Sunday, October 23, 2011

ఈ సంవత్సరమూ, మేము టపాసులు కోనేసామోచ్!‘ పర్యావరణం లో కాలుశ్యం చేరటాన్ని ఆరి కట్టేందుకు, టపాకాయలు ఈ సంవత్సరం నుంచీ కాల్చటం మానేద్దాం’ అని గత ఐదేళ్ల నుండీ అనుకుంటూనే ఉన్నాం.. కానీ అబ్బే.. కుదురుతుందా? మా పిల్ల రాక్షసులు ఊరుకుంటారా? ‘ పుట్టినరోజులు అనాథాశ్రమం లో మాత్రమే జరుపుకోవాలి, ఈసారి బహుమతులు అంగీకరించకూడదు, లాంటి తీర్మానాల్లాగానే.. ప్రతి సంవత్సరమూ ఈ తీర్మానమూ వీగిపోతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే వెయ్యి మన లిమిట్.వెయ్యి దాటి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకూడదు అనుకుని బయల్దేరాం. దానికి మూడు రెట్లు ఎలాగూ కొనేస్తాం అనుకోండి..

టపాకాయలు చిన్నప్పుడంటే.. దసరా వెళ్లిన మర్నాటి నుంచే హడావిడి. పాత న్యూస్ పేపర్లు సేకరించుకుని, ఇసుక సమకూర్చుకుని, ఇంట్లోనే జిగురు తయారు చేసుకుని పెట్టుకోవటం. సికందరాబాద్ మహంకాళీ గుడి దగ్గర మార్కెట్ లో గంధకం, ఆముదం, సూర్యేకారం, సున్నం, మెటల్ పౌడర్ లాంటివి కొని ఎండపెట్టుకుని, ఎప్పుడు కూర్చుందాం.. అని అమ్మా వాళ్లని పీకేయటం. అందరం కూర్చుని ఒక్కోదానికి ఒక్కోలా పాళ్లు రాసుకున్న పుస్తకం తెచ్చుకుని, జాగ్రత్త గా బీడు కలుపుకుని కాగితం పాకెట్లలో ఇసుకు కూరి, బీడు కూర్చి.. మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, సిసింద్రీలు చేసుకోవటం.. అవి రోజూ ఎండపెట్టటం.. అంబానీలు ఆస్తులు పంచుకున్న రేంజ్ లో ఇవి పంచుకుని వేరు వేరు సంచీల్లో దాచుకోవటం ఒక సరదా!


పండగ పూట కొన్ని పేలాల్సినవి తుస్సు మనటం, ఎగిరెగిరి పడాల్సినవి కొన్ని చీదేయటం, పూల జల్లు కురిపించాల్సినవి డామ్మని పేలటం జరిగినా, మొత్తం మీద సక్సెస్! మర్నాడు ఉదయమే లేచి ఎవరింటి ముందు ఎక్కువ కాగితాల తుక్కు ఉందో చూసుకుని గర్వ పడటం, పేలని బాంబులని ఏరుకోవటం.. పేలిన టపాసుల చెత్త ఊడ్చి మంట వేయటం.. అబ్బో! ఆ సరదా ఇక రాదు.. మా అమ్మా వాళ్లూ ఇలాగే అనేవారనుకోండి.. తాటాకు టపాకాయలు, వెన్న ముద్దలు.. టెలిఫోన్ టపాకాయలు చేసిన విధానాలు చెప్పి, ఆరోజుల్లో వాళ్ళెంత బాగా చేసుకునేవారో, ఎలా పంచేవారో చెప్పి..


ఇప్పుడా .. టెర్రరిస్టుల పుణ్యమా అని.. ఎక్కడా గంధకాలూ, భాస్వరాలూ అమ్మట్లేదు. ఒకవేళ అమ్మినా, చేసుకునే ఓపికా, తీరికా లేని హై స్పీడ్ బతుకులు.


పోనీ తయారయితే చేయం.. కానీ మన పిల్లలూ వాళ్ల పిల్లలకి చెప్పాలి గా.. మనం ఎంత బాగా టపాకాయలు తెచ్చుకునే వాళ్లమో!


బెంగుళూరు లో మా ఇంటికి ఒక పాతిక కిలో మీటర్ల లో తమిళ నాడు బార్డర్. కర్ణాటక లో 65% డిస్కౌంట్ అయితే తమిళ నాట 80% డిస్కౌంట్ తో దొరుకుతాయి. హోసూరు దగ్గర రెండు రాష్ట్రాల సరిహద్దు. సరిహద్దు ద్వారం టోల్ బ్రిడ్జ్ దాటితే చాలు బారులు తీరిన టపాసుల దుకాణాలు. ఏటా వేలాది మంది బెంగుళూరు ప్రజలు వెళ్లి కొనుక్కుని పొదుపు చేసామని సంతృప్తి పడుతూ ఉంటారు. మేమూ అంతే. గత మూడేళ్లు గా వైట్ ఫీల్డ్ ద్వారా, గుంజూర్ ఊరు వైపు కి బయల్దేరుతాం.. వైట్ ఫీల్డ్ ఐటీ కి ఒక పేద్ద హబ్. ‘ కొన్నేళ్ల క్రితం అడవి అసలు రావాలంటే భయమేసేది’ అంటారు ఇక్కడి వారు. . ఇప్పుడూ అంతే ననుకోండి. భయమే! కాకపొతే, ఆ ఏరియా లో ఇక్కడ ఏదైనా స్థలం రేటు వింటే! ఫోరం వాల్యూ మాల్, ‘స్టార్టింగ్ రేంజ్ రెండు న్నర కోట్లు మాత్రమే’ అని అమ్మే బంగళాలు, గేటెడ్ కమ్యూనిటీలు దాటుకుంటూ, వర్తూరు చెరువు దాటుతూనే సంత. గత మూడేళ్లు గా దాటుతున్న ప్రతి ఒక్కసారీ ఇప్పుడు సమయం లేదు. ఈసారి వచ్చినప్పుడు ఆగి ఏదైనా కొనాలి అనుకుంటున్నాము. ఎప్పుడోప్పుడు కొనేస్తాం! చూస్తూ ఉండండి.. కనీసం కొత్తిమీరైనా...


కాస్త సంత దాటి వెళ్తే ఇక పచ్చదనం, తారు రోడ్డు.. నర్సరీలు, లోపల గా ఇంటర్ నేషనల్ స్కూళ్లు.

‘Welcome!’ అంటూ అందమైన నల్లని ఆంజనేయ స్వామీ, శనీశ్వరుడి కోవెల. చాలా విశాలం గా ఉంటుంది. అక్కడ ఆగి నెమ్మదిగా పచ్చదనాన్ని ఆస్వాదించి, మళ్లీ కారెక్కి వెళ్తూంటే వందల కొద్దీ ఎకరాల్లో నర్సరీలు, పూదోటలు, అరటి తోపులు.. ఆగి ఒకటి రెండు మొక్కలు కొనుక్కుని మళ్లీ వెళ్తూ ఉంటే నెమ్మది నెమ్మది గా ట్రాఫిక్ తగ్గుతూ,.. కాలుశ్యానికి భయపడి ఏసీ లతో కాలక్షేపం చేసే మాకు హాయిగా విండోలు దించి ఒక పద్దెనిమిది కిలోమీటర్ల స్వర్గం.
ఇంకొకటి రెండు కిలో మీటర్లలో హోసూరు పట్టణం వస్తుందనగా వస్తుంది అసలు సర్ప్రైజ్. రోడ్డుకి ఎదురుగా హెయిర్ పిన్ బెండ్ లో ఒక ౩౦-౪౦ అడుగుల గద లాంటి కట్టడం.. దాంట్లో ఒక ఆంజనేయ స్వామి. చూసారా ఎంత అందమైన గుడో. మొదటి సారి వెళ్లినప్పుడు ‘ ‘ఏంటి? ఈ గద కథా? కమామీషూ? ‘ అని అడిగాము. ఆ కార్నర్ లో బ్లైండ్ స్పాట్ వల్ల నెలకోసారి కనీసం ఆక్సిడెంట్ అవుతూ మనుషులు తమ పొలం ముందు చనిపోతుండటం చూడలేక కొద్దిగా కొత్త గా కనపడుతూ ఉంటే రోడ్డు తిరిగి ఉందని, ఈ మలుపు దగ్గర జాగ్రత్త పడాలి అని వాహన చోదకులు అనుకుంటారని అక్కడి రైతు, గోవిందప్ప అలా కట్టించారు అని చెప్పారు.
 ఈ గుడి ని ఆనుకుని బోల్డు పొలాలు. అలచందలు, బీన్స్, అరటి తోటలు.. సిమెంట్ ఇటుకల ఫాక్టరీ.. ఒక ఎత్తైతే.. అక్కడ అన్నింటి కన్నా చూడదగ్గ విశేషం..., వెయ్యి గజాల విస్తీర్ణం లో హాయిగా ఎదిగిన పేద్ద ఊడల మఱ్ఱి చెట్టు, చుట్టూ సిమెంట్ బెంచీలు, పిక్ నిక్ స్పాట్.


ఒక్క షాట్ లో ఆ వృక్ష రాజాన్ని కవర్ చేయలేకపోయా నా సెల్ కామెరా తో..  నాలుగు ఫోటోల్లో వచ్చింది మొత్తం చెట్టు..
ఒక పక్క మునీశ్వర కోవెల. చల్లటి గాలి, మానవ మాత్రుడు లేడు.. ఎక్కడో పొలాల్లో పని చేసుకునే వారు తప్ప.

కాసేపు కూర్చుని, ఒక కునుకు తీసి, పేపర్ చదివి, చేల వెంబడ తిరిగి,పరుగులెత్తి (పిల్లలు, మేము కాదు) నెమ్మది గా మళ్లీ కార్ ఎక్కి ఒక కిలో మీటర్ పచ్చటి చేల మధ్యలో రోడ్డు పైన వెళ్తూండగానే, మెట్రో నగర పోకడలు, బజార్లు, ట్రాఫిక్ జామ్ లూ.


నక నక లాడుతూ అక్కడి మయూర బేకరీ & స్వీట్ల దుకాణం లోకి ఉరుకులు పెట్టి హాయిగా తింటాం. పేరుకి బేకరీ, స్వీట్లు.. అక్కడ లేని తిండి పదార్థాలు లేవే. పాత కాలపు చందమామ బిస్కట్లు, రస్కులూ, బన్నులూ, బిస్కట్లూ పేస్ట్రీలు మొదలుకుని, మాడర్న్ పిజ్జాలూ, బర్గర్లూ! జంతికలూ, పకోడీలూ, ఊరగాయలూ,, చిప్సూ, పండ్ల రసాలూ..అబ్బో ఎవరికి కావలసినవి వారికి. శుభ్రం గా తినేసి ట్రాఫిక్ జామ్ లో కాసేపు రిలాక్స్ అయి...


 ఇదిగో తెగ కొనుక్కొచ్చాం.. డిస్కౌంట్, డిస్కౌంట్ అని ఎగురుతూ వెళ్లటం, ప్రతిసారీ, ఎంత సేవ్ చేసామో మురిసిపోవటం.. ఈసారి కాస్త రాయితీ స్కీం మారినట్టు గమనించాం.. మొదట 75% రాయితీ ఇచ్చి దాని మీద 15% రాయితీ ఇస్తాం.. అనగానే సరిగ్గా చూసుకొని వారు అందరూ ‘ఆహా, ఓహో ౯౦% ‘ అనుకోవటం కానీ.. జాగ్రత్త గా చూస్తే అది 78.5% మాత్రమే.


ఏంటీ? టోల్,పెట్రోల్, మధ్యలో మేత వగైరా అంతా కలిపి మా ఇంటి పక్క దుకాణం ధర కన్నా ఎక్కువే అవుతుంది అంటారా? పైగా శ్రమా? సమయం? అంటారా?  అన్నీ ఓకే. కానీ ఇలా ప్రకృతి మాత ఒడి లో కాసేపు గడిపి అప్పడు ఆవిడకి కాలుశ్యం నింపే పని లో పడటం,.. కొద్దిగా ముల్లు లాగా గుచ్చుకుంటూ.. తప్పదు గా..


అందరికీ దీపావళి శుభాకాంక్షలు..

53 comments:

స్నేహ said...

మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు కృష్ణగారు. మేము కూడా టపాసులు కొనేసాం. కాని మేము పెట్టుకున్న వెయ్యిరూపాయిల బడ్జెట్‌లో సగం మాత్రమే ఖర్చు అయ్యింది. పిల్లలు చాలు అనేసారు. మిగిలిన డబ్బులు వాళ్ళకే ఇచ్చేస్తే దాచుకున్నారు.

స్నేహ said...

మీకు కుడా దీపావళి శుభాకాంక్షలు కృష్ణ గారు. మేము కూడా కాలుష్యం తగ్గించాలి అనుకుంటూనే టపాసులు కొనేశాం. కాని మేము పెట్టుకున్న వెయ్యి రూపాయల బడ్జెట్‌లో సగమే ఖర్చు అయ్యింది. పిల్లలు చాలు అనేసారు. మిగిలిన డబ్బులు వాళ్ళకే ఇచ్చేస్తే దాచుకున్నారు.

Chandu S said...

అంబానీలు ఆస్తులు పంచుకున్న రేంజ్ లో ఇవి పంచుకుని వేరు వేరు సంచీల్లో దాచుకోవటం ఒక సరదా!

బాగుంది. Nostolgic

harephala said...

మీకూ, మీ కుటుంబానికీ దీపావళి శుభాకాంక్షలు....

రసజ్ఞ said...

మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు! ఇలా మా వాళ్ళు (నా ముందు తరం) చేసుకునేవారుట! నాకు మాత్రం ఎప్పుడూ ఎవ్వరూ చూపించలేదు! నాకు ఒక్కసారన్నా ఇలాంటివి చేయడం చూడాలని కోరిక ఎప్పటికి తీరుతుందో ఏమిటో! ఆంజనేయ స్వామి గుడి చాలా బాగుందండీ!
మీరు ఏం వ్రాసినా నిజంగా మీ డైరీ తీసుకుని చదివినట్టే ఉంటుంది! బ్లాగ్ పేరుకి తగ్గట్టు చక్కగా చక చకా వ్రాసేస్తూ ఉంటారు!

Durga said...

మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు

రాజేష్ మారం... said...

:))

"టోల్,పెట్రోల్, మధ్యలో మేత వగైరా అంతా కలిపి మా ఇంటి పక్క దుకాణం ధర కన్నా ఎక్కువే అవుతుంది అంటారా? పైగా శ్రమా? సమయం? అంటారా?"

అడగాలనుకున్నాను,. :) కానీ, అవకాశమివ్వలేదు కదా మీరు :)

కృష్ణప్రియ said...

@ స్నేహ,

అవునా.. మీ పిల్లలు బెస్ట్. మా వాళ్లు అడిగినవన్నీ కొంటే మా ఇద్దరి నెల జీతాలు ఫట్ అయ్యేవేమో.

థాంక్స్ డాక్టర్ గారు!

హరేఫల గారు,

ధన్యవాదాలు. మీకూ దీపావళి శుభాకాంక్షలు.

కృష్ణప్రియ said...

@ రసజ్ఞ,

హ్మ్. అయితే మీకు మా మఱ్ఱి చెట్టు నచ్చలేదా? :) మిగిలినవన్నీ బాగున్నాయన్నారని.. సరదాగా..

@ దుర్గ,
ధన్యవాదాలు..

@ రాజేశ్ మారం,

కదా.. మీరు ఆ మాట అంటారని ముందుగానే అనేశాను.. :) ఒక నలుగురు కలిసి తెచ్చుకుంటే ఎకనామికాల్. కానీ ఒకళ్ళూ వెళ్తే డబ్బు పెద్దగా ఆదా చేయటం ఉండదు..

జ్యోతిర్మయి said...

అన్నట్టు రేపే కదూ దీపావళి. మా పిల్లలు టపాసులు అడిగితే ఎందుకు? కృష్ణప్రియగారు కోనేసారుగా వాళ్ళింటికి వెళ్ళిపోతే సరి అని చెప్పేసాను. అయ్యో! ఏరీ ఈవిడ ఇక పండగయ్యే వరకూ కనిపించరేమో అడ్రస్సదీ కనుక్కోలేదే!

చాలా బావుంది మీ టపాసుల ప్రహసనం ధన్యవాదములు

Sravya Vattikuti said...

ఓహో కర్ణాటక నుంచి తమిళనాడుకి వెళ్లి టపాసులు కొనుక్కుని వచ్చారా, బావుంది బావుంది :))) మీ వన్ డే ట్రిప్ విశేషాలు కూడా బావున్నాయి .

మొత్తానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిపించారు అడగబోయే ప్రశ్న కూడా ముందే సమాధానం చెప్పేసి :)))

btw మీ బ్లాగు టెక్స్ట్ ఏరియా విడ్త్ పెంచటానికి ఏమన్నా చేయగలరేమో ఒకసారి చూడండి , పోస్టు అంత పొడుగు కాకుండా ఉంటుంది .

Krishna said...

బాగుంది మీ సరదా ప్రయాణం.
మీరు చెప్తుంటే అ పచ్చదనం కోసం అయినా ఒకసారి వెళ్ళాలి అనిపించింది.
మొదటిసారి బెంగలూరు వెళ్ళినపుడు (9 ఏళ్ల క్రితం), నాకు ఊరికన్నా వెళ్ళే దారే బాగా నచ్చింది.
దీపావళి శుభాకాంక్షలు.

కృష్ణప్రియ said...

@ జ్యోతిర్మయి గారు,

వచ్చేయండి. ఈరోజు సగం కాల్చేసాం. అన్నింటి కన్నా గమ్మత్తు ఒకటి ఏంటంటే.. 'కాలుశ్యం పెంచటం మాకు ఇష్టం లేదు అని మాకు తెలిసిన కుటుంబం టపాకాయలు కొనటం మానేశారు. వారి అమ్మాయి మా ఇంటికి వచ్చి ఈ పూట తనివి తీరా కాల్చుకుని వెళ్లింది. సరే అందరూ సరదా పడిన రోజే దీపావళి అనుకుని ఇవ్వాళ్ళే సగం అవగొట్టేసాము.

మీ అమ్మాయి (గౌరి కదూ) నీ పంపేయండి.

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,

అవును.. :) మా ఆఫీసు వాళ్లు నలుగురేసి కలిసి హోసూరు వెళ్లి తెచ్చుకుంటారు.. ఆదా అవుతుందని. మాకైతే ఇది ఒక పిక్ నిక్ తో సమానం. చూశారు కదా ఎంత పచ్చని ప్రయాణమో..

ఈ బ్లాగ్ లో కంటెంట్ విడ్త్ నిజంగానే మరీ తక్కువ గా ఉండి అసలు నేను రాసింది రెండింతలు ఉన్నట్టు అనిపించి 'బాబోయ్ ఇంత చదవాలా ' అనిపిస్తున్నట్టుంది.. చూస్తాను..మళ్లీ టెంప్లేట్ లో మార్పు ఏదైనా చేయవచ్చేమో..

@ కృష్ణ,

నిజమే. విమానం లోంచి చూస్తే కూడా చాలా పచ్చగా కనిపిస్తుంది .. బెంగుళూరు పొలిమేరలు దాటితే అంతా పచ్చదనమే!

Varuna Srikanth said...

Krishnakka....Deepawali shubhakankshalu....mee post chadivithe...chinnapudu maa oollo chesukunna pandaga gurthochesi...gurthukosthunnayeeeeeeee......ani padukovalanpistondi:)

స్నిగ్ధ said...

దీపావళి శుభాకాంక్షలు కృష్ణ గారు..

ఒక రోజు ప్రయాణం విశేషాలు బాగున్నాయి..

హోసూరు వరకు వచ్చారా?? మధ్యలో బొమ్మనహళ్ళి కానీ టచ్ అయ్యిందా???

bonagiri said...

దీపావళీ శుభాకాంక్షలు.
వర్తూరు చెరువు వైపు ఎప్పుడూ వెళ్ళలేదండి. ఈ సారి ప్రయత్నించాలి.
మా ఆఫీసువాళ్ళు కొంతమంది హోసూరు వెళ్ళి అందరికీ టపాసులు తెచ్చారు.
ఇంతకీ మెట్రొలో ప్రయాణించారా?

జ్యోతిర్మయి said...

కృష్ణప్రియ గారూ దీపావళి సుభాకాంక్షలండీ. మీ ఆహ్వానానికి ధన్యలం. రాగల దూరంలో వుంటే తప్పక కలిసేవాళ్ళం. పాపం మీ ఇంటికి వచ్చిన పాపకు టపాసులు కల్చాలని ఎంత సరదా ఉన్నదో! కాలుష్యం గురించి పిల్లల కోరికలని వద్దనడం. ప్చ్..మా అమ్మాయి గౌరి కాదండీ నా ప్రియ శిష్యురాలు.

కృష్ణప్రియ said...

@ వరుణ శ్రీకాంత్,

ధన్యవాదాలు! మరి పాడేసుకోండి.

ఈ పూటే గా దీపావళి?
ఇవ్వాళ్ల ఒక కొత్త విషయం తెలుసుకున్నాను.
మా పక్కింటావిడ నాలుగు రోజుల నుండీ తెగ స్వీట్లు చేస్తున్నారు. 'అవునూ.. పిల్లలా.. చాకొలేట్ తో చేసినవి తప్ప తినరు. మీ వారు తినకూడదు.. మీకు అసలు స్వీట్లంటే చిరాకు. మరి ఎందుకు అంత కష్టపడుతున్నారు?' అని అడిగాను.

ఆవిడ 'అయ్యో పిచ్చిదానా! ' అన్న చూపొకటి కొట్టి, చిద్విలాసం గా నవ్వి.. 'దాదాపు గా మన కాలనీ లో అందరూ అందరికీ ఇవ్వటానికి మాత్రమే చేస్తారు.. అందరూ మనకి ఇవ్వటానికి వస్తే మనకి సిగ్గు గా ఉండదూ?' అంది. అదన్నమాట. మా ఇంట్లో ఇప్పుడు కనీసం పదిహేను ఇళ్ల స్వీట్లు, హాట్లు ఉన్నాయి. అందుకని నాకు నిజంగా హాప్పీ దీపావళి :)

కృష్ణప్రియ said...

@ స్నిగ్ధ,

:) థాంక్స్!
బొమ్మనహళ్లి తగల లేదు. మేము వర్తూర్, గుంజూర్, మరియు సజ్జాపూర్ మీదుగా వెళ్ళాము.


@ bonagiri,

వెళ్లండి. సీనిక్ రూట్! మెట్రో ఇంకా ఎక్కలేదు. కాస్త ఉత్సాహవంతులు అంతా ఎక్కి ఆనందించాక, రష్ తగ్గాక, నెమ్మది గా వెళ్తాం.

@ జ్యోతిర్మయి,

ఓహ్.. అలాగా! మీ నాటకం గురించి చదివి చూసినప్పుడు ఎందుకో మీ అమ్మాయి అనుకున్నాను. శిష్యురాలన్నమాట!

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

క్రిష్ణప్రియ గారు,

బావుంది. మఱ్ఱి చెట్టు చూసే అవకాశం కలగడం వల్లనైనా మీ ట్రిప్ పైసలు వసూల్ అయినట్టే. రన్నింగ్ కామెంటరి బాగా రాస్తారు మీరు.

మీ బ్లాగు చదువుతుంటే డైరీ చదువుతున్నట్టు నాకైతే అనిపించదు. పబ్లిక్ చదవటానికి రాసే డైరీ లాగే అనిపిస్తుంది. ofcourse that's what it is .. కదా :)

btw, some observations on your blog:

in the beginning.. I observed a pattern in your writings and thought you had a good distinct style of your own. But of late.. you seem to be settling into a new pattern. The new pattern is also good to read but I would say it is more like moving your blog into a time pass.. feel good category. If that is intentional.. then ignore this feedback. If that is unintentional then.. I am sure you would think about it :)

Kathi Mahesh Kumar said...

:) :) :)

Mauli said...

@WP

intentional or not...what to do :)

btw, naku alane anipistunnadi, atyadhika visits krishna priya gaari blaagu ke umdi umdali. :), yevaro cheppinatlu navala koda vraseyyochchu meeru !

mee kosam meeru ila vrasukumtunnatlayite okies!

ఆ.సౌమ్య said...

బావుంది :) మొదట్లో రాసినవి..అవే చిన్నప్పటి సంగతులు అన్నీ నన్ను నా చిన్నతనంలోకి తీసుకెళ్ళిపోయాయి. అచ్చు అలాగే చేసేవాళ్లం మేము కూడా. :))

కృష్ణప్రియ said...

@ WP,

హ్మ్.. మీ పరిశీలనాత్మక, మరియు విమర్శనాత్మక వ్యాఖ్యకి ధన్యవాదాలు!

మఱ్ఱి చెట్టు అనే కాదు.. ఊరికే పాత కాలం లో ఇలాగ ఉండేది.. ఇప్పుడేముంది.. అన్నీ కొనుక్కోవటం, పొల్యూషన్, ఫాస్ట్ జీవితం.. అలాగ అనుకుంటూ ఉండటం ఒక రకం. మనమూ ఈ కాలానికి అనుగుణం గా ఒక చిన్న ట్రెండ్, అలవాటు ని సృష్టించి తరువాతి తరానికి ఒక జ్ఞాపకం గా అందివ్వటం.. ఇంకో రకం.

రెండో రకం గా ఉండటానికి మేము చేసే ప్రయత్నాన్ని ఈ టపా ద్వారా రాశాను.

ఇక నా బ్లాగ్ పబ్లిక్ చదవటానికి రాసే డైరీ యే. కాకపొతే ఒక్కోసారి టాగ్ లైన్ లో చెప్పినట్టు ‘కల్పన తాళింపు’ కలిపి..

మీరు అబ్జర్వ్ చేసిన పాటర్న్ ఏంటో నాకు తెలుసని నేననుకుంటున్నాను. నాకు జనరల్ గా సమయం దొరికితే చాలా ఇష్టపడి, అలాగే కష్టపడి రాస్తాను. కొన్ని సీరియస్ వైతే, కొన్ని హ్యూమరస్, ఎలా రాసినా నేను చెప్పాలనుకున్న ఒక విషయాన్ని ఎలాగోలాగ చెప్పటానికి ప్రయత్నిస్తాను.

కానీ ఇద్దరు పిల్లలతో, ఇంటి/ఆఫీసు పనులతో ఇతర హాబీలతో, వ్యవహారాలతో బిజీ గా ఉన్నప్పుడు కేవలం ఇష్టపడి మాత్రమే రాయగలను. ఈ మధ్య నాకున్న కొద్ది పాటి సమయం లో, మరీ ఒక నెల దాటింది, ఏమీ రాయలేకపోయాననే ఉద్దేశ్యం తో ఇటీవల కాలం లో మనసుకి హత్తుకున్న విషయాలు, పెద్దగా ఆలోచన చేయక్కరలేకుండానే రాయగలిగే టపాలు రాసేశాను.
Again, thanks for your feedback.

కృష్ణప్రియ said...

@ మహేశ్ కుమార్,
ధన్యవాదాలు!

@ సౌమ్య,
అవునా? థాంక్స్!

@ మౌళి,
నవల/డైలీ సీరియల్? :)

Mauli said...

డైలీ సీరియలా , అమ్మో వద్దు :)

sarma said...

మీ బ్లాగు మొదటిసారి చూసాను. మాలాంటి గుడి పాములని ఆ ప్రదేశాలు తిప్పేసారు. సంతసం.

నీహారిక said...
This comment has been removed by the author.
కృష్ణప్రియ said...

నీహారిక గారూ,

నా మంచి కోరి మీరు చేసిన వ్యాఖ్య కి, సమయం తీసుకుని నాకు ఇచ్చిన సలహాలకీ ధన్యవాదాలు!
మెగా రైటర్! -- ఈ బిరుదు ‘బ్లాగర్లందరూ’ ఇవ్వలేదండీ. శ్రీకర్ అని ఒక బ్లాగర్ అన్నారు. తర్వాత, సరదాకి కొందరు, సీరియస్ గా కొందరు అలాగ రిఫర్ చేశారు.
ఇక నా టపాల విషయానికొస్తే మొదటి టపా లో రాసినట్టు, అప్పుడప్పుడూ ఆంగ్లం లో ఆఫీసు పత్రికలకి రాసినా, అవి చెప్పుకోదగ్గ రచనలు కావు. తెలుగు లో మునుపెన్నడూ రాయలేదు. ఇక్కడ నాకు రాయటం ఇష్టం గా ఉన్నా, అందరూ రాసినవి చదవటం ఇంకా సరదాగా ఉంది. అందుకే నా వ్యాఖ్యలు బోల్డు కనిపిస్తాయి మాలిక/హారం వ్యాఖ్యల సెక్షన్ లో.
ఇక కంటెంట్ విషయానికొస్తే.. నాకు తెలిసినవి మాత్రమే, అందులోనూ, నాకున్న సమయం, ఓపిక పరిధులకి లోబడి రాయగలను..
అందులోనూ వేరొకరికి పోటీ గా రాయటం అంటే నాకు (ప్రస్తుతానికైతే) అస్సలూ ఇంటరెస్ట్ లేదు. భవిష్యత్తు లో రాస్తానేమో చెప్పలేను.
డా చందు గారి ప్రతి రచన లోనూ నా కామెంట్ ఉంటుంది. ఆవిడ బ్లాగ్ నాకిష్టమైన బ్లాగుల్లో ఒకటి. ఆవిడ కి నేను ఏ విషయం లోనూ పోటీ కొచ్చే ప్రతిభ,ఉద్దేశ్యం నాకు లేవు.

మీరన్నట్టు ప్రశంసలకి పొంగి, విమర్శలకి క్రుంగి పోకూడదని నేను తప్పక గుర్తుపెట్టుకుంటాను. కొత్త విషయాలు రాయటానికి ప్రయత్నిస్తాను.

Anonymous said...

సరదాగా రాసుకొనే బ్లాగులను కూడా సీరియస్ గా తీసుకొని, పోటిగా రాయాలని పురి గొల్పడం చూస్తూంటే. ఈ పోటీల పిచ్చి కొంతమంది ఆడవారిలో కూడా ఎంత ముదిరి పోయిందో అర్థమౌతున్నాది. టి.వి. లో రియాల్టి షో లను విమర్శించే చాలా మంది బ్లాగర్లు, అదే పోటి తత్వాన్ని బ్లాగుల్లోకి ప్రవేశపేట్టాలను కొవాటం విరమించుకోవాలి.
________________
*మీరన్నట్టు ప్రశంసలకి పొంగి, విమర్శలకి క్రుంగి పోకూడదని నేను తప్పక గుర్తుపెట్టుకుంటాను.*
మీరు రాసే టపాలలో ప్రజలకి సందేశం ఎమీ ఇవ్వటం లేదు కదా! బ్లాగులు రాస్తే కలిగే కొద్దిపాటి ఆనందం(పొగడ్తల వలన) కూడా వద్దను కొంటే, ఇక రాయటమేందుకు? పొగడ్తలకి పొంగి పోండి. అందులో ఎమీ తప్పు లేదు.

SriRam

yaramana said...

క్రిష్ణప్రియగారు..
బ్లాగింగ్ అనేది పూర్తిగా కాలక్షేపం బఠాణీ అనుకుంటున్నాను. ఎవరికి తోచింది వాళ్ళు రాసుకుంటారు. మీరు చక్కగా రాస్తారు కాబట్టి.. బహుశా మన వాళ్ళు మీ నుండి ఇంకా మంచి పోస్టులు ఆశిస్తున్నారేమో! ఇది ఇమేజ్ చట్రమా? అదే అయితే మీరు సాధ్యమైనంత తొందర్లో బయటకి రాగలరని ఆశిస్తున్నాను.

Chandu S said...

కొంప దీసి ఈ చందు ని నేనేనా?

నేనైతే ఈ కామెంట్ పబ్లిష్ చెయ్యండి.

కృష్ణప్రియ గారి బ్లాగ్, డ్యూటీ లేని రోజుల్లో చదువుతూ, రిలాక్స్ అవుతుంటాను. చదివిన ప్రతిసారీ, నాకు ఆమె ఒక సోదరి లాగా క్లోజ్అనిపిస్తుంది ( నాకు అక్కచెల్లెళ్ళు లేరు). ఆ ఫీలింగ్ కోసం ఆమె బ్లాగులో పడి తిరుగుతుంటాను. కానీ కామెంట్ రాయను. దానికీ కారణం తెలియదు. May be I don't want to dilute my feeling being very casual by writing my comments.

Dear krishna priya gaaru, I feel really touched with your opinion. Thank you very much.

Chandu S said...

రమణ గారు అన్నట్లు, బ్లాగింగ్ కాలక్షేపానికే అని నమ్ముతాను. పోలికల, పోటీల కటుకు బఠాణీలు ఎవరికీ తినాలనిపించదు.

Mauli said...

Yaramana గారు,

కృష్ణప్రియ గారు ఒక ఇమేజ్ ను౦డి బయటకి వచ్చి ఇ౦కో ఇమేజ్ లోకి వచ్చేసారు :) అది కాక అప్పట్లో అక్కినేని గారి ఫ్లాప్ కూడా పది లక్షలు చెస్తు౦దనే వారట , అలాగే ఇక్కడ ఖాలీ టపా పెట్టినా పాతిక ముప్పయి వ్యాఖ్యలు వచేస్తాయి .ఇది ఇ౦కొ ఇమేజ్, బయటపడలన్న పడలేని ఇమేజ్ కదా :)

చదవడం నచ్చినపుడు వ్రాయమని అడగము :) బద్రినాద్ సిన్మా లో చివర్లో హీరో తో ప్రకాష్ రాజ్ చెప్పే మాటలు గుర్తు వస్తున్నాయి ఇక్కడ :)

కాకపొతే ఈ మార్పు వస్తున్నా స౦ధి కాలం లో ఒక మాట తెలియజేయడం వల్ల నష్టమే౦ లేదు కదా. జ్యోతి గారు ఒక బ్లాగు ను౦డి , పది బ్లాగులు వరకు వచ్చ్చి..ఇప్పుడసలు బ్లాగు లను దాటి పేరు తెచుకొ౦టున్నారు. ఆ అవకాసము ఏ కొద్ది మ౦ది కో ఉ౦టు౦ది . పైన వారి అభీష్టం

భాస్కర రామి రెడ్డి said...

వామ్మో ఇన్ని కామెంట్లా..సీక్రెట్ చెప్పరా !!! మీకు పోటీ ఇంక :)

Sravya Vattikuti said...

పైన దేవుడు అనే వాడు ఒకడు ఉన్నాడు చూసారా ? అప్పుడెప్పుడో మీరు ఓ అందరికి సలహాలు ఇస్తున్నా అని ఖుషీ పడ్డారు , ఇప్పుడు చూడండి మీరు వద్దన్నా మీకు వచ్చేస్తున్నాయి.న్యూటన్ థర్డ్ లా ఇంకో సారి prove అయ్యింది (జస్ట్ కిడ్డింగ్).

On the serious note
ఈ బ్లాగు మీ పర్సనల్ స్పేస్ వేరేవాళ్ళని నొప్పించకుండా ఉన్నంతవరకు ఏమి రాయలనుకుంటారో అది మీ ఇష్టం . ఒకవేళ నొప్పిస్తే అవతల వాళ్ళ reaction సహించాలి అంతే కదా :)) ఆయనా ఎవరి సలహాలు మీకు అక్కరలేదు కూడా నాకు తెలిసినంతవరకు :))))

ఏదో constructive critisim ఐతే భరించాలి కాని ప్రతి దానికి విలువనిచ్చి మీ విలువైన టైం , మూడ్ పాడు చేసుకోరు అని ఆశిసిస్తున్నాను .

Ennela said...

yee madhya naa mind konchem gathi tappindandee..
mee blog kochchi comment ekkada pettaalo kanipinchaka venakki vellipotunnaa..yee roju veligindi...hahahah...postlu annee (already chadivesaa) baagunnaayi eppatilage

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

క్రిష్ణప్రియ గారు,

>> "మీ పరిశీలనాత్మక, మరియు విమర్శనాత్మక వ్యాఖ్యకి ధన్యవాదాలు! "

స్పందించినందుకు ధన్యవాదాలు. నా వ్యాఖ్య కేవలం నా పరిశీలన మాత్రమే. అందులో కొంతైనా మీకూ నిజమే అనిపించే అవకాశం ఉందనిపించి బయటినుంచి చెప్పడం లేదా గుర్తుచేయడం మేలనిపించింది. అంతే.

నేనైతే కేవలం పరిశీలనాత్మక వ్యాఖ్య మాత్రమే అనుకుంటున్నాను :) బహుశా నేను సరిగ్గా వ్రాయలేదేమో. అందుకే మీకూ (??) మరికొంతమందికీ ఇదేదో ఒక విమర్శేమో అనిపించి ఉండొచ్చు.

>>"మీరు అబ్జర్వ్ చేసిన పాటర్న్ ఏంటో నాకు తెలుసని నేననుకుంటున్నాను. నాకు జనరల్ గా సమయం దొరికితే చాలా ఇష్టపడి, అలాగే కష్టపడి రాస్తాను."

I thought so.. agreed and understood :)

అదిసరే.. ఇక్కడ ఇంకా చాలా వ్యాఖ్యలు ఉండాలి! ఏమయ్యాయవన్నీ !! :)

కృష్ణప్రియ said...

శర్మ గారు,

ధన్యోస్మి! నా బ్లాగు కి స్వాగతం!


@ శ్రీరాం,

ధన్యవాదాలు!

'కొద్దిగా ప్రయత్నించి ధైర్యం గా కొత్త విషయాలు రాయి. మరీ బొత్తి గా మామూలు విషయాలు రాస్తున్నావు.. ' అన్న అర్థం లో వేరే బ్లాగర్లను ఉదాహరించి వారిలా కొన్ని ప్రయోగాలు చేయమని, వారితో పోటా పోటీ గా రాయమని అలాగ రాస్తే ప్రతిభ బయటకు వస్తుందని.. ఆవిడ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విధం గా ఒక రచయిత గా నేను ఎదగగలనని వారు భావించి ఆవిధం గా రాశారని నమ్ముతున్నాను.

పొగడ్తలకి మరీ పొంగి పొర్లిపోకపోయినా 'పర్వాలేదు.. నేను రాసి కొద్ది మందిని మెప్పించగలను' అని నమ్మిక ఏర్పడింది. దాని వల్లే ఇంకా రాయాలని ఆకాంక్ష పెరిగింది.

అలాగే కొద్దిగా రచన లో పట్టు సడలుతున్నప్పుడు ఈ మెయిల్స్ ద్వారా వ్యాఖ్యల ద్వారా కొద్ది మంది చెప్పటం వల్ల తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. :)

కృష్ణప్రియ said...

రమణ గారు, చందు గారు,

ధన్యవాదాలు! బ్లాగు అనేది లేకపోతే బహుశా నాకు అసలు ఏదైనా రాద్దామనే ఆలోచనే వచ్చేది కాదని నమ్ముతాను. మీరన్నట్టు ఇవి ఒలింపిక్స్ లాంటి పోటీలు కావు కాబట్టి హాయిగా మనసుకి నచ్చిన విధం గా రాసుకోవటమే.. అనుకుంటున్నాను.

kiran said...

>>అంబానీలు ఆస్తులు పంచుకున్న రేంజ్ లో ఇవి పంచుకుని వేరు వేరు సంచీల్లో దాచుకోవటం ఒక సరదా!-- :ద...నాకు దీపావళి రోజు మొత్తం ఇది గుర్తు వస్తూనే ఉంది..మా తమ్ముడు చదువు వల్ల..వేరే ఊరిలో ఉంటున్నాడు లెండి..:(..మిస్సింగ్..:(
కనీసం కొత్తిమీరైనా... హిహిహి :D (గుడ్ లక్ )
గుంజూరు వైపు ఇంత మంచి స్థలం ఉందా??...కేక కదా..!!
ఆలస్యంగా దీపావళి శుభాకాంక్షలు..:)

కృష్ణప్రియ said...

మౌళి గారు,

:) సరే అయితే! ఈసారి 'అసలు కామెంట్ పెట్టడం వేస్ట్' అనుకునే పోస్ట్ రాసి నా "ఇమేజ్" నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తా..

భాస్కర్ గారు,

:))

@ శ్రావ్య,

:) ధన్యవాదాలు.

కృష్ణప్రియ said...

@ ఎన్నెల,

ధన్యవాదాలు!

@ WP,

విమర్శనాత్మక : అంటే నేను వాడినది క్రింద అర్థం తో..
criticism - a. The practice of analyzing, classifying, interpreting, or evaluating literary or other artistic works.

నా బ్లాగు లో రాతలని తప్పు పడుతున్నారని/దుయ్యపడుతున్నారని కాదు. criticism can be both constructive and -ve as well rite?

ఇక మీకూ, snkr గారికీ మధ్య జరిగిన సంభాషణ బ్లాగ్ గురించి కానందున, వ్యక్తిగత వ్యాఖ్యలు గా మారినట్లు అనిపించి ఒకరోజు ఉంచి తీసేశాను.

@ కిరణ్,

:)ధన్యవాదాలు! ఈసారి ట్రై చేయండి. గుంజూర్ దాటాక ఒక్కసారి గా కాంక్రీటు అడవుల్లోంచి ప్రకృతి మాత ఒడిలోకి చేరినట్లు ఉంటుంది..

కాకపొతే సారీ.. మీకు బెంగుళూరు రోడ్ల మీద దొరికే ఫ్రీ మేకప్ మాత్రం సౌలభ్యం మాత్రం ఉండదు ;)

SNKR said...

/ఇక మీకూ, snkr గారికీ మధ్య జరిగిన సంభాషణ బ్లాగ్ గురించి కానందున, వ్యక్తిగత వ్యాఖ్యలు గా మారినట్లు అనిపించి ఒకరోజు ఉంచి తీసేశాను/

మంచి పని చేశారు. WP గారు కూడా ఇదే కారణాలు చెబుతూ వ్యతిరేక వ్యాఖ్యలు తుడిచిపెట్టేవారులేండి, కాబట్టి ఏమీ అనుకోరు, పూచీ నాది. స్పీకర్ కూడా దాదాపు ఇలాంటి కారణాల మీదే MLAల రాజీనామాలు తిరస్కరించారు, తెలుసా? :))

ఇక పోతే ... మీ టపాకు సంబందించి ఓ పొగడ్త - దీపావళి రోజు టపాకాయలు అతిగా కాల్చవద్దని, డబ్బులు తగలేయొద్దని, పచ్చదనము-పర్యావరణము, పరిశుభ్రతల ప్రాధాన్యతను మీదైన శైలిలో సున్నితంగా సందేశాత్మకంగా చెప్పారు. ఇది కొంత మందికి అర్థంకాక నచ్చకపోవడం కాదు గాని , 'మంచి విషయాలు' తరచూ గుర్తుచేసుకోక మరిచిపోయి వుంటారు, అంతే! :)

Mauli said...

ఇదన్యాయం,నేనెక్కడ ఇమేజ్ వద్దన్నాను :) మీ కడప ఫాన్స్ ఈ అపవాదు ను నమ్మేస్తే నా పని గోవిందా :D

కృష్ణప్రియ said...

I now think that probably I should not have deleted the following conversation from my blog comments.. I am publishing them back..

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) has left a new comment on your post "ఈ సంవత్సరమూ, మేము టపాసులు కోనేసామోచ్!":

>> మీరు ఓ అర్థం కాని/లేని వారాంతపు మేధావే! మీ కెక్కడో కాలినట్టుంది.

చెప్పాగా మీకు అంతకంటే అర్థమయ్యే అవకాశం లేదని :)

>> "మీ అతి తెలివి కామెంటుకు 'ధన్యవాదాలు' చెబుతూ 'తగిన విధంగా' సమాధానం వచ్చినట్టుందే! :)"

నేను చాలా మామూలుగా రాసిన కామెంటు మీకుండే అవగాహనకి మీకు అతితెలివి కామెంటు గా అనిపించడంలో పెద్దగా ఆశ్చర్య పడటానికేమీ లేదు లెండి :). Please do not attribute the cheapness and meanness of your mind to the Blog owner's response.

>> "నాకు తెలియకుండానే స్వయంప్రకటిత Mr. Cool మేధావిని కెలికేసినట్టుందే! అసంకల్పిత కెలికారచర్య అంటే ఇదేనేమో, కెబ్లాస వారిని కనుక్కోవాలి. :))"

Mr. Cool అనీ, మేధావిననీ నేనెక్కడా అనుకున్నట్టుగానీ ప్రకటించుకున్నట్టుగానీ నాకైతే తెలియదు. మీకే అలా అనిపించి ఈ ఏడుపంతా ఏడుస్తున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి ;). మీరు ఏ బ్లాసని సంప్రదించుకున్నా పాపం మీ ఏడుపు నుండి మీకు కొంత ఊరట/ఉపశమనం లభిస్తే మంచిదే లెండి :))

>> "ఒకరి డైరీలో ఏం వుండాలి వద్దు అనేవిషయంలో మీ మేధోపరమైన సలహా అనవసరం అనుకుంటా."

ఎవరు ఎవరికి ఎలాంటి సలహా ఇవ్వొచ్చు, ఎలాంటి కామెంట్లు రాయొచ్చు... అన్నింటి మీదా పాపం తమరిదే గుత్తాధిపత్యం అనుకుంటున్నట్టున్నారు !! ఇటువంటి వాటిల్లో మీ వెటకారభరిత, సభ్యత లోపించిన ఎండార్స్ మెంట్ అనవసరం అని నేను అనుకుంటున్నా మరి :))

>>" మీరు రాశారుగా వైవిధ్యంగా ... ఓ సారి సెంటిమెంటు స్టోరీ, మరో సారి I-Max సినిమా గురించి. అందరూ అలానే అనుకోండి, మరీ అంత డిప్లొమాటిక్‌గా ఏడ్వాల్సిన అవసరంలేదు, వారాంతకపొలిటీషియన్ గారు. "

ఇంత మంచి బ్లాగుకి, ఏదో సరదాగా వచ్చీ రాని రాతలు రాసే నా బ్లాగుతో పోలికెంటండీ !!
డిప్లమాటిక్ ఏడుపా ?? :)) ఎవరిమీదా? ఎవరికి? అయినా నాకెందుకు లెండి. ఏడుపులూ అందులో రకాలూ ఇవన్నీ మీ కోర్ కాంపిటెన్సీ కదా సంక్ర్ గారూ.. పండగ చేస్కోండి మరి :))

/It seems it is beyond your comprehension to understand my comment. /
హ్వా హ్వా హ్వా No doubt ఒప్పుకుంటున్నా.... అది మాత్రం నిజం. మీరు ఓ అర్థం కాని/లేని వారాంతపు మేధావే! మీ కెక్కడో కాలినట్టుంది. మీ అతి తెలివి కామెంటుకు 'ధన్యవాదాలు' చెబుతూ 'తగిన విధంగా' సమాధానం వచ్చినట్టుందే! :) నాకు తెలియకుండానే స్వయంప్రకటిత Mr.Cool మేధావిని కెలికేసినట్టుందే! అసంకల్పిత కెలికారచర్య అంటే ఇదేనేమో, కెబ్లాస వారిని కనుక్కోవాలి. :))
ఒకరి డైరీలో ఏం వుండాలి వద్దు అనేవిషయంలో మీ మేధోపరమైన సలహా అనవసరం అనుకుంటా. మీరు రాశారుగా వైవిధ్యంగా ... ఓ సారి సెంటిమెంటు స్టోరీ, మరో సారి I-Max సినిమా గురించి. అందరూ అలానే అనుకోండి, మరీ అంత డిప్లొమాటిక్‌గా ఏడ్వాల్సిన అవసరంలేదు, వారాంతకపొలిటీషియన్ గారు.
సంక్ర్ గారు,

>> "WP, seems you got hooked to only one of the many patterns, KP gaaru is capable of. If you expect only one pattern always... like a child that likes only chocolates and ice-cream and nothing else.."

I am gald you expressed whatever opinion you have and agree with you in appreciating the capabilities of Krishna Priya gaaru. It seems it is beyond your comprehension to understand my comment. I won't further strain your brain much by explaining.. be happy with that. After all.. blog world wants happy folks to be around :P

>> "వైవిధ్యమైన పోస్టులను ఆస్వాదించమంటే .... మూస పోస్టులు కావాలంటారేమిటండి వారాంతకం గారూ? :))"

నేను రాసిందేంటి? మీరు మాట్లాడుతుందేంటి? సభ్యత లేని చిన్న పిల్లల్లాగా.. మీకు అర్థంకాని విషయాల్లో తలదూర్చి అర్థం లేకుండా మాట్లాడుతారేంటండీ సంక్ర్ గారూ :))
SNKR has left a new comment on your post "ఈ సంవత్సరమూ, మేము టపాసులు కోనేసామోచ్!":

/The new pattern is also good to read but I would say it is more like moving your blog into a time pass./

WP, seems you got hooked to only one of the many patterns, KP gaaru is capable of. If you expect only one pattern always... like a child that likes only chocolates and ice-cream and nothing else, we know that is bad for child's health/teeth. What do you say? Hope you agree with me. :P :))

కృష్ణప్రియ said...

@ WP,
నిజమే. మీరన్నట్టు క్రిటిసిజం అంటే సాధారణం గా మీరన్న అర్థం లోనే వాడతారు.

పదాలు, అర్థాలు వదిలేస్తే, మీరు రాసిన మొదటి వ్యాఖ్య తో (ఈ మధ్య నా బ్లాగ్ లో పైకి సరదాగా కనిపించినా అంతర్లీనం గా సందేశాత్మకం/ఆలోచనాత్మకం గా ఉండే పోస్టుల నుండి కాజువల్, సరదా విషయాల వైపు ఎక్కువ టిల్ట్ అయింది, అని) నేనూ 100% ఏకీభవిస్తున్నాను.. ఈ మధ్య రాసిన టపాలు.. (టపాకాయలు, పాటలు, అమ్మ ఊరు వెళ్లింది.., పొడుగైన వారాంతం, అమ్మో ఏమి రుచి, ఈరోజు, ఎనిమిదికి రెండు మార్కులు, సలహాల కబుర్లు, మళ్లీ మొదలు, ... లాంటివి).

మధ్య మధ్య లో ‘నలుగురు మిత్రుల రీ-యూనియన్, పుస్తకం రివ్యూ, ట్రావెలాగ్, నాకు తెలిసిన వృద్ధురాలి కథ..’ రాసినా.. పెద్దగా సమయం చిక్కక నేననుకున్న రీతి లో రాయలేకపోతున్నాను.

బహుశా ఇంకా కొద్ది కాలం అంతే! :)

ఈ విషయం మీరే కాదు, కొద్దిమంది బ్లాగర్లు ఈ-మెయిల్ రూపం లో, వ్యక్తపరిచారు.

నీహారిక said...

కృష్ణ ప్రియా ,
.
ఆలస్యంగా సమాధానమిస్తున్నాను, నాకు కొన్ని పర్సనల్ పనులవల్ల వ్యాఖ్యలు వ్రాయలేకపోయాను.

మీ సంగతి కొద్దాం , నేను ప్రశంసించినప్పుడు నా మైల్ తీసుకుని వచ్చి ఎలా వచ్చారో, అలాగే విమర్శించినపుడు కూడా వచ్చిఉంటే బాగుండేది. విమర్శ ఎవరికైనా బాధే కదా !!

నేను పొరపడ్డాను, మీరు నిజంగా మెగా బ్లాగరే!! రాతల్లోనే సుమా !!! అచ్చం చిరంజీవి లాగా... నిజజీవితంలో కాదు అని నిరూపించారు.

మిమ్మల్ని సీతా దేవి పోస్టులప్పుడే నేను గమనించాను, ముదురు బ్లాగర్లు అని ఎవరిని అన్నారో మీకు నిజం తెలుసు, కానీ మీరు నాకు కనీసం మద్దతు పలకలేదు. ఎందుకంటే అతను మిమ్మల్ని విమర్శించారు కాబట్టి మీరు మౌనంగా ఉన్నారు. అపుడే మీరేంటో నాకు తెలిసిపోయింది. గేటేడ్ కమ్యూనిటీ కధలు వ్రాసారు, మీ కళ్ళ ఎదురుగా అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించలేదు.

నేనలా ఉండలేను. మీరెంత మెగా బ్లాగరైతే
ఏమిటి ? అనుకున్నాను.

ఇపుడు మీరు కూడా ముదురు బ్లాగరే !! ఆ వ్యాఖ్యలో మిమ్మల్ని ఊహించుకుని చూడండి బాధ తెలుసుంది. ఇప్పటికైనా నోరు తెరవండి, అతనికి మద్దతు పలకండి. ఒక్కోసారి మాటసాయం కూడా అవసరమే !! అన్నీ డబ్బు తోటే చేయాలంటే మీలాగా అందరూ సంపాదించలేరు కదా ?

ఈ టపా కి నా విమర్శ కి సంబంధం ఏమిటి అని అడుగుతారేమో !!! చిరంజీవి నటనకీ రాజకీయాలకీ సంబంధం ఏమిటీ అని నేనడుగుతున్నాను. మీరు నిజ జీవితంలో ఒకలా.. రాసేటపుడు ఒకలా.. ప్రవర్తించవద్దని నా కోరిక. అదీ ఒక అభిమానిగా మాత్రమే సుమా !!!

ఇక సోనియా విషయం మీరు ఒక బ్లాగులో ప్రస్తావించడం చూసాను, మీకు చాలా విషయాలు తెలియవు అని అర్ధం అయింది. వరుస దాడులు జరుగుతున్నా ఒక్కరు కూడా కిక్కురు మనటం లేదు.

అందరూ అవినీతి గురించి మాట్లాడే వారే !!!

ఆవిడ ఒకటే మాట అన్నారు, "వేలెత్తి చూపితే అవినీతి పోదు" అని అన్నారు.

She is a Sagittarian Woman.

అందరిలా వంద మాటలు మాట్లాడరు,మనిషికో మాట చాలదా?

కృష్ణప్రియ said...

@ నీహారిక గారు,
మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు!

>>నేను ప్రశంసించినప్పుడు నా మైల్ తీసుకుని వచ్చి ఎలా వచ్చారో, అలాగే విమర్శించినపుడు కూడా వచ్చిఉంటే బాగుండేది. విమర్శ ఎవరికైనా బాధే కదా !!
నీహారిక గారు, మీరు పొరపడ్డారు. మిమ్మల్ని నా బ్లాగ్ లో ఎవరో ఏదో అన్నారని (అప్పట్లో కామెంట్ మాడరేషన్ లేదు నాకు), మీకు అపాలజీ చెప్దామని మీకు ఒక సారి మెయిల్ చేశాను. మీరూ దాన్ని రైట్ స్పిరిట్ తో తీసుకున్నారు ఇక మొన్న నన్ను ఏదో విమర్శించారని నేననుకోలేదు. నా quality of writing ఎలా పడిపోయిందో, నేను బ్లాగ్ లో ఇంకా గొప్పగా ఎలా రాయవచ్చో,సాటి బ్లాగర్ల తో ఎలాగ పోటీ పడుతూ రాయచ్చో నాకు సలహా ఇచ్చారని అనుకున్నాను. మీకు నేను మర్యాదా పూర్వకం గానే సమాధానం ఇచ్చి, మీ లాంటి వారి సూచనల మేరకు ఎలా ఇంప్రూవ్ అవచ్చో ఆలోచిస్తున్నాను .

>>>నేను పొరపడ్డాను, మీరు నిజంగా మెగా బ్లాగరే!! రాతల్లోనే సుమా !!! అచ్చం చిరంజీవి లాగా... నిజజీవితంలో కాదు అని నిరూపించారు

నీహారిక గారూ, అబ్బే.. రాతల్లో కూడా నేను మెగా బ్లాగర్ ని అని నేను ఏమాత్రం అనుకోవట్లేదు.

>>>ముదురు బ్లాగర్లు అని ఎవరిని అన్నారో మీకు నిజం తెలుసు, కానీ మీరు నాకు కనీసం మద్దతు పలకలేదు. ఎందుకంటే అతను మిమ్మల్ని విమర్శించారు కాబట్టి మీరు మౌనంగా ఉన్నారు

ఈ కాంటెస్ట్ నాకు అర్థం కాలేదండీ.. నేను అన్ని బ్లాగులూ చదవను. ఏవో సరదా బ్లాగులు,రాజకీయ/పుస్తక విశ్లేషణ బ్లాగులు లాంటివి తప్ప. ఎవరు నన్ను విమర్శించారు? ఒకవేళ విమర్శించినా It’s ok. ఒక పబ్లిక్ ఫోరం లో మనం ఏదైనా విషయం గురించి స్టాండ్ తీసుకున్నప్పుడు, ప్రశంసలూ, విమర్శలూ సాధారణమే కదా? అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా? ఎవరి అభిప్రాయం వారిది.మీరైనా నన్ను భవిష్యత్తు లో నిరభ్యంతరం గా విమర్శించవచ్చు.

>>> మీ కళ్ళ ఎదురుగా అన్యాయం జరిగితే కనీసం ప్రశ్నించలేదు.
హ్మ్మ్ possible. I am sorry! నేను ఏదో సరదాకి స్కూల్ లో వదిలేసిన తెలుగు లో, దశాభ్దాల తర్వాత రాసుకుని, ప్రచురించుకునే అవకాశం ఇక్కడ ఉంది, అన్న ఉద్దేశ్యం తో బ్లాగ్ ప్రారంభించాను. జనరల్ గా ఏదో వారానికి కొంత సమయం కేటాయించుకుని రాస్తాను. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి బ్లాగులు చూస్తాను. అంతకి మించి పెద్దగా పట్టించుకోను.

>>> ఇప్పటికైనా నోరు తెరవండి, అతనికి మద్దతు పలకండి. ఒక్కోసారి మాటసాయం కూడా అవసరమే !!
ఎవరికి? ఎవరతను?

>>> అన్నీ డబ్బు తోటే చేయాలంటే మీలాగా అందరూ సంపాదించలేరు కదా ?

డబ్బు తో అన్నీ చేయలేరు.. నిజమే.. ఈ కాంటెస్ట్ ఏంటో అర్థం కాలేదు.

>> మీరు నిజ జీవితంలో ఒకలా.. రాసేటపుడు ఒకలా.. ప్రవర్తించవద్దని నా కోరిక. అదీ ఒక అభిమానిగా మాత్రమే సుమా !!!

తప్పక పాటించటానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

>>>ఇక సోనియా విషయం మీరు ఒక బ్లాగులో ప్రస్తావించడం చూసాను, మీకు చాలా విషయాలు తెలియవు అని అర్ధం అయింది.

భాస్కర్ రామ రాజు గారి బ్లాగ్ లోనా? నిజమే నాకు విషయ జ్ఞానం తక్కువే.

నా వ్యాఖ్యలు ఎక్కడైనా అనుచితం గా/అభ్యంతరకరం గా ఉంటే చెప్పగలరు.

కృష్ణప్రియ said...

అన్నట్టు నీహారిక గారు,

నా వ్రాతలకి, నా పై విమర్శలకి సంబంధించిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురిద్దామని .. మీ ఇతర వ్యాఖ్యలు ప్రచురించ లేదు.

నీహారిక said...

ఒక రచయత/ రచయిత్రులకు సామాజిక దృక్పధం ఉండాలి, ఉండితీరాలి.

నా బ్లాగు నేను వ్రాసుకుంటున్నాను అంటే కుదరదు.

ప్రక్కన ఏమి జరుగుతున్నది అనే స్పృహ లేని వాళ్ళు ఈ ఆగ్రిగ్రేటర్ లలో ఉండనవసరం లేదు. ఇంట్లో కూర్చుని డైరీ రాసుకోవచ్చు.

ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిఉండి ఇంత బాధ్యతా రహితంగా వ్యవహరించడం నేను అసలు భరించలేను.

నాకు తెలిసి cancerian women కి memory ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మర్చిపోవడం జరుగదు, సంవత్సరం క్రితం జరిగిన విషయాలు నాకు తెలియవనడం నటన.

మీరు ఒక మెగా బ్లాగర్ కాబట్టి మీకు కావల్సిన వారు బుక్ మార్క్ చేసుకుని మీ బ్లాగు చూస్తారు. మీరిక ఈ ఆగ్రిగ్రేటర్ లనుండి స్వచ్చందంగా తొలగిపోవలసినదిగా నా సలహా .

మీలాంటి సామాజిక స్పృహ లేని వ్యక్తులు ఈ ఆగ్రిగ్రేటర్ లో లేకపోవడం వల్ల ఈ దేశానికి మంచే కానీ చెడు జరుగదు.

కృష్ణప్రియ said...

నీహారిక గారు,

మీ వ్యాఖ్య కీ,మీ సలహా కీ ధన్యవాదాలు!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;