ఉండాలా? ఏం? మేం మగాళ్లకి ఏం తీసిపోయాం? వాళ్లకీ ఓ రోజు పెట్టాలా? అయినా మన భారత సంస్కృతి లో స్త్రీ పూజనీయమైనది.. ఒక శక్తి, ఒక....
అబ్బా.. ఇదంతా కాదు కానీ.. మూడు వందల అరవై అయిదు రోజుల్లో ప్రతి రోజూ స్త్రీదే కాకపోవచ్చు..కానీ ప్రతి ఒక్కరోజూ స్త్రీ దీనూ..
గత సంవత్సరం స్త్రీల దినం అందరూ ఏంటో తెగ ఘనం గా చేశారు. ఇటు పొద్దున్నుంచీ SMS లు, ఫోన్లు, ఆఫీసులో రోజా పూలిచ్చి కేకు ముక్కలు పంచడం.. ‘ఆడవాళ్ల వల్లే మా బృందానికి వన్నె వచ్చిందని మా డైరెట్రు గారి నుండి ఈ మెయిలూ.. అందరూ కళ కళ లాడుతూ సీతాకోక చిలకల్లా.. ఇంటికొస్తూనే కాంప్లెక్స్ ఆడవాళ్లు పిల్లలని ఇళ్లల్లో వదిలి మ్యూజికల్ చైర్లు, బింగో ల్లాంటి వినోద కార్యక్రమాలూ.. ఏంటో వెలితి.. విసుగూ..
మరి ఈరోజో? ఆడవారి రోజు. అంటే అచ్చం గా నాదే ఈరోజు.. It’s my day and My day is beatiful!!
మార్చి 8, 1200am
గంట కొట్టింది. ఇంట్లో అందరూ కలల సీమ లోనో, గాఢ నిద్రలోనో.. నేను మాత్రం ఒక సీరియస్ ఆఫీసు పని. చేయకపోతే నా ప్రతిభ కే ఒక మచ్చ. చేస్తున్నాను.. తలెత్తటానికీ సమయం లేదు.
1am ఆఆఆఆఆకలి.. రాగి బిస్కట్లు?బోరు. ఆవకాయన్నం? ఇంకా నయం.. అరటి పండు? వద్దులే.. అన్నట్టు.. పాలు ఫ్రిజ్ లో పెట్టానా? చూసొద్దాం..
2am డామిట్.. కథ అడ్డం తిరిగింది.. ఇదేంటి!!!!! ఇప్పటిదాకా పని చేసిన కోడ్.. లేద్దాం అనుకుంటే.. ఇప్పుడు పని చేయదు? దీని పని పట్టాల్సిందే..
2.45am : చాలు..బాబూ.. అయినంత చాలు.. ఉద్యోగం తీసేస్తాడా?ఉరేస్తాడా? తూర్పు తిరిగి దణ్ణం పెట్టుకోమను.. నేను పడుకుంటున్నా.. ‘సుఖ నిద్ర కి మించి న వరం.. ఉంమ్మ్మ్మ్మ్.....zzzzzz
7am : నూతి లోంచి.. లీల గా.. మంద్రంగా ‘అమ్మా.. ‘ ‘హమ్మో!!! ఏడు గంటలా!!! టిఫిన్లు, వంటలు.. ఎలా? ‘ దిగ్గున లేస్తుంటే.. ‘పర్వాలేదు.. అమ్మా.. ఈ పూట కి సీరియల్ తింటా.. ఇవ్వాళ్ల పదకొండు న్నర కే వస్తున్నాను. లంచ్ అక్కర్లేదు.. జడ వేయి చాలు..’ ‘ఆహా.. ఎంత మంచి womens day gift!! నేను అరవకుండానే తయారయిపోయారు..’
“My children are beautiful!” ‘ఓహ్.. పదకొండున్నరకే వచ్చేస్తారా? అయితే మళ్లీ WFH పెట్టాలి.. సోమవారం నుండీ పరీక్షలు.. నేను పని చేసుకుంటూ లెక్కలు చేయిస్తే...బాసు ఏమంటారో ’
7.30am : ‘బై బై.. తల్లీ.. అరే.. ఫోన్.. ‘ఓహ్.. కోయీ బాత్ నహీ.. మై ఘర్ పే హూ.. ఆప్కే బచ్చోంకో భీ యహీ చోడ్ దేనా..’ అరే కాలింగ్ బెల్..’ఓహ్.. ఇన్నికే టాంక్ క్లీన్ పన్న పోరింగలా? నాళకి ముడియాదా? ఓకే ఓకే నో ప్రాబ్లం. ‘
8.30am: ‘ఓ.. హాప్పీ వుమెన్స్ డే!! అలాగే అలాగే బై..’.. అప్పుడే పది ఫోన్ కాల్స్. ఒక్క అమ్మకి ఫోన్ చేస్తే చాలు. మిగిలిన వాళ్లకి ఆన్ లైన్ లో .. ఇక పని పూర్తి చేయాలి...
9.30am: ‘నీళ్లు పట్టేసుకుంటే.. మళ్లీ టాంక్ కడిగినప్పుడు టెన్షన్ ఉండదు.. అప్పుడు.. ఓసారి బ్లాగులు చూద్దాం? ‘అయ్యో..అయ్యో.. సిరిసిరి మువ్వ గారికి శ్రావ్య బ్లాగ్ ముఖం గా ఇవ్వడానికి శ్రావ్య గారికి ఒక ఆడియో మెసేజ్ పంపుదామనుకున్నాను. గిల్ట్..గిల్ట్..గిల్ట్.. హ్మ్.. Too late.. I need to manage my time well..
10.30am: అరే బాసు గారి మెయిల్..’ నీవు గత వారం చేసిన బగ్ ఫిక్స్ వల్ల ఇవిగో సైడ్ ఎఫెక్ట్స్.. కాస్త చూసుకుని...!@#@$#’ ‘ఓకే ఓకే.. దీని ప్రభావం పని మీద పడకూడదు.. కంటిన్యూ..’ అన్నట్టు కాస్త పాదం అటూ ఇటూ తిప్పాలి పని చేస్తూ.. లేకపోతే బిగుసుకుపోతుంది... మొన్ననే విరిగి అతుక్కుందసలే.. అమ్మాయి వచ్చేసరికి దానికిష్టమైనవి చేయాలి..ఇంట్లో ఉన్నాను కదా..
11.30am. ‘కృష్ణా.. పని ఎలా అవుతుంది.. స్నేహితుల పలకరింపు.. నా కంపెనీ కాకపోయినా.. నా కోడ్ ఏమాత్రం ఐడియా లేకపోయినా చాట్ ద్వారానే సహాయం చేసే ఫ్రెండ్!! ఎన్నాళ్ల నుండో వెతుకుతున్న ‘యుగాంత’ పుస్తకం ఇచ్చిన ఇంకో ఫ్రెండ్!!! Friends are beautiful! అమ్మాయి వచ్చేసింది.. దాని ఫ్రెండ్సూనూ.. ‘ఆంటీ.. పప్పు, మాగాయ కావాలి నాకు..’ గుజరాతీ పిల్ల గారాలు.. ‘ఓకే నో ప్రాబ్లం..’
12.30: అమ్మయ్య వంట రెడీ.. రండమ్మా తింటూ చెప్పుకోవాలి కబుర్లు.. ‘ఆ ఆ.. వింటున్నా.. వింటూ చేసుకుంటున్నానమ్మా పని!! ఓ.. సారీ వింటా.. పూర్తి శ్రద్ధ తో చెప్పు.. కళ్ళు ఆసక్తి గా వింటున్నట్టు, బాడీ లాంగ్వేజ్ అలాగే.. ప్రతి పది సెకన్లకీ ‘ఓహ్.. అవునా.. టూ మచ్.. బాబోయ్.. థాంక్ గాడ్’ లాంటివి వాడుతూ.. మెదడు లో ఎక్కడో.. ‘బగ్ గురించి ఆలోచిస్తూ... దొంగతనం గా పేపర్ చదువుతూ..
1.30pm: టాంక్ కడిగినప్పుడు పోయే ప్రతి బొట్టూ మొక్కలకే చేరాలి.. అయ్యో... అరటి చెట్టు గెలనింకో సారి చూసి వద్దాం.. సీతా ఫలం చెట్టు.. చిగురు..అ బ్బా.. ప్రకృతి సౌందర్య మయం.. మనమే.. చేసుకుంటున్నాం ఇదంతా మాయం... ‘ఆఆఆఆఅ వస్తున్నా.. ఇచ్చిన లెక్కలన్నీ చేశావా? వెనక సమాధానాలు చూడలేదు కదా.. Just asking!!! అంత కోపమే.. చచ్చాం. కరెంట్ పోయింది. బాకప్ కూడా రాలేదు....
2.30pm. అరే మేరీ నువ్వెళ్లిపో ఇంక.. ‘హాపీ వుమెన్స్ డే.. ఇంద.. దీనితో ఏదైనా మంచి చీర కొనుక్కో సరదాగా.. ఇదిగో మీ అక్క బిడ్డ కోసం ఆవకాయ.. జాగ్రత్త గా కారకుండా.. ‘ అరే కరెంట్ వచ్చింది.. ‘అరీ చిన్నమ్మాయీ వచ్చేసింది.. గుడ్’ ఈమెయిల్స్ చూడాలి. ‘అయ్యో.. ఇంత నెగటివ్ రిమార్కులా!!! ఏంటి? అంత చెత్తగా రాశానా కోడ్!! ముసలి దాన్నవుతున్నాను. ఇంక ఈ కోడింగ్ ఆపేయాలి.. ఈ ఉద్యోగం కష్టం బాబూ.. చిన్న చిన్న అబ్బాయిలతో పోటీ పడుతూ...
3.30pm.. నా వల్ల కాదు ఈ కోడ్.. ‘phone a friend option?’ సరే.. ఈయన చెప్పిన పద్ధతీ ప్రయత్నిద్దాం. ‘అరే.. మామయ్య ఫోన్.. బాగుండదు. రెండు నిమిషాలు మాట్లాడదాం..’ అరే? పెట్టేసే సరికి మళ్లీ ఫోన్!! చాట్ లో ఎవరు? ‘అలాగే.. నీకు ప్రొమోషన్ రావాలంటే.. ఊర్కే గ్రూపులు మారకు.. ‘ మరి సలహాలు ఇవ్వకపోతే..గడుస్తుందా రోజు? ఇతనికేం కావాలి? ‘ఓహ్.. రివ్యూ.. సరే.. ఏంటయ్యా ఈ ఇంగ్లీషూ.. నేను రాసి పెట్టను.. నీచేతే రాయిస్తాను.. మూడో లైన్లో...’ బాబోయ్ .. పని జరగటం లేదు.. concentrate krishna!! concentrate...
4.30pm.. గారడీ ఆట.. పొయ్యి మీద పప్పు పులుసు..కూర, పెద్దదానితో సంస్కృతం, చిన్నదానితో సైన్సు.. ఆఫీసు పని కొద్దిగా ఓ కొలిక్కి వస్తున్నట్టుంది?
5.30pm.. అవునూ.. అసలు ఉదయం నుండీ చాయ్ తాగానా? పోన్లే ఈయనా వచ్చారు గా.. ఇద్దరం తాగచ్చు.. పని,పని, పని.. టీ వీ చూస్తూ భర్తగారు,.. ఆటల్లో పిల్లగార్లు.. నాకే.. ఈ బగ్.. అర్థం కావటం లేదు.. కాన్సెంట్రేట్.. ‘అమ్మా..చెస్ ఆడతావా? ఒక్క గేమ్?’ సరే..పద.. చెస్..భలే ఆట.. కానీ మా చిన్నదానికి తెలిసిన ఒక ఎత్తు ముందు విశ్వనాథ్ ఆనంద్ కూడా గెలవలేడు.. అదే.. ‘బోర్డ్ ఎత్తు..’ పిల్లలతో ఆడటం.. How beautiful!!
6.30pm : పని, పని.. ‘అలాగే.. లాప్ టాప్ మూసి కథలు చెప్తూంటాను..తినండి.. యెస్...’
7.30pm: పని పని.. నా వల్ల కాదు ఒక వాక్ కొడితే.. ‘ఆహా.. రోడ్డు, సాయంత్రపు సంధ్య..!!! అద్భుతం.. రోడ్డు మీద నుంచుని.. ఆడవాళ్లతో ముచ్చట్లు.. ‘Women are so beautiful’..
8.30pm: ‘కథలు.. ఏం చెప్పాలబ్బా? అనగా అనగా..
8.45pm: ‘మొన్న ఎంతవరకూ చూశారు సినిమా? ఒక విండో లో పిల్లలు రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా.. వివాహ భోజనంబు.. ఇంకో విండో లో పనీ, పనీ... పర్లేదే.. వీళ్లకీ నవ్వొస్తోందే. జై జంధ్యాల, జై రాజేంద్ర ప్రసాద్.. ఈ పాట వినండి.. బాలు లేత గొంతు.. నచ్చినట్లుంది.. తాళం లీల గా పడుతుంది.. గుడ్ గుడ్.. ‘ Music is beautiful!!
9.45pm: NDTV లో తమిళ ముస్లిం ఆడవారిని చైతన్య పరిచిన కార్యక్రమం మీద డాక్యుమెంటరీ ఏదో.. ఆంగ్ల సబ్ టైటిల్స్ తో.. Our idea of a date.. ఒళ్లో లాప్ టాప్ పనీ, పనీ.. ‘ పెద్దగా చదువుకోకపోయినా, వేరే జీవనాధారం లేకపోయినా, ఎంత ధైర్యం గా ఉన్నారు? ఎన్ని సమస్యలనెదుర్కుంటున్నారు!! కళ్ళు నిండిపోయాయి.. దుఖం తో కాదు హృదయం నిండి.. వాళ్ల సమస్యల ముందు నా బోడి బగ్ ఎంత చిన్నది...
10.45pm: ‘అరే.. ఇదా.. కథ!! వచ్చేసింది సొల్యూషన్.. హమ్మయ్య.. మూడురోజుల నుండీ.. ఎంత కష్టపడ్డాను... తొందర పడకూడదు. బాగా టెస్ట్ చేసి మరీ ఇవ్వాలి..
11.45pm : అమ్మయ్య అయిపోవచ్చింది..
12.45pm: ఆల్మోస్ట్ డన్..
1.45pm: అమ్మయ్య.. అయిపోయింది. ‘work is beautiful..’!!
పడుకోనా? అప్పుడే!!! మరి చదివాను, ఇంటి పని, పిల్లలు, వాళ్ల చదువులు, సినిమా, సంగీతం, స్నేహితులతో గప్పాలు,. మొక్కలు, బేబీ సిట్టింగ్, ఆఫీసు పని, ఇన్ని చేసినదాన్ని..ఇదంతా రాసుకోవద్దూ.. Documenting yet another beautiful day .. బగ్ ఫిక్స్ అయిందని కాదు కాకపోయినా మంచిరోజే.. రేపంటూ ఉందిగా.. ఫిక్స్ చేసుకోడానికీ... :)
చేతి నిండా పని, చేయగల్గే ఆసక్తి, అనురక్తి, గుండె నిండా ధైర్యం, ఆరోగ్యం, కొద్దిగా స్పందించే మనసూ... ఉంటే అంతకన్నా ... celebration లేదు, అక్కర్లేదు.. Life is beautiful!
సిరి సిరి మువ్వ.. 'వరూధిని' గారికి ఈ పోస్ట్ అంకితం!!!
30 comments:
chaalaa bagundi.
mee jeevitham lo oka roju..hmm kaadu
woman jeevitham lo oka roju.
:venkat
"Board ettu" manchi move chess lo..it always works.. :)...
Last lo timings 12:45 am,1:45 am anukuntanandi instead of pm...
As usual nice write up..btw,,I'm a silent follower(admirer) to ur blog :)
Hahaha....baavundi....nijame..life is beautiful..:)
"ఆడ వారికి ఒక రోజు" వేరేగా కావాలా అంటూ, చాలా ఆత్మగౌరవంతో మొదలు పెట్టారు మీ పోస్టు.
చివరికి, అన్ని వివరాలూ చెప్పి, ఆడ వారికి వేరే రోజు ఒక్కటి చాలదూ, చాలా కావాలీ అని తేల్చేశారు.
ఆడవారి పనులు: ఇంటి పని, పిల్లలు, వాళ్ల చదువులు, సినిమా, సంగీతం, స్నేహితులతో గప్పాలు,. మొక్కలు, బేబీ సిట్టింగ్, ఆఫీసు పని
మొగవారి పనులు: సినిమా, సంగీతం, స్నేహితులతో గప్పాలు, ఆఫీసు పని
చూడండీ, మొగ వారి జీవితం ఎంత సుఖమో! మరి వాళ్ళిదరూ సమానం అన్నట్టు, అలా అంటారేం? ఈ అదనపు పనుల నించీ పారిపోవడానికి అలా వేరే రోజులు పెట్టుకున్నారేమో, పాపం. కాస్త వారి మీద జాలి చూపండి. ఎన్ని చదువులు చదివితేనేం, ఎంత గొప్ప ఉద్యోగాలు చేస్తేనేం, ఆడ వాళ్ళన్నాక అన్ని పనులూ చెయ్యక తప్పుతుందా, ఏమిటీ? మరి వాళ్ళని ఉబ్బెయ్యడానికి అప్పుడప్పుడు ఇలాంటి ఒక రోజు ఇచ్చేస్తూ వుంటారు మొగవాళ్ళు. "చచ్చినాడి పెళ్ళికి వచ్చిందే కట్నం" అన్నట్టు, దొరికిన ఆ రోజునే హాయిగా తీసేసుకుని, ఏదో సంతోషించేద్దామని ప్రయత్నిస్తున్నారేమో ఆ అమాయకపు స్త్రీలు. కాస్త అర్థం చేసుకోరూ, వారిని?
Final Words.. అద్భుతః
అమ్మో! ఇంత హడావిడి జీవితమా? మీరు గ్రేట్..
అన్ని బ్యూటిఫుల్స్ లో కృష్ణాజీ బ్లాగూ బ్యూటిఫుల్ :)
yes...life is beautiful...
మీకు ఇంత టపా వ్రాసేటంత ఓపికెక్కణ్ణించి వచ్చిందీ?
Hats off...
Simply admirable...
I never thought I would struggling to express my self...But I got me into that now :)
ఇంతందంగా విశధీకరించాక....ఒకరోజు అవసరమని ఎవరంటారు చెప్పండి! :-)
అబ్బే , ఇదా ఈ రోజు జరుపుకోవాల్సిన విధానం. ఇంట్లో పొద్దున్నే పెద్ద గిన్నె ఉప్మా చేసి పారేసి, చక్కగా లేడీస్ తో మీటింగ్స్ చర్చలు పెట్టుకుని సాధక బాధకాలు మాట్లాడుకోవాలి కాని. మేడే లా గా ఉమెన్స్ డే కూడా నేషనల్ హాలిడే చేస్తే కాని ఈ సమస్య తీరదు.
వచ్చే ఏడాది ఉమెన్స్ డే రోజు ఈ విషయమై ఒక తీర్మానం చేసి , సెలవు దినం సాధించుకోవాలి. క్రిష్ణప్రియగారు, సభ బెంగుళూర్ లోనే మీ అధ్యక్షతలో జరుగుతుంది కాబట్టి ఆఫీస్ లో బాస్ కి ఒక మాట ముందే చెప్పి ఉంచండి.
ఏమిటో అమ్మాయ్,
ఈ కాలం పిచ్చి అమ్మాయిలూ, అమ్మలు, అమ్ములు.
గుప్పెడు బువ్వ కోసం ఇట్లా కష్ట పడి పోతారు !
మా కాలం లో ఇట్లాంటివి ఏమైనా విన్నామా ? కన్నామా ?
ప్చ్, కాలం మారి పోయింది సుమీ ! పొద్దస్తమానం ఆడవాళ్ళు ఇట్లా కష్ట పడి పని జేస్తూ పోతూంటే ప్చ్ , ప్చ్ ప్చ్..
జిలేబి.
భలే రాసారు గా డైరీ .ఈ టెంప్లేట్ కి ఈ పోస్ట్ కరెక్ట్ గా ఉంది :-)
ఇంతకీ తులసి / ధాత్రి ఎవరో ఆ గ్రీటింగ్ ఆర్టిస్ట్ ? చక్కగా ఉంది !
మీ కాలు తగ్గిందాండి ? ఆడ వారికి ఒక రోజు" వేరేగా కావాలా అంటూ .. మీ డైరీలో ఒక రోజు బ్యూటిఫుల్
అతిశయోక్తులైనా అందంగా చెప్పారు.
"చేతి నిండా పని, చేయగల్గే ఆసక్తి, అనురక్తి, గుండె నిండా ధైర్యం, ఆరోగ్యం, కొద్దిగా స్పందించే మనసూ... ఉంటే అంతకన్నా ... celebration లేదు, అక్కర్లేదు.. Life is beautiful!"
ఈ పంక్తి నాకు చాలా నచ్చింది..
Anonymous (March 9, 2013 at 7:55 PM),
అతిశయోక్తులని మీకెందుకనిపించిందో చెప్పండి ప్లీజ్.
why do you think there are exaggerations ?!!
It looks like an honest post to me. Am I missing something here ?
@వెంకట్ గారు,
థాంక్స్.. యెస్. నా జీవితం లోనే అని కాదు.
ఒక స్త్రీ జీవితం లో ఒక రోజు అన్నట్టు రాశాను.
@ Niru,
అవును కదూ.. కరెక్ట్ చేస్తాను. ధన్యవాదాలు.
అయితే మొత్తానికి మహిళల దినం మీ చేత కామెంట్ రాయించింది. అభినందనలు.. :)
@ Found In Folsom,
:) థాంక్స్.
@ అజ్ఞాత,
థాంక్స్ ఫర్ కామెంట్. రియల్లీ అప్రిషియేట్ ఇట్!
ఈమధ్య ఏదో ఒక రోజు సంవత్సరం లో ఎవరికో ఒకరికి డెడికేట్ చేస్తున్నారు. మంచిదే. ఎవరి రోజు వాళ్ల గ్రూపు స్లోగన్స్ అరిచి, మీటింగులు పెట్టుకోవచ్చు, కాస్త రిలాక్స్ అవచ్చు.
అయితే సంవత్సరం లో అన్ని రోజులూ అందరివీనీ.. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్లకుంది అన్నది నా అభిప్రాయం.
:) మగవారు కూడా అంత హాయిగా గడపడం లేదు లెండి. దాదాపు వందశాతం కుటుంబాల్లో ఇంటి,పిల్లల బాధ్యత ప్రముఖం గా స్త్రీదే అయినా, ఇంట్లో మగవాడి బాధ్యత గణనీయం గా పెరిగిపోయింది. పిల్లల చదువులు,పిల్లల పనులు, సామాన్లు తేవడం, డ్రైవింగ్, బిల్లులు, మెట్రో ల్లో చాలా కుటుంబాల్లో వంటింట్లో.. కూడా మగవారి పాత్ర ఖచ్చితం గా పెరుగుతోంది.
@ bonagiri గారు,
థాంక్స్.. హడావిడి జీవితం నాదొక్క దానిదే కాదు. ఈ కాలపు మహిళలదందరిదీ..
అయినా మొన్నంత హడావిడి జీవితం లో రోజూ ఉంటే అంతే సంగతులు.. హిమాలయాలు, ఆశ్రమాలు, అడవులు వైరాగ్యులతో నిండిపోతాయి :) ఏదో అప్పుడప్పుడూ.. అంతే.
@ నాగార్జునా ,
హౌ నైస్.. ధన్యవాదాలు!! మీ కామెంట్ కూడానూ:)
శ్రీలలిత గారు,
థాంక్సండీ..
@ ఫణి బాబు గారు,
థాంక్స్. ఆఫీసు పనితో ఎలాగూ తెల్లారింది, బ్రాహ్మీ ముహూర్తం లో బోల్డు శక్తి ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది ;)
@ Weekend Politician,
oh thanks!! :)
@ పద్మార్పిత గారు,
LOL.. థాంక్స్!
@మౌళి ,
అబ్బే.. ఉప్మా మాత్రం ఎందుకండీ.. ఉత్త దండగ! మా ఊళ్లో బ్రెడ్,సీరియల్ దొరకవనుకున్నారా? పక్కనే శాంతి సాగర్ హోటలు కూడా ఉంది. సెలవ..అవును. కావాలి కావాలి.
@ జిలేబి గారు,
:) గుప్పెడు బువ్వ కోసం.. కరెక్టే.. అంతకు మించి ఎక్స్ట్రా గా తింటే..ఎలాగూ కొలెస్ట్రాల్ తప్పదు.
@ శ్రావ్య,
నేనూ అదే అనుకున్నాను :) తులసీ మైత్రి వేసింది ఈ గ్రీటింగ్. స్కూల్లో ప్రాజెక్ట్. థాంక్స్.
@ రాధిక గారు,
ధన్యవాదాలు!
@ అజ్ఞాత,
అతిశయోక్తులున్నదే.. తిమ్మిని దమ్మిని చేసి అందం గా చూపించటానికి కదా? :)
@ బొందలపాటి గారు,
థాంక్సండీ..
మహిళకు ఓ దినం అంటూ పెట్టారు, మగాళ్ళు ఏమన్నా మాకోదినంకావాలంటూ హడావుడి చేస్తున్నారా? అయినా వాళ్ళకి రోజూ దినమే.
చట్టం, న్యాయం ముందూ మగాళ్ళకు రా డీలే, అక్కడా స్త్రీ పక్షపాతమే.
"మగవారు కూడా అంత హాయిగా గడపడం లేదు లెండి. దాదాపు వందశాతం కుటుంబాల్లో ఇంటి,పిల్లల బాధ్యత ప్రముఖం గా స్త్రీదే అయినా, ఇంట్లో మగవాడి బాధ్యత గణనీయం గా పెరిగిపోయింది. పిల్లల చదువులు,పిల్లల పనులు, సామాన్లు తేవడం, డ్రైవింగ్, బిల్లులు, మెట్రో ల్లో చాలా కుటుంబాల్లో వంటింట్లో.. కూడా మగవారి పాత్ర ఖచ్చితం గా పెరుగుతోంది."
మీకు నిజంగా అర్థం కావడం లేదా, లేక మరీ చాలా మంచిగా, అమాయకంగా వున్నారా?
మగ వాళ్ళకీ, ఆడ వాళ్ళకీ బయట విషయాల వల్ల వచ్చే సమస్యలు సమానం గానే వుంటాయి. ఆడ వాళ్ళకి మగ వాళ్ళ వచ్చే సమస్యలు అదనంగా వుంటాయి. అలా, మగ వాళ్ళకి ఆడ వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు లేవు. ఇక్కడ జనరల్ పరిస్థితి మాట్టాడాలి గానీ, అక్కడా, ఇక్కడా వున్న చెడ్డ ఆడ వాళ్ళ గురించి కాదు. మగ వారి పాత్ర ఖచ్చితంగా పెరగడానికి కారణం, ఆడ వారు అర కొరగా అయినా కాస్త కళ్ళు తెరవడం, మగ వారు కొంచెమన్నా మారక పోతే బండి నడవదు అని అర్థం చేసుకోవడం, వగైరాలు. ఎక్కువగా "మగ పనులు", "ఆడ పనులు"గా మారుతున్నాయి. చాలా తక్కువగా, "ఆడ పనులు", "మగ పనులు"గా మారుతున్నాయి. "ఎండుకులే సంసారంలో అనవసరంగా గొడవలు, సర్దుకు పోయి ఎక్కువ పని చేసేస్తే పొలేదూ?" అని ఆడ వాళ్ళు అనుకోవడం వల్లా, ఆ ఆడ వాళ్ళకి, తమ "గొప్ప తనానికి" భంగం కలగనంతవరకూ, ఈ మగ వాళ్ళు "స్వేచ్ఛా,స్వాతంత్రాల" నిచ్చేయడం వల్లా, ఈ కాస్తన్నా జరుగుతూ వుంది. రాబోయే కాలంలో ఇంకా మారతారు లెండి. ముందరగా కష్టాలు అనుభవిస్తున్న ఆడవాళ్ళే మారతారు.
**Anonymous March 10, 2013 at 7:32 PM
@మహిళకు ఓ దినం అంటూ పెట్టారు,
ఇక్కడ ఒక రోజు అని పెట్టి మహిళల్ని ఉద్దరించినది ఏంటో ?
@ మగాళ్ళు ఏమన్నా మాకోదినంకావాలంటూ హడావుడి చేస్తున్నారా?
'మే' దినం చాలదూ?
"మే దినం" మగ వారికి మాత్రమే కాదు, ఆడ వారికి కూడా.
మే డే లానే ఉమెన్స్ డే కూడా మగవాళ్ళు పంచుకోవచ్చు. అస్సలు మొహమాటం అవసరం లేదు.
"మే డే" అనేది శ్రామికులకి. అంటే, ఆడ శ్రామికులకీ, మగ శ్రామికులకీ కూడా. ఆడ వారూ, మగ వారూ ఇద్దరూ పని చేస్తారు కదా? అందుకని.
"ఉమెన్స్ డే" అనేది ఆడ వారికి మాత్రమే. ఎందుకంటే, వీరికి మగ వారి వల్ల అదనంగా శ్రమ చేయాల్సి వస్తుంది. ఆడ వారికున్న ఈ పరిస్థితి మగ వారికి లేదు. కాబట్టి "ఉమెన్స్ డే"ని పంచుకోవడం కుదరదు. :-)
మీ బ్లాగ్ చాలా భాగుంది. "ఆడవారికి ఒక స్పెషల్ డే" అన్నదే ఒక డిస్కషన్ పాయంట్. :-)
మార్నింగ్ లెగిచిన దెగ్గరి నుంచి నైట్ దాకా ప్రతి ఒక్కరి దెగ్గరినుంచి మన నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి.
ఎండ్ ఒఫ్ ద డే అందరూ హ్యాపీ అయితే మనము హ్యాపీ. కానీ మనము హ్యాపీ అయితే అందరు హ్యాపీ నా అంటే డౌట్.
But we still consider our day as "బ్యూటిఫుల్". That is our beauty, I feel.
Wow! asalu kallaki kattinattuga undandi..nijame andi asalu adi oka rojula ledu.. ammo oka rojula iini feelings, emotions and thoughts tho gadusthunda mana life anipinchindi..:) nenu blogging world ki kottha just ninna ne entry icchanu.. ika ivalti nunchi mimmalini follow aipotha.. loved the way u write :)
please write something...
even the small post is also OK...
I came to know your blog 3 days back from then I didn't close it In my tab. I am just reading and reading all the posts not yet completed just became your fan thanks for sharing your ideas
Vidya
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.