Sunday, November 13, 2011

ఆర్ముగం తో సాయంకాలం చాయ్


చెన్నై లో మొట్ట మొదటి ఉద్యోగం, నాతో పాటు గా వచ్చిన వారంతా నాలాంటి వారే, మధ్యతరగతి కుటుంబాల్లోంచి, ఇంజనీరింగ్ లూ, MCA లూ చేసి కాంపస్ ఇంటర్వ్యూల్లో గెలిచి, ఉద్యోగ పర్వం లోకి అడుగిడుతున్న వారు.
చుట్టూ గమనించాను.. ఉన్నంత లో మంచి బట్టలేసుకుని, ముఖాన నాలుగైదు షేడ్ల లో ఎర్ర బొట్లు, కొందరు  అడ్డంగా, నిలువుగా! నామాలూ, విభూతి మనిషి కి ఒక రకం గా పెట్టుకున్నా, అందరి ముఖానా కామన్ గా ఉంది మాత్రం బోల్డు ఒత్తిడి, ఉద్వేగం! స్కూల్ కెళ్లే పిల్లల్లా ఆడ పిల్లలు ఫైళ్లు పట్టుకుని, పక్కన వారి తండ్రులు,  కొద్దిగా నవ్వొచ్చింది. నా పక్కన కూర్చున్న అబ్బాయి మాత్రం పెద్దగా టెన్షన్ పడుతున్నట్టు లేడు. బట్టలు చూస్తే బొత్తిగా రోడ్ల మీద ఆదివారం సంత లో కొన్నట్టున్నాయి. ఒక కొర్రు కూడా ఉన్నట్టుంది. పెద్దగా దాచాలన్న ప్రయత్నం ఏమీ కనపడట్లేదు. అతని దగ్గర్నించి, గాఢమైన లైఫ్ బాయ్ వాసన! తలకి కొబ్బరి నూనె,  ఇంక అంతకన్నా నల్లని మనుషులని బహుశా చూడాలంటే ఆఫ్రికా కి వెళ్లవలసిందే! నలుపు ఒకటైతే, ముఖం లో అసలు ఏ భాగమూ వేరే భాగం తో సంబంధం లేనట్టు ఒక వక్రంగా, అసలు చూడబుల్ గా లేడు. ఆ రోజుల్లో మనకసలు ఒళ్లంతా పొగరేమో, ఆ తర్వాత అప్రయత్నం గానే అతని వైపు వీపు పెట్టి ‘ప్రపంచం లో అన్ని విషయాలూ నాకే తెలిసినట్టు’ మాట్లాడుతున్న ఒకరిద్దరి చర్చ ని ఆసక్తి గా గమనించసాగాను. మధ్యలో ఏదో ప్రశ్న గాఢమైన తమిళ యాస తో అడిగినా ఒకటి రెండు పదాల్లో పొడి పొడి గా సమాధానం చెప్పి వదిలేశాను.
అందర్నీ కాన్ఫరెన్స్ రూము లోకి రమ్మని కూర్చోపెట్టి పరిచయాలు మొదలు పెట్టారు. అందరూ తమ, కాలేజ్, వారి పర్సెంటేజ్/స్కోరులు, హాబీలు,జీవిత ద్యేయాలూ గట్రా చెప్తున్నారు. ఉత్సాహం క్షణ క్షణానికీ, ఇంకా ఇంకా ఎక్కువవుతూ..  చివరికి ఇతని టర్న్!  ‘ I am Armugam..’  అని,  ముక్తసరి గా  ‘అన్నా యూనివర్సిటీ’ నుంచి వచ్చాననీ, హాబీలు ఏమీ లేవని, జీవిత ధ్యేయం అంటూ ఏర్పరచుకోలేదనీ, ప్రస్తుతం, సాధ్యమైనంత ఆసక్తికరమైన పని చేస్తూ, డబ్బు సంపాదించటమే తన గమ్యమనీ, ఇది భవిష్యత్తు లో మారవచ్చనీ చెప్పి వదిలేశాడు. అతని పరిచయం చాలా మామూలు గా జరిగినా,  అతని ఆక్సెంట్ కి దిమ్మదిరిగిపోయింది. ఒక్క క్షణం నేను విన్నది తమిళమే అనిపించింది. కానీ నాకు అర్థమైందే! అన్నట్టు.గ్రామర్ రూల్స్ అంటే అతనికి బహుశా ఐడియా కూడా లేదేమో అన్నట్టు!
 రిక్రూట్మెంట్ కో ఆర్డినేటర్ ధన్యవాదాలు చెప్తూ,.. ‘ఆర్ముగం పదవతరగతి లో తమిళనాడు ఫస్ట్! ఇంటర్ లో లెక్కలూ, సైన్స్ల్లో మూడు సబ్జెక్టుల్లోనూ మూడు వందలు సంపాదించాడనీ, ఆ సంవత్సరపు యూనివర్సిటీ టాపర్ అనీ.. గోల్డ్ మెడలిస్ట్ అనీ చెప్పినప్పుడు  నాకు చెంపదెబ్బ కొట్టినట్టైంది. సిగ్గుతో ఆ పూట అతనితో మాట్లాడలేదు. అలాగే.. అతని మార్కులూ గట్రా విన్నాకే ఆ మనిషి కి ఒక వాల్యూ ఆపాదించిన నా సంస్కారం మీద నాకు కొద్దిగా చిరాకు వేసింది. అతనికి తక్కువ మార్కులొస్తే ఒక మనిషి గా గుర్తించనా? అని ఒక ఆలోచన తో ఎందుకో ఎప్పుడూ అతనితో మాట్లాడింది లేదు. ఒక నెల రోజులు నానా రకాల ట్రేయినింగులు తీసుకున్నాం. అతనికి  రెండే చొక్కాలు ఉన్నట్టు గుర్తు. తనతో ఎవరు మాట్లాడినా హాయిగా మాట్లాడేవాడు.. కానీ తానుగా ఎవ్వర్నీ పలకరించేవాడు కాదు.  తర్వాత నేను వేరే డిపార్ట్మెంట్ లో పడటం తో అతని గురించి దాదాపు గా మర్చిపోయాను. ఎప్పుడైనా ఎదురుపడితే పలకరింపు గా నవ్వటం వరకే. తర్వాత మళ్లీ ఆర్ముగం గురించి నేను మళ్లీ ఒక ఏడాది పాటూ వినలేదు. నా ప్రాజెక్టులూ, పెళ్లీ, కొత్త ఉద్యోగం వెతుక్కుని సెటిల్ అవటం,.. కొత్త కంపెనీ లో కూడా అర్ముగాన్ని చూసి.. కొద్దిగా మాట్లాడాను, కానీ కలిసి పని చేయలేదు. ఎప్పుడో కాఫేటేరియా లో కనిపిస్తే ఒకటి రెండు మాటలు అంతే!  తర్వాత అమెరికా లో ఇంకో కొత్త అధ్యాయం..  
·                   ********                            ************                    ***********************          

ఆఫీస్ లో ఒక రోజు మధ్యాహ్నం పూట!.. మా బాసు గారు ఎవర్నో ఇంటర్వ్యూ కోసం తెస్తున్నట్టున్నాడు..చేతిలో రెజ్యూమె..వెనక నడుస్తున్నాడు ఎవరో. ‘హాయ్ కృష్ణా!  I got some old friend of yours!’  అని ఇంటర్వ్యూ కాండి డేట్ ని చూపించాడు. ఇండియా నుండి బిజినెస్ వీసా మీద వచ్చాడు. మన రాజు రిఫర్ చేశాడని ఇంటర్వ్యూ కి పిలిచాను. అన్నాడు.
 ‘అరే! మన ఆర్ముగం! ‘ అనుకున్నాను. కాస్త నలుపు విరిగింది, జుట్టు పల్చపడింది, ఒళ్లు చేసినట్టున్నాడు. బట్టలు కూడా ఇదివరకు కన్నా చాలా బాగున్నాయి.  నేను సంతోషం గా ‘హాయి! ‘ అన్నాను కానీ, అతని ముఖం లో అసలు నన్ను ఎప్పుడూ జీవితం లో ముందు చూసినట్టు ఆనవాలు లేవు. రజనీకాంత్ రోబో చిట్టి అంత భావహీనం గా ‘హలో’ అన్నాడు. నాకు తిక్క రేగింది. నేను వచ్చేశాను. క్యూబ్ లో కూర్చున్నాక కూడా చిరాకు తగ్గలేదు. ఇంటర్వ్యూ లో ఫిబోనాచీ నంబర్ల గురించి అడిగితే ఆపకుండా అనర్గళం గా కళ్లల్లో మెరుపు తో చెప్తున్నాడట.. అదే  నన్ను అడిగితే అంతే సంగతులు. నాకు మనుషులు గుర్తున్నంత సబ్జెక్ట్ గుర్తుండదు. అతనికి రివర్సేమో?  ‘సరే లెమ్మని’ తేలిక పడిన మనసు తో పనులలో పడ్డాను. అతని గురించి నా అభిప్రాయం అడిగితే నాకు తెలిసిన విషయాలు చెప్పాను. అతనికి ఉద్యోగం ఇచ్చారని, వీసా చేస్తున్నారని తెలిసింది.
మళ్లీ నెల దాటాక ఒక రోజు, క్యూబ్ ముందు.. ‘క్రిష్ణబిరియా.. ‘ అన్న పిలుపు.. తిరిగి చూస్తే AK. (ఆర్ముగం షార్ట్ కట్ లెండి).  హాయ్, హవ్వార్యూలయ్యాక,
‘ నువ్వు తప్ప ఎవరూ తెలియదు ఇక్కడ. నాకు చిన్న సహాయం చేస్తావా?  అన్నాడు.
‘ఓ! తప్పకుండా! దానికేం?  చెప్పు’ అన్నాను. కొన్ని ఏవో కొనటానికి, కార్ మీద తీసుకెళ్ళాను.. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కార్ కోనేలోపల, కొత్త స్నేహితులని సంపాదించుకునే లోగా,  చాలా సార్లు కాస్త షాపింగ్ కి తీసుకెళ్లటం అవీ చేసేదాన్ని. అతనికి అమెరికన్ల ఆంగ్లం అర్థం చేసుకోవటానికి కాస్త కష్టం గా ఉండేది.
గరాజ్ సేల్ లో ఒకసారి పేద్ద వస్తువు ఏదో కొంటే నా కార్ లో తీసుకెళ్లి వాళ్లింట్లో పడేసి వచ్చేసరికి నాలుగయింది. ‘టీ కెళ్దాం’ అని బ్రేక్ రూమ్ లో కూర్చున్నాం. 

టీ తాగుతూ ఎందుకో వంగితే జేబు లోంచి చాలా వస్తువులు పడ్డాయి. . ‘నోరూ,చెవులూ, చదువూ,భాషా అన్నీ ఉండి మూగా చెవిటి వాడినయ్యాను. అందుకే!’ అని  కళ్ళుచికిలిస్తూ చిన్న కాగితాల దొంతర (స్టికీ నోట్స్), పెన్నూ చూపించాడు. 
నేను నవ్వేసి.. ‘ఎంతైనా ప్రాబ్లం సాల్వర్ వి కదా నువ్వు’ అని, ఏం ఇబ్బందులు ఎదురయ్యాయి నీకు చెప్పు.. అన్నాను.. 
బజార్ కెళ్లి ‘నాకు కుకింగ్ ఆయిల్ కావాలి’ అని అడిగాను. ఎంత చెప్పినా అర్థం కాలేదు. చివరకి దాని ఉపయోగాలు చెప్తున్న కొద్దీ, ఇంకా కన్ఫ్యూజ్ అయి.. ఎలాగైనా అది ఏంటో తెలుసుకోవాలని పట్టుదల తో షాపంతా అరగంట తిరిగి ‘ఓ ఓ ఓ ఓ ! ఆయేల్!’ అంది. నేనూ అదే అన్నా కదా! అనగానే.. ఒక్క లుక్కిచ్చింది.. అన్నాడు. అప్పటినించీ.. ఈ చీటీలు.. అన్నాడు.
‘ఓ సారి అపార్ట్మెంట్ ఆఫీస్ లో డబల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ కావాలి’ అన్నాను.  అక్కడ మానేజర్ కి నా లాంటి వాళ్లు బాగా తగులుతారనుకుంటా!  ఎన్ని బెడ్స్ కావాలంటే అన్ని వేసుకో.. అది నీ ఇష్టం అంది. టూ బెడ్ రూమ్ అనాలని అప్పుడు తెలిసింది’ అన్నాడు..
‘ఇంకా?’ అన్నాను..
‘మొదటి సారి కాంట్రాక్టర్ గా నన్ను మా కంపెనీ ఒక క్లైంట్ ఆఫీస్ లో కూర్చోపెట్టింది. ఓ రెండు వారాలు పని చేశాక,.. అక్కడి మానేజర్ ఆ మాటా, ఈ మాటా అంటూ,.. ‘పే చెక్ వచ్చిందా AK?’ అనడిగాడు. నాకు సాలరీ తెలుసు కానీ పే చెక్ తెలియదు కదా.. అందుకని.. పేచెక్ అంటే?’  అనడిగాను. ఆయన ‘పేచెక్’ అంటే ఏంటో తెలియకుండా పని చేసేవాడిని మొదటి సారి చూస్తున్నాను.. అని తెగ జోకులేసి  నువ్వు నా టీం లోకి వచ్చేయ్’ అని ఒకటే గొడవ..  
ఓ సారి టీం మీటింగ్ లో ఏదో అడుగుతుంటే, చెప్తున్నారనుకుని ‘యా యా.. అంటున్నాను. అందరూ ఒకటే నవ్వు!’   చెప్పే విధానానికి నాకూ కాస్త నవ్వొచ్చింది.. కానీ ఆపుకున్నాను.
ఇంకోసారి ఎవరో ఫ్రెండ్ నన్ను ఇంటి దగ్గర దింపుతున్నాడు.. ‘Go to da zendar of da rODD and you can see the sain..’ అన్నాను. ఎన్ని సార్లు చెప్పినా జెండర్ అంటే ఏంటో అతనికి అర్థం కాలేదు.. అన్నాడు..
 ‘జెండర్ అంటే సెంటర్ అని తన నోట్స్ లో రాసి చూపించాకా కానీ నిజానికి నాకూ అర్థం కాలేదు.  అతను ఏం పని ఇచ్చినా చక చకా చేసేస్తాడు కాబట్టి ఎక్కువ గా  అతని తో కమ్యూనికేషన్ పెద్ద సమస్య అని ఎవరూ అనుకోలేదు. సహజం గా తెలివైన వాడవటం తో ఆక్సెంట్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. టీం కి తలలో నాలుక అయ్యాడు.
రెండు మూడు నెలలు తిరిగేసరికి స్నేహం కొద్దిగా  పెరిగింది. వారానికి ఒకటి రెండు సార్లు నాలుగు గంటలకి టీ కి కలిసి బ్రేక్ రూమ్ కి వెళ్లేవాళ్లం...  


ఒకరోజు.. పాంట్ అడుగు భాగం మడత పెట్టే దగ్గర అంతా చిరుగు పట్టి ఉంది. పాంట్ కింద అంతా చిరిగినట్టుంది. చెప్పాలా? వద్దా? అని ఆలోచించి సర్లే చెప్పి చూద్దాం తప్పేముంది  అనుకుని చెప్పాను. అతను దానికి ‘ఆ  తెలుసు.. నాకు రెండే పాంట్లు ఉన్నాయి. కొంటాను దీపావళికి ...  ‘ అన్నాడు. ‘ఏంటీ?!! మూడు నెలలు ఆగుతావా? అప్పటిదాకా చిరుగు పట్టిన దానితోనే వస్తావా? ‘ అని అడిగాను. ‘లేదు. కుట్టుకుంటాను!’ అన్నాడు.  నేను..’ఓకే’ అని ఊరుకున్నాను.

‘కిష్ణబిరియా.. మా ఇంట్లో ఎవ్వరికీ రెండు జతలకి మించి బట్టలు ఎప్పుడూ లేవు..’ అన్నాడు. నేను ఆసక్తి గా వినటం గమనించి.. ‘మా నాన్న రైల్వేస్ లో పట్టాలు శుభ్రం చేసే వాడు. వారానికోసారి ఇంటికి వచ్చేవాడు. మేము నలుగురు పిల్లలం. మా నాన్న తల్లిదండ్రులు, అమ్మ తల్లిదండ్రులు మాతోనే ఉండేవారు. మా అమ్మ.. నలుగురి ఇళ్లల్లో పనులు చేసేది.. చిన్నప్పుడు రెండు జతలు బట్టలు, కడుపు నిండా అన్నం, సాంబారు ఉంటే అదే పది వేలు.. అనుకునేవాళ్లం. సంవత్సరానికి రెండే సార్లు కొత్త బట్టలు. ఒకటి దీబావాలి కి, ఇంకోటి పుట్టిన రోజుకి..’ పొంగల్ వస్తోంది అంటే వారం రోజుల నుండీ ఎదురు చూసేవాళ్లం.. ‘మా అమ్మ నూనె బాండీ పొయ్యి మీద పెడుతుందా? లేదా? ఏదైనా మురుక్కు చేస్తే బాగుండు.. ’ అని. రోజూ స్కూల్ నుండి పరుగున రావటం, పిండి వంటల వాసన రాకపోవటం.. నిరాశ గా మేము వెనక్కి తిరిగటం. ఇంక రేపు పొంగలనగా కూడా ఏమీ చెయ్యట్లేదు అని తేలిపోయాకా, నేనూ, మా అక్కా గంభీరం గా ఉండిపోయినా, చెల్లీ, తమ్ముళ్లు ఎక్కిళ్లు పెడుతూ పడుకునేవారు. మా అమ్మ ఏమీ మాట్లాడేది కాదు. అర్థరాత్రి కలలోలాగా ఒక్కోసారి నూనె కాస్తున్న వాసన తో లేచి చప్పట్లు కొట్టేవాళ్ళం.. మా అమ్మ కారం మురుక్కు, స్వీట్ మురుక్కు చేస్తే కాగితాల్లో పంచుకుని ఇంటి ముందు గొప్ప గా కూర్చుని తినేవాళ్ళం.. ఇప్పుడనిపిస్తుంది సిగ్గుగా.... అది కూడా చేసుకోలేకపోయిన వాళ్లు ఎంతమంది ఉండేవారో మా బస్తీ లో... వాళ్లందరి ముందూ కూర్చుని తినటం!.. అని తల విదిల్చాడు AK. నేను కొద్దిగా పెద్దయ్యాక, దళితుల సంక్షేమ హాస్టల్ లో చదువుకున్నాను. నేనూ మా తమ్ముడూ  సెలవలకి ఇంటికి వస్తే..  మా అమ్మా వాళ్లకి మాకు ఇంత పెట్టాలన్న ఇబ్బంది, అయ్యో పెట్టలేక పోతున్నాము అన్న బాధ తప్ప .. ఏమీ ఉండేది కాదు..
సడన్ గా గుండె ఎందుకో పట్టేసినట్టు.. నాలుగున్నర కి మీటింగ్ లేకపోతే.. అలాగే ఎంత సేపు కూర్చునే దాన్నో..
ఇంకోరోజు.. మళ్లీ నాలుగు గంటలకి మళ్లీ టీ కి కూర్చున్నాం..మొన్న బాబోయ్.. అంత ఏడిపించాడు. ఇవ్వాళ్ల ఏం చెప్తాడో అనుకున్నా.. కానీ....


AK నాకు పదహారేళ్లు గా పరిచయం. ఆశ్చర్యం! నేను మారిన ప్రతి కంపెనీ లోనూ అతనూ వచ్చాడు. మూడు కంపెనీలు మారాకా కానీ మేము స్నేహితులం కాలేకపోయాం. ఒక పదేళ్లు నాలుగు గంటలకి టీ కలిసి తాగాం. ఆఫ్ కోర్స్.. ఒక్కోసారి ఒక్కో బృందం తో అనుకోండి... ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను, నన్ను నేను ఇంకొంచం తెలుసుకున్నాను, ఒక్కోసారి కన్నీరు పెట్టించాడు, ఒక్కోసారి నవ్వించాడు.ఒక్కోసారి చిరాకు తెప్పించి.. విసుక్కునేలా చేశాడు..
‘AK!  ఏదో ఒక రోజు ‘4 pm tea with Armugam’ అని పుస్తకం రాసేస్తా.. అని అంటూ ఉండేదాన్ని. పుస్తకం రాయలేకపోయినా.. బ్లాగ్ లో నేను నా అనుభవాలని ఈ విధం గా ప్రచురించుకునే అవకాశం రావటం.. నా అదృష్టం అనుకుంటున్నాను. మొన్న అమెరికా వెళ్లినప్పుడు గుర్తు చేసి..’ఇలాగ తెలుగు బ్లాగు రాస్తున్నాను. దాంట్లో వేయనా? ‘ అని అనుమతి అడగటం జరిగింది.. ఈ సిరీస్ లో బహుశా నాలుగైదు టపాలు రాయవచ్చు..

46 comments:

Manasa Chamarthi said...

Interesting n waiting for the next one...eagerly!!!

Sravya V said...

Hm ! Definitely this one of your best posts !

Disp Name said...

క్రిష్ణబ్రియా,

అదర గొట్టేసారు. సాంబారు వాసన ఎక్కువే వస్తోంది. వెంటనే కారం మురుక్కు తో బాటు సాంబారు లాగించాల్సిందే.

మీ శైలి చాల బాగున్నది. ఆరుముగంతో ఆరున్నర నిమిడింగల్! (అరవ యాస కొంత ఉండాల గదా మరి, ఆరున్నర కాకుంటే, ఆరుముగం తో ఇడ్లీ సాంబార్ లాంటి హెడింగ్ పెట్టాలన్నమాట )

Sreenivas said...

Edo chanti pilladi amayakatvam maatuna daagina jeevana satyam athani antharmukham..

daanni athayanta hrudyam gaa mee blogu lo mee padaamrtuam to aavishkrutam..

paatakulamaina maa hrudayam bhaaratapta bhaaodwigitam..

Dhanyosmi...

రసజ్ఞ said...

మీ బ్లాగు చదివిన ప్రతీసారీ నిజంగా ఒక మనిషి డైరీ చదివిన అనుభూతే నాది! ఎంతో చక్కగా వ్రాశారు! ఆయన గురించి అన్ని కోణాలను అంత చక్కగా చూపించిన మీరు చేసిన చిన్న పొరపాటు ఆయన ఫోటో పెట్టకపోవడమే! తరువాత ఎపిసోడ్లో అన్నా ఆయనని చూస్తామని ఆశిస్తూ..........

జ్యోతిర్మయి said...

కృష్ణ ప్రియగారూ..'అది కూడా లేని వాళ్ళు ఎంతమందో కదా' అన్న ఆర్ముగంగారి మాటలు వింటుంటే..మాటలు రావడం లేదండీ.మీరు వ్రాసిన విధానం చదువుతున్న వారు మనసులోతుల్లోకి వెళ్లి చూసుకునేలా ఉంది.

నవజీవన్ said...

బాగుంది కృష్ణ ప్రియ గారు..ఆర్ముగం గారి గురించి మీరు రాసిన టపా. మనకు అప్పుడప్పుడు ఇలాంటి వ్యక్తులు కలుస్తుంటారు .ఒక వ్యక్తి రూపురేఖలను బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేము. ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాదాపు మీరు చెప్పిన ఆర్ముగం లాంటి వ్యక్తులనే ఇద్దరు ముగ్గురు ను నా జీవితం లో కూడా చూసాను.చూడటానికి అంత వ్యవహార జ్ఞానం లేని వారి లా కనిపిస్తారు గాని వారంత తెలివైనా వారిని మనము ఎక్కడ చూడలేదనిపిస్తుంది..These people are really someone who are down to earth.I wish you could post these type of wonderful postings in future as well.

lalithag said...

క్రిష్ణా, యూనివర్సిటీలో సీనియర్ ఇంకో అబ్బాయి గుర్తుకు వస్తున్నాడు ఈ కథ చదువుతుంటే. చాలా ఏళ్ళ క్రితం లండన్ నుంచి మాట్లాడాడు. న్యూ యార్క్ వస్తున్నాను అన్నాడు. తర్వాత ఇక సమాచారం లేదు. ఫేస్ బుక్కులో కనిపిస్తాడేమో అని వెతుకుతూనే ఉన్నా. తనూ, ఇంకో స్నేహితురాలూ ఇద్దరూ ఇప్పటి వరకూ దొరకలేదు.

కృష్ణప్రియ said...

@ మానస,

థాంక్స్! రాస్తాను తొందర్లో.

@ శ్రావ్య,

అవునా? చాలా థాంక్స్!

@ జిలేబి,

ధన్యవాదాలు.
ఆరుముగంతో ఆరున్నర నిమిడింగల్!>>>>>>>>ప్రాస బాగుంది :) కానీ నా టీ టైం ఏమో నాలుగు గంటలకి...
Thanks for reading..

కృష్ణప్రియ said...

@ శ్రీనివాస్ గారు,
మీ వ్యాఖ్య .. వావ్!! చాలా సంతోషం. మిగిలిన పార్టులు మీరన్నంత గొప్పగా రాయగలగాలి అని ఆకాంక్షిస్తున్నాను.

@ రసజ్ఞ,
థాంక్స్! ఆయన వ్యక్తిగత విషయాల ప్రస్తావన ఉన్నందున, ఫోటో పెట్టలేదు. బహుశా మా AK కీ సమ్మతం కాకపోవచ్చు. అడిగి చూస్తాను.

@ జ్యోతిర్మయి,
ధన్యవాదాలు!

కృష్ణప్రియ said...

@ చైతన్య దీపిక,
ముందు గా నా బ్లాగ్ కి స్వాగతం.
హ్మ్.. AK ఎలాగూ తెలివైన వాడు. వ్యవహార జ్ఞానమూ ఉన్నవాడే. మంచి సరదా మనిషి కూడా.. ఏదో ఒక దానిలో ఇరుక్కుంటాడు.. నవ్విస్తాడు, ఒక్కోసారి మనస్సంతా చేదు చేసేస్తాడు, బరువెక్కిస్తాడు. చూద్దాం.. ముందు ముందు అతని గురించి ఇంకా వివరం గా చెప్తాను కదా.. I hope I do a good job of presenting the ‘real’ him..

@ లలిత,
నువ్వు చెప్తున్న వ్యక్తి ఎవరో అర్థమైంది. అవును. కానీ అతని బాల్యం గురించి, కుటుంబ స్థితిగతుల గురించి నాకు పూర్తి గా అవగాహన లేదు. One of the sweetest persons I have ever met in my life! నా పెళ్లికి కూడా వచ్చాడు. అతను లండన్ లో ఉండగా నేనూ ఒకసారి మాట్లాడాను. నువ్వన్నట్టు తర్వాత అసలు ఎక్కడా కనపడలేదు. linked in, facebook, orkut.. alumni pages,... :-( చూద్దాం..

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

క్రిష్ణప్రియ గారు,
చాలా బావుంది టపా. మిగిలిన భాగాల కోసం ఎదురుచూస్తాం :)

The irony is..
1. AK's life is the norm rather than an exception to millions..
2. AK's life might be the aspiration for millions of more unfortunate people
3. AK's life can be a curious and inspiring one for many who are more fortunate

AK is a good friend worth understanding and learning a lot from him is the choice you took.. I appreciate that.

>> "ముక్తసరి గా ‘అన్నా యూనివర్సిటీ’ నుంచి వచ్చాననీ, హాబీలు ఏమీ లేవని, జీవిత ధ్యేయం అంటూ ఏర్పరచుకోలేదనీ, ప్రస్తుతం, సాధ్యమైనంత ఆసక్తికరమైన పని చేస్తూ, డబ్బు సంపాదించటమే తన గమ్యమనీ, ఇది భవిష్యత్తు లో మారవచ్చనీ చెప్పి వదిలేశాడు. అతని పరిచయం చాలా మామూలు గా జరిగినా, అతని ఆక్సెంట్ కి దిమ్మదిరిగిపోయింది."

నా దృష్టిలో అయితే అతని పరిచయ వాక్యాలు విన్నప్పుడు, ఆలోచనల్లో స్పష్టతా, ఆత్మ విస్వాసం, నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపించాయి. మూసగా ఇతరులకేం కావాలో అది చెప్పకుండా చాలా నిజాయితీగా స్పష్టతతో తనని తాను పరిచయం చేసుకోవడం నాకు చాలా నచ్చింది.

అద్భుతమైన పరిచయ వాక్యాలు చెప్పే చాలా మంది కేవలం ఇంటర్ వ్యూ కోసమే అలా చెప్తారు కానీ, వాళ్ళకి వాళ్ళమీద అంత అవగాహన ఉన్నట్టూగానీ, ఉన్నా నిజం చెప్తున్నారని గానీ అనిపించదు చాలా సార్లు.

Kathi Mahesh Kumar said...

:) :) :) :)
I am in total agreement with Weekend Politician.

కొన్ని కోట్లమంది ఆర్ముగంలు, మీ అర్ముగం స్థాయికి చేరకుండా అజ్ఞాతంగానే మిగిలిపోతున్న దేశం ఇది. కనీసం ఇలాంటి కొందరు ఆర్ముగంల కథలు జనాలకి తెలిస్తేఅయినా ఆ అనామక ఆర్ముగాల ఉనికి తెలుస్తుందేమో. మీ ఆర్ముగానికి నా సలాం. ఈ కథ చెప్పాలనుకున్న మీ సహృదయతకు నా అభినందనలు.

లత said...

చాలా బావుందండి,మనసుకు హత్తుకునేలా

శిశిర said...

స్ఫూర్తినిచ్చే వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ధన్యవాదాలు.

Srikanth Eadara said...

స్పూర్తివంతమైన టపాలు...నారాయణ రెడ్డి గారి గురించి, ఆర్ముగం గారి గురించి....

మధురవాణి said...

చాలా బాగా రాసారు కృష్ణప్రియ గారూ.. :)
Very intersting.. waiting for the next post!

కృష్ణప్రియ said...

@ WP,
చాలా బావుంది టపా. మిగిలిన భాగాల కోసం ఎదురుచూస్తాం :)
>>>> నిజమా? :))

నిజానికి ‘ఏకే ఒక అద్భుతమైన వ్యక్తి’ అని చెప్పట్లేదు. మామూలు మనిషే. కాస్త అమాయకత్వం, కాస్త అల్లరి, తెలివి, బలహీనతలూ, స్ట్రెంగత్ లూ కలిగిన అందరి లాంటి వ్యక్తే.
అప్పట్లో కొద్ది గా నెయివ్ గా ఉండటం వల్ల అలాగ చెప్పాడు, తర్వాత కాస్త ముదురు అయ్యాడు లెండి :)

అతను అత్యంత అడుగు స్థాయి నుండి వచ్చి చదువు, తెలివి, పట్టుదల తో పైకొచ్చిన మనిషి, నాకు బాగా తెలిసిన వాడు.

ముందు వ్యాఖ్య లో అన్నట్టు I hope I do a good job of presenting him in coming posts.

కృష్ణప్రియ said...

మహేశ్ కుమార్ గారు,

ధన్యవాదాలు!

మీ స్మైలీ ల రేటింగ్ కేవలం హాస్య టపాలకి మాత్రమే అనుకున్నాను. సీరియస్ టపాలకి కూడా స్మైలీల రేటింగ్ ఇస్తారన్నమాట! :)

కొన్ని కోట్ల ఆర్ముగాలు
>>>> మా ఆర్ముగం చాలా ప్రతిభావంతుడు, రైట్ ఆటిట్యూడ్ కలిగిన వాడు.

చాలా మంది రెంటిలో ఏదో ఒకటి లేకపోవటం వల్ల ఆర్ముగం స్థాయికి (ఆర్థికం/అమెరికా లో ఇంజనీర్ అని కాదు) చేరుకోలేరని అనుకుంటున్నాను.

నేను చెప్పదలచుకున్న ఆర్ముగం కథ లో అతని బీదరికపు బాక్ గ్రౌండ్ కేవలం ఒక పార్శ్వం మాత్రమే. మున్ముందు టపాల్లో వేరే కోణాలు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.

@ లత గారు,
ధన్యవాదాలు!

@ శిశిర గారు,
ధన్యవాదాలు!
మీ అందరి కామెంట్లు చదివాడంటే, ఇంక మా AK ని పట్టలేం :))

కృష్ణప్రియ said...

@ శ్రీకాంత్,
థాంక్సండీ!

@ మధురవాణి,
ధన్యవాదాలు! త్వరలో రాసేస్తాను..

lalithag said...

కృష్ణా, అతని విషయాలు నాకు ఇంకెవరి ద్వారానో కొద్దిగా తెలిసాయి. అందులో ఒకటి నీకు తెలిసే ఉంటుందని అనుకున్నాను. వాళ్ళ అక్క వైద్యానికి ఏ మాత్రం డబ్బులు లేక చనిపోయిందని. ఆర్ముగం లాంటి కథే అని కాదు. కానీ ప్రతి మనిషివీ రక రకాల struggles. సమాజం ఇవ్వవలసిన, ఇవ్వగలిగిన moral support చాలా సార్లు సరైన సమయంలో సరిగ్గా ఇవ్వడం జరగట్లేదనిపిస్తుంది. చదువుల్లో ప్రతిభ కనపరిచి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించినా, అక్కడ ఇమడడానికీ, ఎదగడానికి అవసరమైన support తోటి విద్యార్థులనుంచీ , ఉపాధ్యాయులనుంచీ కావల్సినది చాలా ఉంటుంది. కుటుంబరావు గారి "చదువు" గుర్తుకు వస్తుంది. అది ఇంకొంచెం extend చేసుకుని ఈ నాడు ఉద్యోగాల ద్వారా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నా, అక్కడా identity crisis ఎదురౌతుంది. ఒక్కొక్కళ్ళూ ఒక్కోలా ఎదురుకుంటారు దాన్ని. రామానుజం ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకుంటాము. వారి మానసిక వ్యధ గురించి చాలా తక్కువ తెలుసుకుంటాము లేదా ఆలోచిస్తాము, సమాజపరంగా. నీ పోస్ట్లు చాలా కోణాలని చూపిస్తున్నాయి.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

క్రిష్ణప్రియ గారు,

>>>> నిజమా? :))

అవును. నిజమే. ;)

>> "నిజానికి ‘ఏకే ఒక అద్భుతమైన వ్యక్తి’ అని చెప్పట్లేదు. మామూలు మనిషే. కాస్త అమాయకత్వం, కాస్త అల్లరి, తెలివి, బలహీనతలూ, స్ట్రెంగత్ లూ కలిగిన అందరి లాంటి వ్యక్తే."

ఏకే ఒక అద్భుతమైన వ్యక్తి అని నేను ఏమాత్రం అనుకోలేదండీ. I just said why I liked that particular resposne of him and that ends there probably some fo the other comments here made you to give that clarification..

of all the comments you decided to give that clarification to me :)))

Chandu S said...

చదివిన తర్వాత రోజంతా దిగులు, మీమీద కోపం.

coz u made me sad.

Anonymous said...

>>మా ఆర్ముగం చాలా ప్రతిభావంతుడు, రైట్ ఆటిట్యూడ్ కలిగిన వాడు. చాలా మంది రెంటిలో ఏదో ఒకటి లేకపోవటం వల్ల ఆర్ముగం స్థాయికి (ఆర్థికం/అమెరికా లో ఇంజనీర్ అని కాదు) చేరుకోలేరని అనుకుంటున్నాను.

చా!! అదే మరి. అందరూ కాదుగానీ, కోట్లమందిలో మెజారిటీ మందికి కూడా అవి లేవంటారా !!

రైట్ ఆటిట్యూడ్ అనగానేమి? దయచేసి మీరు వివరించండి. కోట్లమందిలో చాలా మందికి వాళ్ళు అవ్వాల్సిన దానికి కావలిసిన రైట్ ఆటిట్యూడ్ ఉందేమో !

ఆర్థికం/అమెరికా లో ఇంజనీర్ అని కాదు అని చక్కగా చెప్పారు కదా.. మరి వాళ్ళల్లో కూడా ప్రతిభా, రైట్ ఆటిట్యూడ్ ఉండే ఉంటాయి అనే ఆలోచన ఒకసారి చేసి చూడండి. ప్రతిభ, రైట్ ఆటిట్యూడ్ ఉంటే నూటికి ఎంతశాతం మంది వాటికి న్యాయం చేసే పనిలో విజయం సాధిస్తారని మీరనుకుంటున్నారో కాస్త తెలియజెయ్యగలరు.

Krishna said...

పేదరికం వల్ల ఎదురయ్యే అనుభవాల నుంచి కొందరు ద్వేషం/ఆత్మ న్యూనత నేర్చుకుంటే (వాళ్ళ తప్పు కాకపొవచ్చు) , కొందరు స్తితప్రజ్ఞత నేర్చుకుంటారు.
మీ కథ లో ఆర్ముగం రెండో రకం లా వున్నారు.

జై ఆర్ముగం!!
జై కృష్ణ గారు - మంచి వ్యక్తి ని గురించి రాసినందుకు.

Just for the heck of it said...

>>పేదరికం వల్ల ఎదురయ్యే అనుభవాల నుంచి కొందరు ద్వేషం/ఆత్మ న్యూనత నేర్చుకుంటే (వాళ్ళ తప్పు కాకపొవచ్చు) , కొందరు స్తితప్రజ్ఞత నేర్చుకుంటారు.

పేదరికం వల్ల ఎదురయ్యే అనుభావలనుంచి మెజారిటీ ప్రజలు ద్వేషం, ఆత్మ న్యూనత నేర్చుకోరు. అలా నేర్చుకునుంటే ఈ పాటికి దేశమంతా ద్వేషమూ, ఆత్మ న్యూనతలతో నిండి పోయుండేది.

వారు ఎలా ఉండాలి అని చెప్పే హక్కు మనకున్నట్టుగా మనం ఫీలవుతాము కాబట్టి మనం చాలా తొందరగా జనాలకి ఇటువంటివి ఆపాదించి సూక్తులు చెప్పడానికి ప్రయత్నిస్తాం అంతే. అది మన బలహీనత. అర్థం చేసుకోతగ్గదే ;)

జై కోట్లమంది పేద ప్రజలు!!
జై కృష్ణ గారు - మంచి టపా రాసినందుకు.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>> కానీ ప్రతి మనిషివీ రక రకాల struggles. సమాజం ఇవ్వవలసిన, ఇవ్వగలిగిన moral support చాలా సార్లు సరైన సమయంలో సరిగ్గా ఇవ్వడం జరగట్లేదనిపిస్తుంది. చదువుల్లో ప్రతిభ కనపరిచి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించినా, అక్కడ ఇమడడానికీ, ఎదగడానికి అవసరమైన support తోటి విద్యార్థులనుంచీ , ఉపాధ్యాయులనుంచీ కావల్సినది చాలా ఉంటుంది. కుటుంబరావు గారి "చదువు" గుర్తుకు వస్తుంది. అది ఇంకొంచెం extend చేసుకుని ఈ నాడు ఉద్యోగాల ద్వారా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నా, అక్కడా identity crisis ఎదురౌతుంది. ఒక్కొక్కళ్ళూ ఒక్కోలా ఎదురుకుంటారు దాన్ని. రామానుజం ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకుంటాము. వారి మానసిక వ్యధ గురించి చాలా తక్కువ తెలుసుకుంటాము లేదా ఆలోచిస్తాము, సమాజపరంగా. నీ పోస్ట్లు చాలా కోణాలని చూపిస్తున్నాయి.

Totally agree with the above comment. Very accurate and nice summary :)

Anonymous said...

Excellent narration...చదువుతూంటే ఆర్ముగాన్ని ఊహించేసికున్నాను....

Mauli said...

@>> కానీ ప్రతి మనిషివీ రక రకాల struggles. సమాజం ఇవ్వవలసిన, ఇవ్వగలిగిన moral support చాలా సార్లు సరైన సమయంలో సరిగ్గా ఇవ్వడం జరగట్లేదనిపిస్తుంది. చదువుల్లో ప్రతిభ కనపరిచి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించినా, అక్కడ ఇమడడానికీ, ఎదగడానికి అవసరమైన support తోటి విద్యార్థులనుంచీ , ఉపాధ్యాయులనుంచీ కావల్సినది చాలా ఉంటుంది.


Thoughtful but As said, writer himself went into this trap initially (till HR anounce the boy's educational credentials..) so the expectation here would be respect each and every one whom ever you come across in life.which is not easy to fallow even to goutam budda as every one has their own priorities and interests (am happy to listen others views here in)

' కుటుంబరావు గారి "చదువు" గుర్తుకు వస్తుంది. అది ఇంకొంచెం extend చేసుకుని ఈ నాడు ఉద్యోగాల ద్వారా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్నా, అక్కడా identity crisis ఎదురౌతుంది. ఒక్కొక్కళ్ళూ ఒక్కోలా ఎదురుకుంటారు దాన్ని. రామానుజం ప్రతిభ గురించి గొప్పగా చెప్పుకుంటాము. వారి మానసిక వ్యధ గురించి చాలా తక్కువ తెలుసుకుంటాము లేదా ఆలోచిస్తాము, సమాజపరంగా. నీ పోస్ట్లు చాలా కోణాలని చూపిస్తున్నాయి.


Here I would like to suggest, personality classes for selected people across the colleges ,universities (or along with reservations, and benifits like walfare hostels) which is major activity the govt. has to take up. and it is easiest than expecting others to support inferior kids in the community. it costs alot initially but once public starts practising more personal skills, spending can be reduced.

(Sorry for not using telugu script)

Varuna Srikanth said...

hi Krishna ji...entha chakkaga rasarandi...mee narration style mathram nijanga adbhutham...I felt like reading some one's diary literally ...ee sari mee Armugam garini kalisinapudu naa hi cheppandi...waiting for your next post on Armugam ji...)))

lalithag said...

@Mauli,
ప్రతిదీ తరగతి గదిలో నేర్చుకోవాలి / నేర్పించాలి అంటే కష్టం కదా? :) ఇలా మాట్లాడుకోవడం మనం అందరి awareness పెంచుకునే అవకాశం కదా. రచయిత చెప్పినట్లు మనము ఎప్పుడూ ఎవరినీ వారి looks ని బట్టి జడ్జ్ చేసి ఉండమంటారా? మన అందరమూ 'సమాజం' లోని మనుషులమే, ఈ బ్లాగు రచయితతో సహా. మనం నేర్చుకుంటే, ఎదిగితే సమాజమూ ఎదుగుతుంది. ఐనా నా మాటల వెనక అనుభవాలూ, observations, ఆలోచనలూ ఎన్నో ఉన్నాయి. అందులో ఏ మాటకి ఆ మాటని పట్టుకుని వాదించుకుంటూ కూర్చుంటే జీవితం గడిచిపోతుంది. ప్రయోజనం ఉండదు. సమాజం ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆలోచనలు ఎక్కువ మేలు చేస్తాయి, అవగాహనా తరగతులకన్నా. మెషీన్లలా ఏది తక్కువైతే దానికి ఓ ప్రోగ్రాం వ్రాసి పడేస్తుండడం కాదు కదా మనుగడ సాగించడం అంటే. ఇంతకు మించి ఎక్కువ వ్రాస్తే నా అభిప్రాయం నీరసపడిపోతుంది, (ఇప్పటికే కాకుంటే :))

Just for the heck of it said...

@ Mouli gaaru,

>>and it is easiest than expecting others to support inferior kids in the community.

So you think people who came from a different back ground and struggle to get assimilated into a different set of people and experiences are inferior !! Whoever can get along with you are superior and others or not !!!

Rather than doing hopeless branding like this.. As Lalitha gaaru said.. it is better for us to learn to live with different people without being judgemental about others.

Krishna said...

@Just for the heck of it గారు,
I think my comment is misinterpreted! I meant to say only positive things about AK, nothing negative about majority of people.
thats why I said ' కొందరు'! (from very few people that I have seen/met) - no generalisation here.

మీరన్నట్టు:-
వారు ఎలా ఉండాలి అని చెప్పే హక్కు మనకున్నట్టుగా మనం ఫీలవుతాము కాబట్టి మనం చాలా తొందరగా జనాలకి ఇటువంటివి ఆపాదించి సూక్తులు చెప్పడానికి ప్రయత్నిస్తాం అంతే. అది మన బలహీనత. అర్థం చేసుకోతగ్గదే ;)

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండీ.. నాకు తెలిసిన కొందరు ఆర్ముగంలు గుర్తొచ్చారు. తరువాతి పోస్ట్ గురించి ఎదురు చూస్తున్నాను.

కొత్తావకాయ said...

నాకు మీలో బాగా నచ్చే విషయం ఇదే. చాలా మంది కప్పిపుచ్చుకునే ఆత్మ విశ్లేషణ (ఇంతకంటే మంచి తెలుగు పదం నాకు తెలియదు) స్పష్టంగా చెప్పేస్తారు.

Mauli said...

@lalithag gaaru

నేను ఈ టపా పై అసలు వ్యాఖ్యానించలేదు. మీ వ్యాఖ్య , కత్తి మహేష్ గారి వ్యాఖ్య తో నేను అంగీకరించి ఆగిపోవల్సినది .కాని వివరణ అవసరమనిపించినది. రచయిత ను నేను జడ్జ్ చేసానని మీరు పొరపడ్డారు. ఒక ఉదాహరణ మాత్రమె చెప్పాను. అది మీరు నేను, మనమందరము. కేవలం మనం నేర్చుకొని ఎదిగినంతనే అసలు ప్రయోజనం చేకూరదు అని నా అభిప్రాయము. నేను వ్యాఖ్య వ్రాసిన తరువాత కూడా ఆలోచించాను, దీని కోసం ప్రోగ్రాము ని వ్రాసి పదేయ్యదని తెలుసు,. మొదట ప్రభుత్వం పేరు చెపుతాము. మీ వ్యాఖ్యని ఇంకాస్త విస్తృతం గా చర్చించడమే కాని, వాదించ లేదని అర్ధం చేసికోగలరు. మాటల వెనుక ఏమున్నది తెలిస్తే కొంత ఉపయోగం వచ్చి చేరుతుంది. నా మాట వివరిస్తాను..
మేమంతా చదువుకున్న స్కూల్ లో ఇప్పుడు చాల కొద్ది మందే విద్యార్ధులు ఉన్నారు. వారంతా కుడా కనీస అవసరాలకు కూడా లేని, మిగిలిన వారి లాగ మామూలు కాన్వెంట్ ఫీజ్ కూడా కట్టలేని వారు. వారి కోసం ప్రపంచ వ్యాప్తం గా ఉన్న పూర్వ విద్యార్ధుల చె విలేజ్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చెయ్యబడినది. పిల్లలందరికీ ప్రతి సంవత్సరం మూడు జతల యూనిఫాం లు, బుక్స్, ఇ౦గ్లీష్ మీడియ౦ లో క్లాసులు ఏర్పాటు చేసారు. ఇంకా లైబ్రరి, ఆట లు, మిగిలిన వసతులు కూడా చిన్న చిన్న గా సమకూర్చుతున్నారు. అలాగే వాళ్లకి కాన్ఫిడెన్స్ పెంచడానికి సెలవుల్లో వీలయిన వాళ్ళంటే వెళ్లి మాట్లాడుతున్నారు. ఇది చాలా చిన్న విషయమే , ఇంత చేసిన వాళ్ళ తోటి వయసు విద్యార్ధులతో వాళ్ళు ఎప్పుడో ఇలాంటి సమావేశాల్లో తప్ప కలవరు. కాబట్టి /, ఎదగడానికి అవసరమైన support తోటి విద్యార్థులనుంచీ , ఉపాధ్యాయులనుంచీ కావల్సినది చాలా ఉంటుంది/ ఇది మనం అనుకున్నంత సులువు కాదు కాబట్టి వారికి ప్రత్యేకం గా సమయం కేటాయించాలి వీలయితే ,అది మన పరిధులలో . అని నా అభిప్రాయం.

@ కృష్ణ ప్రియ గారు

మొదట రెండు జతలు బట్టలు నుండి నాలుగు జతలుకు ఎప్పుడు మారాడు అని ఆలోచన వచ్చినది. కాని ఇప్పుడిప్పుడే(ఈ టపా నుండి ) గాంధి అర్ధం అవుతున్నాడు . ఆయన ఒక్కడు నాలుగు చొక్కాలు తగ్గిమ్చుకొంటే దేశం లో అందరికి వస్తాయా అనోకోన్నాను ఇప్పటివరకు. కాని మీ టపా లో వ్యక్తి అదే ప౦ధాలొ అంటే ఖచ్చితం గా రె౦డు జతలు వాడుతున్నాడు అంతే హ్మ్. (ముందు భాగాలలో ఇవి వస్తాయి కాబట్టి మీరు సమాధానం ఇవ్వద్దు )

@Just for the heck of it said...

మీరు నేర్చుకున్నది మీ వ్యాఖ్య లో స్పష్టం గా కనిపిస్తున్నది అండి . మీరు నా వ్యాఖ్య ను తప్పు గా అర్ధం చేసికొన్నారు. ఇక్కడ జడ్జ్ చెయ్యాల్సిన అవసరం లేదు. నేను టపా గురించి అసలు వ్యాఖ్యానించలేదు కాబట్టి మీ వ్యాఖ్య లు వెనక్కి తీసికోగాలరేమో చూడండి

lalithag said...

@Mauli,
I might have misunderstood your comment. I was talking about different kind of support. When you go to a reputed university or firm, a lot of people might be tuned to the 'culture' or 'environmnet' while some may not be, owing to their background. Their only badge of honor is their talent which was great among those they grew up with but is on comparable level in the new setting. So their talent not always helps their confidence. They may be comparitively more talneted too. But that can come out only when they feel confident enough. This is one point on my mind when I wrote what I wrote. there could have been more thought but I am preoccupied with some other jobs that are priortiy to me to discuss at length right now. Thanks for clarifying your idea. I understand your view point, at least in part.

సిరిసిరిమువ్వ said...

టపా ..దాంతో పాటు వ్యాఖ్యలు మంచి ఆసక్తికరంగా ఉన్నాయి..మిగతా భాగాల కోసం ఎదురుచూస్తుంటాం.

*************************

మీ ఈ టపాకి సంబంధం లేని వ్యాఖ్య...మీరు నా బ్లాగులో వ్యాఖ్యలు చూస్తారో లేదో అని ఇక్కడ కూడా పెడుతున్నాను.

ఇంతకీ ఇల్లేరమ్మ ఎవరు?
అవ్వ..అవ్వ.. (బుగ్గలు నొక్కుకుంటునానన్నమాట).ఇల్లేరమ్మ తెలీదా..అయ్యారే!

సరదాకి అన్నాను లేండి.

ఇల్లేరమ్మ కతలు..అని సోమరాజు సుశీల గారు తన బాల్యం కబుర్లతో ఓ పుస్తకం వ్రాసారు..ఆంధ్రజ్యోతిలో సీరియల్ గా వచ్చింది..ఆ పుస్తకంలో హీరోయిన్ ఈ ఇల్లేరమ్మ..అంటే రచయిత్రే! పుస్తకం చాలా సరదాగా బాగుంటుంది..వీలయితే చదవండి. మీకు కావాలంటే పుస్తకం నేను పంపిస్తాను.

మనసు పలికే said...

మీ టపాతో నా ఉద్యోగం మొదటి రోజులకి తీస్కెళ్లి పడేశారు;) తిరిగి రావాలని లేదు మరి. అప్పటి నేస్తాలంతా గుర్తొస్తూ ఉన్నారు.

ఆర్ముగం కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక మీ శైలి గురించి చెప్పేదేముంది, అద్భుతం అంతే:)) తదుపరి భాగానికై ఎదురు చూస్తూ ఉన్నా..

Anonymous said...

ఎ ఆర్ మురుగదాస్ సమర్పించు "ఆరుముగం" - వీడికి ఏడో ముగం లేదు.

బాగుందండి, మీకు కూడా డబ్బింగ్ సినిమాల గాలి తగిలినట్టుంది.

ప్రియమైన మీ పేరుని బిరియాని చేసేసాడండీ మీ నల్ల తంబి.

కామెంటు తరువాయి భాగం, తరువాయి టపాలో.

చాణక్య said...

కిష్ణబిరియా గారు, మీ శైలి గురించి కొత్తగా చెప్పేదేముంది. చాలా బాగా రాశారు. శ్రావ్య గారు అన్నట్టు this is one of your best. Interesting person and heart touching post. Thank you! :)

కృష్ణప్రియ said...

@ లలిత,

I see,
>>> ప్రతి మనిషివీ రక రకాల struggles.
అవును, కరెక్ట్ గా చెప్పావు. థాంక్స్!

@ WP,
>>>of all the comments you decided to give that clarification to me :)))

Well, you are the lucky one this time! :)
On a serious note, మీరలా అనుకున్నారని నేను చెప్పలేదు. మీరు క్లియర్ గా మూడు పాయింట్స్ వేసి చెప్పారు. మీరన్న వాటికి ఇంకో వాక్యం లో అతని గురించి చెప్తూ జత చేశాను అంతే. మీకు క్లారిఫికేషన్ లా కాదు.

చందు గారు,
I am honoured!

అజ్ఞాత,
>>>చా!! అదే మరి. అందరూ కాదుగానీ, కోట్లమందిలో మెజారిటీ మందికి కూడా అవి లేవంటారా !!..

నేను అలాగని ఎక్కడ చెప్పాను? చాలా మంది ఈ రెండుగుణాలూ లేని వారు ఆ స్థాయికి వెళ్లకపోవచ్చు అన్నాను. కానీ ఆ స్థాయికి వెళ్లలేని వారందరికీ ఈ రెండు గుణాలూ లేవని నేననలేదండీ. ఒక వేళ మెజారిటీ ప్రజలని ఎక్కడైనా హేళన చేసినట్టు గా ఇక్కడ కానీ, మరెక్కడైనా కానీ మాట్లాడి ఉంటే.. చూపించగలరు. సరిదిద్దుకోగలను

ఆర్ముగం తెలివైన వాడు, ప్రతిభావంతుడు, రైట్ ఆటిట్యూడ్ కలిగిన వాడు కాబట్టే పైకి రాగలిగాడు అని నేను ఖచ్చితం గా నమ్ముతాను.

పై గుణాలు కలిగిన వారందరికీ లక్, అవకాశాలూ, గ్రహ బలం,అవినీతి,..ఏదైనా అనుకోండి .. వీటి వల్ల పైకి రాలేకపోవచ్చు కూడా..

Just for the heck of it said...

Krishna గారు,

Thank you for the clarificaton. I know you are talking about the good things in AK :)

I just responded to your comment as an insurance against a "FEW" who might misinterpret it the otherway..;)

Anonymous said...

క్రిష్ణప్రియ గారు,

అంగీకరిస్తున్నాను. నా మొదటి వ్యాఖ్యలో ఉన్న వెటకారాన్ని మన్నించగలరు. నేను మీకు లేని ఉద్దేశ్యాలు అపాదించాలని కాదు గానీ, మీ వ్యాఖ్య సందర్భం చూసి అలా వ్యాఖ్య రాశాను. "చాలా మంది" అనగానే ఠక్కున మావాడు ప్రతిభావంతుడు అని చెప్తే.. నాకు అలా అనిపించింది.

చాలా మంది "ప్రతిభ" లాంటి వాటిని తమ సొంత సొమ్ములా భావిస్తూ, ఏ సమస్య మాట్లాడినా ప్రతిభా, ఆత్మ విస్వాసం, కష్టపడే గుణం లాంటివి లేక పోవడం వల్లే సమస్యల గురించి మాట్లాడుతారు అనుకునే పరిస్థితులు చాలా చోట్ల చూసి ఉండటం వల్లా, అటువంటి సందర్భాలలో నిమ్మకునీరెత్తినట్టు ఉండి, ఎక్కడలేని Benifit of doubt ఇచ్చి ఆలోచించే వాళ్ళు సాధారణంగా దానికి వ్యతిరేక సందర్భాలలో తగుదునమ్మా అని జెనరలైజేషన్ చేస్తూ పడికట్టు పదాల్లాంటి నీతులు వల్లించడం (without understanding the meaning of those నీతులు) కూడా చూసుండటం వల్ల నేను అలా రాశాను. మిమ్మల్నుద్దేశ్యించి కాదు.

anyway, nice series. keep writing :)

కృష్ణప్రియ said...

@ కృష్ణ,
ధన్యవాదాలు. మరీ అంత స్థితప్రజ్ఞుడు కాదు కానీ, మీరన్నట్టు ద్వేషం, ఆత్మ న్యూన్యత లేని వాడే!

@ హరే ఫల,
ధన్యవాదాలు!

@ వరుణ శ్రీకాంత్,
ధన్యవాదాలు!

@ వేణు శ్రీకాంత్,
ధన్యవాదాలు!

@ కొత్తావకాయ,
ధన్యవాదాలు .. :) అన్నీ కాదు లెండి...

కృష్ణప్రియ said...

@మౌళి,
అలాగే.
మరో మాట.. నేను AK జీవితాన్ని పూర్తిగా విశ్లేషించ బోవట్లేదు. కేవలం సాయంకాలం చాయ్ సమావేశాల్లో చూసిన కోణాలు మాత్రం (అతని అనుమతి తో) రాయబోతున్నాను..

@ సిరిసిరిమువ్వ,
థాంక్స్! ఇల్లేరమ్మ తెలియదు  సిగ్గు పడాల్సిన విషయమే. అందులోనూ.. సోమరాజు సుశీల కథల ఫాన్ అయ్యుండీ.. నేను చదువుతాను.
PS: మీ బ్లాగు లోకయినా వచ్చి చూసేదాన్ని ఈ ఇల్లేరమ్మ ఎవరో :)

@ అపర్ణ,
అవునా? థాంక్స్! జీవని బ్లాగ్ లో సౌమ్య గారితో మీ ఫోటో చూసినట్టున్నాను. Looks like you’ve had good time ..

@ bonagiri,
:)

@ చాణక్య,
థాంక్స్!

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;