Saturday, April 17, 2010

నా మొదటి తెలుగు పోస్టు

అమృతవల్లి తమిళ బ్లాగు చూసినప్పటినించీ నాకూ తెలుగు లో బ్లాగాలని కోరిక పట్టుకుంది.

ఎన్నో సార్లు ఎన్నో విషయాలు రాయాలని అనిపించినా సరయిన మాధ్యమం లేక విరమించుకోవ టమో లేక సమయాభావము వల్లో లేక అందరూ నవ్వుతారని భయమో అదీ కాక మనకేం వచ్చు, మనకి దేంట్లో ప్రావీణ్యత ఉంది? అన్నింటా మిడి మిడి జ్ఞానము .. అన్న భావమో ఏదీ చేయనీక యాంత్రిక జీవనము లో దొరికే కాస్త తీరిక సమయాన్నీ చదవటం, చదివించటం, టీవీ చూట్టం తోనో గడిపేస్తూ వచ్చాను.

ఈసారి మాత్రం వెనక్కి తగ్గ దలచుకోలేదు. నాకు తోచినట్టు వచ్చిన నాలుగు విషయాలనే రాద్దాము .. నా ఆత్మ సంతృప్తి కోసమే అనుకోగానే ఎక్కడ లేని ఉత్సాహమూ వచ్చింది. దాని ఫలితమే ఈ చిన్నీబ్లాగు. ఒక రకం గా ఈ విధం గా నన్ను నేను పరిశీలించుకునే అవకాశం వచ్చిందని తలుస్తాను.

మీ కృష్ణ

8 comments:

సుజాత వేల్పూరి said...

కృష్ణ ప్రియ,
మీ కొత్త పోస్టు చూశాక వెనక్కి వచ్చి మీ మొదటి పోస్టు చదివాను. చిన్న చిన్న సంఘటనలనే చక్కని స్కెచ్ లు గా మలచగల నేర్పు మీకుందని అర్థమైంది. రెగ్యులర్ గా రాస్తూ ఉండండి.

నాగేస్రావ్ said...

(లాప్) టాబ్భూషణం భూషణం? చదివి, సుజాత గారు అన్నట్లు వెనక్కి మీ బ్లాగులన్నీ చదూకొంటూ వచ్చాను. మీవెంట పడ్డానుకూడా (followerని)!
రాస్తూండండి. మిమ్మల్ని చూసి ఇంకెవరికన్నా బ్లాగాలనిపించవచ్చేమో!
మరి అమృతవల్లి బ్లాగుకి కొంచెం లంకె ఇస్తారా?

Anonymous said...

నిజమే కృష్ణప్రియ గారు నేను కూడా వెనక్కి వచ్చి మరీ మీ తొలి తెలుగు పోస్ట్ చదివాను.. బాగుంది.. కీప్ ఇట్ అప్..
nagini

కృష్ణప్రియ said...

మనః పూర్వక ధన్యవాదాలు ..ఈ కామెంట్స్ రూపం లో మీ అందరి ప్రోత్సాహం చూస్తుంటే నాకు చాలా శక్తి వచ్చింది.

నా స్నేహితురాలి తమిళ బ్లాగు
http://www.nandhu-yazh.blogspot.com/


-కృష్ణప్రియ

Anonymous said...

Hi Krishna garu, Your writing is very good....I thoroughly enjoyed reading your posts and looking forward for many...Thank you, Sri

కృష్ణప్రియ said...

Thanks a lot Sri!

Unknown said...

కృష్ణప్రియ గారు,

మీ టపాలు అన్నీ వెనకనుండి ముందుకు చదువుకుంటూ వచ్చి , మొదటి టపాకి నా స్పందన తెలియజేస్తున్నాను. ఆహా, ఏమి వ్రాస్తారండి మీరు, అద్భుతం! ఎప్పుడూ తెలుగు బ్లాగులు చదవని మా వారితో కూడా మీ పోస్ట్స్ చదివించేసాను. దైనందిన విషయాలని, అనుభవాలని మీ అంత ఆసక్తికరంగా ఎవరూ వ్రాయలేరనిపించింది. ఒక తపస్సు చేస్తున్నంత ఏకాగ్రతతో మీ 99 టపా లు, మూడు రోజుల్లో చదివేసాను, మీ 100 వ పోస్ట్ కోసం వేచివున్నా :), ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా రావాలి మరి ! శుభాకాంక్షలతో , పద్మజ

కృష్ణప్రియ said...


పద్మజ గారు,

ధన్యవాదాలు! మీ కామెంట్ చూశాకా మళ్లీ రాయడం మొదలు పెట్టాలని ఉత్సాహం వచ్చింది.

Post a Comment

మీ అభిప్రాయం...

Note: Only a member of this blog may post a comment.

 
;