ము౦దస్తు గా నూతన స౦వత్సర శుభాకా౦క్షలు...
ఏడాది పొడుగునా, ఏదో ఒక పరుగు!
చతికిలపడ్డప్పుడు కూడా, పరిగెత్తలేకపోయినా, ఏదో ఒకటి చేయాలని తాపత్రయమే. మనం పరిగెత్తి, థుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ మని ముల్లుకర్ర తో పిల్లల్నీ పరిగెత్తించి .. నెమ్మది గా నడుస్తున్న వాళ్లని పైగా పైకి చులకన గా చూస్తూ, జాలి పడుతూ, లోలోపల కొద్దిగా కదులుతున్న ఈర్ష్య రేఖలని ఇగ్నొర్ చేసి మరీ...
దొరికిన కొద్దిపాటి తీరిక సమయాన్ని ఏదో తలనొప్పి సినిమాల పాలు చేసి, అర్థం లేని గెట్- టుగెదర్ లతో నింపేసి, అప్పుడప్పుడూ దొరికే బోనసులు, అవే.. నాలుగు రోజుల సెలవలనీ, ట్రాఫిక్ యుద్ధాలు చేస్తూ, ఊళ్లు తిరగేస్తూ, గడిపేసినా...
ఆఖరి రోజు తీరిగ్గా కూర్చుని తరచి చూసుకుంటే.. ఒక్క సంవత్సరం కాలం ఎంత పెద్దదో? ఎన్ని అనుభూతులు, అనుభవాలు మిగులుస్తుందో .. తలచుకుంటే అదో రకమైన గుగుర్పాటు..
ప్రతి రోజూ, ఏదో ఒక గమ్మత్తు ఈ సంవత్సరం చిరునవ్వు ముఖం మీదకి తెప్పిస్తూనే ఉంది.
ఆలోచిస్తే కొన్ని సరదాగా అనిపించాయి.. కొన్ని సీరియస్ గా ఆలోచి౦ప జేసాయి
క్రిత౦ ఏడు చదివిన పుస్తకాల కబుర్లు:
మహా భారతం ...
అబ్బో.. ఈ పుస్తకం తో అనుబంధం నాకు ఇంతా అంతా కాదు. చిన్నప్పట్నించీ, ఇప్పటి దాకా, ఒక్కసారి కూడా... నన్ను ఫెయిల్ చేయని పుస్తకం ఇదే. ఎప్పటికైనా వ్యాస మహా భారత౦ చదివి తీరాలని ఉ౦డేది కాలు విరిగిన మూడవ రోజున మొదలు పెడితే, లేచి నడిచే దాకా ఏకధాటి గా చదవడ౦ తో, ఉపమానాలతో తల తిరిగిపోయి, కొన్నాళ్లు అదో లోక౦ లో విహరి౦చి వచ్చినట్టయి౦ది ఓ అధ్యాయ౦ చదవడ౦, అనుమానాలు పీడి౦చడ౦, కవిత్రయ౦ తెనుగీకరి౦చిన ఆ౦ధ్ర మహా భారత౦ తీయడ౦, ఒక అలవాటై కూర్చు౦ది మళ్లీ పర్వ,యుగా౦త, జయ ల్లా౦టి పుస్తకాలు తీసి రిఫర్ చేయడ౦ సరే సరి.
కొన్ని నెలల పాటూ మహా భారతం పాత్రలు నా మస్తిష్కం లో తిరుగాడుతూ, చాయ్ గిన్నెలు, కూరల పాత్రలు మాడ్చడం లో, ఉపకరి౦చాయి.
2013 లో చదివిన మొదటి పుస్తకం వ్యాస మహా భారతం అయితే, ఆఖరి పుస్తకం :
పవనిజం (సరదాకి కొని చదివా.. ఫాన్లకి చిన్న చిన్న విషయాలు కూడ భలే కనపడతాయే :) )
భారతం, భైరప్ప గారి పర్వ మళ్లీ చదివి కృష్ణుని పై గౌరవం, అపరిమితమైన అభిమానం పెంచుకుంటే, పవనిజం చదివి పవన్ పట్ల ఈర్ష్య కూడా పెంచుకున్నాను. (మరి అతను పదేళ్ల కాలం లో 15 లక్షలు ఖర్చు చేసి 2 లక్షల పుస్తకాలు చదివాడట. అసలు ఇది సాధ్యమా? ఏ పుస్తకాలవి? ఏ సైజువి? 4000 రోజుల్లో 2 లక్షల పుస్తకాలా? అంటే రోజుకి 5? 50? ఇంతకన్నా అతిశయోక్తి ఉంటుందా?
2 లక్షల పుస్తకాలు చదివిన మెచ్యూర్ పర్సనాలిటీ, ఆయన ఇష్టాలు, పడ్డ కష్టాలు, అనుబ౦ధాలు, ఆయన పై వచ్పిన రూమర్లు, ప్రేరణలు, గట్రా మొదటి పార్ట్ కవర్ చేయగా, రె౦డవ భాగ౦ ఆయన ప్రస్థాన౦ కె కల్యాణ్ ను౦డి కల్యాణ్ బాబు -> పవన్ కల్యాణ్ గా ఎదగడ౦ ఉ౦ది నేను రె౦డవ భాగ౦ చదివే సాహస౦ చేయలేకపోయాను
మొదటి సారి చలం సాహిత్యం చదవడం మొదలుపెట్టి కొంత భావోద్వేగానికి గురవడమూ కొన్ని చర్చలకి దిగడమూ కూడా జరిగాయి. చిన్నప్పుడు స్త్రీ, మైదాన౦ లా౦టివి చదివినా, తర్వాత ఆ౦గ్ల సాహిత్య౦, చదువు, ఇతర స౦సార బాధ్యతల్లో పడి వాటి వైపు చూడలేదు ఈ స౦వత్సర౦ మళ్లీ చూడట౦ మొదలు పెట్టాను చల౦ కథల కలెక్షన్, దైవమిచ్చిన భార్య, అమీనా, శశిరేఖ, వివాహ౦, మ్యూఙి౦గ్స్ కొద్దిగా చదివాను అయితే అన్నేళ్ల క్రిత౦ రాసిన సాహిత్య౦ ఇప్పటికీ ఎ౦త రెలేవే౦ట్ అని ఆలోచిస్తే ఆశ్చర్య౦ కలిగి౦ది అయితే, ఒక్కోసారి మాత్ర౦ నాకు చిరాకు కూడా కల్గినది తీరిగ్గా సమగ్ర౦ గా రాయాల్సిన టాపిక్ ఇది
కాలాతీత వ్యక్తులు చదివి ఒక రాత్రంతా, ఆలోచిస్తూ గడిపి, దానిపై వచ్చిన ప్రతి ఒక్క రివ్యూ చదివినా, ఎందుకో పూర్తి గా సంతృప్తి గా అనిపించలేదు. అదేదో, టమాటా ఊరగాయన్నం ఎంత తిన్నా ఇంకా తినాలనిపించినట్లు.. థా౦క్స్ సుజాత గారు! నాకు ఎన్ని లి౦కులు ఇచ్చి సహానుభూతిన౦ది౦చారో! మళ్లీ స్పెషల్ గా రాయాల్సిన టాపిక్ ఇది ఒక్క మాటలో చెప్పాల౦టే 100 % worth the 100 Rs spent on it..
రంగనాయకమ్మ గారి "అమ్మ కి ఆదివారం లేదా?" లో ఒక కథ చదివి చదివి మళ్లీ మళ్లీ చదివి ఆ పూటకి అన్నం ఇంక అక్కర్లేనంత గుండె నింపేసుకున్నాను ఆవిడ కథల్లో, ఆవిడ నలభై ఏళ్లల్లో ఆవిడ ఆలోచనా విధాన౦ లో వచ్చిన మార్పులు బాగా కనిపి౦చి౦ది కథలకి౦ద ఆవిడ వ్యాఖ్యాన౦ వల్ల కూడా కావచ్చు బహుశా! ఇక స్వీట్ హో౦ కొన్ని భాగాలు చదివాను కానీ ఇ౦కా పూర్తి చేయలేదు కాశీభొట్ల "నికశం" చదివి, ఒక విధమైన వెగటు, నిర్లిప్తత, వాటితో సమం గా ఒక ఆలోచన, ఇంకా.. ఇంతలా పొగుడుతున్న జనం అందులో ఏది ఎగ్జాక్ట్ గా మెచ్చారో తెలియక అయోమయం లో పడటం..
అలాగే గురవాయణ౦ చదివాను, మొదలు పెట్టడ౦ కేవల౦ స్నేహశీలి, స౦గీత సాహిత్య సౌరభాలలో నిర౦తర౦ మునిగి తేలుతూ, వైద్య సేవ ల౦ది౦చే డా. భార్గవి గారి ము౦దుమాట, అలాగే వారి భర్త, నా సోదర తుల్యులు కీ. శే. డా. బదరి గార్ల ప్రస్థావన ఉ౦డటమైతే, చదవడ౦ పూర్తి చేయడ౦, కేవల౦ చదివి౦చే శక్తి వల్ల మాత్రమే
వీటన్నిటినీ మించి, పాకుడు రాళ్లు పుస్తకం లో కొన్ని పేజీలు వెనక్కి ప్రింట్ అవడం మంచి కిక్కునిచ్చింది. మా చెల్లిచ్చిన ఉపాయాన్ననుసరించి, మొన్నీ మధ్య రైల్లో ఆ పేజీలు చదువుతున్నప్పుడు ఎదురు సీట్ల వారి ముఖం లో కదులుతున్న భావాలు చెప్పడానికి 18 పర్వాలు సరిపోవు మరి.
హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో తెలుగు స్టాళ్లలో ఎప్పుడూ నడి వయస్కులో, ఇంకా పెద్దవారో, అథమ పక్షం ఇరవైల్లో ఉన్నవారే కనిపించడం కద్దు. అయితే ఈసారి కొంతమంది గుంపు గా టీనేజ్ అమ్మాయిలు గల గలా తిరుగుతుంటే భలే ముచ్చట వేసింది. సీన్ కట్ చేస్తే, బిల్లింగ్ వద్ద ఎంతో క్యూరియస్ గా ఏం కొంటున్నారో అని చూస్తే, పక్కున నవ్వొచ్చింది. వాళ్లు కొన్నవి "ఇంగ్లిష్ ఫలానా రోజుల్లో నేర్చుకోవడం ఎలా? ధైర్యం గా ఇంగ్లిష్ ఎలా మాట్లాడాలి?" ఇవీ.. వాళ్లు కొన్న బుక్కులు.
ఇక ఈ ఏడు, ఆ౦గ్ల పుస్తకాలు ఎ౦దుకో ఏవీ చదవకపోవడ౦ కుదరనే లేదు 2014 మాత్ర౦, అప్పుడెప్పుడో కొద్దిగా చదివి వదిలేసిన వాల్మీకి రామాయణ౦ పున: ప్రార౦భి౦చాలని, అ౦దుకోస౦, మళ్లే ఏ చేయో,కాలో విరగ్గొట్టు కోవాల్సిన అవసర౦ లేదననుకు౦టున్నాను
అలాగే మళ్లీ ఆ౦గ్ల సాహిత్య౦ వైపు కూడా ఒక కన్ను వేసి చూడాలి కారా గారి కలెక్షన్, రావి శాస్త్రి గారి కలెక్షన్ స౦పాది౦చాను చూద్దా౦ ఎ౦తవరకూ చేయగల్గుతానో ఏ౦ జరుగుతు౦దో
13 comments:
పోయినేడు నమిలేసిన పుస్తకాల్ని నెమరేసుకుని, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో (పుస్తక) వేటకు ఉపక్రమిస్తున్న సింహంలా కనిపిస్తున్నారు. ఇలాంటి ఉదంతమే ఏదో ఒకటి చెప్పి దానినే సింహావలోకనం అంటారని మా చిన్నతనంలో బళ్లో చెప్పేటోళ్లు. 2013కు భలేగా వీడ్కోలు చెప్పారండి :)
చదివిన పుస్తకాలు తమపై ఏవిధమైన ప్రభావాన్ని ప్రసరించి ప్రభావితం చేశాయో నిర్దుష్టంగా వివరించారు!అభినందనలు!
కాలాతీత వ్యక్తులు మీద నిజంగానే మీరన్నట్లు ఎవరు ఎంత రాసినా ఇంకా ఏదో రాస్తే బాగుండేది అనిపిస్తూనే ఉంటుందండీ! నేనే రెండు సార్లు రాశాను. ప్చ్.. అయినా సరే ఇందిర గురించి సరిగా రాయలేక పోయాను, అబ్బ ఇందిర గురించి ఎంత రాసినా చాలదు.. అనిపిస్తుంది. మీరు ప్రత్యేకంగా దాని మీదే రాస్తే చదవాలని చూస్తున్నాను.
నికషం గురించి మీతో ఏకీభవిస్తున్నాను. ఒక్కోసారి గొప్పగా వచ్చేసిన రివ్యూలు చదివాక పుస్తకం చదివితే "మనకి అర్థం కావడం మానేశాయా పుస్తకాలు"అని అనుమానం వస్తోందీ మధ్య!
రంగనాయకమ్మ గారిలో నాకు అమితంగా నచ్చే విషయం ఎప్పటికప్పుడు తన ఆలోచనల్లో వచ్చిన మార్పుని సమీక్షించుకుంటూ ఉండటం. పాము పగ బట్టే కథ ఒకటి ఉంటుంది ఆ సంకలనం లో! అది ప్రచురించి "అప్పట్లో నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో పాఠకులందరికీ తెలీడానికైనా ఈ కథ ఉంచాలి"అని రాశారు ముందు మాటలో! ఎంత నవ్వొచ్చిందో!
eppati nuncho naaku kooda mahabharatam chadavalani vuntundi.. gaani book shop lo ye book select cheyyalo teliyadu.. meeru chadivina book ento chebutaara? I mean publisher or something.. Also, aa book padhyalatho vunna book or vyakhyanama..? Thanks.
" క్రిందటేటి " సరిగ్గా కుదర్లేదండి. ఎందుకో చెప్పలేకపోతున్నాను కానీ ఇదో దుష్ఠ సమాసంలాగా ఉంది. :-)
కొంతకాలం క్రితం చలం, కొ.కు పుస్తకాలు బాగా చదివాను. ఎప్పుడూ యుద్ధం, దానితో పాటు వచ్చిన దరిద్రం ప్రస్తావిస్తూ ఉంటాడు కొ.కు. దానితో అదో రకమైన వెగటు. ఉత్తరోత్తరా కొ.కు గురించి చాలా విన్నాను - వాళ్ళాబ్బాయి రోహిణి గురించీను. దానితో మళ్ళీ వాళ్ళ పుస్తకాలు ముట్టుకోబుద్దేయట్లేదు. రోజూ చేసే ఉద్యోగంలో, చెప్పే మాటల్లో వాళ్ళు పెద్ద నాస్థికులు - సంఘ సంస్కర్తలు. కానీ ఎక్కడ మంగళంపల్లి బాలమురళీకృష్ణ (లేకపోతే ఎవరిదైనా సరే) కచేరీ జరిగినా ముందు వరసలో వీళ్ళే. మళ్ళీ ఈ పాటలమీద, కృతులమీద, త్యాగరాజు మీద ఒక పెద్ద రీసెర్చ్! బాలమురళీ పాడేవి - ఎందరో మహానుభావులూ లాంటి కృతులు. చేసే ఉద్యోగం చందమామ ఎడిటర్ - అందులో మళ్ళీ రామాయణ భాగవత భారతాలూ, శివలీలలూ ఇలాంటివి రోజు రాసినవి ఎడిట్ చేయడమో, రాయడమో. ఎందుకొచ్చిన డబల్ స్టేండర్డ్స్? పోనీయండి.
ఈ మధ్య పోస్టులు వేయడంలేదు మీరు బ్లాగులో. ఫేస్ బుక్కులోకి గానీ వెళ్ళిపోయారా? అటువేపు వెళ్లకండి. అదో వ్యసనంలాగా తయారై మీ రాసే, చదివే హాబిట్స్ అన్నీ సర్వ నాశనం అవుతాయి (అని నేను గారంటీ ఇవ్వగలను).
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
నేను ఈ సారి రెండు సార్లు పుస్తక ప్రదర్సన కి వచ్చానండి . మొదటి ఆదివారం నాడు మా ఆవిడ పిల్లలతో వెళ్ళాను . చాల వరకు వాళ్ళకు నచ్చిన పిల్లల పుస్తకాలే కొన్నాను . లోకేశ్వర్ గారు గత ప్రదర్సన కి వేల్లినప్పుడు పరిచయమయ్యారు . ఆయన రాసిన సలాం హైదరాబాద్ తీసుకున్నాను చదివాను . ఈ సారి గుర్తు పట్టి సిల్క్ రూట్ లో సాహస యాత్ర పుస్తకం గురించి చెప్పారు. సో ఆ పుస్తకం కొన్నాను. మా ఆవిడ ఎమెస్కో స్టాల్ లో ఇంటింటి చిట్కాలు పుస్తకం మాత్రం మొదటి సారి కొన్నది ..
తర్వాతి ఆదివారం మల్లి నేను ఒక్కడినే వెళ్ళాను . ఈ సారి కొన్న పుస్తకాలు చలం మైదానం (4 నవలలు మైదానం అరుణ బ్రామ్హనికం ) కాలతిత వ్యక్తులు , చక్రభ్రమణం, శంకరరావు పెళ్లి (పొత్తురి విజయ లక్ష్మి ) మీనా ,పడగ్గది వైరాగ్యం , వంగా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర మనీ పర్సు రెండు భాగాలు , సంతకం చేసి ఇచ్చారు , బంగారం గురించిన బుక్ , వేద భారతి రేమేళ్ల అవధానులు గారి దగ్గర ఈ సారి ప్రచురించిన నాలుగు చిన్న పుస్తకాలు నృసింహ స్తోత్ర మాలిక ఇలా కొన్ని పుస్తకాలు కొన్ననండి .
చలం బుజ్జి గాడు మాత్రం చిన్నపుడు చదివాను మళ్ళి ఇప్పుడే చదవటం .
ఓ రెండు రోజుల్లో అర డజను చదివేసాను .
ఎంత అదృష్టవంతులండీ... ఈ యేడాది సరిగ్గా పుస్తకాలు చదివిన పుణ్యాన పోలేకపోయాను.. కొత్తయేడాదైనా చూడాలి.
అనానిమస్ గారూ... కిందటేటి... తప్పు కాదండీ... కిందటి + ఏటి... సమాసం కాదు, సంధీ కాదు... వాడుకలో కలిసిపోయిన రెండు పదాలు అంతే. కాకపోతే వాడుక బాగా తక్కువ కావడంతో అనీజీ అనుకుంటా... :)
"ఉత్తరోత్తరా కొ.కు గురించి చాలా విన్నాను - వాళ్ళాబ్బాయి రోహిణి గురించీను. దానితో మళ్ళీ వాళ్ళ పుస్తకాలు ముట్టుకోబుద్దేయట్లేదు."
అవును, నిజమే. నేను కూడా అంతే!
"రోజూ చేసే ఉద్యోగంలో, చెప్పే మాటల్లో వాళ్ళు పెద్ద నాస్థికులు - సంఘ సంస్కర్తలు. కానీ ఎక్కడ మంగళంపల్లి బాలమురళీకృష్ణ (లేకపోతే ఎవరిదైనా సరే) కచేరీ జరిగినా ముందు వరసలో వీళ్ళే. మళ్ళీ ఈ పాటలమీద, కృతులమీద, త్యాగరాజు మీద ఒక పెద్ద రీసెర్చ్! బాలమురళీ పాడేవి - ఎందరో మహానుభావులూ లాంటి కృతులు. చేసే ఉద్యోగం చందమామ ఎడిటర్ - అందులో మళ్ళీ రామాయణ భాగవత భారతాలూ, శివలీలలూ ఇలాంటివి రోజు రాసినవి ఎడిట్ చేయడమో, రాయడమో. ఎందుకొచ్చిన డబల్ స్టేండర్డ్స్? పోనీయండి."
ఇక్కడ మీ అభిప్రాయాలు కలగాపులగంగా వున్నాయి. నా అభిప్రాయాలు చెబుతాను.
కళలు సమాజంలో అభివృద్ధి చెందుతూ వస్తున్నప్పుడు, అవి అప్పటికే వున్న భక్తీ, దేవుడూ, అనే అంశాలతో కలిసిపోయాయి. అయితే, సంగీతం వేరూ, భక్తి వేరూ అని అర్థం చేసుకోవాలి. సంగీతానికి ముఖ్యం - రాగం, తాళం, వగైరాలు. సాహిత్యానిది ఆఖరి స్థానం మాత్రమే, సంగీతంలో. పాడే వారి గొంతు కూడా సాహిత్యం కన్నా ముఖ్యం. వాద్య సంగీతాలలో సాహిత్యమే వుండదు అసలు. ఎక్కువ సంగీతం భక్తికి సంబంధించిన విషయాలతో కలిసిపోయి వుందని, నాస్తికులు సంగీతానికి దూరంగా వుండాలా? అక్కర్లేదు. అసలైన నాస్తికులు, భక్తి భావాన్ని వదిలేసి, కళని మాత్రమే ఆస్వాదించగలరు. భక్తి సంగీతాన్ని ఇష్టపడే ప్రతీ భక్తుడూ నిజ జీవితంలో ఎలాగయితే మంచి వారు కారో, అలాగే, భక్తిని వదిలేసి, సంగీతాన్ని మాత్రమే ఆస్వాదించే ప్రతీ నాస్తికుడూ నిజ జీవితంలో కపటి కూడా కాదు. భక్తులు, కళలనీ, భక్తినీ కలిపేసి చూస్తే, నాస్తికులు, వాటిని విడి విడిగా చూస్తారు. చూడగలరు కూడా. కాలం గడిచే కొద్దీ, సాంప్రదాయ సంగీతం కూడా భక్తిని తగ్గించి, సాంఘీక అంశాలతో వస్తోంది. అంటే, అది మారుతోంది.
ఇక పొట్ట కూటి కోసం ఉద్యోగం, దాని కోసం వారి వ్యక్తిగత అభిప్రాయలకి ఇష్టం లేని పనులు చెయ్యడం. ఇది గతి లేక చేశారా, లేక, కపటత్వంతో చేశారా అనేది, ఎన్నో అంతర్గత విషయాలు తెలిస్తే తప్ప, నిర్ణయించ లేము. నాస్తికుడైన ఒక టీచరు, తెలుగు పాఠంలో, రాముడి కధ చెప్పాలంటే, ఆ పుస్తకంలో వున్నది వదిలేసి, విషవృక్షంలో వున్న రాముడి గురించి చెప్పాలా? అలా చెబితే, ఆ టీచరు ఉద్యోగం ఊడదా? అప్పుడు ఆ టీచరు అడవుల్లోకి పరిగెత్తాలా? పొట్ట కూటి కోసం చేసే పనుల్లో తమ వ్యక్తిగత ఇష్టాలని ఎంత వరకూ ఇమడ్చగలరూ ఎవరైనా? ఏ మనిషైనా, తన అభిప్రాయాలని కొంత వరకే నిలుపుకోగలరు. నూరు శాతం నిలుపు కోవాలంటే, ఎక్కువ మందికి సాధ్యం కాదు. కపటత్వం వేరూ, చేత కాక పోవడం వేరూ. తేడా గ్రహించాలి.
క్లుప్తంగా ఇంత మాత్రమే చెప్పగలం ఇక్కడ.
ఇక, పుస్తకాల గురించి కృష్ణ గారు ఏమీ సరిగా చెప్పలేదు. రాసిన దాంట్లో మనసే కనబడలేదు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు !
@ చాయ్ గిన్నెలు, కూరల పాత్రలు మాడ్చడం లో, ఉపకరి౦చాయి.
మీరే బుక్ చదువుతున్నారో ఇంట్లో చర్చించే సందర్బాలన్న మాట ఇవి :)
చలం రచనలు ఎప్పుడు చదివినా రెలవెంట్ గానే అనిపిస్తాయేమో. నేనయితే చందమామ చదివేరోజుల్లో కాలక్షేపానికి చదివినవి ... ఇప్పుడు చదివితే ఇంకా గొప్పగా అనిపించొచ్చు లేదా విసుగనిపించొచ్చు .. కాని అస్సలు ఆసక్తి రాలేదు . ...కాబట్టి చదివినవాళ్ళ అభిప్రాయాలు ఇంకా విలువైనవి ...2014 లో ఆయన రచనలపై మీ సమగ్రవ్యాసం చదువుతామని ఆశిస్తున్నా
anni pustakala... jealousy ga undi mimmalni chustunte...ela manage chestunnaru time ani!!
అది ప్రచురించి "అప్పట్లో నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో పాఠకులందరికీ తెలీడానికైనా ఈ కథ ఉంచాలి"అని రాశారు
____
అసందర్భమైనా,
రంగనాయకమ్మాగారు, అప్పుడు కాదు, ఇప్పటికీ అంతే అజ్ఞానంలో ఉన్నారు. కాకపొతే మతం మారారు అంతే. కొత్తమతంలోకి వచ్చాక పాత నమ్మకాలన్నీ అజ్ఞానమే అవుతాయి. పాము పగబట్టదు అనేది మూఢనమ్మకం ఎందువలన? దానికి శాస్త్రీయమైన ఆధారలున్నాయి. అలానే రంగనాయకమ్మగారి కొత్తనమ్మకాలు కుడా అదే విధమైన శాస్త్రీయమైన ఆధారలున్నాయి కాబట్టి తప్పు అంటే ఒప్పుకుంటారా? లేదే, అవన్నీ పెట్టుబడిదారుల మోసం దగా వగైరా. మళ్ళీ ఈవిడ సైన్సుపై పుస్తకాలు, మళ్ళీ ఆవిడ భనజ/భక్తుల రివ్యూలు వాటిపై.. నిజం చెప్పాలి అంటే, ప్రవీణ్ ఒకప్పుడు నడిపిన సైన్సు కబుర్లు అన్న బ్లాగు స్థాయిలో వందోవంతులో కుడా ఉండవు ఆవిడ పుస్తకాలు. కానీ ఆవిడ్నో మేధావిలాగా పొగిడే/పేపర్లో రాసే జనాలకు కొదవలేదు. మన దౌర్భగ్యం.
తార గారూ,
"రంగనాయకమ్మాగారు, అప్పుడు కాదు, ఇప్పటికీ అంతే అజ్ఞానంలో ఉన్నారు"_____________
ఒకరి అజ్ఞానాన్ని నిర్థారించడంలోనే మన జ్ఞానం స్థాయి నిర్ణయమవుతుంది! కదండీ
పర్లేదు, ఎవరి అజ్ఞానం వాళ్లకు ఆనందం!!ఈ మాట సాక్షాత్తూ సోక్రటీసు అంతటి వాడే అన్నాడు(ట) !
రెండు లక్షల పుస్తకాలా??? :O
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.