

స్వయ౦ వరము లో సాధి౦చినది బిక్ష అని ఎలా చెబుతారు :)

నాకు తెలిసినది మాత్ర౦ ..ప౦డు తెచ్హాము అని చెప్పినట్లు..ఆ పిచ్చితల్లి ప౦డు అనగానే తల్లిధర్మ౦ ప్రకార౦, ఒక ప౦డే కదా అని ఒకరి ని తినమనకు౦డా ..అ౦దరి కి నీ అని చెప్పి౦ది అనుకు౦టున్నాను ..

lalithag గారు, సుబ్రహ్మణ్యం గారు

చాలా బాగా చెప్పారు ...ఈ సత్స౦గ౦ లో అ౦దరూ పాల్గొనాలని ..

కృష్ణప్రియ said...

@ మధు,

తప్పక కొనుక్కుంటానండీ.. థాంక్స్!

@ SRINIVAS,
:) హ్మ్.. అలాగంటారా?

@ snigdha,

హ్మ్.. చాలా బాగుంది. భగవద్గీత చదివి .. :)) థాంక్స్..


@ ..nagarjuna.. ,

కరెక్ట్ మాట. కామెంట్ల ద్వారా చాలా తెలుసుకున్నాను.. I am so glad!!

@ Sasidhar Anne,

థాంక్స్.. పైన చెప్పినట్టు.. ఆంగ్ల పుస్తకాలు అన్నీ.. చదిఏసే జెనరేషన్!

@ Indian Minerva,

థాంక్స్.. ఇంకా నయం.. మా పాప అడుగుతుంది కానీ.. ఈ కామెంట్ల లో ఇచ్చిన కథల్లో ఏదో ఒకటి మొదలు పెడతాను.

@ కొత్త పాళీ గారు,

మీకూ అనేకానేక ధన్యవాదాలు!

కృష్ణప్రియ said...

@ మౌళి గారు,

మీకు ప్రత్యేకం గా ధన్యవాదాలు! మీరు మాకు పెట్టిన క్విజ్ వల్ల మొదలైన చర్చ వల్ల బోల్డు విషయాలు తెలిసాయి.

@ మౌళి గారు, సత్య, lalita, శ్రావ్య, రూత్, కొత్త పాళీ గారు,నాగార్జున, భైరవభట్ల కామేశ్వర రావు గారు, tnsatish గారు,

మీకు చాలా చాలా ధన్యవాదాలు.. నాకు అసలు ఎలా థాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు..

నా నాలెడ్జ్ చాలా తక్కువ కాబట్టి.. నేనొక్క ముక్క కూడా మాట్లాడలేదు.. మీ అందరి వల్లా చాలా మంచి విషయాలు తెలుసుకోవటమైంది.

@ రుత్,

థాంక్స్ కామెంట్ బాక్స్ పని చేయకపోయినా కష్టపడి కామెంట్ పంపినందుకు.. నేను జల్లెడ లో ఉన్నాను అనుకుంటున్నాను. చెక్ చేస్తాను.

Sravya Vattikuti said...

అసలు ముందు రూత్ గారు ఎందుకు రాయటంలేదో , ఆవిడ ఈ కామెంట్లు చదువుతారు అన్న ఉద్దేశ్యం తో ఇక్కడ ఈ వాఖ్య పెడుతున్న. ఏమండి రూత్ బోలెడు పొటోలు చూపిస్తా , ఇంకా కబుర్లు చెబుతా అని అలా మాయం అయిపోయారు :)
కృష్ణ ప్రియ గారు మీరు కథలు suggest చేయమన్నారు కదా , కాశీ కజిలీ కథలు ట్రై చేసారా ? మీ పిల్లలకి చదవటం కష్టం కాని , వినటానికి ఇంట్రెస్ట్ గా ఉంటాయి కదా ?

lalithag said...

"If we check 2 steps back, we may find Draupadui a reason or only reason..

but if you go back further back ...we see Bheeshma Pratigna to be a bachelor for life :) .. "

"మా తాతే గనక లా చేసుండక పోతే" అని బ్రహ్మానందం అంటుంటాడు ఒక సినిమాలో.
ఇంతకీ "ఏం చేసుండకపోతే" అంటే, ఏదో చిన్న ఉద్యోగం చేశాడు, పెద్ద ధనవంతుడుగా పుట్టకుండా అనో అలాంటిదేదో చెప్తుంటాడు. అది గుర్తుకు వచ్చింది :)
పరిస్థితులకి మనం ఎలా స్పందిస్తామ న్నదే మన వ్యక్తిత్వం గురించి చెప్తుంది.
తొందరపాటు, పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ అవి మళ్ళీ మళ్ళీ చేస్తే తప్పు ఎవరిది?

Mauli said...

:) బ్రహ్మాన౦ద౦ ది ఊహ...భీష్ముడి ది త్యాగమ్

నేను సరదాగా చెప్పాను , భీష్మ ఉదాహరణ..అలాగే ద్రౌపది ఆ ఒక్క కారణ౦ కూడా యెలా అయ్యి౦ది అన్నది ..కు౦చెమ్ ఊగిసలాట :)

@@పరిస్థితులకి మనం ఎలా స్పందిస్తామ న్నదే మన వ్యక్తిత్వం గురించి చెప్తుంది

ద్రౌపది నవ్విన౦దుకు ఆమె వ్యక్తిత్వ౦ గురి౦చి చెబుతున్నారా ..అర్ధ౦ కాలేదు ...అదే అయితే వివరి౦చగలరు

@మళ్ళీ మళ్ళీ చేస్తే తప్పు ఎవరిది?

మళ్ళీ మళ్ళీ తప్పుచేసి౦ది ఎవరు..పా౦డవులా? మీ భావ౦ వివరి౦చగలరు.

lalithag said...

Couldn't it be Dhritarashtra? Keep guessing:)
I have to now take care of other things that need my attention.

కొత్త పాళీ said...

@ Sravya, మీరు కాశీమజిలీకథలు చదివారా? నేను చదివాను. చాలా ఘోరంగా ఉన్నాయి.

కొత్త పాళీ said...

నా వుద్దేశంలో కురుపాండవ యుద్ధం జరగడానికి ముఖ్య కారణం కృష్ణుడు.

భైరవభట్ల కామేశ్వర రావు said...

ద్రౌపదితో వచ్చిన భీమార్జునులు భిక్ష తెచ్చామనే చెపుతారు కుంతికి. అయితే అన్నదమ్ములు అయిదుగురూ వినియోగించండి, తీసుకోండి అని బదులిస్తుంది కుంతి. ప్రత్యేకించి "సమానంగా" అన్న ప్రసక్తి లేదు.
ద్రౌపదిని "భిక్ష" అని ఎలా అనగలరు అన్న లా పాయింటు లాగితే, కన్యా"దానం" చేస్తారు కదా అని సమాధానపడవచ్చు. అయినా ఆ సన్నివేశంలో వారు మాటవరసకి అలా అన్నారని అనుకోవాలి.

సతీష్ గారూ,

ఒకటే వ్యాస భారతమయినా ఆ కాలంలో తాటాకుల మీద వ్రాసిన ప్రతులు కాబట్టి వాటిలో పాఠాంతరాలు ఉండేవి. ఉత్తర భారతదేశంలో ఒక ప్రతి, దక్షిణాన ఒకటి, తూర్పున (బెంగాలు ప్రాంతంలో) మరొక ప్రతీ, ఇలా వేరు వేరు ప్రతులుండేవి. ఆ ప్రతుల మధ్య పాఠ భేదాలు (కొన్ని కొన్ని చిన్న తేడాలు) ఉండేవి.

Sravya Vattikuti said...

హ హ కొత్తపాళీ గారు అదే కదా మరి పుర్రెకో బుద్ది, జిహ్వ కో రుచి అంటే !

భాస్కర్ రామరాజు said...

http://ramakantharao.blogspot.com/2009/01/1_16.html
http://ramakantharao.blogspot.com/2009/01/blog-post_06.html
మీకు సమయం దొరికినప్పుడు పై టపాలు ఒకసారి చూడగలరు.

r said...

కొత్త పాళీ said...

నా వుద్దేశంలో కురుపాండవ యుద్ధం జరగడానికి ముఖ్య కారణం కృష్ణుడు.
--------
కాదనుకుంటాను.

మితిమీరిన పుత్ర వ్యామోహం వల్ల గుడ్డివాడయిన ధృతరాష్ట్రుడి వల్ల,
పాతివ్ర్యత్యం పేరు తో గుడ్డి గా భర్త ని అనుసరించి, తల్లిగా పిల్లలను సరయిన మార్గం లో పెట్టడం మరచిన గాంధారి వల్ల,
విపరీతమయిన దుర్యోధనుడి మాత్సర్యం వల్ల,
కోడలి కి అన్యాయం జరుగుతున్నా, నిస్సహయం గా, అన్యాయాన్ని ఖండించని భీష్ముడి వల్ల,
అధర్మం అని తెలిసినా, దుర్యోధనుడి పక్షాన్ని వహించిన కర్ణుడి వల్ల,

శ్రీకృష్ణుడు ఈ అన్యాయాలకు కురుక్షేత్ర యుద్ధం ద్వారా గుణపాఠం చెప్పాడు. అంతే

r said...

@ కొత్తపాళి గారు, కృష్ణుడు జరాసంధుడికి భయపడి ఉంటె తనే చంపొచ్చు కదా, మరి భీముడి వరకు ఎందుకు వెళ్ళాడు? నాకైతే, ఈ లాజిక్ ప్రకారం ఐనా, ఆ ఒక్కడు మిగతా నలుగురిని చంపుతాడు అనే వరం ముందే ఉందనిపిస్తుంది.
------------------------
శ్రీకృష్ణుడే జరాసంధ సంహారం గావించిఉండవచ్చు.
కానీ, ఆ కార్యం భీముడి ద్వారా జరగాల్సి ఉంది. అందుకే అలా జరిపించాడు. తహసిల్దారు చెయాల్సిన సంతకాన్ని దేశ ప్రధాని చేస్తే ఎలా చెల్లుతుందో/చెల్లదో ఇదీ అంతే.!!

ఇక జరాసంధుడి జన్మ వృత్తాత్తానికొస్తే,
జనన సమయం లో అగుపించిన దుర్నిమిత్తాలకి హడలి పోయి, ఆ నరికివేయమని ఆదేశిస్తాడు అతడీ తండ్రి. అడవి లో రెండూ భాగలు గా నరికిఉన్న పసివాణ్ణి తీసుకెళ్ళి అతికించి పెంచి పెద్ద చేస్తుంది జరా అనే రాక్షసి.
జర వల్ల సంధించ బడిన వాడు కాబట్టి జరాసంధుడయ్యాడు.పుట్టుకచే క్షత్రియుడయినా రాక్షసి చే పెంచబడ్డాడు కాబట్టి రాక్షస గుణాలు అబ్బి రాక్షసుడి గా చెలామణీ అయ్యాడు..

-సుధ

Ruth said...

@ కృష్ణప్రియ గారు, భలె వారే, మీరు రాసిన్ టపా అలాఉంది మరి.నేనెప్పుడు నా పిల్లలకి(ప్రస్తుతానికి ఒక్కరే లెండి) ఇలా కథలు చెబుతూ నిద్రపుచ్చుతానో!
@ శ్రావ్య గారు, మీరు నన్ను గుర్తుంచుకున్నందుకు చాలా థాంక్యూఊఊలు. నేను రాయకపోవటానికి కారణం పైన కృష్ణ గారికి చెప్పినదానిలో ఉంది చూడండి ;)

Sravya Vattikuti said...

ఓహ్ రూత్ గారు అర్ధం అయ్యింది , అభినందనలు ! ఒక 2 , 3 , 4 ,5 అలా కొద్ది రోజులు కొత్త change చేసి మళ్ళీ బ్లాగండి ;)
Congratulations again !

కృష్ణ ప్రియ గారు క్షమించాలి మీ స్పేస్ అంతా వాదేస్తున్నందుకు :)

సుజాత said...

కృష్ణప్రియ,

మీ బ్లాగు పోస్టు రోజూ చూడ్డం, అమ్మో ఈ కామెంట్లన్నీ చదివి కామెంట్ రాయాలంటే బోల్డు టైము పడుతుంది అని సగం చదివి వెళ్ళి పోడం, మళ్ళీ మర్నాడుచూస్తే మళ్ళీ కొత్త కామెంట్స్! బాగుంది. ఈ ఏడాది బెస్ట్ టపాగా నీ ఎన్నిక ఈ బ్లాగు పోస్టు! ఇంతకంటే ఏం చెప్పను?

మళ్ళి ఇంకోసారి తీరిగ్గా వచ్చి మళ్ళీ కామెంట్లన్నీ చదివి తీరిగ్గా ఇంకో వ్యాఖ్య రాస్తాను! పిల్లలకు ఇతిహాసాలు పరిచయం చేయడం అత్యవసరం! అర్జెంట్ గా చేయాల్సిన పని కూడా! మా అమ్మాయికి తెలుగు చదవడం వచ్చు.(ఏడేళ్ళు) అందువల్ల సులభమైన భాషలో రాసిన మహాభారత రామాయణాలు తెచ్చాను. ఇంగ్లీష్ రామాయణం పుట్టినరోజు కు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. తనే సొంతగా చదివి నన్ను బోలెడు సందేహాలతో సతమతం చేస్తూ ఉంటుంది.

దానికి ఈ పాత్రలన్నీ తికమక! నకుల సహదేవులు అసలు హీరోలే కాదు, వాళ్ళసలు ఫైటింగే చేయరు అని ఫిర్యాదు. ఆవిడ ఫేవరెట్ పాత్రలు మాత్రం కృష్ణుడు, భీష్ముడు,కర్ణుడు! అన్నట్లు ద్రౌపది కూడా!

ఎందుకో తెలీదు కానీ ద్రౌపది చాలా బ్రేవ్ గాల్ అంటుంది. వివరణ అడిగితే ఏం చెప్తుందో అని భయమేసి ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టాను.:-))

వ్యాఖ్యాత said...

>> "జనన సమయం లో అగుపించిన దుర్నిమిత్తాలకి హడలి పోయి, ఆ నరికివేయమని ఆదేశిస్తాడు అతడీ తండ్రి. అడవి లో రెండూ భాగలు గా నరికిఉన్న పసివాణ్ణి తీసుకెళ్ళి అతికించి పెంచి పెద్ద చేస్తుంది జరా అనే రాక్షసి. జర వల్ల సంధించ బడిన వాడు కాబట్టి జరాసంధుడయ్యాడు.పుట్టుకచే క్షత్రియుడయినా రాక్షసి చే పెంచబడ్డాడు కాబట్టి రాక్షస గుణాలు అబ్బి రాక్షసుడి గా చెలామణీ అయ్యాడు.."

ఎట్టెట్టా! జనన సమయం లో అగుపించిన దుర్నిమిత్తాలకి హడలి పోయి, కన్న కొడుకుని నరికివేయమని అదేశించిన తండ్రి క్షత్రియుడా! అడవి లో రెండూ భాగలు గా నరికిఉన్న పసివాణ్ణి తీసుకెళ్ళి అతికించి పెంచి పెద్ద చేసినావిడ రాక్షసా ! ఆవిడ పెంపకంలో రాక్షస గుణాలు వచ్చాయా ! Very Interesting కదా ?

శేషు said...

కృష్ణప్రియ గారు చాలా ఓప్పికగా చెప్పుతున్నారు.
ఉద్యోగం చేస్తు చాలా కష్టపడుతు మీ పిల్లలకి భారతము చెప్పారు.
మీ పెద్ద అమ్మాయి అడిగిన్నట్టు మీకు వీలువుంటే మీరు చెప్పగలిగ్గితే భగవద్గీత చేప్పేయండి.

అది కాక పోతే రామయణం చేప్పండి.

ఏందుకంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చేప్పిన రామాయణం వింటుంటే రామాయణం చదవలని కోరిక పుట్టింది.
ఏదో కష్టపడి రామాయణం చదవటం మొదలు పెట్టాను.
రామాయణం వినడం మొదలు పెట్టిన వేంటనే భద్రాచల రామయ దర్శనం చేసుకున్నాను.
అది కాకుండా మన సాంప్రదాయల మీద పట్టు మరియు అభిమానం వస్తుంది అని నా అభిప్రాయం.
ఇప్పుడు లేదు అని కాదు ఉద్దేశ్యం సుమా.

మీకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన రామాయణం డివిడి కావాలంటే నాకు మీ అడ్రసు మరియు పోన్ నెం:- నాకు మెయిల్ పంపితే మీకు డివిడి పంపిస్తాను.
లేక పోతే మీరు ఈ వెబ్ సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు http://te.srichaganti.net/Ramayanam2009.aspx

Mauli said...

@అయితే అన్నదమ్ములు అయిదుగురూ వినియోగించండి, తీసుకోండి అని బదులిస్తుంది కుంతి

----------------------------------
-వికీ ను౦డి

ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని యొక్క భార్య - ఇంద్రసేన. ఆమెకు భోగేచ్ఛ అత్యధికంగా ఉండడం వలన మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.

రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా 'నాకు పతి కావాలి' అని ఐదుసార్లు కోరింది. శివుడు తధాస్తు అన్నాడు. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.

Chenna Kesava Reddy Madduri said...

కృష్ణప్రియ గారికి,
శుభాభినందనలు. మీరు పిల్లలకి ఆసక్తి కలిగేలా భారతం చెప్పడం ఎన్నదగినది.
పై పోస్ట్లు అన్నీచదవలేదు కాని, భాగవతమే మీరు మొదలు పెట్టదగినది. భాగవతం కేవలం కృష్ణుడి కథే కాదు. ౧౨ స్కంధాలలో ఎన్నో కథలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా తెలుగు జన్మ ఎత్తాక పోతన భాగవతం చదవడం ఇంకా అదృష్టం. కృష్ణుడు చాల వరకు దశమ స్కంధంలో కనిపిస్తాడు. ఇంకొంచెం ప్రధమ స్కంధం లో. మిగతా వాటిల్లో ఎన్నో పాత్రలు, విశేషాలు.. భారతం లో పరిచయం అయిన పాత్రలు ఇంకెన్నో.. పోతన భాగవతం లో పిల్లలకి సులభంగా చెప్పగల పద్యాలు కూడా ఉంటాయి. కష్టం అనుకుంటే ఉషశ్రీ భాగవతం ఆధారంగా చెప్పవచ్చు.. మీకు పోతన భాగవతం కావాలంటే, హైదరాబాద్ వచ్చినప్పుడు సంప్రదించగలరు..
చెన్న కేశవ రెడ్డి

కృష్ణప్రియ said...

@ బాస్కర్ రామరాజు గారు,

:) చూశాను మీ కతల కతలు.

@ r,

Thanks for participating in the discussion!

@ Ruth,

అభినందనలు!

@ సుజాత,

మీ కామెంట్ చూశాక చాలా చాలా సంతోషం వేసింది! ఇంతకు ముందర, మీ అమ్మాయి తెలుగు పుస్తకాలు చదువుతుందంటే పెద్దమ్మాయి అనుకున్నాను.. ఏడేళ్ళా!! So nice! మా చిన్న పాప కూడా ఏడేళ్ళే... తప్పక ఎంజాయ్ చేస్తుంది... చెప్పి చూడండి...

@ వ్యాఖ్యాత,

చెడ్డ క్షత్రియుడూ, మంచి రాక్షసులూ.. ఉండకూడదా? :)

కృష్ణప్రియ said...

@ శేషు గారు,

చాలా థాంక్స్! మీరు చెప్పిన చాగంటి కోటేశ్వర రావు గారి రామాయణం DVD మా కో వర్కర్ ఒకాయన ఇచ్చారండీ.. ఈ వేసవి లో మొదలు పెడదామని చూస్తున్నా..

మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు!


@ Chenna Kesava Reddy Madduri గారికి,

థాంక్స్!!

వ్యాఖ్యాత said...

క్రిష్ణ ప్రియ గారు,

>>చెడ్డ క్షత్రియుడూ, మంచి రాక్షసులూ.. ఉండకూడదా? :)

ఎందుకుండకూడదు? ఉండొచ్చండీ :)

ఆలోచించవలసిన విషయం అనిపించిందేంటంటే, ఇక్కడ నేనుదహరించిన వ్యాఖ్యలో, జరాసంధుడికి వచ్చిన రాక్షస గుణాలు, మంచి రాక్షసి అయిన తల్లి పెంపకంవల్లనే వచ్చాయి, చెడ్డ క్షత్రియుడైన తండ్రి వల్ల కాదు అని ఎలా చెప్పగలం?

పెరిగే పరిస్థితులూ, జీన్స్ ద్వారా వచ్చే లక్షణాలు అనేక కారణాలు ఉండొచ్చు లేండి. కాకపోతే, జాతుల ప్రకారం, పుట్టుక ప్రకారం మనిషి గుణాలు నిర్ణయించబడుతాయి అనేది మనం ఎంత నిత్య సత్యం లా నమ్మేస్తామో అనేది ఆశ్చర్యకరం అంతే. మనుషుల ప్రవర్తనకంటే వారి జాతి మీదే ఎక్కువ భరోసా ఉంచే సంస్కృతి ఇప్పటికీ ఎంత బలంగా ఉంది అనేది ఆలోచించ వలసిన విషయం. కాదంటారా?

వ్యాఖ్యాత said...

క్రిష్ణ ప్రియ గారు,

>>చెడ్డ క్షత్రియుడూ, మంచి రాక్షసులూ.. ఉండకూడదా? :)

ఎందుకుండకూడదు? ఉండొచ్చండీ :)

మరి రాక్షస గుణాలూ, క్షత్రుయ గుణాలూ అనేవి జాతుల మీద అధార పడవు కదా! మన శ్రీక్రిష్ణుడూ, భీముడూ వెళ్ళి ముందు ఆ క్షత్రియుడైన తండ్రిని వధించకుండా, జరాసంధుడి వెనకెందుకు పడ్డారు అని ఇప్పుడు ఆలోచిస్తే కష్టమే :) ఏదో మహత్తరమైన విష్ణుమాయ ఉండే ఉంటుంది మరి.

కానీ ఆ మాయ సంగతి పక్కబెట్టి జాతులని వాటి లక్షణాలనీ బాగా గుర్తుంచుకొని, ఇప్పటికీ నమ్ముతూ హిందూ మతాన్ని ఈ స్థితికి భ్రష్టు పట్టించామే అనేదే మనలో చాలా మంది బాధ. ఏమంటారు?

lalithag said...

Congratulations on 100 comments!
I think it was mentioned that Jarasandha became known as Rakshasa. I don't think the comment was about Rakshasa qualities in him.
Krishna, see you again at 200!
:)))

lalithag said...

It showed 99 beside the title and 98 in the post. Anyway, this should make it the 100th :)

వ్యాఖ్యాత said...

"పుట్టుకచే క్షత్రియుడయినా రాక్షసి చే పెంచబడ్డాడు కాబట్టి రాక్షస గుణాలు అబ్బి రాక్షసుడి గా చెలామణీ అయ్యాడు.."

loolz, I thought it mentioned about rakshasa qualities :). probably my mistake..

@Krishnapriya, sorry I just mentioned a passing thought. do not intend to divert your nice post..but..

huh..anyway it should help you on your way to 200 :))

lalithag said...

My bit to help reach 200 :))
You are right "vyakhyata" garu.
When I read it first though, I didn't remember it feeling offensive. The expression conveyed the sentence at that time seemed like he was known as bleonging to Rakshasa community kind of thing.
Now I'm not so sure.

స్ఫురిత said...

Wow...మీకూ మీ పిల్లలకి చప్పట్లు...ఇప్పుడు మా అమ్మాయికి రెండున్నరేళ్ళు...నేను ఇప్పట్నుంచే భారతం చదవటం మొదలుపెడితే మంచిదనిపించింది మీ post చదివాకా...హహహ

వ్యాఖ్యాత said...

>> You are right "vyakhyata" garu. Now I'm not so sure

Thank you :) I too am not sure. Just a passing thought :)

నా మరో కామెంటుకి ప్రతిస్పందన వస్తే ఒకేసారి ఇద్దరికీ కలిపి రాద్దామనుకోవడం వల్ల ఆలస్యమయ్యింది. looks like the blog author lost track due to too many comments :)

శేషు said...

కృష్ణప్రియ గారు
నాకు చాలా సంతోషంగా వుంది.
మీ రామయణం డివిడి సంపాదించినందుకు మరియు మరి ఏమైన ఉపన్యాసాలు కావలంటే నాకు మెయిల్ చేయండి.
గమనిక:-నా దగ్గర కేవలం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు ఉంటాయి.
అందుకని మీకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ఉపన్యాసాలు కావలంటే నాకు మెయిల్ చేయండి.మీకు దొరకవని కాదు.

అడుగుతున్నానని ఏమి అనుకోవద్దు.
ఇప్పుడు మీ పిల్లలకి ఏమి కధలు చెప్పుతున్నారు.

Mauli said...

@వ్యాఖ్యాత గారు

మనుషుల ప్రవర్తనకంటే వారి జాతి మీదే ఎక్కువ భరోసా ఉంచే సంస్కృతి ఇప్పటికీ ఎంత బలంగా ఉంది అనేది ఆలోచించ వలసిన విషయం.


జాతులని వాటి లక్షణాలనీ బాగా గుర్తుంచుకొని, ఇప్పటికీ నమ్ముతూ హిందూ మతాన్ని ఈ స్థితికి భ్రష్టు పట్టించామే అనేదే మనలో చాలా మంది బాధ. ఏమంటారు?
---------------------

అది ఒక జాగ్రత్త కదా , బాధ పడవలసినది ఏమున్నది ...హిందూ మతానికి వీటి వల్ల వచ్చిన కష్టము ఏమి ఉన్నది ?

బద్రి said...

Krishnapriya gaaru,
Chaganti gaari pravachanaalu kaavaalante ikkada download chesukovacchu :
http://surasa.net/music/purana/
ikkada koodaa :
http://www.srichaganti.net/

Nenu Bhaagavatam vinnaa, raamaayanam inkaa poorti kaaledu :(

వ్యాఖ్యాత said...

>>అది ఒక జాగ్రత్త కదా , బాధ పడవలసినది ఏమున్నది ...హిందూ మతానికి వీటి వల్ల వచ్చిన కష్టము ఏమి ఉన్నది ?

ఏది జాగ్రత్త? మనుషులని వారి పుట్టకనిబట్టీ, జాతినిబట్టీ అంచనా వెయ్యడమా? మనుషుల వ్యక్తిత్వం, ప్రవర్తనా, ఆలోచనల కంటే ఈ జాతులకీ, మన్నూ మశానాలకీ ప్రాముఖ్యత నివ్వడం జాగ్రత్తా? నాకర్థం కాలేదు. కొంచెం వివరించగలరా?
మీ దృష్టిలో హిందూ మతానికి వచ్చిన కష్టమేమీ ఉండక పోవచ్చులేండి. చాలా మంది హిందువులకి వచ్చిన కష్టం గురించి నేను చెప్పాను.

మొదట మనిషగా ఉండగలిగితే తరువాత హిందువుగానో, ముసల్మాను గానో క్రిస్టియన్ గానో ఏదో ఒకలాగా ఉండడం పెద్ద సమస్యేమీ కాదు లేండి.

ఆ.సౌమ్య said...

కృష్ణప్రియ గారూ
మీ పోస్ట్, ఈ కామెంట్లు చదువుతూ ఉన్నాగానీ వ్యాఖ్య రాయడానికి టైం కుదరకపోయింది.
మహాభారతం ఒక కథ కాదు....అసలు నిజంగానే జరిగుండవచ్చు. మనం దానికి పురాణం అనే పేరుని ఆపాదించి (ఇతిహాసం -అంటే జరిగిన కథ అని చెబుతారనుకోండి), కృష్ణుడిని భగవంతుడిని చేస్తున్నంగానీ కృష్ణుడు భగవంతుడు అనుకునేదాని కన్నా ముందుచూపు కలిగిన మంచి తెలివైనవాడు అనుకోవచ్చు....ఇలాగే కర్ణుని గురించి,ద్రౌపది గురించి....కొత్త కోణాలను, పార్శ్వాలని చూపించే మంచి పుస్తకం యుగాంతం. ఇది ఇరవతి కర్వే మారాఠీ లో రాసారు. తెలుగులో అనువదించబడింది. భారతం పై వచ్చిన పుస్తకాలలో నాకు ఇది బాగా నచ్చింది. అలాగే "పర్వ" అనే ఇంకో పుస్తకం. ఇక్కడ కన్నడలో రాయబడి తెలుగులోకి అనువదించబడింది. ఇవి చదివితే భారతం పై మరింత అవగహన పెరుగుతుంది. దాన్ని ఒక కథలా కాకుండా, ఒక నిజమైన గాధలా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఒక్కొక్క పాత్ర స్వరూపాన్ని, వ్యక్తిత్వాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగే అవకాశం లభిస్తుంది. వీలైతే చదవండి.

Mauli said...

వ్యాఖ్యాత గారుమీ వివరణ వినాలని అడిగానే కాని మరొకటి కాదు ..మీరు చెప్పేవి అన్ని సమంజసమే అయినా, మనకంటూ తప్పు, ఒప్పులను ..మంచి చెడులను నిర్వచించడానికి ఒక పద్దతి పెట్టుకున్నాం కదా... మనుషుల వ్యక్తిత్వం, ప్రవర్తనా ఎక్కువ గా వారి పెద్దల ను అనుసరి౦చి ఉ౦టు౦ది కదా...కొ౦దరు వ్యక్తుల కు ఇవి వర్తి౦చేవి లా కనిపి౦చకున్నా , అసలు సిద్దాంతము నే వదిలేయ్యము కదా (కేవలం హి౦దూ మతమునకే ఇది పరిమితము కూడా కాదేమో )


చాలా మంది హిందువులకి వచ్చిన కష్టం అని అన్నారు ..అదేమిటో తెలియకు౦డా చర్చి౦చ లేము@మొదట మనిషగా ఉండగలిగితే తరువాత హిందువుగానో, ముసల్మాను గానో క్రిస్టియన్ గానో ఏదో ఒకలాగా ఉండడం పెద్ద సమస్యేమీ కాదు లేండి.


మనిషి గా ఉ౦డటమ్ అనగా నిజానికి ఇలా ఉ౦డట౦ అని మీరు అనుకు౦టె చెప్పగలరు. అన్ని మతాలూ ఘోషిస్తున్నది ఒకటే అని, అది చెప్పినది కూడా మనిషే అని నా నమ్మక౦ :)

వ్యాఖ్యాత said...

Mauli గారూ,

మీరు వివరణ అడగటం మనం చర్చించడం మంచిదేనండీ. నా మొట్టమొదటి కామెంటు మీరు గమనించండి. నేను కేవలం ఒక ఆలోచనని చెప్పాను. That simplething was inadvertantly (casually without thought i guess) diverted and was responded in a way to support a particular way of thought.

>>మనకంటూ తప్పు, ఒప్పులను ..మంచి చెడులను నిర్వచించడానికి ఒక పద్దతి పెట్టుకున్నాం కదా... మనుషుల వ్యక్తిత్వం, ప్రవర్తనా ఎక్కువ గా వారి పెద్దల ను అనుసరి౦చి ఉ౦టు౦ది కదా...కొ౦దరు వ్యక్తుల కు ఇవి వర్తి౦చేవి లా కనిపి౦చకున్నా , అసలు సిద్దాంతము నే వదిలేయ్యము కదా (కేవలం హి౦దూ మతమునకే ఇది పరిమితము కూడా కాదేమో )

ఏంటా పద్దతి? దాని తప్పొప్పులు ఎవరు నిర్ణయిస్తారు? వదిలివెయ్యలేని ఆ సిద్దాంతం ఏంటి? I am not restricting it to any one religion. It is more about the trend in general.

>>మనిషి గా ఉ౦డటమ్ అనగా నిజానికి ఇలా ఉ౦డట౦ అని మీరు అనుకు౦టె చెప్పగలరు. అన్ని మతాలూ ఘోషిస్తున్నది ఒకటే అని, అది చెప్పినది కూడా మనిషే అని నా నమ్మక౦ :)

మంచి ప్రశ్న. మనిషిగా ఉండడం అంటే ఇలా అని ఎవరూ ఎవరికీ నిర్దేశించలేరు. అది ఎవరికి వారు నిర్ణయించుకునే అంశం. అందుకే మనిషిగా మనకున్న విచక్షణనీ, ఆలోచనా శక్తీనీ అరికట్టే సిద్దాంతాల, భావజాలాల ఆధిపత్యాన్ని నేను నిరసిస్తున్నాను. అంత మాత్రాన సిద్దాంతాలూ, భావజాలాలూ ఎందుకూ పనికిరానివని కావు. చాలా క్లిష్టమయిన విషయాలని అర్థం చేసుకునే క్రమంలో అవి చాలా ఉపయోగపడతాయి. కాకపోతే మన సొంత విచక్షణనీ ఆలోచనా శక్తినీ మన కాపాడుకున్నప్పుడు మాత్రమే.

Viswanath said...

>>> కాకపోతే మన సొంత విచక్షణనీ ఆలోచనా శక్తినీ మన కాపాడుకున్నప్పుడు మాత్రమే.

Sontha vichakshana, alochana sakthi leka pothe? Alanti variki kuda ela pravarthinchalo cheppeve ee generalizations.

Weekend Politician said...

>> సొంత విచక్షణా, ఆలోచనా శక్తీ లేక పొతే? ఆలాంటి వారికి కూడా ఎల ప్రవర్తించాలో చెప్పేవే ఈ generalizations.

hmmm.. intresting...

I am glad to have seen many people who are not prisoners of such generalizations, and who are capable of understanding them.

I have seen some people who try to perpetuate these generalizations because they are perceived to serve their self interest. and also some people who oppose these generalizations just for the heck of it.

My limitation is my inability to beleive that majority of the people in a society are lacking discretion and thinking power. Due to this limitation of me.. I think I feel it offensive when someone try to sell the argument that majority of the society need be prisoners of generalizations, there by branding people as incapable of either discretion or thinking power.

Mauli said...

@@ఏంటా పద్దతి? దాని తప్పొప్పులు ఎవరు నిర్ణయిస్తారు? వదిలివెయ్యలేని ఆ సిద్దాంతం ఏంటి? //

ఆవు ని సాధు జ౦తువు, పులి ని కౄర మృగ౦ అన్న పద్దతి..నిర్ణయి౦చినది ఏవరు, మనమే కాదా.

ఇక మీ మొదటి ప్రశ్నకు నా ఉదాహరణ ఇది చూడ౦డి->
పులి ని ఆవుల తో, ఆవు ని పులుల తో ను కలిపి పె౦చాక , సాధువు యెవరు..మృగ౦ ఎవరు ?

వారు వీరు, వీరు వారూను :)


@అందుకే మనిషిగా మనకున్న విచక్షణనీ, ఆలోచనా శక్తీనీ అరికట్టే సిద్దాంతాల, భావజాలాల ఆధిపత్యాన్ని నేను నిరసిస్తున్నాను. /

నిరసి౦చుకో౦డి ...యెవరికి సౌకర్య౦ గా ఉన్నవిధ౦ గా వారు నిరసి౦చుకోవచ్చును...అదే సమయ౦ లో ము౦దు తర౦ అనుభవాలను విశ్లేషి౦చి ఏర్పాటు చేసిన బాటను ప్రతి ఒక్కరు విస్మరి౦చి సొ౦త విచక్షణ నే పెట్టీ అదే విశ్లేషణ , ఆలోచన చేస్తె వృధా కాలయాపన యే కదా.

//అంత మాత్రాన సిద్దాంతాలూ, భావజాలాలూ ఎందుకూ పనికిరానివని కావు. చాలా క్లిష్టమయిన విషయాలని అర్థం చేసుకునే క్రమంలో అవి చాలా ఉపయోగపడతాయి. //

మీరే చెప్పారు..


//కాకపోతే మన సొంత విచక్షణనీ ఆలోచనా శక్తినీ మన కాపాడుకున్నప్పుడు మాత్రమే. //

ఆహ్వాని౦చదగిన పరిణామ౦.పరిధి ని మి౦చన౦త వరకు ఆశ పడవచ్చును ..

వ్యాఖ్యాత said...

>>ఆవు ని సాధు జ౦తువు, పులి ని కౄర మృగ౦ అన్న పద్దతి..నిర్ణయి౦చినది ఏవరు, మనమే కాదా. ఇక మీ మొదటి ప్రశ్నకు నా ఉదాహరణ ఇది చూడ౦డి-> పులి ని ఆవుల తో, ఆవు ని పులుల తో ను కలిపి పె౦చాక , సాధువు యెవరు..మృగ౦ ఎవరు ? వారు వీరు, వీరు వారూను :)

కలిపి పెంచగానే ఎవరు ఎవరో తెలియనంతగా ఉందంటే, మొదట్లో మనం ఒకటి కౄరమైనదీ, ఒకటి సాధువు అని అనుకున్న సిద్ధాంతం తప్పైనా అయ్యుండాలి.

లేదా

కలిపి పెంచకుండా ఉండుంటే ఈ పాటికి పులులూ, ఆవులూ ఎంతో సంతోషంగా ఉండేవి. పులులూ ఆవులూ పూర్తిగా వేరు వేరు, వాటిని కలిపి పెంచడమే మనం చేసిన తప్పై ఉండాలి.

ఈ రెండింటిలో ఏది సత్యమో తెలుకోవడం అవసరం. కానీ అది అంత తేలికగా తెగే విషయం కాదు. అది మనకి అర్థమయ్యే వరకూ గ్రహించాల్సింది ఏంటంటే ఏదైతేనేం ప్రస్తుతానికి రెండూ కలిసే ఉంటున్నాయి కాబట్టి రెంటికీ న్యాయంగా ఉండేలా చూసుకొని సత్యాన్ని కనుక్కునే పనిలో ఉండాలి. అంతే కానీ ఈ లోపు మొదటి సిద్ధాంతమే సరైందనో, లేక రెండోదే సరైందనో నియంత్రించడానికో, నిర్దేసించడానికో ప్రయత్నించడం ఖచ్చితంగా అన్యాయమే.

>>నిరసి౦చుకో౦డి ...యెవరికి సౌకర్య౦ గా ఉన్నవిధ౦ గా వారు నిరసి౦చుకోవచ్చును...అదే సమయ౦ లో ము౦దు తర౦ అనుభవాలను విశ్లేషి౦చి ఏర్పాటు చేసిన బాటను ప్రతి ఒక్కరు విస్మరి౦చి సొ౦త విచక్షణ నే పెట్టీ అదే విశ్లేషణ , ఆలోచన చేస్తె వృధా కాలయాపన యే కదా.

సౌకర్యంగా ఉన్నవాళ్ళు ఉన్నదాన్ని సమర్థిస్తారు. నొప్పి కలిగిన వాళ్ళు నిరసిస్తారు.

ఉన్నబాటని వదిలి అందరూ తలో కొత్త బాట వెయ్యడం కాల యాపనే. కానీ ఉన్నబాటలో వెళ్తూ ఇది సరైదేనా లేకా ఇంకేదైనా మంచి మార్గం ఉందా అని ఆలోచించలేక పోవడం మరీ దారుణం. అలా ఆలోచించడం ముందే ఉన్న బాటకి చేసే ద్రోహం ఎంతమాత్రం కాదు. బాట ఉంది కదా అని గుడ్డిగా దాన్నే నమ్ముకోవడం మాత్రం మొదట ఆ బాట తయారు చేసిన వారికి చేసే ద్రోహమే అవుతుంది.

సత్య said...

అదంతా ఎందుగ్గానీ, ఆవుతినే గడ్డి పులికి పెట్టి చూడండి చాలు...మీ ప్రశ్నలు పటాపంచలైపొతాయ్..

Mauli said...

@వ్యాఖ్యాత గారు

రె౦డు కలిసి ఉన్నాయి అనడ౦ కాదు అ౦డి -పులి పిల్ల ని ఆవు దూడల మధ్య ఉ౦చితె పులి కి క్రూరత్వం తో పని లేదు- తను పులి అని తనకే తెలిదు --ఆవు దూడ ను పులిపిల్లల మధ్య కు తీసికొని వెళ్తే ఏమవునో మాత్ర౦ మనకు తెలిదు .--నిజానికి ఇది ఆలోచనకు విశ్లేషణ కు అ౦దనిది

@ఈ రెండింటిలో ఏది సత్యమో తెలుకోవడం అవసరం. ///

ఇప్పటికే తెలుసుకొన్నారు కదా ...సత్య౦ కాదు అని అనిపి౦చిన వాళ్ళు ఇ౦కా ఉ౦డొచ్చు

@రెంటికీ న్యాయంగా ఉండేలా చూసుకొని సత్యాన్ని కనుక్కునే పనిలో ఉండాలి.//

న్యాయం గా ఉ౦డెలా చూడాల్సినదీ రెంటికి మాత్రమేనా ,ఆవు పులి రెండు ...దిక్కులు నాలుగు ..పంచభూతాలు ..నవగ్రహాలు etc (ఇ౦కో ఉపమానం దొరకలేదు అ౦డి :) )
అసలు న్యాయం అ౦టె ఏమిటి, అని మనం మల్లి మొదటికే :)

@కానీ ఉన్నబాటలో వెళ్తూ ఇది సరైదేనా లేకా ఇంకేదైనా మంచి మార్గం ఉందా అని ఆలోచించలేక పోవడం//

ఇ౦కొ౦చె౦ ము౦దుకు వెళ్ళు అన్న ఆలోచన 'మన౦ ము౦దుకు వెళ్ళే ప్రతి దారి లో' ఉ౦డగా మీకా అనుమాన౦ యె౦దుకు వచ్చి౦ది :)
కొ౦చె౦ జాగ్రత్త తో ము౦దుకు వెళ్ల డ ౦ సరే ..ప్రక్కకి వెళ్ళడమే కొ౦చె౦ ప్రమాద౦ ..అడ్డదారి కావచ్చు :)

వ్యాఖ్యాత said...

Mouli గారు,

చర్చ చాలా బావుంది:) కానీ.. మీ లేటెస్ట్ వ్యాఖ్య మాత్రం కొంచెం నిరాశ కలిగించింది. పర్లేదు.. ఇవన్ని జరుగుతూనే ఉంటాయి.. చూద్దాం ఎటెళ్తామో

>>రె౦డు కలిసి ఉన్నాయి అనడ౦ కాదు అ౦డి -పులి పిల్ల ని ఆవు దూడల మధ్య ఉ౦చితె పులి కి క్రూరత్వం తో పని లేదు- తను పులి అని తనకే తెలిదు --ఆవు దూడ ను పులిపిల్లల మధ్య కు తీసికొని వెళ్తే ఏమవునో మాత్ర౦ మనకు తెలిదు .--నిజానికి ఇది ఆలోచనకు విశ్లేషణ కు అ౦దనిది

చూశారా? మీరు పులి, ఆవులు వేరనీ, ఆవులదే సరైన దారనే భావజాలమే సరైనది అని నమ్ముతున్నట్టుగా అనిపించట్లేదూ పై వ్యాఖ్య చూస్తే!!

పులికి అసలది పులనే విషయమే తెలియకుండా చేసి మనం సాధించేది ఏంటి? పైగా అది పులి మంచికోసమే అని మనం నమ్ముతూ దాన్నికూడా నమ్మించడానికి ప్రయత్నించడం! దాదాపుగా పులలకి బతికే అర్హతలేదు అని చెప్పటమేగా ఇది.

>>న్యాయం గా ఉ౦డెలా చూడాల్సినదీ రెంటికి మాత్రమేనా ,ఆవు పులి రెండు ..దిక్కులు నాలుగు పంచభూతాలు, నవగ్రహాలు ఎత్చ్ (ఇ౦కో ఉపమానం దొరకలేదు అ౦డి :) )అసలు న్యాయం అ౦టె ఏమిటి, అని మనం మల్లి మొదటికే :)

విషయాన్ని సరళంగా ఉంచడానికి ఆవు పులి గురించి ఉపమానం తెచ్చింది మీరే, మళ్ళీ ఇప్పుడు అదికాదు సమస్య ఇంకొంచెం సంక్లిష్టమయ్యింది అని చెప్తుంది మేరే!

నిజమే ఇది అంత సరళమైన విషయం కాదు. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత సంక్లిష్టమైనదైనా మనం ముందుకెళ్ళగలం. కానీ మన వాదన నెగ్గిచుకోవాలనుకుంటే ఉపయోగం తక్కువ.

>>ఇ౦కొ౦చె౦ ము౦దుకు వెళ్ళు అన్న ఆలోచన 'మన౦ ము౦దుకు వెళ్ళే ప్రతి దారి లో' ఉ౦డగా మీకా అనుమాన౦ యె౦దుకు వచ్చి౦ది :) కొ౦చె౦ జాగ్రత్త తో ము౦దుకు వెళ్ల డ ౦ సరే ..ప్రక్కకి వెళ్ళడమే కొ౦చె౦ ప్రమాద౦ ..అడ్డదారి కావచ్చు :)

మన ముందు తరాల వాళ్ళు వేసింది అడ్డదారో కాదో తెలియనప్పుడు ఎలా చెప్పగలం? వెళ్ళే దారిలోనే ముందుకె వెళ్ళే ఆలోచన ముఖ్యమే కానీ అది గమ్యానికి చేరడానికి పనికొస్తుందా లేక మనల్ని ముందుంచడానికి మాత్రమె పనికొస్తుందా అనేదే కదా సమస్య :)

ss said...

the below comment just caught my attention, even before reading the whole thing...
మీరనేది మైనపు భవనంలో జరిగే హత్యాప్రయత్నం గురించేనా....?

I think లక్క భవనం might be a better description.

Mauli said...

/ఆవులదే సరైన దారనే భావజాలమే సరైనది అని నమ్ముతున్నట్టుగా అనిపించట్లేదూ పై వ్యాఖ్య చూస్తే!!/

Nope, I never said it ..

I think you are not in right path , pls check Mr.Weekend Politician's comment also ..

@@@మన ముందు తరాల వాళ్ళు వేసింది అడ్డదారో కాదో తెలియనప్పుడు ఎలా చెప్పగలం?

It's upto you, you may work for it..no issues

btw you said: @@@చాలా మంది హిందువులకి వచ్చిన కష్టం గురించి నేను చెప్పాను.

just wonder what it is,askin just for knowing...

చింతా రామకృష్ణారావు. said...

అమ్మా! మీ ప్రయత్నం అద్భుతంగా ఉంది.
మీ బ్లాగు చదివి కామెంట్స్ చేసినవారే సుమారు నూటేభై మందుంటే ఇంక చదివి కామెంట్ పెట్టకుండాశ్ ఉన్నవారి సంఖ్య నా ఊహకందటం లేదమ్మా. ఏది ఏమైనా చాలా సంతోషంగా ఉంది మీ బ్లాగు అదివి మీ హృదయనైర్మలయం ఊహించుకుంటే.
అభినందనలమ్మా.
శుభమస్తు.

Anonymous said...

Bhagavatam is good choice. As they say after writing Mahabharata Veda Vyasa also felt very sad and then was told to write bhagavatam to get peace and joy.

కృష్ణప్రియ said...

చింతా గారు,

అన్ని కామెంట్లు అంటే.. కొంత చర్చ వల్లనండీ.. దాదాపు ఒక వెయ్యి హిట్స్ వచ్చినట్టున్నాయి ఈ టపా కి. మహా భారతం గొప్పదనం అది! అనుకుంటున్నాను..

@ అజ్ఞాత గారు,

ఈ విషయం ఇప్పుడే వింటున్నాను.. సంతోషం. భారత దేశ చరిత్ర చెప్తున్నానండీ.. నాకు గుర్తున్నంత వరకూ.. అప్పుడప్పుడూ.. లేదా..ఏవో చిన్నదనపు కథలు..

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;