Thursday, November 10, 2011

కార్తీక మాసం వన భోజనాలు – ఇదిగో.. నా వంట!కార్తీక పౌర్ణమి కి జ్యోతి గారేమో బ్లాగ్లోకం ఘుమ ఘుమ లాడిపోవాలన్నారు. సరే చూద్దాం, చేద్దాం అనుకుని చూస్తే అది గురు వారం అయింది. నేనేదో ‘వీకెండ్’ పూట ‘బాగా ఆలోచించి’, ‘అర్థవంతమైన’ టపా వేద్దామనుకుంటే.. వారం మధ్యలో బుధ వారం పూట రాయమనేశారు.. ‘తప్పుతుందా?’

క్రితం ఏడు టల్లోస్ చూశారు గా .. ఎలా చేయాలో.. బుధ వారం పూట ఏదైనా పుల్ల పుల్ల గా ‘లొట్ట లేస్తూ’ తినాలనిపించిందనుకోండి.. ఆవకాయలు తీయబుద్ధవలేదనుకోండి.. అన్నీ పోపు సామాన్లు, ఉప్పూ, కారం గట్రా ఉండి, నాలుగు ఉసిరి కాయలు దొరికితే ఐదు నిమిషాల్లో తయారయ్యే ‘లొట్టల్స్’ దగ్గరుండి నేర్పిస్తా..లొట్టల్స్ తయారీ కి కావలసిన పదార్థాలు..ఉసిరికాయలు ఒక దోసెడు

ఉప్పు ఒక చారెడు

పసుపు చిటికెడు

కారం ఉప్పుకి రెండు రెట్లు.

నూనె చిన్న మట్టు గిన్నెడు

మెంతి పిండి తేనీటి చెంచాడు

ఆవ పిండి బల్ల చెంచాడు.

ఆవాలు తల గొట్టి బల్ల చెంచాడు

కర్వేపాకు నాలుగు రెబ్బలు

ఉపోద్ఘాతం :2009 జనవరి 26 న సరదాకి ఒక ఉసిరి మొక్క తెచ్చి ఇంటి వెనక స్థలం లొ నాటాను. అది విరగ కాస్తోంది. కార్తీక మాసమేమో.. చూస్తూనే నోరూరిపోతోంది.

కార్తీక మాసం లో ఉసిరికాయలు తినాలంటారు.. నాకు ఏమాసమైనా ఉసిరికాయలు తినటమంటే తగని ఇష్టం!ఇదిగో... ఇలాగ ఒక కర్ర తెచ్చి చెట్టుని బాది, రాలిన కాయల్ని ఏరి .. వట్టివి కానీ, ఉప్పూ, కారం అద్దుకుని కానీ , తినగల్గినన్ని తినేయగా మిగిలినవి ఒక పళ్లెం లో పెట్టుకోవాలి.కర్వేపాకు పెరట్లోంచి దూసుకుని

ఇలాగ పేర్చుకుని,

పోపు సామాన్లన్నీ ఒక దగ్గర అమర్చుకుని..మూకుడు పొయ్యి మీద పెట్టి, కాస్త వెచ్చబడ్డాకా నూనె వేయాలి.అన్నట్టు ఉసిరి కాయలకి ఒక షవర్ కొట్టాలి. .. మట్టి లోంచి ఏరాం కదా, ఎంతైనా ..నూనె కాగేలోపల ఒక పిట్ట కథ :

మా తాతగారు మా స్కూల్ టిఫిన్ బాక్సులు చూసి.. ‘ఛా.. ఇవేం తిండ్లర్రా! మా చిన్నప్పుడు మూడు గిన్నెల ఇత్తడి కారియర్ లో అన్నం పెట్టుకుని ఒక దాంట్లో నిమ్మకాయంత ఘాటు గా పోప్పెట్టిన చింతకాయ పచ్చడన్నం లో సగం నూనె గిన్నె వంపి కలిపి ఒత్తు గా పెట్టుకుని, ఇంకో దాంట్లో అప్పటికప్పుడు జాడీ లోంచి తీసి కొత్తిమీర, పచ్చి మిర్చి వేసి దంపి ఇంగువ పోప్పెట్టిన ఉసిరి కాయ పచ్చడన్నం కలుపుకుని, పై గిన్ని లో పెరుగన్నం రవ్వంత ఉప్పేసుకుని కట్టుకుని ఓ మాగాయ ముక్కో, ఆవకాయ బద్దో.. ఇలా చెప్తూ పోతుంటే... ఇక మేమా బచ్చలి కూర పప్పులూ, కారట్ పెసరపప్పు కూరలూ తింటే ఒట్టు..

నూనె కాగాక, కాస్త ఇంగువ వేసి, ఉసిరి కాయల్ని వేయాలి. కొద్దిగా కదుపుతూ మగ్గ నివ్వాలి. మగ్గే లోపల మా ఇంట్లో ఉసిరికాయ కి ఉన్న ప్రాముఖ్యత :

మనకి పురాణాల్లో రెండు మొక్కలని అత్యంత పూజనీయమైనవని చెప్పారు. ఒకటి ధాత్రి (ఉసిరిక) , రెండు తులసి. నాకు ఎప్పటినుంచో ఈ రెండు పేర్లంటే చచ్చే ఇష్టం. అందుకే నా ఇద్దరు పిల్లలకీ ఆ పేర్లు పెట్టుకోవాలని అనుకుంటూ ఉండేదాన్ని. అనుకున్నట్టు గానే మా పెద్దమ్మాయి కి ధాత్రి అని పెట్టాము. చిన్నదానికి తులసి అన్న పేరు రికార్డ్ కెక్కక పోయినా, బియ్యం లో రాయించి నా ముచ్చట తీర్చుకున్నాను.

రోగ నిరోధక శక్తి బోల్డు ఉన్న ఈ ఉసిరి లో సీ విటమిన్ చాలా అధిక స్థాయి లో ఉంటుంది. పచ్చిరాచ ఉసిరి ఒక్కటి తింటే చాలు.. ఇంక ఆ రోజుకి సీ విటమిన్ గురించి ఆలోచించక్కర్లేదు

కాస్త మెత్తపడ్డాక, చింతపండు రసం ఉసిరికాయల మీద పోసి కలియ పెడుతూ ఉండాలి.  ఉప్పూ, పసుపూ వేసుకుని..కొద్దిగా రుచి చూసుకుని ..కారం, మెంతి పిండీ వేసుకుని,పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారాక ఆవ పిండి కలపాలి.చల్లారేలోపల.. ఇంకో కథ..

కుక్కర్ మూత తీస్తూనే కళ్లముందు పొగలు తప్పితే ఏదీ కనపడకూడదు. అంత వేడన్నం లోకి ఇంత ఉసిరి పచ్చడి వేసుకుని, మధ్యలో గుంట చేసుకుని నెయ్యి వేసి పెడితే అసలు అన్నం తినటానికి రామని ఏ పిల్లలు పేచీ పెట్టగలరు?

మా పాప కి అలవాటు చేయటానికి ‘ధాత్రి రైస్’ అని చెప్పేదాన్ని. తర్వాత చుట్టు పక్కల తల్లులు వచ్చి గొడవ గొడవ చేసి పోయారు. ‘ఏమ్మా! నీ పాటికి నువ్వు ధాత్రీ రైస్ అని పెట్టేస్తే.. మా పిల్లలకి మేమేం వంట ని వాళ్ల పేరు తో పెట్టుకోవాలి అని..  అదీ కథ!అన్నట్టు మూకుట్లో మిగిలిన నూనె లో కాస్త ఆవాలు చిటపట లాడించి పోపు పెట్టుకోవాలి. కర్వేపాకు చుట్టూ సాధ్య మైనంత అందం గా పెట్టి ఎవర్నైనా కాస్త రుచి చూడమనాలి.వాళ్లు ఇదేంటి? అని అడిగారనుకోండి. అసలు తింటే .. మీరే చెప్తారు అని చూడండి. తిని.. వాళ్లేల్ల్ల్ల్ల్ల్ల్ల్ ట్ట!! అనేస్తారు  
ఏమ్మా! పేద్ద నువ్వు కనిపెట్టిందేంటి ? అంటారా?


అంటే ఉసిరికాయ ఊరగాయ చేసేటప్పుడు వాడేవి రాచ ఉసిరికాయలన్నమాట. అలాగే వాటికి కాస్త ఫోర్క్ తో గాట్లు పెట్టటం, కుక్కర్ లో ఆవిరి పైన ఉడికించటం లాంటివి చేస్తారు. ఇక్కడ నేను చేయలేదన్నమాట.

ఇది ఎలా తినాలి?

చూపుడు వేలు తో నాకచ్చు, లేదా, అన్నం లోకి తినచ్చు. ఇంకోటి.. ‘ఉసిరిక్ సాండ్ విచ్’ చేసుకుని కూడా లాగించవచ్చు

40 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

ha ha... good one :)))))))

కొత్తావకాయ said...

అబ్బబ్బో.. చవులూరించేస్తోంది. చింతపండు పులుసు కలపడం మాత్రం కొత్త విషయం. అన్నట్టు కావలసిన పదార్ధాల్లో చింత పండు పులుసు చెప్పడం మరిచిపోయినట్టున్నారు. అయినా ఉసిరి పులుపు సరిపోదంటారా? లేక మగ్గడానికా? మీ అమ్మాయి పేరు వెనక కథ మహ బావుంది. పనిలో పనిగా ఉసిరిచెట్టు చూపించేసారుగా! దాని కింద కూర్చుని ఉసిరిక పచ్చడితో తింటున్నట్టు ఊహించేసుకుంటున్నాను. :)

జేబి - JB said...

ఉసిరికాయలని చూడగానే నోరూరింది, మనసు గతంలోకి వెళ్ళిపోయి బళ్ళో తేలింది. తొమ్మిదిలో నా తమిళ మిత్రుడివాళ్ళ అమ్మ ఇంచుమించు ఇలాగే చేసి (చిత్రంలో చూపించినంత ఎర్రగా కాదు, మీరు మూకుడులో వేయిస్తున్న చిత్రంలో చూపించిన రంగు) రోజూ వాడి డబ్బాలో పెట్టి పంపిస్తే మేం ఊదేశేవాళ్ళం.

మీరు వివరించిన విధానం, పిట్ట కథలు బాగున్నాయి.

అలాగే టల్లోస్‌తో గుర్తొచ్చింది. క్రితం సంవత్స్రరం, నాకు తెలీకుండానే నేను పెట్టిన "పెసరట్టు + అల్లప్పచ్చడి + బ్రూ కాఫీ" వ్యాసం జ్యోతిగారు పెట్టిన పోటీల్లోకి వెళ్ళిపోయి పెద్ద పేరు వచ్చేసింది. ఈసారికి మా క్యాంటీనువారి వంటకాలపై రాసుకోవడంతో (ఇంగ్లీషుబ్లాగులో పెట్టా - తెలుగులో అనువదించాలి) తృప్తి చెందుతున్నా.

విరిబోణి said...

mee chetulu challagundaa :)naa nooru ooripothundi ekkada ..nenu urgent gaa lottals veyali...naaku pampistunnara ledhaa :)

Sravya Vattikuti said...

NOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
ఇది లోట్టల్స్ కాదు టెంపరరీ ఉసిరి ఆవకాయ :))) ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా :)))
పిట్ట కథలు బావున్నాయి , ధాత్రి రైస్ సంగతి సరే మరి తులసి కర్రీ లాంటిది కూడా ఏదన్న ఉందంటారా :)))

జ్యోతి said...

వావ్! స్టెప్ బై స్టెప్ చెప్పేసారా. శుభం.. మళ్లీ వచ్చి తీరిగ్గా చదువుతాను..

Anonymous said...

"..ఎవర్నైనా కాస్త రుచి చూడమనాలి.."
ఇది చదివి ఫక్కున నవ్వేసాను. మనం ఏదైనా వండితే, ఇదే తంతు, మనమే రుచి చూసేంత ధైర్యం చాలక...

Kathi Mahesh Kumar said...

:) :) :) :)

టీవీల్లో వచ్చే వంటావార్పూ, మాయింటి వంటలకన్నా "మీ ఇంటి వంట" బాగుంది.

లత said...

చిన్న ఉసిరికాయలు కనుక లొట్టల్స్ అన్నారా లేక మీ పచ్చడి చూసి ఎటూ లొట్టలేస్తాము కనుక ఆ పేరు పెట్టారా
పచ్చడి నోరూరిస్తూ చాలా బావుంది.పెద్దవాటితో పచ్చడి నేనూ చేస్తాను కానీ చిన్నకాయలతో ఎప్పుడూ వినలేదు

అన్నట్టు మీ గార్డెన్ ఫొటోస్ బ్లాగ్ లో పెట్టొచ్చు కదా, చూసి అన్నా ఆనందిస్తాము.

Anonymous said...

బ్లాగు భోజనాల లో మొదటి వాయనం మీదేనండీ .
నాకు పులుపు ఇష్టం ....ఉమ్మ్...లొట్టల్స్ .
కార్తీకమాసంలో తినమన్న ఉసిరి ఇది కదేమోనండీ . పెద్ద ఉసిరి అంటారే అది . ఆ చెట్టుకి పూజలు చేస్తారు కదా . అయినా పోన్లెండి అందుబాటులో ఉన్నదే అనువైనది అనుకుందాం .

కృష్ణప్రియ said...

@ WP,

:) ధన్యవాదాలు

@ కొత్తావకాయ,

:) నిజమే మర్చిపోయాను. మళ్లీ కరెక్ట్ చేస్తాను. ఉసిరి పులుపు బాగానే ఉన్నా, కొద్దిగా పుల్లటి గ్రేవీ లాగా ఉండటానికి, ఇంకా మరీ నూనె లో పూర్తిగా వేయించకుండా..

మా ఇంటికి రండి.. రాచ ఉసిరి చెట్టు కూడా చూపిస్తా.. (కార్నర్ ఇంటి వారిది.. :) )

మాలా కుమార్ said...

మా ఇంట్లోనూ ఈ ఉసిరి విరగ కాస్తుంది . పక్కింటి ఎదురింటి పిల్లలు కోసుకెళుతూ వుంటారు . మీ లొట్టాస్ ట్రై చేస్తాను .

కృష్ణప్రియ said...

@ జేబీ – JB,
ధన్యవాదాలు.
అవునా? తమిళులు మనంత కారం తినరు కదా.. అయినా సీజన్ అంతా చాలా సార్లు సరదాగా చేసుకోవటానికి అంత నూనె, కారం వాడటం అనవసరం లెండి. ఉసిరి కాయ కి అసలు ఏదీ కలపక పోయినా తినేయచ్చు..
అవును.. మీ వ్యాసం విషయం గుర్తుంది. నేను చదివాను. తెలుగు బ్లాగ్ లో కూడా పోనీ ఆ ఆంగ్ల వ్యాసాన్నే (లేదా లింక్ నో) పెట్టేయచ్చు కదా సమయం లేకపోతే..

@ విరిబోణి,
వచ్చేయండి.. అడ్రస్ పంపండి. గంగాళం లొట్టల్స్ పంపేయనూ.. (స్వగతం : దూరపు కొండలు నునుపు అంటే ఇదే అన్నమాట.. విరిబోణి ఒక దేవత! ఇంట్లో వాళ్లూ, పక్కవాళ్ళూ మరీ తప్పించుకు తిరుగుతున్నారు..)

కృష్ణప్రియ said...

@ శ్రావ్య,

మీరు ఇంకో నలభై OOOO లు పెట్టినా.. ఇది టెంపరరీ ఉసిరికాయ కాదు :))
చెప్పాగా.. చిన్న చిన్న తేడాలు :)

ఒక్కసారి 'కింగ్ ' సినిమా లో బ్రహ్మానందాన్ని గుర్తు తెచ్చుకోండి..

'ఆ ఉసిరికాయల సైజ్ ఏంటి? వీటి సైజ్ ఏంటి? ఆ టేస్ట్ ఏంటి? దీని రుచేంటి? దాని పేరేంటి? దీని పేరేంటి?'...

అసలు తులసి కర్రీ ఒక్కటనే ఏంటి? . ఈసారి మీ పుట్టిన రోజుకి ‘స్వీట్ శ్రావ్య ‘ టపా వేస్తా ఉండండి. :))

@ జ్యోతి,
మీరడిగారని, ఒక మీటింగ్ ఎగ్గొట్టి మరీ కెమెరా చార్జ్ చేసి మా అమ్మాయి, నేను .. ఈ పని మీదే ఉన్నాం నిన్న.
నేను వంట, తను ఫోటోలు..

@ అజ్ఞాత,
:) మరి? మనల్ని మనమే కష్టపెట్టుకుంటే ఎలా? అలాంటి వారిని (తమ వంట తామే రుచి చూసే వారిని) ‘మాసోచిస్టులు’ అంటారని వినికిడి.

కృష్ణప్రియ said...

మహేశ్ గారు,
థాంక్సు!
లత గారు,
:) అంటే రెండు విధాలు గానూ.. అన్నమాట! చిన్న ఉసిరి చెట్టు ఉన్న వారి బాధలు ఇంతా అంతా కాదు. మనమంతా ఆనందం గా తిన్నా.. కనీసం రెండు బస్తా కాయ రాలిపోతుంది, మిగిలిపోతుంది. ఈ కాయ కాసే సీజన్ లొ అందరూ మనల్ని తప్పించుకు తిరుగు తారు. అందుకని అన్ని రకాలూ చేసుకోవటమే ఉత్తమం.
గార్డెన్ ఫోటోలు పెడతానండీ.. బద్ధకం. నాకు గార్డెనింగ్ చాలా పిచ్చి. ఈసారి క్రిస్మస్ సెలవల్లో పెడతా.

@ లలిత గారు,
నిజమే. కార్తీక మాసం లొ చెప్పింది.. రాచ ఉసిరి కాయ గురించి. మీరన్నట్టు.. అందుబాటు లొ ఉంది, ఇంట్లో కాసింది కాబట్టి చిన్న ఉసిరి తో ఇలా సరిపెట్టేసా..

జ్యోతిర్మయి said...

అబ్బో ఎంత బావుందో..ఇప్పటికిప్పుడు తినేయాలనిపిస్తోంది. ఫోటోలతో సహా పెట్టేసారుగా మంచి రంగు రంగుల గిన్నెలు, దినుసులతో కళకళలాడిపోతూ ఉంది.

Ennela said...

అదేంటీ, జ్యోతి గారు పెట్టిన పోస్టు ఇందాక చూసి ఏదో వెబినార్ విని ఇలా వచ్చానో లేదో అప్పుడే మీరు పచ్చడి పెట్టెయ్యడం మిత్రులు లాగించెయ్యడం కూడా అయిపోయాయా...వా..బర్త్ డే బేబీకి ఇలా కారం పెడతారా...మీ తో కచ్చి..

Ruth said...

అబ్భ !!! నోట్లో నీళ్ళూఊరిపోతున్నయ్ ! నాకు పులుపు అంటే, ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్వు ఇంకా చాలా చాలా... అందులోను, ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు గానీ, ఎలాంటి వంటలు చేసుకోవాలో తెలీదు. బజార్లో ఉసిరికాయలు చూసినప్పుడల్లా ఉసూరుమంటూ ఉంటాను (ఇంతకు ముందు చాలా సార్లు కొని ఏం చెయ్యాలో తెలీక వేస్ట్ చేసానని మా అప్పారావ్ నన్ను కొననివ్వరు).
ఉసిరికాయతో పులిహోర చేస్తాను, ఇంకా పప్పులో వేస్తాను కాని నలుపు వచ్చేసి సరిగ్గా తినరు జనాలు(నాకు వంటల్లో కరల్ పేలట్ట్ అంటే కొంచెం పట్టింపు ఎక్కువ). ఈ సారి ఎలాగైనా ఈ లొట్టస్ చెయ్యవలసిందే పైగా మా ఇంట్లో(మమ్మీ వాళ్ళ ఇంట్లో) ఈ చిన్న ఉసిరి కాయల చెట్టు కూడా ఉంది!
thanks for a good recipe n btw, ఇది పెద్ద ఉసిరికాయల్తో కూడా చెయ్యొచ్చా ?

..nagarjuna.. said...

అసలేంటండీ మీ కుటుంబరావుణిల దౌర్జన్యం....మూకుమ్ముడిగా ఇలా వంటలు, భోజనాలు, పచ్చళ్ళు అని నోరూరించేస్తున్నారు. ఇలా ఐతే ఎలా , హౌ అని కొసెనింగ్ అద్దెచ్చా...ఇప్పటికిప్పుడు నూనెలో బాగా ఊరిన ఫ్రెష్ ఉసిరికాయ పచ్చడి ఎలా సంపాదించాలి ఎలా ఎలా ఎలా !? మా కౌటిల్యుడిని అడగాల్సిందే తప్పేట్టులేదు :)

కృష్ణాజీ ఈరోజు రాత్రి మీ వంటింట్లోంచి గిన్నెలు పడేసిన,గ్లాసులు పగిలిన శబ్దాలు గట్రా వస్తే భయపడొద్దు...మేము చోరకళలో ప్రావీణ్యం సంపాదిస్తున్నామని ఊరుకోండి :)


ఉసిరికాయంటే రీసెంట్ గా రసజ్ఞగారు వేసిన దొంగల పోస్ట్ గుర్తొస్తుంది....స్కూల్ నుండి తిరిగొచ్చే దారిలో ఒక ఇంట్లో ఉసిరి చెట్టుండేది...ఖర్మకొద్దీ దుక్కలాంటి ఓ అల్సేషన్ కుక్క కూడా ఉండేది. దాని కంటపడకుండా కాయలు ’దొంగతనం’ చేసి తింటుంటే ఉండేదీఈఈఈఈఈ.....అహా!

'Padmarpita' said...

Hmmm....నోటిలో నీళ్ళూరుతున్నాయి:-)

శిశిర said...

చిన్న ఉసిరికాయలు పచ్చివి తినడానికే అనుకున్నాను. ఇలా ఊరగాయగా కూడా చేయచ్చని తెలియదండి. బాగుంది.

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

వా..........వ్ ! లొట్టల్సు చాలా చాలా చాలా బాగున్నాయండీ, అబ్బా! పళ్ళు జివ్వ్ ..... మంటున్నాయి. బాల్యాన్ని గుర్తు తెచ్చారు. చిన్నపుడు ఎన్ని తెనేదాన్నొ !
"ధాత్రి" చాలా చక్కని పేరు. ఈ సారి మా కిట్టి పార్టిలో ఉసిరిపచ్చడి, అన్నం కలిపి పెట్టి " ధాత్రి రైస్" అని చెప్పి పెట్టేస్తాను. మంచి ఐడీయా యిచ్చారు !

సిరిసిరిమువ్వ said...

నిజంగానే ఈ చిన్న ఉసిరికాయలు చూస్తే లొట్టలు వేయాలనిపిస్తుంది..మీ వంట సూపరు.

ఎంచక్కా మీ తోటలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోంచెయ్యొచ్చు అన్నమాట!

కృష్ణప్రియ said...

మాల గారు,
తప్పక ప్రయత్నించండి. అసలు ఉసిరికాయల తో చాలా రకాలు చేసుకోవచ్చు కదా.. పప్పు, కొత్తిమీర,పచ్చి మిర్చి వేసి పచ్చడి, మురబ్బా.. :)

జ్యోతిర్మయి గారు,
ధన్యవాదాలు.

@ ఎన్నెల,
మీ బర్త్ డే బేబీ కి స్వీట్లు తిని తిని బోర్ కదా.. పైగా మీకు కారం ఇష్టం అని మీ టపా ద్వారా అర్థమైపోయింది :) థాంక్స్!

@ రూత్,
అసలు ఇది పెట్టేదే రాచ ఉసిరితో. కాకపొతే ప్రెషర్ కుక్కర్ లొ ఒక ఐదు నిమిషాలు ఆవిరి మీద ఉడకపెట్టి చేస్తే.. అద్భుతం గా ఉంటుంది :)
ఈ మెయిల్ చేస్తే ..ఇంకా బోల్డు ఉసిరి కాయల రెసిపీలు ఇస్తాను..

కృష్ణప్రియ said...

నాగార్జునా,
దర్జాగా తలుపు కొట్టి రావయ్య.. మళ్లీ ఈ మాత్రానికి గ్లాసులు బద్దలు కొట్టటం ఎందుకూ.
లేదూ, నాకు అదే సరదా అంటే.. దేవుడి గూడు దగ్గర హార్మోనియం పెట్టె పక్కన పెడతా సరేనా? :))

పద్మార్పిత గారు,
: ) థాంక్స్!

శిశిర గారు,
: ) థాంక్స్!

@ భమిడిపాటి సూర్యలక్ష్మి గారు,
ధన్యోస్మి! మొదటి సారి అనుకుంటా మీరు నా బ్లాగు లోకి తొంగి చూడటం!
మా పాప పేరు నచ్చిందన్నమాట! ఇంకేం .. ధాత్రి రైస్ చేసేయండి.. ఈసారి.

Chandu S said...

కృష్ణప్రియగారూ, ఫోటోలో చేతులు మీవేనా?

ఆ చేత్తోనే, వేడిగా అన్నం, కొద్దిగా నెయ్యి ప్లీజ్.

చింతపండు వద్దండీ, నాకూ మరీ పులుపు పడదు.

జయ said...

అప్పుడు టల్లోస్ ఇప్పుడు లొట్టల్స్. తప్పదండి, మీకు డబుల్ లొట్టలు:)

Mauli said...

లొట్టల్స్ WOW..ఉసిరికాయలని చూడగానే నోరూరింది

Krishna said...

కళ్ళార్పకుండా మీ పోస్ట్ చదువుతున్నానా,
ఈ మధ్యనే ఇంట్లో ఒకటో సంవత్సరం పూర్తి చేసి రెండో సంవత్సరం చదువుతున్న మా బుడుగ్గాడు ఓ గొప్ప విషయం నేర్చేస్కున్నాడు.
"బుడుగు నాన్న కూడా అప్పుడప్పడు జొల్లు కారుస్తాడని :-) "

రసజ్ఞ said...

లొట్టల్స్ అంటే ఏమిటా అనుకుంటూ వచ్చా! మా అమ్మ వీటినే ఉసిరి ఆవ బద్దలు అని చేస్తుంది తాత్కాలికంగా చేసే ఉసిరావకాయ! ఇలానే మెంతి పిండితో మెంతి బద్దలు కూడా వేస్తారు (ఉసిరి మెంతికాయ అని కూడా అంటారు) కదా ఉసిరికాయతో! ఏదేమయినా వన భోజనానికి తెసుకుని వెళ్తున్నారుగా నాకు పెట్టకుండా ఇలా నోరూరించడం బాలేదు!!!!!!!!!!

sunita said...

TThaa!! oe pedda loTTha!!!

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

తొంగి చూడడమేమీ కాదు. ప్రతీ బ్లాగూ చదువుతాను, మా శ్రీవారు కంప్యూటర్ దగ్గర లేనప్పుడు! వ్యాఖ్యలు ఆయన పెడుతున్నారు కదా అని, బధ్ధకిస్తూంటాను.పైగా ఆయన వ్యాఖ్యలు కాపీకొట్టాననైనా అనొచ్చు !

శ్రీలలిత said...

మొత్తానికి లొట్టలేయించేసేరండీ..
అభినందనలు..

కౌటిల్య said...

తినే ఉసిరితో ఊరగాయ పెట్టేశారా, మీరు సూపరు! అయితే చింతపండు పులుసు మరికాస్త ఎక్కువ పట్టిద్దేమో!

లేకపోతే నిమ్మరసం పోసి పెట్టినా సరిపోవచ్చేమో!

రాజ్ కుమార్ said...

నాకూ ఉసిరికాయల్ అంటే చాలా ఇష్టం అండీ. కలర్ఫుల్ కుఠోలు చూస్తుంటే నూరూరిపోతుందండీ.
కేక లొట్టల్స్.. తల్లోస్.... ;)

ఇదిగో ఈ గిన్నెలో కొంచేం వేసివ్వండీ ;)

కృష్ణప్రియ said...

@ సిరిసిరిమువ్వ,
: )) థాంక్స్! అవును మీరూ వచ్చి తినచ్చు.
@ చందు గారు,
అవును. ఆ చేతులు నావే. చింతపండు లేకుండా చేస్తా.. మీరైతే రండి..

@ జయ గారు,
: ) థాంక్స్ థాంక్స్!
@ మౌళి,
ఉసిరి కాయలు తలచుకుంటేనే నోరూరి పోతుంది నాకు కూడా..

కృష్ణప్రియ said...

@ కృష్ణ,
బాగుంది బాగుంది : ) బుడుగ్గాడికి ఇంతకీ రెండో సంవత్సరం నడుస్తోందా? చదువుతున్నాడా?
@ రసజ్ఞ,
అదే మరి. శ్రావ్య తో కూడా చెప్పింది.. ఇందులో రెండూ వేసా కాబట్టి ఉసిరి ఆవ,మెంతి బద్దలు అన్నమాట! : )
అదేంటి? వన భోజనాల్లో మీరూ పార్టేగా?

@ సునీత,
: ))
సూర్యలక్ష్మి గారు,
ధన్యవాదాలు!

కృష్ణప్రియ said...

@ శ్రీ లలిత గారు,
మీరూ ఇదే మొదలు అనుకుంటా, నా బ్లాగ్ లొ వ్యాఖ్య ఇవ్వటం. ధన్యవాదాలు!
@ కౌటిల్య,
అవును. మీరన్నది అక్షరాలా నిజం. నిమ్మరసం కూడా పోసుకోవచ్చు. రాచ ఉసిరి మీద కాస్త ఎక్కువ పడుతుంది..
@ రాజ్ కుమార్,
గిన్నేం ఖర్మ, ఇటువైపోస్తే అప్పటికప్పుడు చేసి పెట్టనూ.. ధన్యవాదాలు!

Krishna said...

కృష్ణ గారు,
బుడుక్కి రెండో ఏడు వచ్చింది పోయిన్నెల్లో!
నడక, మాటలు + గిచ్చడం, కొరకటం - వీటిలో లెవెల్ 2 చదువుతున్నాడు, చివరి రెండు ఎక్కువ ప్రాక్టీసు చేస్తాడులెండి మా పైన.

Sujata said...

అబ్బ ! ఉసిరికాయల్తో ఎంత బాగా చేసారండీ. News to me. ముఖ్యంగా పిట్టకధలు చాలా బావున్నాయి. నాకు పళ్ళు పులిసిపోతాయని, పులుపంటే భయం. కానీ చాలా మంధి ఈ వంటకం చూసి లొట్టలేసుకున్నారు. పేరు చాలా బాగా సరిపోయింది. అసలు ఎలా తట్టింది ? కాపీ రైట్లు మీవేనా ?

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;