“పాటలు పాడటం మా రక్తం లో ఉంది! మా తాతగారు ... మా అమ్మగారు.. మా మేనమామ... “ టీ వీ లో ఎవరో చిన్నమ్మాయి పట్టు పరికిణీ కట్టుకుని నానాలంకార భూషితురాలై ఏదో పాటల పోటీ లో చెప్పుకుపోతోంది. ‘తస్సదియ్య’ రక్తం లో ఉందిట అని నవ్వుకున్నా. ఇంకో చానెల్ పెడితే అక్కడా ఇదే సోది.. ముగ్గురేసి జడ్జిలు కూర్చుని తీర్పులు.. పాటలు, డాన్సులు, అగ్ని లో దూకటాలు, వంటలు, హాస్యం, ఏంటేంటో ప్రక్రియల మీద పోటీలు. చూస్తూ చూస్తూ.. ‘ఓర్నాయనోయ్.. నాకు దొరికేదే తక్కువ సమయం. ఏదైనా తెలుగో, హిందీ యో మంచి కార్యక్రమం ఏదైనా చూద్దామంటే ఇదేమి గోల రా బాబూ.. పోనీ మద్యాహ్నం పూట ఎప్పుడైనా ఇంటినుంచి పని (Work From Home) చేస్తూ, భోజన సమయం లో కనీసం ఏదైనా చూద్దామని కూర్చుంటే వంద రకాల వంటల ప్రోగ్రాములు.. కాదంటే ఆడవాళ్ళకి నాగార్జున ముక్కూ, వరుణ్ సందేశ్ మూతీ చూపించి గుర్తించమనటం...
‘హతవిధీ.. నాకు ఈ జన్మకి మంచి ప్రోగ్రాం చూసే అదృష్టమే లేదా? స్కూల్ రోజుల్లో మొదట్లో ఇంట్లో టీవీ లేదు. ఉన్నప్పుడు కళ్ళు పాడవుతాయి అని వద్దనటం, తర్వాత, చదువులని, ఆ తర్వాత హాస్టల్ లో ఉన్న రెండు చానళ్ళ కోసం గాంగ్ వార్లు జరుగుతుంటే భరించలేక బయట పడటం.. తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం లో డాలర్ల ఉద్యోగం ఇప్పుడు మనం చూస్తే పిల్లలూ చూస్తారని భయం..” చానళ్ళు నొక్కుతూ పోతుంటే మళ్లీ మొదటికి వచ్చింది.. ఇంకో అబ్బాయి తలకి ఒక గిన్నెడు నూనె రాసి ఒక మంచి చమక్ చమక్ చుడీదార్ వేసి..’మా కుటుంబం ఒక మ్యూజికల్ ఫామిలీ అండీ’ అంటున్నాడు. నవ్వొచ్చింది. అందరూ మ్యూజికల్ ఫామిలీ లే..
సరే కళ్ళు మూసుకుని ఏదో ఒక చానెల్ నొక్కా..’యాదోమ్కీ బారాత్ నిక్లీ హై ఆగే దిల్ కె ద్వారే’ అన్నదమ్ములు తిరిగి కలుసుకుని పాడుకుంటున్నారు. చిన్నప్పటి ఒక విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది.
మా తమ్ముడు మహా క్రియేటివ్. మేమంతా ఒకసారి దూర్ దర్శన్ లో ఈ సినిమా వచ్చినప్పుడు చలించి ఏదైనా ఒక కుటుంబం పాట పెట్టుకోవాలి ని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏడో క్లాస్, చెల్లి నాలుగో క్లాస్.. తమ్ముడు ఒకటో క్లాస్. అప్పుడే ‘ఫలానా వారి సంగీతానికి రాళ్లే కరుగుతాయి’ అని పుస్తకం లో చదివాం. అర్జెంట్ గా మా కుటుంబం పాట రెడీ చేసేసాం.
‘రాళ్లే కరుగుతాయి మా పాటకూ..మా పాటకూ మా పాటకూ..
కరిగి పారుతాయి మా పాటకూ మా పాటకూ మా మాటకూ
పారి వరదలౌతాయి మా పాటకూ మా పాటకూ మా పాటకూ’
దీనికి ఆనందం గా ఉన్నప్పుడు ఎలా పాడాలో.. మళ్లీ మాలో కనీసం ఒక్కరు తప్పి పోతే..దానికి ఏసుదాసు దుఖం గా పాడినట్టు ఎలా పాడాలో ప్రాక్టీస్ చేశాం.
ఒకేరకం లాకెట్లు చేయించమని అడిగాం కూడా మా అమ్మని.. ‘అది చాలా ఖర్చైన పని. దానికి బదులు గా.. అసలు మేళా లూ, సంతలూ, జన సమ్మర్తమైన ప్రదేశాలకు తీసుకెళ్లను.. మీరేం తప్పిపోరు లెండి..’ అని భరోసా ఇచ్చేసింది. చాలా నిరాశ గా.. సరే ఏం చేస్తాం? ఒకవేళ తప్పిపోతే కరెక్ట్ గా చార్మినార్ మూడు మినార్ల దగ్గర నుంచుని కరెక్ట్ గా అమ్మ పుట్టిన రోజున ఈ పాట పాడుతూ వచ్చి కౌగలించుకుని కన్నీరు కార్చాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయించుకున్న రోజు, పదేళ్ల తర్వాత జరగబోయే ఆ సన్నివేశం తలచుకుంటేనే మా గుండెలు భారం అయిపోయాయి. మొన్నీ మధ్య మా తమ్ముడు ఏదో పని మీద మా ఊరొచ్చినప్పుడు సరదాగా ఆ పాట పాడుకున్నాం... ఆ క్లిప్పింగ్.
అయినా చిన్నప్పుడు మా ఇంట్లోనూ.. సినీ గాన సరస్వతి ప్రతి గది లో తచ్చాడుతూ ఉండేది.
వంటింట్లో ‘సుశీల’ అమ్మ!
మా అమ్మ వంటింట్లో.. తాళింపు లో ఆవాలు తాళలేక చేసే చిటపటలనీ, గ్రైండర్ బర్రుమని ఉరమటాన్నీ, కుక్కర్ ఘీ మని విజిల్ ఎత్తి మరీ అరవటాన్నీ, పాత ఎగ్జాస్ట్ ఫాన్ ఏమీ అనలేక ఖాట్ ఖట్ మంటూ పళ్ళు కోరుక్కోవటాన్నీ, తాళాలు గా బాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా భావించి ‘వినుడు వినుడు రామాయణ గాధా!’ నుంచి ‘నిన్నటి దాకా శిలనైనా..’ దాకా పాడుకుంటూ..
‘అమ్మా! ఆకలేస్తోంది’ అని అరిస్తే.. టేబుల్ మీద అన్నం పెడుతూనే.. ‘అన్నము లేదు.. కొన్ని మధురాంబులున్నవి’.. అని పద్యం ఎత్తుకునేది... ఎవరైనా స్నేహితులు వస్తే.. వంటింట్లోంచి వినబడే గాన మాధుర్యాన్ని విని ఒక్కోసారి కిసుక్కుమని నవ్వితే.. ‘హమ్మా!! ఇంకోసారి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పాడావంటే ఊరుకోను..’ అని ఉక్రోశపడితే అలాగే లే..’పాటలైతే వచ్చు గానీ.. పాడనైనా పాడగలనూ.. పాపిష్టి సిగ్గు నన్ను పాడనీయదూ’ అని గమ్మున ఊరుకుంటాలే అని వెక్కిరించేది.
దేవుడి గది లో ‘నాగ(అ)య్య’..
దేవుడి గది లో ‘నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత..’ అంటూ నరసింహ శతకము, ‘జయ హనుమాన జ్ఞాన గుణ సాగర’ అంటూ హనుమాన్ చాలీసా.. మార్ధవ్యం, రాగ, తాళం,శృతి ల్లాంటి అంశాలతో పని లేకుండా.. పాడినా ఆయన పారవశ్యం,భక్తి, ఆయన మీద మాకున్న ప్రేమ వీటన్నింటి తో మాకు అద్భుతం గా తోస్తూ ఉంటాయి మరి
స్నానాల గది లో ‘చిత్ర‘ విచిత్ర గానం చేసే చెల్లి.
షవర్ భోరున ‘బాబోయ్’ అంటూ బాత్ రూమ్ (కన్నీ) నీటి జల్లుల ధారల తో నింపేసినా.. వాటర్ హీటర్ పెట్టిన బకెట్ లో నీళ్లు రక్తం మరిగినట్టు సల సల మరగినా. బయట నుండి ‘ఇంకెంతసేపు?మేమూ స్కూళ్ళకి వెళ్లాలి ’ అంటూ అరిచే మా అరుపుల్ని కోరస్ గా, తలుపు ధన ధన మని మేము చేసే బాదుళ్లని లయ గా వాడుకుంటూ దానికి తెలిసిన పాటలన్నీ పాడుకుంటూ.. బయటకొచ్చాక ఎలాగూ మాకు ‘ఎటాక్’ చేసే సమయం ఉండదు అనే ధైర్యం అనుకుంటా.. ‘అయ్య బాబోయ్.. ఇంకా లిరిల్ సబ్బు అడ్వర్టైజ్మెంట్ లో ఉంది ఇది.. ఎప్పటికి ఇంక టీవీ సీరియళ్ల పాటలు అవ్వాలి, ఎప్పటికి సినిమా పాటల కెళ్ళాలి.. ఇలాగ ఉండేవి మా బాధలు..
గడప ని మీటితే.. గాన మాలపించే ‘బాలు’డు మా తమ్ముడు ..
నాయనమ్మ పాడే భగవంతుడి లీలలు నాన్నగారు పాడే శతకాలతో, అమ్మ పాడే పౌరాణికాల, సాంఘికాల, పాత తరం రేడియో పాటల తో, చెల్లి పాడే పాత హిందీ, ఆంగ్ల మెలడీలతో, కొత్త సాఫ్ట్ మ్యూజిక్ తో ఒక రకమైన సంగీతానికి అలవాటు పడిన ఇంట్లోకి ‘బంగారు కోడి పెట్ట’ ని తెచ్చి పరుగులెత్తించాడు,..’క్క్క్క్క్క్క్క్ క్క్కాలేజీ స్టైలే... అంటూ.. విప్లవం సృష్టించిన వాడు మా తంబే! పాపు, జాజు, ఒకటేంటి.. గిన్నెలు, చెంచాలు, గంటెల తో దరువు వేసి.. పాటలే పాటలు.. చివరికి చదువు కూడా వాడి ఫేవరేట్ పాటల్లా పాడుతూ చదివేవాడు..
అలాగని మేమెవ్వరమూ పండితులం కాదు. ఏ టాలెంట్ పోటీలు పెట్టినా ఆఖరి స్థానం మాదే...
లక్కీ గా మా నాన్నగారు మధ్యతరగతి కి చెందిన వారవటంతో.. ఊరి మధ్య ఇల్లు కొనలేక పోవటం వల్ల మా గాన ప్రభంజనానికి అడ్డూ, అదుపూ లేకపోయింది అనుకుంటాను. చుట్టుపక్కల ఇళ్లు ఒక్కొక్కటి గా రావటం, మేమూ రెక్కలొచ్చి చదువులకి ఇల్లు వదలటం.. కానీ ఎప్పుడొచ్చినా పాపం ...
మా రక్తం లో పాట, చుట్టుపక్కలవాళ్ల రక్తానికి పోటు గా రూపాంతరం చెందుతుంది.
గత ట్రిప్ నుండి ఈసారి దాకా కొత్త గా విన్న పాటలని ఒకరికొకరు వినిపించుకునేవాళ్లం.. బస్సుల్లో సీట్లు దొరికినప్పుడు ఆ పాట విన్నావా? ఈపాట తెలుసా.. ‘ అని అప్ డేట్ అయిపోయేవాళ్లం.. పారడీలు కట్టేసుకుని మురిసిపోయేవాళ్లం. మాకు తోడు మా కజిన్లు వచ్చారంటే ఇంక గానా బజానా యే..
‘గాలి వాన లో.. వాన నీటిలో పెళ్లి భోజనం.. పప్పు ఎక్కడో కూర ఏమిటో తెలియదు పాపం..
అది పప్పు చారనీ తెలుసూ.. అందులో ఉప్పు లేదనీ తెలుసూ.. పప్పు లేకున్నా, ఉప్పు లేదన్నా.. తినక తప్పదని తెలుసూ.. ‘ అని జేసుదాసు పాట కి పారడీ ఒకరు వినిపిస్తే..
‘ఇదేమి సబ్బూ ఇది రిన్ను సబ్బూ.. అదేమీ రిన్నూ.. అది సూపర్ రిన్నూ..
సబ్బుకి సబ్బే సాటబ్బా.. డబ్బుకి డబ్బే చెల్లబ్బా..’ లాంటి చిరంజీవి పాటలని ఖూనీ చేసేది ఒకరూ..
గో కాట్ కోసం స్కై కాశమల్లే వేయిటాను యువర్ అరైవల్ కై..
యూ దేరూ, ఐ హియరూ, సాంగ్ దేరూ, హార్ట్ హియరూ.. ‘ అంటూ విరహ గీతాన్ని ఎత్తుకునేది ఇంకొకరూ..
ఒకసారి కాలేజ్ లో ‘ఆడవారు’ అనే థీం తో పాటల పోటీ. అబ్బా.. ఆడవారి మీద..పాటలు అంటే మరీ సీరియస్ పాటలు దుఖం తో.. అని అందరూ అనేసుకున్నారు. సగం మంది ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..’, గుండె పిండి చేసి.. కర్చీఫ్ లు తడిసి ముద్దలు చేసే సినిమాల స్పెషలిస్ట్ విసు గారి సినిమా పాట అనుకుంటా ‘ఆడదే ఆధారం..మనిషికి ఆడదే...’ అని కొందరూ.. ఒకమ్మాయి..’జయ జయహే మహిషాసుర మర్ధిని..’ ఇంకో అమ్మాయి ‘అఖిలాండేశ్వరీ..చాముండేశ్వరీ’. ఇవన్నీ వద్దు.. ఇంకేమైనా పాడితే బాగుంటుంది.. అని అనుకుంటే.. మా అమ్మ.. పక్కాంటీ నడగవే అంది.. ఆవిడ ‘నల్ల పెగ్మణీ.. మిగ నల్ల పెగ్మణీ.. తాయ్ నాట నాగరీగం పేణి..నడిపవలఎవరో ఆవళే’ అని నేర్పింది. తీరా చూస్తే.. ‘మంచి చిన్నదీ.. బహు మంచి చిన్నదీ’ అని ..
ఇలా కాదురా.. ఏదైనా ‘హట్కే ‘ కావాలి రా.. అన్నాను తమ్ముడితో.. అంతే.. ఒకళ్ల పాట మనం పాడటమేమిటి? నేనే కడతా పద’ అన్నాడు. ‘అది కాదురా బాబూ.. అందరికీ తెలిసిన భాష లో కాదురా..’ అన్నాను. ఒకళ్ల భాష మనం వాడేదేమిటి.చలో.. నేనే.. రాసేస్తా.. ఒక పాట.. నా భాష లో..’ అని ఒక పాట ఆశువు గా రాసేసి రాగ యుక్తం గా పాడేసాడు. వార్నీ.. అనుకున్నా. పైగా.. అస్సాం పక్కనున్న అడవుల్లో ఒక తెగ.. ‘చిన్బోయ్’ అని వాళ్ల పాట.. అనీ.. సరిపోతుంది. వాడిని ముద్దుగా చిన్నా అని పిలిచేవాళ్లం కదా.. చిన్బోయ్. అంతే కాస్త వాళ్ల భాషల్లానే అనిపిస్తుంది కదా.. అని లాజిక్కు.. అంతే..ఇక ఆ పాట ధైర్యం గా పాదేసా కాలేజ్ లో .. కన్సోలేషన్ ప్రైజ్ తో పాటు ఇంత మంచి పాట.. అంత దూరపు తెగ పాట మీకెక్కడిది? అంటే మళ్లీ దానికో కథ కట్టుకుని ...
ఆ లిరిక్స్ మీకోసం..
దద్దన్ బోలీ రే.. దద్దన్ బోలీ రే..
షోట్తో కోతే మోరీ కీచే దోద్దోన్ బోలీ రే.. (౨ సార్లు)
చోయ్బోకోతే కోలో రీతే హోనీరే బోణీ రే..
జోయ్కేలోతో కోరోరో మోరీ షో తుర్ ముఖీ రే.. (౩ సార్లు)
(పైగా ఈ బోడి పాట కి .. కోరస్.. ఒక్కటి...)
రొథీరె బోరోతె ఖోతోరె బారీతె మొథూర్ గీరీ రే..
అరి చోథోరే గోగోర్ గోగోర్ బాగీరె షోడీరే..
మరి ఇప్పుడో? మా ఇంట్లో ఇప్పటికీ ఈ పాటల పిచ్చి ఇప్పుడు వేరే స్థాయి లో .. ఆరోజులు రావు.. అలాగని ఈరోజుల్లో పారడీల వెనక పడ్డాం మేము.. (నేను, మా వారు, పిల్లలు)..
ఉదయం లేస్తూనే.. రోజుకో పాట తో, కర్ణ కఠోరం గా పాడుతూ (పెద్దగా శ్రమ పడక్కర్లేదు లెండి..).. శరత్ గారు ఓసారి చెప్పినట్టు..’ఇది ఆరని రావణ కాష్టం..’ , ‘జన్మమెత్తితి రా! అనుభవించితి రా!’ లాంటి పాటలతో పిల్లల్ని లేపటం..
పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని ... స్టైల్ లో .. ‘బ్రష్షు చేసుకుని, నీళ్లు పోసుకుని మెల్లగ స్కూలుకి కదలాలోయ్.. చదువులు చదివీ రావాలోయ్..’ అప్పటికి ‘నాన్న్నాఆఆఆఅ’ ఆపు!’ అని కళ్ళు పూర్తిగా తెరుచుకుని..
మా పక్క వాళ్ల తో ఒక గొడవ ‘almost’ తేబోయిన పాట.. మా పాప చిన్నప్పుడు స్నానం చేశాక దానికి తువ్వాలు చుట్టే పాట.. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహ పాట ..’ఎత్తూ పైకెత్తూ.. నువ్వూ...’ కి పారడీ చేసి
‘ఎత్తూ పైకెత్తూ.. నువ్వు..చేతులు పైకెత్తూ.. నాకు వీలు కలిగేట్టూ ఓ చిన్న పాపా!
నేనూ తువ్వాల్ చుట్టేట్టూ.. త్వరగా తయ్యారయ్యేట్టూ .. స్కూలుకి పరిగెత్తేత్టూ.. ఓహ్ చిన్న పాపా..’ అని పైగా దీనికి చరణాలు.. మా బాత్ రూమ్ లో ఈ పాట మొదలు.. మా పక్కింట్లోంచి వంటింట్లోంచి తాళం మొదలు. ఆవిడ రజనీ ఫాన్. (ఆ మాట కొస్తే నేనూనూ..) తలైవర్ పాట ని ఈ విధం గా ఖూనీ చేస్తుంటే తట్టుకోలేక ఆ పంఖా హృదయం వెయ్యి ముక్కలు కాకముందే .. ఆ గిన్నెలు ముక్కలవుతాయనిపిస్తుంది. (మనలో మాట.. అవి వాళ్లత్తగారు ఇచ్చినవి లెండి. ఇలాంటి కోప తాప ప్రదర్శన కి చాలా అనువు గా ఉంటాయి).
మా వల్ల వాళ్ల పిల్లలకి కూడా ‘ఆకలేస్తే అన్నం పెడతా..’ లాంటి కృతులు వంట బడ్డాయి..
చదువుకొమ్మని పిలవటం కూడా.. మేము కాస్త పాటల రూపం లో అదుర్స్ అనుకోండి....
Where is that? (నేను)
What is that? (అమ్మాయి)
వేర్ ఈజ్ దట్ టెక్స్టు బుక్కు, వేర్ ఈజ్ దట్ నోటు బుక్కు వేర్ ఈజ్ దట్ పెన్సిల్ ముక్క పిల్లా!
మా పాప అచ్చం జూనియర్ ఎన్ టీ ఆర్ లా ఆక్ట్ చేస్తూ.. ‘చించేసా.. విసిరేసా.. కట్ చేశా’ అని కాసేపు కాలక్షేపం చేయటం..
సరే ఇది మామూలు రోజుల చదువు కైతే... పరీక్షలకి ‘మాతృదేవో భవ’ అంత దుఖం కాబట్టి ఆ పాటే మాకు శరణం...
‘స్కూలు కెళ్లే పిల్లా నీకు సినిమా లెందుకే? మార్కులెన్నడో గల్లంతాయే లే’
అనగానే .. మా పిల్లలూ ఊరుకోరు..
‘ఆఫీస్ కెళ్లే అమ్మా నీకు టీవీ ఎందుకే? డెడ్ లైన్ ఎప్పుడో మిస్సయ్యింది లే.. అని రాగం తీసి కక్ష తీర్చుకోవటం..
‘మీకిది ఎగ్జామ్స్ టైమమ్మా.. అన్నీ మానేసి చదువే చదువనవమ్మా..’
‘మాథ్స్ పేపర్ నిండా సున్నాలే.. సైన్స్ పేపర్ అంతా తప్పులే...’ అంటూ చరణాలూ.. పాడి పాడి పిల్లలకి కాస్త తెలుగు వచ్చిందేమో.. అనిపించింది.
పడుకునేటప్పుడు 'పడుకుంటావా? పాట పాడనా?' అన్నానంటే.. రెండు నిమిషాల్లో పడుకోవటమే.. అదీ మన లాలి పాటలంటే!!
రామ నామధారులపై ప్రతి భావం లో పోటీలు పడి మన సంగీత కళానిధులు, గేయకారులు, వాగ్గేయకారులు, జానపద కారులు (కరెక్టేనా..ఇలా అనటం..) రాసేశారు గా.. మావారి పేరు లో రామ నామం నా పాలిట వరం అయింది.
పనమ్మాయి రాకపోతే, ఇల్లూడుస్తూ, అంట్లు తోముతూ ‘బంటు రీతి కొలూ,.... విస్తివయ్య రామ! ‘ అని నిష్టూరం తో త్యాగయ్య కృతుల నుండీ,
‘మీ అమ్మకి చేసిస్తీ.. ఫిల్టర్ కాఫీ నేను.. రామ చంద్రా! ఆ కాఫీ కొరకూ పట్టే.. పదిహేను నిమిషాలూ రామ చంద్రా!’ లాంటి రామదాసు పాటల దాకా.. అవకాశం బట్టి సిట్యుఏషన్ గ్రావిటీ బట్టి... వాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నా..
‘నువ్వీ దరినీ, నేనా దరినీ ఆ అమ్మమ్మ కలిపింది ఇద్దరినీ ‘ అని మా పెళ్లి కుదిర్చినావిడ ని, సినిమా పాటలనీ వదలకుండా ఆడిపోసుకోవటం కూడా మానలేదు.
‘ఆడదే ఆధారం.. జగతికి ఆడదే సంతోషం ‘.. లాంటి పాటలతో నా విలువ గుర్తు చేయటం కూడా రోజూ చేస్తూ ఉంటాను...
సో మా కుటుంబం లో కూడా గానామృతం రక్తం లో పారుతోంది.. వరదలై పొంగుతోంది. పక్కవాళ్ళ రక్తం లో కి పోటుగా స్థిరపడుతోంది.. మాదీ మ్యూజికల్ ఫామిలీ.. అంతే నన్నమాట. మీరూ ఒప్పేసుకోండి సరేనా?
57 comments:
:) :)
హ హ మీరు మరీ ఉదాహరణలతో సహా చెప్పాకా ఎవరు కాదంటారు "మీ రక్తం లోనే మ్యూజిక్ ఉంది అన్న విషయాన్ని" :)))
ఆ తప్పిపోయినప్పుడు పాట పాడుకోవాలి అనుకున్నారు చూడండి అది చిన్నప్పుడు నా బుర్రలో కూడా తోలిచేది :) కాకపోతే పాట నేర్చుకోవాలి అని కాదు ఇదేంటబ్బా వీళ్ళంతా ముందే ఫిక్స్ అయ్యిపోతరా తప్పిపోతాం అని :)))
మరీ ఘోరం గా హమ్ చేసి మా ఇంట్లో అందరిని నేను చంపింది మాత్రం "జీవం నీవే కదా " అని భక్త ప్రహ్లాద సినిమాలోది , ఇది నా చిన్నపుడు తిరుపతి లో క్యూ లో నుంచుని అక్కడ చూసి నేర్చిదన్న మాట :))))
అదరగొట్టారు. సూపర్:):)
ఒప్పేసుకున్నామండీ,చాలా బావుంది మీ పాటల పేరడీ.
హా హా చాలా బాగుందండి మీ రక్తంలో పాటలు వాటి వెనకనున్న అర్థాలు.
మేము చిన్నప్పుడు వేసవి సెలవుల్లో తాత గారింటికి వెల్లినప్పుడు మా పెద్ద కక్కి (పిన్ని) తో కలిసి ఇలాగే తాతగారు , అమ్మమ్మ , అమ్మ , మావయ్యలు అందరికి చెరొక పాట అంకితం చేసేవాల్లం అప్పటి వాల్ల సంధర్భానికి తగినట్టు.. అంటే మా చిన్నమామ లవ్ స్టొరీ కి నిన్నేపెళ్లాడతాలో ఒక సాంగు , మా అమ్మమ్మ కి బడి పంతులు లొ తాతగారి కోసం పాడే పాట, తాత గారికి సర్దార్ పాపారాయుడు అలా... మేము చిన్న వాల్లం కదా అందుకని అప్పుడు ఏది మంచి హిట్ సాంగో అది మాకు కావలంటె మాకని కొట్టుకునేవాల్లం..
చాలా మంచి పోస్టు.
అక్కైగారూ ఈ గరిటతో గంటెడు రక్తం అప్పివ్వరూ .... రక్తం లో సంగీత స్పృహ లేక పాలిపోతున్నాం....!!
"SuperStar సుబ్బమ్మ!", నా అపురూప, ఒక గోప్ప ఉత్తమ కహానీ కి మూలం అలాంటి characters యే. త్వరలో, మీ అభిమాన blog http://telugu-story.blogspot.com లో. చిన్నపిల్లల్ని చిన్నపిల్లలుగా ఉంచకుండా మన ప్రసార సాధనాలు, సగం బుర్ర host లూ, ఏదో talent ని బయటకి తీసే ప్రయత్నంలో, ఉన్న talent ని చెడగొడుతున్నారు.
ఒప్పేసుకున్నామండీ మీ కుటుంబంలో పారుతున్న గానామృత రక్తం "పెతాపాన్ని.." :)
"గో కాట్ కోసం స్కై కాశమల్లే వేయిటాను యువర్ అరైవల్ కై..యూ దేరూ, ఐ హియరూ, సాంగ్ దేరూ, హార్ట్ హియరూ.. "
అదుర్స్! :))
kevvu keka ...:))
జాతీయగీతంలాగా కుటుంబగీతం ఒకటుండాలని మీక్కూడా అనిపించిందన్నమాట బాగుంది. మిమ్మల్ని ఎప్పుడు టీవీలో చూస్తామోకూడా చెప్పేస్తే ఓ పనైపోయేదికదండీ. ఎంచక్కా రెడీయిపోయేవాళ్ళం.
opesukunamanid baabu mi rakatamlo paatalu vunnyai.
రక్తంలో ఏంటీ ఏహంగా డీయెన్నేలోనే ఉన్నదని ఒప్పేసుకున్నాం. పేరడీలు కేక!!
:))))))
కౄష్ణప్రియ గారు 515 కి పైబడి ఉన్న గాలి,దౄశ్య చానల్స్ లో మీకు నచ్చిన చానల్ దొరకకపోవడం వల్ల అత్యంత భయానకమైన మీ కుటుంబ పేరడీ పాటలు చదివి బుర్రలు పట్టుకునే దుస్థితి కల్గించారు.మీ పేరడీ పాటల సాహిత్య పిపాసకి అభినందనలు. మీ కుటుంబ కార్యక్రమం కోసం ప్రయత్నించడి. దయచేసి యెప్పుడు వస్తుందో చెప్పండి.మీరు చెప్పినట్లు మేమూ ఎవరికి చెప్పకుండా టీ.వి కట్టి పడేసుకుంటాం. మీ కుటుంబ సభ్యులందరు దయచేసి ఒక సీసా రక్తం దానం ఇస్తారని అనుకుంటున్నాను (బ్లాగ్ స్నేహితులకి మాత్రమే)
ఉ౦దిలే, మ౦చీ టపా ము౦దూ ము౦దునా, అ౦దరూ చదివేయ్యాలి తొ౦దర తొ౦దరగా ;-)
ఒప్పేసుకుంటున్నాం మీది అచ్చమైన సంగీత ఫ్యామిలీ అని... మీరందరూ ఇలాగే వర్ధిల్లమని దీవిస్తున్నా...:))
హహహ!ఒప్పేసుకున్నామండీ!కత్తి లాంటి పోస్ట్ కళ్ళముందు పెట్టి అడిగితే ఏమంటామండీ! ఒప్పేసుకున్నాం:)
మీ పేరడీ పాటలు అద్భుతం. రక్తమేమిటండీ అణువణువూ ఉంది అని ఏకగ్రీవంగా చెప్పేస్తున్నాం.
"ఇప్పుడు మనం చూస్తే పిల్లలూ చూస్తారని భయం..”
హ్మ్మ్మ్... అదే మరి!
"పడుకునేటప్పుడు 'పడుకుంటావా? పాట పాడనా?' అన్నానంటే.. రెండు నిమిషాల్లో పడుకోవటమే.. అదీ మన లాలి పాటలంటే!!"
:)) పాపం చిన్నప్పుడూ మా చిన్నబ్బాయి అడిగి మరీ నా చేత పాడించుకుంటుంటే సంతోషం కంటే ఎన్నాళ్ళు భరిస్తాడు అన్న సందేహమే నన్ను వెంటాడేది. ఆ సందేహం తీరిపోయి ఏడాది దాటింది. ఈ మధ్య వాళ్ళ చేత పాటేదన్నా ప్రాక్టీసు చేయించాలి అంటే "నేను పాడతాను" అనే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నాను.
"రామ నామధారులపై ప్రతి భావం లో పోటీలు పడి మన సంగీత కళానిధులు, గేయకారులు, వాగ్గేయకారులు, జానపద కారులు (కరెక్టేనా..ఇలా అనటం..) రాసేశారు గా" ఇది నువ్వు హాస్యానికి వ్రాసినా, నిష్టూరానికి వాడుకున్నా, నిజంగానే రామ నామం సంగీతానికి అమృతతుల్యం కదా. నేనీ మధ్యే ఏదో వ్రాసుకున్నాలే ఈ విషయం మీద.
అమ్మకి తగ్గ కూతురివే కదా నువ్వు. నిన్ను మించిన వాళ్ళు నీ పిల్లలూను.
गाता रहे तेरा दिल
हंसी ही तेरी मंजिल
कभी ख़त्म हो न जाएँ बातें
हंसी में बीते जाएँ दिन
Amen!
maa intlo kuda unnai family song
inukondi :)
Ammamma nee vanta ento ruchilee
pappaina kuraina okate ruchile !!!
కృష్ణ ప్రియ గారు టపా సూపరండీ .
:) :) :) 1/2 :)
really superb writeup.
ఒహ్హోఃహో ఆహ్హఃహ ఇంక నేను నవ్వలేను.
ఒప్పేసుకున్నాం మీరు సంగీత సముద్రం లో సునామీ లు సృష్టించగలరని. కాదన్నవారిని సంగీతం తోనే ఏసెయ్యగలరని నమ్ముతున్నాము.
జయహో జయహో
Hilarious!! :))))))
భలే భలేగా నవ్విస్తూ... , హుషారుగా చదివిస్తూ...
తెగ నవ్విన్చేస్తున్నావే ... ప్రియా కృష్ణప్రియా
లా లా లాలా ల లా లా ల లా.
" ‘అది చాలా ఖర్చైన పని. దానికి బదులు గా.. అసలు మేళా లూ, సంతలూ, జన సమ్మర్తమైన ప్రదేశాలకు తీసుకెళ్లను.. మీరేం తప్పిపోరు లెండి..’ అని భరోసా ఇచ్చేసింది. "
ఇది బెస్టు...
abba...navvi navvi kadupu noppi puttindi krishna gaaru :)oppukuntunnam andi mee raktam lo kooda paatalu vunnai ani.
haha.. creative... maa intlo ilaanti sannivesaalanni gutochaayi..!! :) chaalaa baagundi...
మీ పాటల పేరడీలు చదూతుంటే చిన్నప్పటి భయంకరానుభవం ఒకటి గుర్తొస్తున్నది. విజయవాళ్ళో మాచవరంకొండ మీద ఒక చిన్నసైజు దుర్గగుడి ఉండేది. నవరాత్రుల్లో వాళ్ళు మైకు పెట్టేవాళ్ళు. రాత్రి సుమారు ఎనిమిదినించీ పదిదాకా ఒక భజనబృందం అమ్మవారి భజనలు పాడేది - అప్పటి హిట్ సాంగ్స్ బాణీల్లో.
ఓ తల్లీ చూడవే దయగా, మాయమ్మా కావవే మమ్మూ (ఓలమ్మీ తిక్కరేగిందా)
జండాలు పట్టుకుని కొండెక్కి వచ్చాము హరె హరె (ఆరేసుకోబోయి..) - ఇలాగ!
I wonder if such bhajanas used to happen elsewhere in the state? One of my classmates who lived near that temple told me that, apparently, that bhajana group has a sort of star image and was in great demand among temples.
పేరడీలు పేలాయండి. :):)
మీ కుటుంబగీతం, లాకెట్లు ఆలోచన అదిరింది - మరి పచ్చబొట్లు గుర్తురాలేదా?
దద్దన్ బోలీ రే.. చదవగానే మా ఎయ్ దెశో ఎయ్ మటీ ప్రహసనం గుర్తొచ్చిందండీ!
రక్త దానంతో ఇలాంటి అనర్థాలు కూడా వుంటాయని బాగా వివరించారు.
హమ్మ్మ్మ్... గ్రహీతలు ఆసుపత్రి బెడ్ మీద పడుకుని తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి లక్షణాలకి ముందుగా రక్తపరీక్షలేమైనా వున్నాయా అన్నది బాగా రీచెచ్చి చేయాల్సిన అంశం, ఏమంటారు?
@ Anon,
:)
@ శ్రావ్య,
:) తప్పి పోయినా తప్పిపోకపోయినా ఒక ఫామిలీ సాంగ్ ఉంచుకోవటం ముఖ్యం. ఏ నెత్తి మీద దెబ్బ పడో పూర్వ జ్ఞాపకాలు నశిస్తే ఏమవుతారండీ? ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఒక పాట పెట్టేసుకోండి. లిరిక్స్ /మ్యూజిక్ కి నేను సహాయం చేస్తా కావాలంటే..చెప్పండి
@ పక్కింటబ్బాయి,
:) థాంక్స్
@ లత గారు,
ఒప్పేసుకున్నారు థాంక్స్! :)
@ వెన్నెల్లో ఆడపిల్ల,
ఈ అంకితాల కాన్సెప్ట్ బాగుంది. మేమూ మొదలెట్టాలి చూసారా కొత్త విషయం తెలుసుకున్నాను.
@ ఆత్రేయ,
అలాగే..అలాగే
@ Salahuddin,
ముందుగా నా బ్లాగుకి స్వాగతం. మీ బ్లాగు కెళ్లి చూశాను. నాకు ఆ కథ కనపడలేదే.. వేరే నాలుగు కథలు కనపడ్డాయి.
@ రవికిరణ్,
గో కాట్ పాట మాది కాదు. మా కాలేజ్ లో ఒకమ్మాయి పారడీ.. ఆ అమ్మాయి పేరు అస్సలూ గుర్తు రావటం లేదు.
@ Indian Minerva,
TV లో కూడానా? ఇంకా నయం.
@ సాయి,
థాంక్సు
@ అనాన్,
థాంక్స్
@ కొత్తపాళీ గారు,
హమ్మయ్య.. DNA లో కూడా ఉన్నాయన్నారు. మేమూ ఇంక కనుబోమ్మలెత్తి సీరియస్ గా మా మ్యూజికల్ ఫామిలీ గురించి చెప్పుకుంటాం.
@ మాలా కుమార్ గారు,
ధన్యోస్మి!
@ మౌళి,
@ జ్యోతి గారు,
ధన్యవాదాలు!
@ సునీత గారు,
గుడ్ గుడ్
@ రసజ్ఞ,
థాంక్సు
@ లలితాజీ,
థాంక్స్ మాడం!
@ సుమ,
బాగుంది బాగుంది మీ ఫామిలీ సాంగ్
@ లలిత గారు,
థాంక్సండీ..
@ అనాన్,
థాంక్స్.
@ మహేశ్ కుమార్,
థాంక్స్!
@ అనాన్,
థాంక్స్!
@ బులుసువారు,
నవ్వుల రాజుగారినే నవ్వించానా? మీ జయహో కి ధన్యోస్మి!
@ మధురవాణి,
థాంక్స్!
@ తొలకరి,
అబ్బో.. నైస్ పారడీ! థాంక్స్
@ లక్ష్మీ ఫణి గారు,
మా అమ్మగారికి కాంప్లిమెంట్లు అందచేస్తాను. థాంక్స్!
@ విరిబోణి గారు,
హమ్మయ్య.. మీరూ ఒప్పేసుకున్నారు. ఇంక నాకు తిరుగు లేదు.
@ కేసరి గారు,
నా బ్లాగ్ కి స్వాగతం! థాంక్స్!
@ కొత్తపాళీ గారు,
)))) ఈ తిక్క అన్ని ఊర్లల్లోనూ ఉంటుంది. హైదరాబాదు నగరం ఏమీ తీసిపోలేదు.
ఇప్పుడు సడన్ గా గుర్తు రావట్లేదు కానీ తెగ తిట్టుకునేవాళ్ళం..
ఏ మాట కామాటే చెప్పుకోవాలి..కొన్ని కాస్త సరదాగా కూడా ఉంటాయి..
@ జేబీ గారు,
థాంక్స్! పచ్చబొట్లు నొప్పి, జ్వరం అని....
@ Snkr,
LOL.. నిజమే. రక్త దానాలప్పుడు ఒక కాలం పెట్టాలి. AIDS, viruses లాంటివి చెక్ చేసినట్టు.. రక్తం లోదానగుణం, గానం, నాట్యం..
నాకూ కొన్ని పాటలుగుర్తుకొస్తున్నాయి:
తడికెల నిండుగ పిడకలు కొట్టవే ఓ చిలకా చిలకా ( జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ) ( ఏ సినెమా నో గుర్తు లేదు )
స్టోనునైనా కాకపొతిని రామ ఫుట్టు సొకగా ..
మీ పోస్ట్ చాలా బాగుంది..hilarious :))
నాకు నచ్చిన అత్యద్భుత పేరడీ :సీతారామయ్య గారి మనవరాలు" లో బాలు పాడిన వేటూరి గీతం :
"ఓ సీత నీ వంటి స్వీటు స్వరూపము వేర్వేరు search na No ఏ కదా !!
కృష్ణ గారు ,మీ కుటుంబ పాట అదుర్స్...చార్మినార్ దగ్గర సీన్ అదుర్స్....పేరడీలు హి హి హి...
నేను మా చెల్లెల్లు ఓ రోజు మా ఇంట్లో వాళ్ళందరికి కొన్ని పాటలని అంకితం చేసాము...చదువుతోంటే గుర్తొచ్చింది..:) ఇన్ని చేసాము గానీ ఓ కుటుంబ పాట కనిపెట్టాలన్న ఆలోచన రాలేదు సుమీ..ఈ రోజే ఫోన్ చేసి ఈ విషయం పై చర్చించాలి అధ్యక్షా ....:)
మీ రక్తం లో పాటలు వున్నాయని బాగా అర్దం అయిందండీ....ఇదివరకు మేము చేసిన ఖూనీ (పాటలనే లెండి) లను మీ పాటల ద్వార గుర్తు చెసారు. పాటలు బాగున్నాయండీ..మీ రక్తం లో ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకోవలని కుతుహలం పెరిగి పోతోందండీ...చెప్పి పుణ్యం కట్టుకోండీ...
హ హ హ...మీది చాలా క్రియేటివ్ కుటుంబమండీ..!!!
నేను నాకూతురికి ఆర్నెల్లున్నప్పుడు లాలి పాట పాడితే అది పక పకా నవ్వుతూనే వుంది పాడుతున్నంత సేపూ...దానికేమనిపించిందో అది మరి...నేను కూని రాగం తీసుకున్నా దాని నవ్వే గుర్తొస్తుంది...మళ్ళీ గుర్తు చేసారు మీ లాలి పాటతో...:)
@స్ఫురిత గారు: :-D అప్పటి మీ లాలిపాట రికార్డులేమన్నావుంటే మీ బ్లాగులో పెట్టోచ్చుకదండీ.
>>ఆడవాళ్ళకి నాగార్జున ముక్కూ, వరుణ్ సందేశ్ మూతీ చూపించి గుర్తించమనటం...
>>అందరూ మ్యూజికల్ ఫామిలీ లే..
ఇంకా చాలా ఉన్నాయి....ప్సోట్ లో మునిగిపోయి..అవి ఇక్కడ కాపీ చెయ్యట్లేదు...
పేరడీ లు బాగున్నాయి..!! :)
ఇంకా ఒప్పుకోక పోతే మీరు ఓ పాట పడి వినిపించేస్తారేమో అని....ఒప్పెస్కుంటున్నా :)
Anon @September 12, 2011 5:48 PM,
:) పొగుడుతున్నారో తిడుతున్నారో అర్థం కాలేదు. బహుశా టపా నచ్చలేదనుకుంటున్నాను.
@ నైమిష్,
థాంక్స్!
>>>>తడికెల నిండుగ పిడకలు కొట్టవే ఓ చిలకా చిలకా
వెరీ ఫన్నీ...LOL. సినిమా పేరు సితార.
@ స్నిగ్ధ,
:) ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. వెంటనే ఒక పాట కట్టేసుకోండి.
ఈ అంకితం కాన్సెప్ట్ ఇప్పటివరకూ మాకెందుకు రాలేదని చాలా బాధ గా ఉంది :-(
@ జాన్,
అసలు టీవీ లో పసి పిల్లల మాటలు చూసి చిరాకుతో రాసిన టపా..
రాస్తూ రాస్తూ నెమ్మది గా హాస్యం లోకి దిగిపోయింది.. మా రక్తం లో హేమో గ్లోబిన్, నీరు.. ఇంకా ఉండాల్సిన ఎసెన్షియల్ వి తప్ప ఇంకేమీ లేవు
@ స్పురిత,
క్రియేటివ్ కుటుంబం కాదు కానీ.. పాటల లిరిక్స్ పెద్దగా గుర్తు పెట్టుకోకుండా.. మా అంతట మేమే సందర్భోచితం గా అల్లేసుకునే విద్య మాత్రం అబ్బింది.
@ ఇండియన్ మినర్వ,
అవునవును. స్పురితా.. మీరు మీ పాటలు పెట్టండి. నేస్తం గారు ‘పాడమని నన్నడగ వలెనా’ అన్నారు నిన్ననే..
@ కిరణ్,
అబ్బే.. మీరు ఒప్పేసుకున్నా.. మేము పాడి వినిపిస్తాం. ఎంతైనా ఒక ఊరోళ్ళం.. ఎలాగూ మీకు పొల్యూషన్ బాగానే అలవాటు.. ..
అవునాండీ !!! పిల్లలు అలా చెప్తున్నారా పోటీల్లో!!!
అల్లప్పుడెప్పుడో ఎవరో చెప్పారని ఒక పాటల పోటీ డవునులోడ్ చేసా కానీ, పోయిన సారి గెలిచిన కూనల్ని జడ్జీల స్థానంలో కూచోబెట్టడం..ఆ కూనలేమో..పండు పండితుల లెవెల్లో....'ఇంకా బాగా పాడొచ్చనిపించింది..ఇక్కడ ఇంకో గమకం ఉంటే బాగుండేదనిపించింది 'అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చూసి ఓర్చుకోలేక...ఖతం జేసేస్న...ఇగ పోటీలు డఒవునులోడ్ చేస్తే ఒట్టు...
టపా విషయానికొస్తే....అబ్బబ్బబ్బా...ఏం పాటలండీ బాబూ...సూపరసలు! మీ కుటుంబమంతా నిజ్జంగానే ప్రతిభావంతులు. అయ్యో మీ ఇంటికి రావడం మిస్ అయ్యానండీ..వచ్చి ఉంటే చక్కగా 'రండి రండి రండి దయచేయండీ..ఎన్నెల రాక మాకెంతో సంతోషం సుమండీ" అని విని పరవశించేదాన్ని కదా!!!!మనిషి బతుకింతే...ప్చ్ ప్చ్ నాకా యోగం లేదంతే.....
నేనూ అలాగే అనుకునేదాన్ని ఒక ఫేమిలీ సాంగ్ పెట్టుకోవాలని..పేరడీలు భలే పాడుతున్నారు మీరందరూ.. :)
మీ అమ్మగారెంత మంచి వారు కృష్ణప్రియ గారూ.. నేనూ చిన్నప్పుడు 'కుటుంబం పాట' కాన్సెప్ట్ చెబితే, అమ్మ అర్ధం చేసుకోక పోగా వీప్పగలగొట్టింది.. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ నేను సంగీతాన్ని వదల్లేదనుకోండి..అది వేరే సంగతి :-) పదాలు తిరగేసి పాడడం, అన్య భాషల్లో పాడడం ఇవన్నీ మా అలవాట్లు కూడానూ.. చాలా బాగుంది మీ టపా.. అప్పుడే అయిపోయిందా అనిపించింది..
@కృష్ణా , నేను మరీ నేస్తం గారంత పేద్ద singer ని కాదండీ బ్లాగులో రాయటానికి(నేస్తం మళ్ళీ వచ్చి నా కామెంటు చూడరనే ధైర్యం తో ;))...బానే పాడతానని నా చుట్టూ వున్న వాళ్ళంతా అనేవారు మరి...ఏ చెట్టూ లేని చోట లా...ఇన్నాళ్ళకి నా కూతురొచ్చి నవ్వే దాకా నేను పాటగత్తెనని అనుకుంటూ వుండిపోయాను హేవిటో....:)
saradaagaa oesaari chooDanDi .... https://profiles.google.com/sumadhuravaani/posts/9SCCB7ihe8r#sumadhuravaani/posts/9SCCB7ihe8r
మీ చినటపాకాయ, మీరూ అదుర్స్ పాట పాడుకుంటున్నట్టు ఊహించుకుని నవ్వేసుకుంటున్న నేను.. (కనబడ్డానా.. చివరి వరసలో ఉన్నాను. ఆఖరున వచ్చాను గా! :(
హహహహ... సూపర్. చాలా బాగుంది. ముఖ్యంగా మీ ఫ్యామిలీ సాంగ్ చాలా బాగుందండి. మేము కూడా ఇలాంటిది ఒకటి రాసుకోవాలి. :p
@ ఎన్నెల గారు,
అవును. నాకు అన్నింటి కన్నా కష్టమనిపించేది.. చిన్న పిల్లలతో తీర్పులు ఇప్పించటం. మీరీసారి రండి మా ఇంటికి.. పాట మీరే చెప్పేసారు కాబట్టి స్వాగతం పాట కి తడుముకోవక్కరలేదు.
@ నేస్తం గారు,
పెట్టేసుకోండి. It’s never too late!
@మురళి గారు,
థాంక్స్! అమ్మలకి చెప్పి చేస్తామటండీ? మీరు మరీ మంచి వారిలా ఉన్నారు
మీ కాంప్లిమెంట్ కి చాలా గర్వం గా ఉంది
@ స్పురిత,
మీలో కళాకారిణి ని ఏదో రోజు.. మీ అమ్మాయి తప్పక గుర్తిస్తుంది. అదే ఆశ తో నేనూ కాలం గడుపు తున్నాను.
@ సునీత,
నాకు ఈ లింక్ పట్టుకుని వెళ్తే మధురవాణి ప్రొఫైల్ వచ్చింది. మీరేదో పోస్ట్ లింక్ ఇచ్చారనుకున్నాను... మళ్లీ ఇవ్వగలరా?
@ చాణక్య,
శుభం! మీరూ ఒకటి పెట్టుకోండి మాతో వీలుంటే పంచుకోండి. .
హమ్మో హమ్మో...నావల్ల కాదు, నవి నవ్వి చచ్చేట్టున్నాను...అవేం పేరడీలండిబాబు. మీ తమ్ముడి అస్సాం పాట మాత్రం కెవ్వు కేక...ఏం రాసారండీ బాబూ! :))))))))
@ సౌమ్య,
:) ధన్యవాదాలు!
Ivala day light savings..time marcharu..poddune oka ghanta mundu ga levali...pendalade padukundam ani decide ayyi kooda ee article poorthi cheddam ani chaduvutune unna...:)) boledu navvu vachindi...u r awesome :)
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.