చిన్నప్పుడు ఎప్పుడూ క్రాఫ్ట్ క్లాస్ అంటే పరమ బోర్ గా ఉండేది. ఉండదూ మరి? ప్రతి సంవత్సరమూ అదే అదే.. చేతి రుమాలు చుట్టూ కాడకుట్టు కుట్టడం, గొలుసు కుట్టు తో మధ్యలో ఒక పువ్వో, పేరు లో మొదటి అక్షరమో కుట్టడం,లేదా చేతి సంచీ చేయడం.. ఇవి తప్ప ఏమీ ఉండేవి కావు. పైగా, కాస్త పరీక్షలు దగ్గర పడుతున్నాయని అంతమాత్రం క్రాఫ్ట్ క్లాస్ సమయం లెక్కల టీచర్ ఆక్రమించేస్తే హాయిగా ఊపిరి పీల్చుకునే దాన్ని.. మా చెల్లి బాగానే చేసుకునేది. మా అమ్మకి కుట్టుపని లో ప్రావీణ్యం చాలా ఎత్తుకి ఎదిగిందంటే దానికి పరోక్షం గా నేనే కారణం అని సగర్వం గా err. సవినయం గా తెలుపు కుంటున్నాను.
అప్పట్లో అమ్మ మీద పని వేసి తప్పించుకుని హాయిగా తిరిగినా,.. చేసిన పాపాలకి భగవంతుడు చక్ర వడ్డీ తో సహా తిరిగి ఇస్తాడని తెలుగు సినిమాలు డెబ్భై ఐదేళ్లు గా ఘోషిస్తున్నా, ‘అప్పుడు చూసుకుందాం’ లెమ్మని వదిలేశాను ఇప్పుడు ఇద్దరి ప్రాజెక్టుల రూపం లో .. అనుభవిస్తున్నాను. అయినా ఇంత త్వరగా బూమరాంగ్ లా నాకు తిరిగి వచ్చేయాలా? వచ్చే జన్మల్లో ఎప్పుడో నెమ్మదిగా ఇవ్వచ్చు కదా..
నాకు ఆర్ట్ రాదనే కానీ, పని చేసీ చేయనట్లు చేయడం, చేసినట్లు బిల్దప్ ఇచ్చి ఎలాగోలా మానేజ్ చేయడం.. వాట్లల్లో మనం దిట్ట కదా.. ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నా.. ఎలాగంటారా?
పక్షుల పాఠం చెప్పినప్పుడు నేను పడ్డ కష్టాలు పగవారు కూడా పడకూడదు బాబోయ్..
పక్షి గూడు తీసుకురమ్మన్నారు.. ఐదు మార్కులకి. పక్కావిడ కొబ్బరి చీపురు చీపురు కట్ట, కొబ్బరి బోండాల బండీ పక్కన్నుంచి కొబ్బరి డొక్కలూ, పీచూ, తోటమాలిని అడిగి గడ్డీ వగైరా తెచ్చుకుంది. మా అమ్మాయికి ఇంక ఒత్తిడి పెరిగిపోయింది. మాకు లక్కీ గా “కృష్ణమ్మ వాకిట్లో ఉన్న సిరిమల్లె చెట్టు (గుబురు) లో పిట్ట వదిలేసి వెళ్లిన గూడుండటం తో, అది నెమ్మది గా తీసి కాస్త హంగులేర్పరిచి జాగ్రత్త గా పాక్ చేసి పంపించా. తీరా సాయంత్రం మా అమ్మాయి ముఖం వేలాడేసుకుని వచ్చింది. దీని నిజం గూటికి మూడున్నర వేశారు.. భవానీకి ఐదుకి ఐదు. ఈ స్కూల్ వాళ్లకేం పోయే కాలమొచ్చింది? మరీ పిట్ట పని పిట్ట దానికి చేతనైనట్లు చేసుకుంటే మూడున్నర వేస్తారా? మా అమ్మాయికీ ఐదుకి ఐదు ఈసారి ప్రాజెక్ట్ లో తెప్పించే పూచీ నాది.. అని భీకర ప్రతిజ్ఞలు చేస్తే కానీ మా అమ్మాయి ఊరుకోలేదు...
పక్షి ఈకల ప్రాజెక్ట్ కథ..
అప్పట్లో అమ్మ మీద పని వేసి తప్పించుకుని హాయిగా తిరిగినా,.. చేసిన పాపాలకి భగవంతుడు చక్ర వడ్డీ తో సహా తిరిగి ఇస్తాడని తెలుగు సినిమాలు డెబ్భై ఐదేళ్లు గా ఘోషిస్తున్నా, ‘అప్పుడు చూసుకుందాం’ లెమ్మని వదిలేశాను ఇప్పుడు ఇద్దరి ప్రాజెక్టుల రూపం లో .. అనుభవిస్తున్నాను. అయినా ఇంత త్వరగా బూమరాంగ్ లా నాకు తిరిగి వచ్చేయాలా? వచ్చే జన్మల్లో ఎప్పుడో నెమ్మదిగా ఇవ్వచ్చు కదా..
నాకు ఆర్ట్ రాదనే కానీ, పని చేసీ చేయనట్లు చేయడం, చేసినట్లు బిల్దప్ ఇచ్చి ఎలాగోలా మానేజ్ చేయడం.. వాట్లల్లో మనం దిట్ట కదా.. ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నా.. ఎలాగంటారా?
పక్షుల పాఠం చెప్పినప్పుడు నేను పడ్డ కష్టాలు పగవారు కూడా పడకూడదు బాబోయ్..
పక్షి గూడు తీసుకురమ్మన్నారు.. ఐదు మార్కులకి. పక్కావిడ కొబ్బరి చీపురు చీపురు కట్ట, కొబ్బరి బోండాల బండీ పక్కన్నుంచి కొబ్బరి డొక్కలూ, పీచూ, తోటమాలిని అడిగి గడ్డీ వగైరా తెచ్చుకుంది. మా అమ్మాయికి ఇంక ఒత్తిడి పెరిగిపోయింది. మాకు లక్కీ గా “కృష్ణమ్మ వాకిట్లో ఉన్న సిరిమల్లె చెట్టు (గుబురు) లో పిట్ట వదిలేసి వెళ్లిన గూడుండటం తో, అది నెమ్మది గా తీసి కాస్త హంగులేర్పరిచి జాగ్రత్త గా పాక్ చేసి పంపించా. తీరా సాయంత్రం మా అమ్మాయి ముఖం వేలాడేసుకుని వచ్చింది. దీని నిజం గూటికి మూడున్నర వేశారు.. భవానీకి ఐదుకి ఐదు. ఈ స్కూల్ వాళ్లకేం పోయే కాలమొచ్చింది? మరీ పిట్ట పని పిట్ట దానికి చేతనైనట్లు చేసుకుంటే మూడున్నర వేస్తారా? మా అమ్మాయికీ ఐదుకి ఐదు ఈసారి ప్రాజెక్ట్ లో తెప్పించే పూచీ నాది.. అని భీకర ప్రతిజ్ఞలు చేస్తే కానీ మా అమ్మాయి ఊరుకోలేదు...
పక్షి ఈకల ప్రాజెక్ట్ కథ..
సైన్సు క్లాసు లో పిల్లలకి ఏదో, సన్నటి పొడుగీకలు ఎగరడానికి, కుచ్చు లాంటి పొట్టి ఈకలు దీనికీ అని చెప్పి వదిలేస్తే అర్థం ఉంది కానీ, ఎవరైనా ఈకలు పుస్తకం లో అంటించి తెమ్మని చెప్తారా? విడ్డూరం!! తల్లిదండ్రులని ఏడిపించడానికి కాకపోతేనూ.. వదిలేయాలంటే ఐదు మార్కులు పోతాయని పిల్లల గోల.
“నెమలీకల పంఖా ఉంది ఇంట్లో.. దాంట్లోంచి రెండు పీక్కెళ్ళు”.. అన్నా. అది చూసిన చూపుకి జడిసి “సరే తెస్తాలె” మ్మని మాటిచ్చా.
‘ప్రాణ్ జాయే పర్ వచన్ న జాయే’ అని సెంటిమెంట్లు పెద్దగా లేవు కదా.. యదావిధి గా మర్చిపోయా.. డెడ్ లైను ఇంకో వారముందనగా, ‘అందరూ ఈకలు తెచ్చేసుకున్నారు.. మనమే ఇంకా తెచ్చుకోలేదు. ‘ అని అమ్మాయి గోల.
సరే. కాలనీ లో చివర పావురాలు కూర్చుంటాయి కదా. .ఎప్పుడూ అవి చేసే చప్పుడు కి, రాల్చే ఈకలకీ తిట్టుకోవడమే కానీ వాటి అవసరం పడుతుందని అనుకోలేదు. చకచకా వెళ్లి మనమూ నాలుగు తెచ్చుకుందామని పోతే .. నాలుగో క్లాస్ తల్లులందరూ అప్పుడే తీసేసినట్లున్నారు. ఒక్క ఈకైనా లేదు. పాపం నాలాగే ‘లేటు తల్లి ‘ ఇంకో ఆవిడా వెతుక్కుంటూ కనపడింది. ఆవిడ ని పలకరిస్తే..’పర్వాలేదు. మా ఊరినుండి అమ్మా వాళ్లు వస్తున్నారు.. కోడీకలు తెప్పిస్తాను. మీకూ ఇస్తాను లెండి.’ అంది. ఆవిడ ఇచ్చిన భరోసాకి నాకు ఇంక టెన్షన్ తీరిపోయి సుఖం గా కూర్చున్నాను.
రెండు రోజుల గడువు ఉందనగా, మా పిల్ల మళ్లీ గుర్తు చేసింది. సరేనని ఆవిడకి ఫోన్ చేస్తే.. ‘మా అమ్మకి అనుకోకుండా.. ఆయాసమని ప్రయాణం ఆపుచేసుకుంది..’ అంది. తల్లికి అసలే బాగోలేదంటే మనం ఈకలు కావాలంటే బాగుండదని ఊరుకున్నాను కానీ ఏం చేయను? పిల్లతో ప్రమాదం వచ్చి పడిందాయే.. నాకోడీకలు చేతిదాకా వచ్చి జారిపోయినట్లనిపించి నీరసంగా అనిపించింది. అంతలో ఐడియా వెలిగింది.. సరే..స్కూటరేసుకుని మా మెయిన్ రోడ్డు మీద మాంసం కొట్టుకి వెళ్లాను. ‘రెండు ఈకలు ఇస్తావా బాబూ?’ అని మొహమాటం గా అడిగాను. నా అదృష్టం కొద్దీ నాలుగు ఈకలు తీసి ఇచ్చాడు. నాలా చాలా మంది వెళ్లినట్టున్నారు. పెద్దగా ఆశ్చర్యపడినట్లు లేడు.
అన్నీకలూ సన్నని పొడుగైనవే, కుచ్చుల్లాంటి చిన్న ఈకలు డొక్కల దగ్గర ఉంటాయి.. అవి లేవా? అని అడిగాను. ఓసారి నన్ను ఎగా దిగా చూసి “వద్దా? వెనక్కిచ్చేయండి..” అన్నాడు.
“లేదు లేదు..చాలా థాంక్స్!” అని చెప్పి ఇంటికొచ్చా.
‘అమ్మా.. ఫెదర్స్.. ఇచ్చేది రేపే.. గుర్తుంది కదా..” అంది మా అమ్మాయి.
“ఓ! జ్ఞాపకం ఉంది.. రేపు ఉదయానికి ఇస్తాను..” అని చెప్పాను.
పిల్లలు పడుకున్నాకా, ఒక ఈక మాత్రం పక్కన పెట్టి, మిగిలిన ఈకని సగానికి కత్తిరించి, వేరే ఈకనుండి ఫైబర్ కత్తెర తో కత్తిరించి, ఈ సగం ఈక ముక్కకి ఫెవికాల్ తో అంటించి.. మూడు సన్నటి పొడుగీకల నుండి ఒక చిన్న కుచ్చు ఈక ని చేసి తృప్తి గా పడుకున్నా.
మా అమ్మాయి, ఆనందం గా రెండూ తన స్క్రాప్ పుస్తకం లో అతికించి. దాని మీద, వాటిని పక్షులు ఎలాగ ఉపయోగించుకుంటాయో, వివరం గా రాసి ఇచ్చేసింది. నేనూ ‘బ్రతికాను రా భగవంతుడా..’ అనుకుని ఆఫీసుకెళ్లి పోయాను.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి దోవలో కాలనీ స్త్రీలు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ కనిపించారు. పలకరింపు గా నవ్వితే ముఖాలు తిప్పుకున్నారు. “ఏమయ్యుంటుందా “ అని ఆలోచిస్తూ బాగ్ లోపల పడేయగానే.. మా అమ్మాయి.. “అమ్మా.. మా టీచర్.. డైరీ నోట్ ఇచ్చింది..” అని వచ్చి చూపించింది.
నేను భయం భయం గా (EAMCET ఫలితాలు చూస్తున్నప్పుడు కూడా ఇంత ఉద్విగ్నత లేదు..) నా మోసం పసిగట్టినట్టుంది.. అనుకుని నెమ్మదిగా డైరీ తెరిచి చూశాను.
“క్లాస్ మొత్తం మీద మీరే రెండు రకాల ఈకలూ అంటించారు. మీ అమ్మాయి చెప్పింది. మీరు చాలా కష్టపడ్డారని.. కుచ్చు ఈకలు ఎక్కడ నుంచి తెచ్చారు? ఈసారి ఇంకా కొన్ని తెచ్సిపెదతారా? మా స్కూల్ లో డెమోలకి పనికొస్తుంది...ఆలాగే అవి ఏ పక్షివో వివరాలు రాసి పంపండి..” అని.
‘హమ్మయ్య.. ‘ అని ఉత్సాహం గా లేచి.. “ బందిపూర్ అడవులకెళ్లినప్పుడు అదృష్ట వశాత్తూ దొరికాయి. మళ్లీ వెడతామా? పెడతామా? కావాలంటే మా అమ్మాయి పుస్తకం లోంచి కత్తిరించుకోండి.. అదేం పిట్టదో..నాకు తెలియదు. క్షమించగలరు..” అని జవాబు రాసిన తర్వాత వెలిగింది.. మా లైను ఆడవారు నా ఎడల ఏల కినుక వహించితిరో.. పోన్లే.. ఇప్పుడు కుచ్చీకల రహస్యం చెప్పానంటే స్కూల్లో పరువు పోతుంది. కాలనీ లో ఇజ్జత్ పోతుంది. ఇది కవర్ చేయాలంటే ఏమబద్ధం చెప్పాలబ్బా.. అని ఆలోచన లో పడిపోయాను..
(తదుపరి టపా లో రకరకాల రాళ్లు, మొక్కలు తెమ్మన్నప్పుడు చేసిన గమ్మత్తులు)
29 comments:
ROFL. ;)
BTW, please tell us the school name, we would not send our kids there.
"పని చేసీ చేయనట్లు చేయడం, చేసినట్లు బిల్దప్ ఇచ్చి ఎలాగోలా మానేజ్ చేయడం.. వాట్లల్లో మనం దిట్ట కదా"
నూటికి నూటపది పాళ్ళు నిజ్ఝం అని చివరిదాకా చదివితే తెలిసింది.
మాంసం కొట్టు అని ముందు టపా ప్రివ్యూ చూసి అసలెంత ఊహించుకున్నామో , అది ఈకా :)
హహహ్హా.. బావుందండీ ఈకల ప్రాజెక్టు. ఇలాంటి తెలివైన చిట్కాలన్నీ ఇలా రానియ్యండి. ముందు ముందు నాలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడేలా ఉన్నాయ్.:D
స్కూలుకెళ్ళడం మొదలుపెట్టిన వందో రోజటండీ. వంద చిన్ని చిన్ని వస్తువులతో ప్రాజెక్ట్ చేసివ్వాలట. వంద చెగోడీల దండో, వడల దండో పంపిద్దామనుకున్నాను కానీ రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడాలా అని ఆలోచన. మీకేమైనా తడితే చెప్దురూ.. ఆట్టే కష్టపడకుండా..! చీరియోస్, ఫ్రూట్ లూప్స్.. వాళ్ళ ఫ్రెండ్స్ చేసేస్తున్నారట. :(
First let me Laugh...hahaha..tega navvesanandi..maa variki kooda chadivi vinipinchanu..maa vaditho kooda science project cheyincha..adi experiment chesedi kadu..just rasi present chesedi...danike tala pranam tokaki vachindi..I can imagine your plight. :)
@ చాతకం,
:) కొత్త తరపు స్కూళ్లన్నీ అంతే. మరి పాత పద్ధతుల్లో చెప్తారా ఏంటి? ప్రతీదీ చూపించి, నిరూపించి చదివిస్తారు కదా?
@ అనాన్,
కదా? :)
@ మౌళి,
మరి సినిమాలన్నింటికీ మన హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఎంత బిల్డప్ ఇస్తారు? వాళ్లతో పోలిస్తే,, నేనిచ్చిన బిల్డప్ ఒక లెక్కలోకొస్తుందా అసలు?
@కొత్తావకాయ,
అలాగే.. తప్పక ఐడియాలిస్తా..కానీ..మరి.. కర్సౌద్ది పర్లేదా?
@ Found In Folsom,
థాంక్స్..
:) అప్పుడే ఏం చూశారు? ఇంకా ఎన్నెన్ని ప్రాజెక్టులు చేస్తే పిల్లలు పెద్దవాళ్లవుతారు?
నిజమేనండి ,ఈ ప్రాజెక్ట్ ల వలన పిల్లలకు పెద్దలకు చాలా ఇబ్బంది అవుతున్నది.ప్రాజెక్ట్ చేస్తే పిల్లలకు అవగాహన పెరుగుతుందని పెట్టారు.కానీ ఈ స్కూలు వాల్లు ఆ కాన్సెప్ట్ ను సరిగా అర్థం చేసుకోలేదు.ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ ,మార్కుల కోసం లాగా అయ్యింది.దీనివలన పిల్లలు నేర్చుకోవడం పక్కన పెట్టి వాల్లను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.ప్రాజెక్ట్ ఇచ్హారంటే నే పిల్లల కంటే ముందు పెద్దలకు గుండెల్లో రాయి పడుతుంది.ప్రాజెక్ట్ కోసం ఎప్పుడు ఏ అవసరం వస్తుందో నని బయట కనిపించిన చెత్త ను తీసికొని వచ్హి ఇంట్ళొ పెడుతున్నారు.పడేయ వలసిన చెత్తను కూడా ఇంట్లోనే పెడుతున్నారు.ఈ ప్రాజెక్ట్ వలన ఇల్లు ఒక చెత్త కుండీ లాగా తయారవుతున్నది.
@ రమణారెడ్డి గారు,
కరెక్ట్. మార్కులు పెట్టకపోతే సీరియస్ నెస్ ఉండదని వారి వాదన. మార్కులు పెడితే ఒత్తిడి పెరిగిపోతుంది.
ఇదొక వలయం..
బయట చెత్త అంతా ఎందుకైనా మంచిదని ఇంట్లో మేమూ పేర్చుకుంటున్నాము. పారేసిన రెండో రోజే అవసరం పడుతోంది కదా?
Hilarious!
హహహ! ఈ పక్షి గూడు మీ పక్కింటామె లానే కొబ్బరి ఈనెలూ, కుంచె చీపురు కొనలూ ఫెవికాల్ తో అంతించి నేనూ చేసానండి జతగా రెండు ఫెవికాల్ గుడ్లు కూడా:))పక్షి ఈకెల కధ బాగుంది:))
ఫెదర్స్ అని ముద్దుగా అనక ఈకలు అంటారేమిటి మీరు?
ఈకలు పీకడం మీ పిల్లల టీచర్స్ నేర్పుతున్నారన్న మాట. సంతోషం......దహా.
ఈ ప్రాజెక్టుల కంటే పిల్లలకు కొన్ని వౄత్తులు నేర్పిస్తే బాగుంటుంది.ఉదాహరణకు:- ప్లంబింగ్,కార్పెంటరీ ,ఎలక్ట్రీసియన్ లాంటివి. ఎందుకంటే ఇంట్లో ఎదైనా ట్యాపు పోయినప్పుడు పనివాల్లను పిలవాలంటేనే భయమేస్తున్నది. 5 నిముషాల పనికి కూడా వాల్లు 200 నుండి 300 అడుగుతున్నారు.అప్పుడు ఎవరి సహాయం లేకుండా ఆ పనులు వీల్లే చేసుకుంటారు.వచ్హే సంవత్సరాలలో ఏదైనా పనికి పని వాల్లను పిలిచి చేయించు కునే వసతి ఉండదు.ఎందుకంటే ఆ వస్తువు విలువ కంటే పని వాల్లకు ఇచ్హేదే ఎక్కువ ఉంటుంది.అలాగే కొన్ని చేతి వౄత్తులను నేర్పించాలి.ఉదా:- కుండలు చేయడం,వ్యవసాయం ,చేనేత ,కంసాలి పని,చెప్పులు కుట్టడం చూపించి కొన్ని చేయమనాలి. అలా చేయడం వలన ఆ వౄత్తుల మీద గౌరవం
ఈ సారి జూ కి వెళ్ళి మరిన్ని ఈకలు తెచ్చుకోండి.
@kothavakaya,
I did the project... I mean my child did the same project few years back. I went and bought 100 1 cent stamps and pasted them on a poster board. Cheap, simple, effortless. No glue needed.
It was a stupid project if you ask me. What was the point?
హహహ పిల్లలకి ప్రాజెక్ట్ అన్నప్పుడల్లా పేరెంట్స్ కి పరీక్ష అనమాట :) ఈ సారి ఎవరయినా కోయదొరని పరిచయం చేసుకోండి, బోలెడు రకాలు తెచ్చి పెడతాడు, మీరు శ్రమ పడనవసరం లేదు.
mee *project 2012-pakshi eekaiani sampadinchadam ela- 17. 02.2013 aadivaram aandhrajyothi sanchikalo
prachuristhunnam. gamaninchagalaru
- editor, andhrajyothi
Wow ముందే కుచ్చు ఈకలకి పేటెంటు తెచ్చుకోండి, ఈ కధ పేపర్ లో వస్తే ఈకలు, రాళ్ళు రప్పలతో కుటీర పరిశ్రమలు వెలుస్తాయి.ఇంకా మహిళల కు ఏ పధకం ప్రకటించి ప్రచారం చేసికోవాలా అని సతమతం అవుతున్న చంద్రబాబు ఈ అయిడియా చుస్తే తర్వాత చేసేదేం లేదు :)
అంతవరకూ పర్లేదు, పక్షి గూడులకు స్టీలు సామానులు, అమ్మే వాళ్ళు వచ్చినా వస్తారు. పాపం పక్షులకు పునరావాసం ???? ఆంధ్రజ్యోతి లో ఈ టపా రావడం వలన పక్షుల సంక్షేమానికి ముప్పువుంది. పక్షిప్రియుల మనోభావాలు గాయపడతాయి.
ఆదివారం ఆంధ్రజ్యోతి కి అభినందనలు, ఈ వివాదం తో పాపులర్ అయిపోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. :)
@దంతులూరి కిశోర్ వర్మ గారు,
థాంక్స్!
@సునీత గారు,
బాగుంది, బాగుంది :) థాంక్స్..
@బులుసు వారు,
:) అలాగలాగే! ఫెదర్స్ అని డాబు గా అంటా లెండి. ఈకలు అనను. ద హా...
@ రమణారెడ్డి గారు,
నిజమే. బాగా చెప్పారు. ౧౦౦% అంగీకరిస్తాను..
@బోనగిరి గారు,
:) ఈ సంవత్సరానికి అయిపోయింది. వచ్చే సంవత్సరం రకరకాల జంతువుల గోళ్లు, పళ్ళ మీద రాయమనకపోతే అదే పదికోట్లు..
@ కొత్తావకాయ,
చూసుకోండి. అజ్ఞాత ఇక్కడ చాలా మంచి ఐడియా ఇచ్చినట్లున్నారు.
@ రసజ్ఞ,
మరే! బందిపూర్ అరణ్యాలకి మళ్లీ వెళ్లే శ్రమ తప్పుతుంది :)
@ ఆంధ్రజ్యోతి ఎడిటర్,
ధన్యవాదాలు. ఆదివారం కోసం ఎదురు చూస్తాను.
@ మౌళి,
LOL
నాకు నా భవిష్యత్తు చాలా భయపెడుతూ కనపడుతోంది కృష్ణ గారూ మీ అవస్థల్లు చదువుతుంటే...మొన్నే ఖాళీ చెప్పుల డబ్బా అలంకరించి తెమ్మంటే..ఖాళీ చెప్పుల బాక్స్ కోసం ఇప్పుడు నేను చెప్పులు కొనుక్కోవాలా అని తెగ ఆలోచిస్తుంటే మా వారు తనది ఎక్కడో వున్నది గబగబా పట్టుకొచ్చి నా మొహాన పడేశారు మళ్ళీ ఎక్కడ చెప్పులు కొనేస్తానో అని...:)
రెండో సారో , మూడో సారో అనుకుంటా ప్రింట్ మీడియా లో మీరు రాసినవి ప్రచురించటం . అభినందనలు !
పోస్ట్ as usual rocks :-)
@స్ఫురిత,
LOL.. ఇదిగో.. ఈ స్కూల్ ప్రాజెక్టుల మూలాన, ఇళ్లల్లో, ముచ్చిరేకులూ, అట్ట పెట్టెలూ, ధర్మా కోల్,విరిగిన వస్తువులూ అన్నీ వచ్చి చేరాయి. పారేశామా? అంతే సంగతులు. మర్నాడే ఇస్తారు నాలుగు సుత్తి ప్రాజెక్టులు. చెత్త కుండీ వైపు పరిగెత్తాలి..లేదా మీరన్నట్టు కొత్త చెప్పుల్లాంటివి కొనాలి :)
@ శ్రావ్య,
థాంక్స్ .. అవును. ఇంతకు ముందర ‘నమస్తే ఆంధ్ర’ అన్న పత్రిక వాళ్లు నా పాట ల పోస్ట్ వేశారు.. ఆంధ్రజ్యోతి వారు బ్లాగర్ల ప్రత్యేక ఆదివారం అనుబంధం 2012 జనవరి ఫస్టు న వేసినప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కథ ఒకటి వేశారు.
I am happy.
నిన్న పోస్ట్ చదివి నవ్వుకుంటూ వెళ్ళి, కామెంట్ వ్రాద్దామని మళ్ళీ ఇప్పుడు వచ్చాను.
ఆంధ్రజ్యోతిలో రాబోతుందని చూసి శాటిస్ఫై.. అనిపించింది.
కంగ్రాట్యులేషన్స్ ప్రియగారూ..
ఇవన్నీ దాటేసాం...మళ్ళీ ఆ ఈకలు ఏరుకునే రోజులొస్తే బావుండనిపిస్తుంది...
nice one......
అజ్ఞాత గారు, మంచి ఐడియా ఇచ్చారు. రేపే చలో పోస్టాఫీస్! థాంక్యూ.:)
@kothavakaya,
I bought a straws pack (yes. the ones we use to drink)and sent it for my son. very easy.
Sree
గీతిక గారూ,
థాంక్స్.. నాకూ చాలా సంతోషం గా ఉంది.
జ్యోతిర్మయి గారు,
వస్తుంది ఒకటి రెండు దశాబ్దాల్లో, మనవలకి :)
రాజు గారు,
ధన్యవాదాలు.
కొత్తావకాయ గారు,
మీకు ఇంకో ఐడియా ఇచ్చినట్లున్నారు.. శ్రీ గారు.
Chaala bagundi maa babu 1 mark project print kosam mundu ratri menu max varu shop moose time ki (into printer sudden ga chachipoyindi Mari) hadavidiga parigetti approxmately 1800 rs kharchu chesi techina vainam gurtuvachindi lekapote vadu edustadani badhaanthe
Post a Comment
మీ అభిప్రాయం...
Note: Only a member of this blog may post a comment.