కాస్త కూడపెట్టగానే మా AK చేసిన పని,.. ఊళ్లో, ఒక పక్క కూలుతున్న, పాతకాలం ఇంట్లో ఉన్న తన కుటుంబం కోసం మంచి పక్కా ఇంటిని కట్టించటం. మరి ఇప్పటిలాగా ఏంటి? కాలింగ్ కార్డ్ మీదో/వాయిప్ ఫోన్ మీదో గంటల కొద్దీ మాట్లాడి ఎలా కావాలో చెప్పి చేయించుకునే పరిస్థితి లేదు. ISD కాల్స్ బోల్డు ఖరీదు. కాబట్టి అవసరం మేరకే వాడుతూ AK చక్కగా ఉత్తరాల మీద కొన్నీ , చెన్నై లో స్నేహితులకి ఈ-మెయిల్ ద్వారా ఇంకొన్నీ సూచనలు ఇచ్చాడు. వాళ్ల ఊరివాడే కాంట్రాక్టర్ ఉంటే అతని చేత కట్టించుకున్నాడు.
ఇక అన్ని రకాల ఆధునిక సదుపాయాలూ అమర్చ టానికి ఎవర్నైనా నియమించుకుందామని, వాళ్లమ్మ రికమెండ్ చేయించిన ఒకతన్ని పెట్టుకున్నాడు. అద్దాలు, లైట్లు, ఫాన్లు.. ఒకటేమిటి? అన్నీనూ. అమెరికా లో తాను అనుభవించే అన్ని మంచి సదుపాయాలూ, తన కుటుంబం కూడా అనుభవించాలని చాలా ప్రయత్నించాడు..
ఒక శుభ ముహూర్తాన, కొత్త ఇంట్లోకి మారచ్చనీ, ఇంటికెళ్లి రెండేళ్లు అయిందని AK వాళ్ల ఊరెళ్ళి వచ్చాడు.
ఇద్దరు ముగ్గురు కలిసి మళ్లీ చాయ్ మీటింగ్ పెట్టించారు. ఆవిషయం, ఈ విషయం మాట్లాడాక, వాళ్ల ఇల్లూ, వ్యవహారం మీదకి చర్చ వెళ్లింది.
ఒక్కసారి గా క్రోధం కనిపించింది ఏకే మొహం లో. ఏమైంది? అని అందరం ఆసక్తి గా చూస్తున్నాం.
“మా అమ్మకి తెలిసిన వాళ్లు కదా అని కాంట్రాక్ట్ ఇచ్చాను, లక్ష సార్లు చెప్పాను.. వాష్ బేసిన్ ఎలా ఉండాలి? అద్దం ఎలాంటిది కావాలి? నల్లా ఎలాంటిది కావాలి? అనేవి పూస గుచ్చినట్టు చెప్పానా? “
“అవునూ.. అందరినీ కనుక్కుని, వెబ్ సైట్లు చూసి, ఫోటోలు పంపి.. ఆ గొడవ మాకూ తెలుసు.. ఐతే?”
“పూర్తి గా తగలేశాడు. వాష్ బేసిన్ మీద అద్దం పెట్టలేదు. పైగా అక్కడ లైట్ పెట్టాడు. అద్దం తువ్వాలు పెట్టుకునే రింగ్ మీదుగా పెట్టాడు.. “
“అదెం?”
“అదే! కడిగి పాడేసాను.. అతనింక ఏమీ చెప్పలేడు అనుకున్నాను..’
“ఆ మాత్రం తెలియదా అతనికి”
“ఇంకా నయం.. అతనేమన్నాడో వింటే..మీరు ఆశ్చర్యపోతారు..”
“ఏమన్నాడు?”
“మరుమహనే! ఇదంతా నీ మంచికే?’
“నా మంచికా! ఎలా?”
“ఇప్పుడు చూడు.. నువ్వు పొద్దున్న లేస్తావు, కచికో, వేప పుల్లో, టూత్ పేస్ట్/పౌడర్ ఏదో ఒకటి నోట్లో వేసుకుని, అదంతా కారుతూ, అసహ్యం గా ఉన్న ముఖం తో తలెత్తుతావు,నీ ముఖం నీకే పిచ్చిగా కనపడదూ? నీకేం ఖర్మ? శుభ్రం గా మొహం కడుక్కుని పక్కకి వచ్చి తువ్వాలు తో తుడుచుకుని అద్దం లో చూసుకో.. రాజా లా కనపడతావు కదా?”
ఫక్కుమని నవ్వేసాం అందరం.
“నా మొహం నాకు పేస్టు మరకలతో కూడా అందం గానే ఉంటుంది లే. నువ్వు ముందు మార్చు’
“మరుమహనే! నీ ఇష్టం.. మళ్లీ నన్ను అనద్దు. అయినా.. అక్కడ మరి లైట్ ఉంది గా..?”
“అవునూ.. లైట్ ఎందుకు పెట్టావు అక్కడ? దానికీ ఏదో ఒక థీరీ ఉందే ఉంటుంది చెప్పు! అన్నాను.”
“...”
“మరుమహనే! చలి కాలం లో చల్లటి నీళ్ల తో కడుగు తావు. కాస్త వెచ్చగా ఉంటుంది కదా.. “
“మరి ఎండా కాలం లో?”
“సారీ...”
“ఈ టాప్ ఇంత ఎత్తు ఎందుకు పెట్టావు?”
“నీళ్లు మంచి ఫోర్స్ గా వస్తాయి కదా మరుమహనే!”
“అవి చుట్టూ చిందవా?.. అని అరిచాను కోపం తో.., ఏమీ మాట్లాడకుండా చేతులు నలుపుకుంటూ నుంచున్నాడు.. ఎం చేస్తాం?”
“హ్మ్...”
“ఇది చాలదన్నట్టు అమెరికా లో లాగా డైనింగ్ టేబుల్ మీదకి వేలాడేట్టు లైట్ పెట్టమని చెప్పాను..”
“అవునవును.. గుర్తుంది”
“ ఆ లైట్ కాస్తా అతను.. కుర్చీ వెనక పెట్టాడు..”
“అదేంటి?”
“అదే మరి! ఇలాగ ఎందుకు చేశావు? అందం అంతా పోయింది. పైగా.. టేబుల్ మీద నీడ పడుతుంది అని నిలదీశాను”
“ఏమన్నాడు”
“మరు మహనే! ఇప్పుడు మాత్రం ఏంటి ప్రాబ్లం? నాలుగు కుర్చీల వెనక నుండీ నాలుగు లైట్లు పెట్టిద్దాం! అన్నాడు”
“హి హి..”
“నాకు లాగి కొడదామన్నంత కోపం వచ్చింది.. పెట్టింది చాలు! ఇక నన్ను వదులు.. అని అయిన కాటికి లెక్క కట్టి ఇచ్చేశా”
ఘొల్లుమని నవ్వాం అందరం..
“ఇలాంటివి అన్నీ నీకే ఎందుకవుతాయి ఆర్ముగం?”
“ఛా.. దీనికే? అసలు ఎగ్జాస్ట్ ఫాన్ కథ వింటే ఏమవుతారో?”
“చెప్పు చెప్పు.. ప్లీజ్..”
“అయ్యో.. టైం అయినట్టుంది.. మళ్లీ రేపు చెప్తాను..” అన్నాడు లేస్తూ..
ఇక మేము కాళ్ల మీద పడటమే బాకీ. బాగా బతిమలాడించుకుని చెప్పాడు.
“మొదటి సారి పెట్టాడు. నేనూ ఎప్పుడూ ఇండియా లో చూడలేదు. అమెరికా లో మన అపార్ట్ మెంట్లలో మనకి కనపడదు..డబ్బు సెటిల్ చేసి..మర్నాడు స్నానం చేస్తూ స్విచ్ ఆన్ చేసి చూద్దును కదా..”
“ఆఅ.. ఏమైంది? ఫ్యూజ్ పోయిందా? పేలిందా?” అందరం ఆందోళనతో...
“నో య్యార్.. తిరగేసి పెట్టాడు. బయట నుండి కాలవ కంపు అంతా బాత్ రూమ్ లోకి తెస్తోంది...”
ఇక మా వల్ల కాలేదు.. నవ్వి నవ్వి.. బుగ్గలు, పొట్టా పట్టుకుని సీట్లల్లో కూలబడి... వెనక్కి చూతును కదా.. ఆర్ముగం.
“కూర్చో.. బాబోయ్.. నవ్వించావు చాలా”
“ఈ కథ కి చిన్న పిట్ట కథ కూడా ఉంది క్రిష్ణబిరియా!”
“ఏంటి?”
“ఇతను మాకు దూరం బంధువు. పొలం లేదు, అక్కడా ఇక్కడా పని చేసి,.. సరిగ్గా రాక ముందే..సొంత పని మొదలు పెట్టాడు. భార్య కి కాన్సర్. నలుగురమ్మాయిలు.. అందరూ ఆ పనీ, ఈ పనీ చేస్తారు, తల్లికీ చేస్తారు,చదువుకీ వెళ్తారు..”
“ఓహ్.. I am sorry!”
“అప్పుడు ఆ క్షణం.. అక్కడ నా కష్టార్జితం వేస్ట్ అయిందని బాధ వల్ల తిట్టేసాను.. కానీ అనుకున్నంతా ఇచ్చాను. కష్టపడే చేశాడు..”
“హ్మ్...”
“ప్రేమ గా అల్లుడూ అని పిలిచేవాడు. మా అమ్మకి పెద్దమ్మమ్మ మనవడు. పోన్లే ఎవరు పర్ఫెక్ట్? ఏం? అంత పర్ఫెక్ట్ గా ఉంటే కానీ బతకలేమా?”అన్నాడు.
నేనేమీ అనకుండా కూర్చుండి పోయాను.
తనే అంటూ పోయాడు..
“నేనతన్ని అరిచాను. కానీ కాస్త చల్ల బడ్డాక, ‘ఛా. డైనింగ్ టేబుల్ మీద కాస్త నీడ పడితే ఏంటి? మన అవసరం, అతనికి అవసరం తీర్చగలిగింది. ultimately, humankind wins! He did not provide good work.. but I see his love thru the light.. I left it as it is.. Changed the exhaust fan though” అని తన క్యూబ్ కి వెళ్లిపోయాడు.
***********************************************************************************************************************
చాలా కాలం తర్వాత, ఒకసారి “మీ లైట్ అంకుల్ ఎలా ఉన్నాడు?” అని అడిగాను. ‘ఆయన భార్య చనిపోయింది. ఆయన వర్క్ మీద అందరికీ చిన్నచూపు.. పని ఎవ్వరూ ఇవ్వలేదు. కూతుళ్ళే చూస్తున్నారు. వాళ్లు బయట పనులు చేసుకుని వస్తే.. ఈయన ఇంటి పనులు చక్కపెడతాడు..” అని ఒక్క క్షణం ఆగి...
“అదే ప్రేమ, అదే పిలుపు,.. ఎప్పుడు కనపడినా, ఏమైనా పని ఉంటే చెప్పు మరుమహనే! బిడ్డలకి పెళ్లి చేయాలి త్వరలో.. చాలా కూడాబెట్టాలి.. అంటాడు తప్పితే, చేయి చాచి ఎప్పుడూ అడగడు.” అన్నాడు.
“అబ్బా! ఈ AK ఎప్పుడూ ఇంతే.. నవ్విస్తున్నట్టే ఉంటాడు, ఎక్కడో కలుక్కుమనేలా చేస్తాడు..’ అని మళ్లీ విసుక్కున్నాను.
ఇంకో ఆర్ముగం చాయ్ కథ తో మళ్లీ వస్తా..
22 comments:
బావుంది. ఆర్ముగం లో కొత్త కోణాలు పెద్దగా ఏమీ ఆవిష్కృతం కాలేదు ఇప్పటికి.
అబ్బా ముందు కామెంట్ పెట్టే అదృష్టం దక్కి౦ద నుకున్నానే politician గారు పెట్టేసారు. మీరో ఆర్ముగంగారో తెలియదు కాని నవ్విస్తూనే కలుక్కుమనిపిస్తున్నారు. ధన్యవాదాలు క్రిష్ణప్రియగారూ..
mee armugam kathalu chaduvuthunte manasanthaa edo aipothundi. chaalaa bagunnayi.
ఎండిపోతున్న మనసు మడులను తడిపే రచనలు అనిపిస్తున్నాయి ఆర్ముగం సిరీస్, కృష్ణప్రియగారూ!
బాగున్నాయండి కధలు.
నవ్విస్తూ నవ్విస్తూ మధ్యలో కలుక్కుమనిపించారు. మరొక ఆర్ముగం కథ కోసం నిరీక్షిస్తూ...
చాలా బావుందండి !
ఇలాంటివి అన్నీ నీకే ఎందుకవుతాయి ఆర్ముగం ?
--------------------
ఇది కరెక్టు కాదేమో :))) ముఖ్యం గా ఇంటి ఇషయం లో "WYSIWYG " concept మహా కష్టం అనుకుంటా :))
ఇవాల్టి కథలో ఆయనకి జరిగిన సంఘటనలు చదువుతుంటే ఎందుకో బారిష్టరు పార్వతీశం గుర్తుకొచ్చారు! కాని ఆర్ముగం గారి మాటలు నిజమే కదా అంత పర్ఫెక్ట్ గా ఉంటే కానీ బతకలేమా ఎంతో మంచి మనసు కలవారిలా అనిపిస్తోంది చదువుతున్న క్రొద్దీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది!
జ్యోతిర్మయి గారు, For this post the honor is mine :)
క్రిష్ణప్రియగారు,
"నవ్విస్తూనే కలుక్కుమనిపించడం" -- ఇదేదో బానే ఉన్నట్టుంది.
you know what I mean :)))
hmm!
so Sad
బాగుందండి.At the end of the day ,life matters for ppl, who experiences the life.
"క్రిష్ణబిరియా" కాదు,కిరుస్ణబిరియా అనిఉంటాడని నా నంబిక్కై.
చాలా బాగుందండీ... కాంట్రాక్టర్ లాజిక్కులన్నీ కెవ్వు.. అతనికి పని ఇవ్వడంలో చేసినపనితో సర్దుకుపోవడంలో హ్యుమానిటీని చూపిన AK గారు ఇంకా కెవ్వు... ఓ చిన్న సంఘటనగా మేమంతా ఆఫీస్ కాఫీటేబుల్ దగ్గర విని నవ్వుకుని వదిలేసే ఈ కథలను ఇంత ఆసక్తికరంగా ప్రజంట్ చేస్తున్న మీకు మరికొన్ని కెవ్వులు :-)
మరుమగళే, క్రిష్ణబ్రియా,
కథ రొంబ నల్లా ఇరుక్కు.
ఆ సాంతం బాగా చదివించేలా రాసారు, మధ్యలో ఆ బొమ్మలతో సహా మంచి శైలి తో.
ఆరు ముగం,
ఆరు ముఖములను మీరు ఆవిష్కరించేలా ఉంది కథ ప్రొగ్రెస్స్ చూస్తూంటే.
వణక్కం
జిలేబి.
Good one! :)
Waiting for the next one in this series! ;)
andaroo cheppinadae!!
@ WP,
అవును. ఆర్ముగం లో అన్ని కోణాలూ అతని అనుమతి లేకుండా నేను బహుశా రాయలేను. వచ్చే పార్ట్ లో అతని అమాయకత్వం/అతి తెలివి గురించి రాద్దామనుకుంటున్నాను.
ఈ పార్ట్, అతని స్వభావాన్ని, ముఖ్యం గా తనకి నష్టం కలిగించినా, పని ప్రావీణ్యత లేనతనిని ట్రీట్ చేసిన మానవీయ కోణాన్ని రాశాను.
@ జ్యోతిర్మయి,
ధన్యవాదాలు!
మొదటి కామెంట్ :) నా బ్లాగ్ లో మొదటి కామెంట్ కి అంత పోటీ ఉండదు లెండి ..
@ గీత,
థాంక్స్!
@ తేజస్వి,
థాంక్స్!
@ పద్మార్పిత, అపర్ణ,
థాంక్స్!
@ శ్రావ్య,
:) అవును.
@ రసజ్ఞ్య,
హ్మ్. మంచి వాడు ఫర్ ష్యూర్.
@ హరేకృష్ణ,
ఆయన బాధ ఆయనది కానీ,వాళ్లమ్మాయిలు కష్ట పడి పని చేసి, తమ కాళ్ల మీద నిలబడ్డారు..
@ భాస్కర్ గారు,
కరెక్ట్ గా చెప్పారు.
@ నాగేస్రావ్ గారు,
చాన్నాళ్లకి తొంగి చూశారు.. అవును.. మీరన్నట్టే అన్నాడు మొదట్లో, పోరగా పొరగా :)
@ వేణూ శ్రీకాంత్ గారు,
అమ్మయ్య థాంక్స్!
కాంట్రాక్టర్ లాజిక్ మీద ఎవరూ ఏమీ అనలేదు ఎంటబ్బా అనుకున్నాను. ఇప్పటికీ తలచుకుంటే నవ్వొచ్చేస్తుంది నాకు. అతను సమర్థించుకునే విధానం!
@ జిలేబీ,
ఆరు ముఖాలు :) నిజమే.. అతనిలో కనిపించని ఏడో ముఖమే.. 'ఏడుపు గొట్టు ముఖం' :)
@ మధురవాణి, సునీత,
ధన్యవాదాలు. మీరందరి కామెంట్ల వల్ల పర్వాలేదు మూడో పార్ట్ రాయచ్చు అని ధైర్యం వస్తోంది..
very nice and interesting too
hi KP garu...nijjanga navistune ekkado kalukkumanela chesaru...hats off to AK garu and you...
@ పక్కింటబ్బాయి, వరుణ గారు,
ధన్యవాదాలు!
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.