Thursday, November 7, 2013

ఈలా మరీ ఇంత బేలా?


“కాటం రాయుడా.. కదిరి నరసింహుడా.. “ యూట్యూబ్ లో వినీ, వినీ, చూసీ, చూసీ, అత్తారింటికి దారేదో తెలుసుకుని తీరాలని ఘట్టి నిర్ణయం తీసుకున్నాను.  ఈలోగా పోస్టర్లలో చిద్విలాసం గా ఒక పెద్ద గద పట్టుకుని  రామయ్య ని చూసి ఆయన కూడా వస్తాడేమో కనుక్కుని అత్తారింటికి  దారి వెతుక్కున్నాను. 

ఈ సినిమాలు ఎలా ఉన్నాయో .. పుంఖానుపుంఖాలు గా  రకరకాల భాష్యాలు చూస్తూనే ఉన్నాము.  అది వదిలేస్తే, ఆ సినిమాల్లో ఆడవాళ్ల పాత్రలు ఎంత విచిత్రం గా ఉన్నాయో.. ఆశ్చర్యం వేస్తోంది.  కనీస స్థాయి విలువలని కూడా పాటించలేదనిపించింది.  రెండు సినిమాల్లో ఒక్కో పాత్ర కొద్దిగా బెటర్. మిగిలినవన్నీ మహా బేవార్స్.

“అతి పెద్ద హిట్ “ గా శ్లాఘించబడుతున్న ‘అత్తారింటికి దారేది?” సినిమా లో చూస్తే.. ఓకే.. నదియా అత్తగారు. అద్భుతం గా నటించింది. టిపికల్ తెలుగు సినిమా అత్త లా కాకుండా, ఆవిడ వ్యక్తిత్వం ఇటు ఇంటి విషయాల్లో, బిజినెస్ విషయాల్లో ఉంది. బిజినెస్ లో ఓడిపోయే స్థితి కి వచ్చి ఉండవచ్చు గాక. అలాగే, తండ్రి పట్ల అంత తీవ్ర స్థాయి లో ఉదాశీనత, కటినత్వాన్ని ప్రదర్శించి ఉండవచ్చు గాక..  పిల్లలకి కొద్దిగా అయినా నేర్పించిందా?..  తన పిల్లలు ఎంత వెకిలి గా, బుర్రలేని అమ్మాయిల్లా ప్రవర్తించారు? సమంతా పాత్ర లో కొద్దిగా అయినా, ఒక రవ్వంతైనా తెలివి  కనిపించిందా? అసలా పిల్ల చదువుతోందా? ఉద్యోగం చేస్తోందా? తల్లి బిజినెస్ పడిపోతుంటే.. తల్లి ఏదో కష్టాలు పడుతోంది కానీ, కనీసం ఏం జరుగుతోందో.. ఆ పిల్లకి తెలుసా?  హీరోయిన్లకి అంతకి మించి తెలివి కానీ, వ్యక్తిత్వం కానీ కమర్షియల్ చిత్రాల్లో ఉండకూడదేమో..

ఇక “రామయ్యా వస్తావయ్యా!” లో సీనియర్ నటి రోహిణి హట్టంగళి పాత్ర ఏ ఒక్క తెలుగు వారికైనా నచ్చిందా? ఆ దర్శకుడు, హీరో, రచయిత, నిర్మాత, (ఇంకా ఎవరెవరికి ఈ పాత్ర చిత్రీకరణ లో జోక్యం ఉంటుందో తెలియదు)  ఏ ఒక్కరికీ ఏహ్యం గా అనిపించలేదా? లేక నేనే కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అని ఆశ్చర్యం వేసింది.  ఒక ఎనభయ్యేళ్ళ వృద్ధురాలు,  తన వయసుని దాచుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూ, “బామ్మా.. అని వద్దు.. బేబీ’ అని పిలువు అని వెఱ్ఱి గా ప్రవర్తించడం..  ‘నా కలల రాజకుమారుడివి నీవే’ నని మనవరాలి వయసున్న హీరో తో వెకిలి గా ప్రవర్తిస్తూ, గుండె నొప్పి వచ్చేదాకా గంతులేయడం..  ఏవిధమైన కామెడీ అది?  రోహిణి చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఏమైనా ఉందేమో..  ఇలాంటి పాత్ర ఒప్పుకుంది.. అనిపించింది.  శృతి హాసన్ పాత్ర చూస్తే.. పాత్ర చిత్రీకరణ బాగానే ఉంది అయితే  అంత ఫుల్ మేకప్ తో, పాశ్చాత్య దుస్తుల్లో పల్లెలో తిరుగుతూ టీచర్లు ఉంటారా? మా బెంగుళూరులో MNC లో మార్కెటింగ్, సేల్స్, HR లలో కూడా అమ్మాయిలు అంత పాష్ గా తయారవడం గత ఆరేళ్లుగా చూడలేదు నేను..  ఇంటర్నేషనల్ స్కూళ్లల్లో టీచర్లయినా  అలా ఉన్నారా?   సమంతా పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.  అంత పెద్ద డాన్ కూతురు..  చిన్న చిన్న బ్లాక్ మెయిళ్ళకి లొంగిపోయి, తన పిచ్చి బామ్మ తో గెంతులాడిన మనిషి లో మానవత చూసి  అకస్మాత్తు గా ప్రేమించేస్తుందా? అలాంటి పిల్ల, తండ్రి ఎంత పెద్ద విలనో తెలుసుకుని  హీరో కుటుంబాన్ని, ఒక ఊరి జనాలని ఊచకోత కోసిన దుర్మార్గుడా అని బాధ పడి, ప్రాయశ్చితం గా   తన పరివారాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసిన హీరో ని పెళ్లి చేసుకుని హీరో మాజీ ప్రియురాలి ఆశయాన్ని నెరవేర్చడానికి పల్లెకి వెళ్లి టీచర్ అయిపోతుందా? భేష్!! ఒక్క సారి గా 180 degree tilt in character, అంత గొప్ప ఉదారత, నాలాంటి సామాన్యులకి సాధ్యం కాదు.

తల బొప్పి కట్టేసింది..  కొత్త తెలుగు సినిమాలు చూసి వాటిల్లోని పాత్రల ఉచితానుచితాల చర్చలు చేయకూడదనుకున్నాను.. కానీ, అన్నీ ఇలాగే ఉంటున్నాయా?ఈమధ్య ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి పాత్ర అన్న మాట ఒకటి గుర్తొచ్చింది.. “నేను  ప్రేమ కోసం మరీ అంత మొహం వాచిపోలేదు. నాకు కావాల్సింది కొద్దిగా రెస్పెక్ట్..’

సరే.. జనాలందరూ “Lunch Box” అని తెగ  ఉత్సాహ పడిపోతున్నారు.. ఆస్కార్స్ కోసం ప్రత్యేకం గా తీసిన సినిమా  అని  విని ప్రత్యేకం గా చూసాను.  UTV productions, కరణ్ జోహార్ .. అనురాగ్ కశ్యప్ అబ్బో పెద్ద పేర్లు..   ఇర్ఫాన్ ఖాన్, కాద్బరీస్ సిల్క్ ఆడ్ లో  కార్ లో కూర్చుని తినే అమ్మాయి,.. 

అద్భుతమైన నటులు, కళ్ళు చెమర్చే సంఘటనలు, చూస్తేనే తినాలనిపించే వంటలు, .. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా పకడ్బందీ గా తీసిన విధానం.. అంతా ఓకే..  కానీ నాకు ఒకటి మాత్రం నచ్చలేదు...  

‘ఈలా’ పాత్ర.  ఆమె గురించి స్థూలం గా చెప్పాలంటే.. ఈలా ముంబై లో ఒక గృహిణి, ఏడెనిమిదేళ్ల పాప,

కారీర్/వేరే ఎఫైర్ వల్ల మాటలతోనో, భౌతికం గానో కష్టపెట్టకపోయినా  పూర్తి గా ఇగ్నోర్ చేసే భర్త.    పై పోర్షన్ లో ఆంటీ తో కలిసి వంట చేసుకుంటూ,  పాప ని పెంచుతూ,.. “నిస్సారం” గా జీవితాన్ని ఈడుస్తూ ఉంటుంది.  పుట్టింటి వైపు వారి పరిస్థితి అంతంత మాత్రమే. ఆమె తమ్ముడు మార్కులు తక్కువొచ్చాయని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కి అనారోగ్యం.  మందులు  కొనుక్కోవడానికి తడుముకోవాల్సిన  ఆర్ధిక స్థితి.  కూతురు దగ్గర్నించి ఏం తీసుకుంటాం.. అదే కొడుకుంటే ఆదుకునే వాడు అని నిట్టూరుస్తూ..

ఈలోగా ఓ పూట కాస్త “స్పెషల్’ గా భర్తని “ఇంప్రెస్” చేయాలని భోజనం  తయారు చేసి డబ్బా వాలా తో పంపుతుంది. అయితే అది 99.999% accuracy అని పేరు గాంచిన ముంబై డబ్బా వాలా ఎప్పుడో గానీ చేయని తప్పు వల్ల ఇర్ఫాన్ ఖాన్ కి వెళ్తుంది. ఆయన కష్టాలు ఆయనకున్నాయి. ముప్ఫై అయిదేళ్లు గా చేస్తున్న ఉద్యోగం పట్లా, నా అనే వాళ్లే లేని జీవితం పట్లా వైరాగ్యం పెంచుకుని ముందస్తు పదవీ విరమణ చేయడానికి నిశ్చయించుకుంటాడు. ఉద్యోగం లో అది ఆయన కి ఆఖరి నెల.  ఈ డబ్బా ఆయన జీవితం లో ఒక చిన్న ఆశారేఖ. చపాతీల మధ్య చీటీల ద్వారా క్రమం గా వారి మధ్య స్నేహ బంధం ఏర్పడటం,..   కలుసుకోవాలనుకుని నిశ్చయించుకుని మళ్లీ ఇంకో ఆలోచనల తో విరమించుకోవడం.. ఈలా తో పరిచయం వల్ల ఇర్ఫాన్ జీవితం లో మార్పులు, ఉప కథ గా మోజియుద్దీన్ కి ఇర్ఫాన్ తన పదవీ బాధ్యతలు ఇవ్వడం, అతని పెళ్లి,  కథ అలా అలా సాగిపోయి చివరకు వాళ్లు కలుస్తారా? లేదా? అన్న ప్రశ్న ప్రేక్షకులలో నిలిపి ఆపేయడం..   

బాగానే ఉంది, కానీ ఏదో వెలితి.

ఈలా పాత్ర పట్ల సానుభూతి వస్తుంది అని ఒకటి రెండు రివ్యూలలో చదివి,  క్యూరియాసిటీ తో ఈ సినిమా మీద వచ్చిన (గూగుల్ ద్వారా వెతుక్కోగల్గిన) ప్రతి రివ్యూ లోనూ ఇదే మాట..  

ఎలా సానుభూతి వచ్చింది ప్రతివారికీ?

తల్లిదండ్రుల తో ఆమె అనుబంధం.. 

ఈలా తల్లిదండ్రులకి అంత ఆర్ధిక ఇబ్బందులున్నప్పుడు ఆమె తప్ప వేరే పిల్లలు వారికి లేనప్పుడు,  తండ్రి మందులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఈలా ఏమీ చేయకుండా,..కనీసం భర్త దగ్గర ప్రస్తావన కూడా తేకుండా.. ఎలా ఉండగల్గింది? ఏం? కనీసం నాలుగు డబ్బాలైనా చేసే అమ్మే పని పెట్టుకుని తల్లిదండ్రులకి సహాయ పడలేదా? తల్లి కున్న పాటి నిబ్బరం ఆమెకుందా? అనారోగ్యపు భర్త, ఆత్మహత్య చేసుకున్న కొడుకు,  ఈలా లాంటి కూతురు, పైసా చేతిలో లేకపోయినా ‘ఏం పర్వాలేదు.. మా సంగతి మేము చూసుకుంటాం.. ఆడపిల్ల వాళ్లం.. మీ ఆయన్నేమడుగుతాం? నువ్వు జాగ్రత్త.. “ అని చెప్తుందే?

సరే అయిందేదో అయింది. తండ్రి పోయాడు.  కూతురిని తీసుకుని ఎక్కడికో పోదామనుకుంటుది తప్ప  ఒంటరి గా మిగిలిన తల్లి గురించి ఆలోచించినట్లు ఎక్కడా కనిపించదు.

భర్త తో కమ్యూనికేషన్

సరే..భర్త తనని పూర్తి గా ఇగ్నోర్ చేస్తున్నాడు,  పైనింటావిడ కీ, డబ్బాల్లో ఉత్తరాల ద్వారా పరిచయమైన ఇర్ఫాన్ కీ చెప్పుకుంటూ, కాలం గడిపేస్తుంది తప్ప ఎందుకు? అని నిలదీసినట్లు కనిపించదు.  (బహుశా..  అందంగా తయారయి భర్తని ఆకర్షించాలనిచేసే ప్రయత్నాలు చూపించారు గా? అని అడగవచ్చేమో).  చిన్న మాట గా అయినా ఒక్కసారి అడిగి చూడకుండా.. , కనీసపు ‘హింట్’ ఇవ్వకుండా ఇల్లు వదిలిపోయే నిర్ణయం తీసుకోవడం..  సరిగ్గా లేదనిపించింది.

ఇర్ఫాన్ తో అనుబంధం..

ఆరోజు పొరపాటున డబ్బా భర్త కి కాకుండా వేరే మనిషి కి వెళ్లింది. దానితో ఒక చిన్న “థ్రిల్” కి గురయ్యి, క్రమం గా ఒక సంబంధం ఏర్పరచుకుంది. తన పరిస్థుతులలో ఆమె కి అంతకు మించి “లెట్ అవుట్” బహుశా లేకపోవచ్చు. ఓకే. అలాగే భర్త ని వదిలి ఇంటి బయటకి వచ్చే నిర్ణయం కూడా ఆమెకి సరైనదే అనుకుందాం.. ఇర్ఫాన్ ఆమెకి ఉత్తరాల ద్వారా తప్ప తెలియదు. ఏ విధమైన ధైర్యం తో వచ్చేస్తోంది? అవతల పక్కనున్నది అద్భుతమైన ఉత్తరాలు రాయగల ఒక భయంకరమైన శాడిస్ట్ అయితే? ఉత్తరాల ద్వారా తన తల్లిని చూస్తానని కానీ, తన కూతుర్ని చేరదీస్తానని కానీ ప్రామిస్ ఏదైనా చేశాడా? బహుశా.. అంతర్లీనం గా  మనసు భాష ద్వారా చెప్పాడేమో?

ఇర్ఫాన్ తో వెళ్లిపోవడం లో చూపించిన ధైర్యం, తన చుట్టూ ఉన్న పరిస్థుతులని చక్కదిద్దుకోవడం కోసం చేసే ప్రయత్నం లో చూపించి ఉంటే.. ఎంత బాగుండేది?  ఇర్ఫాన్ అటూ ఇటూ ఊగిస లాడటం,.. “ఎస్కేపిస్ట్”  ఆలోచనల నుండి విముక్తి పొంది, జీవితం పట్ల ప్రేమ పెంచుకోవడం చూపించిన దర్శకుడు, ఈలా పాత్ర ని మాత్రం, అంత బేల గా చిత్రీకరించడం హాస్యాస్పదం.

నాకు పైన రాసిన తెలుగు సినిమాల్లో సమంతా, రోహిణి  పాత్రల తింగరిదనం కన్నా ఈలా పాత్ర బాధ పెట్టింది.  ఆయా సినిమాల్లో expectation కూడా లేకపోవడం, పట్టుదలతో ఆస్కార్ స్థాయి చలన చిత్రం తీశాం అని బీరాలు పోయినందువల్ల, అలాగే దాదాపు ప్రతి రివ్యూ లోనూ, అద్బుతమైన సినిమా గా శ్లాఘించబడ్డ సినిమా అవడం వల్లనేమో.. లేదా  చుట్టూ ఉన్న నిజమైన సమస్యలని ఎదుర్కుని నిలబడి పోరాడటం మాని, చిన్న పిల్ల పుస్తకం లో భూటాన్ లో ఎక్కడో ప్రజలు ఆనందం గా ఉంటున్నారనీ, ఇక్కడి రూపాయి అక్కడ ఐదు రూపాయలకి సమానమని రాసారని అక్కడకి పారిపోయే పలాయన వాదాన్ని, బేలదనాన్ని “గ్లోరిఫై” చేసినందుకేమో L

33 comments:

DV Satya Prasad said...

First time I read a post in such serious tone from you. Looks like you don't watch Indian movies frequently :).

DV Satya Prasad said...

I never read such serious tone in your posts before. Looks like you're really hurt by the unrealistic depiction of women in these movies. I've stopped looking for sense/logic in movies long back be it bolly/tolly/holly

Krishna Palakollu said...

Great to see a post again after a while.Content is good as usual.
and no comments on your questions as they are genuine :-)

నాగరాజ్ said...

బాగా రాశారండి. మీరు పాత్రల్ని వాస్తవికంగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన తీరు చాలా బావుంది. ఇప్పుడు సినిమాల్ని క్రిటికల్ జడ్జ్ చేసేవాళ్లు మీడియాలో సైతం బాగా తగ్గిపోయారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, సినిమా ప్రొడ్యూసర్స్ డబ్బు వెదజల్లుతూ మీడియాని, రిపోర్టర్లనీ భయంకంరగా మేనేజ్ (ఇన్ ఫ్లూయెన్స్) చేస్తున్నారు తమ సినిమాకు హిట్ టాక్ వచ్చేలా రివ్యూలు చేయమని. Very pathetic affairs!

tejaswi said...

ఆ డైరెక్టర్ గురించి ఎక్కడో చదివాను...డబ్బావాలాలజీవితాన్ని గమనిస్తూఉండగా ఈ కథలైన్ స్ఫురించిందిట. కాబట్టి ఆ లైన్‌చుట్టూ అల్లుకున్న కథకాబట్టి మరి ఇలా అలా దర్శకుడు చెప్పినట్లు ప్రవర్తించిఉండొచ్చు.

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

Thank you Krishnapriya garu. I second your opinion.

Vijay Reddy said...

Attarindiki Daaredi & Ramayya vastha vayya.. ..
your opnion is good. i felt same..

రాధిక(నాని ) said...

బాగుందండి పోస్ట్

Vanaja Tatineni said...

విశ్లేషణాత్మకంగా చాలా బాగా వ్రాసారు. బావుంది . రెండు సినిమాలు కూడా స్త్రీలని గౌరవనీయంగా చిత్రీకరించలేదు ఈలా నిజంగా బేల గానే ఉంది.

Anonymous said...

మీరు మరీను. పాత్రలు ఔచిత్యాలు అని బాధపడిపోతున్నారు. సినిమాలుతీసేవాళ్ళే గౌరవనీయమైన వ్యక్తులు కారని నాదోఅభిప్రాయం. వాళ్ళందరి దృష్టిలో ప్రేక్షకులూ గౌరవనీయమైన వ్యక్తులుకారు (మనమంతా మాస్ కదా!) ఇక అలాంటివాళ్ళు ఇలాంటివాళ్ళనుద్దేశ్యించితీసే సినిమాల్లో పాత్రలు ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు?

రామయ్యను చూడాల్సిన అవసరంలేదని రోహిణిగారి పాత్రను బట్టి తెలిసిపోయింది కాబట్టి దానిజోలికిపోలేదు. అత్తారు సినిమా గురించి నేనూ ఇలాగే ఆలోచించాను. కధానాయికల పాత్రలేకాదండీ కధానాయకుల పాత్రలుకూడా అలాగే ఉంటున్నాయి. జులాయివేషాలు వెయ్యని, రెక్కలకష్టంతో బ్రతికే, ఒకరిక్కాకున్నా ఇంకొకరికైనా ఆదర్శంగా ఉండగల పాత్రలేమున్నాయిప్పుడు? ప్రేక్షకులు తెరమీదిపాత్రలతో తమనుతాము పోల్చిచూసుకోవడానికి 'స్వైరత' ఒక మాధ్యమంగా తప్పనిసరిగా అవసరమౌతోందిప్పుడు.

-R

Anonymous said...

Krishna Priya gaaru

Asusual another good post from you !
I recently read actress Anushka statements in a news paper she is saying that she will not do the powerful roles like Rudramadevi, Arundati etc. and she would prefer to hold on to heroes and dance with them.Quick, easy work and quick money. not only her, most of the current actresses voiced same opinion.
If so is the current actresses mindset, what else can we expect.

Thx
Surabhi

తృష్ణ said...

ఇందాకా(రెండుమూడు గంటల క్రితం) కామెంట్ రాసానండి.. మిస్సయిందేమో...:(
పై తెలుగుసినిమాల్లో ఒకటి చూసా, ఒకటి చూడలేదు.. వాటి గురించి పెద్దగా చెప్పేదేం లేదు.. "లంచ్ బాక్స్" మాత్రం మమ్మల్ని పూర్తిగా నిరుత్సాహపరిచింది..:( అందుకే ఇంక బ్లాగ్లో రాయలేదు. ట్రైలర్ వచ్చిందగ్గర్నుంచి ఎంతో ఆత్రంగా ఎదురుచూసాం..చాలా రోజులకు గాని కుదరలేదు చూడడం.. మీరన్న పాయింట్లే! అతికొద్ది పరిచయంతో అలాంటి భావం + నమ్మకం ఎలా ఏర్పరుచుకోగలదామె? అని! అసలు బేసిక్ ప్రశ్న నాదింకోటి ఉంది..ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్లు ప్రతి స్నేహాన్నీ చివరకు ప్రేమ దగ్గరకు తీసుకువచ్చి ఎందుకు వదులుతారో ఈ కథారచయితలు.. అసలు స్నేహాన్ని స్నేహంలాగ ఉంచకూడదా? ఎలాగోలా ముడిపెట్టే తీరాలా? చాలా కథల్లో, సినిమాల్లో నాకు అర్థంకానిదీ, నచ్చని పాయింట్ ఇదే!!

Anonymous said...

*ఇర్ఫాన్ ఆమెకి ఉత్తరాల ద్వారా తప్ప తెలియదు. ఏ విధమైన ధైర్యం తో వచ్చేస్తోంది? ఇర్ఫాన్ తో వెళ్లిపోవడం లో చూపించిన ధైర్యం, తన చుట్టూ ఉన్న పరిస్థుతులని చక్కదిద్దుకోవడం కోసం చేసే ప్రయత్నం లో చూపించి ఉంటే.. ఎంత బాగుండేది? అవతల పక్కనున్నది అద్భుతమైన ఉత్తరాలు రాయగల ఒక భయంకరమైన శాడిస్ట్ అయితే? ఉత్తరాల ద్వారా తన తల్లిని చూస్తానని కానీ, తన కూతుర్ని చేరదీస్తానని కానీ ప్రామిస్ ఏదైనా చేశాడా*


భలే రాశారండి కృష్ణ ప్రియ గారు. ఒక నడివయసు మధ్యతరగతి మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించారు. మీరు రాసింది చదివితే, స్రీలు ఎంత ముందు జాగ్రత్త గా ఆలోచిస్తారో అర్థమౌతుంది. ఒక స్రీ తో కలసి ఉండాటానికి పురుషులు ఎన్ని రకాల బాధ్యతలను నెత్తిన వేసుకోవాలో కూడా బాగా చెప్పారు. ఇర్ఫాన్ శాడిస్ట్ కాకుండా ఉండాలి, ఆమే తల్లిని చూడాలి, కుతుర్ని చేరదీయాలి. అంతేనా, లేక ఆమే స్నేహితులను ఇంటికి వస్తే సరిగా ఆదరిస్తాడా? వంట పని లో సహాయం చేస్తాడా? అన్నం తిన్నాక కంచం కడుగుతాడా? లేక మొదటి మొగుడిలాగా కంచం ఎత్తకుండా, తిన్నచోటే పడేసివెళతాడా? స్నానం చేసిన తరువాత తడి టవల్ ను పక్క మీద వదిలేసి వేళిపోతాడా లేక బయట అరేస్తాడా? ఇర్ఫాన్ , సల్మాన్ ఖాన్ లాగా అందగాడో కాదో, మంచి కండలు ఉన్నాయోలేవో మొదలైన విషయాల గురించి తెలుసుకోకుండానే, అతనితో వెళితే ఎలా? అని ఈలా పాత్రను చూసి గుబులేసింది కాబోలు! :)

RAW DATA

కృష్ణప్రియ said...

RAW DATA,

ఎస్. శాడిస్ట్ కాకుండా ఉండాలి.. ఆ అమ్మాయి తల్లినీ, కూతురినీ గాలి కి వదిలేసి కేవలం ప్రేమలో కూరుకుపోయి బ్రతక లేదు కదా? ఆమె కి బాధ్యతలు లేకపోతే ఓకే. ఆమె జీవితం ఆమె ఇష్టం.. వెళ్ళనూ వచ్చి, నచ్చక పొతే తిరిగి వచ్చేసి తన జీవితం తను హాయిగా బ్రతకవచ్చు. కానీ కూతురిని తండ్రి నుండి విడదీసే హక్కు ఉందా?
అయినా.. ఇర్ఫాన్ శోభన్ బాబు లా గోరింటాకు పెట్టుకుంటే అన్నం ముద్దలు నోట్లో పెట్టి జడేస్తాడా?, సల్మాన్ లా బట్టలు ఆరేసేటప్పుడు దాంట్లోంచి ‘శుభ్రం’ తాలూకు సువాసన వస్తుందా లేదా అని చూస్తాడా? ఇవన్నీ చూసుకుని తీరాలి అని నేననలేదు..
ఎక్కడో భూటాన్ లో ఇక్కడి ఒక్క రూపాయకి ఐదు రూపాయలని, అక్కడ ఆనందం ఉందని నమ్మి, లేదా కేవలం ఉత్తరాల ద్వారా పరిచయమైన ఒక ముక్కూ మొహం తెలియని మనిషి తో ఏర్పడిన మానసిక బంధం ఆధారం గా ఇల్లు వదలాలని తీసుకున్న నిర్ణయం తీసుకున్న ధైర్యం లో వందో వంతు తన పరిస్థితులు చక్కదిద్దుకోవడం లో చూపించినా బాగుండేదని భావిస్తాను.
ఆర్థికం గా ఏఆధారం లేని తల్లి కి కొడుకు ఆత్మహత్య చేసుకుని, తండ్రి జబ్బుతోనూ పోయారు. ఇప్పుడు ఈవిడ పారిపోయి ఆవిడ ని పూర్తిగా ఒంటరి గా వదిలేసి తన దారిని తాను చూసుకోవడం నేనైతే హర్షించలేను.
భర్త దగ్గర తన బాధని కనీసం ఒక్కసారైనా ప్రస్తావించకుండా, ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కూడా.
On a lighter note, ఇక రిటైర్మెంట్ కి దగ్గర పడ్డ సీనియర్ సిటిజన్ ఇర్ఫాన్ అని ఆమెకి తెలుసు,.. కండలూ అవీ పెంచి, కంచాలు కడిగి, తడి తువ్వాలు బయట ఆరేస్తే మరీ మంచిది  తల్లీ, కూతురూ గంగలో దూకితే మాత్రం ఏంటి?.. :)

కృష్ణప్రియ said...

తృష్ణ గారూ,
నేనూ అదే ఆశ్చర్య పోయాను. కానీ పాత పోస్ట్ లో రాసినట్లున్నారు. అక్కడ వచ్చింది. Love at first sight.. అనీ, ఒక్క వీకెండ్ లో ఏళ్ల తరబడి ప్రేమిస్తున్న?) నిర్ణయం మార్చుకునే సినిమాలు బోల్డు చూస్తున్నాం. ఇక్కడ ఈలా కి స్నేహం మాత్రమే కావాలనుకుంటే పై ఇంటి “ఆంటీ” ఉంది. ఇది వీరిద్దరి మధ్య డబ్బావాలా మాధ్యమం తో జరిగిన ప్రేమ కథ తీయాలనే తీసారు. కాబట్టి నాకు ఈ విషయం లో no complaints.
అయితే సినిమా స్నేహాల విషయం లో నేనూ మీతో ఏకీభవిస్తాను. ఆడ, మగ మధ్య చూపించే ప్రతి స్నేహాన్నీ, ప్రేమ వైపు మళ్లించో, లేక ఒకళ్ల మీద ఒకళ్లు పడి కొట్టుకుని, పాటలు పాడుకుని, కొట్టుకుని, రక్కుకుని దొర్లించో,.. కానీ చూపించరు. 
>>>>డబ్బావాలాతో చివరిలో పోట్లాడేది మొదట్లోనే ఇదేంటి అని పోట్లాడదా? ఆ భర్త మాత్రం తన ఇంటి క్యారేజ్ కీ, బయట క్యారేజ్ కీ తేడా తెలియకుండా అన్ని రోజులు ఎలా ఉన్నాడు?
.. ఆమెకి ఒక చిన్న చేంజ్, థ్రిల్ కావాలనుకుంది.. అందుకనే థాంక్స్ నోట్.. అండ్ సంభాషణలు పొడిగించడం.. ఆ తర్వాత అదొక ఎమోషనల్ బాండ్ అయిపొయింది ఆవిడకి. భర్త కారక్టర్ ని కొద్దిగా ambiguous గా కావాలనే వదిలేసినట్లున్నారు.
టెక్నికల్ గా ఆస్కార్ కెళ్లే అంత నాణ్యత ఉంది, ఫిలసాఫికల్ టచ్ ఉంది.. అదంతా ఓకే.
ఈలా పాత్ర ఆడా? మగా? లేక ఇలాంటి ప్రేమ లో పడటం లో ఉచితానుచితాల గురించి మాట్లాడటం లేదు. ఈలా పాత్ర లో ఇర్ఫాన్ ఉండి, ఇర్ఫాన్ పాత్ర లో ఈలా ఉంటే తప్పక ఇర్ఫాన్ నే విమర్శించేవాళ్లం.. ముందున్న పరిస్థుతులని చక్కదిద్దుకునే కనీస ప్రయత్నం చేయకుండా.. ఎక్కడో భూటాన్ కి పరిగెత్తే మనిషి ఈలా.ఇలాంటి వాళ్ళుండరని కాదు. కోకొల్లలు గా ఉండవచ్చు గాక. ఇదంతా గ్లోరిఫై చేయడం నాకు రుచించలేదని చెప్పాలనే ఈ పోస్ట్.

కృష్ణప్రియ said...

సత్య ప్రసాద్ గారు,
:) అవునా? ఇదివరకు సీరియస్ విషయాలు టచ్ చేశాను కానీ, సీరియస్ టోన్ లో రాయడం తక్కువ. సినిమాలు బానే చూస్తాను. కొత్తా,పాతా, తెలుగు,హిందీ, ఇంగ్లిష్.. అన్నీ. ఇదంతా ఒకే వారం లో మూడు సినిమాలు చూసిన ఎఫెక్ట్.
కృష్ణ గారు,
థాంక్స్. బులుసు గారు మొన్న మందలించారని ఏదైనా రాద్దాం అనుకుంటున్నాను.. ఈలోగా ఒకేసారి మూడు సినిమాల దెబ్బ తగలడం తో వాటిలో నాకు నచ్చని ఆడ పాత్రల గురించి రాద్దామని ఇలా... ఈలా గురించి రాశాను.
నాగరాజ్ గారు,
థాంక్స్. నిజమే. చాలా సార్లు రివ్యూలు చదివి వెళ్లి బలయిపోయాను. అయినా బుద్ధి రాదు 
తేజస్వి గారు,
కరెక్టే. ఇర్ఫాన్ పాత్ర, డబ్బా వాలాలు, ఇర్ఫాన్ అసిస్టెంట్, విజువల్స్, చూపించిన వంటలు.. ఒకటేమిటి.. అన్నీ నాకూ బాగా నచ్చాయి. except for Ila’s character.

విజయ్ రెడ్డి గారు,
కదా? విసుగేసింది.. వాళ్లని చూస్తుంటే..

రాధిక గారు,
థాంక్సండీ..

వనజ గారు,
థాంక్స్. మరీ స్త్రీలని గౌరవించేలా రాయక్కరలేదు. కనీస స్థాయి కన్సిస్టెంట్ చిత్రీకరణ అంటూ ఉండాలి కదా అన్నదే నా బాధ. నిజానికి ఈ తరం సినిమాల్లో హీరో హీరోయిజం చుట్టూ తప్ప, ఆడైతేనేం, మగైతేనేం, ఇతర పాత్రల చిత్రీకరణ మీద మెజారిటీ చిత్రాల్లో పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించట్లేదు.

కృష్ణప్రియ said...

అజ్ఞాత ‘R’గారు,
అవును. 100% agreed. ఇంతకీ.. స్వైరత అంటే ఏంటి?
సురభి గారు,
అవునా?  I can see her point. ఇంతోటి పాత్రలకి మళ్లీ సంభాషణలని నేర్చుకుని, హావ భావాలని ప్రదర్శించడం.. ఇదంతా వేస్ట్.. ఉడుక్కోవడం, కోపం గా హీరో నుండి జుట్టూ, ముక్కుపుటాలు ఎగరేస్తూ దూరం గా వెళ్లడం, హీరో గొప్పదనాన్ని చూసి తాదాత్మ్యం చెందడం, ఆయన కి తీరికున్నప్పుడు ఆయన తో డాన్సులు వేసి.. కొద్దిగా ఎక్స్పోజర్, కాస్త స్లిం గా ఉంటే చాలు :)

Ennela said...

చూడక్కరలేదన్న మాట!చెప్పి బతికించారు!

ఎగిసే అలలు.... said...

Krishna priya gaaru chaalaa baagundi mee review.. Attatintiki chustunappudu nakkudaa alaane anipinchindi:-):-)

Sujata said...

Krishna garu...

I agree with your views.. they are actually mine. Ramayya vastavayya was a total chi chi chi chi chi chi chi movie. I hated Jr.NTR to the core. Is this his taste ? Good that it has got a U/A Certificate and multiplexes didn't allow children to watch this epic wretched movie.

Lunch Box equally disappointed me. I don't know why this hype was created abt this non-entertaining, even meaningless movie. There are so many good movies to cheer up, after watching these two stupid movies. Please try watching 'Gandhi My father' or 'Swarna Kamalam' and lift your mood. Otherwise these dirty pictures will haunt you for a long time to come. Forget them.. Peeda kala laa.. marchipondi.


ఇందు said...

కృష్ణ గారూ,
ఎలా ఉన్నారు? :)

నేను చాల రోజులకి మీ బ్లాగు ఓపెన్ చేసాను :) చూడగానే ఈ పోస్ట్!! ఇంటరెస్టింగ్!

నాకూ సమంతా పాత్ర రెండు సినిమాల్లోనూ చిరాకేసింది. ఈ రెండు సినిమాలే కాదు... ఇలాంటివి ఈమధ్య కోకొల్లలు! ఇలా ఉంటేనే హీరొయిన్స్.. అవే సినిమాలు.హీరొయిన్ ని గ్లామరస్ గా చుపించినట్టు...లేదంటే ముసలి పాత్రలు. ఆ సినిమాలని చూసి.. బైట కూడ బుంగమూతి పెట్టి.. అమాయకంగా , తింగరిగా కనిపించడమే క్యూట్నెస్ అనుకునే అమ్మాయిలని చూస్తుంటే తప్పు ఎవరిదో అర్ధం కాదు నాకు! :( :(

ఇక మీరు చెప్పిన లంచ్ బాక్స్ నేను చూడలెదు... చూసే ఉద్దేశం ఇప్పుడు అస్సలు లేదు కాబట్టి నో కామెంట్స్. :)

Sensible Post :)

PRASAD said...

Great to see a post again ,please write posts at least 2 per month

శారద said...

ఇది నేనెలా మిస్ అయ్యానబ్బా...
తెలుగు సినిమాల్లో హీరోయినలని గురించి నో కామెంట్.
లంచ్ బాక్స్ సినిమా చూడాలని మా మధూ కూడా గోల పెడుతుంది. మీ రివ్యూ చాలా ప్రిసైజ్ గా వుంది. నాకు life in metro లో శిల్పా శెట్టి పాత్ర గుర్తొచ్చింది అది చదువుతూంటే. దాన్లో కూడా భర్త (కేకే మెనన్)ఇంకో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడానికసలేమీకారణం కనిపించదు, ఆమె కూడా ఎన్నడూ నిలదీసి అడగదు. ఇదీ దాన్లాగే అనిపించింది.
శారద

Swapna said...

కృష్ణ ప్రియ గారు...
Lunch box సినిమా నేను చూడలేదు కానీ... తెలుగు సినిమాల్లో heroines గురింఛి మటుకు నా మనసులో వున్న వ్యధ ని మీ post లో చూడగలిగాను.... ఈ మధ్య కలం లో చెప్పుకున్దామన్న ఒక్క మంచి హీరోయిన్ క్యారెక్టర్ కూడా లేదు... :(

Anonymous said...

"అత్తారింటికి దారేదీ" అన్న సినిమా తప్ప మిగిలిన సినిమాలు చూడలేదు, కాబట్టి వాటి గురించి సరిగా తెలియదు.

మీరు ఆ కూతుళ్ళ గురించి కొంచెమే చెప్పారు. పవన్ మొదటగా అక్కని ఇష్ట పడతాడు. ఆ అక్క, మరొకరిని ఇష్టపడుతోందని తెలిసి, చెల్లెలితో సరి పెట్టుకుంటాడు. మీకేమీ అనిపించ లేదా ఈ విషయం?

మొదటగా తాత పాత్ర. కూతురు తనకి ఇష్టం లేని పెళ్ళి చేసుకుందని ఆవేశ పడతాడు. ఆ ఆవేశంలో, "కూతుర్ని పొమ్మనడమో, అల్లుడిని కొట్టడమో, లేదా మరీ ఆవేశంగా అల్లుడుని పిస్తోలుతో కాల్చడమో" చెయ్యడు. అంత గొప్ప ప్రేమ తోనూ, కోపం తోనూ, కూతుర్నే కాలుస్తాడు. అల్లుడేమో భుజం అడ్డిచ్చి, ధైర్యంగా, కొద్దిగా అన్నా నొప్పి లేకుండా, భార్యని తీసుకుని బయటకి నడుస్తాడు. ఆ తాత వూరుకున్నాడా. కోడల్ని కాలుస్తాడు, "పొరబాటు" అంటూ. ఆ కోడలు మాత్రం, భుజం ఇవ్వలేక, ప్రాణాలే ఇచ్చేస్తుంది. అప్రయత్న పూర్వకంగా జరిగినా, అది మర్డరే. తల్లిని మర్డర్ చేసిన తాతని, మనవడు తెగ ప్రేమించేస్తూ వుంటాడు. ఒక మర్డర్ జరిగినా, చిన్న పోలీస్ కేసు కూడా వుండదు. డబ్బుతో మాఫీ చేయించినట్టున్నారు. ఈ తాత పాత్ర మాత్రం ఏ జన్మకీ క్షమార్హుడు కాదు.

సరే అత్త పాత్ర. వదిన మర్డర్‌కి గురైనా, చనిపోయిన విషయం బొత్తిగా, సినిమా ఫక్కీలో తెలియదు ఈవిడకి, అదే వూళ్ళో వుంటూ. భర్త భుజం గాయం తగ్గే వరకైనా ఆ వూళ్ళో, ఏ హాస్పిటల్‌ లోనో వుండాలి కదా? సరే, తెలియదు. చివర్లో, మేనల్లుడు తన తల్లి మరణం గురించి చెప్పాక, ఇంకా ఎక్కువగా తండ్రిని అసహ్యించు కోవాలి కదా? పైపెచ్చు, తనని బదులు, తన వదిన్ని తండ్రి చంపేశాడులే అని సంతోషం కాబోలు, పెద్ద పెట్టున తండ్రిని క్షమించేస్తుంది. ఎంత హీనమైన పాత్రో బాబూ ఇది. భర్తని ఇంట్లో కూర్చో పెట్టుకుని, చెడ్డ మనుషులతో బిజినెస్ చేసేస్తోందని, ఈ పాత్ర వ్యక్తిత్వం నచ్చేసిందా? ఈ మనిషికి ఒకటి సరిగా తెలిసేడిస్తేగా, కూతుళ్ళకి నేర్పించడానికి?

ఈ అత్త పాత్ర, తనకి నచ్చిన వాళ్ళని, ఇష్టపడి వుండొచ్చు. పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకుని వుండొచ్చు. అంత చదువుకుని, అంత సమర్ధవంతంగా బిజినెస్ నిర్వహిస్తూ వున్న మనిషి, ఆ విషయం గురించి, కనీసంగా నైనా తండ్రితో మాట్టాడాలి కదా? ఆ తండ్రి ఒప్పుకోక పోతే, అప్పుడు ఇల్లు వదిలి, ప్రేమించిన మనిషితో వెళ్ళి పోయినా అర్థం వుంటుంది. అలా కాకుండా, పెళ్ళి చేసేసుకుని, దండలతో ఇంటికి వచ్చి, ఆ తండ్రితో ఏదో పొగరుగా మాట్టాడుతుంది. ఆ పొగరు మాటలు మర్చిపోయాను.

ప్రతీ సినిమా ఒక వ్యాపారమే. ఎక్కువ మంది ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి, ఏమన్నా చూపిస్తారు. ఉచ్ఛ, నీచాలుండవు.

Anonymous said...

అనామక,
ఆవిడ మొదటనే చెప్పింది గదా! అన్ని సినేమాల లో అత్త పాత్ర లా కాకుండ, ఈ అత్త యాపారం చేస్తుందని. క్రిష్నక్కయ కి అది నచ్చేసింది. నేటి తరం ఆధునిక మహిళలలు పురుషులతో సమానం గా దూసుకుపోతున్నామను కొంట్టున్నారు. అందులోను వాళ్ల దగ్గర డబ్బులు ఉన్నాయి గనుక, ఆ వర్గ ప్రజల ఆకాంక్షలకు నచ్చే పాత్రను సృష్ట్టించి, దర్శకుడు ఎక్కడ అడవారిని పడగొట్టాలొ అక్కడ పడగొట్టాడు. వారి అహాన్ని తృప్తి పరచి, సొమ్ము చేసుకొన్నాడు.

Anonymous said...

"ఆ వర్గ ప్రజల ఆకాంక్షలకు నచ్చే పాత్రను సృష్ట్టించి, దర్శకుడు ఎక్కడ అడవారిని పడగొట్టాలొ అక్కడ పడగొట్టాడు. వారి అహాన్ని తృప్తి పరచి, సొమ్ము చేసుకొన్నాడు."

అక్షర లక్షలంటారే, అలాంటి మాటలు ఇవి. ఆణి ముత్యాల్లాంటి మాటలు ఇవి.

"ఇంగ్లీషు, వింగ్లీషు" సినిమా గురించీ, శ్రీదేవి పాత్ర గురించీ ఎంతో మంది ఎంతో రాశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా రాయని అంశం - శ్రీదేవి పాత్ర కున్న "ఆత్మ గౌరవం". ఈ అంశం ఎవ్వరికీ కనబడలేదు. ఎందుకంటే, ఎక్కువ మందికి ఈ అంశం తెలియదు.

"ఇర్ఫాన్ తో వెళ్లిపోవడం లో చూపించిన ధైర్యం, తన చుట్టూ ఉన్న పరిస్థుతులని చక్కదిద్దుకోవడం కోసం చేసే ప్రయత్నం లో చూపించి ఉంటే.. ఎంత బాగుండేది? " కృష్ణప్రియ గారు రాశారు.

పై మాటలు చాలా తప్పు మాటలు. ఈలా పాత్ర గురించి ఏమీ మాట్టాడలేను గానీ, ఒక స్త్రీ తన చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కదిద్దుకోవాలని అనడం సరైనది కాదు. ఆ పరిస్థితులను పాడు చేసింది ఎవరూ? ప్రతీ ఒక్కరూ చుట్టూ వున్న పరిస్థితులను పని కట్టుకుని పాడు చేస్తూ వుంటే, ఆ భార్య పాత్ర ధైర్యంగా చక్కదిద్దుకోవాలా? భార్యలకి ఇచ్చే అదనపు బాధ్యతలన్న మాట. మనుషులు మారరు. మారితే ఎవరికి వారే మారాలి నిజ జీవితంలో. అందులోనూ ప్రేమ రాహిత్యం అన్నది చాలా ఘోరమైన విషయం, ప్రేమ గురించి తెలిసిన వాళ్ళకి.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక పెద్ద వ్యాసం అయిపోతుంది. ఇక్కడికి వదిలెయ్యడమే ఉత్తమం. ఎవరి చైతన్యం కొద్దీ వారు అర్థం చేసుకుంటారు.

కృష్ణప్రియ said...

@ ఎన్నెల గారు,
:) లేదు చూడ౦డి మీకు నచ్చుతు౦దేమో?
@ఎగిసే అలలు,
అవునా? థా౦క్స్
@ సుజాత గారు,
మేమెళ్లిన సినిమా హాల్లో అలా౦టి రూల్స్ ఏమీ లేవు చూసుకోకు౦డా వెళ్లిన బాబతు సినిమా అది
@ఇ౦దు,
సూపర్ గా ఉన్నాను మీరు? నేను ఈ వ్యాఖ్యలు అన్నీ చూశాను కానీ సిస్ట౦ మార్చుకునే హడావిడి లో సమాధానాలు ఇవ్వలేక పోయాను
@ప్రసాద్ గారు,
థా౦క్స్! తప్పకు౦డా ప్రయత్నిస్తాను
@శారదగారు,
థా౦క్స్ నిజానికి ఇర్ఫాన్ ఖాన్ పాత్ర పర౦గా మాత్రమే తీసిన సినిమా ఇది అని నాకనిపి౦చి౦ది
@ స్వప్న గారు,
అవున౦డీ అమ్మాయిలని హీరో పాత్ర ని ఎలివేట్ చేయడానికి తప్ప వేరే గా మ౦చో, చెడో ఏదోక రక౦ గా చూపి౦చే సినిమాలు తక్కువ

కృష్ణప్రియ said...


@ anon1,

ఓకే. అత్తారింటికి సినిమా లోకి డీప్ డైవ్ చేయలేదు.

నిజానికి నదియా పెళ్లి చేసుకొచ్చిన సీన్ చాలా చాలా పాత టైప్ రొటీన్ సీన్. నీరసం వచ్చే సీన్. అలాగే నదియా అత్తింటివాళ్లందర్నీ కనుసన్నల్లో పెట్టుకోవడం, అందరూ గడ గడ లాడటం, అంత పెద్ద జాయింట్ ఫామిలీ లో భర్త తో సహా ఏ ఒక్కరూ ఆమెకి ఎదురు చెప్పలేని స్థితి లో ఉండటం..

భర్త భుజానికి గాయం చేశాడని తండ్రి ఇంటికేసి తిరిగి కూడా చూడకపోవడం.. కనీసం వదిన చావు విషయం కూడా తెలియకపోవడం, తండ్రిని వద్దనుకుంది సరే.. అన్న కూడా వద్దనుకొవడం.. దేన్నీ సమర్థించలేను.

పవన్ పాత్ర లో లోపాలు కోకొల్లలు.. ఎం ఎస్ నారాయణ పాత్ర ని కోపం వచ్చినప్పుడల్లా తన్నడం.. బ్రహ్మానందాన్ని ఏడిపించడం, అహల్య ఎపిసోడ్,.. క్లైమాక్స్ నాకు 'అత్తారింటికి దారేది ' ఏవిధం గానూ నచ్చలేదు.
అయితే ఈ టపా పరిధి లో కేవలం స్త్రీ పాత్రల చిత్రీకరణ కాబట్టి.. నేను సినిమా రివ్యూ కి ప్రాధాన్యత ఇయ్యలేదు.

అయితే.. మళ్లీ ఈ టపా మొదటి పారా చూస్తే.. నాకు నదియా పాత్ర తెగ నచ్చినట్లు కన్వే చేసినట్లు అనిపించింది. మీరు రైటే..

కృష్ణప్రియ said...

@ అనాన్ 2,

ఈ సినిమా ఎందుకు హిట్టయిందంటే.. నాకు కారణాలు స్పష్టం గా తెలియవు. అయితే.. వ్యాపారం చేసే పాత్ర కాబట్టి అత్త పార్ట్ నాకు లేక "డబ్బున్న/ మగవారితో సమానం గా దూసుకుపోవాలననుకునే వర్గానికో" బాగా నచ్చడం వల్ల సినిమా హిట్టయిందా? ఏమో.. రొటీన్ "అమ్మ" పాత్రలనుండి వేరుగా ఈ మధ్య కాలం అమ్మ పాత్రలు కొద్దిగా రిలీఫ్ గా ఉంటున్నాయి. అదే విధం గా అత్త పాత్రలంటే ఒక మార్క్ కి అలవాటు పడిపోయిన తెలుగు ప్రేక్షకులకి నదియా పాత్ర "డిఫరెంట్" గా అనిపించి ఉండవచ్చు.

ఆడ వాళ్లు చూడటం వల్ల ఈ సినిమా హిట్టయిందా? I doubt it

Mauli said...

ఒక టపా అయినా వేశారేమో అని బ్లాగ్ చూద్దును కదా ...ఉంది కానీ...:)


౧. అత్తారింటికి...

ఇక్కడ ఇద్దరు ...ఒకరు త్రివిక్రమ్..లెక్కల మాష్టారు...

ఈయనకి హీరోయిన్స్అంటే పెద్ద ఖాతరు లేదు..హీరోయిన్స్ లేకపోతే సినిమాలు హిత్తవ్వావు కాబట్టి అన్నట్లు మిగులు,తగులు రీలు లో హీరోయిన్ని ఫర్ములలో ఎక్కడో చోట వేస్తాడు..ఇక ఆ పాత్రలకి వ్యక్తిత్వము గట్రా లేకుండానే హీరో వెనక పడితే చాలు లెక్కకి ఆన్సర్(సక్సెస్) వచ్చేస్తుంది అని ఆయన ఘట్టి నమ్మకం..

౨. పవన్ కళ్యాన్...తనకి వరస ఫ్లాపులిచ్చిన తెలుగు జనం మీద బానే కక్ష తీర్చుకుంటున్నాడు..పెద్దగా కష్ట పడకుండా...తల తోకలేకుండా సీన్స్ తో సినిమాలు బంపర్ హిట్లు చేసుకోవచ్చని కనుక్కొన్న న్యూటన్ తమ్ముడు...
రెండోది చూడలేదు....

మూడో సిన్మా....మీ కామెంట్స్...మనలో ఉండే ద్వైదీ భావాన్ని కూడా చెప్తాయి.. ఇదే బ్లాగ్ లో ఇంతకూ మును చర్చ జరిగింది...సమస్యలను ఎదుర్కొంటూ కలిసే ఉన్నా అమ్మాయికి వదిలేస్తే మంచిది అనుకొన్నాము...ఇప్పుడు ఇక్కడే నిలబడి పోరాడలేదు అనుకొన్నాం...

ఆమె తల్లికి కొడుకు చనిపోయాడు కాబట్టి..ఈవిడకి బాధ్యతా ఉందనడం కొంచెం ఇబ్బందిగా ఉంది..బాధ్యతా...కొడుకులేనప్పుడే కూతురుకు ఉందా...ఉన్నపుడు ఎందుకుండదు... అలాగే పట్టించుకోకపోవడం వెనక బాధత ఇద్దరిదీను...

ఇక కూతుర్ని..తండ్రి దగ్గర వదిలేసి వెళ్ళినా... ఇలాంటి అభ్యంతరాలు ఉంటాయి...కలిసి ఉండడానికి ఎందుకు పోరాడలేదు అన్నది మీ సందేహం...అందుకే కదా చీటీ పెట్టింది :)..కాపోతే ఇంకో ఆప్షన్ వచ్చింది...సాధ్యా సాధ్యాలు బేరీజు వేస్కొని...తోచిన మార్గం ఎంచుకొంది..ఇదంతా కాదు కాని..ఈ ఆస్కార్ సబ్జెక్టులు అంటే...మురికివాడలు...వివాహిత స్త్రీలు ఇంకొకరితో వేల్లిపోయ్యే కధలేనా :D

Anonymous said...

" హీరోయిన్స్అంటే పెద్ద ఖాతరు లేదు.. మిగులు,తగులు రీలు లో హీరోయిన్ని ఫర్ములలో ఎక్కడో చోట వేస్తాడు"

మునుపటి తరంతో పోల్చుకొంటే, ఈ రోజుల్లో చిన్న నుంచి పెద్దవరకు అమ్మాయిలు/ఆడవారు బ్యుటిపార్లలకి వెళ్లి బొచ్చు గొరిగించుకొని ,ఫేస్ పాక్ లు వేసుకొంట్టూ అందంగా కనపడటానికి ప్రయత్నిస్తున్నారు.అలాగే ఉంట్టున్నరుకూడా. వాళ్లకి ఎది ఇష్టమో త్రివిక్రం అదే చూపించాడు. అంతేకాని నేటి కాలపు ఆధునిక మహిళలకు ఏ ప్రత్యేకత ఉందని, ఒక ప్రత్యేక పాత్ర క్రియేట్ చేయాలి. వారు నడిచే బాట అంతా పురుషులు వేసిన బాటే. అందువలన తివిక్రం పురుషపాత్రలను (రిస్క్ టేకర్స్)బాగా ఎలివేట్ చేసి, క్రియేటివిటి లేని థానాయక పాత్రలను చాలా అందంగా ఉండేవారిని హీరొయిన్ గా తీసుకొని సినేమాను అందంగా తీస్తాడు.

"ఇక ఆ పాత్రలకి వ్యక్తిత్వము గట్రా లేకుండానే హీరో వెనక పడితే చాలు లెక్కకి ఆన్సర్(సక్సెస్) వచ్చేస్తుంది అని ఆయన ఘట్టి నమ్మకం"

నమ్మకం కాదు అది నిజం. "అతడు" సినేమాలో త్రిష పాత్రతో ప్రయోగం చేసి విజయవంతం అయ్యాడు. కథానాయక పాత్రలకి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న, అందంగా లేకపోతే పట్టిచుకొనే వారు ఉండరు. వ్యక్తిత్వం అనేది స్రీ వాదులల అస్తిత్వ సమస్య, ప్రేక్షకులకు సంబందించినంత వరకు కథానాయక పాత్రల వ్యక్తిత్వం, తెలివితేటలు సామర్థ్యం పులుసు కాచుకోవటానికి కూడా పనికి రాదు.

HADOOP

Mauli said...

అయ్యో అజ్ఞతా .. మరందుకే లెక్కల మాష్టారు అన్నది. అయినా తప్పిన లెక్కలు కూడా ఉన్నాయి ..ఽవునవును రిస్క్ టేకర్స్ హీరోలే ... హీరో దయవల్ల సిన్మా అవకాసం వస్తున్న రోజులు మరి ...

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;