Wednesday, July 6, 2011

తెనాలి రామలింగడికీ నాకూ ఉన్న మౌలికమైన అభిప్రాయ బేధం!



ఒకసారి రాయల వారు తీరిగ్గా కూర్చుని.. 'ఈ ప్రపంచం లో అన్నింటికన్నా సులువైంది ఏది?' అని అడిగితే.. అందరూ నానా రకాల విషయాలు చెప్తే, తెనాలి రామకృష్ణుడు అన్నిటికన్నా సలహాలు ఇవ్వటం సులువు అని రాయలవారిని ఒప్పించాడట.


అది కరెక్టే నని మీరు ఒప్పుకుంటారా? ఏమో నేనైతే ఒప్పుకోను... తెనాలి రామ కృష్ణుడికీ, నాకూ ఈ విషయం లో మౌలిక మైన అభిప్రాయ బేధాలున్నాయి..

అసలు సలహాలివ్వటం వెనక ఎంత శాస్త్రం ఉంది? నా అనుమానం.. 64 కళల్లో ఇదొక కళ అని. ఒకవేళ లేకపోతే ఇది అరవై ఐదవ కళ అని సవినయం గా మనవి చేసుకుంటున్నాను. ఒక వేళ అంగీకరించక పొతే ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి సిద్ధం అవుతున్నాను. అసలు సలహాలకి ఎన్ని సూత్రాలున్నాయి? వాటికి మళ్లీ బోల్డు కోరోలరీలు!!!.. సెంటిమెంట్ ఉంది. నవరసాలు అలవోక గా ముఖం లో చూపించగలగాలి! ఎదుటి వారి మనస్సు లోకి దూరి వాళ్ల ఆలోచనలు పసిగట్ట గలగాలి. కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కలిగి ఉండాలి. అంటే సలహా ఒకవేళ ఆచరించి, అది వికటిస్తే, ఎటాక్ ని తట్టుకునే మానసిక స్థైర్యం ఉండాలి.

నేనూ బోల్డు సలహాలు అడిగినా అడక్కపోయినా తెగ ఇచ్చేస్తూ ఉంటా.. పైగా ఆఫీసులో సలహాల కోసం ముప్ఫై ల్లో ఆడవాళ్ళకి బోల్డు డిమాండు. సాధారణం గా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ముప్ఫై ఐదు వచ్చేసరికి ఒకరిద్దరు పిల్లలు తయారయి చాలా వరకూ ఉద్యోగాలయినా వదిలేయటమో, లేక కారీర్ లో పైకి దూసుకు పోవటమో, జరుగుతుండటం తో నాలాంటి వాళ్ల క్యూబ్ ముందు పేద్ద లైన్ అన్నమాట.



సలహా ఇవ్వటం వరకూ మాత్రమే మన కర్తవ్యమ్. ఇవ్వగానే మనం తప్పుకోవాలన్నమాట. పాటిస్తారా? సంతోషం.. పాటించరా ? మహా సంతోషం!! ఏదో సమాజ సేవ చేస్తున్న తుత్తి.. చాలా మంది 'కృష్ణా.. నీ దగ్గర సమయం ఉందా.. నేనొక ప్రాబ్లం లో ఉన్నా' అనగానే ఇక నాకు ఆటోమేటిక్ గా కనుబొమ్మలు విల్లుల్లా లేచి నుంచుంటాయి., ముఖం వెనక దేదీప్యమానం గా వెలుగుతున్న చందమామ దొర్లుకుంటూ వచ్చి అడ్జస్ట్ అవుతుంది. ముఖం మీద చిరునవ్వు పోయి టీవీ లో 'బ్రతుకు బండి భారం' ప్రోగ్రాం లో సుమలత లా సీరియస్, కన్సర్న్డ్ లుక్కు వచ్చి చేరుతుంది.

ఇలాగ సలహాలిస్తున్నప్పుడు కళ్లజోడు ఉంటే కొద్దిగా 'హుందా' గా ఉంటుందని కాంటాక్ట్స్ మానేసా. ;)
మనలో మాట... కొంత మంది గంట సేపు వాళ్ల కష్టాలు చెప్పుకుని సలహా వినకుండానే వాళ్ల బరువు దింపేసుకుని వెళ్లి పోతారనుకోండి.. అలాగని ఈ సెషన్లు పెట్టకుండా ఉంటామా ఏమిటి? మనకి వచ్చే ఇలాంటి కౌన్సెలింగ్ అవకాశాలు ఎందుకు వదులుకోవాలి అసలు?

ఆడపిల్లలు జనరల్ గా కష్టాలు చెప్పుకుంటారు అని ప్రతీతి గానీ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుల్లోఅమెరికా లో కానీ, బెంగళూరు లో కానీ అబ్బాయిలు కూడా బాగానే తమ కష్ట సుఖాలు చెప్పుకోవటం మామూలే.
ఇలా నా సలహా సామ్రాజ్యం లో ప్రజల కష్టసుఖాలు ఆఫీస్ లో మానేజర్ కష్టాలు, గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ తో ఝగడాలు, అత్తగారింటి వారితో లడాయిలు, పక్క క్యూబ్ అమ్మాయితో పోరు, వేరే గ్రూప్ వారితో గొడవలు, పని మనుషుల ధంకీలు, అబ్బో ఒకటని ఏముంది.. రోజూ, నా ప్రజలు క్యూబ్ ముందు నుంచుని .. నా ఏక చత్రాదిపత్యం మా ఫ్లోర్ లో కొనసాగుతూ ఉంది




.
నా సామ్రాజ్యపు రాజ్యాంగం లో సలహా సూత్రాలు ..

౧. సలహాలు అడిగిన వారిని అంచనా వేయాలి. వారు నిజంగా అడుగుతున్నారా? ఊర్కే భారాన్ని దింపుకోవటానికి చెప్తున్నారా? భారాన్ని దింపుకోవటానికయితే వింటూ, ఆఫీసు పనో, ఇంటికెళ్ళాక చేయాల్సిన పనుల జాబితా గట్రా ఆలోచిస్తూ.. ఆర్ట్ సినిమాలో హీరోయిన్ లాగా భావరహితం గా చూస్తూ, మధ్య మధ్యలో.. హ్మ్... అనటం.. నొసలు చిట్లించి తల పైకీ కిందకీ ఊపగలిగితే అదనపు మార్కులు.

ఉదా: భర్తల మీద చెప్పే పతివ్రతలకి ఇచ్చే సలహాలు.. పొరపాటున.. 'అవునా అంత దుర్మార్గమా? మరీ? అన్నామో మటాష్! ఇన్స్టంట్ గా విలన్ అవ్వాలనే సరదా ఉంటే ..ఈ పధ్ధతి అత్యంత శ్రేష్టం!!!. పైన చెప్పినట్టు ముఖ కవళికలు మారుస్తో 'చా.. మరీ.. అలా కాదులే' లాంటి డైలాగులు కొడుతూ ఉండాలి.


అలాగని అత్తగార్ల మీదా, ఆడపడచుల మీదా చెప్తున్నప్పుడు ఆర్ట్ హీరోయిన్ పాత్ర పోషిస్తే ..అది కాస్తా.. మాస్ సినిమా క్లైమాక్స్ అయి కూర్చుంటుంది జాగ్రత్త! సాధ్యమైనంత సానుభూతి ని ఒలికిస్తూ, దుష్ట, దుర్మార్గ,హీనాతి హీన, నికృష్ట లాంటి పద జాలాలని వాడుకోగలిగితే ఇక మనకి తిరుగులేదు.

౨. వాళ్లు నిజంగా అడిగితే అప్పుడు కూడా రెండు రకాలు. కొంత మంది వాళ్లు ముందుగానే నిర్ణయించుకుని మనం వాళ్లు అనుకున్నట్టే చెప్పాలని కోరుకునేవాళ్లు.. ఇలాంటి వారితో కొద్దిగా ప్రమాదం. వాళ్లు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో.. అర్థం చేసుకోవటం ఏమంత పేద్ద ఆర్ట్?



ఉదా: ఈ అమ్మాయి ని చూడు .. BTech From IIT Chennai, ముప్పై లక్షల జీతం. ఐశ్వర్య లా ఉండదు కానీ.. ఏదో అనుష్క లా ఉంటుంది. వాళ్లకి సిటీ లో మూడిళ్లు, ముగ్గురు అన్నదమ్ములకీ ఒక్కతే వారసురాలు.. తండ్రికి ఊళ్లో డెబ్భై ఎకరాల పొలం.. పిల్ల నెమ్మదస్తురాలు. పాటలు బాగా పాడుతుంది ట. ఈ అమ్మాయి ని చేసుకొమ్మని అడుగుతున్నారు. చేసుకొమ్మంటావా? పర్వాలేదంటావా?

౩. ఇక మిగిలిన వాళ్లు నిజంగానే అడుగుతారు. పాటించవచ్చు, పాటించక పోవచ్చు. మళ్లీ మనల్ని అడిగి ..సలహా ని ఖచ్చితం గా పాటించరు అని నమ్మకం గా ఉంటే గొడవలేదు.. హాయిగా.. మనం నిజంగా ఏమనుకుంటున్నామో చెప్పచ్చనుకుంటామా? అక్కడ కూడా మన జాగ్రత్త లో మనముండాలి. అడిగిన వాళ్లకి సింపతీ ఉన్న వాళ్లకి వ్యతిరేకమైన అభిప్రాయం చెప్తే తట్టుకునే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయా? అని. తర్వాత మళ్లీ మనతో మాట్లాడతారా మళ్లీ? అలా మాట్లాడకపొతే మనకి పర్వాలేదు కదా.. అని.



ఉదా: నాకు కొత్త ఐడియా వచ్చింది. ఫోన్ చేస్తే ఈరోజు వాతావరణం తెలుస్తుందన్నమాట. ఫోన్ కాల్ కి ఐదు రూపాయలు.. అని ఎవరైనా వచ్చి ఐడియా ఎలా ఉంది? అడిగితే 'ఇది నీ జీవితాన్ని మార్చేస్తుంది.' అనకుండా.. టీ వీ లో చూడచ్చు, పేపర్ లో చూడచ్చు.. అంతలా ఈరోజు వాతావరణం గురించి ఐదు రూపాయలు ఎందుకు ఖర్చుపెడతారు ఎవరైనా? లాంటి ప్రశ్నలు వేసే ముందు.. తర్వాత 'నా ఐడియా ని రిడిక్యూల్ చేసింది కృష్ణ! నన్ను కించపరిచింది' లాంటివి విని బాధ పడకుండా ఉండగలమా? ఒకవేళ మనం 'బాగుంది! విజయోస్తు! ' అంటేనో?

౪. కొద్ది మందికి మాత్రం నిజంగానే దిక్కు తోచక అడుగుతారే.. వీళ్లకి నిజాయితీ గా చెప్పవచ్చు. కానీ.. మన ఐడియా ఫెయిల్ అయిందో.. అంతే సంగతులు. వాళ్ల కష్ట నష్టాలకి మనల్ని బాధ్యులని చేయరూ?
ఉదా: పెళ్లి మధ్య వర్తిత్వం , స్టాకుల్లో పెట్టుబడీ... ల్ల్లాంటివి.. అమ్మో.

అన్నింటికన్నా ముఖ్యమైన గమనిక : బలహీన క్షణాల్లో వాళ్ల కష్టాలు చెప్పుకుని ఏరు దాటాక మనమంటే భయపడి మనకి దూరం గా మెలుగుతూ.. వాళ్లని వాళ్లు కష్టపెట్టుకుని.. మనల్ని గిల్టీ గా చేసి.. హబ్బో.. అదంతా చాలా గ్రంథం ఉంది.

ఇంతకీ ఈ సలహా పురాణం ఎందుకు విప్పానంటారా? ఇన్ని సలహా శాస్త్రాలూ ఆపోశనం పట్టీ ఈ మధ్య ౨-౩ సలహాల్లో పప్పులో కాలేసా గా ఆ వైరాగ్యం అన్నమాట.


మొన్నీ మధ్య ఒక అబ్బాయికి ఒక అమ్మాయి తెగ నచ్చేసింది. కానీ ఆ పిల్ల కి పొగ తాగే వాళ్లంటే వెగటు. అస్సలూ తట్టుకోలేదు. ఇతనేమో అప్పుడప్పుడూ పొగ తాగుతాడు. మానేసే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గర పెళ్లి విషయం తెచ్చే ముందు.. నన్ను అడిగితే నేను ఆలోచించి 'నువ్వు ముందరే చెప్పకు ఈ విషయం ' అని ఒక సుత్తి సలహా ఇచ్చాను. అతను సాలోచన గా 'సరే' అని వెళ్లాడు. తర్వాత మొహం వేలాడేసుకుని వచ్చి 'సారీ.. నిజాయితీ ముఖ్యం కదా.. ' అని నువ్వు చెప్పినా వినకుండా.. చెప్పేసాను. ఆ అమ్మాయి నువ్వంటే నాకు ఇష్టమే కానీ నేను పొగ తాగటం మాత్రం భరించలేను. I need to think about this.. sorry' అని చెప్పెసిందిట. దానితో నేను.. 'చూసావా? పెద్ద మహాత్మా గాంధీ.. తమ్ముడు బయల్దేరాడండీ' అని ఎద్దేవా చేసి నేను బాధపడి అతన్నీ 'అయ్యో తప్పు చేసానే' అనుకునేలా చేశాను.

కానీ రెండో రోజు సంతోషం గా వచ్చి నేను నిజాయితీ గా ఉండటం తనకు నచ్చింది. అని నాకు 'ఓకే' అని చెప్పింది. అని అన్నాడు. నాకు సిగ్గేసింది. నేను ఎంత చెత్త సలహా ఇచ్చాను. అని. ఆఫ్ కోర్స్.. ఒకవేళ ఆ అమ్మాయి నిజాయితీ లేదు, వంకాయ లేదు.. గెట్ లాస్ట్ అని వెళ్ళిపోయుంటే? అని సర్ది చెప్పుకుని ఊరుకున్నాను.

ఇంకో మిత్రుడు భార్య తో పొరపొచ్చాలొచ్చి విడి గా ఉంటున్నాడు. ఇంటి బాధ్యతలు తీసుకోవటం లేదని ఆవిడ పిర్యాదు. మొన్న తన చెల్లెలి పెళ్లికి రమ్మని.. ఊళ్లో వాళ్ల ముందు మర్యాదగా ఉండదని.. రెండు మూడు సార్లు అడిగినా ఆ అమ్మాయి.. 'పోరా' అని ఊరుకుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదని తల పట్టుకుని ఇతను 'ఏం చేయమంటావు?' అని అడిగాడు. నాకూ తెలియదు ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తే మంచిదో. బాగా ఆలోచించి
'కాళిదాసు కవిత్వం కొంతా.. నా సొంత పైత్యం కొంతా' లాగా నాకున్న పరిజ్ఞానం, వాళ్ల వల్లా, వీళ్ల వల్లా, సినిమాల వల్ల తెలుసుకున్నదీ ఏవో నాకు తోచిన విధాలు చెప్పాను. మొత్తానికి తనని ప్లీజ్ చేసుకునే సిల్లీ పద్ధతులు.
అంతా విని 'నేను ఇలాగే ఉండగలను. ఇవ్వాళ పెళ్లికి తనని రప్పించటానికి అబద్దపు పనులు చేసి తాత్కాలికం గా తనని ప్రసన్నం చేసుకోగలిగినా, జీవితాంతం కట్టు బడి ఉండలేను కదా.. పోన్లే.. ' అని వదిలేసాడు. నేనూ.. ఇలాంటి చెత్త సలహా ఇచ్చినందుకు నన్ను నేను తిట్టుకుని ఈసారి పిచ్చి సలహాలు ఇవ్వకూడదని ధృడ నిశ్చయం చేసుకున్నాను.

నిన్న ఆ అబ్బాయి ఆఫీస్ లొ అడుగు పెడుతూనే ఎదురొచ్చి..'కృష్ణా.. నీకొక మెయిల్ పంపా చూడు..' అన్నాడు. క్యూబ్ కెళ్లి చూస్తే మెయిల్ లొ 'జస్ట్ ఒక ఫోటో..' సరే తెరిచి చూస్తే.. ఆ అబ్బాయి చెల్లి పెళ్లి ఫోటో. ఒక పక్క అన్న, ఇంకో పక్క వదిన. 'వావ్.. ' అని కనుక్కుంటే.. ఆ అబ్బాయి చెప్పాడు. 'నా బాధ్యత నేను నిర్వర్తించకపొతే ఎలా ఉంటుందో.. నీకు చూపించుదామని అలా చేశాను.' అనేసిందిట. మనస్పూర్తి గా అభినందించి బయట పడ్డాను.
లాభం లేదు. ఇక పెళ్ళిళ్ళ కి సంబంధించి కొత్త రూల్స్ జత చేయాల్సిందే. ఎవరిదగ్గరైనా ఏమైనా సలహాలున్నాయా?
అలాగే మీకే విషయం లొ సలహాలు కావాలన్నా.. నేను ఇక్కడ బ్లాగు తెరిచి కూర్చున్నానని మర్చిపోకండెం!! online సలహా సర్వీసులు కూడా మొదలెడుతున్నా.. ఈసారి :)

PS. సరదా గా రాసాను. ఆఖర్లో రాసిన రెండు సలహాలూ నిజంగానే ఇచ్చాను. నిన్న ఒక బ్లాగర్ నా 'ఈరోజు' పోస్ట్ చదివి మెయిల్ ద్వారా ఒక చిలిపి సలహా అడిగితే ..నవ్వుకుని ఈ టపా రాసానన్నమాట.
బ్లాగర్ అడిగిన చిలిపి సలహా..

Priya gaaru
"మా ఇ౦ట్లో బోర్న్ విటా బాగా గట్టిగా అయ్యి౦ది. తినడానికి రావడ౦ లేదు. ఏదన్నా టిప్!!!!! :)"




54 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

క్రిష్ణ ప్రియ గారు,
టపా బావుంది.. సలహాల గురించి నాకు బాగా నచ్చిన ఒక కొటేషన్..

"Advice is what we ask for when we already know the answer but wish we didn't."

Sravya V said...

హ హ అసలు సూపర్బ్ అండి మీరు ! పోస్టు మాత్రం అదిరింది .
ఇంతకీ బోర్నవిటా గడ్డకట్టిన అభిమానికి టిప్ చెప్పరా నన్నేమన్నా ట్రై చేయమంటారా :))))))

కృష్ణప్రియ said...

@ WP,

కొటేషన్ బాగుంది. థాంక్స్!

@ శ్రావ్య,
:)) ష్యూర్! ప్లీజ్ ప్లీజ్ ఒక టిప్ ఇచ్చి పుణ్యం కట్టుకోండి.. నేను ఆల్టర్నేటివ్ లు ఇవ్వ గలిగానే కానీ ఈ సమస్యకి సలహా ఇవ్వలేకపోయా..

confused said...

మీరు ఏ కంపెనీ లో ఉన్నారో చెప్పండి.వెంటనే జాయిన్ అవుతా. నాకు మీ సలహాలు కావాలి.

మురళి said...

సలహాలు చెప్పడం ఓ కళ.. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు.. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, సలహా అడిగిన వాళ్ళ మనోభావాలు ఏమాత్రమూ దెబ్బ తినకుండా చూసుకోవడం.. అన్నట్టు, బోర్నవిటా బ్లాగర్ లాంటి సమస్యే నాదీను.. కాకపొతే మా ఇంట్లో గడ్డ కట్టింది బూస్ట్.. సలహా ప్లీజ్...

SD said...

బూస్ట్ బోర్న విటా (బూబో) లకి సలహా అడిగిన వారికి:

నే చెప్పే సలహా పాటిస్తే బూబోలు తినడానికి పనికిరావు. తాగడానికి పనికిరావొచ్చు అందులో పురుగులు లేకపోతే. ముందే చూసుకుని ఏడవండి. తాగేసి ఏడిస్తే హేమీ ప్రయోజనం ఉండదు. సరేనా?

వేడి నీళ్ళు కలిపి బూబో సీసాలు బాగా జాడించండి. బూబో పూర్తిగా నీళ్ళలో కలిసేక మోతాదు మాత్రం కప్పులో తీసుకొని పాలు కలుపుకోండి. తర్వాత చల్లగా ఏడిసినా వేడిగా ఏడ్చినా బాగానే ఉంటుంది. మిగిలినది ఫ్రిజ్ లో పెట్టుకుని అయ్యేదాకా తాగొచ్చు.

నేను గడ్డకట్టిన కాఫీని ఇలాగే తాగుతూ ఏడూస్తూ ఉన్నాను - చాలా ఏళ్ళ నుంచీ. శుభం భుయాత్!

కొత్త పాళీ said...

టపా కేక. కృప్రి గారి సలహాలు సూపర్ కేక.
@DG - కేకన్నర కేక.

Advice to your blogger friend re. dried up bournevita - buy a good electric drill with diamond tip drill bit and then - drill, baby, drill!

మధురవాణి said...

హహహహ్హా.. బావుంది మీ సలహాల పురాణం! నాకూ ఇలాంటి సలహాల అనుభవాలు చాలానే ఉన్నాయి.. సరదాగా చెప్పినా మీరు చెప్పినవన్నీ నిజాలేగా! ;)
గడ్డ కట్టిన బోర్నవిటాలో వేడి పాలు పోసి.. ఆ చిక్కటి చాకో సిరప్ ని స్పూన్ తో తాగెయ్యమని చెప్పండి మీ ఫ్రెండ్ కి.. :))

Kathi Mahesh Kumar said...

lol :) :) :) :) Sheer fun ! I enjoyed it.

మేధ said...

హ్హహ్హ.. నిజమే ... :)
ఎప్పుడైనా, ఎవరికైనా సలహా చెప్పగానే, ఆ ఏముంది సలహా ఇవ్వడం ఈజీ అంటే, ఈ టపా ప్రింట్ తీసి ఇవ్వాలి :P

మాలా కుమార్ said...

మీకూ తెనాలిరామలింగడి కీ పెద్ద అభిప్రాయబేధమే వచ్చిందే :)

కృష్ణప్రియ said...

@ confsued,
తప్పకుండా.. మీ ఈ-మెయిల్ పంపండి. అలాగే resume కూడా.. :)
@ మురళి గారు,
చూసారు కదా, మీ సమస్యకి DG గారు, మధురవాణి గారు, కొత్తపాళీ గారు ఇచ్చారు సలహాలు?
@ DG గారు,
:) మీ సలహాలు బాగున్నాయి థాంక్స్. నాకు పని తగ్గించారు
@ కొత్త పాళీ గారు,
థాంక్సు, సూపర్ థాంక్సు! మీ సలహా కి కూడా థాంక్స్.
@ మహేశ్ కుమార్ గారు,
Thanks! I am glad you enjoyed reading it.

కృష్ణప్రియ said...

@ మధురవాణి గారు,
:))) థాంక్స్! నా సలహాల పురాణం నచ్చిందన్నమాట. మీ సలహాతో నా పని తగ్గించినందుకు థాంక్స్!

@ ఇంద్రసేనా గంగసాని గారు,
:)) బాగుంది. అయితే మీరు ఇప్పుడు అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి నడుం కడతారన్నమాట. All the best!
మీరన్నది నిజమే. నేనూ ఆలోచిస్తా.. మీకన్నా ఇంకో మెట్టు పైకెదిగి దేవ దానవ సమస్యల పరిష్కారానికి సలహాలేమైనా కావాలేమో, బృహస్పతి గారినీ, శుక్రాచార్యుల వారినీ , అడిగి చూస్తా. వాళ్ల సెల్ నంబర్, అడ్రస్ దొరకటం లేదు. :)
On a serious note, .. Thanks for the compliment.

కృష్ణప్రియ said...

@ మేధ గారు,
:)) థాంక్స్!

@ మాలా కుమార్ గారు,
:))) కదండీ!!!... ఆయనేదో ఈజీ అన్నాడు కదా అని నేను బోర్డ్ పెట్టుకుని కూర్చున్నాను. పేరుకి పేరూ, గాసిప్ వినచ్చు.. ఎంజాయ్ చేయచ్చని. బోర్డ్ ఎత్తేసే పరిస్థితి.
అందుకే మాకొచ్చిన బేధాభిప్రాయాన్ని బ్లాగ్ ప్రపంచం ముందు ఉంచుతున్నాను.

Sravya V said...

అబ్బా ఇప్పుడు మురళి గారి కామెంట్ చూసాక నా సలహా చెప్పలేనండి , ఆయనికి కూడా అదే డౌట్ కదా ఈసారి కి మధురవాణి గారి సలహా , DG గారి సలహా పాటించేద్దాం :))))

Mauli said...

రామలి౦గడికీ బతుకు జట్కాబ౦డికి లి౦క్ పెట్టేసి భలే రాశారు.మొదటి సలహా సూపర్

బులుసు సుబ్రహ్మణ్యం said...

>>>ఇన్ని సలహా శాస్త్రాలూ ఆపోశనం పట్టీ ఈ మధ్య ౨-౩ సలహాల్లో పప్పులో కాలేసా గా ఆ వైరాగ్యం అన్నమాట.

మీరు ప్రాధమిక సూత్రం తెలుసుకోకుండా సలహా.కాం ఓపెన్ చేసారు. శాస్త్ర ప్రకారం ఎప్పుడూ సలహాలు ఇవ్వకూడదు. నాలాంటి అనుభవజ్నుడిని కన్సల్టెంట్ గా పెట్టుకోండి. ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా సలహా ఇవ్వాలి. నో కర్ర విరిగింగ్ నో పాము చచ్చింగ్ అన్న తటస్థ పద్ధతి బెస్ట్. అ.హా

@ DG. మీ సలహా సూపరూ. కెవ్వు కేక.

రవికిరణ్ పంచాగ్నుల said...

కృష్ణప్రియగారూ, పూర్వాశ్రమంలో సలహాలివ్వటంలో కూసంత అనుభవం ఉంది.. మీకేమన్న సహాయకులు కావాలంటే నాకో కేక వెయ్యండి.. :-)

ఆ.సౌమ్య said...

వాహ్...కృష్ణప్రియ గారూ ఏం టాపిక్ తీసుకున్నారండీ....అసలు టైటిల్ దగ్గరే పడేసారు....ఆ టైటిల్ చూసి ఏమిటా అని పరిగెత్తుకొచ్చా! పోస్టు చదివి బాగా నవ్వుకున్నా.

బూస్ట్, బోర్నవీటా సమస్యకు నాదో సలహా.
నేనేం చేస్తుంటానంటే ఒక కత్తిని డబ్బా లోపలికి గుచ్చి తూట్లు పొడుస్తా, అప్పుడు అది ఓ మాదిరి సైజు ముక్కల్లా అవుతుంది. అప్పుడు వాటిని బయటకి తీసి గూటం తో చితగ్గొడతా. అప్పుడు చిన్న చిన్న ముక్కలవుతాయి. దాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటా. కొంచం జీడిపాకంలా సాగుతూ తియ్యగా బావుంటుంది.
లేదంటే మధుర చెప్పినట్టు అందులో వేది పాలు పోసి కరిగించి తాగుతూ ఉంటా. :)

కృష్ణప్రియ said...

@ శ్రావ్య ,
:) పర్వాలేదు. హార్లిక్స్ గురించి ఎవరైనా సలహా అడిగితే మీ సలహా వాడుకుంటా.. సో.. చెప్పేయండి పర్వాలేదు.

@ మౌళి,
:) థాంక్స్!

@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,

హ్మం.. అలాగంటారా? ఈసారి మీకు అవుట్ సోర్స్ చేస్తా కొన్ని సలహాలు. మీ సహాయ సహకారాలు కావాలి నాకు!

కృష్ణప్రియ said...

@ రవికిరణ్ గారు,
తప్పకుండానూ. అబ్బో నాకు సిబ్బంది బానే అమరుతొందే?

@ సౌమ్య,
:)))) హమ్మో.. కత్తులు, తూట్లు, గూటం తో చితక్కోట్టడాలు. జీడిపాకం లా సాగుతున్న పదార్తాన్ని చప్పరించటాలు.

నూరూరిపోతోంది.
అర్జెంట్ గా బూస్ట్ సీసా లో నీళ్ళో నిప్పులో పోసి గట్టి పరచాలి లాభం లేదు.

Unknown said...

బాగా రాసారు.. నాదీ ఒక సలహా.. అసలు ఈ బూస్ట్ లూ, బొర్నవీటాలూ మానేసి హాయిగా హార్లిక్స్ కొనేసుకోమనండి. "నేను హార్లిక్స్ తాగను.. తింటాను అనుకుంతూ తినెయవచ్చు.. అసలు గడ్డ కట్టే వరకూ రాదు.. నమ్మమని చెప్పేయండి.

Anonymous said...

ఎంత కష్టపడి రాసినా, ఇష్టపడి రాసినా నా బ్లాగు చదివే నాధుళ్ళేకా, కామెంటే దాతల్లేకా వెల వెలా పోతూ విల విల లాడుతోంది. దాన్ని "వచ్చీ పోయే అథిదులతో" కళ కళలాడుతూ చేయటం ఎలాగో సలహా ఇవ్వమని అడుక్కుంటున్నాను.. ఐ మీన్ ఆడుగుతున్నాను!

శారద

కొత్తావకాయ said...

:D nice post! బతుకు బండి సుమలతదీ బెంగుళూరే అనుకుంటా! అదా మీ ఇద్దరి మధ్య మౌలికమైన సామ్యం! భలే! ఇంత మంది చెప్పాక నేను ఇచ్చే బోడి సలహా ఏముంటుంది. గడ్డకట్టిన బోర్నవిటా ఎంతవరకూ తెచ్చిందో చూడండి. అసలు డబ్బా కొనుక్కోగానే బుల్లి బుల్లి ఐకియా స్పూన్ లు కాకుండా భారీ గరిటె ఒకటి వేసుకు లాగించెయ్యమని చెప్పండి. ఇది సలహా కాదండోయ్. ముందు జాగ్రత్త. అదీ చెప్పాలి గా సలహాడాట్ కాం వారు. :)

అయితే మీరు సలహాలే కానీ నా లాంటి వాళ్ళు అడిగే చొప్పదంటు ప్రశ్నలకు సమాధానం ఇవ్వారా?

Anonymous said...

చెప్పినదానికి opposite చేస్తే... మీ సలహాలు బాగానే పనిచేస్తున్నాయి అనిపిస్తోంది. :))

అసలు వదిలేసి కొసరు మీద పడ్డట్టు, మెజారిటీ కామెంటర్లను గడ్డకట్టిన బోర్నవిటా బాగా ఆకట్టుకున్నట్టుంది. :P

కృష్ణప్రియ said...

@ ప్రసీద,
ధన్యవాదాలు! :) హార్లిక్స్ బెటర్ అంటారు :)

@ శారద గారు,
ఇంకా నయం! అడిలైడ్ శారద గారి బ్లాగ్ చదివే నాధుడు లేదా? ఎంత మాట?

@ కొత్తావకాయ,
అయ్యో.. మీ మెయిల్ స్పాం లోకి వెళ్లింది. ఇప్పుడే చూశా! అవునండీ.. ఎంతైనా నేనూ, బతుకు బండి సుమలతా బెంగుళూరు వాళ్లం. కావేరి నీళ్లల్లో ఉన్నట్టుంది ఏదో మహిమ..

@ Snkr,
:) అయితే నాకు ఏమనిపిస్తుందో దానికి ఆపోసిట్ సలహా ఇస్తాను. ఈసారి. థాంక్స్.

మహీధర రెడ్డి said...

అస్సలు బోర్నవీటా గడ్డ కట్ట కుండా వుండాలంటే ఏమి చెయ్యాలండి ?? నాకొక సలహా ఇవ్వగలరు. నా పేరు మహీధరు. గత కొన్ని
టపాలు చదువుతూనే వున్నాకానీ ఈరోజే మొదతి సారిగా ఒక వ్యాఖ్యను పెడుతున్నాను . మీ టపాలు ఎంత హాస్యభరితంగా వుంటాయో అంతే సహజంగా , నిజానికి ఆమడ దగ్గరగా (దూరంగా కాదు) వుంటాయండీ. మీరు ఇలాగే కల కాలం రాస్తూ మమ్ములని ఆనదింపచేయగలరని విన్నవించుకుంటున్నాను . మీ టపా స్పూర్థి తో మీకే ఒక సలహా ! ఎలాగూ మీరు సలహా శాస్త్రంలో ఎంతో లోతుగా పరిశోధనలు చేసారు కాబట్టి, మీరు ఈ అంశం మీద ఒక కోర్సు మొదలెట్టి నన్ను మీ మీ విద్యార్తిగా చెర్చుకోరూఊఊఊఊ .

సుజాత వేల్పూరి said...

సలహాల పర్వంలో మరో ముఖ్య ఘట్టం! సలహా అవసరమైన వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుని దాన్ని మన చేత బలపరిపించి, వాళ్ల నిర్ణయం సరైనదే అని మన చేత అప్రూవ్ చేయించుకుని కొంత confidence పొందటానికి వస్తారు చాలా సార్లు! అంటే వాళ్ళ నిర్ణయం ఏదై ఉంటుందో దాన్నే మనం సలహాగా చెప్పాలనీ అశిస్తారు. అలా కాక వేరేగా చెప్పామనుకోండి....కాస్త నిరాశ పడి "మరి ఇలా చేస్తే ఎలా ఉంటుందీ? బాగుంటుంది కదా" అని మనకి హింట్స్ ఇస్తారు.

ఇలాంటి స్వానుభవాలతో బొప్పి కట్టించుకుని సలహాలివ్వడం మానేద్దామనుకుంటే_________ఊహూ కుదిరేట్టు లేదు. 30ల్లో ఉన్నవాళ్ళ సలహాలకు డిమాండ్ ఎక్కువ కదా మరి!:-))

కృష్ణప్రియ said...

@maheedhar,

LOL. గడ్డకట్టకుండా ఉండాలంటే.. కొత్తావకాయ చెప్పినట్టు ఆ లోపలే తినేయాలి.

కొత్త ప్రొఫైల్ లా ఉంది మీది. నా బ్లాగు కి స్వాగతం. తప్పకుండా శిష్యరికానికి మీ అప్లికేషన్ స్వీకరిస్తాను. ఫారం.. 500 Rs. అలాగే ఎడ్మిషన్ ఫి లక్షా.. SBI లో చలాన్ కట్టి ఐడీ కార్డ్ తీసుకెళ్లండి.

మహీధర రెడ్డి said...

అవునండీ క్రిష్ణ ప్రియగారు...నేను ఈ బ్లాగు చదువులలో ఇంకా అ,ఆ ల లోనే వున్నాను. మీ దగ్గర కోర్సు రుసుములు చాలా ఎక్కువగా వున్నాయండి. నేను ఆర్ బి ఐ లేక ఫెడెరల్ రిజర్వ్ దగ్గర పేద్ద పేద్ద రుణాలు తీసుకోవలేమో . చిన్నవాడిని కదా కొంచెం రాయితులు ఇవ్వండి..మీకు భవిష్యత్తు లో రాయల్టీలు ఇచ్చు కుంటాను.

కృష్ణప్రియ said...

@ సుజాత గారు,
నిజమే :) పైగా..మనం వాళ్ల మనసుల్లోది చెప్పకపోతే హింట్స్ ఇస్తారు -- కరెక్ట్ మాట చెప్పారు.
ఎలా మానేస్తాం? మరి సలహాలు ఇవ్వటం మన ధర్మం కదా :)

@ మహీధర్,
:) సరే మీకోసం.. 499 Rs.కే అప్లికేషన్ ఫార్మ్ ఫి.

mayukha said...

Not only Bournvita, any other malted drinks and coffee powders usually get solidified when we leave the spoon in the container after use. To avoid this, take a fresh dry spoon every time you want to use coffee powder (like we take a fresh plate every time we go for food in buffets). A simple logic behind this is, when you bring the spoon close to hot liquid (milk or water) to add coffee powder, the vapor on the surface of drink sticks to the spoon and if you put that spoon back in the container, the remaining coffee powder gets solidify. Many of the above bloggers might be knowing this already, but wanted to make a point. My two cents.

As usually, mee tapa adirindi krishna garu. Keep posting.

thrill said...

క్రిష్న ప్రియ గారికి నా నమస్కారములు ..!

నెను మీ కొత్త పాటకుడిని ( ఎవరా ఈ బకర గాడు అని అల నొసలు చిట్లించకంది )
నెను మీ బ్లొగ్ ఇడి ని మా సీనుగాడి (అదెనండి ఆ కలస్త్రి బ్లొగ్గెర్ ) బ్లొగ్ వీర తాల్లు లొ చుసను . మీ ప్రొఫిల్ల్ బొమ్మ చూడ గానె చాలా ముచ్చట వెసింది తప్పకుండ మీ లొ మంచి సుబ్జెచ్త్ ఉంటుందని ఉహించాను , నా ఊహ 200% నిజమని మీ ఒక బ్లొగ్ చదవ గానె అర్ధమైపొఇంది ...అలా రెందు సార్లు మీ బ్లొగ్ చదవగానె ఇక నా వీర బద్దకత్వన్ని పక్కన పెట్టి కమెంట్ పెట్టలని నిర్నయించెసుకున్నాను .
( ... ఇక సొధి ఆపి విషయానికి రార బడుద్దయి అని మీ ముఖ కవలికలు బట్టి నాకు అర్ధం అవుతుంది )

నెను మీలానె వాగుడుకాయ ని ( అయ్యొ ఇది నెను అన్న మత కాదు మె ప్రొఫిలె లొ మీరె చెప్పి యున్నారు )... యె విషయం తిన్నగ చెప్ప్దడం రాదు , ( ఈ విషయం లొ నా బద్దకనికి నా వగుదు తనానికి పెద్ద ఘర్షన జరుగు తునె ఉంటుంది )

ఇక పొతె నా అభిప్రయల్ని రెండు గ విభజిస్తున్నను .. మొదటి దస , రెందొ దస

నా మొదటి దస అభిప్రాయం :
మీ ప్రెజెంటెసన్ సైలి అద్భుతం , మీ సమాజ స్ప్రుహ , మీ తెలివి ( పురానాల నుంచి లెటెస్త్ తెఛ్నొలొజి వరకు ) అనిర్వచనీయ్యం ( ఇప్పుడు మీ భుజం మీరు తట్టుకొవచు ) ఒవెరల్ గ మీ బ్లొగ్స్ సూపర్ . మీకు నా హ్రుధయ పుర్వక అభినందనలు . ( ఇది వరకు ఇది చాలమంది చెప్పినా , మీకిది కొత్త కాకపొఇన మీ ముకం లొ అనందం టీవీ ప్రొగ్రమ్మె లొ పట్టుచీర గిఫ్త్ వచినంతగ వెలిగిపొవడం నాకు స్పష్తం గ తెలుస్తుంది , కాని ముందుంది ముసల్ల పండగ )

నా రెండొ దస అభిప్రాయం :
మీ బ్లొగ్స్ చదివె కొద్ది నలొ మీ పట్ల అభిమాని థొపాటు ఈర్ష్య కొద్ది (ఈవిడ ఇంత బాగ రస్తూ ఉన్న రె , నెను రాయలెక పొతున్ననె , ఈవిడకి ఇంత అవగహన ఉందె అని ) ఒక అపరిచితుదు కూడా పెరుగుతూ వచ్హాడు. సొ అలా మీపట్ల ఎనలెని అభిమానం థొ పాటు అంతె రెంజి లొ అపరిచితుడు కూడ పెరిగిపొయాడు .

పర్యవసానం :
నెను మీ బ్లొగ్ కమెంట్స్ లొ ఎంత పొగడాలి అనుకున్నా , నాలొ అపరిచితుడు అలా జరగ నివ్వడు , ఏదొ తిక్క చెస్టలు చెస్తునే ఉంటాడు , ఉదా : మీ అభిప్రయాలతొ ఏకీభవించక పొవడం , అప్పుడప్పుడు ఖండించడం అలా వెధవ చెస్టలు చెస్తూనే ఉంటాడు . అవన్నీ ఈర్ష్యతొ వచ్చెవే , వెధవ నా మాట విని చావడు .

డిస్చ్లైమర్ర్ :

సొ నే చెప్పొచెదెంటంటె ఇక పై మీ బ్లొగ్స్ కి కమెంట్లు కి నేను భాద్యుడ్ని కాదు . నాలొ అపరిచితుడు నా మాట వినడు ( మీ అంతరాత్మ : వీడేవడురా బాబూ , పడక పడక వీడి కంట్లొ ఎందుకు పండింది నా బ్లొగ్, అపరిచితుడు అది ఇది అంటూ ఇప్పుడే ఇలా తల తినెస్తున్నడు ముందు ముందు నా సరుకుల లిస్త్ లొ తల నొప్పి మాత్రలు తప్పని సరి అయ్యెట్టుంది ).

ఇక ఫైనల్గా తెనాలి రామలింగయ్య అనే ఈ బ్లొగ్ కి నా కామెంట్లు :

( త్వరలొ విడుదల ) (అసలు విషయం ఇక్కడికి వచెసరికి .. నా బద్దకం కొవై సరల బ్రమ్హనందం మీద దాడిచెసినట్లు దాడి చెసింది ..అందుకె త్వరలొ విడుదల అని టీవీ సీరియల్స్ లొ ల కాస్ట సుస్పెన్సు చొప్పించాను )

(క్రిష్న ప్రియ గారి అంతరాత్మ : హమ్మయ్య బ్రతికించావురా బాబూ , ఈపూటకి ఇల వధిలెసినందుకు నీకొ దండం )

నేను తెలుగులొ టైపదం మొదటిసారి ....ఏమన్న తప్పులుంటే సారీ


ఇట్లు

ఎడారిలొ బిడారి

buddhamurali said...

కృష్ణ ప్రియ గారు మీ సలహాలు చదివాక మీకో సలహా ఇవ్వాలని అనిపిస్తోంది . ఇమ్మంటారా ? వద్దంటారా చెప్పండి ? కావాలంటే ఎవరినైనా సలహా అడిగి చెప్పండి తొందరేమి లేదు

thrill said...

krishna priya garuu,
telugulo typee opika leka ika direct ga eng lo ne typestunnanu ..(mee antaratma - edo okati tondara ga edchi chavu avatala naku boledu pani undi )
..ika vishayniki vaste ...

అది కరెక్టే నని మీరు ఒప్పుకుంటారా? ఏమో నేనైతే ఒప్పుకోను... తెనాలి రామ కృష్ణుడికీ, నాకూ ఈ విషయం లో మౌలిక మైన అభిప్రాయ బేధాలున్నాయి.."
ane vishayam lo nenu tenali ramalingayya cheppindi mummatiki correcte ani...samardhistuu ....

meeru cheppinatluga ..
"అసలు సలహాలివ్వటం వెనక ఎంత శాస్త్రం ఉంది? నా అనుమానం.. 64 కళల్లో ఇదొక కళ అని. ఒకవేళ లేకపోతే ఇది అరవై ఐదవ కళ అని సవినయం గా మనవి చేసుకుంటున్నాను"
meetho eekeebhavistunnanu ...

( mana hit telugu cinemalanni 2nd half bagunnave, sagatu prekhakulu last half an hour lo santhoshamga unte, 1stalf gurinchi marchipoi marii anandistharu...so anduke mundu tenali ramalingayyani samardhinchi taruvata meetho eekeebhavinchanu ....)...

asalu ikkada vachina chikkalla entante ...
salahalu 2 rakalu ani meeru gurthinchali...

modatidi rakam : : "uchita salahalu "..ante uchitanuchitalu alochinchakundaa edutivaru adigina, adakkapoinaa...(cheppevadiki vinevadu lokuva ane type lo ), result yokka paryavasanam gurinchi eematram alochinchakundaa,....( railwaystation canteen food laaga... tinevadiki emaite nakem ante type lo ) ..iche salahalu .
mana tenali rama lingayya cheppina salahalu ee kovake vasthai ,,
veetilo ekkuva satam adakkundane , kalpinchukoni marii icheve untai., vinnavadu deeni patisthada, leda .. ane benga kuda undadu ichevadiki .... cheppatam varake vaadi bhadyata annatluga pravakthisthadu ... (ee salahalu iche kontamandilo matram .. edutivadu patinchali ane tapana matram vuntundi )

ilantisalahalu vinevariki ... konni sandharbhallo patinchali anukune kanna , ichina vari nettina okka motikkai veyyali ane anta chiraku vastundi .
ex:- mee pakkinti pankajam pinni meetho .... entammai mee atta mama ,palletullo vontari ga unnarantagaa .. meedoka bed room kaleegane undiga ... vallani ikkade unchukoni .. baga chuskovachuga .

konni salahalaki , patinchina patinchaka poina navvi urukuntam
ex: edurinti kantham pinni meetho "roju poddunne kasepu yoga cheyya voi , vollu kastha teligga untundi " annattu
(hadavidilo ex anta apt ga undaka povachu sardukondi )

so ila uchitha salahallo sub titles cheppukuntuu pote , chalane untai ... ( nenu konni chepte meeru nakanna ekkuvuga ainkonni jatacheskogalarane nammakam tho ee uchitha salahalu ika apestunnna)
.ee uchita salahalu konni , edutivaru adiginte ... abboo nenu pedda medhavini kabatti nanne adigadu ante styllo ..visirevi , ( arati tokka road meeda vesinatlu , ... avu chuste tintundi .. ala aharam ga upayoga padinattu , manishi tokki kalujarite .. vaadi kharma annattu ...)

so mana tenali rama lingayya cheppindi ilanti salahala gurinche ani naa abhiprayam .... ( meeru eekeebhavistharani thalusthanu )
......to be continued

thrill said...

continuation to the above comment ....( shala bhavam valla ila mukkaluga cyeyyalsi vachindi .....)

ika rendo rakam :

meeru cheppina salahalanni ee kovake vasthai ( idi house food lantidanamata .... srivaruki em pedite baguntundi , pillalaki em pedite baguntundi .. attagariki em pedite baaga jeernam avtundi ani .... alochinchi .... marii... vividharakaluga vaddinchadam type)......
indulo ... mukyam ga patinche vadi gurinchi care and vaati rsult gurinchi andolana vuntundi .
ofcourse indulo konni vikatisthai ..but daanigurinchi manam andolana chendi prayojanam ledu ( sappose meeru mee attagari food vishayam lo enta care teeskunna mee atta gariki ajeernam ayyi, ... idantaa maa kodalu asradda valle jarigindi ani blame cheyyadam.. daaniki manam em cheyyalem aa paivade sakshi ).
indulo rakalu gurinchi nenu ..meeku cheppentatodni kaadu .... meeru savivaram ga anni rakala gurinchi e blog lo teliyajesi unnaru .

ee rakam salahalu .. meeru cheppinatluga 64 kalallo oka kala ani nenu purthiga eekeeebhavistunnanu .


finalaga konni vichitra rakam salahalu kuda unnai ..
ex: mana budda muraligaru annatlu " మీకో సలహా ఇవ్వాలని అనిపిస్తోంది . ఇమ్మంటారా ? వద్దంటారా చెప్పండి ? కావాలంటే ఎవరినైనా సలహా అడిగి చెప్పండి "......
ila salahalu ivvala vadda ani salaha salaha adigina varine /adigi marii teeskomane varine /teeskune varine ,salaha adagadam ...

ika intatitho mugisthanu ...

itlu
darina poye danayya

..nagarjuna.. said...

నన్నెవరైనా సలహా అడిగితే కాసేపు తెగ ఆలోచించేసేసి 'నీకు నచ్చింది, ఇష్టమైంది చేసెయ్' అని సలహా ఇస్తా.చూసారా ఎంత వీజీనో ఇది. లాభమో నష్టమో మనం సేఫ్ :D

ఇక ఆ బోర్న్‌వీటా బాబులు. అలా గట్టిగా అవగానే దగ్గర్లో ఉన్న రోట్లోనో, గ్రైండర్‌లోనో వేసి పిండి పిండి చేయండి. కుదిరితే కప్పు పాలలోనో లేకపోతే పెనం మీద చపాతీలాగో చేసుకోవచ్చు ;)

కృష్ణప్రియ said...

@ మయూఖ,
థాంక్స్!!

@ బుద్దా మురళి,
:)) మీ సలహా తప్పక వింటాను. చెప్పండి. ఎదురు చూస్తున్నాను.

@ నాగార్జున,
:) మీ పధ్ధతి బెస్ట్! సేఫెస్ట్! మీ సలహా బాగుంది. మరి సీసా ముక్కలు కూడా ఆ పిండి లో కలిస్తే?

కృష్ణప్రియ said...

@ thrill (ఎడారి లో బిడారి/దారిన పోయే దానయ్య ),
ముందు గా నా బ్లాగ్ కి స్వాగతం! ఈ బ్లాగ్ లో ఇంతవరకూ వచ్చిన కామెంట్లలో ఇది అతి పెద్ద వ్యాఖ్య :)సో.. కంగ్రాట్స్!
వివిధ దశల్లో మీ అభిప్రాయాలు సునిశితం గా వివరించి, పర్వావసానాలూ, డిస్క్లై మర్ ఇచ్చారు. నైస్.
మీరు ఏకీభవించని విషయాలు చెప్తూ ఉండండి. ఆలోచించి నేను రాసింది తప్పనిపిస్తే అభిప్రాయం మార్చుకుంటాను.

సిరిసిరిమువ్వ said...

:))సలహాలు బాగ ఇస్తారన్నమాట.

శ్రావ్యా బజ్జులో మీ టపా గురించి చూసి వచ్చా!

అన్నట్టు నేనీ రోజు మిమ్ముల్ని చూసానండోయ్! ఎక్కడంటారా..ఇక్కడ...

http://vihanga.com/?p=1111

మీ ఫోటో చూడగానే "గుంటగలగరాకు తో మరిగించిన కేరళ కొబ్బరి నూనె రాసి నున్నగా దువ్వుకుని, జడేసుకుని,..."అని మీరు వ్రాసిన మాటలే గుర్తుకొచ్చాయి.

కొత్త పాళీ said...

http://vihanga.com/?p=1111
వీరు మీరా?

కృష్ణప్రియ said...

@ సిరిసిరి మువ్వ,
:)))

@ కొత్త పాళీ గారు,

అవునండీ.. అది నేనే!

sphurita mylavarapu said...

Nica post as usual. Its been a while i didn't get a chance to check blogs. Have to cover all your posts that i missed in last two months:)

sathish said...

నిన్న ఆ అబ్బాయి ఆఫీస్ లొ అడుగు పెడుతూనే ఎదురొచ్చి..'కృష్ణా.. నీకొక మెయిల్ పంపా చూడు..' అన్నాడు. క్యూబ్ కెళ్లి చూస్తే మెయిల్ లొ 'జస్ట్ ఒక ఫోటో..' సరే తెరిచి చూస్తే.. ఆ అబ్బాయి చెల్లి పెళ్లి ఫోటో. ఒక పక్క అన్న, ఇంకో పక్క వదిన. 'వావ్.. ' అని కనుక్కుంటే.. ఆ అబ్బాయి చెప్పాడు. 'నా బాధ్యత నేను నిర్వర్తించకపొతే ఎలా ఉంటుందో.. నీకు చూపించుదామని అలా చేశాను.' అనేసిందిట. మనస్పూర్తి గా అభినందించి బయట పడ్డాను.
లాభం లేదు. ఇక పెళ్ళిళ్ళ కి సంబంధించి కొత్త రూల్స్ జత చేయాల్సిందే.

enni sarlu chadivina ardham kaaledhu... konchem explain cheyyandi..

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

@ Satish Gaaru,

I was also confused at the part you mentioned. But figured it out later.

Basically his wife attended the marriage and he showed the photo they took with the new couple.

Perhaps KrishnaPriya gaaru using the terms అన్న and వదిన (from the perspective of the guys sister)rather than using he and his wife confused the reader a bit.

Krishna Priya gaaru.. Hope you are OK with me pitching in to explain :)

Mauli said...

ఇక్కడ నేనొక విష్య౦ చెప్పదలిచాను.

మొదటి జ౦ట : స్మోకి౦గ్ గురి౦చి నిజమ్ చెప్పినా అబద్ద౦ చెప్పినా, మొత్తానికి అతను మానెయ్యాల్సి౦దే కాబట్టి , నిజాయితీని ప్రూవ్ చేస్కోడ౦లొ అర్ధ౦ లేదు.అవసరమూ లేదు

ఓకే చెప్పడ౦ వల్ల అతనికి ఇ౦కొన్నాళ్ళు క౦టిన్యూ చేసే అవకాశ౦ వస్తు౦ది అన్నా, అమ్మాయికి పొగ తాగేవాళ్ళ౦టే ఉన్న వెగటు నిజాయితీ సూడగానే పోద్దా? ఉత్తిదే, ఆ పిల్లక్కుడా అతనిమీద మనసిలాయో అయ్య్౦డుద్ది :/

ఇ౦కే౦ పొగ తాగే వాళ్ళు ఒప్పేస్కొ౦టే వెగటు గాయబా!!!

కాబట్టీ మీ సల్హాలో తప్పే౦ లేదు. కొత్త రూల్స్ ఎ౦దుకూ ద౦డగ?


(హి హి ఇది నా సలహా :)

మంచు said...

కెవ్వ్... పొస్ట్ కామెంట్స్ రెండూ సూపర్ :-))

ప్రొఫెషనల్ కెరీర్ కి సంబంధించిన విషయాల్లొ సలహా అడిగేవాళ్ళు చాలా వరకూ తెలీక అడుగుతారు. మనకి తెలిస్తే చెప్తాం, లేకపొతె తెలీదు అనేయోచ్చు. అదే వ్యక్తిగత విషయాల్లొ, వారికంటూ ఒక చిన్న అభిప్రాయం ఉంటునే చిన్నపాటి సందిగ్దం లొ ఉండటం వల్ల మనల్ని అడుగుతారు. మనం నాకు ఐడియా లేదు అని చెప్పలేం... సొ అలాంటప్పుడు వళ్ళు దగ్గరపెట్టుకుని , బాగా అలొచించి వారి మనసుల్లొ ఎది కొరుకుంటున్నారొ అది చెప్పాలి అన్నమాట , బావుందండి సలహాలు ఎలా చెప్పాలొ, చెప్పకూడదో అనే విషయం మీద మాకు సలహా ఇచ్చినందుకు :-)))

ఎదేమయినా పర్సనల్ విషయాల్లొ సలహా ఇవ్వాలంటే నాకు చాలా భయం..... మొగుడూపెళ్ళాలు గొడవపడ్డప్పుడు ఇద్దరూ కామన్ గా తిట్టుకునేది పెళ్ళి కుదిర్చిన మధ్యవర్తిని అట... సంబంధం బావుంటుంది అని సలహా ఇచ్చినందుకు. అలా మనల్ని తిట్టుకొకుండా ఉంటే చాలు :-))

కృష్ణప్రియ said...

@ స్ఫురిత,

థాంక్స్! మా పాప MS Paint తో బొమ్మలు వేస్తూ ౩-౪ రోజుల క్రితం మీ బ్లాగ్ లో పిక్చర్లు చూపించమని అడిగింది. ఒకసారి అలాఆఆఆఅ మీ బ్లాగేమ్మట తిరిగి వచ్చాం.

@ సతీష్ గారు,

హ్మ్. Thanks for asking. మీరన్నాక చూస్తే ..నిజమే! స్పష్టం గా రాయలేదు అనిపించింది.

బెసికల్లీ.. ఆ అబ్బాయి ' నేను మారినట్టు కృత్రిమం గా మరీ బొత్తి గా చీట్ చేసినట్టు ఉంటుంది' అని నాతో అన్నాడు. నా సలహా పాటించలేదు. అయినప్పటికీ వాళ్ళావిడ అతని చెల్లి పెళ్లి దగ్గరుండి జరిపించింది. దీన్ని బట్టి సాధారణ సలహా సూత్రాలు పెళ్లి కి సంబంధించిన విషయాల్లో వర్తించవని అర్థమైంది.

అందుకే నేను రాసిన రూల్స్ లిస్టు లో పెళ్లి కి ఇచ్చే సలహాల్లో కొత్తవి జత చేర్చాలి అని.. రాసానన్నమాట!

@ WP,

Thanks !

కృష్ణప్రియ said...

@ Mauli,
:) Thanks!

@ మంచు,

ధన్యవాదాలు! :) అవును. మేమూ ఇప్పటికీ దేబ్బలాడుకున్నప్పుడల్లా మా పెళ్లి కుదిర్చిన్న అమ్మమ్మ గార్ని తిట్టుకుంటూ ఉంటాం.

lalithag said...

:) ఒక పోస్టు కోసం ఎదురు చూస్తుంటే ఒక దాని వెంట రెండొచ్చేశాయ్. నేను చదవడమే ఆలస్యమయ్యింది.
సలహాల విషయంలో సమస్యలూ, ఎవరికి వారు ఎంచుకున్న సమాధానాలూ స్పష్టంగా వ్యక్తీకరించగలిగావు.
బావుంది.

వేణూశ్రీకాంత్ said...

హ హ హ పోస్టూ కామెంట్స్ రెండూ బాగున్నాయండీ.. కొన్నాళ్ళ క్రితం కాఫీపొడి గడ్డకడితే అచ్చంగా డిజి గారు చెప్పిన సలహానే పాటించి ఉపయోగించా.. కానీ అది బోర్నవిటాకి పనికి రాదు ఎందుకంటే బోర్నవిటా తినడంలో ఉన్న ఆనందం తాగడంలో ఉండదు కదా :)

నేస్తం said...

అమ్మో ఎంత మంచిపోస్ట్ మిస్ అయ్యానో.. మీరు భలే రాస్తున్నారు..అన్ని పొయింట్స్ మీరు చెప్పినవీ సెంట్ పర్సెంట్ కరక్టంతే :) సాధారణంగా బ్లాగర్లు మనం అనుకున్న రూపంలో ఉండరు కానీ మీరు నేనెలా అనుకున్నానో అలాగే ఉన్నారు :)

కృష్ణప్రియ said...

@ లలిత,

థాంక్స్! :)

@ వేణూ శ్రీకాంత్,
:) థాంక్స్! నిజమే.

@ నేస్తం,
మీ నుంచి కాంప్లిమెంట్ అందుకున్నందుకు చాలా గర్వం గా ఉంది.
అవునా? మీరనుకున్నట్టే ఉన్నానా? ఆఫీస్ లో లాప్ టాప్ వెబ్ కాం తో తీసిన ఫోటో. బయట ఇంకా బాగుంటాను, ;) Just Kidding..

పూర్ణప్రజ్ఞాభారతి said...

ఇంద్రసేనా గంగసాని said...

@కృష్ణ ప్రియ గారు,
ఈ చిన్న పాటి సలహాలకే అంత కంగారు పడితే ఎలాగా అండీ? నన్ను చూడండి,ఈ స్టేజ్ ఎప్పుడో దాటి పోయాను,ప్రస్తుతం దేశ సమస్యల మీద అలవోకగా సలహాలు వదులుతున్నాను. కొన్నాళ్ళు పొతే అంతర్జాతీయ సమస్యలయిన ఇథియోపియా,ఎరిట్రియా బోర్డర్ సమస్య,ఇజ్రాయెల్,పాలస్తీనా ల మధ్య శాంతి స్థాపన, అరబ్-అమెరికా ప్రపంచాల మధ్య సంబందాల పునరుద్దరణ మొదలయిన వాటి మీద సలహాలు ఇవ్వబోతున్నాను.

మీరు చాలా ఎదగాలండీ!!!


అయితే నేనే చాలా బెటర్. నా స్థాయిని అంతర్జాతీయ సమస్యల స్థాయినుంచి ఇంకా పైకి పెంచుకున్నా. అంతా నేనూ-దేవుడు వ్యవహారందాకా ఎదిగా. సర్లే కాలం అఅంతా చూసుకుంటుంది, దేవుడున్నాడు మరేం ఫర్లేదు లాంటి సలహాల స్థాయికన్న మాట.

ఇకపోతే ఇప్పుడు సలహాలివ్వడం శాస్త్రమా.. కళా అనే విషయంపై సలహా ఇవ్వడం కుదరదని నా మనవి,

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;